MMTC, STC, PEC Closure and Merger What Says Piyush Goyal - Sakshi
Sakshi News home page

ఈ మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని మూసివేస్తున్నారా!? కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే?

Published Thu, Mar 31 2022 7:55 AM | Last Updated on Thu, Mar 31 2022 10:50 AM

Mmtc Stc Pec Closure And Merger What Says Piyush Goyal - Sakshi

దుబాయ్‌:  ప్రభుత్వ రంగ ఎంఎంటీసీ, ఎస్‌టీసీ, పీఈసీల పనితీరును కేంద్రం అధ్యయనం చేస్తోందని, దేశ ప్రయోజనాల రీత్యా తగు చర్యలు తీసుకుంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ తెలిపారు. 

వీటిని మూసివేసే యోచనేదైనా ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మేము అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. దేశ ప్రయోజనాల రీత్యా తగు నిర్ణయం తీసుకుంటాం. అరుదైన వనరులను వృధా చేయకూడదు‘ అని పేర్కొన్నారు. తూర్పు యూరోపియన్‌ దేశాలతో వాణిజ్య నిర్వహణ కోసం 19056లో ప్రభుత్వ ట్రేడింగ్‌ విభాగంగా స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎస్‌టీసీ) ఏర్పాటైంది. రైల్వే, ఇంజినీరింగ్‌ పరికరాల ఎగుమతులకు సంబంధించి ఎస్‌టీసీ అనుబంధ సంస్థగా 1971లో ప్రాజెక్ట్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (పీఈసీ)ను నెలకొల్పారు. ఇది 1997లో స్వతంత్ర సంస్థగా మారింది.

మరోవైపు, ఎస్‌టీసీ నుండి విడగొట్టి స్వతంత్ర సంస్థగా మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎంటీసీ)ని 1963లో ఏర్పాటు చేశారు. లోహాలు, ముడి ఖనిజాల ఎగుమతులు, ఫెర్రస్‌యేతర లోహాల దిగుమతుల కోసం దీన్ని నెలకొల్పారు. ప్రస్తుతం ఈ మూడు కంపెనీలు వాణిజ్య శాఖ నియంత్రణలో ఉన్నాయి. 

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతల వల్ల కొన్ని దేశాల్లో ఆహార ధాన్యాలపరమైన సమస్యలు తలెత్తవచ్చని మంత్రి చెప్పారు. అలాంటి పరిస్థితి తలెత్తితే ఆయా దేశాలకు మానవతా దృక్పథంతో తోడ్పాటు అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు గోధుమలు అత్యధికంగా ఉత్పత్తి, ఎగుమతి చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement