న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతంగా కొనసాగుతుందన్న తన అంచనాలను ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) పునరుద్ఘాటించింది. దేశీయ డిమాండ్ ఆర్థిక క్రియాశీలతకు దోహదపడే ప్రధాన అంశంగా పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగ రికవరీ బాగుందని పేర్కొన్న ఏడీబీ, అంతర్జాతీయ అనిశి్చతుల దేశీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తన ఆసియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ) విశ్లేíÙంచింది. ఇక 2023–24లో 5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను తాజాగా 4.9 శాతానికి ఏడీబీ తగ్గించింది.
క్రూడ్ ఆయిల్ ధరల్లో కొంత తగ్గుదల దీనికి కారణంగా పేర్కొంది. సాధరణ వర్షపాతం, ఇతర వాతావరణ అంశాలను పరిగణనలోకి తీసుకుని (తదుపరి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఏవీ ఉండబోవన్న అంచనా ప్రాతిపదికన) 2023–24లో 6.4 శాతం, 2024–25లో 6.7 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నట్లు అవుట్‌లుక్ పేర్కొంది. కాగా, ఆసియా, పసిఫిక్‌లో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు సగటున 4.8 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటాయని ఏడీబీ అవుట్‌లుక్ అంచనా వేసింది. చై నా ఎకానమీ వృద్ధి రేటును 5 శాతంగా అంచనావే సింది. 2025లో ఈ రేటును 4.5 శాతంగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment