న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ టెక్నీ గ్రూప్ ఇన్‌కార్పొను (ఐటీఐ) కొనుగోలు చేయనున్నది. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ ప్రొడక్ట్ లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్ ఇంటెరోపెరాబిలిటీ సాఫ్ట్‌వేర్ సేవలందించే ఐటీఐను రూ.312 కోట్ల(4.5 కోట్ల డాలర్లు)కు కొనుగోలు చేయనున్నామని విప్రో తెలిపింది. 1983లో ఆరంభమైన ఐటీఐ అమెరికాలోని ఓహియో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంగ్లాండ్, ఇటలీ, ఇజ్రాయేల్, జర్మనీల్లో ఈ కంపెనీకి కార్యాలయాలున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఈ కంపెనీలో మొత్తం 130 మంది ఉద్యోగులున్నారు. కంపెనీ ఆదాయం గత ఏడాది జూన్ 30 నాటికి 2.32 కోట్ల డాలర్లుగా ఉంది.
సెప్టెంబర్ కల్లా డీల్ పూర్తి !
ఐటీఐ కొనుగోలుతో డిజిటల్ ఇంజినీరింగ్ మాన్యుఫాక్చరింగ్‌లో మరింత శక్తివంతమవుతామని విప్రో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఇండస్ట్రియల్ అండ్ ఇంజినీరింగ్ సర్వీసెస్) హర్మీత్ చౌహన్ పేర్కొన్నారు. ఈ డీల్‌కు నియంత్రణ సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ఈ డీల్ పూర్తవ్వగలదని అంచనా వేస్తున్నామన్నారు.
విప్రో చేతికి అమెరికా కంపెనీ!
Published Thu, Jun 6 2019 5:17 AM | Last Updated on Thu, Jun 6 2019 5:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment