
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం జూలైలో అద్భుత పనితీరు కనబరిచింది. ఇందుకు సంబంధించి ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా సరీ్వసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ పదమూడేళ్ల గరిష్ట స్థాయి 62.3కు ఎగసింది. జూన్‌లో సూచీ 58.5 వద్ద ఉంది. అయితే సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. ఈ ప్రాతిపదికన సేవల పీఎంఐ గడచిన 24 నెలలుగా అప్‌ట్రెండ్‌లోనే కొనసాగుతోంది.
సేవలు–తయారీ కలిపినా స్పీడే...
కాగా, సేవలు, తయారీ రంగంతో కూడిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ జూలైలో 61.9కు ఎగసింది. జూన్‌లో ఇది 59.4 వద్ద ఉంది. కాగా, భారత్ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగాన్ని చూస్తే, జూలైలో వరుసగా 25వ నెల వృద్ధి బాటన నిలిచింది. జూలైలో సూచీ 57.7 వద్ద పటిష్టంగా ఉంది. అయితే జూన్‌కన్నా (57.8) స్వల్పంగా తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment