న్యూఢిల్లీ: గ్లోబల్ బ్రాండ్ల దిగ్గజం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్(ఏబీఎఫ్‌ఆర్‌ఎల్) మహిళా దుస్తుల సంస్థ టీసీఎన్‌ఎస్ క్లాతింగ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. విస్తరించిన టీసీఎన్‌ఎస్ వాటా మూలధనంలో 51 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు వెల్లడించింది. దీంతో టీసీఎన్‌ఎస్ అనుబంధ సంస్థగా ఆవిర్భవించినట్లు ఏబీ ఫ్యాషన్ పేర్కొంది. సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం మెటీరియల్ సబ్సిడయరీగా సైతం నిలవనున్నట్లు తెలియజేసింది.
టీసీఎన్‌ఎస్ క్లాతింగ్‌లో రూ. 1,650 కోట్లు వెచి్చంచి ప్రధాన వాటా కొనుగోలు చేయనున్నట్లు మే 5న ఏబీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. షేర్ల కొనుగోలు ఒప్పందం(ఎస్‌పీఏ)లో భాగంగా ప్రమోటర్ల వాటాతోపాటు.. ఓపెన్ ఆఫర్‌ను చేపట్టింది. ఎస్‌పీఏకింద విస్తారిత మూలధనంలో 22 శాతం వాటాకు సమానమైన 1.41 కోట్ల షేర్లను సొంతం చేసుకుంది. వెరసి షరతులతోకూడిన ఓపెన్ ఆఫర్ తదుపరి 51 శాతం వాటాకు సమానమైన 3.29 కోట్ల షేర్లను చేజిక్కించుకుంది. గతేడాది టీసీఎన్‌ఎస్ రూ. 1,202 కోట్ల ఆదాయం పొందింది. లూయిస్ ఫిలిప్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లండ్ బ్రాండ్ల కంపెనీ ఏబీఎఫ్‌ఆర్‌ఎల్ రూ. 12,418 కోట్ల టర్నోవర్‌ను సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment