న్యూఢిల్లీ: అదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార మంగళం బిర్లా వారసులు అనన్యశ్రీ, ఆర్యమాన్‌లు వరుసగా ఒక్కో గ్రూప్ కంపెనీలోనూ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఆర్‌ఎఫ్‌ఎల్) బోర్డులో అదనపు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా చేరారు. బోర్డు సమావేశంలో నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సు మేరకు వారిద్దరి నియామకాలను డైరెక్టర్లు ఆమోదించారు. వారిద్దరూ ఇటీవలే ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ బోర్డులో కూడా డైరెక్టర్లుగా చేరారు.
అనన్య స్వయంగా వ్యాపారవేత్తే కాకుండా గాయని కూడా. ఆమె ఏర్పాటు చేసిన స్వతంత్ర మైక్రోఫిన్ ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా సూక్ష్మ రుణాల సంస్థల్లో ఒకటిగా ఉందని కంపెనీ పేర్కొంది. స్వతంత్ర మైక్రోఫిన్ నిర్వహణలో ప్రస్తుతం 1 బిలియన్ డాలర్ల పైగా ఆస్తులు (ఏయూఎం) ఉండగా, 7,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. 2018లో మైక్రో హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను కూడా కొనుగోలు చేసింది. అలాగే హోమ్ డెకోరేషన్ బ్రాండ్ ఇకాయ్ అసయ్, ఎంపవర్ సంస్థలను కూడా అనన్య ఏర్పాటు చేశారు.
మరోవైపు, ఆర్యమాన్ .. వ్యాపారవేత్తగా, వెంచర్ క్యాపిటలిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ వ్యాపారాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment