ఆన్‌లైన్‌లో వేలం వేసిన 672 కేజీల వెండి అచ్చులివే
అన్నవరం (ప్రత్తిపాడు): అన్నవరం దేవస్థానంలోని సుమారు 672 కిలోల వెండి అచ్చులను ప్రభుత్వ ఆన్‌లైన్ విక్రయ సంస్థ ‘ఎంఎంటీసీ’ ( హైదరాబాద్)ద్వారా ఈ–వేలంలో విక్రయించగా కిలో వెండికి అత్యధికంగా రూ.33,972 రేటు పలికినట్టు దేవస్థానం ఈఓ ఎం.జితేంద్ర శుక్రవారం తెలిపారు. గతంలో ఇదే వెండిని మరో సంస్థ ద్వారా విక్రయించేందుకు టెండర్లు కోరగా కిలో వెండికి రూ.32,500 మాత్రమే కోట్ చేశారు. దాంతో పోల్చితే ప్రస్తుతం వచ్చిన ధర అధికమైనందున ఈ విషయాన్ని దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనూరాధ దృష్టికి తీసుకువెళ్లి ఆమె అనుమతి మేరకు విక్రయిస్తామని తెలిపారు. ఈ విక్రయం ద్వారా రూ.2.25 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. ఈ మొత్తంతో బంగారం కొనుగోలు చేసి ఆ బంగారాన్ని స్టేట్‌బ్యాంక్ గోల్డ్‌బాండ్ స్కీంలో డిపాజిట్ చేస్తామని వివరించారు.
భక్తులు ఇచ్చిన కానుకలు కరిగించగా వచ్చిన వెండి..
భక్తులు సత్యదేవునికి సమర్పించిన సుమారు 700 కిలోల వెండి కానుకలను 2015 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని మింట్‌కు తరలించి కరిగించారు. ఆ కానుకల వెండిలో డస్ట్‌ను తొలగించి మిగిలిన వెండిని అచ్చులుగా వేయించారు. ఇలా కరిగించడం వల్ల 92 శాతం ప్యూరిటీ కలిగిన సుమారు 672 కేజీల వెండి లభించింది. అప్పటి నుంచి ఆ వెండిని ఆన్‌లైన్ విక్రయసంస్థల ద్వారా విక్రయించేందుకు ప్రయత్నించగా ఇప్పటికి అత్యధిక రేటు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment