న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా వాణిజ్యానికి ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ట్రేడ్ కనెక్ట్ ఈప్లాట్‌ఫామ్ పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించనుంది. వెరసి ప్రస్తుత, కొత్త వ్యాపారవేత్తల(ఆంట్రప్రెన్యూర్స్)కు ట్రేడ్ పోర్టల్ సహాయకారిగా నిలవనుంది.
ఎంఎస్‌ఎంఈ శాఖ, ఎగ్జిమ్ బ్యాంక్, టీసీఎస్, ఆర్థిక సేవల శాఖ, విదేశీ వ్యవహారాల శాఖల సహకారంతో తాజా ట్రేడ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ట్రేడ్ పోర్టల్‌ను వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. కస్టమ్స్ సుంకాలు, నిబంధనలు, నియంత్రణలు తదితర అన్ని రకాల సమాచారానికి ఒకే సొల్యూషన్‌గా తాజా పోర్టల్ నిలవనున్నట్లు గోయల్ వివరించారు. తద్వారా సమాచార లోపాలకు చెక్ పెట్టనున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment