buying
-
ఇంటి ధర రూ.85! రెనొవేషన్కు రూ.3.8 కోట్లు!!
ఇంటి ధర కేవలం రూ.85.. కానీ దాని రెనొవేషన్కు మాత్రం ఏకంగా రూ.3.8 కోట్లు ఖర్చు అయింది.. ‘అదేంటి.. రూ.85కే ఇళ్లు ఎక్కడ దొరుకుతుంది. అద్దె ఇళ్లే దాదాపు రూ.15,000 వరకు ఉంది. మరి అంత తక్కువకు ఇళ్లు ఎవరిస్తారు?’ అని అనుకుంటున్నారా. అలా అయితే మనం ఇటలీలో జరిగిన ఈ సంఘటన గురించి తెలసుకోవాల్సిందే.ఇటలీలోని సాంబుకా డి సిసిలియాలో 2019లో నిరుపయోగంగా ఉన్న ఇళ్లను వేలం వేశారు. అలా చాలా ఏళ్లుగా ఉపయోగంలోలేని ఓ ఇంటిని చికాగోకు చెందిన ఆర్థిక సలహాదారు మెరెడిత్ టాబోన్ కొనుగోలు చేశారు. కేవలం 1.05 డాలర్లు(రూ.85)కే దాన్ని వేలంలో దక్కించుకున్నారు. ఆ ఇంటిని 17 శతాబ్దంలో నిర్మించినట్లు తెలిసింది. దానికి కరెంట్, నీటి సౌకర్యం లేదు. వేలం పూర్తయిన తర్వాతే తాను ఆ ఇంటిని చూశారు. సాంబుకా డి సిసిలియా ప్రాంత్రంలో ఓ మూలన ఉన్న ఆ ఇంటిని మొదటగా చూసి మెరెడిత్ దాన్ని పునరుద్ధరణ చేయించాలనుకున్నారు. దాంతో గడిచిన నాలుగేళ్లల్లో అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. అందుకు 4,46,000(దాదాపు రూ.3.8 కోట్లు) ఖర్చు అయినట్లు ఆమె తెలిపారు. View this post on Instagram A post shared by Meredith Tabbone (@meredith.tabbone)ఇదీ చదవండి: మళ్లీ డబ్బు పెడుతున్న ఎఫ్పీఐలుమెరెడిత్ టాబోన్ ఇంత ఖర్చు చేసి ఎందుకు దీన్ని పునరుద్ధరించారని ఓ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు ‘1908లో నా కుంటుంబం యూఎస్‌కు వెళ్లడానికి ముందు మా ముత్తాత ఈ ప్రాంతంలోనే ఉండేవారు. తన జ్ఞాపకాలకు గుర్తుగా దీన్ని ఎంచుకున్నాను’ అని సమాధానం ఇచ్చారు. ఇంటికి సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఇంట్లో ప్రత్యేకంగా డిజైనింగ్, టైల్స్, ఇంటీరియర్.. వంటి వాటికి భారీగా ఖర్చవుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఇల్లు కట్టేందుకు అయ్యే ఖర్చు ఒకెత్తైతే, మన అభిరుచులకు తగినట్లుగా ఇంటీరియర్ డిజైన్ చేయించేందుకు అయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుంది. -
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
కాలం మారింది.. నేడు ఇంటికో వాహనం కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ కొందరు కేవలం టూ వీలర్స్ మాత్రమే వినియోగిస్తున్నారు. అలాంటి వారిలో కొందరు కొత్త కారు కొనాలని యోచించవచ్చు. అయితే కొత్త కారు కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి టిప్స్ పాటించాలన్నది బహుశా తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.ముందుగా సెర్చ్ చేయండిమార్కెట్లో లెక్కకు మించిన కార్లు నేడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏది మంచి కారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లను లేదా డీలర్‌షిప్‌లను సందర్శించండి. కస్టమర్ల రివ్యూలను బేరీజు వేసుకోవాలి. మీరు కొనాలనుకే కారు వాస్తవ ప్రపంచంలో ఎలాంటి పనితీరును అందిస్తుందనే విషయంపై కూడా అవగాహన పెంచుకోవాలి.బడ్జెట్ సెట్ చేసుకోవాలికారు కొనాలనుకోవడం సులభమే.. అయితే ఎంత బడ్జెట్లో కొనుగోలు చేయాలి? మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత అనేదాన్ని కూడా ఆలోచించాలి. కేవలం కారు కొనాలంటే కేవలం ఎక్స్ షోరూమ్ ధరలను మాత్రమే కాకుండా.. లోన్ తీసుకుంటే కట్టాల్సిన వడ్డీ, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ వంటివి చాలానే ఉంటాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి వీటన్నింటికి బడ్జెట్ సెట్ చేసుకోవాలి.ఫైనాన్సింగ్ ఆప్షన్స్కారు కొనాలంటే.. అందరూ మొత్తం డబ్బు చెల్లించి కొనుక్కోలేరు. కాబట్టి ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. ఇది మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా చేస్తుంది. బ్యాంకులు, క్రెడిట్ యూనియన్లు, కార్ ఫైనాన్స్ కంపెనీలు అందించే వడ్డీ రేట్లతో పాటు.. ఇతర నిబంధనలను కూడా సరిపోల్చుకోండి. ఏదైనా ఆఫర్స్, డిస్కౌంట్స్ లేదా తక్కువ డౌన్ పేమెంట్ స్కీమ్స్ వంటి వాటిని ఎంచుకోవాలి.తెలివిగా చర్చించండికారు కొనడానికి డీలర్‌షిప్‌కు వెళ్తే.. అక్కడ తెలివిగా చర్చించాల్సి ఉంటుంది. మార్కెట్లో ఆ కారు ధర ఎంత, అప్పటికి ఏదైనా ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయా? అనే విషయాలను కూడా ముందుగానే తెలుసుకుని ఉండాలి. మీ డీల్ అంచనాలకు దగ్గరగా లేకపోతే అక్కడ నుంచి వెళ్లిపోవడానికి కూడా సిద్ధంగా ఉండండి. ఇయర్ ఎండ్, ఫెస్టివల్ డిస్కౌంట్స్, డీలర్షిప్ ప్రోత్సాహకాలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని.. అలాంటి సమయంలో కారు కొనుగోలు సిద్దమవ్వండి.బీమా కవరేజ్బహుళ ప్రొవైడర్ల నుంచి బీమా ప్రీమియంలను సరిపోల్చండి. అందులో మీ వాహనానికి తగిన కవరేజీని అందిస్తూ చట్టపరమైన అవసరాలను తీర్చే ప్లాన్‌ను ఎంచుకోండి. యాడ్ ఆన్ కవర్లు, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తులు వంటి అంశాలను పరిగణించండి. అలారం, ఇమ్మొబిలైజర్లు, ట్రాకింగ్ పరికరాల వంటి భద్రతా ఫీచర్లను ఇన్స్టాల్ చేయడం వల్ల బీమా ప్రీమియంలు కూడా తగ్గుతాయి. వీటన్నింటిని గురించి తెలుసుకోండి.క్రెడిట్ స్కోర్కారు కొనుగోలు చేయాలంటే.. దాని కోసం లోన్ తీసుకోవాలంటే, మీకు మంచి సిబిల్ స్కోర్ ఉండాలి. మీకున్న సిబిల్ స్కోరును బట్టి మీకు లోన్ లభిస్తుంది. వడ్డీ రేటు తగ్గాలంటే.. సిబిల్ స్కోర్ తప్పకుండా కొంత ఎక్కువగానే ఉంటుంది.ప్రభుత్వ ప్రోత్సాహకాలుఎలక్ట్రిక్ కారు, హైబ్రిడ్ కారు కొనుగోలు చేస్తే.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, పన్ను ప్రయోజనాలు వంటివి లభిస్తాయి. కాబట్టి దీని గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఇలాంటి ప్రోత్సాహకాలు గురించి తెలుసుకుంటే.. ఖర్చులు కొంత తగ్గుతాయి.ఇంధన సామర్థ్యంకారు ఎంచుకునే ముందే.. ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగిన కారును కొనుగోలు చేయాలి. పెట్రోల్ ఇంజిన్ కారును ఎంచుకుంటే.. అది ఎంత మైలేజ్ అందిస్తుంది? డీజిల్ ఇంజిన్ ఎంచుకుంటే.. అది ఎంత మైలేజ్ అందిస్తుందనేది తెలుసుకోవాలి. ఎక్కువ మైలేజ్ అందించే కార్లను కొనుగోలు చేస్తే.. ఇంధన ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఇంధన సామర్థ్యాన్ని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. -
ఇల్లు పూర్తయినా.. ఈ అనుభవం మీకూ ఎదురైందా?
తన సొంతింటికి సంబంధించిన చేదు అనుభవాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పంచుకున్నారు. తన ఇంటి నిర్మాణం పూర్తయినా ప్రాజెక్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అందుకోని కారణంగా సొంతిట్లోకి ప్రవేశించలేకపోయానని పేర్కొన్నారు.సిడ్నీలో జరిగిన క్రెడాయ్-నాట్కాన్ ఈవెంట్లో పీయూష్ గోయల్ మాట్లాడారు. "2012 చివరి నాటికి నా ఇల్లు సిద్ధమైనప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని కారణంగా దాదాపు ఐదారు సంవత్సరాల వరకు ఆ ఇంట్లోకి ప్రవేశించలేకపోయాను" అన్నారు. కేంద్రమంత్రికి ఎదురైన ఈ అనుభవాన్ని చాలా మంది గృహ కొనుగోలుదారులు ఎదుర్కొనే ఉంటారు. ఈ అనిశ్చితి దేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఒకప్పుడు సర్వసాధారణంగా ఉండేది. డెవలపర్ల తప్పుల కారణంగా కొనుగోలుదారులు ఇబ్బందులు పడేవారు.అప్పట్లో ఇళ్ల కొనుగోలుదారులు పడే ఇబ్బందులు అలా ఉండేవని, అయితే 2016లో రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం (రెరా) ప్రవేశపెట్టడంతో పరిస్థితి గణనీయంగా మారిపోయిందని పీయూష్ గోయల్ వివరించారు. ఇది అవసరమైన పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకువచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. -
సాయి లైఫ్ సైన్సెస్ వాటా రేసులో బెయిన్ క్యాపిటల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాంట్రాక్ట్ రిసర్చ్, డెవలప్మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్‌లో మెజారిటీ వాటా కొనుగోలు రేసులో యూఎస్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బెయిన్ క్యాపిటల్ ముందు వరుసలో నిలిచినట్టు సమాచారం. ఈ డీల్ ద్వారా సాయి లైఫ్ సైన్సెస్ నుంచి టీపీజీ క్యాపిటల్ పూర్తిగా తప్పుకోనుంది. అలాగే ఇతర ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయిస్తున్నారు. ప్రమోటర్ గ్రూప్ సైతం తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించినట్టయితే బెయిన్ క్యాపిటల్ నియంత్రణలోకి సాయి లైఫ్‌సైన్సెస్ వెళుతుంది. సాయి లైఫ్ సైన్సెస్‌లో టీపీజీ క్యాపిటల్‌కు 43.4 శాతం, హెచ్‌బీఎం ప్రైవేట్ ఈక్విటీ ఇండియాకు 6 శాతం, మిగిలిన వాటా ప్రమోటర్లకు ఉంది. డీల్ ద్వారా సాయి లైఫ్ సైనెŠస్స్ను రూ.6,650 కోట్లుగా విలువ కట్టినట్టు తెలుస్తోంది. అడ్వెంట్ ఇంటర్నేషనల్, కేకేఆర్, చార్లెస్ రివర్ సైతం వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరిచాయి. -
వడ్డీ రేట్లు పెరిగితే ఇళ్ల కొనుగోలుపై ప్రభావం
న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు ప్రస్తుత స్థాయి నుంచి మరింత పెరిగి 9.5 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం పడుతుందని, మెజారిటీ ఔత్సాహిక కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇండియా నిర్వహించిన ‘కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే’తో పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. ఈ వివరాలను అనరాక్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. మెజారిటీ ప్రజలు మధ్యస్థ, ప్రీమియం ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ మంది మూడు పడకల ఇళ్లకు తమ ప్రాధాన్యం అని చెప్పారు. అధిక ద్రవ్యోల్బణంతో 66 శాతం మంది (సర్వేలో పాల్గొన్న) ఖర్చు చేసే ఆదాయంపై ప్రభావం పడినట్టు తెలిపారు. వడ్డీ రేటు 9.5 శాతం దాటితే అది తమ కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావిం చేస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో 98 శాతం మంది చెప్పారు. ప్రస్తుతం సగటు గృహ రేటు 9.15 శాతంగా ఉంది. 59 శాతం మంది రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య బడ్జెట్ పరిధిలోని ఫ్లాట్ల కోసం చూస్తున్నట్టు చెప్పారు. రూ.45 - 90 లక్షల మధ్య ఇళ్ల కొనుగోలుకు 35 శాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఇంటి కోసం 24 శాతం మంది చూస్తున్నారు. 48 శాతం మంది 3బీహెచ్‌కే ఇళ్లకు, 39 శాతం మంది 2బీహెచ్‌కే ఇళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నారు. 2022 మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో 3బీహెచ్‌కే ఇళ్లకు అనుకూలంగా ఉన్న వారు 41 శాతం నుంచి 48 శాతానికి పెరిగారు. రూ.40 లక్షల్లోపు ఇళ్లకు డిమాండ్ తగ్గుతోంది. 2020 మొదటి ఆరు నెలల్లో ఈ తరహా కొనుగోలు దారులు 40 శాతంగా ఉంటే, 2021 అర్ధ భాగంలో 28 శాతానికి, 2023 మొదటి ఆరు నెలల్లో 25 శాతానికి తగ్గారు. -
హల్దీరామ్స్‌పై టాటా కన్జ్యూమర్ కన్ను! ఇదే జరిగితే..
న్యూఢిల్లీ: ప్రముఖ ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫుడ్స్ తయారీ సంస్థ ‘హల్దీరామ్స్’లో వాటా కొనుగోలుకు టాటా కన్జ్యూమర్ ఆసక్తి చూపిస్తోంది. ఈ మేరకు కొన్ని కథనాలు వెలుగు చూశాయి. హల్దీరామ్స్‌లో కనీసం 51 శాతం వాటా కొనుగోలుకు టాటా కన్జ్యూమర్ సుముఖత చూపుతుండగా.. విలువల వద్దే ఏకాభిప్రాయం కుదరలేనట్టు సమాచారం. హల్దీరామ్స్ ప్రమోటర్లు 10 బిలియన్ డాలర్ల వ్యాల్యూషన్ (రూ.83,000 కోట్లు) కోరుతున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. కానీ, ఇది చాలా ఎక్కువ అని టాటా కన్జ్యూమర్ ప్రతినిధులు హల్దీరామ్స్తో చెప్పినట్టు తెలిపాయి. మొత్తం మీద వ్యాల్యూషన్ విషయంలోనే టాటా సంస్థ సౌకర్యంగా లేదని తెలిసింది. ఒకవేళ ఏకాభిప్రాయం కుదిరి హల్దీరామ్స్‌లో మెజారిటీ వాటా టాటా కన్జ్యూమర్ చేతికి వస్తే.. అది కంపెనీ చరిత్రలో పెద్ద డీల్ అవుతుంది. టాటా సంస్థ పెప్సీ, ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్‌తో నేరుగా పోటీపడే అవకాశం లభిస్తుంది. ఈ వార్తల నేపథ్యంలో టాటా కన్జ్యూమర్ షేరు బుధవారం 4 శాతం వరకు లాభపడింది. మరోవైపు హల్దీరామ్స్ బెయిన్ క్యాపిటల్ సహా పలు ప్రైవేటు ఈక్విటీ సంస్థలతో 10 శాతం వాటా విక్రయమై చర్చలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. భారీ అవకాశం.. హల్దీరామ్స్ ఆదాయం 1.5 బిలియన్ డాలర్లు ఉండగా, గత ఆర్థిక సంవత్సరానికి టాటా కన్జ్యూమర్ ఆదాయం 1.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. టాటా కన్జ్యూమర్ టాటా సంపన్న్ పేరుతో పప్పు ధాన్యాలు, టీ, సోల్‌ఫుల్ పేరుతో ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్టార్‌బక్స్ భాగస్వామ్యంతో కాఫీ రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. ‘‘టాటా కన్జ్యూమర్‌కు హల్దీరామ్స్ ఎంతో ఆకర్షణీయమైన అవకాశం. టాటా కన్జ్యూమర్‌ను టీ కంపెనీగా చూస్తారు. హల్దీరామ్స్ అనేది విస్తృతమైన మార్కెట్ వాటా కలిగిన కన్జ్యూమర్ కంపెనీ’’అని ఈ వ్యవహారం తెలిసిన ఓ వ్యక్తి తెలిపారు. 6.2 బిలియన్ డాలర్ల సంఘటిత స్నాక్ మార్కెట్లో హల్దీరామ్స్కు 13 శాతం వాటా ఉంది. లేస్ బ్రాండ్‌పై స్నాక్స్ విక్రయించే పెప్సీకి సైతం 13 శాతం మార్కెట్ ఉంది. హల్దీరామ్స్ తన ఉత్పత్తులను సింగపూర్, అమెరికా తదితర దేశాల్లోనూ విక్రయిస్తోంది. స్థానిక ఫుడ్, స్వీట్లను విక్రయించే 150 రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ‘‘ఒకేసారి మార్కెట్ పెంచుకోవాలంటే హల్దీరామ్స్కు మించిన అవకాశం మరొకటి ఉండదు. ఈ స్థాయిలో ప్యాకేజ్డ్ ఫుడ్, ఫుడ్ సర్వీసెస్ నిర్వహించే సంస్థ వేరొకటి లేదు’’అని కన్సల్టెన్సీ సంస్థ టెక్నోప్యాక్ కన్జ్యూమర్ హెడ్ అంకుర్ బిసేన్ అభిప్రాయపడ్డారు. చర్చలు నిర్వహించడం లేదు.. ఈ కథనాలపై టాటా కన్జ్యూమర్ స్పందించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఓ వివరణ ఇచ్చింది. ‘‘కథనాల్లో పేర్కొన్నట్టుగా మేము చర్చలు నిర్వహించడం లేదు. కంపెనీ వ్యాపారం విస్తరణ, వృద్ధి కోసం వ్యూహాత్మక అవకాశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. అవసరం ఏర్పడినప్పుడు నిబంధనల మేరకు ప్రకటిస్తుంది’’అని పేర్కొంది. మార్కెట్ స్పెక్యులేషన్‌పై స్పందించబోమని టాటా కన్జ్యూమర్ అధికార ప్రతినిధి సైతం ప్రకటించారు. -
యూపీఐ పేమెంట్స్‌పై జర్మన్ మంత్రి ఫిదా..!
బెంగళూరు: భారత్‌లో యూపీఐ పేమెంట్స్‌పై జర్మన్ డిజిటల్, ట్రాన్స్‌పోర్టు మంత్రి విస్సింగ్ ప్రశంసలు కురిపించారు. చిరువ్యాపారులు కూడా యూపీఐ పేమెంట్స్ వాడటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతటి సులభతర విధానాన్ని భారతీయులందరూ వాడుతున్నారని పేర్కొంటూ జర్మన్ ఎంబసీ తన ట్వీట్టర్(ఎక్స్ )లో పేర్కొంది. మిస్సింగ్ కూరగాయలు కొని, పేమెంట్స్ చేస్తున్న వీడియోను పంచుకుంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ గణవిజయం సాధించిందని మిస్సింగ్ అన్నారు. సెకన్ల కాలంలోనే చెల్లింపులు చేసుకునే విధానంపై ఆయన ఆశ్చర్యపోతున్నట్లు చెప్పారు. సులభతరంగా చెల్లింపులు చేసుకునే యూపీఐ పేమెంట్స్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెంగళూరులో జరుగుతున్న జీ20 డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగించారు. One of India’s success story is digital infrastructure. UPI enables everybody to make transactions in seconds. Millions of Indians use it. Federal Minister for Digital and Transport @Wissing was able to experience the simplicity of UPI payments first hand and is very fascinated! pic.twitter.com/I57P8snF0C — German Embassy India (@GermanyinIndia) August 20, 2023 జర్మన్ ఎంబసీ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు భారీ సంఖ్యలో స్పందించారు. యూపీఐ పేమెంట్స్‌లో భాగం అయినందుకు మిస్సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత డిజిటల్ విప్లవంపై స్పందించినందుకు థ్యాంక్స్ చెప్పారు. యూపీఐ ప్రపంచవ్యాప్తంగా మారింది.. ఇందులో జర్మనీ ఎప్పుడు చేరుతుందని ప్రశ్నించారు. యూపీఐ అనేది భారత్‌లో వేగవంతంగా చెల్లింపులు చేసుకునే డిజిటల్ విధానం. ఇందులో శ్రీలంక, సింగపూర్, ఫ్రాన్స్ భాగం అయ్యాయి. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ బైక్ రైడ్.. ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రులు.. -
హవ్వ.. గన్ను కొనడం ఇంత సులభమా?
నెదర్లాండ్స్‌కు చెందిన ఒక మహిళ ఇటీవల తన చిన్న కుమారుడు తనకు తెలియకుండానే డార్క్ వెబ్‌లో ఎకె-47ను కొనుగోలు చేశాడని వెల్లడించింది. ‘నా కుమారుడు ఎనిమిదేళ్ల వయసులోనే హ్యాకింగ్ ప్రారంభించాడు. వాడు తుపాకీని ఆర్డర్ చేసినప్పుడు ఈ విషయాన్ని గ్రహించానని బార్బ్రా జెమెన్ అనే నెదర్లాండ్ మహిళ యూరోన్యూస్కు తెలిపారు. ‘మా వాడు కంప్యూటర్లో అధిక సమయం గడపడం ప్రారంభించాడు ఇంటర్నెట్లో ఉచితంగా లభించే వస్తువులను ఆర్డర్ చేయడం మొదలు పెట్టాడన్నారు. డార్క్ వెబ్‌లో కొనుగోళ్లు అనేవి ఉచిత పిజ్జా వంటి చిన్న వాటితో మొదలవుతాయని, క్రమంగా ఈ డెలివరీలు మరింత భయంకరంగా మారుతాయని’ ఆమె తెలిపింది. ‘మనీ లాండరింగ్ చేయడానికి ఉపయోగించారు’ జెమెన్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె కుమారుడు ఇంటర్నెట్లో పలు రకాల కోడ్ పదబంధాలను ఉపయోగిస్తాడు. ఆన్లైన్ గేమ్‌ల ద్వారా మోసగాళ్లతో కమ్యూనికేట్ అవుతూ, వివిధ వ్యవహారాలను కొనసాగిస్తాడు. హ్యాకర్లు తన కుమారుడిని మనీ లాండరింగ్ చేయడానికి ఉపయోగించారని జెమెన్ ఆరోపించింది. మందుగుండు సామాగ్రితో పాటు ఆటోమేటిక్ తుపాకీ ఆమె ఇంటి గుమ్మం వద్ద కనిపించే సరికి ఆమె తన కుమారుడు ఏమి చేస్తున్నాడో గ్రహించింది. తుపాకీని ఎలా ఆర్డర్ చేయాలో.. దానిని ఇంటికి ఎలా తెప్పించాలో తెలుసుకునేందుకు తన కుమారుడు ఒక నెల రోజులు వెచ్చించాడని అనుకుంటున్నానని జెమెన్ పేర్కొన్నారు. తన కుమారుడు పోలాండ్ నుండి బల్గేరియాకు తుపాకీని తెప్పించాడని ఆమె తెలిపింది. తన కుమారుడు ఇంటికి వచ్చిన పార్సిల్ తెరిచాడు. ఇంటికి తుపాకీని డెలివరీ చేయగలిగానని సంతోషపడ్డాడని ఆమె తెలిపింది. వాడి తీరు చూసి షాక్ అయ్యానని, వెంటనే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుని, తుపాకీని స్థానిక పోలీసు విభాగానికి అప్పగించానని, దీంతో తన కుమారునిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని జెమెన్ చెప్పారు. అంతర్జాతీయ హ్యాకర్ల బృందంతో.. జెమెన్ తన కుమారుని వ్యక్తిత్వంలో వచ్చిన మార్పును గమనించింది. వాడు కంప్యూటర్ ముందు అత్యధిక సమయం కూర్చోవడంతోపాటు రాత్రంతా మేల్కోవడాన్ని ఆమె గుర్తించింది. తన కుమారుడు ఒత్తిడికి గురయ్యాడని, అంతర్జాతీయ హ్యాకర్ల బృందంతో కలిసి పని చేస్తున్నాడని జెమెన్ తెలుసుకుంది. తన కుమారుని నేరపూరిత జీవితాన్ని నిలువరించేందుకు కుమారుడు చదువున్న పాఠశాలను సంప్రదించింది. అక్కడ ఆమెకు ఆశించిన ఫలితం కనిపించలేదు. జెమెన్ తన కుమారుని బ్రౌజింగ్ హిస్టరీని చూసి, ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీకి తెలియజేయాలని నిర్ణయించుకుంది. ‘తప్పుదారి పట్టేందుకు అవకాశాలు అనేకం’ కంపెనీలను హ్యాక్ చేయడానికి, దొంగిలించిన సమాచారాన్ని వారికి పంపడానికి సహాయం చేయాలని తన కుమారుడిని అతని హ్యాకర్ స్నేహితులు అడిగారని జెమెన్ తెలిపింది. వెంటనే ఆమె తన కుమారునికి రక్షణ కల్పిస్తూ, వారితో సంబంధాన్ని తెంచుకోవడంలో అతనికి సహాయపడింది. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ల్యాప్‌టాప్‌లు,సెల్ ఫోన్లను కలిగి ఉన్నారని, వారు తప్పుదారి పట్టేందుకు అవకాశాలు అనేకం ఉన్నాయని ప్రస్తుతం డచ్ పోలీసులతో సైబర్ స్పెషల్ వాలంటీర్‌గా పనిచేస్తున్న జెమెన్ తెలిపారు. చాలామందికి ఏది చట్టపరమైనది.. ఏది చట్టవిరుద్ధమో తెలియదని ఆమె తెలిపింది. జెమెన్ ఇటీవలే ప్రారంభమైన సైబర్ అఫెండర్ ప్రివెన్షన్ స్క్వాడ్ అనే డచ్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో విడాకుల కేసులు అధికం! -
బిగ్ స్క్రీన్ టీవీలకు బిగ్ డిమాండ్.. రూ.లక్షలు పెట్టి కొనేస్తున్నారు!
ఇల్లు చూడు.. ఇంటి అందం చూడు అనేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అంతా టీవీ చూడు.. టీవీలో కనబడే పెద్ద బొమ్మ చూడు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీవీలు కొనేవారితో పోల్చితే ఇండియాలో పెద్ద స్కీన్ టీవీలు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోందట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు చిన్న స్క్రీన్ టీవీలు కొనాలని అడిగే వారే లేరంటోంది ఓ రీసెర్చ్ సంస్ధ. ఇంతకీ ఇంతలా పెద్ద స్క్రీన్ టీవీలు ఎందుకు కొంటున్నారు? బిగ్ స్క్రీన్స్‌కు బిగ్ డిమాండ్ కార్ల కంటే కూడా ఇండియన్స్ బిగ్ స్క్రీన్ టీవీలను కొనుగోలు చేసేందుకు తెగ ఉత్సాహపడుతున్నారని ఒక సర్వే తేల్చింది. కొంత మంది చిన్న కార్ల ధరలో టీవీలు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారట. సాధారణంగా 3, 4 లక్షల నుంచి 75 లక్షలు ధరల కలిగిన టీవీ మార్కెట్ విపరీతంగా పెరుగుతోందట. ఒటీటీలు వచ్చిన తరువాత చాలా మంది ఇండ్లలోనే హోమ్థియేటర్స్ ఏర్పాటు చేసుకుని చూడటానికి ఇష్టపడటమే ఇందుకు కారణంగా కనపడుతోంది. కరోనా సమయంలో చాలా మంది ఇంటికే పరిమితమవడం ఎంటర్టైన్మెంట్ కోసం పెద్ద టీవీలను కొనుగోలు చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు అదే కంటిన్యూ అవుతోంది. 65 ఇంచుల టీవీలను ఎగబడి కొంటున్నారు.. జిఎఫ్‌కె మార్కెట్ రీసెర్చ్ ప్రకారం 65 ఇంచుల టీవీలు కొనుగోలు చేయడానికి జనాలు తెగ ఉత్సాహం చూపుతున్నారట దీంతో ఈ మార్కెట్ 37శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక రోజు రోజుకు చిన్నటీవీల మార్కెట్ తగ్గుతూవస్తోంది. ఈ టీవీలను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపేవారే కరువయ్యారట. ఈ ఏడాది మొదటి 5 నెలల్లో ఓవరాల్‌గా టీవీ మార్కెట్ 13 శాతం వృద్ధి సాధించింది. ఇందులో బిగ్ స్క్రీన్ మార్కెట్ వాటా 17శాతం దాకా ఉంది. కోవిడ్ కంటే ముందు ఈ వాటా కేవలం 5శాతానికి మాత్రమే పరిమితమైంది. Additional Big TV Screen pic.twitter.com/RrLJdJoyPx — rajinder kumar (@rajinder75kumar) July 7, 2023 రూ. 75 లక్షల టీవీ అమ్మకాలకు ఫుల్ క్రేజ్ ఇక వినియోగదారుల ఇష్టానికి అనుగుణంగా బ్రాండెడ్ టీవీ కంపెనీలు సైతం పెద్ద పెద్ద స్కీన్స్ ఇండియాలో లాంచ్ చేసేందుకు తెగ ఆరాటపడుతున్నాయి. ఎల్జీ కంపెనీ ఇప్పటికే భారీ తెర కలిగిన ఓఎల్ఈడీ టీవీని లాంచ్ చేసింది. ఇండియాలో ఈ టీవీనే అత్యంత ఖరీదైన టీవీ . ఈ టెలివిజన్ ధర 75 లక్షలుగా ఉంది. దీన్ని ఎలా అంటే అలా చుట్టేయవచ్చు. అంతేకాదు దేశంలోని టాప్ టీవీల అమ్మకం కంపెనీ సైతం నెలకు 20 యూనిట్లు 20 లక్షల ధర కలిగిన టీవీల అమ్మకాలు చేపడుతుండగా, 10 లక్షలకు పైగా ధర ఉన్న టీవీలను నెలకు 100 దాకా అమ్ముతోంది. ఈ దీపావళికి ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించుకుంది. టెలివిజన్ తయారీ రంగంలో కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో ప్రజలు కూడా వారి వారి లగ్జరీ లైఫ్ కు అనుగుణంగా ఇంట్లో ఉండే టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్లెక్సీ ఈఎమ్ఐల రూపంలో కంపెనీలు టీవీల అమ్మకాలు చేయడం కూడా వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడానికి కారణంగా కనపడుతోంది. కేవలం బ్రాండెడ్ టీవీలే కాకుండా దేశీ బ్రాండ్ టీవీలు సైతం లోకల్ మార్కెట్లో అందుబాటులోకి రావడంతో చాలా మంది తక్కువ ధరకే పెద్దస్క్రీన్ టీవీలను కొనుగోలు చేస్తున్నారని జిఎఫ్‌కె రీసెర్చ్ తెలిపింది. బిగ్ స్క్రీన్ టీవీల మార్కెట్ విలువ 32 బిలియన్ డాలర్లు ఇండియాలో స్మార్ట్ టీవీ మార్కెట్ సైజ్ 2022లో 9.88 బిలియన్ డాలర్లు కాగా 2023 చివరి నాటికి అది 11.7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. 2023-2030 నాటికి ఇండియా టీవీ మార్కెట్ 16.7 శాతం వృద్ధితో 32.57 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందనేది నిపుణులు చెపుతున్నమాట. భారత ప్రభుత్వం మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ కింద టీవీ తయారీ కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలిస్తే తయారీ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. పైగా టీవీలలో వాడే చిప్‌లు ఇండియాలోనే తయారవుతుండటం టీవీ తయారీ కాంపోనెంట్స్ దిగుమతులు తగ్గుతుండటంతో అతిపెద్ద టీవీ స్క్రీన్స్‌కు ధర మరింతగా తగ్గే అవకాశం ఉంది. - రాజ్ కుమార్, డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్, బిజినెస్, సాక్షి టీవీ -
లెక్క ఎక్కువైనా పర్లేదు..మాకు కాస్ట్లీ ఇళ్లే కావాలి!
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగితే అది తమ భవిష్యత్తు కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని 96 శాతం మంది కొనుగోలుదారులు (ఇల్లు కొనాలని అనుకుంటున్నట్టు) చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్, సీఐఐతో కలసి దీనిపై ఓ సర్వే నిర్వహించింది. ‘ద హౌసింగ్ మార్కెట్ బూమ్’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఆర్బీఐ గతేడాది మే నుంచి ఇప్పటి వరకు రెపో రేటుని 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. ఇటీవలి ఏప్రిల్ సమీక్షలో మాత్రం రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తటస్థ వైఖరిని ప్రదర్శించింది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 80 శాతం మంది తమకు ధరలు ముఖ్యమైన అంశమని చెప్పారు. ఒకవైపు నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు పెరిగిన ఫలితంగా ప్రాపర్టీల ధరలకు సైతం రెక్కలు రావడం తెలిసిందే. దీనికి తోడు గృహ రుణాలపై రేట్లు 2.5 శాతం మేర పెరగడం భారాన్ని మరింత పెరిగేలా చేసింది. విశాలమైన ఇంటికే ప్రాధాన్యం.. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతల్లో పెద్ద మార్పు కనిపించలేదు. 42 శాతం మంది 3బీహెచ్‌కే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 40 శాతం మంది 2బీహెచ్‌కే ఇళ్ల కొనుగోలుకు అనుకూలంగా ఉండగా, 12 శాతం మంది ఒక్క పడకగది ఇంటి కోసం చూస్తున్నారు. 6 శాతం మంది అయితే 3బీహెచ్‌కే కంటే పెద్ద ఇళ్లను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది తాము రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధరలో ఇంటిని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసుకునే ఇంటికే తాము ప్రాధాన్యం ఇస్తామని 36 శాతం మంది తెలిపారు. దేశ రాజధాని ప్రాంత పరిధిలో ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తున్న వారిలో 45 శాతం మంది 3బీహెచ్‌కే తీసుకోవాలని అనుకుంటున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 42 శాతం మంది ఎంపిక 2బీహెచ్కేగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీ ధరలు చాలా ఎక్కువగా ఉండడం కొనుగోలు ప్రాధాన్యతల్లో మార్పునకు కారణమని తెలుస్తోంది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 52 శాతం మంది సొంత వినియోగానికేనని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల ప్రభావం ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉండడం, అంతర్జాతీ య ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చితి ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశీయ హౌసింగ్ డిమాండ్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి అన్నారు. మొత్తం మీద ఇళ్ల డిమాండ్‌లో రేట్ల పెంపు ఒక భాగమేనని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెద్దా, చిన్న కంపెనీల్లో ఉద్యోగాల కోతలు సైతం ఇళ్ల కొనుగోలు డిమాండ్‌పై ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇంటి కొనుగోలును వాయిదా వేసుకోవచ్చన్నారు. 2024–25 నాటికి అన్ని సమస్యలు సమసిపోయి, హౌసింగ్ మార్కెట్ తిరిగి బలంగా పుంజు కుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ప్రాపర్టీ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు లేకుంటే రిస్కే!
ప్రస్తుతం భూమి.. బంగారం కంటే విలువైనదిగా మారిపోయింది. దీంతో భూమిపై పెట్టుబడి పెట్టేవారు ఇటీవల కాలంలో బాగా పెరిగారు. అధికంగా పెట్టుబడులు పెట్టే స్థోమత ఉన్నవారు షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం కన్నా కూడా స్థిరాస్తి మీదే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కరోనా సంక్షోభ సమయంలో డీలా పడిన రియల్ ఎస్టేట్ రంగం తర్వాత పుంజుకుంది. (త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్‌కుక్!) కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు బ్యాంకులు కూడా ప్రస్తుతం తక్కువ వడ్డీకి హోంలోన్లు ఇస్తున్నాయి. దీంతో ఇల్లు లేదా స్థలం కొనడానికి ఇదే అనువైన సమయమని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసేవారు ముందుగా కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఎలాంటివి కొనాలి.. ఎక్కడ కొనాలి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది.. వంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. (జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు) అనుమతులన్నీ ఉన్నాయా? స్థిరాస్తి కొనుగోలు అన్నది అధిక పెట్టుబడులతో కూడుకున్నది. కాబట్టి జాగ్రత్తలు కూడా ఎక్కువే తీసుకోవాలి. ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటున్న చోటు అంటే ఆ నగరం లేదా పట్టణంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి పరిశోధన చేయాలి. రహదారులు, హైవేలు, కనెక్టివిటీ వంటివి తెలుసుకోవాలి. ఏవైనా వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసేవారు వాటికి అన్ని అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకపోతే ఇల్లు కట్టుకునేటప్పుడు చిక్కులు తప్పవు. ఇక ఇదివరకే నిర్మించిన ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లయితే యాజమాన్య ధ్రువీకరణ పత్రం, బిల్డింగ్ లే అవుట్ ఆమోదం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, వ్యవసాయేతర అనుమతి, నీరు, అగ్నిమాపక విభాగం ఆమోదం వంటివి ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. నివాసం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించడానికి రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) రిజిస్ట్రేషన్ కూడా పరిశీలించాలి. అలాగే కొత్తగా ఏమైనా నిబంధనలు వచ్చాయేమో తెలుసుకోవాలి. ఆస్తి కొంటున్న ప్రాంతం ఏ అధీకృత సంస్థ పరిధిలోకి వస్తుందో దాని ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆయా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ అసలైనవేనా అని చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎలాంటివి కొనాలి? సాధారణంగా ఇల్లు లేదా స్థలాలను కొనేవారిలో చాలా మంది సొంత వినియోగం కోసమే తీసుకుంటున్నారు. మరికొంత మంది కేవలం పెట్టుబడి కోణంలోనే ఆస్తులు కొంటున్నారు. అయితే సొంత వినియోగం కోసం ఆస్తులు కొనేవారు నాణ్యమైనవి కొనుగోలు చేయాలి. ఇందు కోసం మార్కెట్లో నమ్మకమైన బ్రాండెడ్ డెవలపర్ల దగ్గర కొనుగోలు చేస్తే మంచిది. గుర్తింపు లేని, ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు వాటి నాణ్యతపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కొనాలి? ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్లు, బస్సులు, ఆటోలు వంటి ప్రజా రవాణాకు అందుబాటులో ఉన్న ప్రదేశాలలో ఆస్తులను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచిది. అంతేకాకుండా స్థిరాస్తికి సమీపంలో పాఠశాలలు, వాణిజ్య భవన సముదాయాలు, ఆసుపత్రులు ఉన్నాయో లేదో కూడా నిర్ధారించుకోవాలి. ఈ సౌకర్యాలన్ని ప్రాథమిక అవసరాలు తీర్చడమే కాకుండా ఆస్తి విలువ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బిల్డర్ గురించి తెలుసుకున్నారా? ఏదైనా ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు, బిల్డర్ గత రికార్డు, అతను ఎన్ని ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాడు, నిర్మాణం పూర్తి చేసే సమయం, నిర్మాణ నాణ్యతను పరిశీలించాలి. కొనుగోలుదారులు అజాగ్రత్తగా ఉంటే మోసపోయే అవకాశం లేకపోలేదు. కాబట్టి స్థిరాస్తి కొనుగోలు చేసేవారు ముందుగా తగిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం చాలా అవసరం. -
విశాఖ: భారీగా క్యూ కట్టిన క్రికెట్ ఫ్యాన్స్ (ఫొటోలు)
-
India Buying Russian Oil: భారత్‌ని నిందించలేం! అది మా పని కాదు!
రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తున్న భారత్ గురించి జర్మన్ రాయబారి ఫిలప్ అకెర్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం గురించి భారత్‌ని నిందించలేనని స్పష్టం చేశారు. రష్యా చమురు కొనుగోలుపై న్యూఢిల్లీ అనుసరిస్తున్న విధానం సౌకర్యవంతంగా ఉందని యూఎస్ చెప్పిన కొద్ది వారాల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం విషయమై భారత్‌ని విమర్శించలేను, అది మాకు అనవసరమైన విషయం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇది భారత ప్రభుత్వానికి సంబంధించిన విషయం దీనిలో తాము జోక్యం చేసుకోమని తెగేసి చెప్పారు. అంతేగాదు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలిగే తగిన అభ్యర్థి భారతేనని, దానికి ఆ నైపుణ్యం, దౌత్యం ఉన్నాయని జర్మన్ రాయబారి అకెర్ మాన్ అన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన తర్వాత నుంచి పాశ్చాత్య దేశాలు రష్యా చమురు కొనుగోలును తగ్గించాయి. కానీ చైనా, యూఎస్ తర్వాత ప్రపంచంలో మూడవ అతి పెద్ద ముడి చమురు దిగుమతి దారు అయిన భారత్ మాత్రం రష్యా నుంచి చమురును కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పాశ్చాత్య దేశాలు విమర్శిస్తున్నా.. మంచి డీల్ లభించిన చోట చమురు కొనుగోలు చేస్తూనే ఉంటామని కరాఖండీగా చెప్పింది. ఐతే రష్యా చమురుపై పరిమితి విధించిన జీ7 దేశాలకు మద్దతివ్వకుండా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా స్వాగతించింది. భారత్‌లో రష్యన్ చమురు దిగుమతులు జనవరిలో రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల బారెళ్లకు చేరాయి. మాస్కో ఇప్పటికి న్యూఢిల్లీకి చమురు అమ్మకందారుగా ఉంది. దీంతో భారత్‌లో రిఫైనర్లు రష్యా కీలక చమురు క్లయింట్‌గా ఉద్భవించాయి. అంతేగాదు భారత్ ఐరోపా, యూఎస్ కోసం ఇంధనాన్ని శుద్ధి చేస్తోంది కూడా. ఐతే శుద్ధి చేసిన ఇంధనం రష్యన్‌కి చెందినదిగా పరిగణించబడదు. అదీగాక ముడి చమురును సాధ్యమైనంత వరకు తక్కువ ధరకు కొనుగోలు చేయడం కోసం రష్యాతో భారత్ కఠినమైన భేరాన్నే కుదుర్చుకుంది. దీంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని..ఇంధన భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో వాషింగ్టన్ న్యూఢిల్లీతో సౌకర్యవంతంగా ఉందని బైడెన్ పరిపాలనాధికారి తెలిపారు. (చదవండి: బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉంది! భారత్‌లో పరిణామాలపై బ్రిటన్ స్పందన) -
ఎయిరిండియాకు 6,500 మంది పైలట్లు కావాలి
ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సంస్థ ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి 470 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ విమానాలు నడిపించడానికి 6,500 మందికిపైగా పైలట్లు అవసరమని విమానయాన పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 113 విమానాలు ఉన్నాయి. దాదాపు 1,600 మంది పైలట్లు పనిచేస్తున్నారు. పైలట్ల కొరత వల్ల ఇటీవల పలు సందర్భాల్లో అల్ట్రా–లాంగ్ హాల్ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాల ప్రయాణాల్లో ఆలస్యం చోటుచేసుకుంది. ఎయిరిండియా అనుబంధ సంస్థలైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియాలో 54 ఫ్లైట్లు ఉండగా, దాదాదాపు 850 మంది పైలట్లు సేవలందిస్తున్నారు. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో 53 విమానాలు, 600 మందికిపైగా విమాన చోదకులు ఉన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియా, విస్తారా సంస్థల్లో కలిపి 220 విమానాలు ఉన్నాయి. 3,000 మందికిపైగా పైలట్లు పనిచేస్తున్నారు. -
లగ్జరీ విల్లాలకు ఊపు: ఎన్ఆర్ఐ, బడాబాబులే తోపు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి తర్వాత విల్లాలకు ఊపొచ్చింది. సామాన్య, మధ్యతరగతితో పోలిస్తే కరోనా మహమ్మారి లగ్జరీ గృహ కొనుగోలుదారుల మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ఫలితంగా ఈ విభాగం గృహ విక్రయాలలో వృద్ధి నమోదవుతుంది. ఎక్స్ఛేంజ్ రేటు తక్కువగా ఉండటం మూలంగా ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ♦ ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 1.84 లక్షల గృహాలు విక్రయం కాగా.. ఇందులో 14 శాతం అంటే 25,680 ఇళ్లు లగ్జరీ గృహాలే అమ్ముడుపోయాయని అనరాక్ గ్రూప్ సర్వే వెల్లడించింది. అదే కరోనా కంటే ముందు 2019 ఏడాది మొత్తం చూస్తే.. 2.61 లక్షల యూనిట్లు విక్రయం కాగా.. కేవలం 3 శాతం అంటే 17,740 యూనిట్లు మాత్రమే లగ్జరీ గృహాలున్నాయని పేర్కొంది. లాంచింగ్‌లోనూ లగ్జరే.. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందన్న సూత్రం ప్రకారమే.. డెవలపర్లు కూడా ప్రాజెక్ట్ లాంచింగ్‌లలో లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 2019లో 28,960 విలాసవంతమైన ఇళ్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరం నాటికే ఏకంగా 28 వేల లగ్జరీ గృహాలను లాంచింగ్ చేశారు. పశ్చిమంలో హవా.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో పశ్చిమాది ప్రాంతాలదే హవా కొనసాగుతోంది. గత మూడు త్రైమాసికాల నుంఇచ కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ పశ్చిమ హైదరాబాద్‌లో 57 శాతం జరిగాయి. ఉత్తరాదిలో 18 శాతం, తూర్పులో 15 శాతం, సెంట్రల్లో 8 శాతం, సౌత్ హైదరాబాద్‌లో 2 శాతం లాంచింగ్స్ జరిగాయి. వెస్ట్ హైదరాబాద్‌లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్‌లో అత్తాపూర్‌లు రియల్టీ హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. వృద్ధి కారణాలివే.. 2019 నుంచి 2022 హెచ్1తో పోలిస్తే రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ గృహాల విక్రయాలలో రెండింతల వృద్ధి నమోదయింది. 2022 హెచ్1లో అత్యధిక లగ్జరీ గృహాలు అమ్ముడుపోయింది ముంబైలోనే. ఇక్కడ 13,670 యూనిట్లు సేలయ్యాయి. ఆ తర్వాతి ఎన్సీఆర్లో 4,160 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2019లో ఈ రెండు నగరాలలో 11,890 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరంలోనే 17,830 యూనిట్లు విక్రయమయ్యాయి. 2019 నుంచి 2022 హెచ్ 1తో పోలిస్తే ముంబైలో లగ్జరీ గృహాల అమ్మకాలు 13 శాతం 25 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ఎన్సీఆర్లో 4 శాతం నుంచి 12 శాతానికి వృద్ధి చెందాయి. -
ఎగబడి కొంటున్న జనం! ఈ ఇళ్లకు యమ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. భౌతిక దూరం నేపథ్యంలో ఇంటి విస్తీర్ణం కూడా పెరిగింది. గతంలో రెండు పడక గదుల వైపు ఆసక్తి చూపిన కొనుగోలుదారులు శరవేగంగా మూడు పడక గదుల వైపు మళ్లుతున్నారు. గతేడాది జనవరి–జూన్ (హెచ్ 1)లో 46 శాతం మంది 2 బీహెచ్‌కే కొనుగోళ్లకు ఇష్టపడగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి 38 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో 40 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే కాస్త 2022 హెచ్1 నాటికి 44 శాతానికి పెరిగిందని సీఐఐ – అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. ►జనవరి–జూన్ మధ్య ఆన్లైన్లో నిర్వహించిన ఈ సర్వేలో 5,500 మంది పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 92 శాతం మంది ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతుందని, 16 శాతం మంది వచ్చే ఏడాది కాలంలో స్వల్పంగా మెరుగుపడుతుందని అంచనా వేశారు. ► నాలుగు పడక గదులకూ డిమాండ్ పెరిగింది. గతేడాది హెచ్1లో 2 శాతంగా ఉన్న ఈ గృహాల ఆసక్తి.. ఇప్పుడు 7 శాతానికి వృద్ధి చెందింది. రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ ప్రాపర్టీల లావాదేవీలు 4 శాతం మేర వృద్ధి చెందాయి. కరోనా కంటే ముందు 6 శాతంగా ఉన్న ఈ ప్రాపర్టీల డిమాండ్.. 2022 హెచ్1 నాటికి 10 శాతానికి పెరిగింది. ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో డెవలపర్లు కూడా ఈ గృహాల సరఫరాను పెంచారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2022 హెచ్1లో రూ.33,210 లగ్జరీ యూనిట్లు లాంచింగ్ అయ్యాయని పేర్కొన్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉంటేనే.. కరోనా తర్వాతి నుంచి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లకు డిమాండ్ పెరిగింది. రెడీగా ఉన్న, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు మధ్య అంతరం క్రమంగా తగ్గుతుంది. 2020 హెచ్1లో రెడీ టు మూవ్, కొత్త ప్రాజెక్ట్ మధ్య 46:18 శాతంగా ఉన్న నిష్పత్తి.. ఈ ఏడాది హెచ్1 నాటికి 30:25 శాతానికి చేరింది. 69 శాతం మంది సొంతంగా ఉండేందుకు గృహాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే.. 31 శాతం మంది పెట్టుబడుల రీత్యా కొంటున్నారు. 8–10 ఏళ్ల పెట్టుబడి జోన్లో ఉన్న పెట్టుబడిదారులు సానుకూల దృక్పథంతో ఉన్నారని, వచ్చే ఏడాది కాలంలో నివాస సముదాయాల పెట్టుబడిదారుల మార్కెట్ మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది హెచ్1లో 54 శాతం మంది ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్ ఉత్తమమైనదని భావించగా.. 2022 హెచ్1 నాటికిది 59 శాతానికి పెరిగింది. చదవండి👉 ‘మేం ఫ్రీగా డబ్బులిస్తాం...ఇళ్లు కట్టుకోండి’.. బంపరాఫర్ ఇచ్చిన ప్రభుత్వం! -
ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య
రాయదుర్గం రూరల్: సెల్‌ఫోన్ కొనివ్వకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రాయదుర్గం మండలం వేపరాలకు చెందిన హరిజన రమేష్ కుమారుడు యశ్వంత్ (18) ఇంటర్ వరకు చదువుకుని కూలి పనులతో తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా తనకు సెల్‌ఫోన్ కొనివ్వాలంటూ తండ్రిని అడుగుతున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో తండ్రి కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన యశ్వంత్ శనివారం ఉదయం శ్మశాన వాటిక సమీపంలో క్రిమి సంహారక మందు సేవించాడు. గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ భాస్కర్ తెలిపారు. యువకుడి దారుణ హత్య గార్లదిన్నె: విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరిన యువకుడు అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత విగతజీవిగా కనిపించాడు. ఎవరో హత్య చేసి.. గుర్తుపట్టకుండా శరీరంపై పెట్రోలు పోసి తగులబెట్టారు. ఈ ఘటన రామదాస్‌పేట సమీపంలో శనివారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. కేశవాపురానికి చెందిన రాజేష్ (23) గార్లదిన్నె భారత్ గ్యాస్ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. అయితే రాత్రి అయినా ఇంటికి చేరుకోలేదు. మొబైల్‌కు ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వస్తుండటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించకుండా పోయాడని శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో రామదాస్‌పేట అటవీ ప్రాంతంలో ఓ యువకుడికి నిప్పంటించి చంపేసినట్లు సమాచారం అందింది. హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు రోజుల కిందటే శరీరంపై పెట్రోలు పోసి తగులబెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఆనవాళ్లను బట్టి చనిపోయింది రాజేష్ అని తల్లిదండ్రులు తెలిపారు. సీఐ అస్రార్‌బాషా అటవీప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి. (చదవండి: మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి..) -
అంబానీ మరో భారీ ప్లాన్: దిగ్గజ కంపెనీపై కన్నేసిన రిలయన్స్
సాక్షి, ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాకు చెందిన కాస్మెటిక్స్ సంస్థ రెవ్లాన్‌ను సొంతం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దివాలా పిటిషన్ దాఖలు చేసిన రెవ్లాన్ కొనుగోలు చేసే అంశాల్ని పరిశీలిస్తోందన్న వార్తలు ప్రాధాన్యతను సంతరించు కున్నాయి. అయితే ఈ పరిణామాలపై రిలయన్స్ , రెవ్లాన్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. రెవ్లాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్‌ను టేకోవర్ చేయడానికి ఆసియా కుబేరుడు,రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. దీనికవసరమైన బిడ్డింగ్స్ దాఖలుకు రిలయన్స్ సంప్రదింపులు కేడా మొదలు పెట్టినట్లు సమాచారం. గ్లోబల్ సరఫరా గొలుసు అంతరాయాలు ముడిసరుకు ఖర్చులను పెంచి, ముందస్తు చెల్లింపులను డిమాండ్ చేసేలా విక్రేతలను ప్రేరేపించిన తర్వాత ఈ వారం ప్రారంభంలో రెవ్లాన్ దివాలా కోసం దాఖలు చేసినట్లు నివేదిక వచ్చింది. టెలికాం, ఇంధనం, రిటైల్ రంగాల్లో సత్తా చాటుతూ దూసుకుపోతున్న రిలయన్స్ వ్యక్తిగత కాస్మొటిక్స్ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించేందుకు పావులు కదుపుతోందన్నమాట. మరోవైపు రిలయన్స్ ఇటీవలి కాలంలో భారీ విస్తరణ వ్యూహాల్లో ఉంది. ఇందులో భాగంగా జాతీయంగా అంతర్జాతీయంగా పలు కంపెనీల కొనుగోలు ప్రయత్నాల్లో ఉంది. అపోలోతో పాటు,యూకే-ఫార్మసీ చైన్ బూట్స్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో డన్జోలో వాటా కొనుగోలు చేసింది. చార్లెస్ అండ్ బ్రదర్స్ నేతృత్వంలోని 1932లోఏర్పాటైన కాస్మొటిక్స్ కంపెనీ ఇది. నెయిల్ పాలిష్‌లు, లిప్‌స్టిక్‌లకు పేరుగాంచింది. ఎలిజబెత్ అర్డెన్, ఎలిజబెత్ టేలర్ పేరుతో స్కిన్ కేర్, మేకప్, పెర్ఫ్యూమ్స్ విక్రయిస్తుంది. 90 ఏళ్ల నాటి రెవ్లాన్ కంపెనీ అమెరికన్ బిలియనీర్ రాన్ పెరెల్మ్యాన్ సారధ్యంలో ప్రస్తుతం మొత్తం 15 బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది. బ్యాంకు రుణాల భారం, కాస్మొటిక్స్ సెగ్మెంట్లో నెలకొన్న తీవ్ర పోటీ వంటి కారణాలు కంపెనీని దెబ్బ తీశాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి రెవ్లాన్ కంపెనీ రుణాలు 3.31 బిలియన్ డాలర్లు. కాగా తాజా వార్తలతో రెవ్లాన్ షేరుకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. -
Elon Musk: నెక్స్ట్ ఏం కొనబోతున్నాడో చెప్పిన ఎలన్ మస్క్
బహు తిక్క మేధావి ఎలన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశాడు. సోషల్ మీడియా శృంఖలాలు తెంచడంలో భాగంగానే తాను ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు మస్క్ చెప్పిన విషయం తెలిసిందే. నాటకీయ పరిణామల నడుమ సుమారు 44 బిలియన్ డాలర్ల డీల్‌తో ఎట్టకేలకు ట్విటర్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ తరుణంలో.. ఈ ఉదయం(ఏప్రిల్ 28) మరో ట్వీట్ చేశాడు. తాను తర్వాత కోకా కోలాను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటన చేశాడు. కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ తయారీతో మల్టీనేషనల్ కంపెనీగా పేరున్న ఈ అమెరికన్ కంపెనీని, మస్క్ చేజిక్కిచుకోనున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఇల్లీగల్ డ్రగ్‌గా పేరున్న కొకైన్‌ను కోకా కోలాకు తిరిగి చేరుస్తానంటూ సంచలన ప్రకటనతో ట్వీట్ చేశాడు. కోకా కోలా.. ట్రేడ్‌మార్క్ శీతల పానీయంలో రెండు ప్రాథమిక పదార్థాలు ఉండేవి. కోకా ఆకులు, కోలా గింజలు. కోలా గింజలు కెఫిన్ యొక్క మూలం కాగా, కోకా ఆకుల నుంచి సైకోయాక్టివ్ డ్రగ్ ‘కొకైన్’ వస్తుంది. కోకా-కోలా ఒకానొక సమయంలో ఎక్కువగా కోకా ఆకుల మీదే ఆధారపడింది. కొకైన్‌ను ఆ కాలంలో ఔషధంగా పరిగణించినప్పటికీ.. ఒకానొక టైం వచ్చే సరికి నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో.. అమెరికా దానిని నిషేధించగా.. కోకా కోలా నుంచి ‘సీక్రెట్ రెసిపీ’గా పేరున్న కోకా ఆకులు దూరమై.. బదులుగా డీకోకైనైజ్డ్ కోకా ఆకులు వచ్చి చేరాయి. Next I’m buying Coca-Cola to put the cocaine back in — Elon Musk (@elonmusk) April 28, 2022 ఈ తరుణంలో మస్క్.. కోకా కోలాకు తిరిగి ‘కొకైన్’ వైభవం తీసుకొస్తానంటూ ట్వీట్ చేయడం విశేషం. ఇంకోవైపు మెక్‌డొనాల్డ్స్‌ను కొనుగోలు చేస్తానంటూ గతంలో ఎలన్ మస్క్ చేసిన ఓ ట్వీట్‌ను.. తిరిగి తానే షేర్ చేసిన మస్క్.. అద్భుతాలు చేయలేనంటూ మరో తిక్క ట్వీట్‌తో బదులివ్వడం విశేషం. టెస్లా వాటా, షేర్లు అమ్మడంతో మొదలైన మస్క్ యవ్వారం.. ఆపై ట్విటర్ కొనుగోలుతో తారాస్థాయికి చేరుకుంది. జోక్‌గా భావించిన ప్రతీ విషయాన్ని నిజం చేసుకుంటూ పోతున్నాడు ఈ ప్రపంచ కుబేరుడు. చదవండి👉: క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం? చదవండి👉🏾: ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు దిమ్మతిరిగే షాక్.. వీడియో వైరల్ -
రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు: మంత్రి కన్నబాబు
సాక్షి, తాడేపల్లి: రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారుల ప్రమేయం తగ్గించామని పేర్కొన్నారు. అధిక వర్షాలతో కొన్ని జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటివరకూ 2,36,880 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 7వేలకు పైగా ఆర్బీకేలలో ధాన్యం సేకరణ ఏర్పాటు చేశామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. చదవండి: మాయలేడి: ఇంట్లోకి వచ్చి ఎంత పని చేసిందంటే..! -
సోషల్ మీడియా.. మీకు కావాల్సింది ఇదేనా?
సోషల్ మీడియా అంటే ఒకప్పుడు మనకు సంబంధించిన సమాచారాన్ని వర్చువల్‌గా మరొకరితో పంచుకోవడం కోసం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీగా పరిగణించాం. ఆ తర్వాత వ్యక్తులుగా దూరంగా ఉన్నా.. చాలా దగ్గరగా ఉన్న అనుభూతిని అందించే గొప్ప మాధ్యమాలుగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి మనం ఏం కొనాలో ఎప్పుడు కొనాలో ఎవరి దగ్గర కొనాలో అనే విషయాలను కూడా ప్రభావితం చేసే శక్తులుగా ఎదిగాయి. విపత్తుతో వచ్చిన మార్పు అనుకోకుండా వచ్చిన కోవిడ్ విపత్తు, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో వ్యాపార రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పౌడర్ డబ్బా నుంచి ఫోన్ల వరకు ఏది కొనుగోలు చేయాలన్నా ఆన్లైన్నే ఆశ్రయిస్తున్నారు. దీంతో ల్యాప్‌ట్యాప్, డెస్క్‌టాప్, మొబైల్‌ఫోన్లే వర్చువల్ షాపింగ్‌మాల్స్‌గా మారుతున్నాయి. ఇక్కడ ఏ వస్తువులు కొనాలనేది మనకు తెలియకుండానే సోషల్ మీడియా ఖాతాలే డిసైడ్ చేస్తున్నాయి. మన అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా మార్కెట్‌ను మన ముందుకు తెస్తున్నాయి. సోషల్ మీడియాలో 50 కోట్ల మంది కోవిడ్ సంక్షోభం కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆన్లైన్ షాపింగ్‌కి షిఫ్ట్ అయ్యారు. కరోనా కష్టాలు మొదలయ్యాక కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఈ కామర్స్ రంగం 94 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే కాలంలో 4.7 కోట్ల మంది కొత్తగా బేసిక్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు షిఫ్ట్ అయ్యారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ యూజర్ల సంఖ్య 7.8 కోట్లు పెరిగింది. అంటే పాత వారితో పాటు కొత్తగా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారిలో చాలా మంది యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం దేశ జనాభాలో 33 శాతం మంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అంటే కనీసం యాభై కోట్ల మంది జనాభా నిత్యం సామాజిక మాధ్యమాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. స్థిర వ్యాపారాన్ని మించి సాధారణంగా గల్లీ చివర కిరాణా కొట్టు మొదలు బడా షాపింగ్ మాల్ వరకు వ్యాపారం స్థిరమైన నిర్మాణాలు ఉన్న చోటే జరుగుతుంది. అక్కడ లభించే వస్తువులు, ఉత్పత్తుల గురించి వేర్వేరు చోట్ల ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆన్లైన్ బిజినెస్‌లో ఈ కష్టాలు ఉండవు. కస్టమర్ ఎక్కడుంటే ప్రొడక్ట్ అక్కడే కనిపిస్తుంది. ఆయా ప్రొడక్టుకు సంబంధించిన సమాచారం, ప్రకటనలు కూడా కస్టమర్‌కి అతి దగ్గర ఇంచుమించు అతని నీడలా వెన్నంటి ఉంటాయి. దీంతో కస్టమర్‌కి చేరువ కావడం అమ్మకాలు జరిపించడం ఆన్లైన్లో తేలికగా మారింది. కీలకంగా సోషల్ మీడియా స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా వేల కొద్ది వస్తువులు మన చెంతనే ఉన్నా అందులో మనకు ఏదీ అవసరం, ఎప్పుడు అవసరం అనే విషయాలు సెర్చ్ చేయడమనేది సాధారణ విషయమేమీ కాదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారి అభిరుచులు, అవసరాలను ఎప్పటికప్పుడు మెషిన్ లెర్నింగ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలిసి పోతుంది. దానికి అనుగుణంగా వారికి అవసరమైన వస్తువులు, ఉత్పత్తులే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫార్మ్‌లలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో కస్టమర్‌కి అతి దగ్గరగా వెళ్లే అవకాశం ఈ కామర్స్‌కి ఉంటోంది. తాజా నివేదికల ప్రకారం ఒక వ్యక్తి కొనుగోలులో సోషల్ మీడియా ప్రభావం 34 శాతం ఉంటోంది. రెండూ ఉంటేనే ప్రజలు వేగంగా ఈ కామర్స్ రంగానికి మారుతున్న వైనం, కొనుగోలు విషయంలో సోషల్ మీడియా ప్రభావాన్ని గమనించిన అనేక బడా సంస్థలు తమ బిజినెస్ మాడ్యుల్లో మార్పులు చేసుకుంటున్నాయి. షాప్ లేదా బడా మాల్స్‌ను నిర్వహించడంతో పాటు వాటికి అనుబంధంగా ఈ కామర్స్ ఫ్లాట్ఫార్మ్ని కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. ఇలాంటి మార్పులు చేసిన సంస్థల వ్యాపారం గతం కంటే బాగుండగా కేవలం సంప్రదాయ వ్యాపారానికే పరిమితమైన చోట వృద్ధి రేటు తక్కువగా ఉంటోంది. -
37% మహిళల వద్ద బంగారం లేదు
ముంబై: వినటానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. మన దేశంలోని 37 శాతం మంది ఇంత వరకు బంగారం ఆభరణాలను కొనుగోలు చేయలేదట. ప్రపంచ స్వర్ణ మండలి సంస్థ (డబ్ల్యూజీసీ) ఒక సర్వే చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించింది. కాకపోతే భవిష్యత్తులో బంగారం ఆభరణాలను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్టు వారు చెప్పారు. ‘‘37 శాతం మంది మహిళలు కొనుగోలు సామర్థ్యంతో ఉన్నారు. బంగారం ఆభరణాల పరిశ్రమకు వారు కొత్త వినియోగదారులు కానున్నారు. వీరిలో 44 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, 30 శాతం మంది పట్టణ ప్రాంతాల నుంచి ఉన్నారు’’ అని డబ్ల్యూజీసీ భారత ఆభరణాల పరిశ్రమపై విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మన దేశ మహిళలకు బంగారం ఆభరణాలు మొదటి ప్రాధాన్యమన్న విషయం తెలిసిందే. బంగారం మన్నిౖMðనదే కాకుండా, చక్కని పెట్టుబడి సాధనమని, కుటుంబ వారసత్వ సంపదంటూ.. మహిళలకు ఇది చక్కని ఎంపిక అని ఈ సర్వే పేర్కొంది. అయితే, నేటి యువ మహిళల అవసరాలను పసిడి తీర్చలేకపోతుందని తెలిపింది. ఇక 18–24 ఏళ్ల వయసున్న భారతీయ మహిళలలో 33 శాతం మం ది గడిచిన ఏడాది కాలంలో బంగారం ఆభరణాలను కొనుగోలు చేసినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. -
సెకండ్స్ కొంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, కర్నూలు: మార్కెట్లోకి కొత్త కొత్త వాహనాలు వచ్చేస్తున్నాయి. బైక్‌లు, ఆటోలు, కార్లు, జీపులు సరికొత్త హంగులతో ప్రయాణానికి, రవాణాకు వీలుగా పలు కంపెనీలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు వాహనదారులు తమ అవసరాలకు అనుగుణగా వాహనాలను కూడా మార్చుతూ వస్తున్నారు. గతంలో ఉన్న వాహనాలను మార్కెట్లో అమ్మేస్తూ కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. ఇదే క్రమంలో కొందరు ఆర్థిక ఇబ్బందులతో కొత్త వాహనాలను కొనుగోలు చేయలేకపోవడం, మరి కొందరు తాత్కాలిక అవసరాలకు పాత వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో సెకండ్ సేల్స్ ఊపందుకున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ లెక్కల ప్రకారం 3,71,79 వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, ఆత్మకూరు ప్రాంతాల్లో 28 కారు, 52 బైక్ సెకండ్ సేల్ కేంద్రాలు ఉన్నాయి. అయితే పాత వాహనాలను కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తత అవసరమని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటించక పోవడమే పెద్ద సమస్యగా మారుతోందని, కొద్దిపాటి నిర్లక్ష్యం భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఫైనాన్స్ సౌకర్యం పెరగడంతో గత ఐదేళ్లలో వీటి డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే పాత వాహనాల మార్కెట్ కూడా బాగా పెరిగింది. గతంలో వాహనం విక్రయించే సమయంలో సేల్ లెటర్‌పై సంతకం చేస్తే కొనుగోలుదారు రవాణా శాఖ కార్యాలయంలో చలానా చెల్లించి దాన్ని మార్చుకునేవారు. సాంకేతికత అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ఈ పద్ధతికి కాలం చెల్లింది. సులభంగా మార్పు... వాహన బదిలీకి ప్రస్తుతం ఆన్లైన్ విధానం అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్ధతిలో వాహనాన్ని ఒకరి నుంచి మరొకరి పేరిట మార్చుకోవడం చాలా సులువు. విక్రయ, కొనుగోలు దారులిద్దరూ సీఎస్ఈ (కామన్ సర్వీస్ సెంటర్)కి వెళ్లి వాహనానికి సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యుషన్ సరి్టఫికెట్, ఇద్దరి ఆధార్ కార్డ్‌లు సమరి్పంచాలి. తర్వాత ఇద్దరూ బయోమెట్రిక్ డివైస్‌తో వేలిముద్రలు వేసి.. అవసరమైన వివరాలు నమోదు చేస్తే కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట వాహనం బదిలీ అవుతోంది. కేవలం పది నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. సమస్యలు ఇవీ.. పాత వాహనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట బదిలీ చేయకపోతే.. తర్వాత ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే విక్రయించిన వ్యక్తిపైనే పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అసాంఘిక, సంఘ విద్రోహక కార్యకలాపాలకు ఆ వాహనం వినియోగించినా.. విక్రయించిన వ్యక్తినే పోలీసులు మొదట అదుపులోకి తీసుకుంటారు. ఆయన ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తిని సంఘటనకు బాధ్యుడిని చేస్తారు. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు విధించే అపరాధ రుసుం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా విక్రయదారు కొత్త వాహనం కొనుగోలు చేస్తే.. 5 శాతం పన్ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాహనం అప్పగించాలి పాత వాహనం కొనుగోలుదారుడి పేరుతో బదిలీ అయ్యాక వాహనం అప్పగించాలి. పాత వాహనాలు కొనుగోలు చేసేవారు, విక్రయించే వారు ఇద్దరూ అప్రమత్తంగా ఉండాలి. ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సరి్టఫికెట్స్ సక్రమంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించుకోవాలి. ఆర్సీ ప్రకారం చాసీస్ నంబర్ తనిఖీ చేసుకోవాలి. విక్రయం పూర్తయిన వెంటనే.. వాహన బదిలీ ప్రక్రియ కూడా పూర్తి చేయాలి. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. –జి.వివేకానందరెడ్డి, జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ -
మూపురాల జాతర
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ఒంటెల సంతతి పెరుగుతూ ఉంటే ఒక్క భారతదేశంలో తరుగుతూ ఉంది. ప్రమాదకరమైన ఈ పరిణామం మధ్య ఈసారి పుష్కర్‌లో జరుగనున్న ప్రపంచ ప్రఖ్యాత ‘ఒంటెల మేళా’ ఒంటెల గురించి కాసింతైన స్పృహను కలిగించాల్సిన అవసరం ఉంది. ఊళ్లోకి ఏనుగు వచ్చినా ఒంటె వచ్చినా పిల్లలకు వింత. పెద్దలకు సరదా. రెండూ మన ప్రాంతంలో విస్తృతంగా కనిపించే జంతువులు కావు. ఒంటె ఎడారి జంతువు. అందుకే దానిని ఎడారి ఓడ అంటారు. ‘లొటిపిట్ట’ అని కూడా అంటారు. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా రాజస్థాన్‌లో ఒంటె లేకుండా సామాన్య జీవనం జరగదు. ఒక అంచనా ప్రకారం దేశంలోని ఎనభై శాతం ఒంటెలు రాజస్థాన్‌లోనే ఉన్నాయి. అందుకే అక్కడ ఒంటెను ఇక్కడ ఎద్దులా ఇంటి పశువు అనుకుంటారు. కుటుంబంలో భాగం చేసుకుంటారు. సంవత్సరానికి ఒకసారి పుష్కర్‌లో మహా మేళా నిర్వహించి ఒంటెల కొనుగోలు, అమ్మకం జరుపుకుంటారు. కార్తీక మాసంలో కార్తీక ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఈ మేళా జరుగుతుంది. ఈసారి ఈ మేళా నవంబర్ 5 నుంచి 12వ తేదీ వరకు జరుగుతోంది. తరలి వచ్చే సంచారజాతులు సంవత్సరం పొడవునా ఒంటెలను మేపుతూ ఎడారుల్లో తిరిగే, చిన్న చిన్న ఆవాసాల్లో నివసించే సంచార జాతులవారు పుష్కర్ మేళా కోసం వేచి చూస్తారు. తేదీలు దగ్గర పడగానే తమ వద్ద ఉన్న ఒంటెలను తీసుకొని, కుటుంబాలతో, వంట సామాగ్రితో, గుడారాలతో పుష్కర్ మేళాకు తరలి వస్తారు. వీరు తమను తాము ఒంటెలకు బంట్లుగా భావిస్తారు. శివుడు ఒంటెలను చూసుకోమని తమను పుట్టించాడని వీరి విశ్వాసం. పుష్కర్ రాజస్థాన్‌లో ఉన్న ముఖ్య పుణ్యక్షేత్రం. పంచ సరోవరాల్లోని ఒకటైన ‘పుష్కర్ సరోవరం’ ఈ పట్టణంలోనే ఉంది. కార్తీక పౌర్ణమి రోజు ఈ సరోవరంలో భక్తులు విశేషంగా పుణ్యస్నానాలు చేస్తారు. ఈ సందర్భంగా వచ్చిన పర్యాటకలు ఒంటెల మేళాను కూడా ఉత్సాహంగా వెళ్లి తిలకిస్తారు. పుష్కర్ అజ్మీర్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ ఆరావళి పర్వతాల పహారా కాస్తుంటే ఈ ఊరు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక మేళా జరుగుతున్న రోజుల్లో అయితే దేశ,విదేశ పర్యాటకులతో కళకళలాడిపోతుంది. అనేక రకాలు ఎద్దుల్లో, గేదెల్లో రకాలు ఉన్నట్టే ఒంటెల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. రకాన్ని బట్టి వాటి విలువ ఉంటుంది. మనం ఒంటెలన్నీ ఒకటే అనుకుంటాం కానీ కాదు. అందంగా నాజూకుగా తెలివిగా ఉండే ‘సాచోరి’ జాతి ఒంటె ఒక్కోటి లక్షన్నర పలుకుతుంది. ఇది వ్యవసాయానికి, బండి లాగడానికి, నృత్యానికి పనికి వస్తుంది. ఇక బరువులు మోసే జాతి అయిన ‘బాడ్మెరి’ ఒక్కోటి యాభై వేలు పలుకుతుంది. రేసులలో గెలవాలంటే మాత్రం ‘జైసల్మేరి’ జాతికి చెందిన ఒంటె తప్పని సరి. దీని వెల ముప్పై వేల నుంచి మొదలవుతుంది. పుష్కర్ మేళాలో వీటిని వేలాదిగా తీసుకొచ్చి అమ్మడం, కొనడం చేస్తారు. ఇవి కాకుండా ‘గీర్’ అని, ‘నాగేరి’ అని అనేక రకాలు ఉన్నాయి. తరుగుతున్న సంఖ్య ప్రపంచ దేశాలలో పోలిస్తే మన దేశంలో ఒంటెల సంఖ్య దారుణంగా పడిపోతోంది. దీనిని గమనించి రాజస్థాన్ ప్రభుత్వం ఒంటెల కాపరులకు ప్రతి ఒంటె పిల్ల జననానికీ పది వేల రూపాయల నజరానా ప్రకటించింది. ఒంటెల పెంపకం, మేత కష్టంతో కూడుకున్న పని. ఒంటెల సంతతి ఒంటెల కాపరుల మీద ఆధార పడి ఉంటుంది. జానా బెత్తెడుగా ఉన్న కాపరి వృత్తి నుంచి క్రమంగా చాలామంది తప్పుకుంటూ ఉండటంతో సంతతి పడిపోతోంది. ఒంటె పాల అమ్మకాల గురించి చేసిన ప్రయత్నాలు కూడా అంతంత మాత్రం ఉండటం మరో కారణం. తప్పనిసరిగా చూడాల్సిన వేడుక ఈ సమస్యలు ఎలా ఉన్నా జీవితంలో ఒక్కసారైనా ఈ ఒంటెల మేళాను చూడాలి. వేలాదిగా ఉండే ఒంటెల సౌందర్యం, వాటి అలంకరణ, వాటి సవారి చూడతగ్గవి. పర్యాటకుల ఆకర్షణ కోసం అక్కడ ప్రభుత్వం అనేక కళా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ఈ నెల 12వ తేదీ వరకు ఈ మేళా జరుగనుంది కనుక ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేసుకొని వెళ్లి చూసి రావచ్చు. ఆంజనేయ స్వామి వాహనం ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షణాదిన ఆంజనేయ స్వామి గుడులలో వాహనంగా ఒంటె కనిపించడం అరుదు. కాని అది ఆంజనేయస్వామి వాహనం అని నమ్మే వారున్నారు. దానికి కథ కూడా ఉంది.రావణుని బావమరిది దుందుభిని వాలి వధించి అతడి మృతదేహాన్ని రుష్యమూక పర్వతం (నేటి హింపీ ప్రాంతం) పై పడేశాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న మాతంగ మహాముని ఇది చూసి వాలి కనుక రుష్యమూక పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు. ఆ తర్వాత సుగ్రీవుణ్ణి వాలి చంపడానికి వెంటపడినప్పుడు సుగ్రీవుడు రుష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కుంటాడు. ఆ సమయంలో సుగ్రీవుణ్ణి చూడటానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంప సరోవరాన్ని తిలకించాలని అనుకుంటాడు. అందుకు సుగ్రీవుడు పంపా సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా ఒంటెను సిద్ధం చేస్తాడు. అలా అది ఆయనకు వాహనం అయ్యిందని కథనం. -
భారతీయులకు ఉబెర్ సీఈవో హెచ్చరిక
సాక్షి, న్యూడిల్లీ: భారతీయ కార్ల కొనుగోలుదారులకు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ఆసక్తికరమైన హెచ్చరిక చేశారు. కొత్త కార్లను కొనుగోలు ఉచ్చులో పడొద్దని భారతీయులను కోరారు. దీనికి బదులు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసుకోవడానికి తగిన కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే ఎస్టాబ్లిష్డ్ పరిశ్రమలకు దూరంగా వుండాలని హితవు చెప్పారు. ముఖ్యంగా ఆటోరంగం మందగమనానికి దోహదపడే అనేక అంశాలలో ఉబెర్, ఓలా వల్లే యువతరం (మిలీనియల్స్) కార్ల కొనుగోలుకు మొగ్గు చూపకపోవడం కూడా ఒకటి అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉబెర్ సీఈఓ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సి)తో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో కార్ల వినియోగం అధికంగా ఉందన్నారు. ఇలా సొంతకార్లను కలిగి వుండటం కొన్నిసార్లు ఆవిష్కరణలను నిరోధిస్తుందన్నారు. ఫలితంగా రాబోవు 10-20 సంవత్సరాల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయలకు బదులుగ గత పది సంవత్సరాలకోసం రూపొందించిన వాటినే ఇప్పటికీ వాడుతున్నామన్నారు.అందుకే కారు సొంతం చేసుకోవడం అనేది నేటి తరం కలగాకూడదు, కోరుకున్నపుడు స్వేచ్ఛగా ప్రయాణించే సౌకర్యాలు, అలాంటి ఆవిష్కరణలు, పరిశ్రమలపై దృష్టి పెట్టాలన్నారు. అంతేకాదు పాతుకుపోయిన పరిశ్రమలు, పద్ధతులు నూతన ఆవిష్కరణలకు శత్రువులుగా మారాయని వ్యాఖ్యానించారు. దీన్ని అధిగమిస్తే భారత్ ఈ రంగంలో అగ్రగామిగా వుంటుందని ఖోస్రోషాహి పేర్కొన్నారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సి)తో కలిసి ఉబెర్ తాజాగా మరో నూతన ఆవిష్కారానికి శ్రీకారం చుట్టింది. యాప్‌లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫీచర్‌ద్వారా మోటార్ సైకిళ్లు, ఆటోలు, కార్ల ద్వారా క్యాబ్ సర్వీసులను అందిస్తున్న ఉబెర్ ఇపుడు బస్సులను కూడా ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా న్యూఢిల్లీలో మంగళవారం విడుదల చేసింది. దీనిని ఢిల్లీలో కొన్ని ఎంపిక చేసిన ప్రధాన రూట్లలో నడుపుతారు. ఒకవేళ విజయవంతమైతే అన్ని చోట్లకూ, అన్ని ప్రధాన నగరాలకూ విస్తరిస్తామని ఆయన తెలిపారు. యాప్‌లో వినియోగదారులు తమ పికప్, డ్రాపింగ్ పాయింట్లను లోడ్ చేసుకోవాలి. అయితే నిర్ణీత ప్రదేశంలో (బస్స్టాప్ల్లాగా అన్నమాట)మాత్రమే ఎక్కాలి తప్ప ఇంటి వరకూ రాదు. చాలా తక్కువ ధరలో, తక్కువ సమయంలో ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యమని ఉబెర్ పేర్కొంది.