న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇందులో భాగంగా నిర్దిష్ట చర్యలను నేరం కింద పరిగణించే కొన్ని నిబంధనలను సవరించేలా కొత్త బిల్లుపై కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. '
దీన్ని రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. నిబంధనల భారాన్ని తగ్గించేందుకు పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి తెలియజేయాలని పీహెచ్‌డీసీసీఐ వార్షిక సదస్సు 2022లో సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment