అమెజాన్కు పోటీగా వాల్-మార్ట్ డీల్
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు పోటీగా వాల్-మార్ట్ అడుగులు వేయడం ప్రారంభించింది. ఇంటర్నెట్ రీటైలర్ జెట్.కామ్ను 3.3 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.22,080 కోట్లకు) సొంతం చేసుకునేందుకు వాల్-మార్ట్ స్టోర్స్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ కొనుగోలు ఒప్పందం వివరాలను వాల్-మార్ట్ సోమవారం వెల్లడించింది. అమెరికా ఈ-కామర్స్ స్టార్టప్ చరిత్రలో అతిపెద్ద డీల్ గా అవతరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సాంప్రదాయ రీటైలర్గా ఉన్న వాల్-మార్ట్ ఇప్పటికే 15కు పైగా స్టార్టప్లను కొనుగోలుచేసింది. తన 5 దశాబ్దాల వ్యాపార వృద్ధికి ముప్పుగా వచ్చిన మార్కెట్ లీడర్ అమెజాన్ పై పోటీని తీవ్రతరం చేసేందుకు ఈ స్టార్టప్ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
అమెజాన్తో పోలిస్తే వాల్-మార్ట్ ఆన్లైన్ డివిజన్ తక్కువగా నమోదవుతోంది. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో ఆన్లైన్ అమ్మక వృద్ధి కొంత నెమ్మదించింది. కన్సూమర్లను ఆకట్టుకోవడంలో ముఖ్యంగా మిలీనియల్స్ ను ఆకర్షించడంలో చాలా సంఘర్షణకు గురైవడంతో ఆన్ లైన్ అమ్మకాలు కేవలం 7శాతం మాత్రమే పెరిగాయి. ఈ ఒప్పందం వల్ల ఆన్లైన్లో వాల్-మార్ట్ తన ఉనికిని విస్తరించుకుని, తక్కువ ధరల ఆఫర్తో వినియోగదారులను తన సొంతంచేసుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ డీల్ ప్రకారం 3 బిలియన్ డాలర్లను నగదు రూపంలో, మరో 300 మిలియన్లను షేర్ల రూపంలో జెట్కు చెల్లించనున్నట్టు వాల్-మార్ట్ ప్రకటించింది. ఈ నగదు కొనుగోలు జెట్ రెవెన్యూలకు ఆరింతలు ఎక్కువగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
జెట్.కామ్ను 2015 జూలైలో ఇంటర్నెట్ ఎంటర్ప్రైన్యూర్ మార్క్ లోర్ స్థాపించారు. ఈ సంస్థ వినియోగదారులకు ఎక్కువ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ధరల్లో మార్పుల ఆఫర్లను ఈ సంస్థ ప్రకటిస్తూ ఉంటోంది. యూజర్లు వారి వర్చ్యువల్ షాపింగ్ కార్ట్ పై మరిన్ని ఉత్పత్తులు పొందే అవకాశం కూడా ఉంది. సెలెక్టెడ్ ఐటెమ్స్పై ధర ప్రోత్సహకాలనూ జెట్.కామ్ ఆఫర్ చేస్తోంది.జెట్ తొలి ఏడాది ఆపరేషన్లో 12 మిలియన్ ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. 10 మిలియన్లగా ఉన్న ఆన్లైన్ ఉత్పత్తులను కోట్లాది ఉత్పత్తులకు విస్తరించుకుంటామని వాల్మార్ట్ ఇంతకుముందే ప్రకటించింది. తన ప్రత్యర్థి అమెజాన్ ప్రస్తుతం 200 మిలియన్ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తోంది.