తన సొంతింటికి సంబంధించిన చేదు అనుభవాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పంచుకున్నారు. తన ఇంటి నిర్మాణం పూర్తయినా ప్రాజెక్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అందుకోని కారణంగా సొంతిట్లోకి ప్రవేశించలేకపోయానని పేర్కొన్నారు.
సిడ్నీలో జరిగిన క్రెడాయ్-నాట్కాన్ ఈవెంట్‌లో పీయూష్ గోయల్ మాట్లాడారు. "2012 చివరి నాటికి నా ఇల్లు సిద్ధమైనప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని కారణంగా దాదాపు ఐదారు సంవత్సరాల వరకు ఆ ఇంట్లోకి ప్రవేశించలేకపోయాను" అన్నారు. కేంద్రమంత్రికి ఎదురైన ఈ అనుభవాన్ని చాలా మంది గృహ కొనుగోలుదారులు ఎదుర్కొనే ఉంటారు. ఈ అనిశ్చితి దేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఒకప్పుడు సర్వసాధారణంగా ఉండేది. డెవలపర్‌ల తప్పుల కారణంగా కొనుగోలుదారులు ఇబ్బందులు పడేవారు.
అప్పట్లో ఇళ్ల కొనుగోలుదారులు పడే ఇబ్బందులు అలా ఉండేవని, అయితే 2016లో రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం (రెరా) ప్రవేశపెట్టడంతో పరిస్థితి గణనీయంగా మారిపోయిందని పీయూష్ గోయల్ వివరించారు. ఇది అవసరమైన పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకువచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment