పదేళ్లుగా లవర్ కోసం ఆన్‌లైన్ సహా అన్ని రకాల డేటింగ్ యాప్స్ వెతికినా అతనికి ఒక్క అమ్మాయి కూడా దగ్గర కాలేకపోయింది. దీంతో ఎలాగైనా ఒక గర్ల్‌ఫ్రెండ్‌ను సంపాదించాలనే ప్రయత్నంలో ఆ వ్యక్తి ఈసారి ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చాడు. అదేంటంటే ఫేస్‌బుక్ పేజీలో తనను తాను అమ్మాకానికి పెట్టుకున్నాడు. అయితే ఈసారి మాత్రం అతను విఫలమవ్వలేదు. ఎందుకంటే అతను షేర్ చేసిన పోస్ట్‌కు ఫేస్‌బుక్‌లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. గర్ల్‌ఫ్రెండ్ పొందాలనే ఆశ త్వరలోనే నెరవేరేలా కనిపిస్తుంది.(చదవండి : ఎదుగుదలను ఓర్వలేక పెట్రోల్ పోసి సజీవ దహనం)
ఇక అసలు విషయానికి వస్తే.. 30 ఏళ్ల లాన్ క్లేటన్ గత పదేళ్లుగా సింగిల్‌గానే ఉంటున్నాడు. ఈ పదేళ్లలో ఆన్‌లైన్ సహా డేటింగ్ యాప్స్ వెతికినా అతన్ని ప్రేమించడానికి ఒక అమ్మాయి కూడా ముందుకు రాలేదు. దీంతో క్లేటన్ కొంచెం కొత్తగా ఆలోచించి.. నేను సింగిల్.. గుడ్ కండీషన్‌లో ఉన్నా అంటూ ఫేస్‌బుక్ పేజీలో తనను తాను అమ్మకానికి పెట్టుకున్నాడు. అంతేగాక క్లేటన్ ఇలా తనను తాను అమ్మకానికి పెట్టుకోవడం వెనుక కారణాన్ని కూడా వివరించాడు.
' హలో ఆల్ లేడీస్... నాపేరు క్లేటన్.. వయస్సు 30 ఏళ్లు.. గత పదేళ్లుగా సింగిల్‌గా ఉంటున్నా.. నాతో ప్రేమగా మాట్లాడే అమ్మాయి కోసం పదేళ్లుగా వెతుకున్నా.. అంతేగాక కొన్ని పెళ్లిళ్లకు వెళ్లాల్సి ఉన్నా సింగిల్‌గా ఉండడంతో వెళ్లలేకపోయా.. ఏ పెళ్లికి వెళ్లినా జంటగానే వెళ్లాలని నిశ్చయించుకున్నా. గత పదేళ్లుగా సరైన అమ్మాయి కోసం ఎన్నో డేటింగ్ యాప్స్ వెతికాను. నాకు అదృష్టం లేకపోవడంతో అది వర్కవుట్ కాలేదు. అందుకే ఈసారి కొత్తగా ఆలోచించి.. ఫేస్‌బుక్‌లో నన్ను నేను అమ్మకానికి పెట్టుకున్నా .. నన్ను ఒకసారి పరిశీలించండి 'అంటూ రాసుకొచ్చాడు.(చదవండి : కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు)
తాజాగా క్లేటన్ పెట్టిన పోస్టు వైరల్‌గా మారి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. క్లేటన్ షేర్ చేసిన ఫోటోలకు వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. కాగా నెటిజన్లు అతను పెట్టిన పోస్టును చదివి 'క్లేటన్ మీ ఆశ తప్పక నెరవేరుతుందంటూ' మెసేజ్‌లు పెడుతున్నారు. కాగా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న క్లేటన్ జీవితంలో తొందరగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తన స్నేహితుల్లో కూడా చాలామందికే ఇప్పటికే పెళ్లిళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. కానీ క్లేటన్ మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. అయితే ఎప్పటికైనా తన జీవితంలోకి ఎవరో ఒకరు తప్పకుండా వస్తారని.. ఆమెతో తన జీవితం సంతోషంగా గడుపుతానని క్లేటన్ అంటున్నాడు. క్లేటన్ ఆశ నెరవేరాలని మనము కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment