Gross Domestic Product (GDP)
-
సంస్కరణల మోత.. వృద్ధికి చేయూత!
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొంటోందని ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టింది. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్న నేపథ్యంలో తక్షణం ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేసి, వృద్ధికి చేయూతనివ్వాలంటే... పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న పలు నియంత్రణలను తొలగించడంతో పాటు భూ, కార్మిక తదితర కీలక సంస్కరణలు అమలు చేయాలని తేల్చిచెప్పింది. మరోపక్క, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, వినిమయం భారీగా పుంజుకునేలా చర్యలు చేపట్టాలని సూచించింది. మరికొద్ది గంటల్లో మోదీ 3.0 సర్కారు కీలక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో 2024–25 ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించారు. న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.3–6.8 శాతానికి పరిమితం కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ ఏడాది వృద్ధి 6.4 శాతానికి పడిపోవచ్చని ఇప్పటికే కేంద్రం ముందస్తు అంచనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కరోనా తర్వాత జీడీపీ వృద్ధి రేటు మళ్లీ ఇంతలా బలహీనపడటం ఇదే తొలిసారి. 2023–24 ఏడాదికి వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. కాగా, 2024 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన దేశం)గా అవతరించాలంటే వచ్చే ఒకట్రెండు దశాబ్దాల పాటు జీడీపీ ఏటా 8 శాతం చొప్పున వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సర్వే నొక్కి చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించాలంటే పలు రంగాల్లో, ముఖ్యంగా భూ, కార్మిక సంస్కరణలు చేపట్టాలని తెలిపింది. అంతేకాకుండా, జీడీపీలో పెట్టుబడుల శాతాన్ని ఇప్పుడున్న 31 శాతం నుంచి 35 శాతానికి పెంచాల్సిందేనని కూడా పేర్కొంది. తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, బయో టెక్నాలజీ వంటి వర్ధమాన టెక్నాలజీల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సూచించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2027–28లో 5 ట్రిలియన్ డాలర్లను, 2029–30లో 6.3 ట్రిలియన్ డాలర్లను తాకే అవకాశం ఉంది. ధరలు దిగొస్తాయి... కొత్త పంట చేతికి రావడం, సీజనల్‌గా కొన్ని కూర గాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇక ఆహార ద్రవ్యోల్బణం శాంతించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఆర్బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం 4%కి అటుఇటుగానే రిటైల్ ద్రవ్యోల్బణం ఉండొ చ్చని పేర్కొంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరల సెగ వంటి రిస్కులు పొంచిఉన్నాయని తెలిపింది. 2024 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టమైన 5.2%కి దిగొచ్చింది. అయితే, కూరగాయల ధరల మంటతో ఆహార ద్రవ్యోల్బణం ఇంకా భారీగానే 8.4%గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయ రిసు్కలు ఆందోళనకరంగానే ఉన్నా యని కూడా సర్వే పేర్కొంది.నియంత్రణల సంకెళ్లు తెంచాలి... ‘మౌలిక రంగంలో పెట్టుబడులను పెంచాలంటే వ్యవస్థలో పాతుకుపోయిన నియంత్రణ సంకెళ్లను తెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు కూడా వ్యాపారాలకు అడ్డంకులుగా నిలుస్తున్న పలు నిబంధనలను సరళీకరించడంతో పాటు పలు రకాల టారిఫ్‌లలో కోత విధించాలి. దేశంలో నవకల్పనలను ప్రోత్సహించి, చిన్న మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) రంగానికి దన్నుగా నిలిచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. జర్మనీ, స్విట్జర్లాండ్, జపాన్, సింగపూర్ తదితర దేశాల ఆర్థిక విజయంలో ఎస్ఎంఈలు కీలక పాత్ర పోషించాయి. అధిక నియంత్రణ వల్ల ఇన్నోవేషన్, ఆర్థికవ్యవస్థ చురుకుదనానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ దిశగా భూ, కార్మిక, తదితర సంస్కరణలు అత్యవసరం’ అని సర్వే పేర్కొంది.సర్వేలో ఇతర ముఖ్యాంశాలు... → దేశంలో సేవల రంగం మంచి పనితీరును కనబరుస్తోంది. తయారీ రంగం మా త్రం కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటోంది. → ప్రపంచ ఆర్థిక అనిశి్చతిని సైతం తట్టుకుని మన ఫైనాన్షియల్ రంగం పురోగమిస్తోంది. బ్యాంకులు లాభాలు మెరుగుపడ్డాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య వ్యత్యాసం తగ్గుతోంది. → పెట్టుబడులకు దన్నుగా, పొదుపులను మదుపుగా మార్చడంలో, సంపద సృష్టిలో మన క్యాపిటల్ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2013–14 నుంచి 2023–24 మధ్య ఐపీఓ ద్వారా కంపెనీల లిస్టింగ్‌లు ఆరు రెట్లు పెరిగాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లకు యువ ఇన్వెస్టర్లే చోదక శక్తిగా నిలుస్తున్నారు. → విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో ఎగుమతుల వృద్ధి మందగించింది. మరోపక్క, దేశీయంగా పటిష్ట డిమాండ్‌తో దిగుమతులు పెరిగాయి. రక్షణాత్మక ధోరణులు పెరిగిపోవడంతో ప్రపంచ వాణిజ్య ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన ఎగుమతులకు పోటీతత్వం పెంచాలంటే వ్యూహాత్మక వాణిజ్య రోడ్‌మ్యాప్ అత్యవసరం. → అధిక ప్రభుత్వ వ్యయం, మెరుగుపడుతున్న వ్యాపార విశ్వాసంతో పెట్టుబడులు మళ్లీ పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. → సమృద్ధిగా 640 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇది 90 శాతం విదేశీ రుణానికి సమానం, అలాగే దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపోతాయి. → వ్యాపారాలకు సానుకూల వాతావరణం కల్పించేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0లో రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలి. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేయాలి. → అధిక వృద్ధి పథంలో సాగాలంటే వచ్చే రెండు దశాబ్దాల పాటు మౌలిక రంగంలో పెట్టుబడులను దశలవారీగా పెంచాలి. → కార్పొరేట్ రంగం సామాజిక బాధ్యత విషయంలో మరింతగా దృష్టి సారించాలి. → పప్పు ధాన్యాలు, నూనెగింజలు, టమాటా, ఉల్లి ఉత్పత్తిని పెంచేలా పరిశోధనలు జరగాలి. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంట రకాలను రూపొందించడంతో పాటు పంట దిగుబడి పెంచి, పంట నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి.వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం గ్రామీణ డిమాండ్‌కు దన్నుగా నిలుస్తోంది. ఆహార ధరలు శాంతించే అవకాశం ఉండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో వృద్ధి మళ్లీ పట్టాలెక్కనుంది. భౌగోళిక రాజకీయ, వాణిజ్య అనిశి్చతులతో పాటు కమోడిటీ ధరల షాక్‌లు మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ మనదే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే వృద్ధిని పరుగులు పెట్టించాల్సిందే’. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారుపటిష్టమైన దేశీ డిమాండ్, పెట్టుబడులు పుంజుకుంటున్న నేపథ్యంలో వృద్ధి కాస్త మెరుగ్గానే (6.5–6.8%) ఉండొచ్చు. వ్యవసాయ దిగుబడుల జోరు, బలమైన సేవల రంగం వృద్ధికి కీలక చోదకాలు. పాశ్చాత్య దేశాల పాలసీలు, భౌగోళిక–ఆర్థిక అడ్డంకులు సరఫరా వ్యవస్థల రూపురేఖలను మార్చేస్తున్నాయి’. – రుమ్కి మజుందార్, డెలాయిట్ ఇండియా ఎకనమిస్ట్‘భారత్ వృద్ధి రేటు జోరును కొనసాగించాలంటే ప్రపంచ దేశాలతో పోటీతత్వాన్ని పెంచుకోవాల్సిందే. నిర్మాణాత్మక సంస్కరణలు, నియంత్రణల తొలగింపు ద్వారానే ఇది సాధ్యం’ – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
స్థిరంగా దూసుకెళుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక పేర్కొంది. గ్రామీణ వినియోగం పునరుద్ధరణ, ప్రభుత్వ పెట్టుబడుల పెరుగుదల అలాగే బలమైన సేవల ఎగుమతులు భారత్ ఎకానమీ పటిష్టతకు కారణమవుతున్నాయని వివరించింది. ఆయా అంశాల దన్నుతో మార్చితో ముగిసే 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 6.6 శాతం నమోదవుతుందని ఆర్బీఐ 2024 డిసెంబర్ ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. → షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు) పటిష్టంగా ఉన్నాయి. వాటి లాభదాయకత పెరుగుతోంది. మొండి బకాయిలు తగ్గుతున్నాయి. తగిన మూలధన మద్దతు లభిస్తోంది. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) బఫర్లతో గణనీయంగా శక్తివంతమయ్యాయి. రుణాలపై రాబడి (ఆర్‌ఓఏ)ఈక్విటీపై రాబడి (ఆర్ఓఈ) దశాబ్దాల గరిష్ట స్థాయిలో ఉండగా, స్థూల మొండిబకాయిల నిష్పత్తి పలు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. రుణ నాణ్యత మెరుగుపడడం బ్యాంకింగ్‌కు పూర్తి సానుకూల అంశం. స్థూల మొండిబకాయిల (జీఎన్‌పీఏ)నిష్పత్తి 2024 సెపె్టంబరు నాటికి 12 ఏళ్ల కనిష్ఠ స్థాయికి 2.6 శాతానికి తగ్గింది. → మొదటి రెండు త్రైమాసికాల్లో బలహీన వృద్ధి ఫలితాలు వచ్చినప్పటికీ, నిర్మాణాత్మక వృద్ధి అంశాలు స్థిరంగా ఉన్నా యి. 2024–25 మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి పునరుద్ధరణ జరుగుతుంది. దేశీయ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు, బలమైన సేవల ఎగుమతులు, ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణంగా ఉంటాయి. → కరీఫ్, రబీ పంట భారీ దిగుబడులు ద్రవ్యోల్బణాన్ని పూర్తి అదుపులోనికి తీసుకువచ్చే అవకాశం ఉంది. æ అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ సరఫరా చైన్‌పై అలాగే కమోడిటీ ధరలపై ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి. 2025లో వృద్ధి అవకాశాలు మెరుగు భారత ఆర్థిక వ్యవస్థకు 2025లో మంచి వృద్ధి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు, వ్యాపార వర్గాల్లో విశ్వాసం ఇందుకు దోహదపడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి, స్థిరత్వంపై మేము దృష్టి సారిస్తున్నాం. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో వృద్ధి ఊపందుకుంది. – ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్‌లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముందుమాట -
7 శాతం వరకూ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రెండవ త్రైమాసికంలో 5.4 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును నమోదుచేయడాన్ని ‘‘తాత్కాలిక ధోరణి’’గా ఫిక్కీ ప్రెసిడెంట్, ఇమామీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష వర్ధన్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 6.5 నుంచి 7 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని పరిశ్రమ సంఘం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులూ పుంజుకుంటాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఒక ఇంటర్వ్యూలో అగర్వాల్ పేర్కొన్న ముఖ్యాంశాలు... → రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణం –ఆర్థిక వృద్ధికి మధ్య చక్కటి సమన్వయాన్ని సాధించాల్సి ఉంది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల విషయంలో ఆర్బీఐ పూర్తి పరిపక్వతతో వ్యవహరిస్తోంది. → వచ్చే నెలలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారతదేశానికి భారీ సవాళ్లు వస్తాయని నేను భావించడం లేదు. → భౌగోళికంగా–రాజకీయంగా ఇప్పుడు ప్రతి దేశం వాటి ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే, ట్రంప్ పాలనా కాలంలో భారత్‌కు భారీ సవాళ్లు ఉంటాయని నేను భావించడం లేదు. ముఖ్యంగా మెక్సికో, చైనా తదితర దేశాలకు టారిఫ్‌లు ఎక్కువగా ఉండవచ్చు. → ట్రంప్ పాలనా కాలంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు, కానీ స్థూలంగా చూస్తే, భారత్ పరిశ్రమలకు అవకాశాలు లభించే అనేక అంశాలు ఉన్నాయి. → భారత్ ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడి వ్యయాలు మరింత పెరగాలి. సామర్థ్య వినియోగ స్థాయిలు 75 శాతానికి చేరాలి. ఇది సాధ్యమయ్యే విషయమేనని మేము విశ్వసిస్తున్నాం. → వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తన మూలధన వ్యయాలను 15 శాతం పెంచాలని ఛాంబర్ బడ్జెట్ ముందస్తు సిఫార్సు చేసింది. → టీడీఎస్ (మూలం వద్ద పన్ను మినహాయింపు) సరళీకరణ, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ పురోగతికి బడ్జెటరీ కేటాయింపులు వంటి అంశాలనూ ఫిక్కీ సిఫారసు చేసింది. -
7 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ.. 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: భారతదేశం 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరమని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి పలు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించింది. ఈ మేరకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా, ‘ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్: రివైవింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్’ శీర్షికన ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2030 నాటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పరిమాణాన్ని 7 ట్రిలియన్ డాలర్లకు విస్తరించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అత్యవసరం‘ అని నివేదికలో పేర్కొంది. నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ వివరించిన నివేదికలోని కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే... → 2030 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణాన్ని సాధించడానికి దేశం 2024– 2030 మధ్య 10.1 శాతం పురోగతి సాధించాలి. → మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ అభివృద్ధికి కీలకం. ఈ విషయంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. పెరిగిన బడ్జెట్ కేటాయింపులతో లాజిస్టిక్స్ పనితీరు సూచిక (ఎల్పీఐ) విషయంలో భారత్ ర్యాంకింగ్ 2023లో 54కు ఎగసింది. 2014లో ఇది సూచీ 54 వద్ద ఉంది. → గత కొన్ని సంవత్సరాలుగా దేశ మౌలిక సదుపాయాలను గణనీయంగా విస్తరించేందుకు విధాన నిర్ణేతలు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. → దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి తద్వారా ఆర్థిక వృద్ధిలో చురుగ్గా పాల్గొనేందుకు ప్రైవేట్ సంస్థలకు దేశంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ దిశలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. → అయితే మౌలిక రంగం పురోగతికి సంబంధించి ఎదురయ్యే కొన్ని సవాళ్లు సైతం ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా చూస్తే, ద్రవ్యలోటు పరంగా ఎదురయ్యే సవాళ్లను ఇక్కడ ప్రస్తావించుకోల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు తీవ్రం కాకుండా చూసుకోవడంలో భాగంగా మౌలిక రంగంపై పెట్టుబడుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి వ్యహరించాల్సిన అవసరం ఉంటుంది. → భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యం గణనీయంగా తగ్గింది, 2009–13 మధ్య 160 బిలియన్ల (మొత్తం పెట్టుబడులలో 46.4 శాతం) ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. 2019–23 మధ్య ఈ విలువ దారుణంగా 39.2 బిలియన్ (మొత్తం పెట్టుబడుల్లో 7.2 శాతం)క డాలర్లకు పడిపోయింది. అయితే ప్రభుత్వ పరంగా ఈ విభాగంలో పెట్టుబడులు పెరిగాయి. అయితే ఇది ద్రవ్యలోటు సమస్యలకూ దారితీస్తున్న సమస్య. ప్రైవేటు రంగంలో మౌలిక విభాగ పెట్టుబడులు పెరగడం వల్ల ప్రభుత్వాలు ద్రవ్యలోటు సమతౌల్యతను రక్షించగలుగుతాయి. → మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడే చర్యల విషయంలో ప్రభుత్వ వ్యయాన్ని వినియోగించవచ్చు. ప్రజారోగ్య సంరక్షణ, మానవ వన రుల పురోగతి, రుణ చెల్లింపులు వంటి ఇతర ఆర్థిక వృద్ధికి సంబంధించిన ఇతర కీలక విభాగాలకు ప్రభుత్వం వ్యయాన్ని మళ్లించవచ్చు. → రంగాల వారీగా చూస్తే పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్లు, రోడ్డు రవాణా రహదారులు, గోడౌన్లు, రవాణా రంగాలు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి తగిన కీలక విభాగాలు. → వేగవంతమైన పట్టణీకరణ, యువత అధికంగా ఉండడం, పట్టణ ప్రాంతాల పురోగతి, ఎయిర్‌పోర్ట్‌లు, విద్యుత్ సరఫరా వంటి రంగాలు భారీ పెట్టుబడి అవకాశాలను కలిగి ఉన్నాయి. -
జీడీపీ.. జోరుకు బ్రేక్!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీలో వృద్ధి మందగమనం నెలకొంది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్, క్యూ2) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.4 శాతానికి (2023 ఇదే కాలంలో పోల్చి) పరిమితమైంది. గడచిన రెండేళ్లలో ఇంత తక్కువ స్థాయి జీడీపీ వృద్ధి రేటు ఇదే తొలిసారి. ఇంతక్రితం 2022–23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం) భారత్ ఎకానమీ 4.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. సమీక్షా కాలంలో తయారీ, వినియోగం, మైనింగ్ రంగాలు పేలవ పనితీరును ప్రదర్శించినట్లు శుక్రవారం విడుదలైన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) డేటా వెల్లడించింది. 5.4 శాతం వృద్ధి రేటు ఎలా అంటే.. 2023–24 రెండవ త్రైమాసికంలో (2011–12 ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికగా) ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తూ, స్థిర ధరల వల్ల వాస్తవ జీడీపీ విలువ రూ.41.86 లక్షల కోట్లు. తాజా సమీక్షా కాలం (2024 జూలై–సెపె్టంబర్) ఈ విలువ రూ.44.10 లక్షల కోట్లకు ఎగసింది. వెరసి జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదయ్యింది. ఇక ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయని ప్రస్తుత ధరల వద్ద ఇదే కాలంలో జీడీపీ విలువ రూ.70.90 లక్షల కోట్ల నుంచి రూ.76.60 లక్షల కోట్లకు చేరింది. ఈ ప్రాతిపదికన వృద్ధి రేటు 8 శాతం. ఆరు నెలల్లో వృద్ధి 6 శాతం ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) ద్రవ్యోల్బణం సర్దుబాటుతో స్థిర ధరల వద్ద గత ఏడాది ఇదే కాలంలో జీడీపీ విలువ 82.77 లక్షల కోట్లుగా ఉంటే, తాజాగా 87.74 లక్షల కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 6%గా నమోదైంది. ప్రస్తుత ధరల వద్ద చూస్తే, విలువ రూ.141.40 లక్షల కోట్ల నుంచి రూ.153.91 లక్షల కోట్లకు ఎగసింది. వెరసి వృద్ధి రేటు 8.9%.కీలక రంగాలు ఇలా... → తయారీ రంగంలో వృద్ధి రేటు 14.3 శాతం (2023 క్యూ2) నుంచి 2.2 శాతానికి పడిపోయింది. → వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 1.7 శాతం నుంచి 3.5 శాతానికి ఎగసింది. → మైనింగ్ అండ్ క్వారీయింగ్ విభాగంలో 11.1 శాతం వృద్ధి రేటు 0.01 శాతానికి క్షీణబాట పట్టింది. → ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సరీ్వసుల విభాగంలో వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.7 శాతానికి ఎగసింది. → ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల విభాగంలో వృద్ధి రేటు 10.5 శాతం నుంచి 3.3 శాతానికి మందగించింది. → నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 13.6 శాతం నుంచి 7.7 శాతానికి పడిపోయింది. → ప్రైవేటు తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ) వృద్ధి రేటు తాజా సమీక్షా కాలంలో 6 శాతంగా నమోదయ్యింది. క్యూ1 (ఏప్రిల్–జూన్) ఈ విభాగం వృద్ధి రేటు 7.4%గా ఉంది.అక్టోబర్‌లో ‘మౌలిక’ రంగమూ నిరాశే.. ఇదిలావుండగా, ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల వృద్ధి రేటు అక్టోబర్‌లో 3.1 శాతంగా నమోదయ్యింది. 2023 ఇదే నెలతో పోలి్చతే (12.7 శాతం) వృద్ధి రేటు భారీగా పడిపోవడం గమనార్హం. బొగ్గు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాల్లో వృద్ధి మందగించగా, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు రంగాల్లో ఏకంగా క్షీణత నమోదయ్యింది. రిఫైనరీ ప్రొడక్టుల్లో మాత్రం వృద్ధి రేటు పెరిగింది. కాగా, ఈ ఎనిమిది రంగాలూ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ 4.1 శాతం వృద్ధి సాధించగా, 2023 ఇదే కాలంలో ఈ రేటు 8.8 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 40.27%.వృద్ధి వేగంలో గ్లోబల్ ఫస్ట్.. తాజాగా గణాంకాలు వెలువడిన క్యూ2లో వృద్ధి వేగంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలోనే కొనసాగింది. భారత్ ఈ సమయంలో 5.4 శాతం వృద్ధి సాధిస్తే, రెండవ స్థానంలో ఉన్న చైనా ఇదే కాలంలో 4.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. నిరుత్సాహమే, కానీ... జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదు కావడం నిరుత్సాహపరిచే అంశమే. అయితే ఎకానమీలోని కొన్ని విభాగాల్లో సానుకూలతలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం–అనుబంధ పరిశ్రమలు, నిర్మాణ రంగం ఇందులో ఉన్నాయి. ఆ అంశాలు ఎకానమీ ప్రమాదంలో లేదని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. – వీ అనంత నాగేశ్వరన్, సీఈఏ -
రెండేళ్లలో తగ్గనున్న లాజిస్టిక్స్ వ్యయాలు
న్యూఢిల్లీ: జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నేపథ్యంలో రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) లాజిస్టిక్స్ వ్యయాల వాటా 9%కి తగ్గుతుందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా ఇది 14% ఉన్నట్లు చెప్పారు. అమెరికాతో పాటు యూరప్‌లోని పలు పెద్ద దేశా ల్లో ఈ వ్యయాలు 12% ఉండగా చైనాలో 8 శాతంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు. 2022–23 ఎకనమిక్ సర్వే ప్రకారం దేశ జీడీపీలో లాజిస్టిక్స్ వ్యయాలు 14–18%గా ఉన్నాయి. అంతర్జాతీయ సగటు 8% తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎగుమతి చేసేందుకు భారత్‌కు భారీగా అవకాశాలు ఉన్నాయని గడ్కరీ చెప్పారు. తక్కువ నాణ్యత గల బొగ్గును మిథనాల్ తయారీకి ఉపయోగించవచ్చన్నారు. జీవ ఇంధనాల విభాగంలో దేశం గణనీయంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. రహదార్ల నిర్మాణంలో రీసైకిలింగ్ చేసిన టైర్ పౌడరు, ప్లాస్టిŠక్ మొదలైన మెటీరియల్స్‌ను వినియోగించడం వల్ల బిటుమిన్ దిగుమతులు తగ్గగలవని మంత్రి వివరించారు. మరోవైపు, దేశీ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గతేడాదే జపాన్ను దాటేసి అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించిందని గడ్కరీ చెప్పారు. 2014లో రూ. 7.5 లక్షల కోట్లుగా ఉన్న దేశీ మార్కెట్ 2024 నాటికి రూ. 18 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. -
ఎకానమీ జోరుకు బ్రేకులు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో 6.7 శాతంగా నమోదయ్యింది. గడచిన 15 నెలల కాలంలో ఇంత తక్కువ వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. 2023 జనవరి–మార్చి త్రైమాసికంలో ఎకానమీ 6.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. వ్యవసాయం, సేవా రంగాల పేలవ పనితీరు తాజా లెక్కలపై ప్రభావం చూపినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) డేటా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 8.2 శాతం. తాజా సమీక్షా కాలానికి ముందు త్రైమాసికంలో (జనవరి–మార్చి) రేటు 7.8 శాతం. 6.7 శాతం వృద్ధి ఎలా అంటే.. 2024–25 తొలి త్రైమాసికంలో 2011–12 స్థిర ధరల ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని మదింపుచేసే జీడీపీ విలువ రూ.43.64 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో ఇది రూ.40.91 లక్షల కోట్లు. అంటే వృద్ధి రేటు 6.7 శాతమన్నమాట. ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికకాకుండా, ప్రస్తుత ధరల ప్రకారం పరిశీలిస్తే, 2023 ఏప్రిల్–జూన్ మధ్య జీడీపీ విలువ 9.7 శాతం వృద్ధితో రూ.70.50 లక్షల కోట్ల నుంచి రూ.77.31 లక్షల కోట్లకు ఎగసింది. ‘వృద్ధి వేగంలో టాప్’ ట్యాగ్ యథాతథం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.7 శాతంగా నమోదయ్యింది. ఈ కాలంలో ప్రపంచంలోనే మరేదేశమూ 6.7 శాతం వృద్ధి రేటును అందుకోలేకపోవడంతో, ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి రేటు విషయంలో భారత్ తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నట్లయ్యింది. జీవీఏ వృద్ధి 6.8 శాతం ఉత్పత్తికి సంబంధించిన వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా లెక్కించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి రేటు 2023–24 చివరి త్రైమాసికంలో 6.3 శాతంగా నమోదయితే, 2024–25 మొదటి త్రైమాసికంలో అరశాతం పెరిగి 6.8 శాతంగా నమోదయ్యింది. వార్షికంగా చూస్తే జీవీఏ విలువ రూ.38.12 లక్షల కోట్ల నుంచి రూ.40.73 లక్షల కోట్లకు ఎగసింది. ఇది 6.8 శాతం వృద్ధి రేటుకాగా, గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.3 శాతం. వివిధ రంగాల వృద్ధి తీరును స్థూలంగా జీవీఏ ప్రాతిపదికన పరిశీలిస్తారు. -
భళా.. భారత్
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ అన్ని వర్గాల అంచనాలకు మించి మంచి ఫలితాన్ని సాధించింది. మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదయ్యింది. మార్చి త్రైమాసికంలో ఈ పురోగతి 7.8 శాతంగా రికార్డు అయ్యింది. నాలుగో త్రైమాసికంలో 6.1–6.7 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని పలువురు ఆర్థికవేత్తలు అంచనావేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6–7.8 శాతం శ్రేణిలో ఉంటుందన్నది వారి అభిప్రాయం. ఆర్బీఐ వృద్ధి అంచనాసైతం 7 శాతంగా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఫిబ్రవరినాటి తన రెండవ అడ్వాన్స్ అంచనాల్లో 2023–24 వృద్ధి రేటును 7.7 శాతంగా పేర్కొంది. ఈ అంచనాలు, విశ్లేషణలు అన్నింటికీ మించి తాజా ఫలితం వెలువడ్డం గమనార్హం. క్యూ4లో అంచనాలకు మించి (7.8 శాతం) భారీ ఫలితం రావడం మొత్తం ఎకానమీ వృద్ధి (8.2 శాతం) పురోగతికి కారణం. ఎన్ఎస్ఓ శుక్రవారం ఈ మేరకు తాజా గణాంకాలను వెలువరించింది. 5 ట్రిలియన్ డాలర్ల దిశగా అడుగులుభారత ఆర్థిక వ్యవస్థ 2023–24 జూన్ త్రైమాసికంలో 8.2 శాతం, సెపె్టంబర్ త్రైమాసికంలో 8.1 శాతం, డిసెంబర్ త్రైమాసికంలో 8.6 శాతం పురోగతి సాధించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతంకాగా, అదే ఆర్థిక సంవత్సరం క్యూ4లో వృద్ధి రేటు 6.2 శాతం. చైనా ఎకానమీ 2024 మొదటి మూడు నెలల్లో 5.3 శాతం పురోగమించడం గమనార్హం. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఎకానమీ ముందుందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితోపాటు భారత్ ఎకానమీ 3.5 ట్రిలియన్ డాలర్ల జోన్లో స్థిరపడగా, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనకు ముందడుగు పడింది. మార్చిలో మౌలిక రంగం 6.2 శాతం వృద్ధి ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ మార్చిలో 6.2 శాతం పురోగమించింది. సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, విద్యుత్ రంగాల చక్కటి పనితీరు ఇందుకు దోహదపడింది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, ఎరువులు, స్టీల్, సిమెంట్ రంగాలు కూడా కలిగిన ఈ గ్రూప్ 2024 మార్చితో 6 శాతం పురోగమించగా, 2023 ఏప్రిల్‌లో 4.6 శాతంగా నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ) ఈ గ్రూప్ వెయిటేజ్ 40.27 శాతం. 2024లో వృద్ధి 6.8%: మూడీస్ భారత్ 2024లో 6.8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని రేటింగ్ దిగ్గజం మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2025లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. 2022లో ఎకానమీ 6.5 శాతం పురోగమిస్తే,,, 2023లో 7.7 శాతానికి ఎగసిందని తెలిపింది.ద్రవ్యలోటు కట్టడిఆర్థిక వ్యవస్థ గణాంకాలు అంచనాలకు మించి పురోగమించిన నేపథ్యంలో ఎకానమీకి మరో సానుకూల అంశం... ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు పరిస్థితి మెరుగుపడ్డం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతంగా (జీడీపీ విలువలతో పోల్చి) ద్రవ్యలోటు ఉండాలని కేంద్ర బడ్జెట్ నిర్దేశిస్తుండగా, ఈ అంకెలు మరింత మెరుగ్గా 5.63 శాతంగా నమోదయ్యాయి. విలువల్లో రూ.17.34 లక్షల కోట్లుగా ఫిబ్రవరి 1 బడ్జెట్ అంచనావేస్తే, మరింత మెరుగ్గా రూ.16.53 లక్షల కోట్లుగా ఇది నమోదయినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజా గణాంకాలు వెల్లడించాయి.8.2% వృద్ధి ఎలా... 2011–12ను బేస్ ఇయర్‌గా తీసుకుంటూ.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకు ని స్థిర ధరల వద్ద 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ రూ.160.71 లక్షల కోట్లు. 2023–24లో ఈ విలువ 173.82 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 8.2 శాతం. ఇక ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా స్థిర ధరల వద్ద వృద్ధి రేటును చూస్తే... ఇది 9.6 శాతం పురోగమించి రూ.269.50 లక్షల కోట్ల నుంచి రూ.295.36 లక్షల కోట్లకు చేరింది. 7.8% పరుగు ఇలా.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని క్యూ4లో (2023 క్యూ4తో పోల్చి) ఎకానమీ విలువ రూ.43.84 లక్షల కోట్ల నుంచి రూ.47.24 లక్షల కోట్లకు ఎగసింది. అంటే వృద్ధి 7.8 శాతమన్నమాట. స్థిర ధరల వద్ద ఈ రేటు 9.9 శాతం పెరిగి రూ.71.23 లక్షల కోట్ల నుంచి రూ.78.28 లక్షల కోట్లకు ఎగసింది. మోదీ ప్రభుత్వం 3.0లోనూ వృద్ధి వేగం కొనసాగుతుంది ప్రపంచంలోని దిగ్గజ ఎకానమీలో భారత్ జీడీపీ వృద్ధి తీరు విశేషమైనది. మోదీ ప్రభుత్వం 3.0లోనూ ఇదే వృద్ధి వేగం కొనగుతుంది. 2023–24లో తయారీ రంగం 9.9 శాతం పురోగమించడం ప్రత్యేకమైన అంశం. 2014కి పూర్వం యూపీఏ ప్రభుత్వం హయాంలో అవినీతితో మొండి బకాయిల కుప్పగా మారిన బ్యాంకింగ్ రంగాన్ని వివిధ సంస్కరణలతో మోదీ ప్రభుత్వం టర్నెరౌండ్ చేసి, వృద్ధి బాటలో పరుగులు తీయిస్తోంది. 2014–23 మధ్య బ్యాంకులు రూ. 10 లక్షల కోట్ల మేర మొండిబాకీల రికవరీ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 1,105 బ్యాంక్ ఫ్రాడ్ కేసులను దర్యాప్తు చేసి రూ. 64,920 కోట్ల మొత్తాన్ని అటాచ్ చేసింది. – మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో నిర్మలా సీతారామన్ -
జీడీపీలో 2 శాతం
న్యూఢిల్లీ: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతం ప్రత్యక్ష ప్రభుత్వ పెట్టుబడితో 11 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించవచ్చని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) తాజా నివేదిక పేర్కొంది. మొత్తం ఉపాధి సృష్టిలో దాదాపు 70 శాతం మహిళలకు ప్రయోజనం కలుగుతుందని కూడా విశ్లేíÙంచింది. భారత్ పురోగతికి తీసుకోవాల్సిన అంశాలపై ఎఫ్ఎల్ఓ ఒక రోడ్‌మ్యాప్‌ను కూడా ఆవిష్కరించింది. వీటిలో అంశాలు– లీవ్ పాలసీలు, కేర్ సరీ్వస్ సబ్సిడీలు, కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి, కేర్ వర్కర్లకు నైపుణ్య శిక్షణ, నాణ్యత హామీ కీలకమైనవని నివేదిక పేర్కొంది. -
2031 నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్!
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.8 శాతంగా క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అలాగే 2031 నాటికి దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థాయికి రెట్టింపై దాదాపు 7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని.. తద్వారా ఎగువ మధ్య–ఆదాయ దేశంగా మారుతుందని క్రిసిల్ ఇండియా అవుట్‌లుక్ నివేదిక పేర్కొంది. నిర్మాణాత్మక సంస్కరణలు తదితర సానుకూల ఆర్థిక నిర్ణయాల వల్ల దేశ ఎకానమీ 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపింది. రానున్న ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2024–25 నుంచి 2030–31) భారత్ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయిని దాటి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. ఈ కాలంలో ఎకానమీ సగటును 6.7 శాతం పురోగమిస్తుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఐదవ స్థానంలో.. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎనానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.6 ట్రిలియన్ డాలర్లు. 4,500 డాలర్లకు తలసరి ఆదాయం.. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరుగుతుంది. దీనితో దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకా రం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డా లర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పే ర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. తయారీ, సేవల రంగాల్లో మంచి అవకాశాలు... దేశీయ, ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా తయారీ– సేవల రంగాలు రెండింటికీ పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. 2025–2031 ఆర్థిక సంవత్సరాల మధ్య తయారీ– సేవల రంగాలు వరుసగా 9.1 శాతం, 6.9 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని మేము అంచనా వేస్తున్నాము. తయారీ రంగం ద్వారా కొంత పెరుగుదల ఉన్నప్పటికీ, సేవా రంగం భారతదేశ వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తుంది. – ధర్మకీర్తి జోషి, క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ -
భారత్ దూకుడు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ దూసుకుపోతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) అంచనాలకు మించి 8.4 శాతంగా నమోదయ్యింది. ఎస్బీఐ రీసెర్చ్, జర్మనీ బ్రోకరేజ్– డాయిష్ బ్యాంక్ వంటి సంస్థలు 7 శాతం వరకూ వృద్ధి అంచనాలను వెలువరించాయి. తాజా ప్రోత్సాహకర ఎకానమీ ఫలితాల నేపథ్యంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.6 శాతం నమోదవుతుందని విశ్వసిస్తున్నట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ప్రకటించింది. ఈ మేరకు తన రెండవ అడ్వాన్స్ అంచనాలను వెలువరించింది. మొదటి అడ్వాన్స్ అంచనాలు 7.3 శాతం. సమీక్షా కాలంలో (క్యూ3)లో తయారీ, మైనింగ్ అండ్ క్వారీ, నిర్మాణ రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శించినట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. కాగా, వ్యవసాయ రంగం తీవ్ర విచారకరమైన రీతిలో 0.8 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది. ఇదిలావుండగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (క్యూ3) వృద్ధి రేటు 4.3 శాతం. క్యూ1, క్యూ2 శాతాలు అప్.. 2022–23 వృద్ధి అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి ఎన్ఎస్ఓ తగ్గించడం మరో అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఒకటి, రెండు త్రైమాసికాలకు సంబంధించి వృద్ధి అంకెలు వరుసగా 7.8 శాతం (క్యూ1), 7.6 శాతాలుగా (క్యూ2)నమోదయ్యాయి. అయితే ఈ అంకెలను ఎగువముఖంగా 8.2 శాతం, 8.1 శాతాలుగా ఎన్ఎస్ఓ సవరించడం మరో సానుకూల అంశం. తాజా ప్రోత్సాహకర ఫలితంతో 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఎకానమీ 8.2 శాతం పురోగమించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 7.3 శాతం. 8.4 శాతం వృద్ధి ఎలా అంటే.. 2022–23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ... 2011–12 బేస్ ఇయర్ ప్రాతిపదిక వాస్తవిక జీడీపీ) రూ.40.35 లక్షల కోట్లు. తాజా 2023–24 ఇదే త్రైమాసికంలో ఈ విలువ 43.72 లక్షల కోట్లకు పెరిగింది. అంటే అంకెల్లో వృద్ధి 8.4 శాతం అన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోని కరెంట్ ప్రైస్ ప్రకారం ఈ విలువ రూ.68.58 లక్షల కోట్ల నుంచి రూ.75.49 లక్షల కోట్లకు ఎగసింది. ఈ ప్రాతిపదిక వృద్ధి రేటు 10.1 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం 7.6 శాతం అంచనాలు చూస్తే.. (వాస్తవ వృద్ధి) జీడీపీ విలువ రూ.160.71 లక్షల కోట్ల నుంచి రూ.172.90 లక్షల కోట్లకు పెరగనుంది. కరెంట్ విలువ ప్రాతిపదికన ఈ వృద్ధి అంచనా 9.1 శాతంగా ఉంది. విలువల్లో రూ.269.50 లక్షల కోట్ల నుంచి రూ.293.90 లక్షల కోట్లకు జీడీపీ విలువ పెరగనుంది. జనవరిలో మౌలిక రంగం నిరాశ 8 పరిశ్రమల గ్రూప్ 3.6 శాతం వృద్ధి ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ జనవరిలో 15 నెలల కనిష్ట స్థాయిలో 3.6 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2023 జనవరిలో ఈ రేటు 4.9 శాతం. ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 8.3 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 40 శాతం. సమీక్షా కాలంలో రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాల్లో వృద్ధి లేకపోగా, క్షీణత నమోదయ్యింది. బొగ్గు, స్టీల్, విద్యుత్ రంగాల్లో వృద్ధి మందగించింది. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, సిమెంట్ రంగాల్లో వృద్ధి రేటు సానుకూలంగా ఉంది. తలసరి ఆదాయాలు ఇలా... మరోవైపు వాస్తవ గణాంకాల (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని) ప్రాతిపదికన 2021–22లో దేశ తలసరి ఆదాయం రూ.1,50,906కాగా, 2022–23లో ఈ విలువ రూ. 1,69,496కు ఎగసినట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. కరెంట్ ప్రైస్ ప్రకారం చూస్తే ఈ విలువలు రూ.1,05,092 నుంచి రూ.1,18,755కు ఎగశాయి. -
ద్రవ్యలోటు కట్టడిలో తగ్గేదేలే..!
ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు కట్టడిలో తన చిత్తశుద్దిని కేంద్రం తాజా బడ్జెట్ ద్వారా ఉద్ఘాటించింది. ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.1 శాతానికి తగ్గుతుందని మధ్యంతర బడ్జెట్ అంచనావేసింది. 2025–26 నాటికి ఈ లోటును 4.5 శాతానికి తగ్గాలన్నది ప్రభుత్వ రోడ్‌మ్యాప్ అన్న సంగతి తెలిసిందే. గడచిన ఆర్థిక సంవత్సరం (2022–23) ద్రవ్యలోటు 6.4 శాతం. మార్చితో ముగిసే ప్రస్తుత (2023–24) ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని 5.9 శాతంగా గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన సమరి్పంచిన బడ్జెట్ నిర్దేశించుకుంది. అయితే ఇది 5.8 శాతానికే పరిమితమవుతుందని 2024–25 మధ్యంతర బడ్జెట్ పేర్కొంది. భారీ పన్ను ఆదాయాలు ద్రవ్యలోటు అంచనా సానుకూలంగా 5.9 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గడానికి కారణంగా వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు విలువలో రూ.17,34,773 కోట్లు ఉంటే, 2024–25 రూ.16,85,494 కోట్లకు తగ్గుతుందని మధ్యంతర బడ్జెట్ పేర్కొంది. ఇక స్థూల, నికర మార్కెట్ రుణాలు 2024–25లో వరుసగా రూ.14.13 లక్షల కోట్లు, రూ.11.75 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్ తెలిపింది. ఈ రెండు సంఖ్యలూ 2023–24తో పోల్చితే తక్కువే కావడం గమనార్హం. ప్రభుత్వం తక్కువ రుణాలను తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున రుణాల లభ్యత సులభతరం అవుతుందని ఆర్థికమంత్రి వ్యాఖ్యానించారు. ద్రవ్యలోటును తగ్గించడానికి భారతదేశం నిర్దేశించిన లక్ష్యాలను మెరుగుపరిచిందనే సందేశాన్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు విస్తృత స్థాయిలో పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ అనంతర సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ, ‘‘మేము ఇంతకుముందు ఇచి్చన ద్రవ్యలోటు రోడ్‌మ్యాప్‌ను అనుసరించడంలో, మెరుగుపరచడంలో ఎంతో పురోగతి సాధిస్తున్నాం. ఇది ప్రతి రేటింగ్ సంస్థకు సూటిగా పంపుతున్న ఒక స్పష్టమైన సందేశం. ఏజెన్సీలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని అన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి భారీ డివిడెండ్లు, పన్ను సమీకరణలో మెరుగుదల ద్రవ్యలోటు కట్టడిలో లక్ష్య సాధనకు దోహదపడుతున్న అంశాలు. గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థలు– ఫిచ్, ఎస్అండ్పీ, మూడీస్లు దేశానికి అతి దిగువస్థాయి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను ఇస్తున్నాయి. చెత్త స్థాయికి ఈ రేటింగ్ కేవలం ఒకమెట్టు ఎక్కువ. అధిక రేటింగ్ కోసం కేంద్రం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అంతగా ఫలితం ఇవ్వడంలేదు. ఒకదేశంలో పెట్టుబడులను పెట్టడానికి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, ఆయా సంస్థలు ఈ రేటింగ్‌లనే ప్రాతిపదికగా తీసుకుంటాయి. -
మూడేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ
న్యూఢిల్లీ: భారత్ వచ్చే మూడేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆర్థికశాఖ 2024 జనవరి సమీక్షా నివేదిక పేర్కొంది. నిరంతర సంస్కరణల నేపథ్యంలో 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పది సంవత్సరాల క్రితం భారత్ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 1.9 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని వివరించింది. ఈ అంకెలు ప్రస్తుతం 3.7 ట్రిలియన్ డాలర్లకు చేరి (2023–24 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం) దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు. మహమ్మారి సవాళ్లు, తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేశం ఈ ఘనత సాధించిందని పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వం 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన దేశ’గా మారాలనే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుందని వివరించింది. సంస్కరణల ప్రయాణం కొనసాగడంతో ఈ లక్ష్యం నెరవేరుతుందన్న భరోసాను వెలిబుచి్చంది. సమగ్ర సంస్కరణలతో జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయిలలో పాలనాపరమైన మార్పులు తీసుకువచ్చినప్పుడు దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం సంపూర్ణంగా ఉంటుందని నివేదిక వివరించింది. దేశీయ డిమాండ్ పటిష్టతతో ఎకానమీ గత మూడేళ్లలో 7 శాతం వృద్ధిని సాధించిందని, 2024–25లో కూడా 7 శాతం స్థాయికి వృద్ధి చేరే అవకాశం ఉందని నివేదిక అంచనావేసింది. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. మౌలిక రంగం అద్భుతం కేంద్ర ప్రభుత్వం మునుపెన్నడూలేనట్లు అపూర్వమైన స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. 2014–15లో ప్రభుత్వ రంగ మూలధన పెట్టుబడి 5.6 లక్షల కోట్లు ఉంటే 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమాణం 18.6 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. – వి. అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ఎకానమీ... లుకింగ్ లైక్ ఏ వావ్ వైరల్ మీమ్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్... భారత ఆర్థిక వ్యవస్థ శక్తిని, ఎకానమీ ప్రస్తుత చెక్కుచెదరని స్వభావాన్ని ప్రతిధ్వనిస్తుంది. ప్రపంచంలోని అగ్ర దేశాలు నిరాశావాదంలో మునిగిపోయినప్పటికీ, భారతదేశం తిరుగులేని ఆశావాదంతో ముందుకు సాగుతోంది. ఈ విజయానికి కారణం ప్రభుత్వమే. – కార్పొరేట్ దిగ్గజం కుమార మంగళం బిర్లా -
ఇప్పుడు 7.2 శాతం.. వచ్చేది 7 శాతం!
దావోస్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం, ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదుచేసుకోగలదన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వ్యస్తం చేశారు. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న భరోసాను ఇచ్చారు. గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) 2023–24 జీడీపీ అంచనాలు 7 శాతంకన్నా... వ్యక్తిగతంగా దాస్ అంచనా 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికంగా గమనార్హం. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఐఐ వార్షిక సమావేశంలో ‘అధిక వృద్ధి తీరు–తక్కువ స్థాయిలో ఇబ్బందులు: ది ఇండియా స్టోరీ’ అనే అంశంపై దాస్ మాట్లాడుతూ, వృద్ధి స్పీడ్ తక్కువగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలకు సంబంధించి ద్రవ్యోల్బణం ప్రమాదం ఇటీవల తగ్గుముఖం పట్టిందని అన్నారు. ఇది భవిష్యత్ వృద్ధి పటిష్టతకు సంకేతమని పేర్కొన్నారు. సమావేశంలో ఇంకా ఆయన ఏమన్నారంటే... ► ఇటీవలి సంవత్సరాలలో భారత్ ప్రభుత్వం చేపట్టిన పటిష్ట నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పెంచాయి. ► సవాలుతో కూడిన ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనూ భారత్... పటిష్ట వృద్ధి, స్థిరత్వ బాటన పయనిస్తోంది. ► ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు, మార్కెట్ల సానుకూల వాతావారణం ఉన్నప్పటికీ, భౌగోళిక ఇబ్బందులు, వాతావరణ మార్పులు ఆందోళనకు కారణమవుతున్నాయి. ► బలమైన దేశీయ డిమాండ్‌తో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఇటీవలి ప్రపంచ అనిశ్చితి పరిణామాల నుంచి భారత్ మరింత బలంగా బయటపడింది. ► అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనగలిగిన స్థాయిలో భారత్ చెల్లింపుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశానికి తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. ► 2022 మే నుంచి ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతూ వచి్చంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం, ద్రవ్య లభ్యత నిర్వహణా పరిస్థితులు ఇందుకు దోహదపడ్డాయి. (2022 మే నుంచి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటు 2.5 శాతం పెరిగి 6.5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.) సరఫరాల వైపు సమస్యలు కూడా తొలిగిపోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తోంది. ► వచ్చే ఏడాది సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నా. ప్రభుత్వ నిర్దేశాలకు అనుగుణంగా ఆర్బీఐ 4 శాతం లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలదనే విశ్వాసంతో ఉంది. -
సవాళ్లున్నా... 6.2 శాతం వృద్ధి!
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.2 శాతం పురోగమిస్తుందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ నివేదిక పేర్కొంది. విదేశీ ఒత్తిడులు, గృహ రుణ స్థాయిలు 15 సంవత్సరాల గరిష్ట స్థాయిలో (జీడీపీలో 5.8 శాతం) ఉన్నప్పటికీ సానుకూల పాలసీ విధానాలు, రుణ వృద్ధి, తగిన స్థాయిల్లో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు దేశం 2024–25లో 6.2 శాతం వృద్ధి బాటన నడవడానికి దోహదపడతాయని భావిస్తున్నట్లు నివేదిక ఆవిష్కరణ సందర్భంగా యుబీఎస్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ తన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు. నివేదికలోని అంశాల్లో కొన్ని... ► 2023–24లో 6.3 శాతం వృద్ధి అంచనా. 2024–25లో 6.2 శాతంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. వినియోగ రంగంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి (2023–24 అంచనా), 4.7 శాతానికి మెరుగుపడే వీలుంది. ► వచ్చే ఆర్థిక సంవత్సరం మూలధన మరింత విస్తృత ప్రాతిపదికన మెరుగుపడే వీలుంది. ఎన్నికల ముందు నెమ్మదించే అవకాశం ఉన్న ఈ విభాగం, ఎన్నికల అనంతరం వేగం పుంజుకునే వీలుంది. ► 2025–26 నుంచి 2029–30 మధ్య వార్షికంగా భారత్ 6.5 శాతం పురోగమించవచ్చు. 2030లో దేశం 6 ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా ఆవిర్భవించే అవకాశం ఉంది. ► డిజిటలైజేషన్, సేవల ఎగుమతుల పురోగతి, తయారీ రంగం పటిష్టత ఎకానమీకి దన్నుగా నిలుస్తాయి. ► 2024–25లో రుణ వృద్ధి 13 నుంచి 14 శాతం ఉండే వీలుంది. ► దేశంలో తిరిగి మోదీ ప్రభుత్వమే అధికారంలోని వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే రాజకీయ స్థిరత్వం విధాన నిర్ణయాల కొనసాగింపునకు తద్వారా వివిధ రంగాల పురోగతికి దోహదపడే అంశాలు. ► 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సగటు 5.4 శాతం, 2024–25లో 4.8 శాతం నమోదయ్యే వీలుంది. సరఫరాల పరిస్థితి మెరుగుపడ్డం ఈ అంచనాలకు కారణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశాల ప్రకారం– 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను చేరుకోడానికి దీర్ఘకాలం పట్టే వీలుంది. 4 ట్రిలియన్ డాలర్లకు ఎకానమీ: పీహెచ్‌డీసీసీఐ భారత్ ఎకానమీ విలువ 2024–25లో 4 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్‌డీసీసీఐ ఒక నివేదికలో పేర్కొంది. 2024–25లో ఈ విలువ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని విశ్లేíÙంచింది. 2024 ముగిసే సరికి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ప్రస్తుతం 6.5 శాతం నుంచి 5.5 శాతం వరకూ తగ్గించే వీలుందని కూడా ఇండస్ట్రీ చాంబర్ విశ్లేíÙంచింది. అంతర్జాతీయ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటూ దూసుకుపోతున్న భారత్– 2047 నాటికి ‘వికసిత భారత్ ఎకానమీ’ లక్ష్యాలను చేరుకోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. 2024లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటు 4.5 శాతంగా ఉంటుందని అంచనావేసింది. వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్స్టైల్, దుస్తులు, ఫార్మాస్యూటికల్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎల్రక్టానిక్స్, ఫిన్‌టెక్ సహా వృద్ధికి ఆశాజనకంగా ఉన్న పలు రంగాలను కూడా ఇండస్ట్రీ సంస్థ గుర్తించింది. నాలుగు విభిన్న కాల వ్యవధులను విశ్లేషణకోసం పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కరోనా ముందస్తు సంవత్సరాలు(2018, 2019), కరోనా పీడిత సంవత్సరాలు (2020, 2021), కరోనా తర్వాతి సంవత్సరాలు (2022,2023) భవిష్యత్ అవుట్‌లుక్ సంవత్సరాలుగా(2024,2025) వీటిని విభజించింది. ఈ నాలుగు కాలాల్లో లీడ్ ఎకనామిక్ ఇండికేటర్స్ ర్యాంకింగ్‌ను గమనించినట్లు ఇండస్ట్రీ బాడీ పీహెచ్‌డీసీసీఐ తెలిపింది. -
అంచనాలకు మించి భారత్ పురోగతి
ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2023–24) స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ అంచనాలను దేశీయ రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా క్రితం 6.2 శాతం నుంచి 30 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. కమోడిటీల ద్రవ్యోల్బణం ‘మైనస్’లో ఉండడం, ఏప్రిల్–సెపె్టంబర్ ఆరు నెలల జీడీపీ గణాంకాల్లో చక్కటి పురోగతి, అక్టోబర్–డిసెంబర్ మధ్య కూడా సానుకూల వృద్ధి గణాంకాలు వెలువడే అవకాశాలు తమ అంచనాల తాజా పెంపునకు కారణమని ఇక్రా పేర్కొంది. ‘‘2023 అక్టోబర్–నవంబర్ ఇక్రా బిజినెస్ యాక్టివిటీ మానిటర్ 11.3 శాతం పెరిగింది. జూలై, ఆగస్టు, సెపె్టంబర్ (క్యూ2)లో నమోదయిన 9.5 శాతం కన్నా ఇది అధికం. పండుగల నేపథ్యంలో అధిక ఫ్రీక్వెన్సీ నాన్–అగ్రి ఇండికేటర్లలో నమోదయిన ఈ పెరుగుదల పూర్తి సానుకూలమైంది. ఈ నేపథ్యంలో క్యూ3తో కూడా మంచి ఫలితం వస్తుందని భావిస్తున్నాం’’ అని ఇక్రా విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. సానుకూల పరిస్థితులు... చైనాకు సంబంధించి డిమాండ్ తగ్గే అవకాశాలు, ముడి చమురు వంటి కీలక కమోడిటీల తగినంత సరఫరాలు, సాధారణ సరఫరా చైన్ పరిస్థితులు ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉండడానికి దోహదపడే అంశంగా ఇక్రా పేర్కొంది. భారత్ ఎకానమీకి సంబంధించి అక్టోబర్, నవంబర్లలో అధిక క్రియాశీలత కనిపించినప్పటికీ, డిసెంబరులో ప్రారంభంలో మిశ్రమ పోకడలు కనిపించాయని ఇక్రా పేర్కొంది. విద్యుత్ డిమాండ్ పెరుగుదల నెమ్మదించిందని, డీజిల్ డిమాండ్ క్షీణతలోకి జారిందని పేర్కొన్న ఇక్రా, రోజువారీ వాహనాల రిజి్రస్టేషన్లు మ్రాతం పెరిగినట్లు తెలిపింది. 2023–24లో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తొలుత అంచనావేసింది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా ఫలితం వెలువడింది. దీనితో ఆర్బీఐ కూడా ఇటీవలి పాలసీ సమీక్షలో తన జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతానికి పెంచింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే... రియల్ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. క్యాలెండర్ ఇయర్ మూడు త్రైమాసికాల్లో వృద్ధి 7.1 శాతంగా ఉంది. -
2024 గ్లోబల్ బ్యాంకింగ్‌పై నెగటివ్ అవుట్‌లుక్: మూడీస్
న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకుల కఠిన ద్రవ్య విధానాల వల్ల పలు దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి తగ్గే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. దీనివల్ల 2024కి సంబంధించి ప్రపంచ బ్యాంకుల అవుట్‌లుక్ ప్రతికూలంగా (నెగటివ్) ఉందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపు (ప్రొవిజనింగ్స్) వ్యయాలు తగ్గే అవకాశాలు, దేశ చక్కటి వృద్ధి రేటు వల్ల భారత్ బ్యాంకుల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ అంచనావేయడం గమనార్హం. అధిక నిధుల సమీకరణ వ్యయాలు, రుణ వృద్ధి తక్కువగా ఉండడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ భారత్ బ్యాంకింగ్ సవాళ్లను తట్టుకుని నిలబడుతుందన్న అభిప్రాయాన్ని నివేదిక వ్యక్తం చేసింది. ‘‘లిక్విడిటీ తగ్గడం (ద్రవ్య లభ్యత), రుణ చెల్లింపుల నాణ్యత పడిపోవడం వల్ల ప్రపంచంలోని పలు దేశాల బ్యాంకుల అసెట్ నాణ్యత దెబ్బతింటుంది’’ అని మూడీస్ తన గ్లోబల్ బ్యాంకింగ్ అవుట్‌లుక్ నివేదికలో పేర్కొంది. కఠినమైన ద్రవ్య విధానాల వల్ల బ్యాంకింగ్ నిర్వహణా పరిస్థితులు క్షీణిస్తాయని అభిప్రాయపడింది. ప్రధాన కేంద్ర బ్యాంకులు రేట్లు తగ్గించడం ప్రారంభించినప్పటికీ, కఠిన ద్రవ్య పరిస్థితులే 2024లో కొనసాగుతాయని, ఇది ఆయా దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై ప్రభావం చూపుతుందని మూడీస్ పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పర్యావరణ సవాళ్లు ఆందోళనకు గురిచేస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రైవేట్ వ్యయాలు తగ్గడం, బలహీన ఎగుమతులు, ప్రాపర్టీ మార్కెట్ దిద్దుబాటు కారణంగా చైనా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని అభిప్రాయపడింది. దీనివల్ల పలు చైనా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడే వీలుందని అంచనావేసింది. -
India Q2 GDP Growth: జీడీపీ.. టాప్‌గేర్!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2023–24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) అంచనాలను మించి 7.6 శాతంగా నమోదయ్యింది. చైనా వృద్ధి రేటు ఇదే కాలంలో 4.9 శాతంగా నమోదుకావడంతో ప్రపంచంలో తన వేగవంతమైన ఎకానమీ హోదాను సైతం భారత్ మరోసారి ఉద్ఘాటించింది. సమీక్షా త్రైమాసికంలో తయారీ, మైనింగ్, సేవలు చక్కటి పనితీరును ప్రదర్శించాయి. వ్యవసాయ రంగం మాత్రం బలహీన ఫలితాన్ని నమోదుచేసుకుంది. మొదటి త్రైమాసికంలో భారత్ ఎకానమీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికంలో ఈ రేటు 6.5 శాతానికి పరిమితం అవుతుందన్న అంచనాలను మించి పటిష్ట ఫలితం నమోదుకావడం పట్ల ఆర్థికవేత్తలు, విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వృద్ధి 6.2 శాతం కావడం గమనార్హం. 2022–23లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది. 7.6 శాతం వృద్ధి అంటే.. 2011–12 ధరల ప్రకారం (ఈ సంవత్సరం బేస్‌గా ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన రియల్ ఎకానమీ వృద్ధి) 2022–23 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారత్ ఎకానమీ విలువ రూ.38.78 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో (సమీక్షా కాలంలో) ఈ విలువ రూ.41.74 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే వృద్ధి రేటు 7.6 శాతమన్నమాట. ఇక ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయకుండా కరెంట్ ప్రైస్ పాతిపదిక చూస్తే, ఇదే కాలంలో జీడీపీ వృద్ధి రేటు (నామినల్) రూ.65.67 లక్షల కోట్ల నుంచి రూ. 71.66 లక్షల కోట్లకు ఎగసింది. అంటే నామినల్ వృద్ధి రేటు 9.1 శాతంగా ఉంది. ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకూ చూస్తే... రియల్ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. ఇక ఇదే సమయంలో నామినల్ రేటు 8.6 శాతంగా ఉంది. రంగాల వారీగా వృద్ధి తీరు ఇలా... వస్తువులు, సేవల ఉత్పత్తికి సంబంధించి గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ)విలువల ప్రకారం... జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) రంగాల వారీగా విడుదల చేసిన ఫలితాలు పరిశీలిస్తే... తయారీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 78 శాతం వాటా కలిగిన ఈ రంగంలో వృద్ధి భారీగా 13.9 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో అసలు వృద్ధిలేకపోగా 3.8 శాతం క్షీణత నమోదయ్యింది. ► గనులు, తవ్వకాలు: ఈ రంగంలో 0.1 శాతం క్షీణత సమీక్ష కాలంలో 10 శాతం వృద్ధిలోకి మారింది. ►విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: వృద్ధి రేటు 6.1 శాతం నుంచి 10.1 శాతానికి ఎగసింది. ►నిర్మాణం: వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 13.3 శాతానికి ఎగసింది. ►వ్యవసాయం: ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ కీలక రంగంలో వృద్ధి రేటు (2022 ఇదే కాలంతో పోల్చిచూస్తే) 2.5 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గింది. ►ఫైనాన్షియల్, రియలీ్ట, ప్రొఫెషనల్ సేవలు: 7.1% నుంచి వృద్ధి 6 శాతానికి పడిపోయింది. ►ఎకానమీ పటిష్టతకు ప్రతిబింబం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరీక్షా కాలంలో ఎదురవుతున్న సవాళ్లను భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థాయిలో తట్టుకుని నిలబడుతోందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరిన్ని అవకాశాలను సృష్టించేందుకు, పేదరికాన్ని త్వరితగతిన నిర్మూలించడానికి, మన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వేగవంతమైన వృద్ధిని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాము. – ప్రధాని నరేంద్ర మోదీ -
జీడీపీ గణాంకాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా దేశ ఆర్థిక పురోగతి గణాంకాలపై ఆధారపడి కదిలే వీలుంది. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికానికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వివరాలు గురువారం(30న) వెల్లడికానున్నాయి. అక్టోబర్ నెలకు మౌలిక సదుపాయాల గణాంకాలు సైతం ఇదే రోజు విడుదలకానున్నాయి. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. గురువారం నవంబర్ డెరివేటివ్స్ సిరీస్ గడువు ముగియనుంది. శుక్రవారం(డిసెంబర్ 1న) తయారీ రంగ పనితీరు వెల్లడించే నవంబర్ పీఎంఐ ఇండెక్స్ వివరాలు తెలియనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. స్థూల ఆర్థిక గణాంకాలతోపాటు, విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులకు అనుగుణంగా ట్రెండ్ ఏర్పడే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. ఇతర అంశాలూ కీలకమే.. ఆరు ప్రధాన కరెన్సీలతో డాలరు మారకంతోపాటు.. దేశీయంగా రూపాయి కదలికలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. గత వారం డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 83.38వరకూ నీరసించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ముడిచమురు ధరలు, యూఎస్ బాండ్ల ఈల్డ్స్‌కు సైతం ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మీనా తెలియజేశారు. నవంబర్ నెలకు వాహన విక్రయ గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో వారాంతాన ఆటో రంగ దిగ్గజాలు వెలుగులో నిలిచే వీలున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అర్వీందర్ సింగ్ నందా తెలియజేశారు. వీటికితోడు యూఎస్ జీడీపీ, యూఎస్ పీఎంఐ, చమురు నిల్వలు, యూరోజోన్ సీపీఐ తదితర గణాంకాలు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు. వడ్డీ రేట్ల ప్రభావం గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. హెచ్చుతగ్గుల మధ్య నికరంగా సెన్సెక్స్ 175 పాయింట్లు, నిఫ్టీ 63 పాయింట్లు చొప్పున పుంజుకున్నాయి. అయితే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు లేదా పెట్టుబడులు ఈ వారం కొంతమేర ప్రభావం చూపనున్నట్లు మీనా పేర్కొన్నారు. యూఎస్‌లో అంచనాలకంటే అధికంగా ద్రవ్యోల్బణం తగ్గడంతో మార్కెట్లలో విశ్వాసం నెలకొననున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇది కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు యోచనను అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో పదేళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ రెండు వారాల క్రితం నమోదైన 5 శాతం నుంచి 4.4 శాతానికి దిగివచ్చాయి. వెరసి దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐల అమ్మకాలు నెమ్మదించవచ్చని తెలియజేశారు. -
2023–24లో వృద్ధి 6.3 శాతం: యూబీఎస్
ముంబై: భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను విదేశీ బ్రోకరేజ్ యూబీఎస్ అప్‌గ్రేడ్ చేసింది. దీనితో ఈ రేటు 6.3 శాతానికి ఎగసింది. మధ్య కాలికంగా చూస్తే (ఐదేళ్లు) క్రితం 5.75–6.25 శాతం శ్రేణి అంచనాలను ఎగువముఖంగా 6–6.5 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. బ్రోకరేజ్ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ తన్వీ గుప్తా జైన్ మాట్లాడుతూ దేశీయ ఆర్థిక కార్యకలాపాలు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయన్నారు. అయితే ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలు, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల ఫలితాలు వంటివి ఎకానమీపై ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడ్డారు. -
2023–2027 మధ్య భారత్ వృద్ధి జూమ్
న్యూఢిల్లీ: భారత్ మధ్య కాలిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను రేటింగ్ దిగ్గజం– ఫిచ్ 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీనితో ఈ రేటు 5.5 శాతం నుంచి 6.2 శాతానికి చేరింది. 2023 నుండి 2027 వరకు మధ్యకాలంగా ఫిచ్ నిర్వచించింది. ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డం, పని చేసే వయస్సులో ఉన్న జనాభా అంచనాలో స్వల్ప పెరుగుదల తమ తాజా అప్‌గ్రేడ్‌కు కారణమని పేర్కొంది. ఫిచ్ తాజా అంచనాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► కరోనా కాలంలో భారత్‌లో భారీగా పడిపోయిన ఉపాధి అవకాశాలు దేశంలో వేగంగా రికవరీ అవుతున్నట్లు తెలిపింది. మహమ్మారి నాటి కాలంలో పోల్చితే కారి్మక సరఫరా వృద్ధి రేటు పెరిగినప్పటికీ, 2019 స్థాయి నాటికన్నా తక్కువగానే ఉంది. 2000 సంవత్సరం ప్రారంభంలో నమోదయిన స్థాయిలకంటే కూడా తక్కువే. ముఖ్యంగా మహిళల్లో ఉపాధి అవకాశాల రేటురేటు చాలా తక్కువగా ఉంది. ► భారత్‌లో పాటు బ్రెజిల్, మెక్సికో, ఇండోనేíÙయా, పోలాండ్, టర్కీ వృద్ధి రేట్ల అంచనా పెరిగింది.అయితే భారత్ కన్నా తక్కువగా 0.2 శాతం మాత్రమే బ్రెజిల్ టర్కీ, ఇండోనేషియా వృద్ధి రేటు అంచనాలకు ఎగశాయి. ► 10 వర్థమాన ఆర్థిక వ్యవస్థల మధ్యకాలిక వృద్ధిని 4 శాతంగా అంచనా వేసింది. ఇది మునుపటి అంచనా కంటే 30 బేసిస్ పాయింట్లు (ఇంతక్రితం అంచనా 4.3 శాతం) తక్కువ. చైనా వృద్ధి అంచనాలో 0.7 శాతం పాయింట్ల కోత వల్ల ప్రధానంగా ఈ పరిస్థితి నెలకొంది. దీనితో చైనా ఎకానమీ సగటు వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది. ఇటీవలి సంవత్సరాలలో చైనా వృద్ధి బాగా మందగించింది. రియల్టీ రంగంలో క్షీణత మొత్తం పెట్టుబడుల అవుట్‌లుక్‌కు దెబ్బతీసింది. ► రష్యా వృద్ధి రేటును ఈ కాలంలో చైనా 80 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఆ దేశం వృద్ధి రేటు మధ్య కాలికంగా 80 బేసిస్ పాయింట్లుగానే (ఒక శాతం కన్నా తక్కువ) ఉంటుంది. 2023–24లో 6.3 శాతం కాగా, భారత్ స్థూల దేశీయోత్పత్తి 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతమన్న తన అంచనాలను రేటింగ్ దిగ్గజం– ఫిచ్ పునరుద్ఘాటించింది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు వృద్ధి స్పీడ్‌కు బ్రేకులు వేస్తాయని ఫిచ్ అభిప్రాయపడింది. 2024–25లో వృద్ధి రేటు 6.5 శాతమని అంచనావేస్తున్నట్లు తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో ద్రవ్యోల్బణం 6 శాతం పైనే కొనసాగే అవకాశం ఉందని ఫిచ్ అభిప్రాయపడింది. -
ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడుల దన్ను!
న్యూఢిల్లీ: పటిష్ట ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం వంటి కారణాలతో ఏప్రిల్‌తో ప్రారంభమైన 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3 శాతంగా ఉంటుందని పరిశ్రమల సంస్థ ఫిక్కీ సోమవారం వెల్లడించింది. కొన్ని సవాళ్లతో కూడిన అంశాలు నెలకొన్నప్పటికీ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే పేర్కొంది. సర్వేలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఫలితాలు అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంటే వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదవుతుంది. ఏదైనా ప్రతికూలతలు ఎదురయితే 6 శాతానికి తగ్గవచ్చు. భౌగోళిక రాజకీయ ఒత్తిడి కారణంగా అనిశ్చితి కొనసాగడం, చైనాలో వృద్ధి మందగించడం, కఠిన ద్రవ్య విధానం, సాధారణ రుతుపవనాల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు వృద్ధికి ప్రతికూలతలు. ► మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శా తం వాటా ఉన్న వ్యవసాయ రంగం, అనుబంధ కార్యకలాపాల విషయంలో వృద్ధి రేటు 2.7 శా తంగా ఉంటుంది. అయితే 2022–23తో పోలి్చ తే (4 శాతం) ఈ వృద్ధి రేటు తగ్గుతుందని సర్వే వెల్లడిస్తోంది. ఎల్ నినో ప్రభావం దీనికి కారణం. ► జీడీపీలో మరో 15 శాతం వాటా ఉన్న పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 5.6 శాతంగా నమోదుకావచ్చు. ► ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండే వీలుంది. ► 2023 సెపె్టంబర్లో సర్వే జరిగింది. పరిశ్రమ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ► మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, రెండవ–మూడవ త్రైమాసికాల్లో ఈ రేట్లు వరుసగా 6.1 శాతం, 6 శాతాలకు తగ్గవచ్చు. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023–24లో సగటున 5.5 శాతంగా నమోదయ్యే వీలుంది. కనిష్టంగా 5.3 శాతం, గరిష్టంగా 5.7 శాతంగా ఉండవచ్చు. ద్రవ్యోల్బణం గమనం అనిశ్చితంగానే ఉందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ప్లస్ 2, మైనస్ 2తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ పాలసీ అంచనావేస్తోంది. ► తీవ్ర అనిశ్చితి పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగవచ్చు. 2024 వరకూ ఇదే ధోరణి నెలకొనే అవకాశం ఉంది. అయితే భారత్ ఎకానమీ ఈ సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతుంది. భారత్ ఎగుమతులపై మాత్రం ప్రతికూల ప్రభావం తప్పదు. 2024–25 ప్రారంభంలో పావుశాతం రేటు కోత 2024 మార్చి వరకూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో యథాతథంగా 6.5 శాతంగా కొనసాగే వీలుందని ఫిక్కీ సర్వే తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024–25)మొదటి లేదా రెండవ త్రైమాసికాల్లో రెపో రేటును ఆర్బీఐ పావుశాతం తగ్గించే అవకాశం ఉందని విశ్లేíÙంచింది. ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల మొదట్లో జరిగిన సమీక్షసహా గడచిన మూడు ద్రవ్య పరపతి విధాన సమక్షా సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నాటికి పెద్ద మరింత ఊరటనిస్తూ, మూడు నెలల కనిష్ట స్థాయి 5.02 శాతానికి దిగివచి్చంది. అయితే ద్రవ్యోల్బణం పట్ల ఆర్బీఐ అత్యంత అప్రమత్తంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం 2–4 ఆర్బీఐ లక్ష్యం అని కూడా ఆయన ఇటీవలి పాలసీ సమీక్షలో ఉద్ఘాటించారు. -
పడుతున్న పొదుపులు.. పెరుగుతున్న అప్పులు
ముంబై: భారత్‌లో వ్యక్తులుసహా చిన్న స్థాయి కుటుంబ సంస్థల (హౌస్‌హోల్డ్ సెక్టార్) ఆర్థిక పరిస్థితులపై ఎస్బీఐ రీసెర్చ్ కీలక అంశాలను ఆవిష్కరించింది. దీని ప్రకారం కరోనా తర్వాత వీటి పొదుపురేట్లు ఒకవైపు పడిపోతుండగా మరోవైపు అప్పులు పెరిగిపోతున్నాయి. వీటి నికర ఆర్థిక (ఫైనాన్షియల్) పొదుపు రేటు 2022 ఏప్రిల్– 2023 మార్చి ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.15 శాతానికి పడిపోయింది. గడచిన 50 సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి ఆర్థిక పొదుపురేటు నమోదు ఇదే తొలిసారి. 2020–21లో ఈ రేటు 11.5 శాతంగా ఉంది. మహమ్మారికి ముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20) ఈ రేటు 7.6 శాతం. అటు ప్రభుత్వం, ఇటు నాన్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఈపీఎఫ్ఓ వంటివి) పొదుపు నిధులే ప్రధాన ఆర్థిక వనరు కావడం గమనార్హం. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌస్‌హోల్డ్ సెక్టార్ రుణభారం రూ. 8.2 లక్షల కోట్లు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రాథమికంగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు తాజా అధికారిక విశ్లేషణ వెల్లడించింది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని వర్గాల నుంచి వ్యక్తమైన ఆందోళనలను కేంద్ర ఆర్థికశాఖ తోసిపుచ్చడం గమనార్హం. ఫైనాన్షియల్ రంగంలో పొదుపు రేటు తగ్గడంపై ఆందోళన పడాల్సింది ఏమీ లేదని, వివిధ ఇతర భౌతిక పొదుపు ప్రొడక్టుల్లో ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారని వివరణ ఇచ్చింది. ఎస్బీఐ రీసెర్చ్ చెబుతున్న అంశాలు క్లుప్తంగా... ► 2022–23లో పెరిగిన హౌస్‌హోల్డ్ సెక్టార్ రుణం రూ.8.2 లక్షల కోట్లలో బ్యాంక్ రుణాలు రూ.7.1 లక్షల కోట్లు. ఇందులో దాదాపు 55 శాతం భాగం గృహాలు, విద్య, వాహనాల కొనుగోళ్లకు వెళ్లింది. ► ఈ కాలంలో బీమా, ప్రావిడెంట్ ఫండ్లు, పెన్షన్ ఫండ్ పథకాల్లో రూ. 4.1 లక్షల కోట్ల పెరుగుదల ఉంది. ► హౌస్‌హోల్డ్ రంగం రుణం జీడీపీ నిష్పత్తిలో చూస్తే, 2020 మార్చిలో 40.7 శాతం. 2023 జూన్‌లో ఇది 36.5 శాతానికి పడింది. ► ఫైనాన్షియల్ పొదుపు నుండి తగ్గిన మొత్తంలో ప్రధాన భాగం భౌతిక (పొదుపు) ఆస్తులవైపు మళ్లింది. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ దీనికి కారణం. ► సంవత్సరాలుగా హౌస్‌హోల్డ్ సెక్టార్లో 80–90 శాతం భౌతిక పొదుపులు (ఫైనాన్షియల్ రంగంలో కాకుండా) నివాసాలు, ఇతర భవనాలు, నిర్మాణాలు, యంత్ర పరికరాల విభాగంలో ఉన్నాయి. ► వాస్తవానికి, 2011–2012లో హౌస్‌హోల్డ్ పొదుపులో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ భౌతిక ఆస్తుల వాటా ఉంది. అయితే ఇది 2020–21లో 48 శాతానికి తగ్గింది. 2022–23లో ఈ తరహా పొదుపులు మళ్లీ దాదాపు 70 శాతానికి చేరే అవకాశం కనబడుతోంది. రియల్టీ రంగం పురోగతికి ఇది సంకేతం. నివేదిక పరిధి ఇదీ... పొదుపులు, అప్పులకు సంబంధించి ఈ నివేదికలో ఎస్బీఐ రీసెర్చ్ ‘హౌస్‌హోల్డ్ సెక్టార్’ అని పేర్కొంది. అంటే జాతీయ ఖాతా (నేషనల్ అకౌంట్స్)కు సంబంధించి వ్యక్తులతోపాటు, వ్యవసాయ, వ్యవసాయేతర వ్యాపారాలు, ప్రభుత్వేతర, కార్పొరేటేతర చిన్న వ్యాపార సంస్థలు, ఏకైక (ప్రొప్రైటరీ) యాజమాన్యాలు, భాగస్వామ్యాలు, లాభాపేక్షలేని సంస్థలు వంటి అన్ఇన్కార్పొరేటెడ్ సంస్థలు ఈ పరిధిలో ఉంటాయి. -
క్యూ1 జీడీపీ గణాంకాలు పూర్తి పారదర్శకం
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి గణాంకాల మదింపు తగిన విధంగా జరగలేదని వస్తున్న విమర్శల్లో ఎటువంటి వాస్తవం లేదని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు. ఏప్రిల్–జూన్‌లో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయినట్లు గత నెల చివర్లో అధికారిక గణాంకాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ‘‘ఇండియాస్ ఫేక్ గ్రోత్ స్టోరీ’’ పేరుతో ప్రాజెక్ట్ సిండికేట్ పోస్ట్ చేసిన ఒక కథనంలో ఆర్థికవేత్త, ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అశోక మోడీ తీవ్ర విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత అధికారులు ప్రతికూల స్థూల ఆర్థిక వాస్తవాలను తక్కువ చేసి చూపుతున్నారు. తద్వారా వారు జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ముందు పొగడ్తలతో కూడిన హెడ్లైన్ గణాంకాలను విడుదల చేసి ఉండవచ్చు. కానీ, అత్యధిక మంది భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను కప్పిపుచ్చుతూ వారు ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నారు. వాస్తవ జీడీపీ గణాంకాలు చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో అసమతౌల్యత పెరుగుతోందని. ఉపాధి కల్పనలో లోటు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విమర్శలను నాగేశ్వరన్ త్రోసిపుచ్చారు. ఇండియన్ కార్పొరేట్, ఫైనాన్షియల్ రంగాలు గత దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న బ్యాలెన్స్ షీట్ ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోయాయని అన్నారు. బ్యాంకుల్లో రెండంకెల రుణ వృద్ధి నమోదవుతోందని, కంపెనీల పెట్టుబడులు ప్రారంభమయ్యాయని ఒక ఆర్టికల్‌లో పేర్కొన్నారు. -
5.5 శాతం నుంచి 6.7 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2023 క్యాలెండర్ ఇయర్ వృద్ది రేటు 5.5 శాతం అంచనాలను రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ భారీగా 6.7 శాతానికి పెంచింది. ఆర్థిక క్రియాశీలత గణనీయంగా మెరుగుపడ్డం దీనికి కారణమని తన తాజా అంతర్జాతీయ స్థూల ఆర్థిక అవుట్‌లుక్ (ఆగస్టు అప్డేట్)లో తెలిపింది. కాగా 2023 హై బేస్ నేపథ్యంలో 2024లో వృద్ధి రేటును 6.5 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. పటిష్ట సేవల రంగం, మూలధన వ్యయాలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 7.8 శాతం పెరుగుదలకు కారణంగా పేర్కొంది. 2023 ద్వితీయార్థంలో, 2024 ప్రారంభంలో ఎల్‌నినో పరిస్థితులు బలంగా ఉంటే వ్యవసాయ వస్తువుల ధరలు పెరగవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉంటుందని, ద్రవ్యోల్బణం దేశంలో తట్టుకునే రీతిలోనే ఉండే అవకాశం ఉందని అంచనావేసిన మూడీస్, ఈ నేపథ్యంలో ఆర్బీఐ రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాత) రేట్ల పెంపు ఉండకపోవచ్చని అంచనా వేసింది. జీ20 వృద్ధి తీరు ఇది... జీ–20 దేశాల వృద్ధి 2023లో 2.5 శాతంగా ఉండవచ్చని, 2024లో 2.1 శాతానికి తగ్గవచ్చని అభిప్రాయపడింది. 2022లో ఈ రేటు 2.7 శాతం. 2024 చైనా వృద్ధి రేటును 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించడం గమనార్హం. భారత్‌కు మూడీస్ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ‘బీఏఏ3’ సావరిన్ రేటింగ్‌ను అందిస్తోంది. 2023–24లో వృద్ధి రేటును 6.1 శాతంగా అంచనావేస్తోంది. 2022–23 7.2 శాతం కన్నా ఇది భారీ తగ్గుదల కావడం గమనార్హం. -
వృద్ధి వేగంలో భారత్ టాప్!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2023–24, ఏప్రిల్–జూన్) 7.8 శాతంగా నమోదయ్యింది. వ్యవసాయం, ఫైనాన్షియల్ రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శించాయి. జూన్ త్రైమాసికంలో ప్రపంచంలో మరే దేశమూ ఈ స్థాయి వృద్ధిని నమోదుచేసుకోలేదు. దీనితో వృద్ధి వేగంలో భారత్ మొదటి స్థానంలో నిలిచినట్లయ్యింది. 6.3 శాతం వృద్ధి రేటుతో భారత్ తర్వాత చైనా వృద్ధి వేగంలో రెండవ స్థానంలో నిలిచింది. అయితే క్యూ1లో 8 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా తాజా లెక్క తక్కువగా ఉండడం గమనార్హం. ఈ నెల రెండవ వారంలో జరిగిన ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5 శాతం, క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా అంచనా వేసింది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనాకు వచి్చంది. 7.8 శాతం వృద్ధి అంటే... 2011–12ని బేస్ ఇయర్‌గా తీసుకుని ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తూ లెక్కిస్తే, 2022–23 మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.37.44 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో ఈ విలువ రూ.40.37 లక్షల కోట్లకు ఎగసింది. అంటే వృద్ధి 7.8 శాతం పెరిగిందన్నమాట. కాగా ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయని (ప్రస్తుత ధరల ప్రాతిపదిక) జీడీపీ వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. విలువల్లో రూ.65.42 లక్షల కోట్ల నుంచి రూ.70.67 లక్షల కోట్లకు పెరిగింది. ► 2022–23 క్యూ1లో జీడీపీ వృద్ధి రేటు 13.1 శాతంగా ఉంది. అయితే దీనికి లో బేస్ ఎఫెక్ట్ ఒక కారణం. అంటే కరోనా కష్టకాలం 2021–22 ఇదే కాలంలో చేటుచేసుకున్న అతి తక్కువ గణాంకాలు 2022–23 క్యూ1లో అధిక రేటు (శాతాల్లో) నమోదుకు దోహదపడ్డాయి. ► తాజా గణాంకాలకు ముందు త్రైమాసికం అంటే జనవరి–మార్చి మధ్య జీడీపీ విలువ 6.1% కాగా, అంతక్రితం త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్)ఈ రేటు 4.5%. అంటే సమీక్షా కాలంసహా అంతక్రితం గత 3 త్రైమాసికాల్లో వృద్ధి రేటు పెరుగుతూ వచి్చందన్నమాట. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్– స్థూల విలువ జోడింపు అనేది ఆర్థిక వ్యవస్థలోని పరిశ్రమ, రంగం, తయారీదారు, ప్రాంతం లేదా ప్రాంతం ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువ. ఉత్పత్తి వ్యయాలను ఇందులో చేర్చరు) ప్రకారం వివిధ రంగాల వృద్ధి తీరును పరిశీలిస్తే.. జూలైలో మౌలిక రంగం ఓకే... ఎనిమిది రంగాల భారత్ మౌలిక పరిశ్రమ జూలైలో మంచి పనితీరును కొనసాగించింది. బొగ్గు , క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, స్టీల్, సిమెంట్, విద్యుత్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాలు వీటిలో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వీటి వెయిటేజ్ 40.27 శాతం. ఐఐపీ జూలై డేటా సెపె్టంబర్ రెండవ వారం మొదట్లో వెలువడుతుంది. ఇక ఏప్రిల్ నుంచి జూలై వరకూ మౌలిక పరిశ్రమ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. కాగా, జూన్‌లో మౌలిక రంగం వృద్ధి రేటు 8.3 శాతం కావడం గమనార్హం. 2022 ఏప్రిల్–జూలై మధ్య ఈ రేటు 11.5 శాతం. జూలైలో మౌలిక రంగం ఓకే... ఎనిమిది రంగాల భారత్ మౌలిక పరిశ్రమ జూలైలో మంచి పనితీరును కొనసాగించింది. బొగ్గు , క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, స్టీల్, సిమెంట్, విద్యుత్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాలు వీటిలో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వీటి వెయిటేజ్ 40.27 శాతం. ఐఐపీ జూలై డేటా సెపె్టంబర్ రెండవ వారం మొదట్లో వెలువడుతుంది. ఇక ఏప్రిల్ నుంచి జూలై వరకూ మౌలిక పరిశ్రమ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. కాగా, జూన్‌లో మౌలిక రంగం వృద్ధి రేటు 8.3 శాతం కావడం గమనార్హం. 2022 ఏప్రిల్–జూలై మధ్య ఈ రేటు 11.5 శాతం. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.5% వృద్ధి సాధించే సత్తా భారత్‌కు ఉంది. ధరల కట్టడికి ప్రభుత్వం, ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అందువల్ల ద్రవ్యోల్బణం భయాలు అక్కర్లేదు. – వి. అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
ఆశావహ బాటనే ఎకానమీ... అంచనాలన్నీ అనుకూలమే..
అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ భారత్ ఎకానమీ పురోగతి బాటనే నడుస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదని విశ్లేషణా సంస్థలు పేర్కొంటున్నాయి. వృద్ధి, ద్రవ్యోల్బణం, ఎగుమతులు తక్షణం ఎకానమీ పురోగతికి అనుగుణంగా ఉంటాయన్నది వాటి అభిప్రాయం. స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని విశ్లేషణలను పరిశీలిస్తే... న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో 8.5 శాతానికి చేరుకుంటుందని ఇక్రా రేటింగ్స్ మంగళవారం ఒక నివేదికలో పేర్కొంది. గత జనవరి–మార్చి త్రైమాసికంలో నమోదైన 6.1 శాతం వృద్ధిరేటు నుంచి గణనీయంగా కోలుకుంటుందని వివరించింది. వేగవంతమైన వృద్ధికి విస్తృత స్థాయిలో డిమాండ్, సేవల రంగంలో రికవరీ కారణమని పేర్కొంది. మొదటి త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)అంచనాలు 8.1 శాతం మించి ఇక్రా అంచనాలు ఉండడం గమనార్హం. సేవల డిమాండ్‌లో నిరంతర పురోగతి, మెరుగైన పెట్టుబడి కార్యకలాపాలు, ముఖ్యంగా ప్రభుత్వ మూలధన వ్యయంలో పెరుగుదల, కొన్ని రంగాలలో మార్జిన్లు పెరగడం, వివిధ వస్తువుల ధరలు అదుపులోనికి రావడం వంటి అంశాలు జూన్ జూన్ త్రైమాసికానికి సంబంధించి తమ వృద్ధి అంచనాను పెంచాయని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితీ నాయర్ తెలిపారు. కేంద్రం, 23 రాష్ట్ర ప్రభుత్వాల (అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, గోవా, మణిపూర్, మేఘాలయ మినహా) మొత్తం మూలధన వ్యయం మొదటి త్రైమాసిక వ్యయం 76 శాతం పెరిగి రూ.1.2 లక్షల కోట్లకు, నికర రుణాలు 59.1 శాతం పెరిగి రూ.2.8 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆమె వెల్లడించారు. ఆధునికీకరణ, కొత్త ప్రాజెక్టులు, మూలధన వస్తువుల దిగుమతుల ప్రయోజనం కోసం మూల ధన సంబంధిత అంతర్జాతీయ వాణిజ్య రుణాలు క్యూ1లో 13.0 బిలియన్ డాలర్లని పేర్కొన్న నివేదిక, 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో పోల్చితే (9.6 బిలియన్ డాలర్లు) అధికమని పేర్కొంది. కాగా, ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఇంకా కొంత అనిశ్చితి నెలకొన్నట్లు పేర్కొంది. 6 శాతం వృద్ధి మాత్రమే నమోదుకావచ్చని అంచనావేసింది. ద్రవ్యోల్బణం ఒత్తిడి తాత్కాలికమే ఆర్థికశాఖ నివేదిక టమోటా ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆహార పదార్థాలపై ధరల ఒత్తిడి తాత్కాలికంగానే ఉంటుందని మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే పెరిగిన ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం, ఆర్బీఐ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మూలధన వ్యయం కోసం పెంచిన కేటాయింపులు ఇప్పుడు ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదలకూ దారితీస్తున్నాయని పేర్కొన్న ఆర్థిక మంత్రిత్వశాఖ.. దేశీయ వినియోగం, పెట్టుబడి డిమాండ్ వృద్ధిని ముందుకు తీసుకువెళతాయని తన జూలై నెలవారీ ఎకనామిక్ రివ్యూలో పేర్కొంది. జూలైలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దాటి 15 నెలల గరిష్ట స్థాయిలో 7.44 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఆర్థికశాఖ ఎకానమీకి సంబంధించి తాజా భరోసాను ఇచి్చంది. ద్రవ్యోల్బణం తగ్గుదలకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోందని, కొత్త స్టాక్ కూడా మార్కెట్లోకి వస్తోందని ఆర్థికశాఖ తెలిపింది. ఇవన్నీ ద్రవ్యోల్బణం కట్టడికి దారితీస్తాయని విశ్లేíÙంచింది. తగిన రుతుపవనాలు, ఖరీఫ్ సాగు గణనీయమైన పురోగతితో వ్యవసాయ రంగం ఊపందుకుంటోందని అంచనావేసింది. గోధుమలు, బియ్యం సమీకరణ బాగుందని తెలిపింది. దేశంలో ఆహార భద్రతను పెంచడానికి ఆహార ధాన్యాల బఫర్ స్టాక్ స్థాయిలను కేంద్రం పెంచుతుందని తెలిపింది. ప్రైవేట్ రంగం పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) 14 కీలక రంగాలకు ప్రోత్సాహకాలను అందిస్తోందన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. పీఎం గతి శక్తి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ)తో కలిసి కొత్త మౌలిక సదుపాయాలను సృష్టించడంలో ప్రైవేట్–రంగం భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపింది. 800 బిలియన్ డాలర్లు దాటిన విదేశీ వాణిజ్యం సేవల రంగం సాయం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మందగించినప్పటికీ, 2023 ప్రథమార్థంలో భారతదేశం సేవల విభాగాలలో ఆరోగ్యకరమైన పెరుగుదల.. దేశం మొత్తం అంతర్జాతీయ వాణిజ్యానికి భరోసాను అందించిందని ఆర్థిక విశ్లేషనా సంస్థ–గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) తన తాజా నివేదికలో పేర్కొంది. 2023 జనవరి–జూన్ మధ్య భారత్ వస్తువులు, సేవల వాణిజ్యం 800 బిలియన్ డాలర్లు దాటినట్లు జీటీఆర్ఐ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, సమీక్షా కాలంలో వస్తు, సేవల ఎగుమతులు 1.5 శాతం పెరిగి 385.4 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు ఇదే కాలంలో 5.9 శాతం ఎగసి 415.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక వేర్వేరుగా చూస్తే.. వస్తు ఎగుమతులు 8.1 శాతం తగ్గి 218.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు 8.3 శాతం క్షీణించి 325.7 బిలియన్ డాలర్లకు పడ్డాయి. కాగా, సేవల ఎగుమతులు మాత్రం 17.7 శాతం పెరిగి 166.7 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 3.7 శాతం పెరిగి 89.8 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎస్బీఐ అంచనా 8.3 శాతం బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మొదటి త్రైమాసికంలో 8.3 శాతం వృద్ధి అంచనాలను వేసింది. ఆర్బీఐ అంచనాలకు మించి ఈ విశ్లేషణ నమోదుకావడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంలో 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని తమ 30 హై ఫ్రీక్వెన్సీలతో కూడిన ఆరి్టఫిషియల్ న్యూట్రల్ నెట్వర్క్ (ఏఎన్ఎన్) అంచనా వేస్తున్నట్లు గ్రూప్ చీఫ్ ఎకమిస్ట సౌమ్య కాంతి ఘోష్ ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, జూలై–సెపె్టంబర్లో 6.5 శాతం, అక్టోబర్–డిసెంబర్ మధ్య 6 శాతం, జనవరి–మార్చి (2024)లో 5.7 శాతం వృద్ధి నమోదవుతుంది. ఆర్బీఐ ఈ నెల మొదట్లో జరిగిన పాలసీ సమీక్ష 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5 శాతం, క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనా. -
జూలైలో సేవలు సూపర్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం జూలైలో అద్భుత పనితీరు కనబరిచింది. ఇందుకు సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సరీ్వసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ పదమూడేళ్ల గరిష్ట స్థాయి 62.3కు ఎగసింది. జూన్‌లో సూచీ 58.5 వద్ద ఉంది. అయితే సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. ఈ ప్రాతిపదికన సేవల పీఎంఐ గడచిన 24 నెలలుగా అప్‌ట్రెండ్‌లోనే కొనసాగుతోంది. సేవలు–తయారీ కలిపినా స్పీడే... కాగా, సేవలు, తయారీ రంగంతో కూడిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ జూలైలో 61.9కు ఎగసింది. జూన్‌లో ఇది 59.4 వద్ద ఉంది. కాగా, భారత్ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగాన్ని చూస్తే, జూలైలో వరుసగా 25వ నెల వృద్ధి బాటన నిలిచింది. జూలైలో సూచీ 57.7 వద్ద పటిష్టంగా ఉంది. అయితే జూన్‌కన్నా (57.8) స్వల్పంగా తగ్గింది. -
2023–24లో 6.4 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతంగా కొనసాగుతుందన్న తన అంచనాలను ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) పునరుద్ఘాటించింది. దేశీయ డిమాండ్ ఆర్థిక క్రియాశీలతకు దోహదపడే ప్రధాన అంశంగా పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగ రికవరీ బాగుందని పేర్కొన్న ఏడీబీ, అంతర్జాతీయ అనిశి్చతుల దేశీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తన ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ) విశ్లేíÙంచింది. ఇక 2023–24లో 5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను తాజాగా 4.9 శాతానికి ఏడీబీ తగ్గించింది. క్రూడ్ ఆయిల్ ధరల్లో కొంత తగ్గుదల దీనికి కారణంగా పేర్కొంది. సాధరణ వర్షపాతం, ఇతర వాతావరణ అంశాలను పరిగణనలోకి తీసుకుని (తదుపరి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఏవీ ఉండబోవన్న అంచనా ప్రాతిపదికన) 2023–24లో 6.4 శాతం, 2024–25లో 6.7 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నట్లు అవుట్‌లుక్ పేర్కొంది. కాగా, ఆసియా, పసిఫిక్‌లో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు సగటున 4.8 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటాయని ఏడీబీ అవుట్‌లుక్ అంచనా వేసింది. చై నా ఎకానమీ వృద్ధి రేటును 5 శాతంగా అంచనావే సింది. 2025లో ఈ రేటును 4.5 శాతంగా పేర్కొంది. -
భారత్ ఎకానమీకి ‘వినియోగం’ రక్ష
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2026–27 ఆర్థిక సంవత్సరం వరకూ సగటున 6.7 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ సీనియర్ ఎకనమిస్ట్ (ఆసియా–పసిఫిక్) విశ్రుత్ రాణా అంచనావేశారు. దేశీయ వినియోగమే ఎకానమీ పురోగతికి ప్రధాన కారణంగా ఉంటుందని ఆయన విశ్లేషించారు. 2022–23లో ఎకానమీ వృద్ధి రేటు 7.2 శాతంకాగా, ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6 శాతంగా ఉంటుందని ఒక వెబినార్‌లో పేర్కొన్నారు. ఎగుమతుల పరంగా ఎదురవుతున్న సవాళ్లు వృద్ధి రేటుకు కొంత ప్రతికూలంగా ఉన్నాయని అన్నారు. వడ్డీరేట్ల పెంపు, వినియోగ డిమాండ్‌పై ఈ ప్రతికూలతలు తక్షణం ఎకానమీ బలహీనతకు కారణంగా పేర్కొన్నారు. 2022–23 వృద్ధికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 6.5 అంచనాలకన్నా విశ్రుత్ రాణా అంచనా (6 శాతం) తక్కువగా ఉండడం గమనార్హం. కాగా పెట్టుబడుల పరంగా చూస్తే దేశీయ రికవరీ పటిష్టంగా ఉందని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్నప్పటికీ, వడ్డీరేట్లను తగ్గించేందుకు ఆర్బీఐ తొందరపడబోదన్నది తమ అభిప్రాయమన్నారు. ద్రవ్యోల్బణం అంచనాలు పూర్తిగా తగ్గే వరకు ఆర్బీఐ నిరీక్షిస్తుందని, రేట్లను తగ్గించడానికి 2024 ప్రారంభం వరకు వేచి ఉండవచ్చని రాణా అభిప్రాయపడ్డారు. -
జూన్ త్రైమాసికంలో వృద్ధి 6.3 శాతంలోపే..: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 6 నుంచి 6.3 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ అంచనావేసింది. ప్రభుత్వానికి అంచనాలకన్నా తక్కువ ఆదాయాలు నమోదయ్యే అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత వారం ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వేసిన 8 శాతం అంచనాలకన్నా తాజా మూడీస్ అంచనా ఎంతో దిగువన ఉండడం గమనార్హం. 2022–23 చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో నమోదయిన 6.1 శాతానికి దాదాపు సరిసమానంగా ఉండడం మరో విశేషం. వ్యవస్థలో అధిక వడ్డీరేట్లు పెట్టుబడులపై ప్రభావం చూపుతాయని కూడా మూడీస్ అభిప్రాయపడింది. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేట్లు వరుసగా 6.1 శాతం, 6.3 శాతాలుగా నమదవుతాయని మూడీస్ అంచనా. మూడీస్ భారత్‌కు ప్రస్తుతం ‘బీఏఏ3’ రేటింగ్ ఇస్తోంది. ఇది అత్యంత దిగువ ఇన్వెస్ట్మెంట్ స్థాయి. చెత్త రేటింగ్కన్నా ఒక అంచె ఎక్కువ. మరో రెండు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజాలు ఫిచ్, ఎస్అండ్పీ కూడా భారత్‌కు ఇదే తరహా రేటింగ్ ఇస్తున్నాయి. -
ఈ ఏడాది వృద్ధి 6 శాతానికిపైనే
భారత్ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి 7.2 శాతం వృద్ధి రేటును సాధించడం, దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం,అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాల నేపథ్యంలో ఎకానమీపై తాజా అంచనాలను పరిశీలిస్తే.. 2023–24లో వృద్ధి అంచనాలు అప్ అంతర్జాతీయ వృద్ధి అవుట్‌లుక్ బాగుంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖంగా పయనిస్తున్నాయి. సేవల ఎగుమతులు మెరుగుపడుతున్నాయి. 2022–23 క్యూ4లో భారత్ వృద్ధి అంచనాలకు మించి మెరుగ్గా 6.1 శాతంగా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో భారత్ ఎకానమీ ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నాం. వెరసి 2023–24లో వృద్ధి 6.2 శాతంగా ఉండవచ్చు. ఇక భారత్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే 2023–24లో క్రితం అంచనాలు 5.3 శాతంకన్నా తక్కువగా 5.1 శాతంగా సగటు నమోదుకావచ్చు. ప్రపంచ వృద్ధి అంచనాలను ఇప్పటికే 50 బేసిస్ పాయింట్లు పెంచి 2.6 శాతానికి పెంచడం జరిగింది. చైనా, యూరోపియన్ యూనియన్, అమెరికా నుంచి వెలువడుతున్న గణాంకాల సానుకూలత దీనికి కారణం. క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలో ఉన్న అనిశ్చితి పరిస్థితి ఇప్పుడు కనిపించడంలేదు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. – యూబీఎస్, స్విస్ బ్రోకరేజ్ సంస్థ ఈ సారీ రేట్ల పెంపు ఉండకపోవచ్చు ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలో ఉన్న నేపథ్యంలో జూన్ 8వ తేదీ సమీక్షా సమావేశంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటులో ఎటువంటి మార్పూ చేయకపోవచ్చు. మార్చిలో 5.7 శాతం వద్ద ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి దిగివచ్చిన సంగతి తెలిసిందే. 2023లో సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా నమోదుకావచ్చు. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కన్నా ఇది తక్కువ. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో మే 2022 నుంచి ఆరు దఫాలుగా రెపో రేటును ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ పెంచుతూ వచ్చింది. ఈ కాలంలో రేటు 4 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. అయితే ఏప్రిల్ పాలసీ సమీక్షా సమావేశంలో అందరి అంచనాలకూ భిన్నంగా రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయించింది. అయితే భవిష్యత్ నిర్ణయం ద్రవ్యోల్బణం కట్టడిపై ఆధారపడి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. – గోల్డ్‌మన్ శాక్స్, వాల్‌స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ 2023–24లో 6.7% వరకూ.. దేశీయంగా పటిష్టంగా ఉన్న ఆర్థిక ఫండమెంటల్స్, ప్రభుత్వం భారీ మూలధన పెట్టుబడుల మద్దతుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.5–6.7 శాతం శ్రేణిలో వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. 2022–31 దశాబ్ద కాలంలో భారత్ సగటున అంతక్రితం దశాబ్దంతో పోల్చితే (6.6 శాతం) భారీగా 7.8 శాతం వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణాత్మక చర్యలు భారత్‌ను చక్కటి వృద్ధి పథంలో నడిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాం. భారతదేశం జీ–20 అధ్యక్ష పదవిని చేపట్టిన దృష్ట్యా, ఈ సంవత్సరం దేశానికి చాలా ముఖ్యమైనది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. దీని నుండి ఉత్పన్నమయ్యే అవకాశాలు మనకు ముఖ్యమైనవి. ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలో ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. భారత్ వృద్ధికి దోహదపడే అంశం ఇది. – ఆర్ దినేష్, కొత్తగా ఎన్నికైన సీఐఐ ప్రెసిడెంట్ -
భారత్ జీడీపీ జూమ్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 6.1 శాతంగా నమోదయ్యింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఫిబ్రవరిలో విడుదల చేసిన రెండవ అడ్వాన్స్ అంచనాలు 7 శాతం కన్నా ఇది అధికం కావడం గమనార్హం. వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాలు చక్కటి పనితీరును ప్రదర్శించినట్టు బుధవారం విడుదలైన గణాంకాలు వెల్లడించాయి. చైనా వృద్ధి రేటు చివరి త్రైమాసికంలో 4.5 శాతంగా నమోదయ్యింది. దీనితోపాటు ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను పోల్చితే భారత్ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోంది. తాజా గణాంకాలతో గణనీయమైన పురోగతితో వార్షికంగా 3.3 ట్రిలియన్ డాలర్లకు ఎగసిన ఎకానమీ విలువ వచ్చే కొద్ది సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జీడీపీ లెక్కలు ఇలా.. 2011–12 స్థిర ధరల వద్ద (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసి) 2021–22 జనవరి–మార్చి త్రైమాసికంలో జీడీపీ విలువ రూ.41.12 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో (2022–23 జనవరి–మార్చి) ఈ విలువ రూ.43.62 లక్షల కోట్లు. వెరసి నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 6.1 శాతమన్నమాట. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరంలో చూస్తే... ఈ విలువలు 2021–22తో పోల్చిచూస్తే 2022–23లో రూ.149.26 లక్షల కోట్ల నుంచి రూ.160.06 లక్షల కోట్లకు పెరిగాయి. వెరసి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంది. 2021–22లో వృద్ధి రేటు 9.1 శాతం అయినప్పటికీ, బేస్ తక్కువగా ఉండడం (2020–21లో కరోనా కష్టకాలంలో వృద్ధిరేటు భారీగా పడిపోవడం) దీనికి ప్రధాన కారణం. అయితే 2021–22 చివరి త్రైమాసికం 4 శాతంతో పోల్చితే తాజా లెక్కలు మెరుగ్గా ఉండడం గమనార్హం. జీవీఏ లెక్క ఇదీ... కేవలం వివిధ రంగాల ఉత్పత్తి విలువకు సంబంధించిన– గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) వృద్ధి రేటు 2022–23లో 7%గా ఉంది. 2021–22లో రేటు 8.8 శాతం. జీవీఏ ప్రకారం మార్చి త్రైమాసికం వృద్ధి రేటు పరిశీలిస్తే... ► తయారీ రంగం పురోగతి 2021–22 మార్చి త్రైమాసికంలో 0.6% ఉంటే, 2022–23 మార్చి త్రైమాసికంలో 4.5%గా నమోదయ్యింది. ► మైనింగ్ ఉత్పత్తి వృద్ధి ఇదే కాలంలో 2.3 శాతం నుంచి 4.3 శాతానికి ఎగసింది. ► నిర్మాణ రంగం విషయంలో భారీగా 4.9 శాతం నుంచి 10.4 శాతానికి చేరింది. ► వ్యవసాయ రంగం పురోగతి 4.1 శాతం నుంచి 5.5 శాతానికి చేరింది. 2022–23 వృద్ధి (%) క్యూ1 13.1 క్యూ2 6.2 క్యూ3 4.5 క్యూ4 6.1 సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది ప్రపంచ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.2 శాతం వార్షిక వృద్ధిని నమోదుచేసుకోవడం హర్షణీయ పరిణామం. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని, సూచీల దృఢమైన పనితీరును, ఆశాజనక పరిస్థితిని గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. – ప్రధాని నరేంద్ర మోదీ అంచనాలకు మించి.. తాజా ఆర్థిక పురోగతిని పరిశీలిస్తే, ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీ తొలి 6.5% అంచనాలను మించి వృద్ధి సాధించే అవకాశా లు కనిపిస్తున్నాయి. వివిధ అంతర్జాతీయ సంస్థల అంచనాలను మించి 2022–23 ఎకానమీ గణాంకాలు నమోదుకావడం భారత్ సవాళ్లను ఎదుర్కొనగలిగిన పరిస్థితికి అద్దం పడుతోంది. – వి. అనంత నాగేశ్వరన్, సీఈఏ -
జీడీపీ గణాంకాలపైనే దృష్టి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆధారపడి కదలనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2022–23)తోపాటు చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) స్థూల దేశీయోత్పత్తి గణాంకాలను ప్రభుత్వం ఈ నెల 31న విడుదల చేయనుంది. పూర్తి ఏడాదికి ప్రొవిజనల్ గణాంకాలు వెల్లడికానున్నాయి. వీటికితోడు మే నెల ఆటో రంగ విక్రయాలు, తయారీ రంగ గణాంకాలు(పీఎంఐ) సైతం విడుదల కానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ప్రధానంగా క్యూ4 జీడీపీ, ఆటో విక్రయాలపై దృష్టి పెట్టనునన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఫలితాల స్పీడ్ ఇప్పటికే గతేడాది క్యూ4(జనవరి–మార్చి) ఫలితాల సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ బాటలో వారాంతాన ఓఎన్జీసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పీటీసీ, అరబిందో ఫార్మా, బాలకృష్ణ ఇండస్ట్రీస్ క్యూ4 పనితీరు వెల్లడించాయి. ఈ బాటలో అదానీ ట్రాన్స్మిషన్, క్యాపంస్ యాక్టివ్‌వేర్, ఇప్కా ల్యాబొరేటరీస్, డీసీఎం, ఐఆర్సీటీసీ, జిందాల్ పాలీఫిల్మŠస్, జూబిలెంట్ ఫార్మోవా, నాట్కో ఫార్మా, ఎన్బీసీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్ఐఐటీ, రైల్ వికాస్ నిగమ్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్ తదితరాలు క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇతర అంశాలు తొలుత విడుదలైన రుతుపవన అంచనాల ప్రకారం ఈ ఏడాది సాధారణ వర్షపాతానికి వీలుంది. ఇకపై వెలువడనున్న రుతుపవన తాజా అంచనాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంట అంశాలు సైతం మార్కెట్లో ట్రెండ్‌ను నిర్దేశించగలవని విశ్లేషకులు వివరించారు. కాగా.. అమెరికా రుణ పరిమితి పెంపు అంశంపై ఈ వారం మరిన్ని చర్చలకు తెరలేవనుంది. గడువు ముగిసేలోగా ఇందుకు అనుమతి పొందాలని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. రుణ పరిమితి పెంపు 31.2 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. గత వారం ఇలా.. పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు పటిష్ట లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 772 పాయింట్లు జమ చేసుకుని తిరిగి 62,000 పాయింట్ల ఎగువన 62,502కు చేరింది. నిఫ్టీ 296 పాయింట్లు ఎగసి 18,499 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ మరింత అధికంగా 2.5 శాతం జంప్‌చేయగా.. స్మాల్ క్యాప్ 1.4 శాతం బలపడింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు రూ. 37,317 కోట్ల పెట్టుబడులు కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌పట్ల ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ(మే 2–26) నికరంగా రూ. 37,317 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇది గత ఆరు నెలల్లోనే అత్యధికంకాగా.. స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, ఆకర్షణీయ స్థాయికి చేరిన షేర్ల ధరలు వంటి అంశాలు ఇందుకు కారణమవుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఇంతక్రితం ఎఫ్‌పీఐలు 2022 నవంబర్‌లో మాత్రమే ఈ స్థాయిలో రూ. 36,239 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఈ బాటలో 2023 ఏప్రిల్‌లో రూ. 11,630 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. మార్చిలో రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్ సొంతం చేసుకున్నారు. అయితే 2023 జనవరి, ఫిబ్రవరిలలో ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 34,000 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనార్హం! -
మాంద్యంలోకి జర్మనీ ఎకానమీ
బెర్లిన్: యూరోప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన జర్మనీ మాంద్యంలోకి జారిపోయింది. 2023 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) దేశ స్థూల దేశీయోత్పత్తి 0.3 శాతం క్షీణించినట్లు ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాంకాలు పేర్కొన్నాయి. 2002 చివరి త్రైమాసికం అంటే అక్టోబర్–డిసెంబర్ మధ్య దేశ జీడీపీ 0.5 శాతం క్షీణించింది. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయితే దానిని ఆ దేశం మాంద్యంలోకి జారినట్లు పరిగణించడం జరుగుతుంది. అధిక ధరలు వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఎకనమిస్టులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం ఏకంగా 7.2 శాతంగా ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. (ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా) మరిన్ని బిజినెస్వార్తలు, ఇ ంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
జీడీపీలో వ్యక్తిగత ఆదాయపు పన్ను నిష్పత్తి 3% అప్
న్యూఢిల్లీ: భారత్ వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు దేశ 2021–22 స్థూల దేశీయోత్పత్తిలో 2.94 శాతానికి చేరాయి. 2014–15లో ఈ నిష్పత్తి 2.11 శాతంగా ఉంది. ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య విస్తరిస్తున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడానికి తీసుకున్న వివిధ చర్యల ప్రభావం గురించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ)తో జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, 2014–15లో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను) రూ.2.65 లక్షల కోట్లుకాగా, ఈ పరిమాణం రూ.6.96 లక్షల కోట్లకు చేరింది. ఇక తాజాగా ‘న్యూ ట్యాక్స్ డిడక్టెడ్ యట్ సోర్స్ (టీడీఎస్) కోడ్స్ తీసుకురాడంతో ఈ లావాదేవీ సంఖ్య దాదాపు రెట్టింపై 70 కోట్ల నుంచి (2015–16 ఆర్థిక సంవత్సరంలో)144 కోట్లకు (2021–22 ఆర్థిక సంవత్సరం) ఎగసింది. సత్వర నిర్ణయాలు అవసరం: సీతారామన్ పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడం, పెండింగులో ఉన్న న్యాయ వివాదాల పరిష్కారం, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని కొన్ని సెక్షన్ల కింద రాయితీల మంజూరు వంటి పలు అంశాలపై సీబీడీటీ అధికారులతో ఆర్థిక మంత్రి సమీక్షా సమావేశం చర్చించింది. పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన అన్ని దరఖాస్తులపై సీబీడీటీ సకాలంలో తగిన చర్యలను, నిర్ణయాలను తీసుకోవాలని, ఆయా దరఖాస్తులను పరిష్కరించడానికి తగిన కాలపరిమితిని నిర్దేశించుకోవాలని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. ప్రత్యక్ష పన్ను చట్టాలు, నియమ–నిబంధనలకు సంబంధించి పన్ను చెల్లింపుదారుల్లో అవగాహనను పెంచడానికి ప్రయత్నాలను విస్తరించాలని కూడా సీబీడీటీకి ఆమె సూచించారు. ఆర్థిక మంత్రితో జరిగిన సీబీడీటీ సమీక్షా సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, బోర్డ్ చైర్మన్ నితిన్ గుప్తా తదితర సభ్యులు పాల్గొన్నారు. -
భారత్ వృద్ధి రేటు 5.9 శాతమే!
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో (2023–24) 5.9 శాతానికి పరిమితం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా అంచనావేసింది. ఈ మేరకు క్రితం 6.1 శాతం అంచనాలకు 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. అయితే 5.9 శాతం వృద్ధి సాధించినప్పటికీ, ఇది ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి రేటు కావడం గమనార్హం. సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్ట పనితీరును కనబరుస్తుందని అభిప్రాయపడింది. కాగా, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతంగా ఐఎంఎఫ్ ప్రపంచ వార్షిక ఎకనమిక్ అవుట్‌లుక్ అంచనావేస్తోంది. 2024–25లో భారత్ వృద్ధి రేటు అంచనాలను సైతం క్రితం (జనవరిలో) 6.8 శాతం అంచనాల నుంచి అవుట్‌లుక్ 6.3 శాతానికి తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా భారత్ వృద్ధికి సంబంధించి ఐఎంఎఫ్ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. 2022–23లో 7 శాతం, 2023–24లో 6.4 శాతం వృద్ధిని ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2022–23 భారత్ జీడీపీ అధికారిక గణాంకాలు వెలువడాల్సి ఉంది. నివేదికలో మరికొన్ని అంశాలు చూస్తే... ► 2023లో చైనా వృద్ధి రేటు 5.2 శాతంగా ఉంటుంది. 2024లో ఈ రేటు 4.5 శాతానికి తగ్గుతుంది. అయితే 2022లో నమోదయిన 3 శాతం వృద్ధిరేటు కన్నా తాజా అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం. ► మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ఎదురవుతున్న సవాళ్ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్నట్లే కనబడుతోంది. చైనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. సరఫరాల సమస్యలు తొలుగుతున్నాయి. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా సెంట్రల్ బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానమే వృద్ధికి ప్రతికూలతలు సృష్టించవచ్చు. ► ప్రపంచ ఆర్థిక వృద్ధి 2023లో 2.8 శాతంగా నమోదుకావచ్చు. 2024లో ఈ రేటు 3 శాతానికి పెరుగుతుందని అంచనావేస్తున్నాం. ► 2022లో 8.7 శాతంగా ఉన్న గ్లోబల్ ఇన్ఫ్లెషన్ (అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం) 2023లో 7 శాతానికి, 2024లో 4.9 శాతానికి తగ్గవచ్చు. ► యూరోజోన్, బ్రిటన్లు మందగమనం అంచన నిలబడ్డాయి. యూరోజోన్‌లో 2023లో కేవలం 0.8 శాతం వృద్ది నమోదయ్యే అవకాశం ఉంది. బ్రిటన్‌లో అసలు వృద్ధిలేకపోగా 0.3 శాతం క్షీణత నమోదుకావచ్చు. అయితే 2024లో ఈ రేట్లు వరుసగా 1.4 శాతం, 1 శాతం వృద్ధి బాటకు మళ్లవచ్చు. -
డిసెంబర్ త్రైమాసికంలో క్యాడ్ 2.2 శాతం
ముంబై: దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) డిసెంబర్ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.2 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 18.2 బిలియన్ డాలర్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. రెండవ త్రైమాసికంతో పోల్చితే మూడవ త్రైమాసికంలో క్యాడ్ గణనీయంగా తగ్గింది. రెండవ త్రైమాసికంలో క్యాడ్ 30.9 బిలియన్ డాలర్లు. జీడీపీలో ఇది 3.7 శాతం. వస్తు ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు రెండవ త్రైమాసింకంతో పోల్చితే మూడవ త్రైమాసికంలో 78.3 బిలియన్ డాలర్ల నుంచి 72.7 బిలియన్ డాలర్లకు తగ్గడం క్యాడ్ తగ్గుదలకు దారితీసినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఈ కాలంలో సేవల రంగం ఎగుమతులు కూడా గణనీయంగా 24.5 శాతం మేర పెరిగాయి. అయితే నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రం 2021 ఇదే కాలంతో పోల్చితే 4.6 బిలియన్ డాలర్ల నుంచి 2.1 బిలియన్ డాలర్లరు తగ్గాయి. నికర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కూడా 5.8 బిలియన్ డాలర్ల నుంచి 4.6 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మద్య చూస్తే, కరెంట్ అకౌంట్‌లోటు జీడీపీలో 2.7 శాతంగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో ఈ లోటు 1.1 శాతం. -
భారత్ ఎకానమీపై భరోసా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7 శాతంగా నమోదవుతుందని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) జనవరిలో 25 నెలల కనిష్ట స్థాయి తరహాలోనే రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతా తగ్గుతుందని అంచనావేసింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు కట్టడిలో ఉండడం ఈ అంచనాలకు కారణమని తెలిపింది. ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6% దిగువ కు రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనావేస్తున్నాట్లు పేర్కొంది. ఈ మేరకు విడుదలైన నెల వారీ ఆర్థిక సమీక్షలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► అధిక సేవల ఎగుమతుల నుంచి పొందుతున్న లాభాలు, చమురు ధరలు అదుపులో ఉండడం, దిగుమతి ఆధారిత వినియోగ డిమాండ్‌లో ఇటీవలి తగ్గుదల కారణంగా దేశ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరంలో తగ్గుతుందని భావించడం జరుగుతోంది. ఈ పరిస్థితి రూపాయి అనిశ్చితి పరిస్థితి కట్టడికి దోహదపడుతుంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో క్యాడ్ కట్టడిలో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అవకాశం. ఈ పరిస్థితుల్లో ఫైనాన్షియల్ రంగానికి సంబంధించి అంతర్జాతీయ పరిణామాలు భారత్‌పై తీవ్ర ప్రభావం చూపబోవు. ► భారత్ సేవల రంగం ఎగుమతుల విషయంలో పురోగతి దేశానికి ఉన్న మరో బలం. కరోనా సవాళ్లు తొలగిన నేపథ్యంలో ఐటీ, నాన్–ఐటీ సేవల విషయంలో అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా పెరుగుతోంది. అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల నేపథ్యంలో దిగుమతుల బిల్లు కూడా దేశానికి కలిసి వస్తోంది. ► తైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) ఈ రేటు అంచనాలకన్నా తగ్గి 4.4 శాతంగా నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో ఎకానమీ స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేయడం జరుగుతోంది. జనవరి, ఫిబ్రవరి హై–ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా యి. 2023లో వస్తు సేవల పన్ను వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ తరహా భారీ వసూళ్లు వరుసగా 12వ నెల. ► భారతదేశ కార్పొరేట్ రంగం రుణ–జీడీపీ నిష్ప త్తి చారిత్రక రేటు కంటే తక్కువగా ఉంది. ఇది కార్పొరేట్ రంగానికి మరింత రుణం తీసుకోవడానికి తగిన వెసులుబాటును కల్పిస్తుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగించడంలో కార్పొరేట్ల రుణ ప్రొఫైల్ కీలక పాత్ర పోషిస్తుంది. -
ఏడు శాతం కంటే తక్కువే.. మరింత తగ్గే అవకాశం
ముంబై: జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తాజా అంచనా 7 శాతం కంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి రేటు మరింత తగ్గే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా అంచనాల్లో పేర్కొంది. చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి) వృద్ధి రేటు దాదాపు 4 శాతంగా ఉంటుందని కూడా పేర్కొంది. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 13.2 శాతంగా నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో 6.3 శాతంగా ఉంది. మూడవ తైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఈ రేటు అంచనాలకన్నా తగ్గి 4.4 శాతంగా నమోదయ్యింది. అయితే మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతం నమోదవుతుందని రెండవ ముందస్తు అంచనాల్లో ఎన్ఎస్ఓ పేర్కొంది. ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకావాలంటే నాల్గవ త్రైమాసికంలో కనీసం 4.1 శాతం వృద్ధి రేటు నమోదుకావాల్సి ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా 2022–23లో వృద్ధి రేటు 6.8 శాతంగానే అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ విశ్లేషకులు పరాస్ జస్రాయ్ చేసిన విశ్లేషణల్లో కొన్ని ముఖ్యాంశాలు.. ► వృద్ధి పురోగతికి పలు అవరోధాలు ఉన్నాయి. డిమాండ్ ఊపందుకోవడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఎగుమతుల్లో పురోగతి లేదు. రుణ వృద్ధి కఠిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ► ఇక ఉత్తరాదిలో వేసవి ఫిబ్రవరిలోనే తీవ్రంగా ఉంది. ఇది గోధుమ ఉత్పత్తిపై ఆందోళనలను సృష్టిస్తోంది. మార్చి– మే మధ్య వేసవి తీవ్రత మరింత ఉండే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించడం కూడా ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశం. ► నాల్గవ త్రైమాసికంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు కనీసం 4.3 శాతం నమోదవుతుందన్న అంచనాలను వేసవి తీవ్రత విఘాతం కలిగించవచ్చు. ► ఇక ద్రవ్యోల్బణం తీవ్రత గ్రామీణ వినియోగ డిమాండ్‌పై ప్రభావితం చూపే వీలుంది. మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పడిపోయిన డిమాండ్ ఇంకా నత్తనడకనే సాగుతోంది. ► మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మిగుల్లో ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ లిక్విడిటీ తగ్గుతుండడం మరో ఆందోళకరమైన అంశం. జనవరిలో బలమైన క్రెడిట్ డిమాండ్ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ నాలుగు నెలల కనిష్టం 0.43 శాతానికి తగ్గింది. 2022 డిసెంబర్లో ఇది 0.53 శాతంగా ఉంది. -
భారత్ బ్యాంకింగ్.. భేష్
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ‘స్థిర’ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ బుధవారం పేర్కొంది. ఆర్థిక వృద్ధి, మెరుగైన ఫైనాన్షియల్ పరిస్థితులు ఇందుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ‘మార్చితో ముగిసే 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కొంత తగ్గుతుందని భావిస్తున్న విషయం వాస్తవం. అయితే దేశ వృద్ధికి సంబంధించి పరిస్థితులు, ఫండమెంటల్స్ అన్నీ పటిష్టంగా ఉన్నాయి. ఆయా అంశాలు బ్యాంకింగ్ రుణ వృద్ధికి, రుణ నాణ్యతకు దోహదపడతాయి’’ అని మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ)కు సంబంధించి బ్యాంకుల రుణ నాణ్యత కొంత ఇబ్బందుల్లోనే ఉంది. వడ్డీరేట్లలో పెరుగుదల దీనికి కారణం. ► అయితే మొత్తంగా చూస్తే, రుణ నాణ్యత స్థిరంగా ఉంది. మొండిబకాయిలు (ఎన్పీఎల్) నిష్పత్తులు స్వల్పంగా తగ్గాయి. రికవరీలు, ఎప్పటినుంచో పేరుకుపోయిన రుణాల రైటాఫ్‌లు దీనికి కారణం. ► బ్యాంకుల లాభదాయకత గత కొన్నేళ్లుగా మెరుగుపడింది. రుణ–నష్టాల కేటాయింపులు (ప్రొవిజనింగ్స్) కూడా తగ్గుముఖం పడుతున్నాయి. బ్యాంకుల మూలధనం, నిధులు, లిక్విడిటీ (ద్రవ్య లభ్యత, సరఫరాలు) పరిస్థితులు స్థిరంగా ఉన్నాయి. ఆయా అంశాలు రుణ వృద్ధికి సైతం మద్దతును ఇస్తున్నాయి. ► అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. బ్యాంకింగ్‌కు స్టేబుల్ అవుట్‌లుక్ కొనసాగించడానికి ఇది కూడా ఒక కారణం. 2023–24లో భారత్ జీడీపీ వృద్ధి 5.5 శాతంగా, 2024–2025లో 6.5 శాతంగా నమోదవుతుందని భావిస్తున్నాం. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ) అంచనాలు వేస్తున్నప్పటికీ, క్లిష్ట, అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో ఇది తగిన వృద్ధి రేటే. దీనికి దేశీయ వినియోగ డిమాండ్, ప్రభుత్వ మూలధన వ్యయాలు మద్దతును ఇస్తున్నాయి. ► ప్రైవేట్ కార్పొరేట్ల నుంచి కూడా రుణ డిమాండ్ బలంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. ద్రవ్యోల్బ ణం వంటి క్లిష్ట అంశాలు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను పెంచడం, కంపెనీలు తమ ఫైనాన్సింగ్ అవసరాలను తక్కువ వ్యయాలతో తీర్చుకోవడానికి దేశీయ బ్యాంకుల వైపు మొగ్గు చూపడం వంటి అంశాలు ఈ అంచనాలకు కారణం. వృద్ధి అంచనా పెంపు 2023–24 భారత్ అంచనాలను కిత్రం 4.8 శాతం నుంచి 5.5 శాతానికి పెంచుతున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్లో మూలధన కేటాయింపుల పెంపు (2022–23లో రూ.7.5 లక్షల కోట్లుగా ఉన్న మొత్తాలను రూ.10 లక్షల కోట్లకు పెంపు. జీడీపీలో 3.3 శాతం) దీనికి కారణం. అయితే 2022–23కు సంబంధించి తన అంచనాలను 7 శాతం నుంచి (నవంబర్‌లో అంచనా) 6.8 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. 2024–25 లో వృద్ధి అంచనాలను 6.5 శాతంగా తన గత తాజా గ్లోబల్ మ్యాక్రో అవుట్‌లుక్‌లో పేర్కొంది. జీ20 దేశాల పురోగతి ఇలా... ఇక జీ20 దేశాల వృద్ధి 2022లో 2.7 శాతంగా ఉంటే, 2023లో 2 శాతానికి తగ్గుతుందని మూడీస్ అంచనావేసింది. అయితే 2024లో 2.4 శాతానికి మెరుగవుతుందని తెలిపింది. చైనాకు సంబంధించి వృద్ధి రేటు 2022ల 3 శాతం ఉంటే, 2023లో 5 శాతానికి మెరుగుపడుతుందని తెలిపింది. దీని ప్రకారం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్ కొనసాగిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
తగ్గిన వృద్ధి వేగం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం తగ్గుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులతో పాటు దేశంలో కీలక తయారీ రంగం కుంటుపడటం ఎకానమీ మందగమనానికి కారణమవుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) మంగళవారం విడుదల చేసిన అక్టోబర్–నవంబర్–డిసెంబర్ (3వ త్రైమాసికం) గణాంకాల ప్రకారం, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం గడచిన రెండు త్రైమాసికాల్లో (జూన్, సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 13.5 శాతం, 6.3 శాతాలుగా నమోదయ్యాయి. 2021 ఇదే కాలంలో భారత్ వృద్ధి రేటు 11.2%. ఈ లెక్కలు ఎకానమీ మందగమనాన్ని సూచిస్తున్నాయి. 2021–22 వృద్ధి రేటు 9.1 శాతానికి పెంపు 2021–22 వృద్ధి అంచనాలను ఎన్ఎస్ఓ తాజాగా క్రితం 8.7 శాతం నుంచి 9.1 శాతానికి ఎగువముఖంగా సవరించడం కొంత ఊరట కలిగించే అంశం. 2020–21లో జీడీపీ విలువ రూ.136.87 లక్షల కోట్లు. 2021–22లో ఈ విలువ రూ.149.26 లక్షల కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 9.1 శాతంగా నమోదయ్యిందన్నమాట. కరోనా తీవ్ర సంక్షోభం నేపథ్యంలో 2020–21లో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8% క్షీణతను నమోదుచేసుకుంది. ఇక తలసరి ఆదాయం 2020–21 నుంచి 2021–22కు రూ.1,27,065 నుంచి రూ.1,48,524కు పెరిగింది. పెట్టుబడులకు సంబంధించి గ్రాస్ క్యాపి టల్ ఫార్మేషన్ కరెంట్ ప్రైస్ ప్రకారం, ఇదే కాలంలో రూ.55.27 లక్షల కోట్ల నుంచి రూ.73.62 లక్షల కోట్లకు ఎగసింది. స్థూల పొదుపులు రూ.57.17 లక్షల కోట్ల నుంచి రూ.70.77 లక్షల కోట్లకు ఎగశాయి. 2022–23లో 7 శాతంగా అంచనా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఎన్ఎస్ఓ రెండవ ముందస్తు అంచనాలు పేర్కొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా (6.8 శాతం) ఇది 20 బేసిస్ పాయింట్లు అధికంకావడం గమనార్హం. 4.4 శాతం వృద్ధి ఎలా అంటే.. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన స్థిర (2011–12 బేస్ ఇయర్) ధరల వద్ద 2021–22 అక్టోబర్–డిసెంబర్ మధ్య జీడీపీ విలువ రూ.38.51 లక్షల కోట్లు. 2022–23 ఇదే కాలంలో ఈ విలువ రూ.40.19 లక్షల కోట్లుగా తొలి అంచనాలు వేయడం జరిగింది. అంటే వృద్ధి రేటు 4.4 శాతమన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ప్రస్తుత ధరల వద్ద జీడీపీ వృద్ధి రేటు 11.2% వృద్ధితో రూ.62.39 లక్షల కోట్ల నుంచి రూ.69.38 లక్షల కోట్లకు చేరింది. కీలక రంగాల తీరిది... ► తయారీ: గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ ప్రకారం (పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి దోహదపడే విధానం) 3వ త్రైమాసికంలో తయారీ రంగం ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా 1.1 శాతం క్షీణించింది. 2021 ఇదే కాలంలో ఈ రంగం కనీసం 1.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► వ్యవసాయం: మొత్తం ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ రంగంలో వృద్ధి రేటు 3.7 శాతంగా ఉంది. 2022 ఇదే కాలంలో ఈ రేటు 2.2 శాతం. ► మైనింగ్ అండ్ క్వారియింగ్: వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది. ► నిర్మాణం: నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 8.4 శాతానికి చేరింది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: వృద్ధి 6 శాతం నుంచి 8.2 శాతానికి ఎగసింది. ► ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సేవలు: వృద్ధి 9.2 నుంచి 9.7 శాతానికి చేరింది. 2022–23పై అంచనాలు ఓకే మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలు తగిన విధంగా, వాస్తవికతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. ఈ స్థాయి వృద్ధి సాధనకు భారత్ నాల్గవ త్రైమాసికంలో 5 నుంచి 4.1 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుంది. అయితే ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి భారత్ సిద్ధం కావాల్సి ఉంది. – వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
Union Budget 2022: ద్రవ్య స్థిరత్వానికి బడ్జెట్లో ప్రాధాన్యత!
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్న 2023–24 వార్షిక బడ్జెట్ ద్రవ్య స్థిరత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 2022–23లో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) రూ.16.61 లక్షల కోట్లు ఉండాలని 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంచనాలకు అనుగుణంగా 6.4 శాతంలోపునకే (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక రానున్న (2023–24) ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 5.8 శాతంగా ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా వంటి సంస్థలు అంచనావేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) దన్నుతో భారత్ పన్ను వసూళ్లు 2023 మార్చితో ముగిసే 2022–23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలకన్నా రూ.4 లక్షల కోట్ల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని స్వయంగా ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి. 2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు. అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చు. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం. 2022–23లో రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటు కట్టడికి (జీడీపీలో 6.4 శాతం వద్ద) దోహదపడే అంశం ఇది. వ్యయ ప్రతిపాదనలకు సూచన పార్లమెంట్ (రెండు భాగాల) బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుండి ఆర్థికశాఖ 2022–23కు సంబంధించి తుది వ్యయ ప్రతిపాదనలను కోరింది. గ్రాంట్లకుగాను రెండవ, తుది సప్లిమెంటరీ డిమాండ్ల ప్రతిపాదనలను ఆర్థికశాఖ కోరినట్లు ఒక అధికారిక మెమోరాండం పేర్కొంది. గ్రాంట్ల కోసం తుది సప్లిమెంటరీ డిమాండ్లను సమావేశాల్లోని రెండవ విడతలో సమర్పించే అవకాశం ఉందని సమాచారం. గత నెలలో, ప్రభుత్వం రూ. 3.25 లక్షల కోట్లకు పైగా నికర అదనపు వ్యయాన్ని అనుమతించే గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్ల మొదటి బ్యాచ్‌ను ఆమోదించింది. ఇందులో ఎరువుల సబ్సిడీ చెల్లింపునకు ఉద్దేశించిన రూ. 1.09 లక్షల కోట్లు కూడా ఉన్నాయి. ఈ అదనపు వ్యయం 2022–23 బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం కంటే అధికం. 2021–22లో బడ్జెట్ వ్యయం రూ.37.70 లక్షల కోట్లు. 2022–23లో బడ్జెట్ ప్రతిపానల్లో దీనిని రూ.37.70 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. నియంత్రణలు సడలించాలి... ఫార్మా, హెల్త్‌కేర్ పరిశ్రమ విజ్ఞప్తి ∙ ప్రోత్సాహకాల కోసం వినతి రాబోయే కేంద్ర బడ్జెట్లో ఫార్మా, హెల్త్‌కేర్ రంగానికి సంబంధించిన నిబంధనలను సరళీకృతం చేయాలని సంబంధిత వర్గాలు విజ్ఞప్తి చేశాయి. పలు ప్రోత్సాహకాలతో పాటు, ప్రభుత్వం నూతన ఆవిష్కరణలు, పరిశోధనా అభివృద్దిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దేశీయ ఫార్మా పరిశ్రమ ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల పరిమాణంలో ఉందని, 2030 నాటికి 130 బిలియన్ డాలర్లు, 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు ఎదగాలన్నది పరిశ్రమ ఆంకాంక్షని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. ఈ దిశలో బడ్జెట్లో చర్యలు ఉంటాయని భావిస్తున్నామని అన్నారు. ఔషధ పరిశ్రమ అభివృద్ధికి సహాయపడే సహాయక విధానాలు, సరళీకృత నిబంధనలు, జీఎస్టీ నిబంధనల సరళీకరణ ప్రతిపాదనలు బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా, సిప్లా, లుపిన్, గ్లెన్‌మార్క్‌లతో సహా 24 ప్రముఖ దేశీయ ఫార్మా కంపెనీల కూటమే ఐపీఏ. ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) డైరెక్టర్ జనరల్ వివేక్ సెహగల్ మాట్లాడుతూ, భారతదేశ పురోగతి బాటలో ’ఆత్మనిర్భర్ భారత్’ విజన్‌కు లైఫ్ సైన్సెస్ రంగం వాస్తవికంగా దోహదపడేలా ప్రభుత్వం విధానాలు అవసరమని అన్నారు. ప్రొడక్షన్ ఆధారిత ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం మాదిరిగానే, పరిశోధన ఆధారిత ఇన్సెంటివ్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. హెల్త్‌కేర్ రంగం విషయానికొస్తే, ప్రజలు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని పరిశ్రమల సంఘం నాథేల్త్ ప్రెసిడెంట్ శ్రవణ్ సుబ్రమణ్యం అన్నారు. ఈ దిశలో మౌలిక సదుపాయాల సామర్థ్యాలను పెంపొందించడం అత్యవసరమని పేర్కొన్నారు. అల్యూమినియంపై దిగుమతి సుంకాలు పెంచాలి అల్యూమినియం, అల్యూమినియం ఉత్పత్తులపై రాబోయే బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని కనీసం 12.5 శాతానికి పెంచాలని ఇండస్ట్రీ సంస్థ– ఫిక్కీ కోరింది. ఈ చర్య అల్యూమినియం ఉత్పత్తుల డంపింగ్‌ను అరికట్టడానికి అలాగే దేశీయ తయారీ– రీసైక్లింగ్ వృద్ధిని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం అల్యూమినియం, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో అల్యూమినియం దిగుమతులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దిగువ స్థాయి అల్యూమినియం దిగుమతుల్లో 85 శాతానికి పైగా చైనా వాటా ఉంటోందని ఒక ప్రకటనలో తెలిపింది. -
డిజిటల్ రూపీ ప్రారంభం చరిత్రాత్మక మైలురాయి
న్యూఢిల్లీ: డిజిటల్ రూపాయి ప్రారంభం ఒక చరిత్రాత్మక మైలురాయి అని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. దీనివల్ల కరెన్సీ వ్యవస్థ సామర్థ్య మరింత పెరుగుతుందని, ఆర్థిక సేవలు భారీగా విస్తరిస్తాయని తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ట్రాకర్ ప్రకారం, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 95 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 105 దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ కరెన్సీని ప్రారంభించడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు. దాదాపు 50 దేశాలు డిజిటల్ కరెన్సీని ప్రారంభించే తుది దశలో ఉండగా, 10 దేశాలు డిజిటల్ కరెన్సీని పూర్తిగా ప్రారంభించాయని పేర్కొన్నారు. పీహెచ్డీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ)నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ఆయన చేసిన ప్రకటనలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► డిజిటల్ రూపాయి చెల్లింపులు చేసే విధానంలో వినూత్నతను తీసుకువస్తుంది. అంతర్జాతీయ స్థాయి చెల్లింపుల్లో సైతం పూర్తి సులభతరమైన వెసులుబాటును కల్పిస్తుంది. ► సీబీడీసీ వినియోగదారుల ఆర్థిక పరిరక్షణకు దోహదపడటమే కాకుండా, హానికరమైన సామాజిక– ఆర్థిక పరిణామాలను నివారిస్తుంది. ప్రజలకు అవసరమైన తగిన సేవలు అందించడంలో దోహదపడుతుంది. ► ఆర్బీఐ ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ.. సీబీడీసీ–డబ్ల్యూ, అలాగే సీబీడీసీ–ఆర్‌లను భారత వ్యవస్థలో పైలట్ ప్రాతిపదికన ఆవిష్కరించింది. సీబీడీసీ–డబ్ల్యూ టోకు లావాదేవీలను సీబీడీసీ–ఆర్ రిటైల్ లావాదేవీలను సూచిస్తాయి. ► డిజిటల్ కరెన్సీ– యూపీఐ మధ్య వ్యత్యాసాన్ని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివరిస్తూ, భౌతిక కరెన్సీ తరహాలోనే సెంట్రల్ బ్యాంక్ జారీ చేసే డిజిటల్ కరెన్సీ ఆర్బీఐ నిర్వహణాలో ఉంటుంది. ఇక యూపీఐ చెల్లింపు సాధనం తద్వారా జరిగే లావాదేవీ సంబంధిత బ్యాంకు బాధ్యతకు సంబంధించినది అని చెప్పారు. -
2022లో 6.9 శాతం.. 2023లో 5.9 శాతం!
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ 2022, 2023లో వరుసగా 6.9 శాతం, 5.9 శాతం వృద్ధిని సాధిస్తుందని వాల్ స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఒక నివేదికలో అంచనా వేసింది. 2022 భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను రేటింగ్ ఏజెన్సీ ఇటీవలే 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గించిన నేపథ్యంలో గోల్డ్‌మన్ శాక్స్ ఈ నివేదికను విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... ► వరుసగా రెండు సంవత్సరాల భారీ ర్యాలీ కొనసాగే వీలుంది. డిసెంబర్ 2023 నాటికి బెంచ్‌మార్క్ నిఫ్టీ 20,500 స్థాయికి చేరుకుంటుందని అంచనా. ఇది 12 శాతం ధర రాబడిని సూచిస్తుంది. ► ఇక వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, 2022లో సగటును 6.8 శాతం, 2023లో 6.1 శాతంగా ఉండే వీలుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లక్ష్యం కన్నా ఇది అప్పటికీ ఎక్కువగానే ఉండడం గమనార్హం. ► వచ్చే డిసెంబర్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ ఇచ్చే రుణ రేటు రెపోను 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచే వీలుంది. 2023 ఫిబ్రవరిలో మరో 35 బేసిస్ పాయింట్లు పెరిగే వీలుంది. ఈ చర్యలతో రెపో రేటు 6.75 శాతానికి చేరుతుంది. మే తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా రెపో రేటును నాలుగు దఫాలుగా 4 నుంచి 5.9 శాతానికి పెంచింది. తదుపరి ద్వైమాసిక సమావేశం డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ మధ్య జరగనుంది. -
2022–23లో భారత్ వృద్ధి 6.9 శాతం
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 6.9 శాతంగా నమోదవుతుందని యూబీఎస్ ఆర్థికవేత్తలు అంచనావేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఈ రేటు మరింతగా 5.5 శాతానికి పడిపోతుందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ ఎకనమిస్టులు ఒక నివేదికలో విశ్లేషించారు. 2024–25లో 6 శాతం వృద్ధి అంచనా వేసిన సంస్థ, దీర్ఘకాలిక సగటు ఇదే స్థాయిలో కొనసాగుతుందని పేర్కొంది. ప్రపంచ వృద్ధి మందగమనం, కఠిన ద్రవ్య విధానాలు భారత్ వృద్ధి మందగమనానికి కారణమని నివేదిక పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావం తక్కువగా ఉండే దేశాల్లో భారత్ కూడా ఒకటైనప్పటికీ, ఈ ప్రతికూలతల నుంచి భారత్ ఎకానమీ తప్పించుకోలేదు. ► భారత్ వ్యవస్థీకృత వృద్ధి ధోరణి చెక్కుచెదరకుండా ఉంది. అయితే ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) వంటి స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వంపై సమీప కాలంలో భారత్ దృష్టి సారించాలి. లేదంటే తీవ్ర ప్రతికూల పరిస్థితులకు అవకాశం ఉంది. ► ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా 4 శాతం కనిష్టం నుంచి 1.90 శాతం పెరిగి 5.9 శాతానికి ఎగసిన రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది వృద్ధికి విఘాతం కలిగించే అంశం. ► కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే వినియోగదారుల వ్యయంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గృహాల కొనుగోలు శక్తి పెరిగింది. అయితే ఈ సానుకూల ప్రభావాలు వడ్డీరేట్ల పెంపు పరిణామాలతో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. పొదుపుల్లో క్షీణత నమోదుకావచ్చు. అలాగే అసంపూర్తిగా మిగిలిఉన్న లేబర్ మార్కెట్ పునరుద్ధరణ... గృహాల కొనుగోలు శక్తి, డిమాండ్‌పై ప్రభావం చూపుతుంది. ► ఈ పరిస్థితి కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికల అమలును వాయిదే వేసే అవకాశం ఉంది. ► కొన్ని క్లిష్టతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెట్టుబడులు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ప్రతికూల ఫలితాల తగ్గింపు, ప్రైవేటు మూలధనానికి ప్రోత్సాహం వంటి అవకాశాలు దీనివల్ల ఒనగూరతాయి. ► ఇక ఎగుమతుల విషయానికి వస్తే, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఉంటుంది. 450 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన కొంత క్లిష్టంగా మారవచ్చు. ► రూపాయి తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి సెంట్రల్ బ్యాంక్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగిన చర్యలు తీసుకుంటోంది. ఇతర సెంట్రల్ బ్యాంకులతో సమన్వయాన్ని సాధిస్తోంది. ► 2024లో సాధారణ ఎన్నికలను ఎదుర్కొననున్న కేంద్ర ప్రభుత్వం, వృద్ధికి మద్దతుగా ద్రవ్య స్థిరీకరణ విధానాలను కొంత నెమ్మది చేయచ్చు. ఇది ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే వీలుంది. -
ఐఎంఎఫ్ అంచనాలకు మించి భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలు 6.8 శాతం మించి నమోదవుతుందన్న విశ్వాసాన్ని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. పెరుగుతున్న మూలధన పెట్టుబడులు తమ విశ్వాసానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ వరుసగా రెండోసారి తగ్గించింది. తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా వెలువరించింది. అయితే జూలైలో దీనిని 7.4 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో రేటు అంచనాలను ఈ నెల మొదట్లో మరింతగా 6.8 శాతానికి ఐఎంఎఫ్ కుదించింది. ఈ నేపథ్యం అనంత నాగేశ్వరన్ సోమవారం చేసిన ఒక ప్రకటనలో తన తాజా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► భారతదేశ పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బహుశా ఒక కీలక మైలురాయిని దాటింది. ఇది పటిష్ట ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుతోపాటు అధిక వృద్ధికి కూడా దోహదపడే అంశం. ► ఆర్థిక, ద్రవ్య విధానలు సాధారణంగా ఒకదానికి మరోటి అనుసంధానమై ఉంటాయి. ఒకదానికొకటి సమతుల్యత కలిగి ఉంటాయి. ► దేశీయ రుణం– జీడీపీ నిష్పత్తి విషయంలో ఆందోళన లేదు. అసెట్ మానిటైజేషన్ (నిరర్ధక ఆస్తుల నుంచి ఆర్థిక ప్రయోజనం) ఈ నిష్పత్తి మరింత తగ్గుతుంది. క్రెడిట్ రేటింగ్ పెరుగుదల విషయంలోనూ ఇది సానుకూల అంశం. ► ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, తయారీ, నిర్మాణంసహా అన్ని కీలక రంగాలూ మంచి పనితీరు ప్రదర్శిస్తున్నాయి. -
లక్ష్యంలో 37.3 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి ఆరు నెలలూ ముగిసే నాటికి (సెప్టెంబర్) లక్ష్యంలో 37.3 శాతానికి చేరింది. మరిన్ని వివరాల్లో వెళితే, 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. అయితే సెప్టెంబర్ ముగిసే నాటికి ద్రవ్యలోటు రూ.6,19,849 కోట్లకు చేరినట్లు సోమవారం వెలువడిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాలు ప్రకారం.. ► సెప్టెంబర్ నాటికి పన్నులుసహా ప్రభుత్వ మొత్తం ఆదాయాలు రూ.12.03 లక్షల కోట్లు. 2022–23 బడ్జెట్ అంచనాల్లో ఇది 52.7 శాతం. ఇందులో ఒక్క పన్ను వసూళ్లు రూ.10.11 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో ఈ మొత్తం 52.3 శాతం. ► ఇక ఇదే కాలంలో ప్రభుత్వ వ్యయాలు రూ.18.23 లక్షల కోట్లు. ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ అంచనాల్లో 46.2 శాతం. ► వెరసి ద్రవ్యలోటు 6.20 లక్షల కోట్లుగా నమోదయ్యింది. -
7.2 శాతం నుంచి 7 శాతానికి డౌన్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 20 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత పెట్టింది. క్రితం 7.2 శాతం అంచనాలను 7 శాతానికి తగ్గింది. తీవ్ర ద్రవ్యోల్బణం, ద్రవ్య పరపతి విధానం కఠినతరం వంటి అంశాలు వృద్ధి అంచనాల తగ్గింపునకు కారణమని ఏడీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యిన నేపథ్యలో ఏడీబీ తాజా ‘‘ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ 2022’’ విడుదలైంది. ‘‘ధరల ఒత్తిళ్లు దేశీయ వినియోగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని అంచనా. మందగించిన గ్లోబల్ డిమాండ్, పెరిగిన చమురు ధరలు నికర ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’’ అని అవుట్‌లుక్ రిపోర్ట్ పేర్కొంది. కోత రెండవసారి.. ఏడీబీ ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ ప్రతి ఏడాదీ ఏప్రిల్‌లో విడుదలవుతుంది. 2022 ఏప్రిల్‌లో 2022–23లో 7.5 శాతం, 2023–24లో 8 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ఏడీబీ అవుట్‌లుక్ పేర్కొంది. అయితే ఈ రేట్లను జూలైలో వరుసగా 7.2 శాతం, 7.8 శాతాలకు తగ్గించింది. తాజాగా 2022–23 వృద్ధి రేటును మరింతగా 7 శాతానికి తగ్గించింది. నివేదికలో మరికొన్ని అంశాలు... ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కమోడిటీ ధరలను తీవ్రతరం చేసింది. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపింది. ► 2022–23 ఏప్రిల్–జూన్ మధ్య సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 7.3 శాతంగా ఉంది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతంకన్నా ఇది ఎంతో అధికం. ఆహార ఉత్పత్తుల ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. వినియోగ బాస్కెట్లో ఆహార ఉత్పత్తుల వెయిటేజ్ దాదాపు 45 శాతం. కూరగాయల ధరలు భారీగా 35 శాతం వరకూ పెరిగాయి. ► చైనా 2022 వృద్ధి అంచనాలు 5 శాతం నుంచి 3.3 శాతానికి కోత. జీరో–కోవిడ్ వ్యూహంలో భాగంగా లాక్డౌన్లు దీనికి ప్రధాన కారణం. రియల్టీ రంగంలో ప్రతికూలతలు, అంతర్జాతీయ డిమాండ్ తగ్గుదల వంటి అంశాలు చైనా ఎకానమీపై ప్రభావం చూపుతున్నాయి. ► సెంట్రల్ బ్యాంకుల రేట్ల పెంపు నేపథ్యంలో ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి రేటు తొలి 5.2 శాతం అంచనాలు 4.3 శాతానికి కోత. ఈ ప్రాంతం వృద్ధికన్నా చైనా వృద్ధి రేటు తగ్గుదల మూడు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. 2023 ఆసియా, పసిఫిక్ వృద్ధి రేటు అంచనా కూడా 5.3 శాతం నుంచి 4.9 శాతానికి కుదింపు. ► భారత్‌తో కూడిన దక్షిణ ఆసియా 2022 వృద్ధి రేటు అంచనా 7 శాతం నుంచి 6.5 శాతానికి కోత. 2023 విషయంలో ఈ రేటు అంచనా 7.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింపు. -
Azadi Ka Amrit Mahotsav: అప్పుడే.. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వచ్చే ఐదేళ్లపాటు స్థిరంగా ఏడాదికి తొమ్మిది శాతం వృద్ధి చెందితేనే 2028–29 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సోమవారం పేర్కొన్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో దువ్వూరి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ► ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్దేశించుకున్న ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలను సాకారం చేసుకోడానికి భారత్‌కు ఎనిమిది కీలక సవాళ్లు ఉన్నాయి. ఇందులో మొదటిది వచ్చే ఐదేళ్లలో భారత్ వరుసగా 9 శాతం చొప్పున వృద్ధిని సాధించాలి. తరువాతి అంశాల్లో కొన్ని పెట్టుబడులు పెరగాలి. ఉత్పత్పాదక మెరుగుపడాలి. విద్య, వైద్య రంగాలు పురోగమించాలి. భారీ ఉపాధి కల్పనలు జరగాలి. వ్యవసాయం మరింత తోడ్పాటును అందించాలి. ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టంగా కొనసాగుతూ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి వంటి స్థూల ఆర్థిక అంశాలు స్థిరంగా ఉండాలి. పలు రంగాల్లో ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. పాలనా వ్యవస్థ మెరుగుపడాలి. ► రాష్ట్రాలు ఇచ్చే రాయితీలపై మోడీ చర్చను ప్రారంభించారు. అనవసర సబ్సిడీల పరిస్థితికి ఏ ఒక్కరూ కారణం కాదు. అన్ని రాజకీయ పార్టీలూ ఇందుకు బాధ్యత వహించాలి. ► దేశానికి మిగులు బడ్జెట్లు లేవని, ఈ పరిస్థితుల్లో దేశానికి ఆర్థిక పరమైన భద్రతా వలయం తప్పనిసరిగా అవసరమని, కేంద్రం, రాష్ట్రాలు గుర్తించాలి. ► అప్పు తెచ్చుకున్న డబ్బు నుండి ఎలాంటి ఉచితాలను ఇవ్వాలనే అంశాన్ని కేంద్ర, రాష్ట్రాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందుకు సంబంధించి ఎంపికలు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు తరాలపై అనవసరమైన అప్పుల భారం మోపకూడదు. ► రూపాయి తన సహజ స్థాయిని కనుగొనడం అవసరమే. ఈ విషయంలో సెంట్రల్ బ్యాంక్ జోక్యం పరిమితంగానే ఉండాలి. తీవ్ర ఒడిదుడుకులను నివారించేలా మాత్రమే ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి. డాలర్ మారకంలో మినహాయిస్తే, పలు కరెన్సీలకన్నా భారత్ మెరుగైన స్థితిలో ఉంది. పలు దేశాల మారకంలో బలపడింది. -
ఈ నెల 13 బంగారం గనుల అమ్మకం!
న్యూఢిల్లీ: దేశ స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) మైనింగ్ రంగం సహకారం మరింత పెరగడానికి వ్యూహ రచన చేస్తున్న కేంద్రం ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 13 బంగారు గనులను ఈ నెల్లో వేలం వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. వీటిలో 10 ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, మరో మూడు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 10 బ్లాకుల్లో ఐదు బ్లాకుల వేలం ఆగస్టు 26న జరగవచ్చని సమాచారం. మిగిలిన ఐదు బ్లాకులను ఆగస్టు 29న వేలం వేయవచ్చని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వేలం వేయనున్న బ్లాకుల్లో... రామగిరి నార్త్ బ్లాక్, బొక్సంపల్లి నార్త్ బ్లాక్, బొక్సంపల్లి సౌత్ బ్లాక్, జవాకుల–ఎ బ్లాక్, జవాకుల–బి బ్లాక్, జవాకుల–సి బ్లాక్, జవాకుల–డి బ్లాక్, జవాకుల–ఈ బ్లాక్, జవాకుల–ఎఫ్ బ్లాక్ ఉన్నాయి. వీటికి టెండర్లను ఆహ్వానిస్తూ, గత మార్చి నెల్లో నోటీసులు జారీ అయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్ బ్లాక్‌ల వేలం కూడా ఇదే నెల్లో జరిగే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. అయితే నిర్దిష్టంగా తెలియరాలేదు. ఈ రాష్ట్రంలోని మూడు పసిడి బ్లాక్స్‌లో రెండు.. సోనపహరి బ్లాక్, ధుర్వ–బియాదండ్ బ్లాక్ రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద జిల్లా సోనభద్రలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మూడు బ్లాక్‌ల వేలానికి టెండర్లను ఆహ్వానిస్తూ, మే 21న నోటీసులు జారీ అయ్యాయి. దేశాభివృద్ధికి దన్నుగా... దేశ ఎకానమీలో గనుల భాగస్వామ్యం పెరగడానికి వ్యూహ రచన చేస్తున్నట్లు కేంద్రం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రాలు ఆగస్టు 4 నాటికి 199 మినరల్ బ్లాక్‌లను వేలం వేశాయి. 2015లో మైనింగ్ చట్టంలో సవరణ తర్వాత వేలం మార్గం ద్వారా ఖనిజ బ్లాకుల కేటాయింపు ప్రారంభమైంది. గత ఆర్థిక సంవత్సరంలో 45 మినరల్ బ్లాక్‌లను అమ్మకానికి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు వేలం ద్వారా ఆదాయంలో చాలా మంచి వాటాను పొందుతున్నాయని కేంద్రం పేర్కొంటోంది. ఈ రేసులో మొదట ఉన్న రాష్ట్రాలు ఆదాయాల వాటా విషయంలో సంతోషంగా ఉన్నాయని తెలుపుతోంది. ఖనిజాల వేలం నిబంధనలలో సవరణలు పోటీని ప్రోత్సహిస్తాయని, తద్వారా బ్లాక్‌ల విక్రయంలో మరింత భాగస్వామ్యానికి అవకాశం ఉంటుందని గనుల మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది. మినరల్స్ (ఎవిడెన్స్ ఆఫ్ మినరల్ కంటెంట్స్) రూల్స్, 2015 (ఎంఈఎంసీ రూల్స్), మినరల్స్ (ఆక్షన్) రూల్స్, 2015 (ఆక్షన్ రూల్స్)ను సవరించడానికి కేంద్ర గనుల మంత్రిత్వశాఖ పలు నిబంధనలను నోటిఫై చేసింది. వీటిలో మినరల్స్ (ఎవిడెన్స్ ఆఫ్ మినరల్స్ కంటెంట్స్) రెండవ సవరణ నిబంధనలు, 2021, మినలర్ (ఆక్షన్) నాల్గవ సవరణ నిబంధనలు, 2021 ఉన్నాయి. రాష్ట్రాలు, పారిశ్రామిక సంఘాలు, గనుల విభాగంలో నిపుణులు, ఇతర భాగస్వాములు, సాధారణ ప్రజలతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ సవరణ నియమాలు రూపొందాయి. -
RBI Repo Rate Increased: ఈఎంఐలు మరింత భారం!
ముంబై: గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత భారమయ్యేలా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక పాలసీ రేట్లను మరోసారి పెంచింది. ధరల కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు.. రెపోను మరో 50 బేసిస్ పాయింట్లు లేదా 0.5 శాతం (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో 5.4 శాతానికి చేరింది. మే నెల నుంచి రెపో రేటు 1.4 శాతం పెరిగినట్లయ్యింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నది ఈ ఇన్స్ట్రుమెంట్ ఉద్దేశం. ఈ ప్రభావంతో బ్యాంకులు కూడా వడ్డీరేట్లను ఇంకాస్త పెంచనుండటంతో రుణాలపై నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) ఎగబాకనున్నాయి. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం 2022–23లో 6.7%గా ఉంటుందన్న అంచనాలను యథాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలోనూ అంచనాను యథాతథంగా 7.2 శాతం వద్ద కొనసాగించింది. కోవిడ్–19 కన్నా పావుశాతం అధికం... తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా పావుశాతం అధికం కావడం గమనార్హం. వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది.ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది. 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 %కి) తగ్గించిన నాటి నుంచి 4% వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి ఆర్బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్ 8వ తేదీన మరో 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి. పాలసీ ముఖ్యాంశాలు... ► 2022–23లో జీడీపీ 7.2 శాతంగా అంచనా. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని పాలసీ భావిస్తోంది. ► రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1%, 6.4%, 5.8 శాతాలుగా నమోదవుతాయి. 2023–24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5%కి ఇది దిగివస్తుంది. ► భారత్ వద్ద ప్రస్తుతం 550 బిలియన్ డాలర్లకుపైగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోగలిగిన స్థాయిలో ఉన్నాయి. అధిక ఫారెక్స్ నిల్వలు ఉన్న దేశాల్లో భారత్ నాల్గవ స్థానంలో ఉంది. ► వృద్ధి ధోరణి కొనసాగేలా తగిన చర్యలు తీసుకుంటూనే ద్రవ్యోల్బణం నియంత్రణే లక్ష్యంగా సరళ పాలసీ విధానాన్ని ఉపసంహరించుకోవడంపై ద్రవ్య విధాన కమిటీ దృష్టి సారిస్తుంది. ► ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 4వ తేదీ వరకూ డాలర్ మారకంలో రూపాయి మారకపు విలువ 4.7 శాతం పతనమైంది. భారత ఆర్థిక వ్యవస్థ స్థూల ఆర్థిక మూలాధారాల బలహీనత కంటే, అమెరికా డాలర్ విలువ పెరగడం వల్ల రూపాయి విలువ మరింతగా క్షీణించింది. అయినా డాలర్ మారకంలో మిగిలిన దేశాలతో పోల్చితే భారత్ కరెన్సీ పటిష్టంగానే ఉంది. ► భారత్‌లోని తమ కుటుంబాల తరపున యుటిలిటీ, విద్య చెల్లింపుల కోసం ఎన్ఆర్ఐలు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)ను వినియోగించుకునేలా తగిన యంత్రాంగాన్ని రూపొందించనుంది. ► 2021 ఏప్రిల్–జూన్ మధ్య దేశానికి వచ్చిన ఎఫ్‌డీఐల పరిమాణం 11.6 బిలియన్ డాలర్లు అయితే, 2022 ఇదే కాలంలో ఈ పరిమాణం 13.6 బిలియన్ డాలర్లకు చేరింది. ► తదుపరి ద్వైమాసిక సమావేశం సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ మధ్య జరగనుంది. డిపాజిట్లను సమీకరించుకోండి! రుణ వృద్ధికిగాను బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ డబ్బుపై శాశ్వతంగా ఆధారపడ జాల వు. రుణ వృద్ధికిగాను బ్యాంకింగ్ తన సొంత వనరులపై ఆధారపడాలి. మరిన్ని డిపా జిట్లను సమీకరించాలి. బ్యాంకులు ఇప్పటికే రెపో రేట్ల పెంపు ప్రయోజనాన్ని తమ డిపాజిటర్లకు అందించడం ప్రారంభించాయి. ఇదే ధో రణి కొనసాగుతుందని భావిస్తున్నాం. తద్వారా వ్యవస్థలో తగిన లిక్విడిటీ కూడా ఉంటుంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఐసీఐసీఐ, పీఎన్బీ వడ్డింపు.. న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రుణాలపై రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించాయి. కీలక రెపో రేటును ఆర్బీఐ అరశాతం పెంచుతున్నట్టు ప్రకటించిన రోజే ఈ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 9.10%కి పెంచింది. పీఎన్బీ రెపో ఆధారిత రుణ రేట్లను 7.40% నుంచి 7.90%కి పెంచినట్టు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని పీఎన్బీ తెలిపింది. -
‘మాంద్యం’లోకి జారిన అమెరికా!
వాషింగ్టన్: అమెరికా జూన్ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిలేకపోగా 0.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అగ్రరాజ్య జీడీపీ క్షీణతలో ఉండడం వరుసగా ఇది రెండవ త్రైమాసికం. మార్చి త్రైమాసికంలో ఎకానమీ 1.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. వరుసగా రెండు త్రైమాసికాలు ఎకానమీ క్షీణ బాటలో ఉంటే దానిని అనధికారికంగా (సాంకేతికంగా) మాంద్యంగానే పరిగణిస్తారు. తాజా పరిస్థితిని క్షీణతగా ఎంతమాత్రం భావించరాదని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొంటున్నారు. ఎకానమీలో పలు రంగాలు పటిష్టంగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను క్షీణతలోకి జారిందని పేర్కొనడం సరికాదన్నది వారి వాదన. తీవ్ర ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి పరిణామాల నేపథ్యంలో రుణ వ్యయాలు పెరిగిపోయి అమెరికా వినియోగదారులు, వ్యాపారులు తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ‘మాంద్యం’ అంటే ఏమిటన్న ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణ అదుపునకు జనవరి మొదలు ఇప్పటివరకూ వడ్డీ రేటును ఫెడ్ 2.25 శాతం పెంచింది. దీనితో ఫెడ్ ఫండ్స్ రేట్లు 2.25 –2.5 శాతానికి చేరాయి. అయితే ఇకపై రేటు పెంపులో దూకుడు ఉండకపోవచ్చని అంచనా. -
క్షీణతలోకి అమెరికా ఎకానమీ
వాషింగ్టన్: ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ అయిన అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణించింది. బ్యూరో ఆఫ్ ఎకనమిక్ అనాలసిస్ (బీఈఏ) తుది సమీక్ష (మూడవ దఫా అంచనాల సవరణ) అనంతరం ఈ ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు క్రితం మైనస్ 1.5 శాతం గణాంకాలను ఎగువముఖంగా సవరించడం జరిగింది. వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో అమెరికా ఎకానమీ మాంద్యంలోకి జారిపోతుందన్న ఆందోళనలు నేపథ్యంలో తాజా ఫలితాలు వెలువడ్డం గమనార్హం. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఎకానమీ క్షీణతను నమోదుచేస్తే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి జారినట్లు పరిగణిస్తారు. మార్చి నుంచి అమెరికా సెంట్రల్ బ్యాంక్ బెంచ్‌మార్క్ ఓవర్‌నైట్ వడ్డీరేటు 150 బేసిస్ పాయింట్లు పెంచిన (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) సంగతి తెలిసిందే. ఎకానమీ మైనస్‌లోకి జారుతున్నా, దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉన్నట్లుగా పేర్కొంటూ అధికారులు పరిస్థితిని పక్కదారిపట్టిస్తున్నారన్న విమర్శలూ నెలకొనడం గమనార్హం. మేలో రిటైల్ అమ్మకాలు పడిపోయాయి. గృహ నిర్మాణం, అనుమతులు తగ్గిపోయాయి. జూన్‌లో వినియోగ విశ్వాసం 16 నెలల కనిష్టానికి పడిపోయింది. వినియోగ ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్టానికి ఎగసింది. క్యూ1లో వాణిజ్యలోటు భారీగా పెరగడం (3.2 శాతం) ఎకానమీకి ప్రతికూలంగా మారింది. గత ఏడాది నాల్గవ త్రైమాసికంలో ఎకానమీ 6.9 శాతం పటిష్ట వృద్ధి సాధించిన సంగతి తెలిసిందే. -
కొనసాగుతున్న ‘జీఎస్టీ’ కనకవర్షం!
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారీ వసూళ్లు కొనసాగుతున్నాయి. 2022 మేలో 2021 ఇదే నెలతో పోల్చితే (రూ.97,821) వసూళ్లు 44% పెరిగి రూ.1,40,885 లక్షల కోట్లకు చేరాయి. అయితే ఆల్ టైమ్ రికార్డు ఏప్రిల్ రూ.1,67,540 కోట్లు, మార్చి రూ.1,42,095 కోట్లు, జనవరి రూ. 1,40,986 కోట్లతో పోల్చితే మే వసూళ్లు తక్కువ. అంటే 2017 జూలై 1న ప్రారంభమై తర్వాత మేలో వసూళ్లు నాల్గవ అతిపెద్ద పరిమాణం. కాగా, ఈ క్యాలెండర్ ఇయర్లో ఫిబ్రవరిని (రూ.1,33,026 కోట్లు) మినహాయిస్తే, జీఎస్టీ రూ.1,40 లక్షల కోట్లను అధిగమించడం ఇది నాల్గవసారి. వేర్వేరుగా... ► మొత్తం వసూళ్లు రూ.1,40,885 కోట్లుకాగా, సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.25,036 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ వసూళ్లు రూ.32,001 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వసూళ్లు రూ.73,345 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలయిన రూ.37,469కోట్లుసహా). ► సెస్ రూ.10,502 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలయిన రూ.931 కోట్లుసహా). ► మే నెల గణాంకాలకు ప్రాతిపదిక అయిన ఏప్రిల్ నెల్లో నమోదయిన ఈ–వే బిల్లులు 7.4 కోట్లు. ఎకానమీకి శుభ సంకేతం గత మూడు నెలల్లో రూ. 1.4 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి, వృద్ధికి సంకేతం. స్థూల దేశీయోత్పత్తి (జీఎస్టీ) సంఖ్యలతో సహా ఇతర ఆర్థిక విభాగాల్లో రికవరీ పరిస్థితి ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పటిష్ట ఆడిట్లు, ప్రభుత్వ చర్యలు పన్ను ఎగవేతల నిరోధానికి దోహదపడుతున్నాయి. – ఎంఎస్ మణి, డెలాయిట్ ఇండియా పార్ట్నర్ -
భారత్ వృద్ధి అంచనాలకు మూడీస్ కోత!
న్యూఢిల్లీ: అధిక ద్రవ్యోల్బణాన్ని కారణంగా చూపిస్తూ, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం 2022 క్యాలెండర్ ఇయర్ భారతదేశ ఆర్థిక వృద్ధి వృద్ధి అంచనాను 9.1 శాతం నుండి 8.8 శాతానికి కుదించింది. ఈ మేరకు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం వెలువరించిన 2022–23 గ్లోబల్ స్థూల ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. ► డిసెంబర్ త్రైమాసికం 2021 (2021 అక్టోబర్–డిసెంబర్) నుండి ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో వృద్ధి ఊపందుకున్నట్లు హై–ఫ్రీక్వెన్సీ డేటా సూచిస్తోంది. ► అయితే ముడి చమురు, ఆహారం, ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం రాబోయే నెలల్లో గృహ ఆర్థిక, వ్యయాలపై ఉంటుంది. ఇంధనం, ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరక్కుండా సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్న రేట్ల పెంపు విధానం డిమాండ్ రికవరీ వేగాన్ని తగ్గిస్తుంది. ► 2022 ఎకానమీ స్పీడ్‌ను 8.8 శాతానికి తగ్గిస్తున్నా, 2023 వృద్ధి అంచనాలను 5.4 శాతంగా యథాతథంగా కొనసాగిస్తున్నాం. ► పటిష్ట రుణ వృద్ధి, కార్పొరేట్ రంగం ప్రకటించిన పెట్టుబడి ప్రణాళికలు, ప్రభుత్వం మూలధన వ్యయానికి అధిక బడ్జెట్ కేటాయింపుల వంటి అంశాలు పెట్టుబడుల పక్రియ బలపడుతున్నట్లు సూచిస్తున్నాయి. ► అంతర్జాతీయంగా ముడి చమురు, ఆహార ధరలు మరింత పెరగకపోతే ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి వేగాన్ని కొనసాగించేంత బలంగా కనిపిస్తోంది. ► 2022, 2023 క్యాలెండర్ సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం సగటున వరుసగా 6.8 శాతం, 5.2 శాతంగా ఉంటుందని అంచనా. ► అనేక ప్రతికూల కారకాల కారణంగా 2022, 2023 ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం అంచనాలను పెంచాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. ► సరఫరాల సమస్యలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణించేట్లు చేస్తున్నాయి. ఆయా అంశాలతో సెంట్రల్ బ్యాంకులు కఠిన ద్రవ్య విధానానికి మొగ్గుచూపే పరిస్థితికి దారితీస్తున్నాయి. దీనితోపాటు ఆర్థిక మార్కెట్ అస్థిరత, ఆస్తుల రీప్రైసింగ్, కఠిన ద్రవ్యపరిస్థితుల వంటి అంశాలు ఎకానమీల మందగమనానికి ప్రధాన కారణం. ► మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. అనంతరం రికవరీకి పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా కనబడుతోంది. జీరో–కోవిడ్ విధానంతో చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. వచ్చే ఏడాదినాటికి ప్రధాన ద్రవ్యోల్బణం రేట్లు (శాతాల్లో) తగ్గుతాయని మేము భావిస్తున్నప్పటికీ, ధర స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. ఆయా అంశాలు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ► చైనా వృద్ధి రేటు 2022లో 4.5 శాతం, 2023లో 5.3 శాతం ఉంటాయని భావిస్తున్నాం. అమెరికా, బ్రిటన్ ఎకానమీల వృద్ధి రేటు దాదాపు 2.8 శాతంగా ఉంటుందని అంచనా. కట్టుతప్పిన ద్రవ్యోల్బణం... ఈ సంవత్సరం ప్రారంభం నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి నమోదవుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో నమోదుకావాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్టం 7.79 శాతానికి చేరడంతో జూన్ మొదటి వారంలో జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఎంపీసీ మరో దఫా రేట్ల పెంపు ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారం ఆర్బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. అయితే ఈ లెక్కలు తప్పే అవకాశాలు స్పష్టమవడంతో నేపథ్యంలో ఈ నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధాన మధ్యంతర కమిటీ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రెపో రేటును అనూహ్య రీతిలో 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ పాలసీ రేటు పెంపు ఇది. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది.వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల కాలంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. 4.4 శాతానికి రెపో రేటును పెంచడంతోపాటు వ్యవస్థలో నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వెనక్కు మళ్లే విధంగా... రెపో రేటుతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని కట్టడి చేసి తద్వారా ద్రవ్యోల్బణం స్పీడ్‌ను తగ్గించాలన్నది ఈ ఇన్‌స్ట్రమెంట్ల ప్రధాన ఉద్దేశ్యం. వచ్చే నెల్లో అరశాతం రేటు పెంపు ఖాయం బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ విశ్లేషణ ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జూన్‌లో జరిగే ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు రెపోను మరో 0.50 శాతం పెంచే అవకాశాలు అధికంగా ఉన్నాయని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ విశ్లేషించింది. అలాగే వృద్ధి రేటు అంచనాలనూ 7.2 శాతం నుంచి 7 శాతానికి కుదించే అవకాశం ఉందని పేర్కొంది. ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల బ్యాండ్‌ను 6.2–6.5 శాతం శ్రేణిగా సవరించే వీలుందని అంచనావేసింది. ద్రవ్యోల్బణం కట్టడి, మధ్య కాలిక ఆర్థిక స్థిరత్వం లక్ష్యాలుగా పాలసీ సమీక్ష ఉంటుందని అభిప్రాయపడింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)కట్టడి లక్ష్యంగా క్యాష్ రిజర్ రేషియో (సీఆర్ఆర్)ను మరో 0.50 శాతం పెంచే అవకాశం ఉందని తెలిపింది. బార్క్లేస్ విశ్లేషణలు నిజమైతే రెపో రేటు 4.90 శాతానికి, సీఆర్ఆర్ 5 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కట్టడి–వృద్ధి సమతౌల్యత ఆర్బీఐ ముందున్న ప్రస్తుత కీలకాంశమని వివరించింది. -
ఎకానమీ స్పీడ్ 5 శాతం దాటకపోవచ్చు
ముంబై: ఎకానమీపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం తప్పదని ఇక్రా రేటింగ్స్ హెచ్చరించింది. నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) దీని ప్రభావం వల్ల 40 బేసిస్ పాయింట్లు మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత తప్పదని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5 శాతం శ్రేణిలోనే ఉంటుందని ఆభిప్రాయపడింది. ఒమిక్రాన్ వల్ల నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 0.3 శాతం మేర హరించుకుపోతుందని, ఈ నేపథ్యంలో వృద్ధి రేటు 5.8–5.9 శాతం శ్రేణికి పరిమితమవుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనా వేసిన మరుసటి రోజే అంతకంటే తక్కువగా వృద్ధి శాతాన్ని చూపుతూ ఇక్రా విశ్లేషణ వెలువడిన విషయం గమనార్హం. కాగా మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఇక్రా స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) 7.4 శాతం క్షీణ ఎకానమీ గణాంకాల నేపథ్యంలో 2021–22లో మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్) భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్లు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 9 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. ఆర్బీఐ ఈ అంచనాలను 9.5 శాతంగా పేర్కొనగా, వివిధ సంస్థలు 8.5 నుంచి 10 శ్రేణిలో అంచనాలను వెలువరిస్తున్నాయి. ఏజెన్సీ చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపిన ఇక్రా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మూడవ వేవ్ ఇప్పుడే ప్రారంభమైనందున, ఈ అంశంపై తక్షణం ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. ముందస్తు సూచనలు, కొత్త అంటువ్యాధి విస్తరణ విశ్లేషణల ఆధారంగా మున్ముందు పరిస్థితిని అంచనావేయవచ్చు. మొబిలిటీ ఆంక్షల వల్ల ముఖ్యంగా కాంటాక్ట్ ప్రాతిపదికన ఉపాధి రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించే వీలుంది. ► ఇప్పటికి 2021–22లో 9 శాతం వృద్ధి అంచనాలనే కొనసాగిస్తున్నాం. మూడవ వేవ్ ప్రభావంపై డేటా పూర్తిగా అందుబాటులో లేకపోవడం, డిసెంబర్లో ప్రభుత్వ వ్యయాల గణాంకాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉండడం వంటి అంశాలు దీనికి కారణం. ► కేంద్రం గత నెల్లో రూ.3.73 లక్షల కోట్ల అదనపు వ్యయ ప్రణాళికలను ప్రకటించింది. ప్రభుత్వ వ్యయాలు ఎంత మేర పెరిగితే అంతమేర మూడవవేవ్ ప్రభావం తగ్గుతుంది. దీనికితోడు మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వాలు, కుటుంబాల సంసిద్ధత, ఆరోగ్య వ్యవస్థ పటిష్టత వంటి అంశాలూ ఇక్కడ కీలకమైనవి. అయితే ఆయా అంశాల్లో ఇంకా తీవ్ర అనిశ్చితి నెలకొంది. ► సరఫరాల కొరత తగ్గడం, పండుగల సీజన్ వంటి అంశాల నేపథ్యంలో మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో వృద్ధి రేటు అంచనాలను యథాతథంగా 6 నుంచి 6.5 శ్రేణిలో కొనసాగిస్తున్నాం. ► ఇటీవలి కోవిడ్–19 కేసుల పెరుగుదల, అనిశ్చితికి దారితీసే అంశాల నేపథ్యంలో ‘ద్రవ్యోల్బణం తీవ్ర ప్రతికూల ఫలితాలను ఇచ్చే పరిస్థితి ఉంటే తప్ప’ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన సరళతర విధానాన్ని ఇప్పుడే విడనాడకపోవచ్చు. ఫిబ్రవరిలో జరిగే వరుస 10వ ద్వైమాసిక సమావేశాల్లోనూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4శాతం) ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే వీలుంది. -
వృద్ధి రేటులో 0.3 శాతం ‘ఒమిక్రాన్’పాలు!
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నట్లు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. తాజా ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) స్థూల దేశీయోత్పతి (జీడీపీ) విలువలో కొంత మొత్తం ఒమిక్రాన్ వల్ల హరించుకుపోనుందని విశ్లేషించింది. వృద్ధి రేటులో 0.2– 0.3 శాతం శ్రేణి మేర కోతపడే అవకాశం ఉందని పేర్కొంది. క్యూ4లో 6.1 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్నది తమ తొలి అంచనాకాగా, ఇది 5.9–5.8 శాతం శ్రేణికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే వెల్లడైన గణాంకాల ప్రకారం క్యూ1, క్యూ2ల్లో జీడీపీ వృద్ధి రేటు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయ్యాయి. తాజా నివేదికలో బ్యాంక్ ఆర్థిక వేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో కొన్ని... ► రాష్ట్రాలు కోవిడ్–సంబంధిత ఆంక్షలు విధించడంతో (ప్రజల రాకపోకలపై రాత్రిపూట కర్ఫ్యూ, 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, వివిధ రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో కార్యాలయాలు పనిచేయడం) 2021–22 క్యూ4లో ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ► ప్రస్తుత తరుణంలో మరిన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీనికితోడు గ్లోబల్ రికవరీ మందగించడం వల్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడే వీలుంది. ► కోవిడ్ మహమ్మారికి సంబంధించి మునుపటి వేవ్‌ల అనుభవాలను బట్టిచూస్తే, కోవిడ్ కేసులు పెరిగేకొద్దీ కదలికలపై (మొబిలిటీ) పరిమితులు మొదలవుతాయి. ఇది ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. ► భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో 60 శాతం కొత్త వేరియంట్‌కు సంబంధించినవిగా ఉంటున్నాయి. ► నాటికి దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య సోమవారంనాటికి (3వ తేదీ) 1,700గా ఉంది. అయితే జీనోమ్ సీక్వెన్సింగ్‌ను తనిఖీ చేయడానికి భారతదేశంలో చాలా తక్కువ పరీక్షా సౌకర్యాలు ఉన్నందున ఒమిక్రాన్ కేసుల వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని మీడియా నివేదికలు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులను 18,000గా అంచనా వేస్తుండడం గమనార్హం. ► ఒమిక్రాన్ భయాందోళనలు ఉన్నప్పటికీ, డాలర్ మారకంలో రూపాయి విలువ 74–76 శ్రేణిలో ఉండే వీలుంది. రూపాయి భారీ పతనాన్ని నిరోధించడానికి అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం చేసుకునే వీలుంది. ► తాజా వేరియంట్ వృద్ధిపై ప్రభావం చూపే అవకాశాలు ఉండడం వల్ల ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను మరికొంత కాలం సరళతరం రీతిలోనే కొనసాగించే వీలుంది. అలాగే బ్యాంకుల్లో అదనపు దవ్య లభ్యతను వెనక్కు తీసుకునే చర్యలనూ తక్షణం తీసుకోకపోవచ్చు. దీనిప్రకారం ఫిబ్రవరిలో ఆశించిన రివర్స్ రెపో (బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్బీఐ వద్ద ఉంచి పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం) పెంపు ఉండకపోవచ్చు. తగిన ద్రవ్య లభ్యత, ఈల్డ్స్ కట్టడి వంటి అంశాలపై ఆర్బీఐ దృష్టి సారించే వీలుంది. ద్రవ్యల్బణం కట్టడి, వృద్ధి లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక సమీక్షల సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును 4శాతంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. -
8.9% కాదు... 9.5%
ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను స్విస్ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ సెక్యూరిటీస్ 9.5 శాతానికి పెంచింది. ఇప్పటి వరకూ ఈ అంచనా 8.9 శాతం. ఆర్థిక రికవరీ ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతుండడం, పెరిగిన వినియోగ విశ్వాసం, వ్యయాల పెరుగుదల వంటి అంశాలు తమ అంచనాల పెంపునకు కారణమని వివరించింది. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేటు వరుసగా 7.7 శాతం, 6 శాతంగా నమోదవుతుందన్నది అంచనాగా తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2021–22 జీడీపీ వృద్ధి రేటుకు సమానంగా తాజాగా యూబీఎస్ సెక్యూరిటీస్ తన అంచనాలను పెంచడం గమనార్హం. ప్రభుత్వం 10 శాతం అంచనావేస్తోంది. వివిధ రేటింగ్, విశ్లేషణా సంస్థల అంచనా శ్రేణి 8.5 శాతం నుంచి 10 శాతం వరకూ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి రేటు 20.1 శాతం. వడ్డీరేట్లు పెరిగే అవకాశం! రానున్న 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తక్కువ వడ్డీరేటు ప్రయోజనాలకు ముగింపు పలికే అవకాశం ఉందని అభిప్రాయపడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల కాలంలో ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను అరశాతం పెంచే అవకాశం ఉందని కూడా యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనావేసింది. 2021–22లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉంటుందన్న ఇంతక్రితం అంచనాలను 4.8 శాతానికి తగ్గిస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. ఇక ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22లో 10.1 శాతంగా, 2022–23లో 8.8 శాతంగా నమోదవుతుందని తమ అంచనా అని యూబీఎస్ సెక్యూరిటీస్ తెలిపింది. ఇదిలాఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 10 శాతం నమోదవుతుందన్న విశ్వాసాన్ని ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేవ్రాయ్ వ్యక్తం చేశారు. ఎస్బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. -
2021–22లో 10 శాతం వృద్ధి: నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 10 శాతం ఉంటుందని విశ్వసిస్తున్నట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏడు సంవత్సరాల మోదీ ప్రభుత్వం దేశంలో పటిష్ట ఆర్థిక వృద్ధికి పునాదులు వేసిందన్నారు. కోవిడ్–19 వల్ల ఎదురయిన సవాళ్లను దేశం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని వివరించారు. వచ్చే ఐదేళ్లూ భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నివేదికను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచ పెట్టుబడిదారులను భారత్ ఆర్థిక వ్యవస్థ ఆకర్షించగలుగుతోందన్నారు. అయితే దేశంలో ఉపాధి కల్పన అనుకున్నంత వేగంగా లేదని ఆయన అంగీకరించారు. మోదీ ప్రభుత్వం ఏడేళ్లలో 485 ప్రభుత్వ పథకాలను ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపు (డీబీటీ) పరిధిలోకి తీసుకుని వచ్చిందన్నారు. డీబీటీ ద్వారా రూ.5.72 లక్షల కోట్లు బదిలీ అయినట్లు కూడా కుమార్ తెలిపారు. -
క్యూ3లో చైనా వృద్ధి 4.9 శాతం
బీజింగ్: చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు మూడవ త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెపె్టంబర్) 4.9 శాతంగా నమోదయ్యింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంతో పోలి్చతే (7.9 శాతం) వృద్ధి రేటు తగ్గడం గమనార్హం. కరోనా సవాళ్లకుతోడు రియల్టీ రంగం సంక్షోభంతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని తాజా గణాంకాలు సంకేతాలు ఇస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 18.3 శాతం పురోగమించిన సంగతి తెలిసిందే. మూడు త్రైమాసికాల్లో ఎకానమీ 9.8 శాతం వృద్ధి సాధించినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిక్స్ (ఎన్బీఎస్) పేర్కొంది. ఈ తొమ్మిది నెలల్లో వినియోగం వాటా మొత్తం జీడీపీలో 64.8 శాతంగా ఉందని ఎన్బీఎస్ ప్రతినిధి ఫు లింగ్హవా పేర్కొన్నారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో 2020 తొలి త్రైమాసికం మినహా గత ఏడాది మిగిలిన మూడు త్రైమాసికాల్లోనూ వృద్ధిని నమోదుచేసుకోవడం గమనార్హం. కరోనా సవాళ్లతో 2020 మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు (2019 ఇదే కాలంతో పోల్చి) జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెపె్టంబర్ మధ్యా ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారీగా 6.5 శాతం వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 2.3 శాతం వృద్ధి రేటును (జీడీపీ విలువ 15.42 ట్రిలియన్ డాలర్లు) నమోదుచేసుకుంది. అయితే గడచిన 45 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత తక్కువ స్థాయిలో దేశం వృద్ధి రేటు నమోదుకాలేదు. 2021లో దేశ ఎకానమీ పదేళ్ల గరిష్ట స్థాయిలో 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని ఈ ఏడాది మొదట్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. -
ద్రవ్యలోటు కట్టడికి చర్యలు అవశ్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును కట్టడిలోకి తీసుకోడానికి విశ్వసనీయ చర్యలు అవసరమని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారి సవాళ్లు తొలగిన వెంటనే ఈ బాటలో చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశ రుణ భారం ఇప్పటికి అటు ఆందోళనకరంగాకానీ లేదా ఇటు తగిన స్థాయిలో కానీ లేదని ఆయన విశ్లేíÙస్తూ, ఆర్థిక ఉద్దీపన చర్యలను కోరడానికి ముందు ఆయా వర్గాలన్నీ దేశ రుణ భారం అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి నేపథ్యంలో ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెకించడానికి కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు రూ.30 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 15 శాతం. ద్రవ్యలోటు పెరుగుదలపై విభిన్న వాదనల నేపథ్యంలో ఎన్కే సింగ్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2019– 20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యమయితే, కరోనా ఈ లక్ష్యానికి గండి కొట్టింది. భారీ వ్యయాలు, ఉద్దీపనల నేపథ్యంలో ద్రవ్యలోటు ఏకంగా 9.3 శాతానికి (రూ.18,21,461 కోట్లు) ఎగసింది. 2021–22లో జీడీపీలో 6.8 శాతం (రూ.15,06,812 కోట్లు)ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే 8 శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్ అంచనాలతో పోలి్చతే ఇది 21.3 శాతం. 15వ ఫైనాన్స్ కమిషన్ సూచనలు.. ప్రభుత్వం కొంత ధైర్యం చేసి ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచవచ్చని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ వంటి పలువురు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదనల అమలును రేటింగ్, బహుళజాతి ఆర్థిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఆయా అంశాల నేపథ్యంలో సామాజిక ఆర్థిక పురోగతి వ్యవహారాల కేంద్రం (పీఎస్‌ఈపీ)– ప్రపంచబ్యాంక్ నిర్వహించిన సెమినార్లో 15 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసిన ప్రసంగంలో ద్రవ్యలోటుపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. -
వ్యాపార పరిస్థితులు మెరుగుపడుతున్నాయ్
ముంబై: భారత్‌లో వ్యాపార క్రియాశీలత పురోగతి వేగంగా కొనసాగుతోందని జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా పేర్కొంది. ఆగస్టు 29నాటికి వ్యాపార క్రియాశీలత కరోనా ముందస్తు స్థాయికి చేరుకుందని తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► నోమురా బిజినెస్ రిజంప్షన్ ఇండెక్స్ 2021 ఆగస్టు 29వ తేదీతో ముగిసిన వారంలో 102.7కు ఎగసింది. దేశంలో కరోనా ముందస్తు.. అంటే 2020 మార్చి తరువాత ఇండెక్స్ ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. అంతక్రితం ఆగస్టు 22వ తేదీతో ముగిసిన వారంలో ఇండెక్స్ 101.3 వద్ద ఉంది. మార్చి 2020 తర్వాత లాక్డౌన్లు, ఆంక్షల నేపథ్యంలో ఇండెక్స్ భారీగా పడిపోయింది. ► 2021 జూన్‌లో ఇండెక్స్ 15 శాతం పెరిగితే, జూలైలో ఈ వేగం 17.1 శాతంగా ఉంది. తొలి ఫలితాల ప్రకారం ఆగస్టు 29 నాటికి 5.6 శాతంగా నమోదయ్యింది. ► ఆగస్టు 29వ తేదీనాటికి గూగుల్ రిటైల్, రిక్రియేషన్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగితే, యాపిల్ డ్రైవింగ్ ఇండిసీస్ 10 శాతం ఎగసింది. వర్క్‌ప్లేస్ మొబిలిటీ ఇండెక్స్ 3.7 శాతం పడిపోయినప్పటికీ, గూగుల్, యాపిల్ సంబంధిత ఇండెక్స్‌లు పెరగడం గమనార్హం. ► విద్యుత్ డిమాండ్ వారం వారీగా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. ► ఇక కార్మికుల భాగస్వామ్య సూచీ 40 శాతం నుంచి 40.8 శాతానికి ఎగసింది. మూడవవేవ్ను తోసిపుచ్చలేం... కాగా రానున్నది పండుగల సీజన్ కావడంతో మూడవవేవ్ ముప్పును త్రోసిపుచ్చలేమని నోమురా హెచ్చరించడం గమనార్హం. ఆగస్టు 29వ తేదీతో ముగిసిన వారంలో 7 రోజుల సగటు (మూవింగ్ యావరేజ్) కేసులు 9,200 పెరిగి 41,000కు చేరినట్లు నోమురా పేర్కొంది. కేసులు పెరుగుతుండడంపై ఇంకా మిశ్రమ వార్తలు వస్తున్నాయని తెలుపుతూ, ఇది మూడవ వేవ్‌కు సంకేతం కావచ్చనీ విశ్లేషించింది. అలాగే ఇదే సమయంలో వ్యాక్సినేషన్ మూవింగ్ యావరేజ్ వారం వారీగా 47 లక్షల డోసుల నుంచి 71 డోసులకు పెరిగిందని పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగితే 2021 డిసెంబర్ ముగిసే నాటికి భారత్‌లో దాదాపు 50 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని తెలిపింది. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం కావాల్సి ఉందని పేర్కొంది. వృద్ధి 10.4 శాతం మూడవ వేవ్ సమస్యలు తలెత్తకపోతే సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ ఎకానమీ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని అంచనావేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 10.4 శాతంగా ఉంటుందని తన నివేదికలో నోమురా పేర్కొంది. -
ఎకానమీకి లోబేస్ భరోసా.. జీడీపీ జూమ్!
న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగానే భారత్ ఆర్థిక వ్యవస్థ 2021–22 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 20.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఇందుకు లోబేస్ ప్రధాన కారణమైంది. అయితే ఇదే కాలంలో దేశం మహమ్మారి సెకండ్‌వేవ్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఎకానమీ తగిన సానుకూల ఆర్థిక ఫలితాన్ని సాధించడం కొంతలో కొంత ఊరట. లోబేస్ అంటే..? ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 ఏప్రిల్–జూన్ కాలాన్ని తీసుకుంటే కరోనా కష్టాలతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో అసలు వృద్ధిలేకపోగా (2019 ఇదే కాలంలో పోల్చి) 24.4 శాతం క్షీణతను ఎదుర్కొంది. అప్పటి లోబేస్తో పోల్చితే జీడీపీ విలువ తాజా సమీక్షా కాలంలో 20.1 శాతం పెరిగిందన్నమాట. విలువలు ఇలా... 2020–21 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.26,95,421 కోట్లు (2019–20 తొలి క్వార్టర్‌తో పోల్చితే 24.4 శాతం డౌన్). జాతీయ గణాంకాల కార్యాలయం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజా సమీక్షా కాలంలో(2021–22 ఏప్రిల్–జూన్) ఈ విలువ రూ.32,38,020 కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయ్యింది. అయితే తాజా సమీక్షా నెల్లో విలువ కరోనా ముందు కాలంలో పోల్చితే ఇంకా వెనుకబడి ఉండడం గమనార్హం. 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎకానమీ పరిమాణం రూ.35,66,708 కోట్లు. అప్పటితో పోల్చితే, ఎకానమీ ఇంకా రూ. 3,28,688 కోట్లు వెనుకబడి ఉండడం గమనార్హం. శాతాల్లో చెప్పాలంటే కోవిడ్–19 ముందస్తు కాలంతో పోల్చితే ఇంకా 9.2 శాతం ఎకానమీ వెనుకబడి ఉందన్నమాట. రంగాల వారీగా... ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) విలువ ప్రకారం తాజా సమీక్షా కాలంలో (ఏప్రిల్–జూన్) వివిధ రంగాల వృద్ధి తీరు ఇలా... ► తయారీ: ఈ రంగం ఉత్పత్తి 49.6% ఎగసింది. 2020–21 ఏప్రిల్–జూన్ మధ్య ఈ విభాగం 36 శాతం క్షీణించింది. ► వ్యవసాయ రంగం: వృద్ధి 3.5% నుంచి 4.5%కి చేరింది. ► నిర్మాణం: 49.5% క్షీణత నుంచి 68.3% వృద్ధికి మళ్లింది. ► మైనింగ్: 18.6 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. 2020–21 ఏప్రిల్–జూన్ మధ్య ఈ విభాగం 17.2 శాతం క్షీణించింది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవలు: ఈ విభాగంలో తాజా సమీక్షా కాలంలో 14.3 శాతం వృద్ధి నమోదుకాగా, 2020 ఇదే కాలంలో 9.9 శాతం క్షీణత నమోదయ్యింది. ► వాణిజ్యం, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు, సేవలు: 48.1 శాతం క్షీణత 34.3 శాతం వృద్ధిబాటకు వచ్చింది. ► ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలు: 2020 ఏప్రిల్–జూన్ మధ్య 5 శాతం క్షీణిస్తే, తాజా సమీక్షా కాలంలో 3.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవల రంగాలు మైనస్ 10.2% నుంచి 5.8% వృద్ధి బాటలోకి వచ్చాయి. త్రైమాసికం పరంగా 16.9 శాతం పతనం త్రైమాసికం పరంగా చూస్తే, ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఎకానమీ విలువ 38.96 లక్షల కోట్లు. తాజా సమీక్షా కాలంలో ఈ విలువ రూ.32.38 లక్షల కోట్లు. అంటే త్రైమాసికపరంగా చూసినా ఎకానమీ 16.9% డౌన్లో ఉందన్నమాట. దీనికి ప్రధానంగా ఏప్రిల్–మే నెలల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కోవిడ్–19 సెకండ్‌వేవ్ కారణం. ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) విలువలో చూస్తే క్యూ1లో వృద్ధి రేటు (2020 ఇదే కాలంలో పోల్చి) 18.8% పురోగమించింది. అయితే 2020 జనవరి–మార్చి కాలంతో చూస్తే, విలువ 13.3% క్షీణించడం గమనార్హం. 2021–22పై అంచనాలు ఇలా... కోవిడ్–19 మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో గడచిన ఆర్థిక సంవత్సరం ఎకనామీ 7.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అయితే లోబేస్‌కుతోడు ఎకానమీ ఊపందుకుని 2021–22లో వృద్ధి రేటు 17 శాతం వరకూ నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం సెకండ్‌వేవ్ సవాళ్లు ప్రారంభమయ్యాయి. దీనితో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు 2021–22పై తమ వృద్ధి అంచనాలను రెండంకెల లోపునకు కుదించేశాయి. 7.5 శాతం నుంచి 9.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను తాజాగా వెలువరిస్తున్నాయి. ఆర్బీఐ, ఐఎంఎఫ్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 9.5 శాతం అంచనావేస్తుండగా, మూడీస్ అంచనా 9.3 శాతంగా ఉంది. అయితే ప్రపంచబ్యాంక్ వృద్ధి రేటు అంచనా 8.3 శాతంగా ఉంది. ఫిచ్ రేటింగ్స్ మాత్రం 10 శాతం వృద్దిని అంచనావేస్తోంది. కాగా, 2021లో 9.6 శాతం, 2022లో 7 శాతం వృద్ధి నమోదవుతుందని మూడీస్ తాజా నివేదికలో అంచనా వేసింది. కీలక రంగాలు విలువల్లో... ఒక్క వ్యవసాయ రంగం మినహా అన్ని రంగాల విలువలూ కోవిడ్–19 ముందస్తు స్థాయికన్నా తక్కువగానే ఉండడం గమనార్హం. 2019 ఏప్రిల్–జూన్ మధ్య తయారీ రంగం ఉత్పత్తి విలువ 5.67 లక్షల కోట్లయితే, ఈ విలువ 2021 ఏప్రిల్–జూన్ మధ్య రూ.5.43 లక్షల కోట్లుగా ఉంది. సేవల రంగం విలువ మాత్రం కోవిడ్ ముందస్తు స్థాయి (రూ.6.64 లక్షల కోట్లు)కి ఇంకా చాలా దూరంలో ఉంది. సమీక్షా కాలంలో ఈ విలువ రూ.4.63 లక్షల కోట్లుగా ఉంది. వ్యవసాయ రంగం విలువ రూ.4.49 లక్షల కోట్ల నుంచి రూ.4.86 లక్షల కోట్లకు ఎగసింది. దేశ ఎకానమీలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వాటా 15 శాతం చొప్పున ఉండగా, సేవల రంగం విలువ దాదాపు 60 శాతం వరకూ ఉంది. వేగవంతమైన వృద్ధి హోదా తాజా గణాంకాల ప్రకారం, ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదుచేసుకున్న దేశాల్లో మొదటి స్థానం హోదాను భారత్ దక్కించుకుంది. 2021 ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో చైనా వృద్ధి రేటు 7.9 శాతం. భవిష్యత్ వృద్ధికి బాటలు మొదటి త్రైమాసికంలో సానుకూల ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఆర్థిక సంవత్సరం రానున్న నెలల్లో ఎకానమీ మరింత మెరుగుపడుతుందన్న సంకేతాలను ఈ గణాంకాలు అందిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి అంచనాలను ఎగువముఖంగా సవరించే అవకాశం ఉంది. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఆర్థిక మూలాలు పటిష్టం భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవస్థాగత సంస్కరణలు, చేస్తున్న భారీ మూలధన వ్యయాలు వృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఎకానమీలో ‘వీ’ (ఠి) నమూనా వృద్ధి ధోరణి నమోదవుతుందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుదల ధోరణి ఎకానమీకి కలిసివస్తుంది. – కేసీ సుబ్రమణ్యం, సీఈఏ పునరుత్తేజం: పారిశ్రామిక రంగం ఎకానమీ కోవిడ్–19 సవాళ్ల నుంచి కోలుకుని పునరుత్తేజం అవుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని భారత్ పారిశ్రామిక రంగం పేర్కొంది. సెకండ్‌వేవ్ సవాళ్లు ఉన్నప్పటికీ, మొదటి త్రైమాసికంలో ఎకానమీ తగిన మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఇండస్ట్రీ చాంబర్–సీఐఐ పేర్కొంది. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కార్యక్రమాలు వృద్ధికి ఊతం ఇస్తున్నట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. -
కుటుంబాలపై అప్పుల భారం
ముంబై: కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో కుటుంబాలపై రుణ భారాలు తీవ్రమయ్యాయని ఎస్బీఐ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక ప్రకారం.. 2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల రుణ భారం 32.5 శాతం అయితే, ఇది తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో 37.3 శాతానికి పెరిగింది. నిజానికి 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు, 2017 జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు వంటి ఆర్థిక పరిణామాలు చోటుచేసుకున్న కాలం నుంచి జీడీపీలో కుటుంబాల రుణ భారాల నిష్పత్తి పెరుగుతూ వస్తోంది. రుణాల్లో ఏమున్నాయంటే... బ్యాంకులు, క్రెడిట్ సొసైటీలు, నాన్ బ్యాంకింగ్ ఫై నాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వం టి ఫైనాన్షియల్ సంస్థల నుంచి రిటైల్‌సహా వ్యవ సాయ, వ్యాపార రుణాలు ఈ కేటగిరీ కిందకు వస్తాయి. అగ్ర దేశాలకన్నా తక్కువే! జీడీపీలో కుటుంబ రుణ భారాల నిష్పత్తి ప్రస్తుత ఆర్థిక మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనావేస్తోంది. ఆరోగ్య భద్రతా వ్యయాలు కూడా గణనీయంగా పెరుగుతుండడం గమనించాల్సిన అంశమని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య క్రాంతి ఘోష్ పేర్కొన్నారు. అయితే జీడీపీలో కుటుంబాల రుణ నిష్పత్తి 37 శాతం అంటే మిగిలిన పలు దేశాలకన్నా ఇది తక్కువేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కొరియా (103.8 శాతం), బ్రిటన్ (90 శాతం), అమెరికా (79.5 శాతం), జపాన్ (65.3 శాతం), చైనా (61.7 శాతం)లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మెక్సికోలో ఇది కనిష్ట స్థాయిలో 17.4 శాతం. డిపాజిట్ల తీరు ఇలా... 2020–21లో బ్యాంక్ డిపాజిట్లు తగ్గడం ఇక్కడ ప్రస్తావనాశం. 2020 లాక్డౌన్ ప్రారంభంలో వ్యయాలు ఏవీ లేక అన్ని వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరిగాయి. అయితే పండుగల కాలంలో క్రమంగా తగ్గాయి. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2020 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో కుటుంబాల పొదుపు రేటు (జీడీపీలో) 10.4 శాతంగా ఉంది. అయితే ఇది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 8.2 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో కుటుంబాల బ్యాంక్ డిపాజిట్ల రేషియో 7.7 శాతం నుంచి 3 శాతానికి తగ్గింది. ఇక కుటుంబాల రుణ భారం జీడీపీ విలువతో పోల్చితే 37.1 శాతం నుంచి 37.9 శాతానికి పెరిగింది. డిపాజిట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్స్, ప్రావిడెంట్ అండ్ పెన్షన్ ఫండ్స్, కరెన్సీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, ఈక్విటీలు, స్మాల్ సేవింగ్స్సహా ఫైనాన్షియల్ అసెట్స్ విలువ 7,46,821.4 కోట్ల నుంచి 6,93,001.8 కోట్లకు పడిపోయింది. ఇక మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇటీవల నివేదిక ప్రకారం భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంది. ప్రైవేటు రంగం 80 శాతం ఆర్థిక నష్టం ఎదుర్కొంటే, ఇందులో కార్పొరేట్ రంగానికి కేవలం 12 నుంచి 16 శాతం. మిగిలినది కుటుంబాలు భరించాయి. -
40 ఏళ్ల కనిష్టానికి...జీడీపీ
న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3% క్షీణించి 40 ఏళ్ల కనిష్టానికి జారిపోయింది. అయితే, కరోనా సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందు త్రైమాసికం (క్యూ4)లో ఎకానమీ కొంత పురోగతి సాధించింది. 2020–21 ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో వరుసగా రెండవ క్వార్టర్లోనూ వృద్ధి బాటన నడిచింది. మార్చి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 1.6 శాతంగా నమోదయ్యింది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలోనూ భారత్ ఎకానమీ 0.5% వృద్ధిని నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ నేపథ్యంలో 2020–21 తొలి జూన్ త్రైమాసికంలో ఎకానమీ 24.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. తదుపరి జూలై– సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత 7.4 శాతానికి పరిమితమైంది. ఇక మొత్తం 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణత 7.3 శాతానికి పరిమితమైంది. నిజానికి 7.5 శాతం నుంచి 8 శాతం వరకూ క్షీణ అంచనాలు నమోదయ్యాయి. మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం ఆర్థిక సంవత్సరం తాజా గణాంకాలను ఆవిష్కరించింది. విలువలు ఇలా... 2011–21 ఆర్థిక సంవత్సరం స్థిర ధరల ప్రకారం (బేస్ ఇయర్ ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసుకుంటూ వచ్చిన గణాంకాలు) 2019 ఏప్రిల్–2020 మార్చి మధ్య భారత స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.145.69 లక్షల కోట్లు. కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఈ విలువ 2020 ఏప్రిల్–2021 మార్చి మధ్య రూ.135.13 లక్షల కోట్లకు ఎకానమీ విలువ పడిపోయింది. వెరసి 7.3 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక మార్చి త్రైమాసికంలో విలువలు పరిశీలిస్తే, 38.33 లక్షల కోట్ల నుంచి రూ.38.96 లక్షల కోట్లకు ఎగసింది. అంటే 1.6 శాతం వృద్ధి అన్నమాట. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 4 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. 2019–20 మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు 3 శాతం. కాగా, ఉత్పత్తి దశ వరకూ సంబంధించి గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) వృద్ధి 2020–21 మార్చి త్రైమాసికంలో 3.7 శాతంగా నమోదయితే, ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం క్షీణత నమోదుచేసుకుంది. కీలక రంగాల తీరు ఇలా... ► వ్యవసాయం: మూడవ త్రైమాసికంలో 4.5 శాతం వృద్ధి సాధిస్తే, నాల్గవ త్రైమాసికంలో ఇది 3.1 శాతానికి పరిమితమైంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో 3.6 శాతం పురోగమించింది. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 15 శాతం. ► మైనింగ్: డిసెంబర్, మార్చి వరుస త్రైమాసికాల్లో క్షీణత 4.4 శాతం నుంచి 5.7 శాతానికి పెరిగింది. వార్షికంగా చూస్తే క్షీణ రేటు 8.5 శాతం. ► తయారీ: డిసెంబర్ త్రైమాసికంలో 1.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే, ఇది నాల్గవ త్రైమాసికంలో 6.9 శాతానికి పెరిగింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం క్షీణించింది. ► నిర్మాణం: డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.5%, 14.5 శాతాలుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంలో 8.6% క్షీణించింది. ► ట్రేడ్, హోటల్, రవాణా, కమ్యూనికేషన్లు: డిసెంబర్ త్రైమాసికంలో క్షీణత 7.9 శాతం అయితే, క్షీణత నాల్గవ త్రైమాసికంలో 2.3 శాతానికి పరిమితమైంది. 2020–21లో క్షీణ రేటు 18.2 శాతం. ► ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలు: డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి 6.7 శాతం అయితే, మార్చి త్రైమాసికంలో ఈ రేటు 5.4 శాతం. ఆర్థిక సంవత్సరంలో 1.5 శాతం క్షీణత. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: నాల్గవ త్రైమాసికంలో వృద్ధి 9.1 శాతం. ► పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు: నాల్గవ త్రైమాసికంలో వృద్ధి 2.3 శాతం. మరిన్ని అంశాలు.. ► 1979–80 ఆర్థిక సంవత్సరం తర్వాత అంటే దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒక పూర్తి ఆర్థిక సంవత్సరంలో క్షీణ రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. అప్పట్లో క్షీణత 5.2 శాతం. ► 1950–51 జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు – 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్ వృద్ధి నమోదైంది. వర్షాలు సరిగ్గా లేక వ్యవసాయ రంగం దెబ్బతినడం ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు ఆరవసారి క్షీణత నమోదయ్యింది. ► భారత్ ఎకానమీ మళ్లీ రూ.145 లక్షల కోట్ల స్థాయిని చేరుకోవాలంటే 2021–22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 10 నుంచి 11 శాతం పురోగమించాలి. నిజానికి ఈ స్థాయిలో వృద్ధి ఉంటుందని తొలుత భావించినప్పటికీ, దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఈ అంచనాలకు దెబ్బకొట్టింది. వృద్ధి రెండంకెల లోపే ఉంటుందని రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థల తాజా అంచనాలు. ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ స్వయంగా ఈ తరహా సందేహాలు వ్యక్తం చేయడం గమనించాల్సిన మరో ముఖ్యాంశం. ► ఎకానమీలో 55 శాతం వాటా ఉన్న వినియోగ డిమాండ్, నిరుద్యోగం ఇప్పుడు దేశం ముందు ఉన్న తీవ్ర సవాళ్లని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడక నడుస్తుండడం మరో ప్రతికూల అంశం. ► ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వెలువడినవి తొలి అంచనాలు మాత్రమే. మరింత సమగ్రంగా తదుపరి రెండు విడతల్లో సవరణలు, తుది ఫలితాలు వెలువడతాయి. ► 2020–21 తలసరి ఆదాయం రూ.1,28,829గా నమోదయ్యింది. దాదాపు 2018–19 నాటి రూ.1,25,883 స్థాయికి పడిపోయింది. ద్రవ్యలోటు రూ.18,21,461 కోట్లు 2020–21 జీడీపీలో 9.3 శాతం ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు 2020–21 ఆర్థిక సంవత్సరం రూ.18,21,461 కోట్లుగా నమోదయ్యింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే ఇది 9.3 శాతం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ఆర్థిక శాఖ సవరిత అంచనాలు 9.5% కన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. మరిన్ని అంశాలను పరిశీలిస్తే, 2020–21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతం ఉండాలని (రూ.7.96 లక్షల కోట్లు) 2020 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. అయితే కరోనా కష్టాల నేపథ్యంలో ఆదాయాలు భారీగా పడిపోయాయి. దీనితో ద్రవ్యలోటు అంచనాలను 9.5%కి (రూ.18,48,655 కోట్లు) పెంచుతున్నట్లు 2021–22 బడ్జెట్ పేర్కొం ది. సవరిత అంచనాలకన్నా 20 బేసిస్ పాయింట్లు తక్కువగా 9.3%గా ద్రవ్యలోటు తాజాగా నమోదయ్యింది. ఆదాయ– వ్యయాలు ఇలా... ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆదాయాలు రూ.16,89,720 కోట్లు. ఇందులో రూ.14,24,035 కోట్లు పన్నులు, రూ.2,08,059 కోట్ల పన్ను రహిత ఆదాయాలుకాగా, రూ. 57,626 కోట్లు రుణ రికవరీ, పెట్టుబడుల ఉపసంహరణలకు సంబంధించి వసూలయిన నాన్–డెట్ క్యాపిటల్ ఆదాయాలు. ఇక ప్రభుత్వ వ్యయాల మొత్తం రూ. 35,11,181 కోట్లు. ఇందులో రూ.30,86,360 కోట్లు రెవెన్యూ అకౌంట్ నుంచి వ్యయమవగా, రూ.4,24,821 కోట్లు క్యాపిటల్ అకౌంట్ నుంచి ఖర్చయ్యాయి. వెరసి రూ.18,21,461 కోట్ల ద్రవ్యలోటు నమోదయ్యిందన్నమాట. 2021 ఏప్రిల్‌లో ఇలా..: కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి నెల– ఏప్రిల్ ద్రవ్యలోటు పరిస్థితిని మరో ప్రకటనలో సీజీఏ వివరించింది. బడ్జెట్ అంచనాల్లో ఇది ఏప్రిల్‌లో 5.2 శాతానికి చేరింది. విలువలో రూ.78,699 కోట్లు. 2021–22లో 6.8% లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. విలువలో రూ.15,06,812 కోట్లు. 2019–20లో ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతంకావడం గమనార్హం. అప్పటికి ఇదే ఏడేళ్ల గరిష్టం. ఎకానమీలో అనిశ్చితి కరోనా మహమ్మారి సవాళ్లు తొలగకపోవడంతో ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కొనసాగనుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండకపోయినప్పటికీ, వృద్ధి రేటు రెండంకెల్లో నమోదుకావడం కష్టం – కేవీ సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారు -
జీడీపీ యూటర్న్!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో రెండు త్రైమాసికాల వరుస క్షీణ రేటుతో ‘సాంకేతికంగా’ మాంద్యంలోకి జారిపోయిన భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మెజారిటీ విశ్లేషణలకు అనుగుణంగానే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి బాట పట్టింది. ఆర్థి క సంవత్సరం మూడవ త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. తాజా సవరిత గణాంకాల ప్రకారం మొదటి త్రైమాసికం ఏప్రిల్–జూన్ మధ్య జీడీపీ భారీగా 24.4 శాతం క్షీణత నమోదు చేసింది. రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్‌లో క్షీణత 7.3 శాతానికి పరిమితమైంది (నవంబర్ 20నాటి తొలి అంచనాల ప్రకారం ఈ క్షీణ రేట్లు వరుసగా 23.9 శాతం, 7.5 శాతంగా ఉన్నాయి). రెండు త్రైమాసికాలు వరుస క్షీణతను మాంద్యంగా పరిగణిస్తారు. మూడవ త్రైమాసికంలో వృద్ధి నమోదుకావడంతో భారత్ ఎకానమీ మాంద్యం కోరల నుంచి బయటపడినట్లయ్యింది. ప్రధానంగా వ్యవసాయం, సేవలు, నిర్మాణ రంగాలు ఇందుకు దోహదం చేశాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 3.3 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మొత్తం జీడీపీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం వృద్ధి రేటు డిసెంబర్ త్రైమాసికంలో 3.9 శాతంగా ఉంది. ► తయారీ రంగం స్వల్పంగా 1.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► నిర్మాణ రంగం భారీగా 6.2% వృద్ధి చెందింది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల విభాగంలో భారీగా 7.3 శాతం వృద్ధి నమోదయ్యింది. ► మూలధన పట్టుబడులకు సంబంధించిన ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ విభాగంలో 2.6 శాతం వృద్ధి నమోదయ్యింది. ► వాణిజ్య, హోటెల్ పరిశ్రమ కరోనా మహమ్మారి సవాళ్ల నుంచి బయటకు రాలేదు. మూడవ త్రైమాసికంలోనూ క్షీణత 7.7%గా నమోదైంది. ► ప్రభుత్వ వినియోగ వ్యయాలు 1.1%క్షీణిస్తే, ప్రైవేటు వినియోగ వ్యయం 2.4% తగ్గింది. 0.4 శాతం ఎలా అంటే... మూడవ త్రైమాసికంలో మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ రూ.36.22 లక్షల కోట్లు. 2019–20 ఇదే కాలంలో ఈ విలువ రూ.36.08 లక్షల కోట్లు. వెరసి తాజా సమీక్షా త్రైమాసికంలో వృద్ధి 0.4 శాతంగా ఉన్నట్లు లెక్క. 2020–21లో క్షీణత అంచనా 8 శాతం ! నేషనల్ అకౌంట్స్ రెండవ ముందస్తు అంచనాల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎకానమీ క్షీణ రేటు 8 శాతంగా ఉంటుందని ఎన్ఎస్ఓ పేర్కొంది. తొలి అంచనాల ప్రకారం ఈ రేటు 7.7 శాతంగా ఉండడం గమనార్హం. 2019–20లో 4 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. తాజా అంచనాల ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ 145.69 లక్షల కోట్లు. అయితే 2020–21లో ఈ విలువ 134.09 లక్షల కోట్లకు పడిపోయే వీలుంది. అంటే క్షీణత 8 శాతం ఉంటుందన్నమాట. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఎకానమీ 7.5 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని అంచనావేసిన ఆర్బీఐ, మూడవ త్రైమాసికంలో 0.1%, నాల్గవ త్రైమాసికంలో 0.7% వృద్ధి రేట్లు నమోదవుతాయని సమీక్షలో విశ్లేషించింది. తలసరి ఆదాయం 9.1% డౌన్! తాజా గణాంకాల ప్రకారం 2011–12 ధరలను ప్రాతిపదికగా (ద్రవ్యోల్బణం సర్దుబాటుతో) తీసుకుంటే, 2020–21లో తలసరి ఆదాయం రూ.85,929 ఉంటుందని అంచనా. 2019–20లో ఈ విలువ రూ.94,566. అంటే తలసరి ఆదాయంలో 9.1 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉంది. కాగా ప్రస్తుత ధరల ప్రాతిపదిగా చూస్తే, తలసరి ఆదాయం 4.8 శాతం క్షీణతతో రూ.1,34,186 నుంచి రూ.1,27,768కి పడిపోతుంది. -
ఆర్బీఐ మూడో‘సారీ’..
ముంబై: అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ (ఆర్బీఐ–ఎంపీసీ) ప్రధాన నిర్ణయం వెలువడింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 4 శాతంగానే కొనసాగించాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతను దీనికి కారణంగా చూపింది. ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 4% స్థాయిలో ఉండాలి. అయితే దీనికి మించి కొనసాగుతోంది. క్యూ4లో 5.8 శాతానికి ద్రవ్యోల్బణం! అక్టోబర్–డిసెంబర్ (క్యూ3), జనవరి–మార్చి (క్యూ4) కాలాల్లో ద్రవ్యోల్బణం వరుసగా 6.8 శాతం, 5.8 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ అంచనావేసింది. ఈ అంచనాల నేపథ్యంలో సరళతర వడ్డీరేట్ల విధానమే కొనసాగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. తద్వారా ద్రవ్యోల్బణం తగ్గితే వడ్డీరేట్లూ మరింత దిగివస్తాయని సూచించింది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. అకాల వర్షాలు, కార్మికుల కొరత, సేవల వ్యయాల తీవ్రత, అధిక కమోడిటీ ధరలు, పన్నులు, సరఫరాల్లో సమస్యల వంటి పలు సమస్యలు టోకు, రిటైల్ ధరల పెరుగుదలకు కారణాలని ఆర్బీఐ పాలసీ సమీక్ష విశ్లేషించింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు 1%) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటైల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న విశ్లేషణ చేస్తున్న ఆర్బీఐ, సరళతర పరపతి విధానాన్నే పాటించడానికి మొగ్గుచూపుతోంది. ఇక రెపో రేటు తగ్గించని నేపథ్యంలో.. రివర్ రెపో రేటు (బ్యాంకులు తన వద్ద డిపాజిట్‌చేసే అదనపు నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) కూడా యథాపూర్వం 3.35 శాతంగానే కొనసాగనుంది. డిపాజిటర్లకు ఊరట ఆర్బీఐ పాలసీ కమిటీ తాజా నిర్ణయం ప్రకారం, రుణ గ్రహీతలకు ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ల (ఈఎంఐ)ల భారం తగ్గే అవకాశాలు తక్కువ. అయితే ఇది డిపాజిట్లకు ఊరటనిచ్చే అంశం. బ్యాంకులు ఎఫ్డీలపై తదుపరి వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు లేవు. ఇప్పటికే ఏడాది ఆపైన కాలపరిమితుల స్థిర డిపాజిట్ రేటు 4.90–5.50% శ్రేణిలో ఉన్నాయని, ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోల్చితే ఇది నెగెటివ్ రిటర్న్స్ అనీ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. వడ్డీరేట్లు మరింత తగ్గి, ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంటే అది పొదుపులు, డిపాజిట్లు, కరెంట్ అకౌంట్లపై ప్రతికూల ప్రభావం చూపి సమీపకాలంలో వృద్ధికి విఘాతం కలిగిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు ఆర్బీఐ పాలసీ ప్రకటన స్పష్టం చేసింది. ద్రవ్య లభ్యతకు లోటుండదు ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత)కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చర్యలు ఉంటాయని ఆర్బీఐ భరోనాను ఇచ్చింది. ఇందుకు అవసరమైన సమయంలో అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. కార్పొరేట్ బ్యాండ్స్ మరింత విస్తరించడానికీ చర్యలు ఉంటాయని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పురోగతి 2020–21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణత 9.5 శాతం ఉంటుందని ఆర్బీఐ తాజా సమీక్షలో అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో స్థూల జీడీపీ భారీగా 23.9 శాతం క్షీణత దీనికి నేపథ్యం. అయితే ఈ అంచనాలను తాజాగా 7.5 శాతానికి మెరుగుపరిచింది. అలాగే గత సమీక్ష సందర్భంగా నాల్గవ త్రైమాసికంలోనే స్వల్ప వృద్ధి రేటు (0.5%) నమోదవుతుందని పేర్కొంది. తాజాగా ఈ అంచానాలనూ మెరుగుపరిచింది. మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 0.1%, నాలుగో త్రైమాసికంలో (జనవరి–మార్చి) 0.7% వృద్ధి రేట్లు నమోదవుతాయని పేర్కొంది. అక్టోబర్ పాలసీ సమీక్షలో డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 5.6% క్షీణత నమోదవుతుందని అంచనావేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ క్షీణత అంచనాలకన్నా మెరుగ్గా 7.5%గా నమోదుకావడం తెలిసిందే. నగదు వినియోగం తగ్గింపు చర్యలు కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీ పరిమితి పెంపు కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచుతూ పాలసీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 14వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. నిరంతరాయంగా ఆర్టీజీఎస్... భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (ఆర్టీజీఎస్) ఇక నిరంతరాయంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఆర్టీజీఎస్ సేవలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి నెలా రెండు, నాలుగు శనివారాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉండడం లేదు. 2019 డిసెంబర్లో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్ఈఎఫ్టీ) వ్యవస్థ నుంచి నిరంతరాయ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రూ.2 లక్షల వరకూ లావాదేవీలకు ఎన్ఈఎఫ్టీ సేవలను పొందవచ్చు. డిజిటల్ లావాదేవీల పెంపు లక్ష్యంగా 2019 జూలై నుంచి ఎన్ఈటీఎఫ్, ఆర్టీజీఎస్ ద్వారా లావేదేవీలపై చార్జీలను ఆర్బీఐ నిలుపుచేసింది. ప్రాఫిట్, డివిడెండ్లపై బ్యాంకులకు వరం... కోవిడ్–19 మహమ్మారి సవాళ్లను ఎదుర్కొనడానికి వీలుగా 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు లాభాలను తమవద్దే ఉంచుకోవాలని, డివిడెండ్లను చెల్లించవద్దని ఆర్బీఐ సూచించింది. కష్ట నష్టాలను ఎదుర్కోడానికి మద్దతుగా అలాగే రుణ మంజూరీలకు మూలధన నిర్వహణ కీలకమని ఈ సందర్భంగా పేర్కొంది. లాభాలు తమవద్దే ఉంచుకోవడం, అలాగే డివిడెండ్ చెల్లింపుల నిలిపివేతలకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు కూడా తెలిపింది. బ్యాంకుల తరహాలో డివిడెండ్ పంపిణీకి సంబంధించి ఎన్‌బీఎఫ్‌సీలకు మార్గదర్శకాలు ఏమీ లేవని కూడా ఈ సందర్భంగా ఆర్బీఐ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో జనవరిలో సమగ్ర మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. వృద్ధికి ఊతం– ఆర్థిక స్థిరత్వం లక్ష్యం ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వడానికి, ఆర్థిక స్థిరత్వానికి తగిన చర్యల తీసుకుంటున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ‘ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాల నేపథ్యంలో సరళతర ద్రవ్య పరపతి విధానాన్నే ఆర్బీఐ కొనసాగించనుంది. మహమ్మారి ప్రభావాన్ని జాగ్రత్తగా అంచనావేస్తూ, ఆర్థిక వ్యవస్థ పురోగతికి తగిన నిర్ణయాలను తీసుకుంటాం. ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ చెందుతోందని కీలక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్‌లో పాసింజర్, మోటార్‌సైకిల్ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి కనబడుతోంది. రైల్వే రవాణా పెరిగింది. విద్యుత్ డిమాండ్ మెరుగుపడింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ), అర్బన్ సహకార బ్యాంకులపై నిర్వహణా పరంగా మరింత పర్యవేక్షణ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ మరింత పటిష్టం అవుతోంది. పట్టణ డిమాండ్ మరింత మెరుగుపడుతోంది. వ్యాక్సిన్ వస్తోందన్న వార్తలు ఆశావహ పరిస్థితులను మెరుగుపరుస్తోంది. రానున్న 2021–22 బడ్జెట్ వృద్ధికి దోహదపడేదిగా ఉంటుందని విశ్వసిస్తున్నాం’ అని చెప్పారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్... ఆర్బీఐ యోచనకాదు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949కు అవసరమైన సవరణలు చేస్తూ, స్వయంగా బ్యాంకులను తెరవడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ చేసిన సిఫారసు అంశాన్ని ఆర్బీఐ గవర్నర్ తన పాలసీ ప్రకటనలో ప్రస్తావించారు. ఈ ప్రతిపాదన ఆర్బీఐ అంతర్గత కమిటీ చేసిన సూచన తప్ప, ఆర్బీఐది కాదన్న విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆర్బీఐ ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రేటింగ్ దిగ్జజం ఎస్అండ్పీ సహా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య, ప్రపంచబ్యాంక్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ బసు ఈ ప్రతిపాదనను బహిరంగంగానే తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. డిజిటల్ బ్యాంకింగ్‌పై విశ్వాసం పెంచాలన్నదే లక్ష్యం... కొత్త కార్డుల జారీ నిలిపివవేతసహా హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై తీసుకున్న పలు చర్యలను ఆర్బీఐ గవర్నర్ పాలసీ ప్రకటన సందర్భంగా ప్రస్తావించారు. డిజిటల్ బ్యాంకింగ్ పట్ల వినియోగదారుల విశ్వాసాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించాలన్నదే ఆర్బీఐ నిర్ణయం ఉద్దేశమని తెలిపారు. సాంకేతిక విభాగంపై బ్యాంకర్లు మరింత పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ వ్యవస్థ పటిష్టతకు తగిన చర్యలన్నింటినీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాజమాన్యం తీసుకుంటుందన్న విశ్వాసాన్నీ దాస్ వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆన్లైన్ సేవల అంతరాయల అంశాన్ని కూడా ఆర్బీఐ పరిశీలిస్తోందని తెలిపారు. వృద్ధికి దోహదం యథాతథ వడ్డీరేట్ల విధానాన్ని సెంట్రల్ బ్యాంక్ కొనసాగిస్తుందన్నది ఊహించిందే. అయితే సరళతర ఆర్థిక విధానాన్ని కొనసాగిస్తున్నట్లు చేస్తున్న ప్రకటన వృద్ధికి, మార్కెట్లకు ఊతం ఇచ్చే అంశం. పటిష్ట డిమాండ్ కొనసాగడానికి దోహదపడుతుంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ అరశాతం వరకూ తగ్గే చాన్స్ వృద్ధి పునరుద్ధరణ లక్ష్యంగా రెపో రేటు మరింత తగ్గడానికి తగిన వెసులుబాటు ఉంది. 2020–21 తదుపరి ద్వైమాసిక సమీక్షల సందర్భంగా రేటు పావు శాతం నుంచి అరశాతం వరకూ తగ్గే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కట్టడికి పటిష్ట చర్యలు అవసరం. – అభీక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ప్రోత్సాహకరం.. ఆర్థిక వ్యవస్థ క్షీణ రేట్లు సవరిస్తూ పాలసీ నిర్ణయం ప్రోత్సాహకరమైనది. కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలతో దేశం ఆర్థిక పురోగతితో వచ్చే ఏడాదిలోకి ప్రవేశిస్తుందని మేము ఆశిస్తున్నాం. సరఫరాల వ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉంటుంది. –సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ గృహ డిమాండ్‌కు ఊతం సరళతర ద్రవ్య పరపతి విధానాన్నే కొనసాగిస్తున్నట్లు పాలసీ ప్రకటన గృహ డిమాండ్‌కు ఊతం ఇవ్వడానికి దోహదపడుతుంది. తగిన వడ్డీరేట్లు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. డిమాండ్ పునరుద్ధరణ దిశలో ప్రత్యేకించి మధ్య తరగతికి హర్షదాయకమైన పాలసీ నిర్ణయం ఇది. – నిరంజన్ హిరనందని, నరెడ్కో ప్రెసిడెంట్ వడ్డీరేట్ల తగ్గింపు కష్టమే రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో రేటు తగ్గింపు కష్టం. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి ఉంటుందని భావిస్తున్నాం. అయితే సరళతర విధానాన్నే కొనసాగించాలన్న నిర్ణయం దీర్ఘకాలంపాటు వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయనడానికి సంకేతంగా భావించవచ్చు. – అదితీ నయ్యర్, ప్రిన్సిపల్ ఎకనమిస్ట్, ఐసీఆర్ఏ -
జీడీపీ బౌన్స్‌బ్యాక్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రికవరీ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు 7.5 శాతానికి పరిమితమయ్యింది. నిజానికి క్షీణత ‘సింగిల్ డిజిట్’కు పరిమితమవుతుందని పలు విశ్లేషణలు వచ్చినప్పటికీ, ఇంత తక్కువగా నమోదవుతుందని అంచనావేయలేదు. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం క్షీణిస్తుందని అంచనావేసింది. తయారీ, వ్యవసాయం, విద్యుత్, గ్యాస్ రంగాలు ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీకి చేయూతను ఇచ్చాయి. వినియోగ డిమాండ్ మెరుగుపడితే రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ మరింత ఊపునందుకునే అవకాశం ఉందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితులతో భారత్ ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారీగా 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ 4.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. వివిధ రంగాలు చూస్తే...: తయారీ: జూన్ నుంచీ కఠిన లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఊపందుకుంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో దాదాపు 15% వాటా ఉన్న తయారీ రంగం 0.6% వృద్ధి నమోదుచేసుకోవడం గమనార్హం. జూన్ క్వార్టర్లో ఈ విభా గం 39% క్షీణించింది. ► వ్యవసాయం: జీడీపీలో దాదాపు 15% వాటా ఉన్న వ్యవసాయం 3.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► విద్యుత్, గ్యాస్: 4.4% వృద్ధిని సాధించాయి. ► ఫైనాన్షియల్, రియల్టీ సేవలు: ఈ విభాగాలు క్షీణతలోనే ఉన్నాయి. 8.1 శాతం మైనస్ నమోదయ్యింది. ► ట్రేడ్, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్ విభాగాలు సైతం 15.6 శాతం నష్టాల్లోనే (క్షీణత) ఉన్నాయి. ► నిర్మాణం: ఆర్థిక వ్యవస్థలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఈ రంగం క్షీణత 8.6 శాతం. అయితే క్యూ1లో భారీగా ఇది 50% క్షీణించింది. ► ప్రభుత్వ వ్యయాలు: ఆందోళనకరంగానే ఉన్న ప్రభుత్వ వ్యయాలు మరో అంశం. ప్రభుత్వ వ్య యాలు సెప్టెంబర్ క్వార్టర్లో 12% క్షీణించింది. క్షీణత ఇలా...: జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటన ప్రకారం, 2020–21 సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.33.14 లక్షల కోట్లు. 2019–20 ఇదే కాలంలో ఈ విలువ 35.84 లక్షల కోట్లు. అంటే విలువలో ఎటువంటి వృద్ధిలేకపోగా 7.5 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. సాంకేతికంగా మాంద్యమే... ఒక ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాలు క్షీణ రేటును నమోదుచేస్తే, ఆ పరిస్థితిని మాంద్యంగా పరిగణిస్తారు. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో భారత్ వరుస క్షీణ రేటును నమోచేసిన నేపథ్యంలో దేశం సాంకేతికంగా మాంద్యంలోకి జారిపోయినట్లే భావించాల్సి ఉంటుంది. మొదటి ఆరు నెలల కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 15.7 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 4.8 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. అయితే ఎకానమీ ‘వీ’ నమూనా వృద్ధి నమోదుచేసుకుంటుందని ఆర్థిక నిపుణులు భరోసాతో ఉండడమే ఊరట. దేశంలో క్రమంగా వినియోగ డిమాండ్ పుంజుకుంటోంది. ఆటో మొబైల్ పరిశ్రమ బాగుంది, నాన్–డ్యూరబుల్ రంగం మెరుగుపడుతోంది. రైలు రవాణా పెరుగుతోంది. వచ్చే ఏడాది తొలి నెలల్లోనే వ్యాక్సిన్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ వృద్ధికి ఊతం ఇచ్చేవి కావడం గమనార్హం. అయితే సెకండ్‌వేవ్ కేసుల భయాలూ ఉన్నాయి. ఇది రానున్న రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థను ప్రతికూలతలోకి నెడతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న దానికన్నా (4% వద్ద నిర్దేశం) అధికంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండడం గమనార్హం. వృద్ధి బాటలో చైనా దూకుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుసహా ప్రపంచంలోని పలు దేశాల ఎకానమీలు కరోనా ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారిన నేపథ్యంలో... ఈ మహమ్మారికి పుట్టినిల్లు చైనా మాత్రం వృద్ధి బాటన సాగుతోంది. ఈ ఏడాది వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును (2019 ఇదే కాలంతో పోల్చి) నమోదుచేసుకుంది. కరోనా సవాళ్లతో మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. 2020తో తొలి ఆరు నెలల కాలం (జనవరి–జూన్) చూసుకుంటే 1.6 శాతం క్షీణతలో ఉన్న చైనా, మూడు త్రైమాసికాలు కలిపితే 0.7 శాతం పురోగతిలో ఉంది. అక్టోబర్‌లో మౌలికం 2.5 శాతం క్షీణత మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి అక్టోబర్‌లో 2.5 శాతం మేర క్షీణించింది. ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు ఉత్పత్తి పడిపోవడం ఇందుకు కారణం. మౌలిక రంగం క్షీణించడం ఇది వరుసగా ఎనిమిదో నెల. మార్చి నుంచి ఇది క్షీణ బాటలోనే ఉంది. 2019 అక్టోబర్‌లో ఎనిమిది మౌలిక పరిశ్రమల ఉత్పత్తి 5.5 శాతం క్షీణత నమోదు చేసింది. బొగ్గు, ఎరువులు, సిమెంట్, విద్యుదుత్పత్తి సానుకూల వృద్ధి కనపర్చగా, క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో చూస్తే మౌలికం 13% క్షీణించింది. గతేడాది ఇదే వ్యవధిలో 0.3% వృద్ధి నమోదైంది. విభాగాల వారీగా .. అక్టోబర్‌లో బొగ్గు ఉత్పత్తి 11.6%, సిమెంట్ (2.8%), విద్యుత్ (10.5%) వృద్ధి నమోదు చేశాయి. మరోవైపు క్రూడాయిల్ 6.2 శాతం, సహజ వాయువు 8.6%, రిఫైనరీ ఉత్పత్తులు 17 శాతం, ఉక్కు 2.7 శాతం మేర ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. 1950–51నుంచి భారత్ జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు – 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్ వృద్ధి నమోదైంది. అంచనాలు నిజమైతే 2020–21 ఆరవసారి అవుతుంది. అబ్బురపరుస్తున్నాయ్... ఆర్థిక రికవరీ అబ్బుర పరుస్తోంది. ప్రత్యేకించి తయారీ రంగం సానుకూలతలోకి రావడం హర్షణీయం. వ్యవస్థలో తిరిగి డిమాండ్ నెలకొంటోందని ఈ అంశం సూచిస్తోంది. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రోత్సాహకరం మహమ్మారి ప్రేరిత అంశాలు, గత త్రైమాసికం తీవ్ర నిరాశాకర ఫలితాల నేపథ్యంలో వెలువడిన తాజా గణాంకాలు కొంత ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ కొంత ఆందోళన కూడా ఉంది. ఆర్థిక క్షీణత మహమ్మారి వల్లే. ఈ సవాలు ఇంకా కొనసాగుతోంది. – కృష్ణమూర్తి సుబ్రమణ్యం, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ద్వితీయార్ధంలో ‘వృద్ధి’కి అవకాశం ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యలు, సంస్కరణలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో (అక్టోబర్–మార్చి) దేశం వృద్ధి బాటకు వస్తుందన్న విశ్వాసం కనబడుతోంది. 2021–22లో వృద్ధి రెండంకెల్లో నమోదు అవుతుందని భావిస్తున్నాం. అక్టోబర్‌లో భారీగా పెరిగిన వినియోగ డిమాండ్ ఆశావహ పరిస్థితులను సృష్టిస్తోంది. అయితే సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనడమే ప్రస్తుతం కీలకాంశం. – ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ విశ్వాసాన్ని పెంచుతున్నాయ్ తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతున్నాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితులను క్రమంగా సడలిస్తున్న నేపథ్యం ఇది. ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక వ్యవస్థ సంస్కరణలు ఫలితాలను అందిస్తున్నాయి. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుందని భావిస్తున్నాం. వినియోగ డిమాండ్ మున్ముందు పుంజుకునే అవకాశం ఉంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ తయారీలో విజయం అంచనాలకు మించి సానుకూల ఫలితం రావడం హర్షణీయం. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీ బాటలో ఉన్నట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా తయారీ రంగంలో సానుకూలత మంచి పరిణామం. ప్రోత్సాహకరమైనది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల ఫలితమిది. – సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ ముందుముందు మంచికాలం ఫలితాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. తాజా ఫలితాలను చూస్తుంటే, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లోనూ మంచి ఫలితాలు వెలువడతాయన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఆర్థిక వ్యవస్థలో పలు విభాగాలు పురోగతి బాటన పయనిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం మెరుగుపడుతోంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
ఆరోగ్య రంగంపై వ్యయాలు పెరగాలి
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సిన అవసరం ఉందని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ బుధవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ విలువ కేవలం 0.95 శాతం ఉందని పేర్కొన్న ఆయన, 2024నాటికి ఇది 2.5 శాతానికి చేరాలని సూచించారు. దురదృష్టవశాత్తూ, ఆరోగ్య రంగానికి సంబంధించి దేశంలో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆసియా హెల్త్ 2020 అనే అంశంపై పారిశ్రామిక వేదిక సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సింగ్ మాట్లాడారు. ఆరోగ్య రంగంలో సవాళ్లను ఏ ఒక్కరో ఎదుర్కొనలేరనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ... ఈ రంగంపై కేటాయింపులను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వాల నుంచి చర్యలు ఉంటాయని తాను విశ్వసిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఎంబీబీఎస్ కోర్సు పరిధి పెంచడం వంటి రెగ్యులేటరీ మార్పులను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం... ఆరోగ్య సేవల రంగంలో ప్రైవేటు రంగం భాగస్వామ్యం కూడా కీలకమని సింగ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వినూత్న నైపుణ్యలతో ప్రైవేటు రంగం చక్కటి సేవలను అందించగలుగుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో మంచి ఫలితాలను సాధించవచ్చని అన్నారు. కోవిడ్–19ను ఎదుర్కొనడంలో ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్న సింగ్, ఆరోగ్య సేవల విషయంలో మరింత గుర్తింపు లభించడానికి వారు అర్హులని అన్నారు. ‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్’ ప్రస్తావన ‘‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ ఏర్పాటవుతుందని 1951 సివిల్ సర్వీసెస్ యాక్ట్ పేర్కొంది. ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే, అప్పటి నుంచీ ఈ తరహా సర్వీస్ ఏదీ ఏర్పాటు కాలేదు’’ అని సందర్భంగా పేర్కొన్న సింగ్, అంతర్జాతీయ ప్రమాణాలు, ఇప్పటికే చోటుచేసుకున్న పరిణా మాలు, ఉదాహరణల ప్రాతిపదికన ఈ సర్వీసు ఏర్పాటుకావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆరోగ్యం రంగం పలు సమస్యలు, సవాళ్ల వలయంలో చిక్కుకుందనీ వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తరహాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్)ను ఏర్పాటు చేయాలని ఇండియన్ మెడికన్ అసోసియేషన్ (ఐఎంఏ) గత కొంత కాలంలో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2021–22 నుంచి 2025–26 మధ్య దేశ ఆర్థిక రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై సింగ్ నేతృత్వంలోని 15వ ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీలకు తన సిఫారసులను సమర్పించిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత నివేదికాంశాలు వెల్లడవుతాయి. -
కోవిడ్–19పై శక్తివంచనలేకుండా పోరు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థను, ప్రజారోగ్యాన్ని కోవిడ్–19 ప్రభావం నుంచి తప్పించడానికి తగిన చర్యలను నిరంతరం తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్ డెవలప్మెంట్ కమిటీ ప్లీనరీ 102వ సమావేశాన్ని ఉద్దేశించి శుక్రవారం ఆమె మాట్లాడారు. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతానికి సమానమైన ఉద్దీపన ప్యాకేజ్సహా, కార్మిక రంగంలో భారీ సంస్కరణలను తీసుకువస్తున్నట్ల వివరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... కరోనా వైరస్ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. పేదరికం నిర్మూలనకు పలు సంవత్సరాలుగా జరుగుతున్న కృషి తాజా పరిస్థితుల్లో నీరుగారిపోయే వాతావరణం నెలకొంది. మహమ్మారి ప్రభావం సామాజిక, ఆర్థిక రంగాలపై పడకుండా తగిన చర్యలు అన్నింటినీ భారత్ ప్రభుత్వం తీసుకుంటోంది. నాబార్డ్ ద్వారా రీఫైనాన్షింగ్ మద్దతు మార్గంలో గ్రామీణ రంగానికి అండగా నిలవడం జరుగుతోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులను పెంచడం జరిగింది. ప్రత్యేకించి ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడానికి తగిన కృషి జరుగుతోంది. మహమ్మారి నిర్మూలనకు ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉంది. ఈ దిశలో తనవంతు సహకారం, అనుభవ పాఠాలను అందించడానికి భారత్ సిద్ధంగా ఉంటుంది. 80 సంవత్సరాల్లో ఎన్నడూలేని విపత్కర పరిస్థితి: ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ కాగా కరోనా మహమ్మారి ప్రతికూలతల నేపథ్యంలో ప్రపంచం గత 80 సంవత్సరాల్లో ఎన్నడూ లేని పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడ్డాయి. రెండు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల వార్షిక సమావేశం శుక్రవారం ముగిసింది. అనంతరం విడుదలైన ఒక సంయుక్త ప్రకటన విడుదలైంది. ‘‘కోవిడ్–19 వల్ల ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగింది. అసమానతలు తీవ్రమయ్యాయి. దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ సమస్య తీవ్రత ఇంకా కొనసాగుతోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రపంచదేశాలన్నీ ఒకతాటిపైకి రావాలి. పరస్పర సహకారంతోనే సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది’’ అని ప్రకటన పేర్కొంది. ఇదిలావుండగా, జూన్ 2021 నాటికి కరోనా వైరస్ పోరులో భాగంగా 160 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించడానికి ప్రపంచబ్యాంక్ తగిన కృషి జరపాలని బ్యాంక్ స్టీరింగ్ కమిటీ శుక్రవారం విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి చెందిన దేశాలకు అదనపు అత్యవసర నిధి, రుణ సౌలభ్యతలను కలిగించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల సహాయం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్ కూడా కరోనా పోరు విషయంలో తన చర్యలను మరింత ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేసింది. -
తలసరి ఆదాయంలో భారత్‌ను మించనున్న బంగ్లా!
న్యూఢిల్లీ: తలసరి ఆదాయం విషయంలో 2020లో భారత్‌ను పొరుగున ఉన్న బంగ్లాదేశ్ మించిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేస్తోంది. ఒక దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువను ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. ఐఎంఎఫ్ ‘‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’’ నివేదిక ప్రకారం, 2021 మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత్ తలసరి ఆదాయం 1,877 డాలర్లుగా (డాలర్ మారకంలో రూపాయి విలువ 70 ప్రకారం చూస్తే, రూ.1,31,390)నమోదుకానుంది. ఇక ఇదే కాలంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 1,888 డాలర్లకు పెరగనుంది. కరోనా సవాళ్ల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 2020లో 10.3% క్షీణిస్తుందని ఐఎంఎఫ్ ఇదే నివేదికలో అంచనావేసింది. కొనుగోలు శక్తి ప్రమాణాల్లో భారత్‌దే పైచేయి! ఐఎంఎఫ్ అంచనాల ప్రభావాన్ని తగ్గించే గణాంకాలను అధికార వర్గాలు ప్రస్తావిస్తుండడం ఇక్కడ మరో అంశం. దేశాల ఉత్పాదకత, కరెన్సీల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలకు సంబంధించిన పర్చేజింగ్ పవర్ ప్యారిటీ (పీపీపీ) విధానం ప్రకారం చూస్తే, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2019లో బంగ్లాదేశ్‌కన్నా 11 రెట్లు అధికమని అధికార వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. తలసరి ఆదాయంలో భారత్‌ను బంగ్లాదేశ్ అధిగమించనున్నదన్న ఐఎంఎఫ్ అంచనాలను ప్రస్తావిస్తూ, ‘‘ఆరు సంవత్సరాల్లో బీజేపీ పాలన సాధించిన ఘనత ఇదీ’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఒక ట్వీట్ నేపథ్యంలో అధికార వర్గాలు తాజా వివరణ ఇచ్చాయి. 2014– 15లో రూ.83,091గా ఉన్న భారత్ తలసరి ఆదా యం 2019–20లో రూ.1,08,620కి చేరిందని అధి కార వర్గాలు వివరించారు. పీపీపీ విధానం ప్రకారం, 2020లో భారత్ తలసరి ఆదాయం 6,284 డాలర్లు ఉంటుందని అంచనావేసిన ఐఎంఎఫ్, బంగ్లాదేశ్ విషయంలో దీన్ని 5,139 డాలర్లుగానే లెక్కగట్టడాన్ని అధికారులు ప్రస్తావించారు. జీడీపీలో 90 శాతానికి కేంద్ర రుణ భారం వాషింగ్టన్: కరోనా నేపథ్యంలో గవర్నమెంట్ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, స్వల్పకాలిక రుణాలకు సంబంధించిన కేంద్ర రుణ భారం(పబ్లిక్ డెట్) భారీగా పెరిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనావేస్తోంది. 1991 నుంచీ జీడీపీలో పబ్లిక్ డెట్ స్థిరంగా దాదాపు 70% వద్ద కొనసాగుతుండగా, తాజా పరిస్థితుల్లో ఇది దాదాపు 90 వరకూ పెరిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ ఫైనాన్షియల్ వ్యవహారాల డైరెక్టర్ విక్టర్ గ్యాస్పర్ తెలిపారు. -
కరెంట్ అకౌంట్ మిగులు @ 20 బిలియన్ డాలర్లు
ముంబై: కరెంట్ అకౌంట్ లావాదేవీల విషయంలో 2020 వరుసగా రెండవ త్రైమాసికం ఏప్రిల్–జూన్‌లోనూ భారత్ మిగులను నమోదు చేసుకుంది. ఈ మొత్తం 19.8 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. సంబంధిత త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 3.9 శాతం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా కరెంట్ అకౌంట్ మిగులు 0.6 బిలియన్ డాలర్లు (0.1 శాతం) నమోదయ్యింది. అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది. వస్తువులు, సేవలకు సంబంధించి ఒక దేశం ఎగుమతులు–దిగుమతుల లావాదావీల వ్యయాలు, విదేశీ ఇన్వెస్టర్లకు చేసిన చెల్లింపులు, వారి నుంచి వచ్చిన నిధులు, ఆయా పరిమాణాల వ్యత్యాసాలు అన్నీ కరెంట్ అకౌంట్లోకి వస్తాయి. సహజంగా భారత్ కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్)ను కలిగి ఉంటుంది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో దిగుమతులు భారీగా పడిపోవడంతో కరెంట్ అకౌంట్ మిగులు నమోదవుతోంది. 2019–20లో కరెంట్ అకౌంట్ లోటు 24.6 బిలియన్ డాలర్లు. జీడీపీలో ఇది 0.9 శాతం. 2020–2021లో 30 బిలియన్ డాలర్ల కరెంట్ అకౌంట్ ‘మిగులు’ ఉంటుందని ఇక్రా అంచనా. -
ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పడిపోనుందన్న వార్తల ఆధారంగా భారత్ సత్తాను అంచనా వేయరాదని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని, 2050 నాటికి రెండో అతి పెద్ద ఎకానమీగా భారత్ ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదం ఇందుకు కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. జేపీ మోర్గాన్ ఇండియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా అదానీ ఈ విషయాలు తెలిపారు. ‘జీడీపీ గణాంకాల ఫ్యాన్స్‌కు కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నాను. 1990లో ప్రపంచ జీడీపీ 38 లక్షల కోట్లుగా ఉండేది. 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు 90 లక్షల కోట్లుగా ఉంది. మరో 30 ఏళ్ల తర్వాత..అంటే 2050లో ఇది సుమారు 170 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. అప్పటికి భారత్ నిస్సందేహంగా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఎకానమీగా మారుతుంది‘ అని అదానీ పేర్కొన్నారు. అంతర్జాతీయ సంక్షోభం తగిలే ఎదురుదెబ్బలు స్వల్పకాలికమైనవేనని, వీటి ఆధారంగా భారత్ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయొద్దని ఆయన సూచించారు. ఓర్పు, దీర్ఘకాలిక ప్రణాళిక, వ్యాపారాలకు సంబంధించి ప్రభుత్వ ఎజెండా ఆధారంగా పనిచేయడం కీలకమని ఆయన చెప్పారు. సవాళ్లు ఉన్నాయ్..కానీ.. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. దేశానికి వచ్చే దశాబ్ద కాలంలో 1.5–2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమని అదానీ చెప్పారు. జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల ఫండ్ ఏర్పాటు వంటి కీలకమైన వ్యవస్థాగత సంస్కరణలు అమల్లోకి తెచ్చినప్పటికీ సాధికారిక నియంత్రణ సంస్థలు లేకపోవడమనేది జాతి నిర్మాణం, పెట్టుబడుల అవకాశాలకు అవరోధంగా ఉంటోందని ఆయన తెలిపారు. ‘ఒక వ్యాపారవేత్తగా నేను ఆశావహంగా ఉంటాను. నా కళ్లతో చూడండి. పుష్కలంగా వ్యాపార అవకాశాలు కనిపిస్తాయి. స్వల్పకాలిక ఆలోచనలతో దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేయలేమని నేను భావిస్తాను. పాత చింతకాయ పచ్చడి లాంటి పాశ్చాత్య వృద్ధి గణాంకాల కోణం నుంచి ఇతర దేశాలను చూడటం మానుకోవాలి. ఒకో దేశంలో ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక్కో రకంగా ఉంటుందని గుర్తించాలి‘ అని అదానీ సూచించారు. రూపాయికి 800 రెట్లు లాభం.. రెండున్నర దశాబ్దాల క్రితం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.1 ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుతం 800 రెట్లు రాబడులు అందుకునే వారని అదానీ తెలిపారు. నౌకాశ్రయాలు మొదలుకుని విమానాశ్రయాల దాకా వివిధ రంగాల్లోకి విస్తరించిన తమ గ్రూప్ ఆరు లిస్టెడ్ కంపెనీలను ఏర్పాటు చేసిందని, వేల కొద్దీ ఉద్యోగాలు సృష్టించడంతో పాటు షేర్హోల్డర్లకు అసాధారణ రాబడులు అందించిందని వివరించారు. కాలేజ్ చదువును మధ్యలోనే వదిలేసిన అదానీ ముందుగా కమోడిటీల్లో ట్రేడింగ్‌తో ప్రారంభించి దేశీయంగా అతి పెద్ద వ్యాపార గ్రూప్‌లలో ఒకదాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు. అదానీ ఎంటర్ప్రైజెస్ 1994లో ఐపీవోకి వచ్చింది. -
జీడీపీ మైనస్ 11.5 శాతానికి..
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మైనస్ 11.5 శాతం క్షీణిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ శుక్రవారం పేర్కొంది. ఈ మేరకు క్రితం అంచనా మైనస్ 4 అంచనాలకు మరింత పెంచుతున్నట్లు ప్రకటించింది. వృద్ధి బలహీనత, అధిక రుణ భారం, బలహీన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నేపథ్యంలో భారత్ క్రెడిట్ ప్రొఫైల్ (రుణ సమీకరణ సామర్థ్యం) ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉందని మూడీస్ పేర్కొంది. కరోనా ప్రతికూలతలు ఈ పరిస్థితులను మరింత దిగజార్చాయని వివరించింది. దేశ ద్రవ్య పటిష్టతకు దీర్ఘకాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పకపోవచ్చని విశ్లేషించింది. కాగా తక్కువ బేస్ ఎఫెక్ట్ (2020–21లో భారీ క్షీణత కారణంగా) ప్రధాన కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) భారత్ 10.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉందని తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 90 శాతానికి భారత్ రుణ భారం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం జీడీపీలో భారత్ రుణ భారం 72 శాతం. ► ఇక ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 7.5 శాతానికి చేరే అవకాశం ఉంది. రాష్ట్రాలకు ద్రవ్యలోటు జీడీపీలో 4.5 శాతం ఉంటుందని భావిస్తున్నాం. 2020 (ఏప్రిల్)–2021 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.7.96 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. 2020–21 అంచనాలో 3.5% దాటకూడదన్నది ఈ లక్ష్యం ఉద్దేశం. అయితే ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలూ గడిచే సరికే– అంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్య నాటికే ద్రవ్యలోటు రూ.8,21,349 కోట్లకు చేరింది. అంటే వార్షిక లక్ష్యంలో 103.1 శాతానికి చేరిందన్నమాట.గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.6 శాతం. ► జీ–20 దేశాలతో పోల్చిచూస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లుగా మరే ఇతర ఆర్థిక వ్యవస్థ నష్టపోలేదు. ► ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వ పరంగా ద్రవ్య పరమైన మద్దతు చర్యలు తీసుకోడానికి పల్లు క్లిష్ట పరిస్థితులు, పరిమితులు ఉన్నాయి. ► బలహీన మౌలిక వ్యవస్థ, కార్మిక, భూ, ప్రొడక్ట్ మార్కెట్లలో క్లిష్ట పరిస్థితులు వృద్ధికి అవరోధాలు కలిగిస్తున్న అంశాలు. ► ఇక బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల మొండిబకాయిల సమస్యలు మరింత తీవ్రం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ► సమీప భవిష్యత్తులో రేటింగ్‌ను పెంచే అవకాశాలు లేవు. ప్రభుత్వం తీసుకుంటున్న విధాన చర్యలు వృద్ధి బాటలో పురోగతికి సహకరిస్తున్నాయని గణాంకాలు వెల్లడించేవరకూ రేటింగ్ పెంపు ఉండబోదు. భారత్ సావరిన్ రేటింగ్‌ను జూన్‌లో మూడీస్– నెగెటివ్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’కి కుదించింది. ఇది చెత్త స్టేటస్‌కు ఒక అంచ ఎక్కువ. ► పర్యవేక్షణలో పటిష్టత, ఫైనాన్షియల్ రంగంలో స్థిరత్వం వంటి లక్ష్యాల సాధనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తే, వృద్ధి రికవరీ వేగవంతం అయ్యే వీలుంది. కేర్ రేటింగ్స్ అంచనా మైనస్ 8.2 శాతం కాగా దేశీయ రేటింగ్ సంస్థ కేర్ రేటింగ్స్ శుక్రవారం మరో నివేదికను విడుదల చేస్తూ, 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు మైనస్ 8% నుంచి 8.2% వరకూ ఉంటుందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ క్షీణ అంచనా మైనస్ 6.4% కావడం గమనార్హం. ప్రభుత్వం నుంచి తగిన ద్రవ్యపరమైన మద్దతు ఆర్థిక వ్యవస్థకు అందకపోవడమే తమ అంచనాల పెంపునకు కారణమని కేర్ రేటింగ్స్ తెలిపింది. అందరి అంచనాలూ క్షీణతే.. మొదటి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం క్షీణ రేటును నమోదు చేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 10శాతం నుంచి 15 శాతం వరకూ ఉంటాయని అంచనా వేశాయి. ఆయా అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో) సంస్థ తాజా క్రితం అంచనా అంచనా గోల్డ్‌మన్ శాక్స్ 14.8 11.8 ఫిచ్ 10.5 5.0 ఇండియా రేటింగ్స్ – రిసెర్చ్ 11.8 5.3 ఎస్బీఐ ఎకోర్యాప్ 10.9 6.8 -
కేంద్ర చర్యల చేయూత నామమాత్రమే!
ముంబై: ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న విధాన చర్యల ఫలితాలు ఇప్పటి వరకూ నామమాత్రంగానే ఉన్నట్లు రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ గురువారం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మేలో వేసిన మైనస్ 5 శాతం క్షీణ అంచనాలను ప్రస్తుతం మైనస్ 9 శాతానికి పెంచుతున్నట్లు కూడా క్రిసిల్ పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా ఎటువంటి ద్రవ్య పరమైన మద్దతూ లభించని పరిస్థితి, కరోనా వైరస్ సవాళ్లు కొనసాగుతున్న ప్రతికూలతలు కూడా తమ క్షీణ అంచనాలకు కారణమని తెలిపింది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2020–21) క్షీణత రేటు భారీగా 23.9 శాతం నమోదయిన నేపథ్యంలో ఆవిష్కరించిన క్రిసిల్ తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల సహాయక ప్యాకేజీ ప్రకటించింది. ఈ పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం. అయితే వాస్తవంగా తాజా వ్యయాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రెండు శాతంకన్నా తక్కువగా ఉండడం గమనార్హం. ► ఆర్థిక వ్యవస్థ వృద్ధికిగాను ప్రభుత్వ పరంగా భారీ వ్యయాలు చేయడానికి తగిన ద్రవ్య పరిస్థితులు లేవు. ప్రభుత్వ ప్రత్యక్ష ద్రవ్య మద్దతు జీడీపీలో కనీసం ఒక శాతం ఉంటుందని మే అంచనాల నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటివరకూ ఈ స్థాయి ప్రత్యక్ష ద్రవ్య మద్దతు లభించలేదు. ► అక్టోబర్ నాటికి కరోనా కేసుల పెరుగుదల ఆగిపోతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (మార్చి నాటికి) జీడీపీ వృద్ధి రేటు కొంత సానుకూల బాటలోకి మళ్లే వీలుంది. ► భారత ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి ఒక ‘‘శాశ్వత మచ్చ’’ను మిగల్చనుంది. ► స్వల్పకాలికంగా చూస్తే, జీడీపీకి 13 శాతం శాశ్వత నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విలువ దాదాపు రూ.30 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. -
మళ్లీ ‘డ్రాగన్’ షాక్!
స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. దీంతో ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి చైనా బలగాలు మళ్లీ తూర్పు లద్దాఖ్‌లో చొరబడటంతో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింతగా ముదురుతాయనే భయాలు దీనికి ప్రధాన కారణం. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,400 పాయింట్లు దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ట్రేడింగ్ ఆరంభంలోనే కీలకమైన స్థాయిలకు ఎగియడంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, క్యూ1 జీడీపీ గణాంకాలు ఎలా ఉండనున్నాయో అనే అనిశ్చితి, నేటి(మంగళవారం) నుంచి కొత్త ‘మార్జిన్’ నిబంధనలు అమల్లోకి రానుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు పతనం కావడం....ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 839 పాయింట్ల నష్టంతో 38,628 పాయింట్ల వద్ద, నిఫ్టీ 260 పాయింట్లు క్షీణించి 11,388 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2.13 శాతం, నిఫ్టీ 2.23 శాతం చొప్పున నష్టపోయాయి. గత మూడు నెలల కాలంలో ఈ సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 1,614 పాయింట్లు పతనమైంది. ఇక జపాన్ సూచీ లాభపడగా, మిగిలిన ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. సెబీ కొత్త ‘మార్జిన్’ నిబంధనలు... స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రూపొందించిన మార్జిన్ నిబంధనలు నేటి(మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు కఠినంగా ఉన్నాయని, మార్పులు, చేర్పులు చేస్తే మంచిదని, ఈ నిబంధనల అమలుకు సాంకేతికంగా సిద్ధంగా లేమని, ఒకవేళ మార్పులు చేయకపోయినా, వీటి అమలును ఈ నెల 30కు వాయిదా వేయాలని పలు బ్రోకరేజ్ సంస్థలు విన్నవించాయి. ఈ విన్నపాన్ని సెబీ మన్నించలేదు. ఈ నేపథ్యంలో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో జోరుగా లాభాల స్వీకరణ జరిగింది. మరిన్ని మార్కెట్ విశేషాలు... ► సన్‌ఫార్మా షేర్ 7 శాతం నష్టంతో రూ.518 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► 30 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు–ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ► ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ డీల్ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ షేర్లన్నీ అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ రిటైల్ 20 శాతం లాభంతో రూ.163కు చేరింది. ► స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనా, వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ► రూ.4.55 లక్షల కోట్ల సంపద ఆవిరి ► స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా రూ.4.55 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,55,915 కోట్లు హరించుకుపోయి రూ.153.76 లక్షల కోట్లకు పడిపోయింది. -
జీడీపీ క్రాష్!
న్యూఢిల్లీ: కరోనా విలయతాండవంతో భారత ఎకానమీ కుప్పకూలింది. ఆర్థిక విశ్లేషకులు, సంస్థలు, విధాన నిర్ణేతల అంచనాలకు మించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పాతాళానికి జారిపోయింది. గత ఏడాది కాలంతో పోలిస్తే, అసలు వృద్ధిలేకపోగా మైనస్ 23.9 శాతం క్షీణించింది. కరోనా నేపథ్యంలో దేశంలో అమలుచేసిన కఠిన లాక్డౌన్ దీనికి ప్రధాన కారణం. గడిచిన 40 ఏళ్లలో దేశ జీడీపీ మళ్లీ మైనస్‌లోకి జారిపోవడం ఇదే తొలిసారి కాగా, చరిత్రలో ఇంతటి ఘోర క్షీణత నమోదవడం కూడా మొట్టమొదటిసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో దేశంలో పడిపోయిన పెట్టుబడులు, వినియోగం పరిస్థితులను కరోనా వైరస్ మరింత కుంగదీసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 3.1% అయితే 2019 ఇదే త్రైమాసికంలో 5.2%. అధికారికంగా సోమవారం విడుదలైన జీడీపీ లెక్కను పరిశీలిస్తే, త్రైమాసిక గణాంకాలు ప్రారంభమైన 1996 నుంచీ ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణ పతనం ఇదే తొలిసారి. వ్యవసాయ రంగం ఒక్కటే గణాంకాల్లో కొంత ఊరటనిచ్చింది. మిగిలిన దాదాపు అన్ని రంగాల్లో క్షీణ ధోరణి కనిపించింది. 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఆర్థిక వ్యవస్థపై అంచనాలు వేయడం క్లిష్టమైన వ్యవహారమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో అస్పష్ట ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని పేర్కొంది. అయితే క్షీణ రేటు మైనస్ 15–20% ఉంటుందని పలు విశ్లేషణా సంస్థలు అంచనావేస్తున్నాయి. విలువల్లో చూస్తే... జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్ఎస్ఓ), గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.35.35 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.26.90 లక్షల కోట్లు. వెరసి మైనస్ –23.9 శాతం క్షీణ రేటు నమోదయ్యిందన్నమాట. ఇక కేవలం వస్తు ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) ప్రకారం జీడీపీ విలువ రూ.33.08 లక్షల కోట్ల నుంచి రూ.25.53 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇక్కడ విలువ మైనస్ 22.8% క్షీణించిందన్నమాట. వ్యవ‘సాయం’ ఒక్కటే ఊరట ► వ్యవసాయం: వ్యవసాయ రంగం 3.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ► ఫైనాన్షియల్, రియల్టీ, వృత్తిపరమైన సేవలు: మైనస్ 5.3% క్షీణించింది. ► పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు: క్షీణత రేటు మైనస్ 10 శాతంగా ఉంది. ► వాణిజ్యం, హోటల్స్ రవాణా, కమ్యూనికేషన్లు: ఈ విభాగాలు ఎన్నడూ లేనంతగా మైనస్ 47 శాతం పతనమయ్యాయి. ► తయారీ: మైనస్ 39.3% కుదేలైంది. ► నిర్మాణం: మైనస్ 50.3% కుప్పకూలింది. ► మైనింగ్: మైనస్ 23.3% క్షీణించింది. ► విద్యుత్, గ్యాస్: క్షీణత మైనస్ 7%. ఊహించని షాక్ వల్లే... అంతర్జాతీయంగా ప్రతి దేశాన్నీ షాక్‌కు గురిచేసిన కరోనా వైరస్ ప్రభావమే తొలి త్రైమాసిక భారీ క్షీణ ఫలితానికి కారణం. జీడీపీ తలసరి ఆదాయం 1870 తరువాత ఎన్నడూ చూడని క్షీణ రేటును చూసింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలూ లాక్డౌన్ పరిస్థితి నుంచి బయటపడ్డాక, వృద్ధి ‘వీ’ షేప్‌లో ఉండొచ్చు. – కేవీ సుబ్రమణియన్, చీప్ ఎకనమిక్ అడ్వైజర్ రికవరీ ఉంటుందని భావిస్తున్నాం... ఊహించిన విధంగానే క్షీణత భారీగా ఉంది. లాక్డౌన్ ప్రభావిత అంశాలే దీనికి ప్రధాన కారణం. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలూ బలహీన పరిస్థితి ఉన్నా, క్రమంగా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతుందని భావిస్తున్నాం. కేంద్రం, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలు ఇందుకు దోహదపడతాయని భావిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ కుదుట పడుతుంది... రానున్న త్రైమాసికాల్లో క్షీణ రేట్లు క్రమంగా దిగివస్తాయి. లాక్డౌన్ కఠిన పరిస్థితులు తొలగుతుండడం దీనికి కారణం. కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్, ఆర్బీఐ చొరవలు పరిస్థితిని కుదుటపడేస్తాయని భావిస్తున్నాం. – నిరంజన్ హీరనందాని, అసోచామ్ ప్రెసిడెంట్ 1950–51 జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు అంటే.. 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్ వృద్ధి నమోదైంది. అంచనాలు నిజమైతే 2020–21 ఆరవసారి అవుతుంది. స్వాతంత్య్రానంతరం 1958, 1966, 1980లో చోటుచేసుకున్న మూడు మాంద్యాలకూ ప్రధాన కారణాల్లో ఒకటి తగిన వర్షపాతం లేకపోవడమే. -
ఏప్రిల్–జూన్ మధ్య జీడీపీ16.5% క్షీణత
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020–21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్–జూన్ మధ్య అసలు వృద్ధిలేకపోగా –16.5 శాతం క్షీణిస్తుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదిక ఎక్రోప్ తాజాగా అంచనావేసింది. అయితే మే నెల నివేదికతో పోల్చితే (మైనస్ 20 శాతం కన్నా ఎక్కువ క్షీణత) క్షీణ రేటు అంచనా కొంత తగ్గడం ఊరటనిస్తున్న అంశం. సోమవారం విడుదలైన తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► కొన్ని లిస్టెస్ ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కంపెనీల ఫలితాలు ఊహించినదానికన్నా బాగున్నాయి. కార్పొరేట్ గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) గణాంకాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. ఉత్పత్తిదారులు లేదా సరఫరాల వైపు నుంచి ఒక ఆర్థిక సంవత్సరం, లేదా త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలత ఎలా ఉందన్న అంశాన్ని తెలియజేస్తుంది. ప్రత్యేకించి పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు (ఉత్పత్తి స్థాయిలో) ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి జీవీఏ దోహదపడుతుంది. ఏ రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి? దేనికి అక్కర్లేదు అన్న విషయాన్ని నిర్దారించుకునే క్రమంలో విధాన నిర్ణేతలకు జీవీఏ దోహదపడుతుంది. ► ఇప్పటి వరకూ దాదాపు 1,000 లిస్టెడ్ కంపెనీల ఫలితాలు తొలి త్రైమాసికానికి సంబంధించి విడుదలయ్యాయి. ఇందులో 25 శాతానికిపైగా కంపెనీల ఆదాయాలు పడిపోయాయి. 55 శాతానికిపైగా సంస్థల లాభాలు క్షీణించాయి. విశేషం ఏమిటంగే, కార్పొరేట్ జీవీఏ మాత్రం కేవలం 14.1 శాతం మాత్రమే క్షీణించింది. ఇది కార్పొరేట్ రంగంలో ఒక సానుకూల సంకేతం. ► లిస్టెడ్ కంపెనీల ఆదాయాలు పడిపోవడం ఆయా సంస్థల వ్యయ హేతుబద్దీకరణలపై ప్రభావం చూపిస్తోంది తప్ప, లాభాలపై కాదు. ► జూలై, ఆగస్టుల్లో కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ► కోవిడ్–19 వల్ల తొలి త్రైమాసికంలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు మొత్తంగా 16.8 శాతం క్షీణంచనున్నాయి. ► కరోనా వైరస్ వల్ల దేశంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.27,000 తలసరి ఆదాయ నష్టం జరగనుంది. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, గోవా రాష్ట్రాల్లో తలసరి ఆదాయ నష్టం రూ.40,000 వరకూ ఉంటుంది. -
ఆర్థికాంశాలు, అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచి
ముంబై: గతవారాంతాన వెల్లడైన పదకొండేళ్ల కనిష్టస్థాయి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, ద్రవ్య లోటు తీవ్రత వంటి ఆర్థికాంశాలతో పాటు లాక్‌డౌన్‌ను క్రమేపి సడలించడం వంటి ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వీటితోపాటు సోమవారం వెల్లడికానున్న భారత పీఎంఐ తయారీ రంగ డేటా కూడా మార్కెట్ దిశపై ప్రభావం చూపనుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ దీపక్ జసాని అభిప్రాయపడ్డారు. నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచే కేరళను తాకనున్నాయనేది మార్కెట్‌కు సానుకూల అంశంగా పేర్కొన్నారు. అమెరికా–చైనాల మధ్య ముదురుతోన్న ప్రచ్ఛన్నయుద్ధ అంశంపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయని నిపుణుల విశ్లేషణ. కాగా, ఈ వారంలో ఎస్బీఐ, ఇండిగో, బీపీసీఎల్ సహా 75 కంపెనీల ఫలితాలు వెల్లడికానుండడం కీలకాంశం. కాగా, లాక్డౌన్ ప్రకటించిన మార్చి చివరి వారంలో ఈక్విటీల్లో మ్యూచువల్ ఫండ్స్ నికరంగా రూ.1,230 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, ఏప్రిల్ నెలలో రూ.7,965 కోట్ల మేర ఈక్విటీ పెట్టుబడులను విక్రయించాయి. తిరిగి మే నెలలో ఫండ్స్ రూ.2,832 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు సెబీ డేటా తెలియజేస్తోంది.