MMTC
-
ఎంఎంటీసీకి భారీ షాక్: స్టాక్ బ్రోకర్ లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: మూతపడిన నేషనల్ స్పాట్ ఎక్సే్ఛంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) కేసులో ఎంఎంటీసీ స్టాక్ బ్రోకర్ లైసెన్స్‌ను సెబీ రద్దు చేసింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌కు సంబంధించి కొన్ని లావాదేవీల్లో చట్టవిరుద్ధమైన పాత్ర ఉండడంతో ఎంఎంటీసీపై ఈ చర్య తీసుకుంది. ఎంఎంటీసీ క్లయింట్లు తమ నిధులను, సెక్యూరిటీలను వెనక్కి తీసుకోవడానికి వీలుగా 15 రోజుల గడువు విధించింది. (ఎంజీ బుల్లి కామెట్ ఈవీస్పెషల్ గేమర్ ఎడిషన్: ధర పెరిగిందా?) ఒకవేళ క్లయింట్లు తమ నిధులు, సెక్యూరిటీలను 15రోజుల్లోపు తీసుకోకపోతే, క్లయింట్ల సూచన మేరకు ఎంఎంటీసీయే వాటిని మరో బ్రోకర్‌కు తదుపరి 15 రోజుల్లో బదిలీ చేయాలని సెబీ ఆదేశించింది. ఎంఎంటీసీ 2015 నుంచి సెబీ వద్ద కమోడిటీ డెరివేటివ్స్ బ్రోకర్‌గా నమోదై ఉంది. ప్రస్తుతం ఎంసీఎక్స్ మెంబర్‌గా కొనసాగుతోంది. తన అనుమతి లేకుండా ఎన్ఎస్ఈఎల్ పెయిర్డ్ కాంట్రాక్టుల్లో ఎంఎంటీసీ లావాదేవీలు నిర్వహించినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్ ) -
ఈ మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని మూసివేస్తున్నారా!? కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే?
దుబాయ్: ప్రభుత్వ రంగ ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీల పనితీరును కేంద్రం అధ్యయనం చేస్తోందని, దేశ ప్రయోజనాల రీత్యా తగు చర్యలు తీసుకుంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. వీటిని మూసివేసే యోచనేదైనా ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మేము అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. దేశ ప్రయోజనాల రీత్యా తగు నిర్ణయం తీసుకుంటాం. అరుదైన వనరులను వృధా చేయకూడదు‘ అని పేర్కొన్నారు. తూర్పు యూరోపియన్ దేశాలతో వాణిజ్య నిర్వహణ కోసం 19056లో ప్రభుత్వ ట్రేడింగ్ విభాగంగా స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్టీసీ) ఏర్పాటైంది. రైల్వే, ఇంజినీరింగ్ పరికరాల ఎగుమతులకు సంబంధించి ఎస్టీసీ అనుబంధ సంస్థగా 1971లో ప్రాజెక్ట్ అండ్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ (పీఈసీ)ను నెలకొల్పారు. ఇది 1997లో స్వతంత్ర సంస్థగా మారింది. మరోవైపు, ఎస్టీసీ నుండి విడగొట్టి స్వతంత్ర సంస్థగా మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ)ని 1963లో ఏర్పాటు చేశారు. లోహాలు, ముడి ఖనిజాల ఎగుమతులు, ఫెర్రస్యేతర లోహాల దిగుమతుల కోసం దీన్ని నెలకొల్పారు. ప్రస్తుతం ఈ మూడు కంపెనీలు వాణిజ్య శాఖ నియంత్రణలో ఉన్నాయి. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల వల్ల కొన్ని దేశాల్లో ఆహార ధాన్యాలపరమైన సమస్యలు తలెత్తవచ్చని మంత్రి చెప్పారు. అలాంటి పరిస్థితి తలెత్తితే ఆయా దేశాలకు మానవతా దృక్పథంతో తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాలు గోధుమలు అత్యధికంగా ఉత్పత్తి, ఎగుమతి చేస్తున్నాయి. -
వెండి..రేటు బాగుందండీ..
అన్నవరం (ప్రత్తిపాడు): అన్నవరం దేవస్థానంలోని సుమారు 672 కిలోల వెండి అచ్చులను ప్రభుత్వ ఆన్లైన్ విక్రయ సంస్థ ‘ఎంఎంటీసీ’ ( హైదరాబాద్)ద్వారా ఈ–వేలంలో విక్రయించగా కిలో వెండికి అత్యధికంగా రూ.33,972 రేటు పలికినట్టు దేవస్థానం ఈఓ ఎం.జితేంద్ర శుక్రవారం తెలిపారు. గతంలో ఇదే వెండిని మరో సంస్థ ద్వారా విక్రయించేందుకు టెండర్లు కోరగా కిలో వెండికి రూ.32,500 మాత్రమే కోట్ చేశారు. దాంతో పోల్చితే ప్రస్తుతం వచ్చిన ధర అధికమైనందున ఈ విషయాన్ని దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనూరాధ దృష్టికి తీసుకువెళ్లి ఆమె అనుమతి మేరకు విక్రయిస్తామని తెలిపారు. ఈ విక్రయం ద్వారా రూ.2.25 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. ఈ మొత్తంతో బంగారం కొనుగోలు చేసి ఆ బంగారాన్ని స్టేట్‌బ్యాంక్ గోల్డ్‌బాండ్ స్కీంలో డిపాజిట్ చేస్తామని వివరించారు. భక్తులు ఇచ్చిన కానుకలు కరిగించగా వచ్చిన వెండి.. భక్తులు సత్యదేవునికి సమర్పించిన సుమారు 700 కిలోల వెండి కానుకలను 2015 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని మింట్‌కు తరలించి కరిగించారు. ఆ కానుకల వెండిలో డస్ట్‌ను తొలగించి మిగిలిన వెండిని అచ్చులుగా వేయించారు. ఇలా కరిగించడం వల్ల 92 శాతం ప్యూరిటీ కలిగిన సుమారు 672 కేజీల వెండి లభించింది. అప్పటి నుంచి ఆ వెండిని ఆన్లైన్ విక్రయసంస్థల ద్వారా విక్రయించేందుకు ప్రయత్నించగా ఇప్పటికి అత్యధిక రేటు వచ్చింది. -
30 కేజీల డిజిటల్ పుత్తడి విక్రయించిన పేటీఎం
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ, పేటీఎం 30 కేజీల ‘డిజిటల్’ పుత్తడిని విక్రయించింది. ‘డిజిటల్ గోల్డ్’ పేరుతో ఆన్లైన్లో పుత్తడి కొనుగోళ్లు, అమ్మకాలు నిర్వహించే ఒక సర్వీస్‌ను ఇటీవలనే పేటీఎం సంస్థ, ఎంఎంటీసీ–పీఏఎంపీ భాగస్వామ్యంతో నెలకొల్పిన విషయం తెలిసిందే. ఒక్క రూపాయితో కూడా బంగారాన్ని కొనుగోలు చేసే వీలును ఈ సర్వీస్ కల్పించింది. పేటీఎం మొబైల్ వాలెట్ల ద్వారా వినియోగదారులు 24 క్యారట్ల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ బంగారాన్ని ఎంఎంటీసీ–పీఏఎంపీ వాల్ట్స్‌లో ఎలాంటి చార్జీలు చెల్లించకుండా భద్రంగా దాచుకోవచ్చు. లేదా నాణేల రూపంలో ఇంటివ ద్దకే డెలివరీ తీసుకోవచ్చు. లేదా ఎంఎంటీసీ–పీఏఎంపీకే తిరిగి విక్రయించవచ్చు. ఆరు రోజుల్లో... ఈ డిజిటల్ గోల్డ్ సర్వీస్‌ను ప్రారంభించిన ఆరు రోజుల్లోనే 30 కేజీల డిజిటల్ పుత్తడిని విక్రయించామని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ హెగ్డే చెప్పారు. చిన్న నగరాల నుంచి అధికంగా కొనుగోళ్లు జరిగాయని పేర్కొన్నారు. -
రూపాయికీ బంగారం..?
-
రూపాయికీ బంగారం..?
⇔ పసిడిలో పెట్టుబడులకు ‘పేటీఎం’ కొత్త ప్రచారం ⇔ ఎంఎంటీసీతో కలిసి ’డిజిటల్ గోల్డ్’ ప్లాన్ ⇔ ఆన్లైన్లోనే క్రయ, విక్రయాలు ⇔ కావాలనుకుంటే 1 గ్రాము నుంచి నాణేల రూపంలో డెలివరీ న్యూఢిల్లీ: డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం... ఆన్లైన్ పసిడి క్రయ, విక్రయాల్లోకి కూడా ప్రవేశించింది. పసిడి రిఫైనరీ సంస్థ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ)తో కలిసి ’డిజిటల్ గోల్డ్’ ప్లాన్‌ను ప్రారంభించింది. తమ పేటీఎం మొబైల్ వాలెట్ ద్వారా కస్టమర్లు అత్యంత తక్కువగా రూ.1 పెట్టుబడితో కూడా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలున్న బంగారాన్ని కొనుగోలు చేయొచ్చని పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. 999.9 స్వచ్ఛత గల 24 క్యారట్ల బంగారాన్ని ఆన్లైన్లో కొన్నవారు... ఎంఎంటీసీ– పీఏఎంపీకి చెందిన సురక్షితమైన వాల్టులలో ఉచితంగా నిల్వ చేసుకోవచ్చని ఆయన వివరించారు. నిజానికి ఎంఎంటీసీకి డిజిటల్ రూపంలో (సర్టిఫికెట్ల రూపంలో) బంగారాన్ని డెలివరీ చేసే సదుపాయం లేదు. అది భౌతిక బంగారాన్నే డెలివరీ చేస్తుంది. మరి రూపాయికెంత బంగారం వస్తుంది? దీనికి విజయ్ శేఖర్ శర్మ సమాధానమిస్తూ... పెట్టుబడి విలువ కనీసం 1 గ్రాము దాకా పోగుపడిన తర్వాత కావాలనుకుంటే డెలివరీ తీసుకోవచ్చని చెప్పారు. అంటే పెట్టుబడి కనీసం రూ.3వేల దాకా ఉంటేనే బంగారాన్ని డెలివరీ తీసుకోగలుగుతారు. కొనుగోలు చేసిన బంగారాన్ని 1, 2, 5, 10 ,20 గ్రాముల నాణేల రూపంలో ఇంటి వద్దకే డెలివరీ తీసుకోవచ్చని లేదా ఆన్లైన్లోనే ఎంఎంటీసీ–పీఏఎంపీకి విక్రయించవచ్చని శర్మ చెప్పారు. కస్టమర్లు విక్రయించదల్చుకున్న పక్షంలో ఎంఎంటీసీ–పీఏఎంపీ బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. డబ్బును యూజర్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ‘భారతీయులు పసిడిలో పెట్టుబడులకు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. వారు డిజిటల్ రూపంలో బంగారంలో ఇన్వెస్ట్ చేసే ప్రక్రియను మేం సులభతరం చేస్తున్నాం‘ అని శర్మ చెప్పారు. ప్రస్తుతం పేటీఎం ద్వారా రూ.20,000 పైబడిన లావాదేవీలు జరిపే వారంతా కేవైసీ వివరాలు సమర్పించాల్సి ఉంటోంది. గోల్డ్ స్కీమ్‌కు కూడా ఇది వర్తిస్తుంది. పసిడి వినియోగదారులు బంగారం స్వచ్ఛత, సురక్షితంగా నిల్వ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎంఎంటీసీ–పీఏఎంపీ చైర్మన్ మెహ్దీ బర్ఖుర్దార్ చెప్పారు. తాజా స్కీమ్‌తో ఉత్తమ నాణ్యత గల బంగారంలో అత్యంత తక్కువ స్థాయి నుంచి ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లభించగలదన్నారు. అత్యధిక వినియోగం భారత్‌లోనే... ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో పసిడి వినియోగం ఉంటోంది. దేశీయంగా ఇళ్లల్లో, బ్యాంకు లాకర్లలో సుమారు 900 బిలియన్ డాలర్ల విలువ చేసే 24,000 టన్నుల పైచిలుకు బంగారం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో కాయిన్లు, ఆభరణాలు ఇతరత్రా భౌతిక రూపంలో బంగారం కొనుగోలు కన్నా డిజిటల్ / పేపర్ రూపంలో పసిడి కొనుగోళ్లు జరిపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా సావరీన్ గోల్డ్ బాండ్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కార్యకలాపాలపై రూ. 10,000 కోట్లు.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంపై వచ్చే మూడేళ్లలో రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఇప్పటికే గడిచిన రెండేళ్లుగా రూ. 3,200 కోట్లు పెట్టుబడి పెట్టామన్నారు. తమ పేమెంట్స్ బ్యాంక్‌కు త్వరలోనే తుది అనుమతులు రాగలవని ఆశిస్తున్నట్లు చెప్పారు. గతేడాది దీపావళికే కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. అనుమతుల్లో జాప్యం కారణంగా వాయిదాపడింది. 150 కోట్ల స్థాయిలో ఉన్న పేటీఎం లావాదేవీల పరిమాణాన్ని ఈ ఏడాది 450 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు శర్మ చెప్పారు. విజయవాడ, వైజాగ్, జైపూర్, సోనేపట్ వంటి నగరాల్లో తమ కార్యకలాపాలు భారీగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. -
వెంటనే బంగారం అమ్మేయండి
కస్టమ్స్ విభాగానికి రెవెన్యూ శాఖ ఆదేశాలు న్యూఢిల్లీ: స్వాధీనం చేసుకున్న బంగారం అమ్మడానికి సత్వర చర్యలు చేపట్టాలని కస్టమ్స్ విభాగాన్ని రెవెన్యూ శాఖ కోరింది. ఇందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు(బంగారం అమ్మకం, దిగుమతికి ఆర్బీఐ అనుమతి ఉన్నవి), ఎంఎంటీసీ(మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), ఎస్టీసీ(స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సేవలు వినియోగించుకోవడానికి అనుమతిచ్చింది. ఇంతకు పూర్వం కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ద్వారానే అమ్మకాలు చేపట్టేవారు. బంగారం ఏ రూపంలో ఉన్నా దాని అమ్మకం ధరను అంతకు ముందు రోజున్న మార్కెడ్ ధర ఆధారంగా నిర్ణయిస్తారు. అమ్మినందుకు బ్యాంకులు కస్టమ్స్ విభాగం నుంచి ఎలాంటి కమిషన్ ఆశించకూడదు. అయితే ఈ ప్రక్రియకు అయ్యే ఖర్చులను తిరిగి చెల్లిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలోని కస్టమ్స్ నిల్వల నుంచి సుమారు 67.4 కిలోల బంగారం కనిపించకుండా పోయిందని పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. గత మూడేళ్ల (2013–2016) కాలంలో న్యూఢిల్లీ, ముంబై, త్రిచీ విమానాశ్రయాల్లో కస్టమ్స్ విభాగాల నుంచి 12 సందర్భాల్లో సుమారు 65.39 కిలోల బంగారం మాయమైనట్లు గుర్తించారు. -
బ్యాంకుల్లోనూ ఇండియన్ గోల్డ్ కాయిన్స్
ఒప్పందాలు కుదుర్చుకున్న ఎంఎంటీసీ న్యూఢిల్లీ: ఇండియన్ గోల్డ్ కాయిన్ల భారీ విక్రయానికి ఎంఎంటీసీ (మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) వ్యూహ రచన చేసింది. ఈ విషయంలో పలు బ్యాంకులతో ఒడంబడికలు కదుర్చుకుంది. వీటిలో ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా శుక్రవారంనాటి ధంతేరాస్ లక్ష్యంగా ఈ చొరవ తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 383 ఎంఎంటీసీ షాపుల్లో మాత్రమే ఇండియన్ గోల్డ్ కాయిన్లు లభ్యం అవుతున్నాయి. ఇప్పుడు ఈ కాయిన్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, విజయాబ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌కు సంబంధించి నిర్దేశిత బ్రాంచీల్లో లభ్యం అవుతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కాయిన్లు 5, 10, 20 గ్రాముల్లో లభ్యమవుతాయి. విస్తృత ప్రచారం: దీపావళి సందర్భంగా ఇండియన్ గోల్డ్ కాయిన్ల లభ్యతకు సంబంధించి ఎంఎంటీసీ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విస్తృత ప్రాతిపదికన ప్రచార కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టాయి. వార్తా పత్రికలు, రేడియో, డిజిటల్, కొన్ని సినిమా హాళ్లలో వీటి విక్రయాలపై ప్రచారం జరుగుతోంది. 2015 నవంబర్ 5వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన ఈ నాణెం... భారత్ మొట్టమొదటి సావరిన్ గోల్డ్. స్వచ్ఛతకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెర్డ్స్ హాల్‌మార్క్‌తో ఈ కాయిన్లు లభ్యం అవుతాయి. పసిడికి భారీ డిమాండ్: మరోవైపు ధంతేరాస్ సందర్భంగా ఆభరణ విక్రయాల వృద్ధిపై రిటైలర్లు భారీ అంచనాలను వ్యక్తం చేశారు. శుభాలను అందిస్తుందని భావించే రోజుగా అక్టోబర్ 28న గత ఏడాది ఇదే రోజు అమ్మకాలతో పోల్చితే దాదాపు 25 శాతం అమ్మకాల వృద్ధి ఖాయమని విశ్వసిస్తున్నారు. -
పసిడి నాణేల విక్రయాల పెంపుపై దృష్టి
ఎస్బీఐ, ఐసీఐసీఐ, పోస్టాఫీసులతో ఒప్పందాలకు ఎంఎంటీసీ కసరత్తు చండీగఢ్: పసిడి డిపాజిట్ పథకంలో భాగంగా ఉన్న ఇండియన్ గోల్డ్ కాయిన్ల విక్రయ మార్కెటింగ్ నెట్వర్క్ పటిష్టతపై ఎంఎంటీసీ దృష్టి సారించింది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు ఇండియా పోస్ట్‌తో ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఎంఎంటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వేద్ ప్రకాశ్ శుక్రవారం ఇక్కడ పేర్కొన్నారు. ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని, రెండు వారాల్లో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం తక్షణం నాణేల అమ్మకానికి దేశ వ్యాప్తంగా 100 నుంచి 150 బ్రాంచీలు ఖరారయ్యే అవకాశం ఉందని వివరించారు. తరువాత అమ్మకానికి సంబంధించిన బ్రాంచీల పెంపుపై కూడా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం సంస్థ 22 ఔట్లెట్ల ద్వారా ‘ఇండియన్ గోల్డ్’కాయిన్ల రిటైల్ విక్రయాలు నిర్వహిస్తోంది. నాణేల విక్రయానికి పంజాబ్ స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ కార్పొరేషన్‌తో ఒక అవగాహన కుదుర్చుకున్నట్లు కూడా శుక్రవారం సంస్థ తెలిపింది. 24 క్యారట్ల ప్యూరిటీ ఇండియన్ గోల్డ్ కాయిన్ ఒకవైపు అశోకచక్రను కలిగిఉండగా, మరోవైపు మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించడం జరిగింది. 5, 10, 20 గ్రాముల్లో తొలిదశల్లో ఈ కాయిన్లు లభ్యమవుతున్నాయి. -
ఎంఎంటీసీలో 15% ప్రభుత్వ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎంఎంటీసీలో 15 శాతం వాటాలు విక్రయించడం ద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం దాదాపు 15 కోట్ల షేర్లను విక్రయించవచ్చని సంస్థ చైర్మన్ వేద్ ప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం రూ. 52.80గా ఉన్న ఎంఎంటీసీ షేరు ధరను బట్టి చూస్తే డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 800 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఎంఎంటీసీలో కేంద్రానికి 80.93 శాతం వాటాలు ఉన్నాయి. మరోవైపు, ఆంక్షలు సడలించిన దరిమిలా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంఎంటీసీ 50 టన్నుల మేర పసిడి దిగుమతి చేసుకోనున్నట్లు వేద్ ప్రకాశ్ తెలిపారు. అలాగే, వెండి దిగుమతులు 200 టన్నులకు పెరుగుతాయన్నారు. -
దిగుమతిపై ఎంఎంటీ‘సీ’!
- బంగారం ధరలు తగ్గుతుండడంతో ఆసక్తి - కేంద్రం పచ్చజెండా కోసం ఎదురుచూపులు - ఆంక్షలతో జీరోకు పడిపోయిన అమ్మకాలు - రిటైల్ అవుట్లెట్లు వెలవెల సాక్షి, విశాఖపట్నం: కొండెక్కిన బంగారం ధరలు క్రమేపీ తగ్గుతుండడంతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎంటీసీలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రెండేళ్ల కిందటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పసిడి వ్యాపారంతో కోట్లలో లాభాలు ఆర్జించిన ఈ సంస్థ ప్రస్తుతం వ్యాపారం పూర్తిగా పడిపోయి కళావిహీనంగా మారింది. ఏటా రూ.450 కోట్ల టర్నోవర్ కాస్తా సున్నాకు పడిపోయింది. మళ్లీ ఇప్పుడు ధరలు తగ్గి అమ్మకాలు పుంజుకుంటుండడంతో దిగుమతుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం ప్రారంభిస్తే లాభాల బాట పట్టవచ్చనే యోచనతో ప్రణాళికలు రచిస్తోంది. కేంద్రం పచ్చజెండా ఊపితే రిటైల్ అవుట్లెట్లలో బిస్కెట్లు, నాణేలను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఆశలు ఫలించేనా? కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెటల్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ)దేశానికి అవసరమైన బంగారాన్ని ఏటా విదేశాల నుంచి బిస్కెట్ల రూపంలో దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది. ఇందులో భాగంగా విశాఖ, హైదరాబాద్‌లోని రెండు ఎంఎంటీసీ ప్రాంతీయ కార్యాలయాలు విడివిడిగా మూడు నెలలకోసారి దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా పసిడి బిస్కెట్లను 500, 100 గ్రాములు, అంతకు మించిన తక్కువ రూపంలో దిగుమతి చేసుకుంటున్నాయి. వీటిలో 100 గ్రాములకు మించిన బిస్కెట్లను బులియన్ కార్పొరేషన్ల ద్వారా, అంతకుమించి తక్కువ బరువున్న పసిడిని సొంత రిటైల్ అవుట్లెట్లలో విక్రయిస్తోంది. ఈ విధంగా రెండు కార్యాలయాలు ఏటా రూ.1525 కోట్ల విలువైన 42 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకునేవి. ఒక్క విశాఖ ప్రాంతీయ కార్యాలయమే రూ.450 కోట్ల విలువైన 20 టన్నుల బంగారాన్ని దిగుమతి వ్యాపారం చేసేది. దేశంలోకి పసిడి దిగుమతులు అంచనాలకుమించి వచ్చిపడిపోతుండడంతో తరిగిపోతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి ఎంఎంటీసీ కళావిహీనంగా మారింది. గతేడాది డిసెంబర్ నుంచి సగానికిపైగా ఆర్డర్లలో కోత విధించి క్రమక్రమంగా పూర్తిగా నిలిపివేసింది. బంగారం వర్తకులు, వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది మార్చిలో విశాఖ ఎంఎంటీసీ కార్యాలయం 10 టన్నులకు ఆర్డర్లు ఇచ్చింది. కానీ ఏప్రిల్ నుంచి పూర్తిగా ఈ దిగుమతులను కూడా నిలిపివేసింది. ఫలితంగా వ్యాపారం పడిపోయింది. కేంద్ర కార్యాలయం నుంచి 1, 2, 5, 8, 10, 20, 50 గ్రాముల రూపంలో పసిడి నాణేలను విశాఖ కార్యాలయానికి భారీగా వచ్చేవి. ఇవి కూడా నాలుగు నెలల నుంచి రాకపోవడంతో ప్రసుత్తం ఎంఎంటీసీ రిటైల్అవుట్లెట్లు కార్యకలాపాలు లేక మూతపడ్డాయి. ఇప్పుడు పసిడి ధరలు తగ్గుతుండడం, వరుసగా పండగలు రావడంతో పసిడి విక్రయాలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీజన్‌ను ఉపయోగించుకుని వ్యాపారం పెంచుకోవడానికి ఎంఎంటీసీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు అధికారులు వివరిస్తున్నారు. మరోపక్క కేంద్రం కూడా కరెంట్ఖాతాలోటు ప్రస్తుతం పెద్దగా లేకపోవడంతో దిగుమతులపై ఆంక్షలు ఎత్తేసే అవకాశాలున్నట్టు సంకేతాలు వస్తుండడంతో కేంద్రం అనుమతుల కోసం ఎంఎంటీసీ ఆశగా ఎదురుచూస్తోంది. -
టీటీఈపై ప్రయాణికుల దాడి
గాయపడడంతో ఉస్మానియాకు తరలింపు హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌లో రైలులో ఓ టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్)పై ముగ్గురు మహిళలు దాడికి పాల్పడ్డారు. నాంపల్లి జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం... టీటీఈ కౌసల్య సికింద్రాబాద్ నుంచి లింగంపల్లికి వెళ్లే ఎంఎంటీఎస్(47150) ట్రైన్లో బుధవార ం ఉదయం విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుమారి, పద్మ, రాధ అనే ప్రయాణికులు బేగంపేట్ రైల్వేస్టేషన్ సమీపంలో టికెట్ లేకుండా పట్టుబడ్డారు. దీంతో వారిపై రూ.250 చొప్పున జరి మానా విధించారు. దీంతో వాగ్వాదానికి దిగి టీటీఈపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు బేగంపేట్ స్టేషన్లో పద్మ, కుమారీలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ కౌసల్యను ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిం చారు. టీటీఈపై దాడిని నిరసిస్తూ మజ్దూర్ యూని యన్ నాంపల్లి జీఆర్పి స్టేషన్ వద్ద నిరసన చేపట్టిం ది. టికెట్టు తీసుకోకపోవడం తప్పే. ఫైన్ కట్టలేదని చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. బోగీల్లోంచి కిందకు ఈడ్చుకు వెళ్లింది, చెంపపై కొట్టింది. టీటీఈల వెంట సాయుధ పోలీసులు... టీటీఈల వెంట ఇక నుంచి సాయుధులైన పోలీసులు పంపేలా రైల్వే అధికారులు నిర్ణయిం చారు. విధులకు అడ్డుపడి దురుసుగా వ్యవహరిస్తే ఆరునెలల జైలు శిక్ష, రూ.వేయి వరకు జరిమానా విధించనునున్నారు. -
సుఖేష్ గుప్తాను విచారిస్తున్న సీబీఐ అధికారులు
హైదరాబాద్ : ఎంబీఎస్ జ్యూయలర్స్ అధినేత సుఖేష్ గుప్తాను శుక్రవారం సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 195 కోట్ల విలువైన బంగారం కొనుగోళ్లకు సంబంధించి చెల్లింపులు ఎగవేశారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. గత రాత్రి నుంచి కోఠీ సీబీఐ కార్యాలయంలో సుఖేష్ గుప్తాను అధికారులు విచారిస్తున్నారు. కోట్ల విలువైన బంగారం దిగుమతిలో అక్రమాలకు పాల్పడ్డాడని సుఖేష్ గుప్తా పై ఆరోపణలు ఉండగా, ఈ కేసులో సుఖేష్ గుప్తా ఏ-1గా ఉన్నారు. సుఖేష్ గుప్తాపై ఈ ఏడాది జనవరిలోనే కేసు నమోదైంది. ఆయనపై ఐపీఎస్ 420, 409తో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో ఆయనకు సహకరించారనే ఆరోపణలపై ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీకి చెందిన ఐదుగురు ఉన్నతాధికారులను కూడా సీబీఐ విచారిస్తోంది. వీళ్లందరి ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. మొత్తం 100 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్టు సీబీఐ గుర్తించింది. వీళ్లను అరెస్టు చేసే అవకాశం ఉంది. తప్పుడు డిపాజిట్లు, బ్యాంకు గ్యారెంటీ ద్వారా ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు సీబీఐ గుర్తించింది. ఇక ప్రభుత్వరంగ స్వర్ణ విక్రయ సంస్థ అయిన ఎంఎంటీసీ (మినరల్స్, మైన్స్ ట్రేడింగ్ కార్పొరేషన్)కి బంగారం కొనుగోళ్లలో పన్ను చెల్లింపులకు సంబంధించి ఎంబీఎస్ జ్యూయలర్స్ కుచ్చుటోపీ పెట్టింది. అరువు బేరం మీద దాని నుంచి టన్నుల కొద్ది బంగారాన్ని కొనుగోలు చేసి.. రూ. 194 కోట్ల మేరకు ముంచింది. బీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ సుఖేష్ గుప్తా, ఎంఎంటీసీ ఉద్యోగులు కలిసి సాగించిన ఈ అక్రమాలపై ఎంఎంటీసీ... సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఐపీసీ 120-బీ రెడ్‌విత్ 409, 420, 471, 477 ఏ సెక్షన్లతోపాటు అవినీతి నిరోధకచట్టం సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13(1)(డీ) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి.. సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
పసిడి దిగుమతులు 41% డౌన్!
న్యూఢిల్లీ: దేశం పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 41 శాతం వరకూ పడిపోయే అవకాశం ఉందని ప్రభుత్వరంగ ఎంఎంటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డీఎస్ దేశీ అంచనా వేశారు. ప్రభుత్వ ఆంక్షలు దీనికి కారణమని బుధవారం పేర్కొన్నారు. సుంకాల పెంపు కారణంగా దేశీయంగా భారీగా ఉన్న రేట్లు సైతం బంగారం డిమాండ్ పడిపోవడానికి కారణమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 850 టన్నులు. అయితే 2013-14లో ఈ పరిమాణం 500 టన్నులకు పరిమితం కావచ్చని అంచనా వేశారు. దేశీయ వినిమయం కోసం బంగారం దిగుమతులను తమ సంస్థ తగ్గించుకుంటోందని ఆయన వివరించారు. అయితే ఆభరణాలు ఎగుమతి చేసే ప్రత్యేక యూనిట్లకు మాత్రం సరఫరాలను పెంచుతున్నట్లు వెల్లడించారు. నియంత్రణలు సరిపోతాయి... దిగుమతులకు సంబంధించి ప్రస్తుత నియంత్రణలు సరిపోతాయని అన్నారు. మరిన్ని నియంత్రణలు అవసరం లేదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడికి బంగారం దిగుమతి సుంకాన్ని 10 శాతం వరకూ కేంద్రం పెంచింది. నాణేలు, కడ్డీల దిగుమతులను నిషేధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గుతాయనే అంచనాలు ప్రభుత్వానికి ఉన్నాయి. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. విదేశీ మారకంతో రూపాయి విలువ క్షీణతకు ప్రధాన కారణమైన క్యాడ్ 2012-13 జీడీపీలో 4.8 శాతం (88.2 బిలియన్ డాలర్లు). ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3.7 శాతానికి (దాదాపు 60 బిలియన్ డాలర్ల)కు తగ్గుతుందన్నది ఆర్థికశాఖ తాజా అంచనా.