majority share
-
భారత్ సేవల రంగం నెమ్మది
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటినెల ఏప్రిల్‌లో నెమ్మదించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మార్చిలో 61.2 వద్ద ఉంటే, ఏప్రిల్‌లో 60.8కి తగ్గింది. అయితే ఈ స్థాయి కూడా 14 ఏళ్ల గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటం గమనార్హం. కాగా, ఈ సూచీ 50పై ఉంటే దానిని వృద్ధి బాటగా, దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణించడం గమనార్హం. మరోవైపు తయారీ, సేవలు కలగలిపిన హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ మార్చిలో 61.8 ఉంటే, ఏప్రిల్‌లో 61.5కు తగ్గడం మరో అంశం. అయితే ఇది కూడా 14 సంవత్సరాల గరిష్ట స్థాయే కావడం గమనార్హం. -
ఏబీ ఫ్యాషన్ చేతికి టీసీఎన్ఎస్
న్యూఢిల్లీ: గ్లోబల్ బ్రాండ్ల దిగ్గజం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్(ఏబీఎఫ్ఆర్ఎల్) మహిళా దుస్తుల సంస్థ టీసీఎన్ఎస్ క్లాతింగ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. విస్తరించిన టీసీఎన్ఎస్ వాటా మూలధనంలో 51 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు వెల్లడించింది. దీంతో టీసీఎన్ఎస్ అనుబంధ సంస్థగా ఆవిర్భవించినట్లు ఏబీ ఫ్యాషన్ పేర్కొంది. సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం మెటీరియల్ సబ్సిడయరీగా సైతం నిలవనున్నట్లు తెలియజేసింది. టీసీఎన్ఎస్ క్లాతింగ్‌లో రూ. 1,650 కోట్లు వెచి్చంచి ప్రధాన వాటా కొనుగోలు చేయనున్నట్లు మే 5న ఏబీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. షేర్ల కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ)లో భాగంగా ప్రమోటర్ల వాటాతోపాటు.. ఓపెన్ ఆఫర్‌ను చేపట్టింది. ఎస్పీఏకింద విస్తారిత మూలధనంలో 22 శాతం వాటాకు సమానమైన 1.41 కోట్ల షేర్లను సొంతం చేసుకుంది. వెరసి షరతులతోకూడిన ఓపెన్ ఆఫర్ తదుపరి 51 శాతం వాటాకు సమానమైన 3.29 కోట్ల షేర్లను చేజిక్కించుకుంది. గతేడాది టీసీఎన్ఎస్ రూ. 1,202 కోట్ల ఆదాయం పొందింది. లూయిస్ ఫిలిప్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లండ్ బ్రాండ్ల కంపెనీ ఏబీఎఫ్ఆర్ఎల్ రూ. 12,418 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. -
జూలైలో సేవలు సూపర్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం జూలైలో అద్భుత పనితీరు కనబరిచింది. ఇందుకు సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సరీ్వసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ పదమూడేళ్ల గరిష్ట స్థాయి 62.3కు ఎగసింది. జూన్‌లో సూచీ 58.5 వద్ద ఉంది. అయితే సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. ఈ ప్రాతిపదికన సేవల పీఎంఐ గడచిన 24 నెలలుగా అప్‌ట్రెండ్‌లోనే కొనసాగుతోంది. సేవలు–తయారీ కలిపినా స్పీడే... కాగా, సేవలు, తయారీ రంగంతో కూడిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ జూలైలో 61.9కు ఎగసింది. జూన్‌లో ఇది 59.4 వద్ద ఉంది. కాగా, భారత్ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగాన్ని చూస్తే, జూలైలో వరుసగా 25వ నెల వృద్ధి బాటన నిలిచింది. జూలైలో సూచీ 57.7 వద్ద పటిష్టంగా ఉంది. అయితే జూన్‌కన్నా (57.8) స్వల్పంగా తగ్గింది. -
వినీ కాస్మెటిక్స్‌లో కేకేఆర్‌కు వాటాలు
ముంబై: ఫాగ్ తదితర డియోడ్రెంట్ బ్రాండ్ల తయారీ సంస్థ వినీ కాస్మెటిక్స్‌లో ప్రైవేట్ దిగ్గజం కేకేఆర్ మెజారిటీ వాటాలు దక్కించుకోనుంది. ఇందుకోసం 625 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,600 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. సంస్థ చైర్మన్ దర్శన్ పటేల్, జేఎండీ దీపం పటేల్ సారథ్యంలోని వినీ వ్యవస్థాపక గ్రూప్‌తో పాటు సెకోయా క్యాపిటల్ ఈ వాటాలను విక్రయించనున్నాయి. ఆ తర్వాత కూడా సహ వ్యవస్థాపకులకు కంపెనీలో గణనీయంగా వాటాలు ఉంటాయి. అటు ప్రస్తుత ఇన్వెస్టరు వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ కూడా వ్యవస్థాపక గ్రూప్ నుంచి మరిన్ని షేర్లు కొనుగోలు చేయడం ద్వారా కంపెనీలో తన వాటాను పెంచుకోనుంది. కేకేఆర్ ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలిపింది. అయితే, సంస్థలో ప్రస్తుతం ఎవరికి ఎంత వాటా ఉన్నది మాత్రం వెల్లడించలేదు. డీల్ అనంతరం కూడా దర్శన్ పటేల్ చైర్మన్‌గా కొనసాగుతారని, దీపం పటేల్ వైస్ చైర్మన్‌గా నియమితులవుతారని పేర్కొంది. దీనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు, వచ్చే నెలాఖరులోగా డీల్ పూర్తికాగలదని భావిస్తున్నట్లు కేకేఆర్ పార్ట్నర్ గౌరవ్ ట్రెహాన్ వివరించారు. కార్యకలాపాలను తదుపరి స్థాయికి పెంచుకునేందుకు కేకేఆర్ అనుభవం, వనరులు తోడ్పడగలవని దర్శన్ పటేల్ తెలిపారు. ఆసియన్ ఫండ్ ఐV ద్వారా కేకేఆర్ ఈ పెట్టుబడులు పెడుతోంది. గతేడాది వ్యవధిలో జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, లెన్స్‌కార్ట్, రిలయన్స్ జియో తదితర సంస్థల్లో కూడా ఇది ఇన్వెస్ట్ చేసింది. వినీకి 7,00,000 పైగా పాయింట్స్ ఆఫ్ సేల్, 3,000 పైచిలుకు డీలర్లు, 1,200 మంది దాకా సేల్స్ సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయంగా 50 పైగా దేశాల్లో ఉత్పత్తులు విక్రయిస్తోంది. -
గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా అమ్మకం!
హైదరాబాద్: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, బ్లాక్‌స్టోన్ రేసులో ఉన్నట్టు సమాచారం. కంపెనీ నుంచి నిష్క్రమించాలన్న ప్రణాళికను ప్రమోటర్లు పునరుద్ధరించారని, మెజారిటీ వాటాను ప్రీమియం వాల్యుయేషన్‌తో విక్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గ్రాన్యూల్స్ ఇండియాలో ఈ ఏడాది జూన్ నాటికి ప్రమోటర్లకు 42.13 శాతం వాటా ఉంది. కాగా, ప్రతిపాదిత వాటా కొనుగోలుకై నాన్ బైండింగ్ బిడ్లను మూడు సంస్థలు దాఖలు చేసినట్టు సమాచారం. కొనుగోలుదార్ల వేటకై ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన కొటక్ మహీంద్రా క్యాపిటల్‌ను కంపెనీ ప్రమోటర్లు నియమించారు. వాటాల విక్రయంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలపై స్పందిం^è లేమని గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ ఈడీ ప్రియాంక చిగురుపాటి స్పష్టం చేశారు. అయితే ఫార్మా రంగంలో ఈ స్థాయి డీల్స్ సహజమని, దీంతో ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ ఆసక్తి చూపుతున్నాయని ఒక కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ డీల్‌ను వేదికగా చేసుకుని మరింత విస్తరణకు ఆస్కారం ఉంటుందనేది ఆలోచన అని ఆయన అన్నారు. మూడు సంస్థలూ పోటీపడితే బిడ్డింగ్ వార్‌కు అవకాశం ఉంది. ప్రమోటర్లు తమ వాటా విక్రయానికి ఫార్మా రంగంలో వాల్యుయేషన్స్, వారసత్వ ప్రణాళిక సమస్యలు కారణంగా తెలుస్తోంది. 2019 నవంబరులోనూ ప్రమోటర్లు తమ వాటాను అమ్మాలని భావించారు. తాజా వార్తల నేపథ్యంలో గ్రాన్యూల్స్ షేరు ధర శుక్రవారం 4.20 శాతం అధికమై రూ.375.75 వద్ద స్థిరపడింది. -
హిందుస్తాన్ జింక్ వాటా విక్రయం వద్దు
ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం * చట్ట ఉలంఘనలు జరుగుతున్నాయని * పిటిషనర్ ఆరోపణ న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వంవద్ద మిగిలి ఉన్న వాటాలను విక్రయించవద్దని (డిజిన్వెస్ట్‌మెంట్) అత్యున్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఈ సంస్థలో మెజారిటీ వాటాను (64.92 శాతం) వేదాంతాకు ప్రభుత్వం 14యేళ్ల క్రితం విక్రయించింది. వేదాంతా అనుంబంధ సంస్థ స్టెరిలైట్ వేదాంత యాజమాన్య నియంత్రణలో ప్రస్తుతం హిందుస్తాన్ జింక్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తాజా సుప్రీం ఆదేశంతో వ్యూహాత్మక ఖనిజాలతో ముడివడిఉన్న కంపెనీలో విలువైన 29.54 శాతం వాటాల విక్రయానికి బ్రేక్ పడినట్లయ్యింది. ఈ వాటాలకు సంబంధించి యథాతథ పరిస్థితిని కొనసాగించాలని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంబంధిత పక్షాలను ఆదేశించింది. పిటిషన్ దాఖలు కారణం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధికారుల సంఘాల జాతీయ సమాఖ్య ఈ పిటిషన్ దాఖలు చేసింది. తొలి దఫా పెట్టుబడుల ఉపసంహరణల సమయంలోనే చట్ట సంబంధ ఉల్లంఘనలు జరిగాయని సమాఖ్య తరఫున సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషన్ తన వాదనలు వినిపించారు. ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి గతంలో ఒక ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్‌లో చట్ట ఉల్లంఘనల విషయం స్పష్టమైనట్లు వివరించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న త్రిసభ్య ధర్మాససం, ‘సంబంధిత చట్ట సవరణలు చేయనిదే తిరిగి తాజా వాటాలను ఎలా విక్రయిస్తారు’ అని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. వేదాంతాకు విలువైన ఆస్తులు అప్పగించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రోతాంగీని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం... విచారణ పూర్తయ్యే వరకూ ఎటువంటి తదుపరి వాటాల విక్రయం జరగరాదని స్పష్టం చేసింది. తొందరలేదు: ప్రభుత్వం కాగా ప్రస్తుత వాటాల విక్రయంపై తొందరలేదని గనుల వ్యవహారాల కార్యదర్శి బల్విందర్ కుమార్ తెలిపారు. ఇందుకు న్యాయ, మార్కెట్ ఒడిదుడుకుల కారణాలను తెలిపారు. -
బ్యాంకుల చేతికి ఐవీఆర్సీఎల్?
42 శాతానికి చేరిన వాటా; మెజారిటీ దిశగా అడుగులు ► 8.75 శాతానికి తగ్గిన ప్రమోటర్ల వాటా ► కంపెనీ బోర్డులో బ్యాంకుల నుంచి ఇద్దరు పరిశీలకులు ► కన్సార్షియంగా ఏర్పడిన 6 బ్యాంకులు ►నవంబర్‌లోగా రూ. 2,000 కోట్ల ఆస్తుల విక్రయానికి సన్నాహాలు ► కంపెనీ తమ చేతిలోనే ఉంటుందంటున్న యాజమాన్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌లో మెజారిటీ వాటాను దక్కించుకోవాలని బ్యాంకులు నిర్ణయించాయా? తీసుకున్న రుణాలను తీర్చలేక ఇప్పటికే వడ్డీని ఈక్విటీగా మార్చుకుంటున్న బ్యాంకులు ఇప్పుడు కంపెనీలో 51 శాతం వాటాను తీసుకుని, యాజమాన్య హక్కులు చేజిక్కించుకోవాలనుకుంటున్నాయా? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇవన్నీ నిజమేననిపించక మానదు. ఎందుకంటే ఐవీఆర్‌సీఎల్‌కి అప్పులిచ్చిన ఆరు బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడి కంపెనీలో యాజమాన్య హక్కు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తీసుకున్న రుణాలను పునర్వ్యవస్థీకరించినా, సీడీఆర్ ప్యాకేజీ కింద వడ్డీని ఈక్విటీగా మార్చుకున్నా కంపెనీ పనితీరు మెరుగుపడలేదు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా బ్యాంకులు యాజమాన్య హక్కులను తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం ఎస్బీఐ నేతృత్వంలో ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐవోబీ, కెనరా, ఆంధ్రా బ్యాంక్‌లు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. జూన్ 30 నాటికి ఈ ఆరు బ్యాంకులకూ కలిపి మొత్తంగా 26.81 శాతం వాటా ఉంది. ఈ వాటాకు గాను కంపెనీ బోర్డులో బ్యాంకుల తరఫున ఇప్పటికే ఇద్దరు పరిశీలకులు కూడా ఉన్నారు. భయం లేదు: కంపెనీ వర్గాలు ఆర్బీఐ కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ (ఎస్డీఆర్) విధానం కింద రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఆ రుణాన్ని ఈక్విటీగా మార్చుకోవచ్చు. కనీసం 51% వాటాకు తక్కువ కాకుండా తీసుకుని, కంపెనీలో పూర్తి యాజమాన్య హక్కులను సొంతం చేసుకోవచ్చు. అయితే దీనికి అప్పులిచ్చిన సంస్థల్లో 75%గానీ లేకపోతే ఇచ్చిన అప్పు విలువలో 60% ఇచ్చినవారి నుంచి గానీ మద్దతు పొందాల్సి ఉంది. ఐవీఆర్సీఎల్ విషయంలో ఈ రెండు నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి బ్యాంకులు ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కంపెనీకి ఉన్న ప్రధానమైన రూ.4,900 కోట్ల అప్పులో మెజార్టీ వాటాను ఈక్విటీగా మార్చుకొని బ్యాంకు ఖాతాల నుంచి ఎన్పీఏ మరకను తొలగించుకోవాలని బ్యాంకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను కంపెనీ తోసిపుచ్చుతోంది. ఒకవేళ మెజారిటీ వాటాను బ్యాంకులు తీసుకున్నా కంపెనీని తామే నిర్వహిస్తామన్న ధీమాను కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే కంపెనీ గాడిలో పడుతోందని, వచ్చే 18 నెలల్లో కంపెనీ టర్న్ అరౌండ్ అవుతుందని చెప్పారాయన. ‘‘కొన్నాళ్లుగా ఆస్తుల్ని విక్రయించి అప్పులు తీరుద్దామని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఆ ప్రయత్నాలకు సాంకేతికంగా అడ్డంకులు ఎదురయ్యాయి. నవంబర్‌లోగా ఆస్తుల విక్రయం ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరిస్తాం. దీనివల్ల రూ. 1,500 కోట్ల రుణ భారం తగ్గడమే కాకుండా, రూ.500 కోట్ల ఈక్విటీ సమకూరుతుందని అంచనా వేస్తున్నాం’’ అని చెప్పారాయన. ప్రస్తుతం ఎస్బీఐ బేస్ రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గిం చటం వల్ల వడ్డీ భారం నెలకు రూ.2 కోట్లు తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. మార్కెట్ విలువ 380 కోట్లకు! మొత్తం ఐవీఆర్సీఎల్ గ్రూపునకు సుమారుగా రూ. 7,000 కోట్ల రుణాలు ఉంటే అందులో ప్రధానమైన కన్స్ట్రక్షన్ కంపెనీకి రూ.4,900 కోట్ల వరకు అప్పులున్నాయి. ఈ అప్పుల్లో 75 శాతం వాటా ఈ ఆరు బ్యాంకులదే. ఈ అప్పులకు కంపెనీ వడ్డీలు చెల్లించలేకపోవటంతో కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ కింద కట్టాల్సిన వడ్డీని ఈ బ్యాంకులు ఈక్విటీగా మార్చుకున్నాయి. 2013 నవంబర్ నుంచి కట్టాల్సిన రూ.600 కోట్ల మేర వడ్డీని... షేరు ధర దాదాపు రూ.24 దగ్గర ఉన్నపుడు బ్యాంకులు ఈక్విటీగా మార్చుకున్నాయి. అయితే షేరు ధర వేగంగా పతనమవుతూ ప్రస్తుతం రూ.7.45కు చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా హరించుకుపోయి 380 కోట్లకు పడిపోవటంతో బ్యాంకుల్లో ఆందోళన మొదలయినట్లు సమాచారం. మరోవంక బ్యాంకులకు వడ్డీ కోసం కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయడంతో ప్రమోటర్ల వాటా 13.7 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గింది. ఈ మిగిలిన వాటాలో కూడా చాలావరకూ ప్రమోటర్లు బ్యాంకుల వద్ద తనఖా పెట్టారు. ఈ ఆరు బ్యాంకులతో కలిపి ఇతర ఆర్థిక సంస్థల చేతిలో 44.53 శాతం వాటా ఉంది.