గతవారం బిజినెస్ డీల్స్.. | Last week, the Business Deals .. | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్ డీల్స్..

Published Mon, Aug 15 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

Last week, the Business Deals ..

అమెరికాకు చెందిన జెట్.కామ్ కంపెనీని రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. ఆన్‌లైన్ అమ్మకాల కంపెనీ అమెజాన్.కామ్‌కు పోటీగా గత ఏడాదే కార్యకలాపాలు ప్రారంభించిన జెట్.కామ్‌ను 300 కోట్ల డాలర్లకు నగదులో, 30 కోట్ల డాలర్లకు స్టాక్‌లో కొనుగోలు చేయనున్నట్లు వాల్‌మార్ట్ పేర్కొంది.

టాటా గ్రూప్‌కు చెందిన టాటా కెమికల్స్ కంపెనీ తన యూరియా వ్యాపారాన్ని నార్వేకు చెందిన యారా ఫెర్టిలైజర్స్‌కు రూ.2,670 కోట్లకు విక్రయించనుంది.

ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీలు విలీనం కానున్నాయి. ఆదిత్య బిర్లా నువో (ఏబీఎన్) కంపెనీ...  గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో విలీనం కానుంది. ఈ విలీనం కారణంగా రూ.60 వేల కోట్ల డైవర్సిఫైడ్ సంస్థ అవతరిస్తుంది.

 

నియామకాలు

దేశీ టూవీలర్ దిగ్గజ కంపెనీ ‘హీరో మోటొకార్ప్’ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ), సీఈవోగా మళ్లీ పవన్ ముంజాల్ నియమితులయ్యారు. మామూలుగా పవన్ ముంజాల్ పదవీ కాలం ఈ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. కంపెనీ ఈయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించింది.

ఎస్‌బీఐ మేనేజింగ్ డెరైక్టర్‌గా దినేశ్ కుమార్ ఖార నియమితులయ్యారు.

యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవోగా పవన్ కుమార్ బజాజ్ ఎంపికయ్యారు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈవోగా రవీంద్ర ప్రభాకర్ మరాఠే నియమితులయ్యారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా అశోక్ కుమార్ జార్జ్ ఎంపికయ్యారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా రాజ్ కమల్ వర్మ నియమితులయ్యారు.

కార్పొరేషన్ బ్యాంక్ ఈడీగా గోపాల్ మురళీ భగత్ వ్యవహరించనున్నారు.

ఓబీసీ ఈడీగా హిమాంశు జోషి బాధ్యతలు స్వీకరిస్తారు.

 
రేట్లు యథాతథం

కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ తన కీలక రుణ రేట్లు రెపో, రివర్స్ రెపో, క్యాష్ రిజర్వ్ రేషియో... మూడింటినీ మార్పులేకుండా కొనసాగించింది. ద్రవ్యోల్బణ భయాల వల్లే రేట్లు తగ్గించలేదని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టంచేశారు. కాగా రెపో 6.5 శాతంగా, రివర్స్ రెపో 6 శాతంగా ఉంది.


దిగువకు పారిశ్రామికోత్పత్తి
స్థూల ఆర్థికాంశాల్లో ప్రధానమైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి తాజా గణాంకాలు నిరాశపరిచాయి. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం కట్టు తప్పి ఏకంగా 6.07 శాతానికి ఎగిసింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. ఇక జూన్‌లో  పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధిరేటు 2.1 శాతంగా నమోదయ్యింది. 2015 ఇదే కాలంలో ఈ రేటు 4.2 శాతంగా ఉంది.

 
పసిడి డిమాండ్ తగ్గింది..

పసిడి డిమాండ్ భారత్‌లో ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) 131 టన్నులుగా నమోదయ్యింది. 2015 ఇదే కాలంలో పోల్చిచూస్తే. ఈ డిమాండ్ 18 శాతం పడిపోయింది.

 
ఫోర్బ్స్ టెక్ బిలియనీర్లలో ప్రేమ్‌జీ, శివ్ నాడార్

ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన ప్రపంచపు టెక్నాలజీ రంగంలోని టాప్-100 అత్యంత సంపన్నుల జాబితాలో భారత్ నుంచి ఇద్దరు స్థానం పొందారు. వీరిలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ సహ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్ ఉన్నారు. ప్రేమ్‌జీ 16 బిలియన్ డాలర్ల సంపదతో 13వ స్థానంలో, నాడార్ 11.6 బిలియన్ డాలర్ల సంపదతో 17వ స్థానంలో నిలిచారు. 78 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అగ్రస్థానంలో ఉన్నారు.


ఐకియా స్టోర్‌కు శంకుస్థాపన
రిటైల్ రంగ దిగ్గజం, స్వీడన్‌కు చెందిన ఐకియా భారత్‌లో తొలి స్టోర్‌కు శంకుస్థాపన చేసింది. హైదరాబాద్ హైటెక్‌సిటీ సమీపంలో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2017 చివరినాటికి ప్రారంభం కానున్న ఈ ఔట్‌లెట్‌కు రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రత్యక్షంగా 500, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement