కాలం మారింది.. నేడు ఇంటికో వాహనం కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ కొందరు కేవలం టూ వీలర్స్ మాత్రమే వినియోగిస్తున్నారు. అలాంటి వారిలో కొందరు కొత్త కారు కొనాలని యోచించవచ్చు. అయితే కొత్త కారు కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి టిప్స్ పాటించాలన్నది బహుశా తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.
ముందుగా సెర్చ్ చేయండి
మార్కెట్లో లెక్కకు మించిన కార్లు నేడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏది మంచి కారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లను లేదా డీలర్‌షిప్‌లను సందర్శించండి. కస్టమర్ల రివ్యూలను బేరీజు వేసుకోవాలి. మీరు కొనాలనుకే కారు వాస్తవ ప్రపంచంలో ఎలాంటి పనితీరును అందిస్తుందనే విషయంపై కూడా అవగాహన పెంచుకోవాలి.
బడ్జెట్ సెట్ చేసుకోవాలి
కారు కొనాలనుకోవడం సులభమే.. అయితే ఎంత బడ్జెట్‌లో కొనుగోలు చేయాలి? మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత అనేదాన్ని కూడా ఆలోచించాలి. కేవలం కారు కొనాలంటే కేవలం ఎక్స్ షోరూమ్ ధరలను మాత్రమే కాకుండా.. లోన్ తీసుకుంటే కట్టాల్సిన వడ్డీ, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ వంటివి చాలానే ఉంటాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి వీటన్నింటికి బడ్జెట్ సెట్ చేసుకోవాలి.
ఫైనాన్సింగ్ ఆప్షన్స్
కారు కొనాలంటే.. అందరూ మొత్తం డబ్బు చెల్లించి కొనుక్కోలేరు. కాబట్టి ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. ఇది మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా చేస్తుంది. బ్యాంకులు, క్రెడిట్ యూనియన్లు, కార్ ఫైనాన్స్ కంపెనీలు అందించే వడ్డీ రేట్లతో పాటు.. ఇతర నిబంధనలను కూడా సరిపోల్చుకోండి. ఏదైనా ఆఫర్స్, డిస్కౌంట్స్ లేదా తక్కువ డౌన్ పేమెంట్ స్కీమ్స్ వంటి వాటిని ఎంచుకోవాలి.
తెలివిగా చర్చించండి
కారు కొనడానికి డీలర్‌షిప్‌కు వెళ్తే.. అక్కడ తెలివిగా చర్చించాల్సి ఉంటుంది. మార్కెట్లో ఆ కారు ధర ఎంత, అప్పటికి ఏదైనా ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయా? అనే విషయాలను కూడా ముందుగానే తెలుసుకుని ఉండాలి. మీ డీల్ అంచనాలకు దగ్గరగా లేకపోతే అక్కడ నుంచి వెళ్లిపోవడానికి కూడా సిద్ధంగా ఉండండి. ఇయర్ ఎండ్, ఫెస్టివల్ డిస్కౌంట్స్, డీలర్‌షిప్ ప్రోత్సాహకాలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని.. అలాంటి సమయంలో కారు కొనుగోలు సిద్దమవ్వండి.
బీమా కవరేజ్
బహుళ ప్రొవైడర్ల నుంచి బీమా ప్రీమియంలను సరిపోల్చండి. అందులో మీ వాహనానికి తగిన కవరేజీని అందిస్తూ చట్టపరమైన అవసరాలను తీర్చే ప్లాన్‌ను ఎంచుకోండి. యాడ్ ఆన్ కవర్లు, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తులు వంటి అంశాలను పరిగణించండి. అలారం, ఇమ్మొబిలైజర్‌లు, ట్రాకింగ్ పరికరాల వంటి భద్రతా ఫీచర్‌లను ఇన్‌స్టాల్ చేయడం వల్ల బీమా ప్రీమియంలు కూడా తగ్గుతాయి. వీటన్నింటిని గురించి తెలుసుకోండి.
క్రెడిట్ స్కోర్
కారు కొనుగోలు చేయాలంటే.. దాని కోసం లోన్ తీసుకోవాలంటే, మీకు మంచి సిబిల్ స్కోర్ ఉండాలి. మీకున్న సిబిల్ స్కోరును బట్టి మీకు లోన్ లభిస్తుంది. వడ్డీ రేటు తగ్గాలంటే.. సిబిల్ స్కోర్ తప్పకుండా కొంత ఎక్కువగానే ఉంటుంది.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు
ఎలక్ట్రిక్ కారు, హైబ్రిడ్ కారు కొనుగోలు చేస్తే.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, పన్ను ప్రయోజనాలు వంటివి లభిస్తాయి. కాబట్టి దీని గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఇలాంటి ప్రోత్సాహకాలు గురించి తెలుసుకుంటే.. ఖర్చులు కొంత తగ్గుతాయి.
ఇంధన సామర్థ్యం
కారు ఎంచుకునే ముందే.. ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగిన కారును కొనుగోలు చేయాలి. పెట్రోల్ ఇంజిన్ కారును ఎంచుకుంటే.. అది ఎంత మైలేజ్ అందిస్తుంది? డీజిల్ ఇంజిన్ ఎంచుకుంటే.. అది ఎంత మైలేజ్ అందిస్తుందనేది తెలుసుకోవాలి. ఎక్కువ మైలేజ్ అందించే కార్లను కొనుగోలు చేస్తే.. ఇంధన ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఇంధన సామర్థ్యాన్ని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment