Aditya Birla
-
అడుగు పెడితే ఫస్టో.. సెకెండో.. అంతే!
న్యూఢిల్లీ: ‘చేస్తున్న, ప్రవేశించే ప్రతి వ్యాపారంలో మొదటి లేదా రెండవ స్థానంలో ఉండాలనుకుంటున్నాం. కాబట్టి సామర్థ్యం పెంపు ఏకైక మార్గం. అలా కాని పక్షంలో ఈ రోజు మనుగడ సాగించడం చాలా కష్టమని నేను భావిస్తున్నాను. లేదంటే అధిక మార్జిన్లను అందించే చాలా ప్రత్యేక, ఉన్నత సాంకేతికత ఉండాలి’ అని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కేఎం బిర్లా అన్నారు.ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఆదిత్య బిర్లా గ్రూప్ దాదాపు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చేసింది. ప్రధానంగా తయారీ రంగంలో పెట్టుబడి పెట్టాం. కంపెనీ నిర్వహించే అన్ని విభాగాలలో మొదటి రెండు స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా చేసుకున్నాం. గ్రూప్ పెట్టుబడులు చాలా వరకు రాబోయే 15–20 ఏళ్లలో వ్యాపార దృక్పథం దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలికంగా ఉంటాయి. విలువలు, వ్యక్తులు, సామర్థ్యం పెంపు, దీర్ఘకాలిక లక్ష్యంతో వ్యాపారాల నిర్వహణ అనేది సంస్థ వ్యాపార విధానాన్ని నిర్వచించే కీలక వ్యూహాలు’ అని వెల్లడించారు.కఠినమైన నిర్ణయాలు..గ్రూప్ సంస్థ హిందాల్కో ద్వారా నోవెలిస్ను కొనుగోలు చేయడంతో సహా అనేక కఠినమైన నిర్ణయాలను తీసుకున్నామని బిర్లా తెలిపారు. నోవెలిస్ను దక్కించుకోవడానికి 6 బిలియన్ డాలర్లు వెచ్చించినట్టు చెప్పారు. ‘నేను ఒక కంపెనీని (నోవెలిస్) కొనుగోలు చేశాను. అది చాలా పెద్దది. షేరు దెబ్బతింది. ముఖ్యమైనది కాదని పెట్టుబడిదారులు స్పష్టం చేశారు. తిరిగి పుంజుకోవడానికి దాదాపు ఏడాది పట్టింది. ఆ నిర్ణయం తీసుకున్న ఏ ప్రొఫెషనల్ సీఈవో అయినా తొలగించబడతారు. ఎందుకంటే ఆ సమయంలో అది తప్పుగా అనిపించింది’ అని అన్నారు.దీర్ఘకాలానికి వ్యాపారాలు నిర్వహించడం అనేది మనలో ఒక సంస్కృతి అని వివరించారు. కంపెనీ 36 ఏళ్లలో 100 మిలియన్ టన్నుల సిమెంట్ సామర్థ్యాన్ని నిర్మించింది. వచ్చే 5 ఏళ్లలో దీనిని 150 మిలియన్ టన్నులకు, 10 ఏళ్లలో 200 మిలియన్ టన్నులకు పెంచుతామని ఆయన తెలిపారు. -
ప్రముఖ కంపెనీ మాజీ హెచ్ఆర్ హెడ్.. ఒడిశా అభ్యర్థుల్లో రిచెస్ట్
ఆదిత్య బిర్లా గ్రూప్ మాజీ హెచ్ఆర్ హెడ్, ప్రస్తుత లోక్‌సభ ఎన్నిలల్లో కటక్ నుంచి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంతృప్త్ మిశ్రా సుమారు రూ. 461 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా అభ్యర్థుల్లో ఈయనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు.సంతృప్త్ మిశ్రా ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత గత ఫిబ్రవరిలో బీజేడీలో చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఆయన ఆదాయపు పన్ను రిటర్న్స్ 2021-22లో రూ. 76.23 కోట్లు, 2022-23లో రూ. 66.21 కోట్లుగా ఉన్నాయి. నామినేషన్ దాఖలు సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో రూ.408 కోట్ల విలువైన చరాస్తులు, రూ.4 కోట్ల బ్యాంకు డిపాజిట్లు సహా రూ.53 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు.మ్యూచువల్ ఫండ్స్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, బాండ్లు, షేర్లలో మిశ్రా పెట్టుబడి మొత్తం ప్రస్తుత విలువ దాదాపు రూ. 308 కోట్లు. రూ.2.3 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన కార్లు ఆయనకున్నాయి. ఇక మిశ్రా భార్య చరాస్తుల విలువ రూ. 11.72 కోట్లు అని నివేదిక పేర్కొంది. ఒడిశాలో ఎటువంటి స్థిరాస్తి లేనప్పటికీ, మిశ్రాకు మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో వ్యవసాయ భూమి, హైదరాబాద్, ముంబైలలో ఫ్లాట్లు ఉన్నాయి.కాగా ఒడిశాలో 21 లోక్‌స్థానాలు, 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నింటికీ ఏక కాలంలో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సంతృప్త్ మిశ్రా పోటీ చేసే కటక్ లోక్‌సభ స్థానానికి మే 25న ఆరో దశలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. -
రాష్ట్రంలో ఆదిత్య బిర్లా భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు అనగానే గుర్తుకు వచ్చేది టాటా–బిర్లా గ్రూపులు. ఈ గ్రూపు గడచిన అయిదేళ్లలో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రోత్సాహంతో ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమారమంగళం బిర్లా స్వయంగా వచ్చి పెట్టుబడుల కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఈ రాష్ట్రంపై ప్రత్యేక ఆసక్తిని తెలియజేస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో ఆదిత్య బిర్లా గ్రూపు మూడు భారీ ప్రాజెక్టులకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది. విశాఖలో గతేడాది మార్చిలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో రూ.9,300 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో ఇప్పటికే రూ.4,510 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో రూ.2,700 కోట్ల పెట్టుబడితో ఏటా రూ.1.50 లక్షల టన్నుల కాస్టిక్ సోడాను ఉత్పత్తి చేస్తే క్లోర్ ఆల్కాలి యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ను గ్రూపు చైర్మన్ కుమారమంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2022 ఏప్రిల్ 21న ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా ప్రస్తుతం 1,300 మందికి ఉద్యోగ అవకాశాలు రాగా పూర్తిస్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే ఈ సంఖ్య 2,400కు చేరుతుంది. ఆదిత్య బిర్లా గ్రూపునకు దేశవ్యాప్తంగా క్లోర్ ఆల్కాలికి సంబంధించి ఏడు యూనిట్లు ఉండగా, తూర్పు తీర ప్రాంతంలో తొలి యూనిట్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. కోవిడ్ లాక్డౌన్లో కూడా పనులు వేగంగా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇవ్వడంతో రికార్డు సమయంలోనే ఈ యూనిట్ ఉత్పత్తిని ప్రారంభించింది. పులివెందుల్లో గార్మెంట్స్ యూనిట్ ఆదిత్య బిర్లా గార్మెంట్స్ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో రెడిమేడ్ దుస్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. 2021 డిసెంబర్ 24న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ యూనిట్ రెండేళ్లల్లోనే అందుబాటులోకి వచ్చింది. రూ.110.38 కోట్ల వ్యయంతో 2112 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ యూనిట్ ఏర్పాటైంది. మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో ఉత్పతైన దుస్తులు ఆదిత్య బిర్లా రిటైల్ షోరూంలతో పాటు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. గతేడాది నవంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన సందర్భంగా ఈ యూనిట్‌ను పరిశీలించి అక్కడ పనిచేస్తున్న మహిళలతో ముచ్చటించారు. త్వరలోనే పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువవుతున్న యూనిట్లో ప్రస్తుతం 500 మందికి పైగా పనిచేస్తున్నారు. నాయుడుపేటలో కార్బన్ బ్లాక్ ఆదిత్య బిర్లా గ్రూపు చిత్తూరు జిల్లా నాయుడు పేటలో రంగులు, ఇంకు, టోనర్లు వంటి వాటిలో కీలకంగా వినియోగించే కార్బన్ బ్లాక్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.1,700 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా 250 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ నెల 14న పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ యూనిట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. 24 నెలల్లో అందుబాటులోకి రానుంది. పదివేల మందికి ఉపాధి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భారీ పెట్టుబడులను ఆహా్వనిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్ఆర్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పుగోదావరి బలభద్రపురంలో కాస్టిక్‌సోడా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైనది. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది. బలభద్రపురంలో 21–04–22న క్లోర్ అల్కాలి (కాస్టిక్ సోడా) యూనిట్ ప్రారంబోత్సవం సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా -
రాష్ట్రంలో రిలయన్స్, బిర్లా భారీ పెట్టుబడులు
-
భారత్‌కు ఎలాంటి వృద్ధి అవసరమో చెప్పిన బిర్లా..
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మహిళలు కూడా కీలక పాత్ర పోషించే విధంగా భారత్‌కు ’డబుల్ ఇంజిన్’ వృద్ధి అవసరమని పారిశ్రామిక దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు. మహిళలు సైతం ఆర్థిక కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా వృద్ధి కూడా వేగవంతం కాగలదని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే దేశీయంగా శ్రామిక శక్తిలో మహిళల వాటా తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో బిర్లా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ (బీసీఏఎస్) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్ వేగవంతమైన వృద్ధి ముంగిట ఉందని, రాబోయే రోజుల్లో సూపర్‌పవర్‌గా ఎదుగుతుందని బిర్లా ధీమా వ్యక్తం చేశారు. వచ్చే దశాబ్ద కాలంలో అంతర్జాతీయంగా ఉద్యోగుల్లో దాదాపు నాలుగో వంతు భారత్ నుంచే ఉండనున్నారని ఆయన చెప్పారు. -
ఏబీ ఫ్యాషన్ చేతికి టీసీఎన్ఎస్
న్యూఢిల్లీ: గ్లోబల్ బ్రాండ్ల దిగ్గజం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్(ఏబీఎఫ్ఆర్ఎల్) మహిళా దుస్తుల సంస్థ టీసీఎన్ఎస్ క్లాతింగ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. విస్తరించిన టీసీఎన్ఎస్ వాటా మూలధనంలో 51 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు వెల్లడించింది. దీంతో టీసీఎన్ఎస్ అనుబంధ సంస్థగా ఆవిర్భవించినట్లు ఏబీ ఫ్యాషన్ పేర్కొంది. సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం మెటీరియల్ సబ్సిడయరీగా సైతం నిలవనున్నట్లు తెలియజేసింది. టీసీఎన్ఎస్ క్లాతింగ్‌లో రూ. 1,650 కోట్లు వెచి్చంచి ప్రధాన వాటా కొనుగోలు చేయనున్నట్లు మే 5న ఏబీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. షేర్ల కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ)లో భాగంగా ప్రమోటర్ల వాటాతోపాటు.. ఓపెన్ ఆఫర్‌ను చేపట్టింది. ఎస్పీఏకింద విస్తారిత మూలధనంలో 22 శాతం వాటాకు సమానమైన 1.41 కోట్ల షేర్లను సొంతం చేసుకుంది. వెరసి షరతులతోకూడిన ఓపెన్ ఆఫర్ తదుపరి 51 శాతం వాటాకు సమానమైన 3.29 కోట్ల షేర్లను చేజిక్కించుకుంది. గతేడాది టీసీఎన్ఎస్ రూ. 1,202 కోట్ల ఆదాయం పొందింది. లూయిస్ ఫిలిప్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లండ్ బ్రాండ్ల కంపెనీ ఏబీఎఫ్ఆర్ఎల్ రూ. 12,418 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. -
దూసుకుపోతున్న అనన్య బిర్లా: కోట్ల డీల్
ముంబై: పారిశ్రామిక దిగ్గజం కుమారమంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లాకు చెందిన సూక్ష్మ రుణాల సంస్థ ’స్వతంత్ర’ తాజాగా చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 1,479 కోట్లు వెచ్చించనుంది ఈ లావాదేవీ 2023 చివరి నాటికి పూర్తవుతుందని కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ సహ–వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్‌కి చెందిన నవీ గ్రూప్‌లో చైతన్య ఇండియా భాగంగా ఉంది. చైతన్య కొనుగోలు ద్వారా 36 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లు, 20 రాష్ట్రాల్లో 1,517 శాఖలు, రూ. 12,409 కోట్ల అసెట్స్ (ఏయూఎం)తో స్వతంత్ర దేశీయంగా రెండో అతి పెద్ద మైక్రోఫైనాన్స్ సంస్థగా ఆవిర్భవించనుంది. 2013లో అనన్య బిర్లా ప్రారంభించిన స్వతంత్రలో రూ. 7,499 కోట్ల ఏయూఎం, 7,000 మంది పైచిలుకు ఉద్యోగులు, 22 లక్షల గ్రామీణ కస్టమర్లు ఉన్నారు. చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్‌కు రూ. 4,900 కోట్ల ఏయూఎం, 6,000 మంది ఉద్యోగులు, 14 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. చైతన్య ఇండియా, దాని మాతృ సంస్థ నవీ ఫిన్‌సర్వ్‌ను 2019లో బన్సల్ కేవలం రూ. 150 కోట్లకు కొనుగోలు చేశారు. గత నాలుగేళ్లలో చైతన్య ఆరు రెట్లు వృద్ధి చెందినట్లు బన్సల్ తెలిపారు. ఈ కొనుగోలుతో తమ సంస్థ విస్తృతి మరింత పెరగగలదని అనన్య బిర్లా తెలిపారు. -
తనిష్క్, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ
ప్రముఖ వ్యాపార సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించ నుంది. ఇప్పటికే పలురంగాల్లో దూసుకుపోతున్న కుమార్ మంగళం బిర్లా నేతృత్వంలోని సంస్థ వేల కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు ఆదిత్యా బిర్లా ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ. 5000 కోట్ల పెట్టుబడితో 'నావల్ జ్యువెల్స్' అనే కొత్త వెంచర్ కింద ఆభరణాల వ్యాపారం ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రత్యేకమైన డిజైన్, అధిక నాణ్యత కలిగిన ఆభరణాల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో కొత్త వెంచర్ ఉంటుందని పేర్కొంది. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) వ్యూహాత్మక పోర్ట్‌ఫోలియో అని, తద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువ కావడానికి, సంస్థ ఉనికిని విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. ఇప్పటికే పెయింట్స్, B2B ఇ-కామర్స్‌లో ప్రవేశించడమే కాకుండా, మెటల్ పల్ప్ ఫైబర్, సిమెంట్, కెమికల్స్, టెక్స్టైల్స్, కార్బన్ బ్లాక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్ రిటైల్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో విస్తరించిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఇపుడిక బ్రాండెడ్ జ్యువెలరీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) దీంతో టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్, రిలయన్స్ జ్యువెల్స్‌తో పోటీ పడనుంది ఆదిత్య బిర్లా గ్రూప్. కంపెనీ డేటా ప్రకారం, దేశీయ ఆభరణాల మార్కెట్ 2025 నాటికి సుమారు రూ. 7.43 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత రత్నాభరణాల మార్కెట్ వాటా దేశ జీడీపీలో 7 శాతం. -
బిర్లా వారసురాలు.. తండ్రి పేరు చెప్పుకునే టైపు కాదు!
అనన్య బిర్లా.. ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత, దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా కుమార్తె. సాంప్రదాయ వ్యాపారాలను విడిచిపెట్టి తనకంటూ సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఒక్క బిజినెస్‌లోనే కాకుండా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! బిర్లా కుటుంబం దేశంలోనే సంపన్న కుటుంబాల్లో ఒకటి. వారికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. తండ్రి కుమార మంగళం బిర్లా ఫోర్బ్స్ 2023 భారతీయ బిలియనీర్ల జాబితా ప్రకారం.. దేశంలోనే 9వ అత్యంత సంపన్న వ్యక్తి. వీటితో సంబంధం లేకుండా ఒక వ్యాపారవేత్తగా, గాయనిగా విభిన్న రంగాల్లో రాణిస్తున్న అనన్య బిర్లా చదువు, ఆమె నడుపుతున్న వ్యాపారాలు, నికర సంపద వంటివి తెలుసుకుందాం. ఉన్నత చదువు, వ్యాపారాలు అనన్య బిర్లా ముంబైలోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాథమిక విద్య చదివింది. యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మేనేజ్మెంట్లో డిగ్రీ పొందింది. అనన్య బిర్లా స్వతంత్ర మైక్రోఫైనాన్స్ అనే సంస్థను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అల్పాదాయ వర్గాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సేవలను అందిస్తోంది. ఈ సంస్థకు ఆమె సీఈవోగా కూడా ఉన్నారు. అలాగే క్యూరోకార్టే అనే లగ్జరీ ఈ-కామర్స్ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు. హస్త కళాకృతులు, శిల్పకళా ఉత్పత్తులను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది. ఇదీ చదవండి: Satyajith Mittal: బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ! View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla) విభిన్న ప్రతిభ అనన్య బిర్లా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. విజయవంతమైన సంగీత విద్వాంసురాలు కూడా. ‘లివిన్ ద లైఫ్’, ‘హోల్డ్ ఆన్’ వంటి అద్బుతమైన సింగిల్స్‌ను ఆమె విడుదల చేశారు. తన మ్యూజిక్‌కి అనేక అవార్డులను గెలుచుకున్నారు. మానసిక ఆరోగ్య న్యాయవాది కూడా అయిన అనన్య.. మానసికంగా తాను పడిన ఇబ్బందులు, కుంగుబాటు వంటి సమస్యలను కూడా నిర్భయంగా బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె అనన్య బిర్లా ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇది మానసిక ఆరోగ్య అవగాహనను పెంపొందించడం, మానసిక ఆరోగ్య కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి కార్యక్రమాలపై దృష్టి సారించింది. దీంతోపాటు లింగ సమానత్వం, ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్, విద్య, వాతావరణ మార్పు, మానవతా సహాయం వంటి అంశాలకు తోడ్పాటును అందిస్తోంది. నెట్‌వర్త్ అనన్య బిర్లా నికర సంపద విలువ సుమారు 13 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. జీతం గురించి బహిరంగంగా తెలియకపోయినా రెండు విజయవంతమైన కంపెనీలకు వ్యవస్థాపకురాలు, సీఈవోగా ఆమె గణనీయమైన ఆదాయాన్నే ఆర్జిస్తోంది. ఇక సింగర్ గానూ సంపాదిస్తోంది. ఇలాంటి స్పూర్తివంతమైన, విజయవంతమైన వ్యాపారవేత్తల సక్సెస్ స్టోరీల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడిండి -
వోడాఫోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ముగిసిన నిరీక్షణ!
వోడాఫోన్ కస్టమర్ల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. భారతదేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వోడాఫోన్ సిద్ధమవుతోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్పర్సన్ కుమార్ మంగళం బిర్లా ఓ వార్తాచానెల్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వొడాఫోన్ ఐడియా 5జీ సేవలను త్వరలో ప్రారంభించబోతున్నట్లు ధ్రువీకరించారు. (Akshata Murthy: బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..) వోడాఫోన్ తన సబ్‌స్క్రైబర్ బేస్‌ను వేగంగా కోల్పోతున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది. రాబోయే 5జీ సేవల కోసం వోడాఫోన్ మోటరోలా, షావోమీ స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం వోడాఫోన్ భారతదేశంలో 4జీ సేవలను మాత్రమే అందిస్తోంది. దేశంలో 5జీ సేవలను ఇప్పటివరకూ ప్రారంభించని ఏకైక టెలికాం కంపెనీ ఇదే. జియో, ఎయిర్టెల్ రెండూ ఇప్పటికే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. భారత్‌లో వోడాఫోన్ 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించినప్పటికీ అది ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేది స్పష్టం చేయలేదు. దేశంలో ఇప్పటికే 5జీ సేవలను ప్రారంభించిన ఎయిర్టెల్, రిలయన్స్ జియోలకు వొడాఫోన్ ఐడియా క్రమంగా కస్టమర్లను కోల్పోతున్న క్రమంలో ఈ ప్రకటన వచ్చింది. 2021 ఏప్రిల్ నుంచి వోడాఫోన్ 42.4 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. 2022 డిసెంబర్ నాటికి 12 నెలల వ్యవధిలో 24.2 మిలియన్ల సబ్‌స్క్రైబర్-బేస్ కోతను చవి చూసింది. (tata motors: మళ్లీ పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఎందుకంటే..) 2022 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా రూ. 7,990 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ. 7,595.5 కోట్లు. అయితే డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.10,620.6 కోట్లు కాగా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.10,614.6 కోట్లు. ఎయిర్టెల్, జియో 5జీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దూసుకెళ్తుంటే వోడాఫోన్ ఐడియా వెనుకబడి ఉంది. ఏది ఏమైనప్పటికీ త్వరలో 5జీ సేవలను ప్రారంభించబోతున్నట్లు వోడాఫోన్ ఐడియా ప్రకటించడం వల్ల కోల్పోయిన కస్టమర్లను తిరిగి పొందడంలో కొంతైనా సహాయపడవచ్చు. (Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...) -
ఖర్చులు తగ్గించుకుని అయినా హెల్త్ ఇన్సూరెన్స్
ముంబై: అవసరమైతే ఖరీదైన కొనుగోళ్లకు దూరంగా ఉండి మరీ, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని దేశంలో మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో 85 శాతం మంది ఇదే చెప్పారు. 19 పట్టణాల నుంచి 6,600 మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. కరోనాతో అనిశ్చితి, ఆందోళనకర పరిస్థితులతో మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడినట్టు ఈ సర్వే నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 89 శాతం మంది తమ హెల్త్ ఇన్సూరెన్స్‌లో హెల్త్ కన్సల్టేషన్ (వైద్య సలహా) కూడా భాగంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కనుక మానసిక ఆరోగ్యంపై అత్యవసర అవగాహన అవసరం ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా తర్వాత ఆరోగ్యం, శ్రేయస్సుపై తమ అవగాహన పెరిగినట్టు 84 శాతం మంది సర్వేలో చెప్పారు. వైద్య అత్యవసరాల్లో వినియోగించుకునేందుకు వీలుగా కొంత నిధిని పక్కన పెట్టనున్నట్టు 52 శాతం మంది తెలిపారు. ఖర్చు దృష్ట్యా తాము మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించేందుకు వెనుకాడినట్టు 35 శాతం మంది వెల్లడించారు. తాము బరువు, రక్తపోటు తదితర ఆరోగ్య అంశాలను తరచూ పర్యవేక్షించుకోవడం లేదని ప్రతి ముగ్గురిలో ఒక్కరు చెప్పడం గమనార్హం. కరోనా తర్వాత ఆరోగ్యం విషయంలో ప్రజల ఆలోచన విధానం మారిందని, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడంతోపాటు అత్యవసర పరిస్థితుల పట్ల సన్నద్ధతను అర్థం చేసుకుంటున్నారని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే నివేదిక తెలియజేసింది. ‘‘ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరాన్ని కరోనా తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో తాము తీసుకునే ఆహారాన్ని పర్యవేక్షించుకుంటున్నారు’’అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. -
వొడాఫోన్‌లో ప్రభుత్వానికి భారీ వాటా
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా వడ్డీ బకాయిల చెల్లింపుకింద ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఈక్విటీని జారీ చేయనుంది. సుమారు రూ. 16,133 కోట్లకుగాను రూ. 10 ముఖ విలువగల దాదాపు 1,613.32 కోట్ల షేర్లను కేటాయించనుంది. స్థూల సర్దుబాటు ఆదాయం(ఏజీఆర్) వాయిదా, స్పెక్ట్రమ్ వేలం చెల్లింపులపై వడ్డీ కింద వొడాఫోన్ ఐడియా ఈక్విటీ కేటాయింపునకు ప్రతిపాదించింది. ఇందుకు తాజాగా కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. వెరసి వడ్డీ.. ఈక్విటీగా మార్పు చెందనుంది. ఇది కంపెనీ మొత్తం విస్తారిత ఈక్విటీలో 33.44 శాతం వాటాకు సమానంకానుంది. కంపెనీ మొత్తం చెల్లించిన మూలధన రూ. 48,252 కోట్లను మించనుంది. కంపెనీలో ప్రమోటర్లు వొడాఫోన్ గ్రూప్ వాటా 32.29 శాతానికి, ఆదిత్య బిర్లా గ్రూప్ వాటా 18.07 శాతానికి చేరనున్నాయి. 2018లో విలీనం తదుపరి 43 కోట్ల మొబైల్ వినియోగదారులతో వొడాఫోన్ ఐడియా 35 శాతం మార్కెట్ వాటాను పొందింది. తద్వారా అతిపెద్ద కంపెనీగా నిలిచిన సంస్థ ప్రస్తుతం 24.3 కోట్లమంది కస్టమర్లతో 21.33 శాతానికి మార్కెట్ వాటాకు పరిమితమై మూడో ర్యాంకుకు చేరింది. ఈ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ షేరు బీఎస్ఈలో 4 శాతం పతనమై రూ. 7.94 వద్ద ముగిసింది. -
ఆదిత్య బిర్లా: యంగ్ అండ్ డైనమిక్ వారసులొచ్చేశారు!
న్యూఢిల్లీ: అదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార మంగళం బిర్లా వారసులు అనన్యశ్రీ, ఆర్యమాన్లు వరుసగా ఒక్కో గ్రూప్ కంపెనీలోనూ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఆర్ఎఫ్ఎల్) బోర్డులో అదనపు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా చేరారు. బోర్డు సమావేశంలో నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సు మేరకు వారిద్దరి నియామకాలను డైరెక్టర్లు ఆమోదించారు. వారిద్దరూ ఇటీవలే ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ బోర్డులో కూడా డైరెక్టర్లుగా చేరారు. అనన్య స్వయంగా వ్యాపారవేత్తే కాకుండా గాయని కూడా. ఆమె ఏర్పాటు చేసిన స్వతంత్ర మైక్రోఫిన్ ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా సూక్ష్మ రుణాల సంస్థల్లో ఒకటిగా ఉందని కంపెనీ పేర్కొంది. స్వతంత్ర మైక్రోఫిన్ నిర్వహణలో ప్రస్తుతం 1 బిలియన్ డాలర్ల పైగా ఆస్తులు (ఏయూఎం) ఉండగా, 7,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. 2018లో మైక్రో హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను కూడా కొనుగోలు చేసింది. అలాగే హోమ్ డెకోరేషన్ బ్రాండ్ ఇకాయ్ అసయ్, ఎంపవర్ సంస్థలను కూడా అనన్య ఏర్పాటు చేశారు. మరోవైపు, ఆర్యమాన్ .. వ్యాపారవేత్తగా, వెంచర్ క్యాపిటలిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ వ్యాపారాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. -
బేవకూఫ్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థకు వాటాలు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ టీఎంఆర్‌డబ్ల్యూ తాజాగా డీ2సీ బ్రాండ్ అయిన బేవకూఫ్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసినట్లు తెలిపింది. 70–80 శాతం వాటా కోసం రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వచ్చే అయిదేళ్లలో రూ. 1,500 కోట్ల ఆదాయాలను బేవకూఫ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. క్యాజువల్ వేర్ విభాగంలో వినూత్న బ్రాండ్‌గా బేవకూఫ్ నిలుస్తోందని టీఎంఆర్‌డబ్ల్యూ సీఈవో ప్రశాంత్ తెలిపారు -
పని వారి కోసం ‘సిప్’
ముంబై: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ వినూత్నంగా ‘సహ్యోగ్’ అనే ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తమకు సాయపడే సిబ్బంది పేరిట సిప్ ప్రారంభించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. రోజువారీ మన జీవితాలను సౌకర్యవంతం చేయడం కోసం డ్రైవర్లు, వంట మనుషులు, గార్డెనర్లు, ఇంట్లో పనులు చేసే వారు ఎంతో సాయపడుతుంటారని.. వారికి సైతం జీవితంలో ఎదగాలనే కోరిక ఉంటుందని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పేర్కొంది. ఇతరుల మాదిరే వారికి సైతం రిటైర్మెంట్, పిల్లల విద్య తదితర లక్ష్యాలుంటాయనే విషయాన్ని గుర్తు చేసింది. చదవండి: రోడ్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..కేంద్రం మరో కీలక నిర్ణయం! -
పారిశ్రామికవేత్తలే ప్రచారకర్తలు
సాక్షి, అమరావతి: సాధారణంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖ సినీ నటులు, క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. వారు కోరినంత డబ్బులు చెల్లించి మరీ ప్రచారాన్ని చేపడతాయి. ఇక గత సర్కారు ప్రచార ఆర్భాటాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంవోయూల పేరుతో మభ్యపుచ్చింది. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ సహకారం ఉన్నప్పుడు ఇలాంటి కృత్రిమ ప్రచారంతో పనిలేదు. వచ్చే ఏడాది మార్చిలో విశాఖ వేదికగా నిర్వహించనున్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన దిగ్గజ సంస్థలే ప్రచారకర్తలుగా నిలవనున్నాయి. ఆయా యూనిట్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా పరిశ్రమలు నెలకొల్పిన దిగ్గజాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నూతన పెట్టుబడులను రప్పించేందుకు చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పునాది సమయంలోనే విస్తరణ ప్రణాళికలు.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాన్ని మెచ్చి దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆదిత్య బిర్లా, టాటా, ఐటీసీ, టెక్ మహీంద్రా, డిక్సన్, సెంచురీ ప్లై, అపాచీ ఫుట్‌వేర్, ఏటీజీ టైర్స్, రామ్‌కో, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్, అరబిందో, బ్లూస్టార్, హావెల్స్ లాంటి పలు సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఆదిత్య బిర్లా, ఐటీసీ గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రెండేసి యూనిట్లు ఏర్పాటు చేయడమే కాకుండా విస్తరణ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాయి. ఏటీజీ టైర్స్, సెంచురీ ప్లైవుడ్స్ లాంటి సంస్థలైతే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తున్న వేగాన్ని చూసి పునాది సమయంలోనే విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలకు నిదర్శనం. పూర్తిగా పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో వరుసగా మూడో ఏడాది ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం ఇందుకు తార్కాణం. ఇటీవల రాష్ట్రంలో వివిధ యూనిట్ల ప్రారంభం, శంకుస్థాపన సందర్భంగా ఆయా సంస్థలు ఏమన్నాయో చూద్దాం.. రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏపీ కొత్తగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్ఆర్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్‌సోడా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపు సంస్థలకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది. – బలభద్రపురంలో క్లోర్ అల్కాలి (కాస్టిక్ సోడా) యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అర నిమిషంలోనే ఒప్పించారు.. మే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి 30 సెకన్లు మాత్రమే మాట్లాను. ఎమర్జింగ్ టెక్నాలజీని ఏపీకి తేవడంలో సహకరించాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా మా అబ్బాయి బయోఇథనాల్ ప్లాంట్ స్థాపనకు వివిధ రాష్ట్రాలను పరిశీలిస్తున్న విషయం చెప్పా. ఎక్కడో ఎందుకు? మా రాష్ట్రంలో పెట్టండి అని సీఎం ఆహ్వానించారు. ఏపీలో బయో ఇథనాల్ పాలసీ లేదని ఆయన దృష్టికి తేవడంతో యూనిట్ ప్రారంభమయ్యే సరికి రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. ఇది జరిగిన ఆరు నెలల్లోనే రాజమహేంద్రవరంలో యూనిట్‌కు శంకుస్థాపన చేశాం. ఇలా మా అబ్బాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం గర్వకారణంగా ఉంది. – అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవ సభలో సీపీ గుర్నానీ, సీఈవో, టెక్ మహీంద్రా పెట్టుబడుల ఆకర్షణలో ఫస్ట్ దేశ జీడీపీ వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటమే కాకుండా అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టిస్తోంది. సామాజిక ఆర్థికాభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవల గుంటూరులో వెల్కమ్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను శరవేగంగా ప్రారంభించాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల పార్క్‌ను ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ పరిశీలిస్తుంటే సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం ఎటువంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. – యడ్లపాడులో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ పార్క్ ప్రారంభోత్సవ సదస్సులో సంస్థ సీఈవో సంజయ్ పూరి అత్యుత్తమ ఈఎంసీ కొప్పర్తి కేవలం తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుంది. ఇక్కడి యూనిట్ ద్వారా శామ్సంగ్, బాష్, షావోమి లాంటి పలు ప్రముఖ సంస్థలకు చెందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తాం. రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారుగా మారింది – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ యూనిట్ భూమిపూజ కార్యక్రమంలో డిక్సన్ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ రూ.6 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు.. తొలుత తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్ జిల్లా బద్వేల్లో యూనిట్ నెలకొల్పుతున్నాం. పెట్టుబడుల ప్రతిపాదనలు అందచేసిన రెండు నెలల్లోనే అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేశారు. ప్రభుత్వ సహకారాన్ని చూశాక రూ.6,000 కోట్ల పెట్టుబడులను రూ.26,000 కోట్లకు పెంచాలని నిర్ణయించుకున్నాం. – బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీ చైర్మన్ సజ్జన్ భజాంక పారిశ్రామికవేత్తల మనోగతమే మాకు బ్రాండింగ్ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రత్యేకంగా బ్రాండింగ్ అవసరం లేదు. ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న ప్రజాదరణే అతి పెద్ద బ్రాండింగ్. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ సంస్థల అభిప్రాయాలనే వచ్చే మార్చిలో విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు బ్రాండింగ్‌గా వినియోగించుకుంటాం. 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మూడేళ్లుగా మొదటి స్థానంలో నిలవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి -
రిలయన్స్ నిప్పన్ లైఫ్‌లో వాటాలపై ఆదిత్య బిర్లా గ్రూప్ ఆసక్తి
న్యూఢిల్లీ: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్ఎన్ఎల్ఐసీ)లో వాటాల కొనుగోలు కోసం తాజాగా ఆదిత్య బిర్లా క్యాపిటల్ కూడా బరిలోకి దిగింది. రిలయన్స్ క్యాపిటల్‌కు (ఆర్సీఎల్) ఉన్న 51 శాతం వాటా కొనుగోలు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్ఎన్ఎల్ఐసీలో రిలయన్స్ క్యాపిటల్‌కు 51 శాతం, జపాన్‌కి చెందిన నిప్పన్ లైఫ్‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి. ఇరు సంస్థలు కలిసి దీన్ని జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి. భారీగా పేరుకుపోయిన రుణాల చెల్లింపులో పదే పదే డిఫాల్ట్ అవుతుండటంతో ఆర్సీఎల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ గతేడాది నవంబర్ 29న రద్దు చేసింది. దివాలా చట్టం కింద చర్యలకు సంబంధించి వై నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్సీఎల్ విక్రయం కోసం అడ్మినిస్ట్రేటర్ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను ఆహ్వానించారు. మొత్తం 14 బిడ్లు వచ్చాయి. పూర్తి కంపెనీని కొనేందుకు ఆరు కంపెనీలు ముందుకు రాగా, ఆర్‌సీఎల్‌లో భాగంగా ఉన్న వివిధ సంస్థలను వేర్వేరుగా కొనేందుకు మిగతా వారు బిడ్లు వేశారు. బిడ్డింగ్ గడువు ముగిసే నాటికి ఆర్ఎన్ఎల్ఐసీ కొనుగోలు కోసం ఒక్క బిడ్ కూడా రాలేదు. -
కేఎస్కే మహానది ఖాతా విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) మొండిబకాయి(ఎన్పీఏ)గా మారిన కేఎస్కే మహానది పవర్ కంపెనీ రుణ ఖాతాను విక్రయించింది. ఆదిత్య బిర్లా ఏఆర్సీకి రూ. 1,622 కోట్లకు ఖాతాను బదిలీ చేసింది. ఈ(2022) ఏప్రిల్‌కల్లా కేఎస్కే మహానది చెల్లించాల్సిన రుణాల విలువ రూ. 3,815 కోట్లుకాగా.. 58 శాతం కోత(హెయిర్‌కట్)తో ఖాతాను ఏఆర్సీకి ఎస్బీఐ విక్రయించింది. కేఎస్కే మహానది పవర్ ఎన్పీఏ ఖాతాను ఎస్బీఐ నగదు ప్రాతిపదికగా ఈవేలం నిర్వహించింది. ఇందుకు రూ. 1,544 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించినట్లు ఎస్బీఐ వెల్లడించింది. కాగా.. మొత్తం 15 ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ లభించినప్పటికీ ఏబీ ఏఆర్సీ నుంచి రూ. 1,544 కోట్లకు ఒకే బిడ్ దాఖలుకావడం గమనార్హం! స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టిన వేలం విధానంలో పోటీ బిడ్స్ దాఖలుకానప్పటికీ తదుపరి చర్చలతో బిడ్‌ను రూ. 1,622 కోట్లకు ఏబీ ఏఆర్సీ సవరించింది. ఇందుకు తగిన అనుమతులు పొందాక ఈ నెల 12న ఎస్బీఐ విక్రయాన్ని పూర్తి చేసింది. 2009లో ఏర్పాటైన కేఎస్కే మహానది పవర్ రెండేళ్లుగా కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది. -
ఏబీ క్యాపిటల్ రికార్డు లాభం.. కంపెనీ చరిత్రలోనే అత్యధికం
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ రంగ దిగ్గజం ఆదిత్య బిర్లా(ఏబీ) క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 42 శాతం జంప్‌చేసి రూ. 429 కోట్లకు చేరింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 302 కోట్లు ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం 26 శాతం ఎగసి రూ. 5,859 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 4,632 కోట్ల టర్నోవర్ నమోదైంది. జూన్‌కల్లా నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్, గృహ రుణాల బుక్ 22 శాతం బలపడి రూ. 69,887 కోట్లకు చేరింది. జీవిత, ఆరోగ్య బీమా విభాగం స్థూల ప్రీమియం 53 శాతం జంప్‌చేసి రూ. 3,250 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఏబీ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం క్షీణించి రూ. 106 వద్ద ముగిసింది. -
మార్కెట్లో ఒడిదుడుకులు ఉండొచ్చు
ముంబై: స్టాక్ మార్కెట్ ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల తేది ఈ గురువారంతో ముగియనుంది. సూచీలు జీవితకాల గరిష్టస్థాయికి చేరడంతో పలు షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఆటో కంపెనీలు సెపె్టంబర్ వాహన విక్రయ గణాంకాలను శుక్రవారం విడుదల చేయనున్నాయి. అదే రోజున కేంద్ర గణాంకాల శాఖ సెపె్టంబర్ తయారీ రంగ డేటాను, ఆర్బీఐ సెపె్టంబర్ 24తో ముగిసిన వారం నాటి ఫారెక్స్ నిల్వల గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఈ వారంలోనే ఒక ఐపీఓతో పాటు మరో లిస్టింగ్ ఉంది. ఈ పరిమాణాల దృష్ట్యా ఇన్వెస్టర్ల అప్రమత్తతతో మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనుకావచ్చు. ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు తదితర అంశాల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని నిపుణులు అంటున్నారు. టెలికాం, టెక్, క్యాపిటల్ గూడ్స్, ఇంధన ఆటో రంగాల షేర్లు రాణించడంతో గతవారంలో సెన్సెక్స్ 1033 పాయింట్లు ఆర్జించింది. తొలిసారి 60వేల పైన ముగిసింది. నిఫ్టీ 268 పాయింట్లు లాభపడింది. సూచీలకిది వరుసగా ఐదోరోజూ లాభాల ము గింపు కావడం విశేషం. ‘సూచీలు భారీ వ్యాల్యూవేషన్లతో ట్రేడ్ అవుతున్న తరుణంలో ట్రేడర్లు అప్రమత్తత వహించవచ్చు. దీంతో లాభాలు పరిమితం గా ఉండొచ్చు. నిఫ్టీకి ఎగువస్థాయిలో 18,000 స్థాయి వద్ద బలమైన నిరోధం ఉంది. లాభాల స్వీకరణ జరిగితే 17,500 వద్ద తక్షణ మద్దతు ఉంది’ అని సామ్కో రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. జోరుగా విదేశీ పెట్టుబడులు దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐల) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ సెపె్టంబర్ 1–24 తేదిల్లో ఎఫ్ఐఐలు నికరంగా రూ. 21,875 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.13,536 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.8,339 కోట్లు పెట్టుబడులు పెట్టారు. దేశీయ ఈక్విటీలపై ఎఫ్ఐఐల బుల్లిష్ వైఖరి కొనసాగితే సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగ వచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. బుధవారం ఆదిత్య బిర్లా సన్ ఐపీఓ అదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఐపీఓ సెపె్టంబర్ 29న (బుధవారం) మొదలై అక్టోబర్ ఒకటవ తేదిన ముగియనుంది. ధరల శ్రేణిని రూ.695–712 గా నిర్ణయించారు. కంపెనీ ఇష్యూ ద్వారా 3.88 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనుంది. ఇందులో ఆదిత్య బిర్లా క్యాపిటల్ 28.5 లక్షలకు పైగా షేర్లను విక్రయించనుండగా, సన్ లైఫ్ (ఇండియా) ఏఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ 3.6 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.2,768.25 కోట్లను సమీకరించనుంది. కనీసం ఒక లాట్ సైజ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఐపీఓ ప్రక్రియ పూర్తైన తర్వాత షేర్లు అక్టోబర్ 11న ఎక్చ్సేంజీల్లో లిస్ట్‌కానున్నాయి. శుక్రవారం పరస్ డిఫెన్స్ షేర్ల లిస్టింగ్ పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాల జీస్ షేర్లు శుక్రవారం ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్ కానున్నాయి. ధరల శ్రేణిని రూ.165 – 175గా నిర్ణయించి కంపెనీ రూ.170.70 కోట్లను సమీకరించింది. ఈ ఐపీఓ ఏకంగా 304 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 71.4 లక్షలకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా.., 217 కోట్లకుపైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల (క్విబ్) విభాగంలో 170 రెట్లు, నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో 928 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 112 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. -
ఆదిత్య బిర్లా ఏఎంసీ ఐపీవోకు సై
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అనుమతించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ఈక్విటీలో 13.5 శాతం వాటాకు సమానమైన 3.88 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్ సంస్థలు ఏబీ క్యాపిటల్ 28.51 లక్షలు, సన్ లైఫ్ (ఇండియా) ఏఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ 3.6 కోట్లు చొప్పున ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నాయి. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా ఆస్తుల నిర్వహణ జేవీ.. ఏబీ సన్ లైఫ్ ఏఎంసీ ఏప్రిల్‌లోనే సెబీకి దరఖాస్తు చేసింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,500–2,000 కోట్లు సమకూర్చుకోవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా. ఇప్పటికే ఏఎంసీలు.. నిప్పన్ లైఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, యూటీఐ లిస్టింగ్ సాధించిన సంగతి తెలిసిందే. -
బీఎస్ఈ బాండ్స్ వేదికపై జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సీపీ
న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ తన కమర్షియల్ పేపర్స్‌ను (సీపీ) బీఎస్ఈ బాండ్స్ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ చేయాలని బీఎస్ఈకి దరఖాస్తు చేసుకుంది. ఈ కంపెనీతో పాటు ఆదిత్య బిర్లా ఫైనాన్స్, కేఈసీ ఇంటర్నేషనల్, ఆదిత్య బిర్లా మనీ, ఫుల్లర్టన్ ఇండియా క్రెడిట్.. మొత్తం ఐదు కంపెనీలు సీపీ లిస్టింగ్ కోసం దరఖాస్తు చేశాయి. గురువారం ఈ కంపెనీల కమర్షియల్ పేపర్స్‌ను లిస్ట్ చేస్తామని బీఎస్ఈ పేర్కొంది. ఈ కంపెనీలతో కలుపుకుంటే బీఎస్ఈ బాండ్స్ ప్లాట్‌ఫామ్‌పై కమర్షియల్ పేపర్స్‌ను లిస్ట్ చేసిన కంపెనీల సంఖ్య 16కు పెరుగుతుంది. ఈ కమర్షియల్ పేపర్స్ ద్వారా కంపెనీలు రూ.17,835 కోట్లు సమీకరించాయి. కమర్షియల్ పేపర్స్ అంటే... పెద్ద పెద్ద కంపెనీలు తమ స్వల్పకాలిక రుణాల కోసం ప్రామిసరీ నోట్ల రూపంలో జారీ చేసే మనీ మార్కెట్ సాధనంగా కమర్షియల్ పేపర్స్‌ను చెప్పుకోవచ్చు. వీటి మెచ్యురిటీ కాలం జారీ చేసిన తేదీ నుంచి కనిష్టంగా ఏడు రోజులు గరిష్టంగా ఏడాది కాలం ఉంటుంది. ముఖ విలువ కంటే కొంచెం డిస్కౌంట్‌కు వీటిని జారీ చేస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ వడ్డీరేట్లు వర్తిస్తాయి. -
పేమెంట్ బ్యాంకులు... ప్చ్!
ప్రజలందరికీ మరింతగా ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పేమెంట్స్ బ్యాంకుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారుతోంది. లా¿¶ సాటైన వ్యాపార విధానం లేకపోవడంతో కార్యకలాపాలు ప్రారంభించిన కొన్నాళ్లకే కొన్ని మూతబడగా, అసలు మొదలుపెట్టకుండానే మరికొన్ని వైదొలుగుతున్నాయి. వొడాఫోన్ ఎం–పెసా ఈ నెల తొలినాళ్లలోనే కార్యకలాపాలు నిలిపివేసినట్లు సమాచారం. తాజాగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ (ఏబీఐపీబీ) ఈ ఏడాది అక్టోబర్ నుంచి కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించింది. వ్యాపార పరిస్థితుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల వ్యాపార విధానం లాభదాయకత దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. 2018 ఫిబ్రవరిలో ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఏబీఐపీబీలో దాదాపు 20 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. సుమారు 200 మంది పైగా సిబ్బంది ఉన్నారు. ఏబీఐపీబీ మూసివేతతో వీరిని గ్రూప్‌లోని ఇతర సంస్థలకు బదిలీ చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిపాజిట్ల గురించి ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విత్‌డ్రా చేసుకునేందుకు తగినంత సమయం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు ఇందులో 51 శాతం, వొడాఫోన్ ఐడియాకు 49 శాతం వాటాలు ఉన్నాయి. 2017–18లో ఏబీఐపీబీ రూ. 24 కోట్ల నష్టం నమోదు చేసింది. 11 బ్యాంకులకు లైసెన్సులు.. 2015లో 11 సంస్థలకు ఆర్బీఐ పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులు ఇచ్చింది. అయితే, టెక్ మహీంద్రా, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీతో పాటు కన్సార్షియంగా ఏర్పడిన దిలీప్ సంఘ్వీ, ఐడీఎఫ్సీ బ్యాంక్, టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు పేమెంట్స్ బ్యాంక్ ప్రతిపాదనలను పక్కన పెట్టాయి. సూత్రప్రాయంగా పొందిన లైసెన్సులను తిరిగిచ్చేశాయి. ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులు పూర్తి స్థాయి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటితో పోలిస్తే ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు పరిమిత స్థాయిలో ఉన్నాయి. 2018 మే ఆఖరు నాటికి దేశీయంగా పేమెంట్స్ బ్యాంకుల్లో రూ. 540 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అత్యధికంగా రూ. 307 కోట్లు, పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో రూ. 194 కోట్లు, ఫినోలో రూ. 37 కోట్లు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో రూ. 1.39 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. కఠినతరమైన నిబంధనలతో కష్టాలు.. ఇటు డిపాజిట్ల సమీకరణపరంగానూ అటు రుణాల వితరణలోనూ కష్టతరమైన నిబంధనలు పాటించాల్సి వస్తుండటమే పేమెంట్స్ బ్యాంకులు విఫలమవుతుండటానికి కారణాలుగా ఉంటున్నాయి. పేమెంట్ బ్యాంకులు ఒక్కో ఖాతాదారు నుంచి రూ. 1 లక్షకు మించి డిపాజిట్లు సేకరించడానికి లేదు. రుణాలివ్వడానికి లేదు. కానీ సేకరించిన నిధుల్లో 75 శాతాన్ని ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రుణాలపరమైన రిస్కులు పెద్దగా లేకపోయినప్పటికీ 15 శాతం మేర మూలధనం నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సి వస్తోంది. ఇక ప్రతీ వివరాన్నీ నియంత్రణ సంస్థకు తెలియజేయాలన్న మరో నిబంధన కూడా సమస్యగా ఉంటోంది. పేమెంట్ బ్యాంకులు వైవిధ్యమైన సేవలు అందించేందుకు ఎక్కువగా టెక్నాలజీపైనే ఆధారపడుతున్నాయి. అయితే, వివరాల వెల్లడి నిబంధనల వల్ల మొత్తం వ్యాపార ప్రణాళికను బైటపెట్టినట్లవుతుందని, ఫలితంగా పోటీ సంస్థలకు తమ వ్యాపార రహస్యాలను చేజేతులా అందించినట్లవుతుందని అవి ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అవి పూర్తి స్థాయి బ్యాంకులకు ఎప్పటికీ నిజమైన పోటీదారుగా నిలిచే పరిస్థితులు లేవని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఖాతాదారుల వివరాల ్ర«ధువీకరణ కోసం ఆధార్ ఆధారిత ప్రక్రియను పేమెంట్స్ బ్యాంకులకు కూడా అందుబాటులోకి తెస్తే .. కేవైసీ నిబంధన పాటింపు వ్యయాలు తగ్గుతాయని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. అలాగే వివిధ సాధనాలను విక్రయించేందుకు థర్డ్ పార్టీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా పేమెంట్స్ బ్యాంకులకు వెసులుబాటు కల్పించాలని తెలిపింది. ఇలాంటి విధానాలతో పేమెంట్స్ బ్యాంకులు విజయవంతం కాగలవని పేర్కొంది. అనిశ్చితిలో బ్యాంకుల భవిష్యత్..: ఎస్బీఐ నివేదిక పేమెంట్స్ బ్యాంకుల భవిష్యత్ అనిశ్చితిలో ఉందని, అవి సమర్ధంగా పనిచేయాలంటే నియంత్రణ సంస్థ తోడ్పాటు తప్పనిసరని ఎస్బీఐ ఒక నివేదికలో వెల్లడించింది. ‘పేమెంట్ బ్యాంక్‌ల భవిష్యత్ అనిశ్చితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, నియంత్రణ సంస్థ, ప్రభుత్వ తోడ్పాటుతో వీటి వ్యాపారం క్రమంగా విస్తరించి, వృద్ధి చెందే అవకాశం ఉంది‘ అని పేర్కొంది. నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో పేమెంట్స్ బ్యాంక్ విధాన ం విఫలమైనట్లుగానే కనిపిస్తోందని వివరించింది. 11 సంస్థలు లైసెన్సులు పొందినప్పటికీ నాలుగు సంస్థలు మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించడం అవి కూడా మనుగడ సాగించలేని పరిస్థితులు నెలకొనడం ఇందుకు నిదర్శనమని పేర్కొంది. -
5,872 కోట్ల ఐటీ డిమాండ్‌పై గ్రాసిమ్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నుంచి రూ.5,872.13 కోట్ల ఆదాయపు పన్ను డిమాండ్‌పై గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు ఊరట లభించింది. రికవరీపై బొంబాయి హైకోర్ట్ స్టే మంజూరు చేసింది. ఈ కేసులో తన సమాధానం కోసం ఐటీ శాఖ హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంది. బీఎస్ఈకి పంపిన ఒక నోట్లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఈ విషయాన్ని తెలిపింది. 2016 గ్రూప్ వ్యాపారాల పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌లో షేర్లు కొన్ని గ్రాసిమ్‌కు లభించాయి. ఇందుకు సంబంధించి రూ.5,872.13 కోట్ల డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (వడ్డీసహా) చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నుంచి రెండు వారాల క్రితం సంస్థ నోటీసు అందుకుంది. దీనిని సవాలుచేస్తూ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. -
లక్ష్య సాధనకు కేటాయింపులు కీలకం
దేశీ మార్కెట్లపై ఆశావహ ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) మళ్లీ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ సీఈవో బాలసుబ్రమణియన్. అలాగే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) రూపంలో దేశీయంగా కూడా పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సాక్షి ప్రాఫిట్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఈ ఏడాది గణనీయంగా వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. రిస్కులు, ప్రయోజనాలపరంగా చూస్తే మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన సాధనాలు. పొదుపు (లిక్విడ్ ఫండ్స్), రాబడి (ఫిక్స్డ్ ఇన్‌కం స్కీమ్స్), సంపద సృష్టి (ఈక్విటీ పథకాలు), పన్ను ఆదా స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్ పథకాలు).. ఇలా అవసరం ఏదైనా ప్రతి దానికీ ఒక స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలు చేరుకోవాలంటే ఎల్లవేళలా ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా.. వివిధ సాధనాలకు కేటాయించడం శ్రేయస్కరం. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ ఇన్‌కం పథకాలు ప్రతీ ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండతగినవి. ప్రస్తుతం బ్యాంకుల్లో రూ. 69 లక్షల కోట్లు ఎఫ్‌డీల రూపంలో ఉన్నాయని అంచనా. వీటితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ ఫిక్స్డ్ ఇన్‌కం పథకాలు ఇటు మెరుగైన రాబడులు అందించడంతో పాటు పన్నులపరమైన ప్రయోజనాలు కూడా ఇస్తాయి. సంస్కరణలతో ఊతం .. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, దేశీయంగా బ్యాంకుల మొండిబాకీలు పెరిగిపోవడం, రూపాయి పతనం, వ్యాపార రంగంలో సంక్షోభాలు మొదలైన వాటితో గతేడాది సవాళ్లమయంగా సాగింది. అయితే, 2019లో పరిస్థితులు ఆశావహంగానే ఉంటాయన్న అంచనాలు నెలకొన్నాయి. చమురు ధరలు కాస్త ఉపశమించడం, రూపాయి కొంత బలపడుతుండటం మొదలైనవి ఇందుకు ఊతమిస్తున్నాయి. వ్యవస్థాగతంగా ప్రవేశపెట్టిన వివిధ సంస్కరణలు క్రమంగా ఫలాలిస్తున్న నేపథ్యంలో భారత్‌పై అంతర్జాతీయ ఏజెన్సీలు కూడా ఆశావహ అంచనాలే వెలువరిస్తున్నాయి. వినియోగమే దేశ ఎకానమీ వృద్ధికి చోదకంగా నిలుస్తుందనడానికి నిదర్శనంగా ప్రైవేట్ వినియోగం ఈసారి మరింత ముఖ్యపాత్ర పోషించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం మరింతగా వ్యయం చేస్తుండటం కూడా వినియోగ వృద్ధికి ఊతమివ్వనుంది. ఇక దివాలా చట్టం అమల్లోకి వచ్చాక బ్యాంకుల ఖాతాల ప్రక్షాళన జరగడం కూడా ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మెరుగుపడటానికి దోహదపడనుంది. ఇక జీఎస్టీ విధానం కూడా స్థిరపడితే, పన్నుల రేట్లు తగ్గిన పక్షంలో వినియోగంతో పాటు మొత్తం మీద ట్యాక్స్ చెల్లించే వారి సంఖ్య కూడా పెరిగేందుకు ఊతమిస్తుంది. సెంటిమెంట్ అంతా సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ.. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కీలకపాత్ర పోషించనున్నాయి. ఎన్నికలు జరగడానికి ముందు, తర్వాత ఆరు నెలల డేటా పరిశీలిస్తే మార్కెట్లు పాజిటివ్‌గానే స్పందించిన దాఖలాలే ఉన్నాయి. ఏదైతేనేం.. అంతిమంగా ఫండమెంటల్స్, ఎకానమీ స్థిరత్వమే మార్కెట్ పనితీరును ప్రభావితం చేస్తుంది.