Wal-Mart
-
ఫ్లిప్‌కార్ట్ కోసం వాల్‌మార్ట్ రూ.7.439 కోట్ల పన్ను చెల్లింపు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన వాల్ మార్ట్ దేశీయ ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు కోసం రూ.7,439 కోట్ల పన్నును చెల్లించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుత ఇన్వెస్టర్లు 10 మంది నుంచి వాటాల కొనుగోలు కోసం ఈ మేరకు చెల్లించింది. ఇంకా 34 మంది నుంచి పన్నులను మినహాయించలేదు. ఫ్లిప్‌కార్ట్‌ను 16 బిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు ఆ సంస్థకు, వాల్‌మార్ట్‌కు మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో మొత్తం 44 మంది వాటాదారులు ఉన్నారు. ఇందులో సాఫ్ట్‌బ్యాంకు, నాస్పర్స్, వెంచర్ ఫండ్ అయిన అస్సెల్పార్ట్నర్స్, ఈబే తదితరులు తమ వాటాలను వాల్‌మార్ట్‌కు విక్రయించారు. పన్నును జమ చేసేందుకు చివరితేదీ సెప్టెంబర్ 7కాగా, ఆఖరు రోజున రూ.7,439 కోట్ల విత్‌హోల్డింగ్స్ పన్నును వాల్‌మార్ట్ ఆదాయపన్ను శాఖకు జమ చేసింది. ‘‘ఫ్లిప్‌కార్ట్‌లో వాటాలు కలిగిన 44 మంది వాల్‌మార్ట్‌కు విక్రయించగా, కేవలం పది మందికి సంబంధించే వాల్‌మార్ట్ పన్నులు జమ చేసింది. వాటాదారుల నుంచి పన్నును మినహాయించే విషయంలో పాటించిన విధానాన్ని మేం ప్రశ్నించాం. ప్రతీ కేసుకు సంబంధించి వివరణ కోరాం’’అని ఆదాయపన్ను శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
గతవారం బిజినెస్ డీల్స్..
►అమెరికాకు చెందిన జెట్.కామ్ కంపెనీని రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. ఆన్లైన్ అమ్మకాల కంపెనీ అమెజాన్.కామ్‌కు పోటీగా గత ఏడాదే కార్యకలాపాలు ప్రారంభించిన జెట్.కామ్‌ను 300 కోట్ల డాలర్లకు నగదులో, 30 కోట్ల డాలర్లకు స్టాక్‌లో కొనుగోలు చేయనున్నట్లు వాల్‌మార్ట్ పేర్కొంది. ► టాటా గ్రూప్‌కు చెందిన టాటా కెమికల్స్ కంపెనీ తన యూరియా వ్యాపారాన్ని నార్వేకు చెందిన యారా ఫెర్టిలైజర్స్‌కు రూ.2,670 కోట్లకు విక్రయించనుంది. ►ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీలు విలీనం కానున్నాయి. ఆదిత్య బిర్లా నువో (ఏబీఎన్) కంపెనీ... గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో విలీనం కానుంది. ఈ విలీనం కారణంగా రూ.60 వేల కోట్ల డైవర్సిఫైడ్ సంస్థ అవతరిస్తుంది. నియామకాలు ►దేశీ టూవీలర్ దిగ్గజ కంపెనీ ‘హీరో మోటొకార్ప్’ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ), సీఈవోగా మళ్లీ పవన్ ముంజాల్ నియమితులయ్యారు. మామూలుగా పవన్ ముంజాల్ పదవీ కాలం ఈ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. కంపెనీ ఈయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించింది. ►ఎస్బీఐ మేనేజింగ్ డెరైక్టర్‌గా దినేశ్ కుమార్ ఖార నియమితులయ్యారు. ► యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవోగా పవన్ కుమార్ బజాజ్ ఎంపికయ్యారు. ►బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈవోగా రవీంద్ర ప్రభాకర్ మరాఠే నియమితులయ్యారు. ►బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా అశోక్ కుమార్ జార్జ్ ఎంపికయ్యారు. ►యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా రాజ్ కమల్ వర్మ నియమితులయ్యారు. ►కార్పొరేషన్ బ్యాంక్ ఈడీగా గోపాల్ మురళీ భగత్ వ్యవహరించనున్నారు. ►ఓబీసీ ఈడీగా హిమాంశు జోషి బాధ్యతలు స్వీకరిస్తారు. రేట్లు యథాతథం కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ తన కీలక రుణ రేట్లు రెపో, రివర్స్ రెపో, క్యాష్ రిజర్వ్ రేషియో... మూడింటినీ మార్పులేకుండా కొనసాగించింది. ద్రవ్యోల్బణ భయాల వల్లే రేట్లు తగ్గించలేదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టంచేశారు. కాగా రెపో 6.5 శాతంగా, రివర్స్ రెపో 6 శాతంగా ఉంది. దిగువకు పారిశ్రామికోత్పత్తి స్థూల ఆర్థికాంశాల్లో ప్రధానమైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి తాజా గణాంకాలు నిరాశపరిచాయి. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం కట్టు తప్పి ఏకంగా 6.07 శాతానికి ఎగిసింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. ఇక జూన్‌లో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధిరేటు 2.1 శాతంగా నమోదయ్యింది. 2015 ఇదే కాలంలో ఈ రేటు 4.2 శాతంగా ఉంది. పసిడి డిమాండ్ తగ్గింది.. పసిడి డిమాండ్ భారత్‌లో ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) 131 టన్నులుగా నమోదయ్యింది. 2015 ఇదే కాలంలో పోల్చిచూస్తే. ఈ డిమాండ్ 18 శాతం పడిపోయింది. ఫోర్బ్స్ టెక్ బిలియనీర్లలో ప్రేమ్‌జీ, శివ్ నాడార్ ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన ప్రపంచపు టెక్నాలజీ రంగంలోని టాప్-100 అత్యంత సంపన్నుల జాబితాలో భారత్ నుంచి ఇద్దరు స్థానం పొందారు. వీరిలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ సహ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్ ఉన్నారు. ప్రేమ్‌జీ 16 బిలియన్ డాలర్ల సంపదతో 13వ స్థానంలో, నాడార్ 11.6 బిలియన్ డాలర్ల సంపదతో 17వ స్థానంలో నిలిచారు. 78 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అగ్రస్థానంలో ఉన్నారు. ఐకియా స్టోర్‌కు శంకుస్థాపన రిటైల్ రంగ దిగ్గజం, స్వీడన్‌కు చెందిన ఐకియా భారత్‌లో తొలి స్టోర్‌కు శంకుస్థాపన చేసింది. హైదరాబాద్ హైటెక్‌సిటీ సమీపంలో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2017 చివరినాటికి ప్రారంభం కానున్న ఈ ఔట్‌లెట్‌కు రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రత్యక్షంగా 500, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది. -
అమెజాన్‌కు పోటీగా వాల్-మార్ట్ డీల్
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు పోటీగా వాల్-మార్ట్ అడుగులు వేయడం ప్రారంభించింది. ఇంటర్నెట్ రీటైలర్ జెట్.కామ్‌ను 3.3 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.22,080 కోట్లకు) సొంతం చేసుకునేందుకు వాల్-మార్ట్ స్టోర్స్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ కొనుగోలు ఒప్పందం వివరాలను వాల్-మార్ట్ సోమవారం వెల్లడించింది. అమెరికా ఈ-కామర్స్ స్టార్టప్ చరిత్రలో అతిపెద్ద డీల్ గా అవతరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సాంప్రదాయ రీటైలర్‌గా ఉన్న వాల్-మార్ట్ ఇప్పటికే 15కు పైగా స్టార్టప్‌లను కొనుగోలుచేసింది. తన 5 దశాబ్దాల వ్యాపార వృద్ధికి ముప్పుగా వచ్చిన మార్కెట్ లీడర్ అమెజాన్ పై పోటీని తీవ్రతరం చేసేందుకు ఈ స్టార్టప్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అమెజాన్‌తో పోలిస్తే వాల్-మార్ట్ ఆన్లైన్ డివిజన్ తక్కువగా నమోదవుతోంది. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో ఆన్లైన్ అమ్మక వృద్ధి కొంత నెమ్మదించింది. కన్సూమర్లను ఆకట్టుకోవడంలో ముఖ్యంగా మిలీనియల్స్ ను ఆకర్షించడంలో చాలా సంఘర్షణకు గురైవడంతో ఆన్ లైన్ అమ్మకాలు కేవలం 7శాతం మాత్రమే పెరిగాయి. ఈ ఒప్పందం వల్ల ఆన్లైన్లో వాల్-మార్ట్ తన ఉనికిని విస్తరించుకుని, తక్కువ ధరల ఆఫర్‌తో వినియోగదారులను తన సొంతంచేసుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ డీల్ ప్రకారం 3 బిలియన్ డాలర్లను నగదు రూపంలో, మరో 300 మిలియన్లను షేర్ల రూపంలో జెట్‌కు చెల్లించనున్నట్టు వాల్-మార్ట్ ప్రకటించింది. ఈ నగదు కొనుగోలు జెట్ రెవెన్యూలకు ఆరింతలు ఎక్కువగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జెట్.కామ్‌ను 2015 జూలైలో ఇంటర్నెట్ ఎంటర్ప్రైన్యూర్ మార్క్ లోర్ స్థాపించారు. ఈ సంస్థ వినియోగదారులకు ఎక్కువ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ధరల్లో మార్పుల ఆఫర్లను ఈ సంస్థ ప్రకటిస్తూ ఉంటోంది. యూజర్లు వారి వర్చ్యువల్ షాపింగ్ కార్ట్ పై మరిన్ని ఉత్పత్తులు పొందే అవకాశం కూడా ఉంది. సెలెక్టెడ్ ఐటెమ్స్‌పై ధర ప్రోత్సహకాలనూ జెట్.కామ్ ఆఫర్ చేస్తోంది.జెట్ తొలి ఏడాది ఆపరేషన్‌లో 12 మిలియన్ ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. 10 మిలియన్లగా ఉన్న ఆన్లైన్ ఉత్పత్తులను కోట్లాది ఉత్పత్తులకు విస్తరించుకుంటామని వాల్‌మార్ట్ ఇంతకుముందే ప్రకటించింది. తన ప్రత్యర్థి అమెజాన్ ప్రస్తుతం 200 మిలియన్ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తోంది. -
వాల్‌మార్ట్ ను దాటనున్న ఆలీబాబా
బీజింగ్: ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ ప్లాట్‌ఫాంగా అమెరికా సంస్థ వాల్‌మార్ట్‌ను.. చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా త్వరలోనే అధిగమించగలదని అంచనాలు నెలకొన్నాయి. మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 463.3 బిలియన్ డాలర్ల ట్రేడింగ్ పరిమాణం సాధిస్తామని ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ తెలిపింది. జనవరి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం వాల్‌మార్ట్ నమోదు చేసిన 478.6 బిలియన్ డాలర్ల నికర అమ్మకాలకు ఇది దాదాపు సమీపంలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వాల్‌మార్ట్‌ను ఆలీబాబా అధిగమించే రోజు దగ్గర్లోనే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 2020 నాటికల్లా తమ వార్షిక ట్రేడింగ్ పరిమాణం దాదాపు 980 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగదలని అంచనా వేస్తున్నట్లు ఆలీబాబా సీఈవో ఝాంగ్ యాంగ్ తెలిపారు. -
ఏపీలో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం
హైదరాబాద్: మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఏపీలో మ్యాగీ నూడుల్స్ ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. మ్యాగీ నూడుల్స్ కు సంబంధించి సరఫరా, అమ్మకాలు జరపరాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఆహారభద్రత అధికారాలు మ్యాగీ నూడుల్స్ పై తాజా ఆదేశాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆమె ఆదేశించారు. కాగా, మ్యాగీ సరఫరా చేసే తొమ్మిదిరకాల ఉత్పత్తులను వెనక్కితీసుకోమని చెప్పినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
మరో నాలుగు రాష్ట్రాల్లో మ్యాగీ నిషేధం
-
మరో నాలుగు రాష్ట్రాల్లో నిషేధం
ఉత్తరాఖండ్, తమిళనాడు, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లో ‘మ్యాగీ నూడుల్స్’పై చర్యలు ♦ సరుకును తక్షణమే ఉపసంహరించాలని నెస్లే ఇండియాకు ఆదేశం ♦ చర్యలకు సిద్ధమవుతున్న బిహార్, ఉత్తరప్రదేశ్ న్యూఢిల్లీ: హానికారక రసాయనాల నేపథ్యంలో మ్యాగీ నూడుల్స్‌పై మరో నాలుగు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఉత్తరాఖండ్, తమిళనాడులో మూడు నెలలు, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లలో ఒక నెల చొప్పున నిషేధం విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు గురువారం ప్రకటించాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని లేదని పరీక్షల్లో తేలిన తర్వాతే అనుమతిస్తామని స్పష్టంచేశాయి. అలాగే తమ రాష్ట్రాల నుంచి మ్యాగీ నూడూల్స్ సరుకును తక్షణమే ఉపసంహరించాలని నెస్లే ఇండియా సంస్థను ఆదేశించాయి. బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా మ్యాగీపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాలు నూడుల్స్‌పై పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఫలితాలు రాగానే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రభుత్వం బుధవారమే మ్యాగీ నూడుల్స్‌పై 15 రోజులపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గుజరాత్ సర్కారు మ్యాగీ నూడుల్స్‌తోపాటు సన్‌ఫీస్ట్, ఎస్కేఎస్ ఫుడ్స్‌కు చెందిన న్యూడుల్స్పైనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో ఎస్కేఎస్ నూడుల్స్‌లో లెడ్(సీసం) మోతాదు పరిమితికి మించి ఉండడంతో వాటిపైనా 15 రోజుల నిషేధం విధించింది. ‘‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 27 మ్యాగీ నూడుల్స్ శాంపిళ్లను సేకరించి పరీక్షలు చే శాం. అందులో 14 శాంపిళ్లలో సీసం శాతం మోతాదుకు మించి నమోదైంది. ఇక అన్ని నమూనాల్లో హానికారక మోనోసోడియం గ్లుటామేట్(ఎస్ఎస్జీ) ఆనవాళ్లు కనిపించాయి’’ అని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్ వెల్లడించారు. ఇక పరీక్షల్లో మ్యాగీ నూడుల్స్ హానికారకం కాదు అని తేలే వరకు ఒక్క జిల్లాలో కూడా వాటిని అమ్మకుండా చూడాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సూచించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మ్యాగీపై మూడునెలలపాటు నిషేధం విధించినట్లు ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఓం ప్రకాశ్ తెలిపారు. పరీక్షలకు పంపిన కొన్ని శాంపిళ్లలో ఎంఎస్‌జీ ఉన్నట్టు తేలిందని, మరికొన్ని ఫలితాలు రావాల్సి ఉందని ఆయన వివరించారు. కాగా, భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న మ్యాగీ నూడుల్స్‌పై నేపాల్ కూడా దృష్టి సారించింది. వాటిని పరీక్షలకు పంపింది. ఫలితాలు వచ్చాక నిషేధంపై నిర్ణయం తీసుకోనుంది. నూడుల్స్ ఉపసంహరించిన వాల్‌మార్ట్, మెట్రో ఏజీ వాల్‌మార్ట్, మెట్రో ఏజీ సంస్థలు తమ హోల్‌సేల్ స్టోర్ల నుంచి మ్యాగీ నూడుల్స్‌ను ఉపసంహరించాయి. ‘మ్యాగీ 2-మినిట్ నూడుల్స్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మా సంస్థకు చెందిన 20 స్టోర్ల నుంచి ఆ సరుకును ఉపసంహరిస్తున్నాం. ప్రజారోగ్యానికి మేం పెద్దపీట వేస్తాం’ అని వాల్‌మార్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ కూడా భారత్‌లో 18 స్టోర్ల నుంచి మ్యాగీని ఉపసంహరిస్తున్నట్లు పేర్కొంది.