Asian Development Bank
-
భారత్ వృద్ధి అంచనా పెంచిన ఏడీబీ
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 30 బేసిస్ పాయింట్లు పెంచింది. తొలి అంచనాలు (2023 డిసెంబర్ అంచనాలు) 6.7 శాతంకాగా, దీనిని 7 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడుల పెరుగుదల, వినియోగ డిమాండ్ పటిష్టత తాజా అంచనాలకు కారణమని ఏప్రిల్ ఎడిషన్ అవుట్‌లుక్‌లో ఏడీబీ పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ప్రధాన ‘‘గ్రోత్ ఇంజిన్’’గా భారత్ ఉంటుందని అవుట్‌లుక్‌లో విశ్లేíÙంచింది. ఇక 2025–26లో వృద్ధి 7.2 శాతంగా ఉంటుందన్నది ఏడీబీ తాజా అంచనా. అయితే ప్రస్తుత ఆర్థిక సవాళ్ల పట్ల అప్రమత్తత అవసరమని హెచ్చరించింది. 2024–25 విషయానికి వస్తే, ఆర్బీఐ కూడా దేశాభివృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని పేర్కొనడం గమనార్హం. -
6.3 శాతం నుంచి 6.7 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత్ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తాజా నివేదిక పేర్కొంది. ఈ మేరకు సెపె్టంబర్ నాటి అవుట్‌లుక్ 6.3 శాతం వృద్ధి అంచనాలను 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. రెండవ త్రైమాసికం (జూలై–సెపె్టంబర్) త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి ఫలితాలు అంచనాలకు మించి 7.6 శాతంగా వెలువడ్డం తమ తాజా నిర్ణయానికి కారణమని ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్– డిసెంబర్ 2023లో వివరించింది. 2022–23లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తొలుత అంచనావేసింది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా ఫలితం వెలువడింది. దీనితో ఆర్బీఐ కూడా ఇటీవలి పాలసీ సమీక్షలో తన జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతానికి పెంచింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకూ చూస్తే... రియల్ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. క్యాలెండర్ ఇయర్ మూడు త్రైమాసికాల్లో వృద్ధి 7.1 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఏడీబీ తాజా అవుట్‌లుక్ అంశాలను పరిశీలిస్తే.. ► 2024–25లో ఎకానమీ 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నాం. ► తయారీ, మైనింగ్, నిర్మాణంసహా కీలక పారిశ్రామిక రంగం కూడా రెండంకెల వృద్ధిని సాధిస్తున్నట్లు ఆర్థిక గణాంకాలు సూచిస్తున్నాయి. ► వ్యవసాయ రంగం కొంత నెమ్మదించినా.. దీనిని పారిశ్రామిక రంగం భర్తీ చేసే అవకాశం ఉంది. ► ప్రైవేటు వినియోగ వ్యయాలు, ఎగుమతుల్లో కొంత బలహీనతలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాలు వ్యవస్థలో డిమాండ్ పెరుగుదలకు దోహదపడే అంశం. ► వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటును 5.5 శాతంగా కొనసాగవచ్చు. ఇది ఆర్బీఐ అంచనా 5.4 శాతం కంటే అధికం కావడం గమనార్హం. 2023, 2024 భారత్ ద్రవ్యోల్బణం లెక్కలు అంచనాల పరిధిలోనే ఉంటాయి. రెపో రేటు యథాతథ పరిస్థితి 2024 లో కూడా కొనసాగవచ్చు. ► పలు ఆగ్నేయాసియా ఆర్థిక వ్యవస్థలలో మహమ్మారి అనంతరం పరిస్థితులు మెరుగుపడినప్పటికీ, తిరిగి నిరాశాజనక పరిస్థితులు నెలకొంటున్నాయి. అధిక–ఆదాయ సాంకేతిక ఎగుమతిదారుల నుండి వస్తువుల ఎగుమతుల్లో స్థిరత్వమే తప్ప ప్రోత్సాహకరంగా లేవు. -
భారత్ వృద్ధి అంచనాకు ఏడీబీ కోత
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–24మార్చి) జీడీపీ వృద్ధి రేటు తొలి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్వల్పంగా తగ్గించింది. 2023 ఏప్రిల్ అవుట్‌లుక్ 6.4 శాతం అంచనాలను తాజాగా 10 బేసిస్ పాయింట్లు తగ్గి స్తున్నట్లు తెలిపింది. దీనితో ఈ అంచనా 6.3 శాతానికి తగ్గినట్లయ్యింది. ఎగుమతుల్లో మందగమనం, తగిన వర్షపాతం లేక వ్యవసాయంపై ప్రభావం వంటి అంశాలు తమ అంచనాల కోతకు కారణ మని తన 2023 సెపె్టంబర్ అవుట్‌లుక్‌లో తెలిపింది. కాగా 2024–25 అంచనాలను 6.7 శాతంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రైవేటు పెట్టుబడులు, దేశీయ వినియోగం, ప్రభ్తువ మూలధన వ్యయాలు వృద్ధికి భరోసాను ఇస్తున్నట్లు తెలిపింది. 5.9 శాతం నుంచి 6.2 శాతానికి అప్: ఇండియా రేటింగ్స్ మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 5.9 శాతం వృద్ధి అంచనాలను 6.2 శాతానికి పెంచుతున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ మూలధన పెట్టుబడులు పెరగడం, బ్యాంకులు, కార్పొరేట్ల మెరుగైన బ్యాలెన్స్ షీట్లు, గ్లోబల్ కమోడిటీ ధరలు తగ్గడం, ప్రైవేటు పెట్టుబడుల్లో ఉత్తేజం తన రేటింగ్ మెరుగుదలకు కారణమని ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో ఇండియా రేటింగ్స్ ప్రధాన ఎకనమిస్ట్ సునిల్ కుమార్ పేర్కొన్నారు. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) మన ఎకానమీకి ఢోకా లేదు: అషీమా గోయెల్ ఇదిలావుండగా, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ చక్కని పనితీరు ప్రదర్శిస్తోందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధన కమిటీ (ఎంపీసీ) సభ్యుల్లో ఒకరైన అషీమా గోయెల్ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణాత్మక చర్చలు, ఆర్బీఐ విధానాలు దేశ ఎకానమీకి తగిన బాటన నడుపుతున్నట్లు వివరించారు. -
2023–24లో 6.4 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతంగా కొనసాగుతుందన్న తన అంచనాలను ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) పునరుద్ఘాటించింది. దేశీయ డిమాండ్ ఆర్థిక క్రియాశీలతకు దోహదపడే ప్రధాన అంశంగా పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగ రికవరీ బాగుందని పేర్కొన్న ఏడీబీ, అంతర్జాతీయ అనిశి్చతుల దేశీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తన ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ) విశ్లేíÙంచింది. ఇక 2023–24లో 5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను తాజాగా 4.9 శాతానికి ఏడీబీ తగ్గించింది. క్రూడ్ ఆయిల్ ధరల్లో కొంత తగ్గుదల దీనికి కారణంగా పేర్కొంది. సాధరణ వర్షపాతం, ఇతర వాతావరణ అంశాలను పరిగణనలోకి తీసుకుని (తదుపరి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఏవీ ఉండబోవన్న అంచనా ప్రాతిపదికన) 2023–24లో 6.4 శాతం, 2024–25లో 6.7 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నట్లు అవుట్‌లుక్ పేర్కొంది. కాగా, ఆసియా, పసిఫిక్‌లో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు సగటున 4.8 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటాయని ఏడీబీ అవుట్‌లుక్ అంచనా వేసింది. చై నా ఎకానమీ వృద్ధి రేటును 5 శాతంగా అంచనావే సింది. 2025లో ఈ రేటును 4.5 శాతంగా పేర్కొంది. -
అడుగంటిన విదేశీ మారక నిల్వలు
ఇస్లామాబాద్: పీకల్లోతు ఆర్థిక సంక్షోభంతో అష్టకష్టాలు పడుతున్న పాకిస్తాన్‌కు విదేశీ రుణాలు సైతం దొరకడం లేదు. 2022లో జూలై నుంచి డిసెంబర్ వరకు కేవలం 5.6 బిలియన్ డాలర్ల రుణాలు లభించాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) రుణ కార్యక్రమాన్ని పునరుద్ధరించే విషయంలో సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు. విదేశీ మారక నిల్వలు 3.1 బిలియన్ డాలర్లకు అడుగంటాయి. కొత్త అప్పులు పుట్టడం లేదు. తీసుకున్న అప్పులపై వడ్డీలు భారీగా పెరిగిపోతున్నాయి. వాటి చెల్లింపుకూ అప్పులే గతి! క్రెడిట్ రేటింగ్ దెబ్బ పాకిస్తాన్‌కు డిసెంబర్లో 532 మిలియన్ డాలర్ల రుణం లభించింది. ఇందులో 44 శాతం అంటే.. 231 మిలియన్ డాలర్లను ఆసియన్ అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) రుణంగా ఇచ్చింది. పాక్ ప్రభుత్వం చాలా దేశాలకు చెల్లింపులు చేయాల్సి ఉంది. గత ఏడు రోజుల్లో చైనా ఆర్థిక సంస్థలకు 828 మిలియన్ డాలర్లు చెల్లించింది. -
ఈసారి భారత్ వృద్ధి రేటు 7%
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ 7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందంటూ సెప్టెంబర్‌లో వేసిన అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తాజా అప్డేట్లో యథాతథంగా కొనసాగించింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశీయంగా వినియోగదారుల ధీమా, విద్యుత్ సరఫరా, పర్చేజింగ్ మేనేజర్స్ సూచీలు మొదలైనవి ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉండటం ఇందుకు తోడ్పడగలదని పేర్కొంది. అయితే, ఎగుమతులు .. ముఖ్యంగా టెక్స్టైల్స్, ముడి ఇనుము మొదలైనవి అంత సానుకూలంగా కనిపించడం లేదని ఏడీబీ ఒక నివేదికలో తెలిపింది. 2022–23లో ద్రవ్యోల్బణం 6.7 శాతానికి చేరి, తర్వాత 5.8 శాతానికి దిగి రావచ్చని వివరించింది. 2023–24కి సంబంధించిన అంచనాలను 7.2 శాతం స్థాయిలో యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఏడీబీ తెలిపింది. 2021–22లో భారత వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది. మరోవైపు, ఆసియా వృద్ధి అంచనాలను ఏడీబీ కుదించింది. ఈ ఏడాది వృద్ధి రేటు 4.2 శాతంగాను, వచ్చే ఏడాది (2023) 4.6 శాతంగాను ఉండొచ్చని పేర్కొంది. గతంలో ఇది వరుసగా 4.3 శాతం, 4.9%గా ఉండొచ్చని అంచనా వేసింది. -
కరోనా ముందు కంటే తక్కువే
న్యూఢిల్లీ: ఆర్థిక రంగ కార్యకలాపాలు కరోనా మహమ్మారి రావడానికి ముందు నాటి స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూనే, ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలిచేందుకు ఆర్బీఐ రేట్ల పెంపును నిదానంగా అనుసరించొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ద్రవ్యోల్బణం 5.8 శాతంగా ఉండొచ్చంటూ ఏడీబీ గతంలో వేసిన అంచనాలను, తాజాగా 6.7 శాతానికి పెంచింది. ఇక తదుపరి ఆర్థిక సంవత్సరం (2023–24)లో ద్రవ్యల్బణం 5 శాతంగా ఉండొచ్చన్న అంచనాలను 5.8 శాతానికి సవరించింది. ఇది ఆర్బీఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి కొంచెం తక్కువని పేర్కొంది. ద్రవ్యోల్బణం ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో గరిష్ట స్థాయిల్లోనే చలిస్తుందని ఏడీబీ తన తాజా నివేదికలో అంచనా వేసింది. సరఫరా వైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గుతాయన్న ఏడీబీ.. ఆర్థిక రంగ కార్యకలాపాలు ఊపందుకున్నందున డిమాండ్ వైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతాయని వివరించింది. ఆర్థిక రంగ కార్యకలాపాలు కరోనా మహమ్మారి ముందు కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆర్బీఐ కీలక రేట్ల పెంపును చేపడుతుందని.. ద్రవ్యోల్బణాన్ని అంతర్జాతీయ అంశాల కంటే స్థానిక సరఫరా సమస్యలే ప్రభావితం చేస్తున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ ప్రభావం ‘‘ఆర్థిక రంగ కార్యకలాపాలు ఇంకా మెరుగుపడాల్సి ఉన్నందున ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును వచ్చే ఏడాది వరకు నిదానంగా చేపట్టొచ్చు. అదే సమయంలో రూపాయి మారకాన్ని తనంతట అదే స్థిరపడేలా వదిలేయవచ్చు. ఇది బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్‌కు సాయపడుతుంది’’అని ఏడీబీ తన నివేదికలో వివరించింది. అంతర్జాతీయ డిమాండ్ బలహీనంగా ఉన్నందున వచ్చే రెండేళ్లపాటు భారత్ వృద్ధి, ఎగుమతులు గణనీయంగా ప్రభావితమవుతాయని అంచనా వేసింది. ఈ అంశాల ఆధారంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు అంచనాను ఏడీబీఏ 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. -
7.2 శాతం నుంచి 7 శాతానికి డౌన్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 20 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత పెట్టింది. క్రితం 7.2 శాతం అంచనాలను 7 శాతానికి తగ్గింది. తీవ్ర ద్రవ్యోల్బణం, ద్రవ్య పరపతి విధానం కఠినతరం వంటి అంశాలు వృద్ధి అంచనాల తగ్గింపునకు కారణమని ఏడీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యిన నేపథ్యలో ఏడీబీ తాజా ‘‘ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ 2022’’ విడుదలైంది. ‘‘ధరల ఒత్తిళ్లు దేశీయ వినియోగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని అంచనా. మందగించిన గ్లోబల్ డిమాండ్, పెరిగిన చమురు ధరలు నికర ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’’ అని అవుట్‌లుక్ రిపోర్ట్ పేర్కొంది. కోత రెండవసారి.. ఏడీబీ ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ ప్రతి ఏడాదీ ఏప్రిల్‌లో విడుదలవుతుంది. 2022 ఏప్రిల్‌లో 2022–23లో 7.5 శాతం, 2023–24లో 8 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ఏడీబీ అవుట్‌లుక్ పేర్కొంది. అయితే ఈ రేట్లను జూలైలో వరుసగా 7.2 శాతం, 7.8 శాతాలకు తగ్గించింది. తాజాగా 2022–23 వృద్ధి రేటును మరింతగా 7 శాతానికి తగ్గించింది. నివేదికలో మరికొన్ని అంశాలు... ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కమోడిటీ ధరలను తీవ్రతరం చేసింది. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపింది. ► 2022–23 ఏప్రిల్–జూన్ మధ్య సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 7.3 శాతంగా ఉంది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతంకన్నా ఇది ఎంతో అధికం. ఆహార ఉత్పత్తుల ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. వినియోగ బాస్కెట్లో ఆహార ఉత్పత్తుల వెయిటేజ్ దాదాపు 45 శాతం. కూరగాయల ధరలు భారీగా 35 శాతం వరకూ పెరిగాయి. ► చైనా 2022 వృద్ధి అంచనాలు 5 శాతం నుంచి 3.3 శాతానికి కోత. జీరో–కోవిడ్ వ్యూహంలో భాగంగా లాక్డౌన్లు దీనికి ప్రధాన కారణం. రియల్టీ రంగంలో ప్రతికూలతలు, అంతర్జాతీయ డిమాండ్ తగ్గుదల వంటి అంశాలు చైనా ఎకానమీపై ప్రభావం చూపుతున్నాయి. ► సెంట్రల్ బ్యాంకుల రేట్ల పెంపు నేపథ్యంలో ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి రేటు తొలి 5.2 శాతం అంచనాలు 4.3 శాతానికి కోత. ఈ ప్రాంతం వృద్ధికన్నా చైనా వృద్ధి రేటు తగ్గుదల మూడు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. 2023 ఆసియా, పసిఫిక్ వృద్ధి రేటు అంచనా కూడా 5.3 శాతం నుంచి 4.9 శాతానికి కుదింపు. ► భారత్‌తో కూడిన దక్షిణ ఆసియా 2022 వృద్ధి రేటు అంచనా 7 శాతం నుంచి 6.5 శాతానికి కోత. 2023 విషయంలో ఈ రేటు అంచనా 7.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింపు. -
పేదరికంపై ఆసియా పసిఫిక్ పోరాటానికి కరోనా ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో పేదరిక నిర్మూలన పోరాటానికి కోవిడ్–19 పెద్ద సవాలుగా నిలిచిందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తన తాజా నివేదికలో పేర్కొంది. కరోనా కష్టకాలం లేకపోతే 2020లోనే ఈ ప్రాంతం తీవ్ర పేదరిక సమస్య నుంచి బయటపడి, స్థిరత్వం సాధించేదని విశ్లేషించింది. నిర్దేశించుకున్నట్లు 2022లో కాకుండా 2020లోనే ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు రోజుకు 1.90 డాలర్ల (రూ.152) కంటే తక్కువతో జీవించే పరిస్థితి నుంచి కోలుకుని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుని ఉండేవాళ్లని మనీలా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ నివేదిక అభిప్రాయపడింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న మెజారిటీ ప్రజలు ఆర్థికంగా మరింత క్లిష్టతను ఎదుర్కొనవచ్చని అంచనావేసింది. ఏడీబీలో మొత్తం 68 సభ్యదేశాలు ఉండగా, ఇందులో 49 ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన దేశాలు ఉన్నాయి. తన కీలక ఇండికేటర్ల ప్రాతిపదికన ఏడీబీ విడుదల చేసిన నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► 2022లో ఈ ప్రాంతం తీవ్ర పేదరికం నుంచి బయటపడుతుందని కోవిడ్–19 పేరు వినపడకముందు అంచనావేయడం జరిగింది. చాలా మంచి ప్రజలు రోజుకు 1.90 డాలర్లకన్నా ఎక్కువ సంపాదిస్తారని, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని భావించారు. పరిస్థితి ఎంత ఆశాజనకంగా కనిపించిందంటే 2020లోనే లక్ష్యాన్ని ఆసియా పసిఫిక్ సాధించగలదన్న ధీమా ఏర్పడింది. అయితే ఈ పరిస్థితికి కోవిడ్–19 దెబ్బకొట్టింది. కరోనా నేపథ్యంలో చాలామంది ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయి. 2022 సగం పూర్తయినా, మెజారిటీ ప్రజాలు ఇంకా 1.90 డాలర్లకన్నా తక్కువ సంపాదనతోనే జీవనం వెల్లదీస్తున్నారు. ► ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ పురోగతి అసమానంగా ఉంది. దీర్ఘకాలిక సవాళ్లు కొనసాగుతూనే ఉంటాయి. ► ఆహార భద్రత, ఆరోగ్య సేవలు, విద్యా రంగాల్లో పురోగతి కనిపించడం లేదు. ► ప్రతి ఒక్కరికీ మరింతంగా సమాన ఆర్థిక అవకాశాలను అలాగే ఎక్కువ క్రియాశీలతను అందించడానికి ఈ ప్రాంతంలోని ప్రభుత్వాలు పటిష్ట చర్యలను, సమగ్ర విధానాలను తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. ► ఆసియా పసిఫిక్‌లో తీవ్ర పేదరికం 2030 నాటికి 1 శాతం కంటే తక్కువగా ఉంటుందని అంచనా. దాదాపు 25 శాతం జనాభా కనీసం మధ్యతరగతి స్థితికి చేరుకోవచ్చు. అంటే ఆయా వర్గం ప్రజలు రోజుకు 15 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం/వినియోగ సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు. అయితే ఇందుకు మొబిలిటీలో అవరోధాలు, ఇతర అనిశ్చితులు ఎదురుకాకుండా ఉండాలి. ► అభివృద్ధి చెందుతున్న ఆసియా ప్రస్తుతం స్టాగ్ఫ్లేషన్ (ధరల తీవ్రత, వృద్ధి మందగమన) సమస్యలను ఎదుర్కొంటోంది. భౌగోళిక ఉద్రిక్తతలు ఆహార భద్రతకు సవాళ్లను సృష్టించడంతోపాటు ఇంధన ధరల తీవ్రతకు కారణమవుతున్నాయి. -
పట్టణ సేవలకు ఏడీబీ రూ.2,625 కోట్ల రుణం
న్యూఢిల్లీ: భారత్‌లో పట్టణ సేవల పురోగతికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) 350 మిలియన్ డాలర్ల (రూ.2,625 కోట్లు)ను రుణంగా ఇవ్వనుంది. మెరుగైన సేవలను అందించేందుకు వీలుగా ప్రభుత్వాలు సంస్కరణలను చేపట్టడంతోపాటు.. పనితీరు ఆధారితంగా పట్టణ పాలకమండళ్లకు నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖకు ఈ కార్యక్రమం అమలు విషయంలో ఏడీబీ సలహా, మద్దతు సేవలను అందించనుంది. ఇందుకు సంబంధించిన రుణ ఒప్పందంపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా, ఏడీబీ భారత్ డైరెక్టర్ టకియో కొనిషి సోమవారం సంతకాలు చేశారు. విధాపరమైన సంస్కరణలను అమలు చేయడంలో, పెట్టుబడుల ప్రణాళికల రూపకల్పనకు సంబంధించి పట్టణ పాలక మండళ్లకు ఏడీబీ తన సేవలను అందిస్తుంది. వాతావరణం మార్పులు, పర్యావరణ, సామాజిక భద్రతా చర్యలను కూడా సూచిస్తుందని ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రకటన తెలియజేసింది. అసోంలో నైపుణ్య యూనివర్సిటీకి సాయం అసోంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఏడీబీ మరో 112 మిలియన్ డాలర్లను రుణంగా ఇవ్వనుంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను బలోపేతం చేసేందుకు యూనివర్సిటీ ఏర్పాటు మార్గం చూపుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి ఏడీబీతో ఒప్పందంపై సంతకం చేసినట్టు ప్రకటించింది. -
జీడీపీ అంచనాల్లో మార్పులు.. కారణమిదే ?
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 10 శాతం నుంచి 9.7 శాతానికి కుదించింది. తొలత 11 శాతం వృద్ధి అంచనాలను సెప్టెంబర్‌లో 10 శాతానికి తగ్గించింది. తాజాగా మరో 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కుదించింది. పరిశ్రమలకు సంబంధించి సరఫర సమస్యలు ఇందుకు ప్రధాన కారణమని మనీలా కేంద్రంగా పనిచేస్తున్న బహుళజాతి బ్యాంకింగ్ సంస్త పేర్కొంది. దక్షిణాసియా వృద్ధి రేటును కూడా 8.8 శాతం నుంచి 8.6 శాతానికి సంస్థ తగ్గించింది. కాగా ఏడీబీ అంచనాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలు 9.5 శాతంకన్నా అధికంగానే ఉండడం గమనార్హం. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ అంచనా 8.7 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో అంచనాలకు మించి 8.4 శాతం వృద్ధి రేటు నమోదయిన సంగతి తెలిసిందే. చదవండి: పన్ను పోటు లేని ప్రదేశం.. క్రిప్టో కుబేరులకు ఇప్పుడది స్వర్గధామం! -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.11 వేల కోట్ల రుణం
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారత్‌కు 150 కోట్ల అమెరికా డాలర్ల (దాదాపు రూ.11,185 కోట్లు) రుణాన్ని మంజూరు చేసింది. ఈ విషయాన్ని గురువారం ఏడీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్‌పై పోరాటం కోసం సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ల కొనుగోలు కోసం 150 కోట్ల అమెరికా డాలర్ల రుణాన్ని మంజూరు చేస్తున్నట్టుగా ఆ ప్రకటన తెలిపింది. చైనాలోని బీజింగ్ కేంద్రంగా పని చేసే ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) అదనంగా మరో 50 కోట్ల డాలర్లను రుణంగా ఇవ్వడానికి అవకాశాలున్నాయి. -
భారత్ ఎకానమీ వృద్ధి 10 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి అంచనాలకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కోత పెట్టింది. ఏప్రిల్‌నాటి 11 శాతం వృద్ధి పరుగు అంచనాను తాజాగా 10 శాతానికి కుదించింది. కోవిడ్–10 మహమ్మారి ప్రేరిత సవాళ్లు ఆర్థిక క్రియాశీలతకు విఘాతం కలిగిస్తుండడమే తాజా అంచనాలకు కారణమని తన ఆసియా డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ)లో పేర్కొంది. 46 సభ్య దేశాలతో కూడిన ఏడీబీ అవుట్‌లుక్‌లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022–23లో భారత్ వృద్ధి 7.5 శాతానికి పరిమితం అవుతుంది. ► కరోనా సెకండ్‌వేవ్ భారత్ సేవలు, దేశీయ వినియోగం, పట్టణ అసంఘటిత రంగం ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపింది. ► 2020–21తో పోలి్చతే 2021–22లో వినియోగం క్రమంగా మెరుగుపడుతుంది. ప్రభుత్వ వ్యయాలు, ఎగుమతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే అంశాలివి. ► మూడవ వేవ్ సవాళ్లు లేకపోతే 2021–22 చివరి మూడు త్రైమాసికాల్లో (2021జూలై–మార్చి 2022 )ఎకానమీ రికవరీ పటిష్టంగా ఉంటుంది. వ్యాక్సినేషన్ వేగవంతం కావడం, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన చర్యలు, మౌలిక రంగం పురోగతి, ఆరోగ్య సంబంధ సేవల పటిష్టత వంటి అంశాలు వృద్ధి రికరవీ వేగవంతానికి దోహదపడతాయి. ► 2021లో ఆసియా ప్రాంత వృద్ధి రేటు 7.3 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది. ► చైనా విషయంలో 2021 వృద్ధి రేటు అంచనా 8.1 శాతంగా ఉంది. గృహ డిమాండ్ పటిష్టత దీనికి కారణం.అయితే 2022లో 5.5 శాతానికి తగ్గుతుంది. హైబేస్ దీనికి కారణం. కాగా ఉపాధి కల్పనా మార్కెట్, వినియోగ విశ్వాసం పటిష్టంగా ఉన్నాయి. ► దక్షిణాసియాలోని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో ఎకానమీల వృద్ధి తీరు వివిధ తీరులుగా ఉంటుంది. ఇంతకుముందు అంచనాలకన్నా వృద్ధి వేగం ఆయా దేశాల్లో మందగిస్తుంది. అయితే 2022లో వృద్ధి వేగం పెరిగే వీలుంది. ► వేగవంతమైన వ్యాక్సినేషన్ వల్ల ఎకానమీల్లో కేసులు, మరణాల తీవ్రత తగ్గుతోంది. ► కాగా అమెరికా, యూరో ప్రాంతం, జపాన్లలో 2022 వృద్ధి సగటును 3.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. ► ఆసియా ఎకానమీల్లో ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఇంధన, ఆహార ధరలు పెరుగుదలతోపాటు, కరెన్సీ విలువలు తగ్గడం కూడా దీనికి కారణం కావచ్చు. అయితే సెంట్రల్ బ్యాంకులకు నిర్దేశిత స్థాయిలకన్నా భారీగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేదు. ► ప్రభుత్వాల ద్రవ్య, పరపతి విధానాలు సరళతరంగా కొనసాగుతాయని భావిస్తున్నాం. భారీ వృద్ధి అంచనాకు సెకండ్‌వేవ్ దెబ్బ కరోనా ప్రేరిత సవాళ్లతో గడచిన ఆర్థిక సంవత్సరంలో 7.3 క్షీణతను నమోదుచేసుకున్న ఆర్థిక వ్యవస్థ, 2021–22 మొదటి జూన్ త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని సొంతం చేసుకుంది. నిజానికి లోబేస్‌కుతోడు ఎకానమీ ఊపందుకుని 2021–22లో వృద్ధి రేటు 17 శాతం వరకూ నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (2021 ఏప్రిల్, మే) సెకండ్‌వేవ్ సవాళ్లు ప్రారంభమయ్యాయి. దీనితో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు 2021–22పై తమ వృద్ధి అంచనాలను రెండంకెల లోపునకు కుదించేశాయి. 7.5 శాతం నుంచి 9.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను తాజాగా వెలువరిస్తున్నాయి. ఆర్బీఐ, ఐఎంఎఫ్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 9.5 శాతం అంచనావేస్తుండగా, మూడీస్ అంచనా 9.3 శాతంగా ఉంది. అయితే ప్రపంచబ్యాంక్ వృద్ధి రేటు అంచనా 8.3 శాతంగా ఉంది. ఫిచ్ రేటింగ్స్ మాత్రం 10 శాతం వృద్దిని అంచనావేస్తోంది. ఇక రెపోను వరుసగా ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ పరపతి విధాన కమిటీ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తోంది. కోవిడ్–19 నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలే అవలంభించాల్సిన అవసరం, ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి మేలో 6.3 శాతంకాగా, జూన్‌లో స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది. అయితే జూలైలో 5.59 శాతం దిగువకు చేరింది. ఆగస్టులో 5.3 శాతానికి దిగివచి్చంది. 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23లో ద్రవ్యోల్బణం 5.1 శాతం ఉంటుందని ఆర్బీఐ ప్రస్తుతం భావిస్తోంది. -
మార్కెట్లో ‘ఫెడ్’ అప్రమత్తత!
ముంబై: ఇంట్రాడేలో పరిమిత శ్రేణిలో ట్రేడైన సూచీలు బుధవారం చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 78 పాయింట్లను కోల్పోయి 58,927 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 15 పాయింట్లు పతనమైన 17,547 వద్ద నిలిచింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ వెల్లడి(బుధవారం రాత్రి)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ భారత వృద్ధి అంచనాలను ఒక శాతం తగ్గించి పదిశాతానికి పరిమితం చేసింది. ఈ అంశాలు ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 300 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 86 పాయింట్ల శ్రేణిలో ట్రేడయ్యాయి. సోనీ పిక్చర్స్ – జీ ఎంటర్టైన్మెంట్ వీలీన ఒప్పందం నేపథ్యంలో మీడియా షేర్లు పరుగులు పెట్టాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మీడియా ఇండెక్స్ 14 శాతం ర్యాలీ చేసింది. ఈ సెప్టెంబర్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరగడంతో రియల్టీ రంగ షేర్లకు కలిసొచ్చింది. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ఎనిమిదిన్నర శాతం లాభపడింది. ఎవర్‌గ్రాండే సంక్షోభం ఓ కొలిక్కిరావడంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. ఆటో రంగ షేర్లూ లాభాల బాట పట్టాయి. చైనా రియల్టీ దిగ్గజం ఎవర్‌గ్రాండే బాండ్లపై కొంత వడ్డీని చెల్లించేందుకు అంగీకారం తెలపడంతో డిఫాల్ట్ ఆందోళనలు తగ్గాయి. ఫలితంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. ఆసియాలో జపాన్, సింగపూర్, తైవాన్ స్టాక్ సూచీలు నష్టాల్లో ముగియగా, మిగిలిన అన్ని దేశాల ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు ఒకశాతం పెరగ్గా, అమెరికా ఫ్యూచర్లు ఒకటిన్నర శాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,943 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,850 కోట్ల షేర్లను కొన్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ... ► వాణిజ్య వాహన ధరలను పెంచడంతో టాటా మోటార్స్ కంపెనీ షేరు మూడుశాతం పెరిగి రూ.310 వద్ద ముగిసింది. ► నోయిడాలోని తన లగ్జరీ ప్రాపరీ్టని రూ.575 కోట్లకు విక్రయించడంతో గోద్రెజ్ ప్రాపరీ్టస్ లిమిటెడ్ షేరు 13 శాతం లాభపడి రూ.1950 వద్ద స్థిరపడింది. ► ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలతో హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు వరుసగా 1.50%, ఒకశాతం చొప్పున క్షీణించాయి. ఫెడ్ రేటు యథాతథం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్– ఫెడ్ ఫండ్ రేటులో ఎటువంటి మార్పు చేయలేదు. దీనితో ఈ రేటు 0.00–0.25 శ్రేణిలో ఇకముందూ కొనసాగనుంది. 2021లో ద్రవ్యోల్బణం అంచనాలను 3.4 శాతం నుంచి 4.2కు పెంచినప్పటికీ, అమెరికా ఆర్థిక పరిస్థితిలో అనిశ్చితి పూర్తిగా తొలగని నేపథ్యంలో యథాతథ రేట్ల కొనసాగింపునకే ఫెడ్ ఏకగ్రీవంగా మొగ్గుచూపింది. -
ఆర్థిక సంక్షోభంగా మారకూడదు!: నిర్మలా
న్యూఢిల్లీ: కోవిడ్ ప్రేరిత ఆరోగ్య సంక్షోభం పూర్తిస్థాయి ఆర్థిక విపత్తుగా మారకుండా వర్థమాన దేశాలకు తగిన సహాయం అందించాలని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)సహా వివిధ బహుళజాతి రుణ సంస్థలకు భారత్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం విజ్ఞప్తి చేశారు. మనీలా (ఫిలిప్పైన్స్) ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడీబీ, గవర్నర్ల బోర్డు 54వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆర్థికమంత్రి ప్రసంగించారు. వర్థమాన దేశాలపై దీర్ఘకాలంలో మహమ్మారి ప్రభావం పడకుండా చూడడానికి ‘‘సమన్వయ, సమ్మిళిత’’ అంతర్జాతీయ వ్యూహం అవసరమని ఆమె ఈ వెర్చువల్ సదస్సులో పేర్కొన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో జరిగిన రెండవ ఏడీబీ గవర్నర్ల బోర్డ్ వెర్చువల్ సమావేశమిది. తాజా సమావేశంలో ఆర్థికమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►2020 తొలి ఆరు నెలల కాలంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అన్నీ కరోనా ప్రేరిత సవాళ్ల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. అయితే అటు తర్వాత మళ్లీ రికవరీ జాడలు కనిపించాయి. అయితే ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త కేసుల నేపథ్యలో ఆర్థిక రికవరీని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రస్తుతం మనముందు ఉంది. ►ప్రపంచ ఆర్థిక ఫలాలను సంరక్షించుకోడానికి అభివృద్ధి చెందిన దేశాలు, అలాగే బహుళజాతి బ్యాంకింగ్ సంస్థలు వర్థమాన సభ్య దేశాల (డీఎంసీ) తరఫున నిలవాలి. ►జాగ్రత్తగా పరిశీలిస్తే, కొన్ని సంవత్సరాల నుంచీ పేదరికం క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే 2020వ సంవత్సరం.. ఒక్కసారిగా 7.8 కోట్ల మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టేసింది. సంపద అసమానతలు భారీగా పెరిగిపోయాయి. ►మహమ్మారి తలెత్తడంతోటే ఈ సవాళ్లను అడ్డుకోడానికి ఏడీబీ తన వంతు ప్రయత్నాన్ని సమర్థవంతంగా నిర్వహించింది. దేశాల ఎకానమీలు, అలాగే ఆరోగ్య వ్యవస్థలకు తోడ్పాటును అందించింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ విస్తృతికి కృషి చేస్తోంది. భారత్ విషయంలో కోవిడ్, నాన్–కోవిడ్ ప్రాజెక్టులకు ఏడీబీ సకాలంలో తగిన మద్దతును అందజేసింది. ►గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2020లో క్షీణతలోకి జారిపోయింది. వృద్ధి రికవరీలో తీవ్ర విఘాతం ఏర్పడింది. వర్థమాన దేశాల దీర్ఘకాల పురోభివృద్ధి లక్ష్యాలను గండి పడింది. ►కోవిడ్ తదనంతర ఎకానమీలు కోవిడ్ ముందస్తు ఎకానమీల అంత పటిష్టంగా ఉండజాలవు. దీర్ఘకాల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రస్తుతం అంతర్జాతీయంగా అన్ని దేశాల సమన్వయ సహకారం అవసరం. ►2021–22లో 12.5 శాతం పటిష్ట వృద్ధి ఉంటుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలతో 2021ని భారత్ ఎంతో ఆశావహంగా ప్రారంభించింది. అయితే దేశం ప్రస్తుతం సెకండ్‌వేవ్ కోవిడ్ సవాళ్లను ఎదుర్కొంటోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆరోగ్య రక్షణ వ్యవస్త తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఎకనమీ రికవరీ ప్రక్రియకు తాజా పరిస్థితి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి మద్దతుగా సహాయం అందిస్తున్న అంతర్జాతీయ సమాజానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుం టోంది. కోవిడ్ బారిన పడిన ప్రజలకు సకాలంలో చికిత్స అందేందుకు తగిన కృషి జరుగుతోంది. అదే సమయంలో ఎకానమీ పట్టాలు తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కష్టాల నుంచి భారత్ గట్టెకుతుందన్న గట్టి విశ్వాసం ఉంది. ►దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థాన్ని పెంచుతున్నాము. వ్యాక్సినేషన్ విస్తృతికి తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటున్నాము. ►ఏడీబీ రుణ సామర్థ్యాలు మరింత పెరగడానికి తగిన చర్యలు ఉండాలి. సావరిన్ రుణాల విషయంలో ఏడీబీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రైవేటు రంగ భాగస్వామ్యం ఆకర్షణ విషయంలో బ్యాంక్ మరింత తగిన , వినూత్న ఫైనాన్షింగ్ ఇన్స్ట్రమెంట్స్ను ఆవిష్కరించాలి. ప్రైవేటు రంగంలో మరింత క్రియాశీల చర్యల కోసం ముంబైలో ప్రైవేట్ రంగ ఆఫరేషన్స్ బ్రాంచ్ ఆఫీస్‌ను ఏడీబీ ఏర్పాటు చేయాలి. ►ప్రాంతీయ సమగ్ర అభివృద్ధికి ఉద్ధేశించిన సౌత్ ఆసియా సబ్–రీజినల్ ఎకనమిక్ కో–ఆపరేషన్ (ఎస్ఏఎస్ఈసీ) సెక్రటేరియట్‌ను భారత్‌లో ఏర్పాటు చేయాలని ఏడీబీని కోరుతున్నాం. ఆరోగ్య రంగంపై పెట్టుబడులే కీలకం: ఏడీబీ ఇదిలావుండగా, మహమ్మరి కరోనా సవాళ్ల నుంచి బయటపడ్డానికి ఆరోగ్యం, విద్య, సామాజిక రంగాలపై పెట్టుబడులే ప్రస్తుతం కీలకమని ఏడీబీ బుధవారం పేర్కొంది. ఆయా అంశాలతో పాటు సమగ్ర ప్రాంతీయ సహకారం ప్రస్తుతం ఆసియా పసిఫిక్ ప్రాంతానికి కీలకమని తెలిపింది. బుధవారం ముగిసిన మూడు రోజుల గవర్నర్ల బోర్డ్ సమావేశంలో ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సుగు అసకావా మాట్లాడుతూ, కోవిడ్–19 కష్టాల నుంచి ఆసియా గట్టెక్కుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.పర్యావరణం, అసమానత, మౌలిక రంగం, ప్రాంతాయ సహకారం, వనరుల సమీకరణ వంటి అంశాల్లో సాధించిన ప్రగతిని మించి కోవిడ్–19పై ఈ ప్రాంతం విజయం సాధిస్తుం దన్న భరోసా ఉందని అన్నారు. ఇందుకు ఏడీబీ తగిన సహాయసహకారాలను అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే 20 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఏడీబీ అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే సహకారం మున్ముందూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే మహమ్మారి వల్ల ఏడీబీ ఇప్పటికే చేపట్టిన పథకాల అమల్లో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తబోవన్నారు. -
Indian Economy: ఆందోళన కలిగిస్తున్న సెకండ్‌వేవ్
న్యూఢిల్లీ: భారత్‌లో సెకండ్‌వేవ్ అందోళన కలిగిస్తోందని బుధవారం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 2021 అవుట్‌లుక్ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పటిష్ట రికవరీకి ఇది అడ్డంకిగా మరుతోందని తెలిపింది. అయితే 2022 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 11 శాతం ఎకానమీ వృద్ధి నమోదవుతుందని అంచనావేస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు జరుగుతుండడం, రానున్న నెలల్లో ఈ కార్యక్రమం మరింత విస్తృతం కావడానికి చర్యలు తన వృద్ధి అంచనాలకు కారణమని పేర్కొంది. మనీలా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి బ్యాంకింగ్ సంస్థ ఏడీబీ తాజా ‘అవుట్‌లుక్’ లో మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. ►మౌలిక రంగంలో పెట్టుబడులు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, గ్రామీణ ఆదాయాలకు చేయూత వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. దేశీయ డిమాండ్ మెరుగ్గానే ఉంది. ఆయా అంశాలు ఆర్థిక రంగాన్ని పట్టాలు తప్పనీయకపోవచ్చు. అయితే వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా విస్తృతంగా పంపిణీ అవుతుందని, తద్వారా సెకండ్‌వేవ్ కట్టడి జరుగుతుందన్న అంచనాలే తాజా అవుట్‌లుక్‌కు ప్రాతిపదిక. కాగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంలో లోపాలు ఉన్నా, మహమ్మారి కట్టడిలో అది విఫలమైనాకోవిడ్–19 కేసుల పెరుగుదల ఆందోళనకరంగా మారుతుంది. ►దీనికితోడు అంతర్జాతీయ ఫైనాన్షియల్ పరిస్థితులు మరింత కఠినతరంగా మారే అవకాశం ఉండడం భారత్‌కు ఆందోళకరం. ఆయా అంశాలు దేశీయ మార్కెట్ వడ్డీరేట్ల పెరుగుదలకు దారితీస్తుంది. ఇదే జరిగితే ఆర్థికరంగం సాధారణ స్థితికి చేరుకోవడానికి అడ్డంకులు ఏర్పడతాయి. ►2021–22లో 11 శాతం వృద్ధి అంచనాకు బేస్ ఎఫెక్ట్ (2020–21లో తక్కువ స్థాయి గణాంకాల)ప్రధాన కారణం. బేస్ ఎఫెక్ట్‌ను పరిగణనలోకి తీసుకోకపోతే 7 శాతం వృద్ధి ఉంటుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 8 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉంది. ►ఆరోగ్యం, నీటి సరఫరా, పారిశుధ్యం వంటి రంగాల్లో ప్రభుత్వ వ్యయాలు పెరగాలి. దీనివల్ల భవిష్యత్తులో తలెత్తే మహమ్మారి సంబంధ సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రైవేటు పెట్టుబడులు పెరగడం, తగిన రుణ పరిస్థితులు ఉండడం ప్రస్తుతం దేశానికి తక్షణ అవసరం. ►ద్రవ్యోల్బణం వార్షిక సగటు 6.2 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గవచ్చు. తగిన వర్షపాతం, పంట సాగు, సరఫరాల చైన్ మెరుగుపడే అవకాశాలు దీనికి కారణం. ►ఇక దక్షిణ ఆసియా పరిస్థితిని పరిశీలిస్తే, 2021 క్యాలెండర్ ఇయర్లో ఉత్పత్తి వృద్ధి 9.5 శాతంగా ఉండే వీలుంది. 2022లో ఇది 6.6 శాతానికి తగ్గవచ్చు. ఆసియా మొత్తంగా వృద్ధి ధోరణి మెరుగుపడుతున్నప్పటికీ, కోవిడ్–19 కేసుల పెరుగుదల రికవరీకి ఇబ్బందిగా మారుతోంది. ►ఒక్క చైనా విషయానికివస్తే, ఎగుమతులు పటిష్టంగా ఉన్నాయి. గృహ వినియోగంలో రికవరీ క్రమంగా పెరుగుతోంది. 2021లో చైనా ఎకానమీ 8.1 శాతం వృద్ధిని నమోదుచేసుకునే వీలుంది. 2022లో ఇది 5.5 శాతానికి తగ్గవచ్చు. ►సెంట్రల్ ఆసియా, తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా, పసిఫిక్ ప్రాంత దేశాలుసహా ఏడీబీలో ప్రస్తుతం 46 సభ్య దేశాలు ఉన్నాయి. -
8.8లక్షల కోట్ల డాలర్లు!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 5.8–8.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. ఇందులో దక్షిణాసియా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై సుమారు 142–218 బిలియన్ డాలర్ల దాకా ప్రతికూల ప్రభావం పడనుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ ప్రారంభంలో వెలువరించిన అంచనాలకు కొనసాగింపుగా ఏడీబీ తాజా నివేదికను రూపొందించింది. ఏప్రిల్ 3న నాటి ఆసియా అభివృద్ధి అంచనాల (ఏడీవో) నివేదికలో ప్రపంచ ఎకానమీకి కరోనా వైరస్‌పరమైన నష్టాలు సుమారు 2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల దాకా ఉండొచ్చని పేర్కొంది. తాజాగా.. ‘కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఎకానమీ సుమారు 5.8 – 8.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో నష్టపోనుంది. ఇది గ్లోబల్ జీడీపీలో 6.4–9.7 శాతానికి సమానం. అటు దక్షిణాసియా జీడీపీ కూడా 3.9–6.0 శాతం మేర క్షీణించవచ్చు. భారత్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటం ఇందుకు కారణం‘ అని వివరించింది. ఈ అధ్యయనంలో విధానపరమైన చర్యల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఏడీబీ తెలిపింది. గ్లోబల్ జీడీపీ 2–4 శాతం తగ్గొచ్చంటూ ప్రపంచ బ్యాంకు వేసిన అంచనాల కన్నా ఏడీబీ అంచనాలు రెట్టింపు కావడం గమనార్హం. ఈ క్షీణత 6.3 శాతం స్థాయిలో ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. చైనాకు 1.6 లక్షల కోట్ల డాలర్ల నష్టాలు .. ఆంక్షలను స్వల్పకాలికంగా మూడు నెలల పాటు కొనసాగించిన పక్షంలో ఆసియా, పసిఫిక్ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ నష్టాలు 1.7 లక్షల కోట్ల డాలర్ల మేర, ఆరు నెలల పాటు అమలు చేస్తే 2.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలోనూ ఉంటాయని ఏడీబీ పేర్కొంది. మొత్తం గ్లోబల్ ఉత్పత్తి క్షీణతలో ఈ ప్రాంత వాటా దాదాపు 30 శాతం ఉంటుంది. చైనా నష్టాలు సుమారు 1.1–1.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఏడీబీ అంచనా. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ కరోనా వైరస్ కట్టడిపై వేగంగా స్పందించాయని, ద్రవ్యపరమైన చర్యలతో ఆదాయ నష్టాలను తగ్గించే ప్రయత్నం చేశాయని ఏడీబీ తెలిపింది. ఈ చర్యలను ఇలాగే కొనసాగించిన పక్షంలో కరోనాపరమైన ప్రతికూల ప్రభావాలు 30–40 శాతం దాకా తగ్గొచ్చని వివరించింది. జీతాల్లో కోతలు.. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్లలో వేతన ఆదాయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండొచ్చని ఏడీబీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదాయాలు 1.2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 1.8 లక్షల కోట్ల డాలర్ల దాకా తగ్గొచ్చని పేర్కొంది. ఆసియాలో వేతన ఆదాయాలు 359–550 బిలియన్ డాలర్ల స్థాయిలో క్షీణించవచ్చని వివరించింది. ఏడీబీ నివేదిక -
కరోనాపై పోరు.. భారత్‌కు భారీ రుణం
న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భారత్‌కు సాయంగా నిలిచేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ముందుకొచ్చింది. భారత్‌కు 1.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 11.3 వేల కోట్లు) రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం, నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు పేదలకు భద్రత కల్పించేందుకు ఈ రుణం అందజేయనున్నట్టు తెలిపింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో భారత ప్రభుత్వానికి మద్దుతుగా నిలవడానికి కట్టుబడి ఉన్నామని ఏడీబీ అధ్యక్షుడు మసత్సుగు అసకావా చెప్పారు. ‘భారత్ చేపడుతున్న కరోనా నివారణ చర్యలకు మద్దతుగా నిలవాని మేము నిర్ణయం తీసుకున్నాం. భారత ప్రజలకు.. ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాలకు సమర్ధవంతమైన సాయం అందించేలా చూడాలని అనుకుంటున్నాం’ అని అసకావా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. భారత్‌లో ఇప్పటివరకు 31,332 కరోనా కేసులు నమోదు కాగా, 1007 మంది మృతిచెందారు. 7,695 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. చదవండి : హెచ్-1 బీ: జూన్ నాటికి ముగుస్తున్న గడువు! -
ఈ ఏడాది భారత్ వృద్ధి 5.1 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019లో 5.1 శాతమే ఉంటుందని ఆసి యా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) తాజా నివేదికలో పేర్కొంది. ఉపాధి అవకాశాలు నెమ్మదించడం, పంట దిగుబడులు సరిగాలేక గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలహీనత, రుణ వృద్ధి మందగమనం వంటి అంశాలు దీనికి కారణమని ఏడీబీ విశ్లేషించింది. అయితే 2020లో భారత్ వృద్ధి 6.5 శాతం ఉంటుందని అంచనావేసింది. ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉండడం 2020పై తమ అంచనాలకు కారణమని తన 2019 అప్డేటెడ్ ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్‌లో ఏడీబీ పేర్కొంది. రెండవసారి కోత...: నిజానికి 2019లో 7 శాతం వృద్ధి రేటు ఉంటుందని తొలుత ఏడీబీ అంచనావేసింది. అయితే సెప్టెంబర్ మొదట్లో దీనిని 6.5 శాతానికి తగ్గించింది. తాజాగా దీనిని మరింత కుదించి 5.1 శాతానికి చేర్చింది. ఇక 2020 విషయానికి వస్తే, తొలి అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి తాజాగా తగ్గించింది. 2018లో భారత్ వృద్ధిరేటు 6.8 శాతంగా ఏడీబీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ) దేశీయ వృద్ధి రేటును 6.1 శాతం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఐఎఫ్‌ఎస్‌సీల నియంత్రణకు ప్రత్యేక సంస్థ న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ (ఐఎఫ్ఎస్సీ)ల్లో ఆర్థిక లావాదేవీల నియంత్రణ కోసం ఏకీకృత సంస్థ ఏర్పాటుకు లోక్‌సభ బుధవారం ఆమోదముద్ర వేసింది. దేశీయంగా తొలి ఐఎఫ్ఎస్సీ గుజరాత్‌లోని గాంధీ నగర్లో ఏర్పాటైంది. దీన్ని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ (గిఫ్ట్)గా వ్యవహరిస్తున్నారు. ఈ నియం త్రణ సంస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, అయితే.. సీవీసీ, కాగ్ పరిధిలో ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
వృద్ధి రేటు అంచనాకు ఏడీబీ కోత
న్యూఢిల్లీ: ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) భారత్ వృద్ధిరేటు అంచనాలను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2020) వృద్ధి రేటు 7.2 శాతమే ఉంటుందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 7.6 శాతం. ఇందుకు ప్రధాన కారణాల్లో అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు, ఆదాయాల్లో క్షీణతని ఏడీబీ బుధవారం విడుదల చేసిన తన ఏసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ) 2019 నివేదికలో పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... ► 2018–19 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను కూడా ఏడీబీ తగ్గించింది. డిసెంబర్లో ఈ రేటును 7.3 శాతంగా అంచనావేయగా, దీనిని తాజాగా 7 శాతానికి కుదించింది. ► 2017–18 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (7.2 శాతం) ఈ రేటు తగ్గిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం రేటు కోతకు వ్యవసాయ ఉత్పత్తి బలహీనత, వినియోగ వృద్ధి మందగమనం కారణమని పేర్కొంది. అధిక అంతర్జాతీయ క్రూడ్ ధరలు, ప్రభుత్వ వ్యయాలు తగ్గడం కూడా వృద్ధి తగ్గడానికి కారణమని విశ్లేషించింది. ► 2020లో వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని అంచనావేస్తున్న ఏడీబీ, పాలసీ రేటు కోత, రైతులకు ఆదాయ మద్దతు, దేశీయ డిమాండ్ పెరుగుదల దీనికి ప్రధాన కారణాలు. మరిన్ని ఆర్థిక సంస్కరణలు, వ్యాపార, పెట్టుబడుల వాతావరణంలో సానుకూల మార్పులు కూడా రానున్న కాలంలో భారత్ వృద్ధికి కారణమవుతాయి. ► భారత్ అంతర్జాతీయంగా తక్షణం ఎదుర్కొంటున్న కొన్ని ప్రతికూల అంశాలూ ఉన్నాయి. అంతర్జాతీయ డిమాండ్ మందగమనం, ద్రవ్య పరిస్థితుల్లో క్లిష్టత, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం ముగింపుపై అనిశ్చితి, అభివృద్ధి చెందిన దేశాల్లో బలహీన ఆర్థిక పరిస్థితులు ఇందులో ప్రధానమైనవి. ► దేశీయంగా చూస్తే, ఆదాయాలు తగ్గడం తీవ్ర ప్రతికూలాంశం. ఇది ద్రవ్యలోటు సమస్యను తీవ్రతరం చేస్తుంది. ఇక బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్యనూ ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ► ఇన్ని సమస్యలున్నా, 2019–20లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుంది. ► కుటుంబాల పొదుపులు, కార్పొరేట్ మూలాల పటిష్టత భారత్ ఎకానమీకి సానుకూల అంశాలని ఏడీబీ చీఫ్ ఎకనమిస్ట్ యసుయుకీ సవాడా పేర్కొన్నారు. యువత ఎక్కువగా ఉండడం, వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డం, పెరుగుతున్న ఎగుమతులూ దేశానికి లాభిస్తున్నాయని అన్నారు. ► వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 2019–20లో సగటున 4.3 శాతంగా ఉంటే, 2020–21లో 4.6 శాతంగా ఉంటుందని ఏడీబీ పేర్కొంది. తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం దేశంలో డిమాండ్ పటిష్టతకు దోహదపడే అంశంగా విశ్లేషించింది. ► దేశంలో డిమాండ్ పరిస్థితులు బాగుండడం వల్లే దిగుమతులు పెరుగుతున్నాయి. ► ఇక దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతం (జీడీపీ విలువలో పోల్చి), 2020–21లో 2.5 శాతంగా ఉండే అవకాశం ఉంది. అయితే క్యాడ్ సమస్యను భారత్ విజయవంతంగా అధిగమించే అవకాశం ఉంది. దేశం భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుండడమే దీనికి కారణం. ► దక్షిణాసియాలో మందగమన పరిస్థితులు మొత్తం ఆసియాపై ప్రతికూలత చూపవచ్చు. -
ఈ ఏడాది సాయం 4.5 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత్‌కు ఇచ్చే నిధుల సాయాన్ని 2019లో 4.5 బిలియన్ డాలర్ల(రూ.31,500 కోట్లు)కు పెంచనున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 7.6 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. పెట్టుబడుల వృద్ధికి తోడు, జీఎస్టీ స్థిరపడటంతో ఆదాయాలు పెరుగుతాయన్న అంచనాల మేరకు ఈ గణాంకాలను ప్రకటించింది. ‘‘భారత్‌కు 2019లో నిధుల సాయాన్ని 4.5 బిలియన్ డాలర్లకు పెంచనున్నాం. ఇందులో 3.5 బిలియన్ డాలర్లు భారత ప్రభుత్వానికి, మరో బిలియన్ డాలర్లు ప్రైవేటు రంగానికి ఇవ్వనున్నాం’’ అని ఏడీబీ ఇండియా డైరెక్టర్ కెనిచి యోకోయమ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. 2018లో భారత్‌కు 3.03 బిలియన్ డాలర్ల సౌ ర్వభౌమ రుణాలు ఇచ్చేందుకు కట్టుబడినట్టు చెప్పా రు. ఓ ఏడాదిలో ఇదే గరిష్టమన్నారు. దీనికి అదనం గా ప్రైవేటు రంగానికి 557 మిలియన్ డాలర్ల రుణాలిచ్చినట్టు తెలిపారు. ప్రాజెక్టుల సంసిద్ధతపై నిధుల సాయం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. వృద్ధి పుంజుకుంటుంది... కేంద్ర ప్రభుత్వ గణాంకాల విభాగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేయగా, ఏడీబీ అంచనాలు 7.3 శాతంగా ఉన్నాయి. 2019–20లో వృద్ధి పుంజుకుంటుందని ఏడీబీ సీనియర్ ఎకనమిక్స్ అధికారి అభిజిత్‌సేన్ గుప్తా పేర్కొన్నారు. జీఎస్టీ అమలు, డీమోనిటైజేషన్ కారణంగా ఏర్పడిన సమస్యలు తొలగిపోయాయని, చమురు ధరల తగ్గుదల గృహ వినియోగాన్ని పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ద్రవ్యపరిమితులు, వాణిజ్య యుద్ధ ఆందోళనలు వృద్ధికి సవాళ్లుగా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కరెంటు ఖాతా లోటు 2.5 శాతంగా ఉంటుందని ఏడీబీ అంచనా వేసింది. ఆర్థిక సూత్రాలకు విరుద్ధం వ్యవసాయ రుణాల మాఫీ అనేది ఆర్థిక సూత్రాలకు వ్యతిరేకమని, సాగు రంగంలో సంక్షోభానికి ఇది తగిన పరిష్కారం కాదని కెనిచి యోకోయమ అభిప్రాయపడ్డారు. లబ్ధిదారులకు నేరుగా నిధులను బదిలీ చేయడం వల్ల దుర్వినియోగం తగ్గుతుందన్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రూ.1.47 లక్షల కోట్ల మేర వ్యవసాయ రుణాల బకాయిలు ఉండగా, వీటిని మాఫీ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటనలు వెలువడిన విషయం తెలిసిందే. కేంద్రం సార్వత్రిక కనీస ఆదాయ పథకాన్ని ఎంత సమర్థవంతంగా, ఏ రూపంలో అమలు చేయగలదన్న దానిపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని యోకోయమ అన్నారు. ద్రవ్యలోటును ప్రభుత్వం చేరుకునే విషయంలో తమకు ఎటువంటి సందేహం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. -
వృద్ధి అంచనాలను కొనసాగించిన ఏడీబీ
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందన్న గత అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) కొనసాగించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధిని సాధించగలదన్న అంచనాలను కూడా అలాగే కొనసాగించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో ఒత్తిడులున్నా, వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యపరమైన సమస్యలున్నా భారత్ ఈ స్థాయి వృద్ధిని సాధించగలదన్న అంచనాలను ఏడీబీ వెల్లడించింది. ‘ఏషియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ) 2018 అప్డేట్’ పేరిట ఏడీబీ రూపొందించిన తాజా నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., ∙వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతుండటం, ఎగమతులు పుంజుకుంటుండటంతో భారత వృద్ధి జోరు కొనసాగగలదు. ∙భారత జీడీపీ ఈ క్యూ1లో 8.2%, క్యూ2లో 7.1% గా నమోదైందని, మొత్తం మీద ఈ ఆర్థిక సంవ త్సరం తొలి 6 నెలల్లో వృద్ధి సగటున 7.6%గా ఉంది. ∙క్యూ2లో వృద్ధి అంచనాల కంటే తక్కువే. ∙వాణిజ్య ఉద్రిక్తతలు, ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలున్నా, క్రూడ్ ధరలు దిగిరావడం భారత్‌కు కలసిరానున్నది. ∙మరోవైపు రూపాయి బలహీనపడటం వల్ల ఎగుమతులు పుంజుకుంటాయి. ∙ఇక చైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం వృద్ధిని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతం వృద్ధిని సాధించగలదు. ∙దేశీయంగా అధిక డిమాండ్ కారణంగా ఆసియా దేశాలు విదేశీ ప్రతికూలతలను తట్టుకోగలవు. -
పటిష్ట వృద్ధి బాటనే భారత్: ఏడీబీ
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19), అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ ఆరికాభివృద్ధి రేట్లు వరుసగా 7.3 శాతం, 7.6 శాతం నమోదవుతాయని విశ్లేషిం చింది. ‘ఆసియన్ డెవలప్మెంట్ అవుట్ లుక్ (ఏడీఓ) 2018’ పేరుతో విడుదలైన ఏడీబీ వార్షిక ఆర్థిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►భారత్‌కు కొన్ని సవాళ్లూ ఉన్నాయి. రూపాయి బలహీనత, విదేశీ ఫైనాన్షియల్ మార్కెట్ల ఒడిదుడుకులు ఇందులో ప్రధానమైనవి. ► చమురు ధరలు ఒకపక్క పెరుగుతున్నాయి. అయితే మరోపక్క దేశీయ డిమాండ్ బాగుంది. ఎగుమతులు ప్రత్యేకించి తయారీ రంగానికి సంబంధించి బాగున్నాయి. ఆయా అంశాల వల్ల చమురు ధరల పెరుగుదల తీవ్రత భారత్ ఆర్థిక వ్యవస్థపై లేకుండా చేస్తున్నాయి. ►ఆసియా వృద్ధి రేటు 2018లో 6 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. వాణిజ్య యుద్ధ భయాలు కీలకమైనవి. ప్రపంచం కోలుకోలేదు...కానీ భారత్ భేష్: ఆంక్టాడ్ 2008 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా ప్రపంచం కోలుకోలేదని ఆంక్టాడ్ (యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్) పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవడానికి సంకేతాలని పేర్కొంది. అయితే భారత్‌తో కూడిన బ్రిక్స్ దేశాలు మాత్రం మెరుగైన వృద్ధిని సాధిస్తున్నాయని కితా బిచ్చింది. దేశీయ డిమాండ్ పుంజుకోవడం దీనికి కారణమని పేర్కొంది. -
సూపర్ ఫాస్ట్ స్పీడుతో దూసుకుపోతోంది!
మనీలా : దేశీయ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పైగా నమోదైన సంగతి తెలిసిందే. ఈ వృద్ధిరేటు అద్భుతమైన వేగంగా ఉందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు(ఏడీబీ) అభివర్ణించింది. ఇదే స్థాయిలో దూసుకుపోతే, దశాబ్దంలోనే భారత ఆర్థిక వ్యవస్థ రెండింతలు కానుందని ఏడీబీ చీఫ్ ఎకనామిస్ట్ యసుయుకి సవాడా అన్నారు. 8 శాతం వృద్ధి రేటు సాధించలేదని భారత్ ఆందోళన చెందాల్సినవసరం లేదని, కానీ ఆదాయ అసమానతలు తగ్గించి, దేశీయ డిమాండ్‌ను పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టిసారించాలని సూచించారు. వృద్ధి రేటు ఎగుమతులు కంటే దేశీయ వినియోగంపైనే ఎక్కువగా వృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. 2018-19లో 7.3 శాతం వృద్ధి రేటుతో ఆసియా దేశాల్లో వేగవంతంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంటుందని ఏడీబీ పేర్కొంది. ఈ వృద్ధి రేటు 2019-20 కల్లా 7.6 శాతానికి పెరుగుతుందని ఏడీబీ అంచనా వేసింది. 7 శాతమనేది నిజంగా చాలా వేగవంతమైనదని, ఒకవేళ 10 ఏళ్లు కూడా 7 శాతం వృద్ధిరేటునే కొనసాగిస్తే, దేశీయ ఆర్థికవ్యవస్థ పరిమాణం రెండింతలవుతుందని సవాడా పేర్కొన్నారు. ఇది చాలా వేగవంతంగా దూసుకుపోతున్న వృద్ధి రేటు, ఈ రీజియన్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇదీ ఒకటని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి రేటు సాధించి, వచ్చే ఏడాదిలో 7.6 శాతాన్ని తాకుతుందని, ఇది నిజంగా అద్భుతమైన వేగమేనని ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం దేశీయ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 8 శాతం వృద్ధి రేటు అనేది భారత్‌కు అతిపెద్ద సవాల్ అని సవాడా పేర్కొన్నారు. 7 శాతం వృద్ధి అనేది చాలా మంచి నెంబర్, 8 శాతం సాధించలేదని భారత్ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఎగుమతులు భారత వృద్ధిని నిర్థారించవని, దేశీయ మార్కెటే వృద్ధి రేటుకు చాలా కీలకమని పేర్కొన్నారు. ఎగుమతులు వృద్ధిని పెంచడంలో ఒక భాగమే మాత్రమే కానీ ఎక్కువగా దేశీయ మార్కెటే కీలకమైనదని తెలిపారు. ఆదాయ అసమానతలు, పేదరికం తగ్గింపు ఎక్కువ వృద్ధి రేటు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. -
రోజూ 3వేల కోట్ల విలువైన రూ. 500 నోట్ల ముద్రణ
మనీలా: దేశంలో నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో రూ. 3 వేల కోట్ల విలువైన రూ.500 నోట్లను ప్రతి రోజూ ముద్రిస్తున్నామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం నగదు లభ్యత సంతృప్తికర స్థాయిలో ఉందని, అదనపు డిమాండ్‌ను అందుకుంటున్నామని ఆయన చెప్పారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు(ఏడీబీ) వార్షిక సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నగదు పరిస్థితిపై గతవారం తాను సమీక్షించానని, 85 శాతం ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని వెల్లడించారు.‘అవసరం మేరకు నగదును సరఫరా చేస్తున్నాం. అదనపు డిమాండ్ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం దేశంలో నగదు సంక్షోభం ఉందని నేను భావించడం లేదు’ అని చెప్పారు. దేశంలో రూ.7 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయని గార్గ్ తెలిపారు. అవసరాని కంటే ఎక్కువ లభ్యత ఉందని అందువల్ల కొత్తగా రూ. 2 వేల నోట్లు ముద్రించాల్సిన అవసరం లేదన్నారు. -
ఐదో రోజూ లాభాలే..
రోజంతా లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు మన మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఆశావహ వృద్ధి అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి 33,940 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 10,417 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ మొత్తం 5 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 921 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ 6 వారాల గరిష్టానికి, నిఫ్టీ 4 వారాల గరిష్ట స్థాయికి ఎగిశాయి. 231 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 101 పాయింట్ల లాభంతో 33,982 పాయింట్లను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో 130 పాయింట్ల నష్టంతో 33,751 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో కనిష్ట స్థాయిని తాకింది. మొత్తంగా రోజంతా 231 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆల్‌టైమ్ హైకి హెచ్‌యూఎల్: హిందుస్తాన్ యూనిలివర్ కంపెనీ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,420ను తాకింది. చివరకు 1.2 శాతం లాభంతో రూ. 1,409 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీని తోసిరాజని రూ.3.04 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో మార్కెట్ క్యాప్ పరంగా ఐదవ అతి పెద్ద కంపెనీగా హెచ్‌యూఎల్ అవతరించింది. -
భారత్ వృద్ధి7.3 శాతం
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19) 7.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని భావిస్తున్నట్లు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తన తాజా నివేదికలో అంచనావేసింది. రానున్న ఆర్థిక సంవత్సరం ఈ రేటును 7.6 శాతంగా విశ్లేషించింది. తద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా తన హోదాను కొనసాగిస్తుందని వివరించింది. ఏడీబీ 2018 అవుట్లోక్లో ఈ మేరకు వివరించిన అంశాలను చూస్తే... ►వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లో తొలుగుతున్న అవరోధాలు, బ్యాంకింగ్ సంస్కరణలు భారత్ వృద్ధికి దోహదపడే పటిష్ట అంశాల్లో కొన్ని. ►భారత్‌లో కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకువస్తోంది. దీనివల్ల దేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింతగా ఆకర్షించగలుగుతుంది. దేశంలో వ్యాపార అవకాశాలకు సంబంధించిన గ్లోబల్ ర్యాంక్ (130 నుంచి 100కు ప్రపంచబ్యాంక్ రేటింగ్) మెరుగుపడ్డం కూడా గమనార్హం. ►భారత్‌కు కొన్ని కీలక సవాళ్లూ ఉన్నాయి. బ్యాంకింగ్ మొండి బకాయిలు, క్రూడ్ ధరల అప్‌ట్రెండ్ సమస్యలు ఇందులో ప్రధానమైనవి. అమెరికా టారిఫ్‌ల పెంపు పెద్దగా ప్రభావం చూపే అవకాశంలేనప్పటికీ, కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ►ద్రవ్యోల్బణం సమస్యలు, అమెరికా ఫెడ్ వడ్డీరేటు పెంపు, ద్రవ్యలోటు లక్ష్యాలు నీరుగారడం వంటి అంశాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు మరింత తగ్గించడానికి అవరోధాలు. 2018లో యథాతథ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ► 2018లో భారత్ ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతం, వచ్చే ఏడాది 5 శాతం ఉండే అవకాశం ఉంది. -
7 శాతం కాదు.. 6.7 శాతమే..!
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) వృద్ధి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 6.7 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 7 శాతం. డీమోనిటైజేషన్, జీఎస్టీ తొలి దశ ప్రతికూలాంశాలు, దీనికితోడు రుతుపవనాలు, వ్యవసాయంపై సంబంధిత ప్రభావం వంటి అంశాలను వృద్ధి అంచనాల తాజా తగ్గింపునకు కారణంగా చూపింది. 2018–19 వృద్ధి అంచనాలను సైతం 7.4 శాతం నుంచి 7.3 శాతానికి కుదించింది. క్రూడ్ ధరల పెరుగుదల, ప్రైవేటు పెట్టుబడులు తక్కువగా వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. 3, 4 త్రైమాసికాల్లో బెటర్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు మూడేళ్ల గరిష్టస్థాయి 5.7 శాతం పడిపోయి, రెండవ త్రైమాసికంలో కొంత కోలుకుని 6.3 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణల ఫలితాల కారణంగా తదుపరి మూడు, నాలుగు త్రైమాసికాల్లో వృద్ధి పుంజుకునే అవకాశం ఉందని ఏడీబీ అంచనా వేస్తోంది. 2017–18 ద్రవ్యోల్బణం అంచనాను 3.7 శాతంగా ఏడీబీ పేర్కొంది. ఇంతక్రితం 4 శాతం అంచనాకన్నా ఇది తక్కువ. వివిధ సంస్థల అంచనాలు ఇలా... ♦ 2017–18 వృద్ధి అంచనాను ప్రపంచబ్యాంక్ 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. 2019–20 నాటికి 7.4 శాతానికి పెరుగుతుందని విశ్లేషించింది. ♦ఇక 2017–18కి ఓఈసీడీ (ఆర్థిక సహకార అభివృద్ధి సంఘం) వృద్ధి అంచనా 6.7 శాతం. ♦ఫిచ్ రేటింగ్స్ కూడా 6.9 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించింది. 2018–19కి 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. ♦ఇక మూడీస్ విషయంలో 2017–18 వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది. ♦2017–20 మధ్య సగటు వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని స్టాండర్డ్ అండ్ పూర్స్ విశ్లేషిస్తోంది. -
భారత ‘విద్యుత్’కు రూ.655 కోట్ల రుణం
బీజింగ్ : భారత్‌లో విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించడంతో పాటు సౌర, పవన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(ఏఐఐబీ), మనీలాలోని ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) రూ.655.63 కోట్ల(100 మిలియన్ డాలర్లు) రుణం అందించనున్నట్లు చైనా పత్రిక జిన్జువా తెలిపింది. ఏఐఐబీ, ఏడీబీలు చెరో 50 మిలియన్ డాలర్ల చొప్పున ఈ రుణాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ ప్రతిపాదనకు ఏఐఐబీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొంది. ఏఐఐబీ, ఏడీబీలు సంయుక్తంగా రుణాలు జారీచేయడం ఇది నాలుగోసారని వెల్లడించింది. చైనా నేతృత్వంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 2016లో ఏర్పాటైన ఏఐఐబీలో చైనా 26.06% పెట్టుబడితో మెజారిటీ వాటాదారుగా ఉండగా, భారత్ 7.5 శాతంతో రెండో స్థానంలో ఉంది. రష్యా 5.93%, జర్మనీ 4.5శాతం పెట్టుబడితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
రుణాల జారీని వేగవంతం చేయాలి
ఆసియా అభివృద్ధి బ్యాంకును కోరిన జైట్లీ యోకోహమ: రుణాల ఆమోదం, జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)ను క్రేందం కోరింది. ఆసియా ప్రాంతంలోని వర్ధమాన దేశాలు మౌలిక సదుపాయాలు, సామాజిక రంగాలపై నిధులను వెచ్చించాల్సిన అవసరం దృష్ట్యా రుణాల ఆమోదానికి ప్రస్తుతం తీసుకుంటున్న సమయాన్ని కుదించాలని విజ్ఞప్తి చేసింది. జపాన్‌లోని యోకోహమ నగరంలో జరిగిన ఏడీబీ గవర్నర్ల బోర్డు సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ... దక్షిణాసియా దేశాలకు ప్రాంతీయ కేంద్రాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో రుణాలకు సంబంధించిన ప్రతిపాదనల పరిశీలనను వేగంగా నిర్వహించవచ్చని సూచించారు. ఏడీబీ కార్యకలాపాలు, వనరుల ప్రణాళిక విషయంలో వర్ధమాన దేశాల అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వాలని కోరారు. ఏడీబీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఇప్పటి వరకు సాధించిన విజయాలు, ఇంకా నెరవేర్చాల్సి ఉన్న మరిన్ని అవసరాలపై ఆలోచనకు అవకాశం కల్పించిందన్నారు. ‘‘ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి పేదరికాన్ని పారదోలడమే ఏడీబీ ఎంచుకున్న లక్ష్యం. ఇంధనం, పట్టణాభివృద్ధి, రవాణా రంగాలతో పాటు అందుబాటు ధరలకే పునరుత్పాదక ఇంధనంపైనా మనం దృష్టి సారించాల్సి ఉంది’’ అని జైట్లీ సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఏడీబీ ప్రెసిడెంట్ టకెహికో నకావోతోనూ జైట్లీ పలు అంశాలపై చర్చలు జరిపారు. భారత్‌లో తయారీ కేంద్రాలకు పిలుపు జపాన్ పర్యటనలో ఉన్న జైట్లీ ఆ దేశ ఆర్థిక మంత్రి టారో అసోతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రతిష్టాతక్మంగా భావిస్తున్న భారత్‌లో తయారీ కార్యక్రమం గురించి చేపడుతున్న చర్యల్ని వివరించారు. భారత్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం విషయంలో మరింత కలసి పనిచేయాలని ఇరు దేశాలూ నిర్ణయించినట్టు సమావేశం అనంతరం విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు. -
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు ఏడీబీ నిధులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫండింగ్ ఏజెన్సీ ‘ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్’ (ఏడీబీ) తాజాగా భారత్ తొలి తీరప్రాంత పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు రుణ సాయం అందించేందుకు ఆమోదం తెలిపింది. ఈ పారిశ్రామిక కారిడార్ విశాఖపట్నం-చెన్నై మధ్యలో నిర్మాణం కానుంది. దీనికోసం ఏడీబీ 631 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4,200 కోట్లు) మేర నిధులను అందించడానికి ముందుకొచ్చింది. ఈ నిధులతో తొలిగా మొత్తం 2,500 కిలోమీటర్ల కారిడార్ ఏర్పాటులో ప్రధానమైన 800 కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని, దీంతో దక్షిణ తూర్పు ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య కార్యకలాపాలు మరింత బలోపేతమవుతాయని ఏడీబీ పట్టణాభివృద్ధి విభాగపు ప్రధాన విశ్లేషకుడు మనోజ్ శర్మ అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వల్ల విశాఖ-చెన్నై తీరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా అవతరిస్తుందని చెప్పారు. కాగా మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 846 మిలియన్ డాలర్లు. మిగతా 215 మి. డాలర్లను ఆంధ్రప్రదేశ్ సర్కారు సమకూర్చాల్సి ఉంటుంది. -
ఏడీబీ చీఫ్‌గా మళ్లీ నకయో
న్యూఢిల్లీ: ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్‌గా తకిహికొ నకయో తిరిగి ఎన్నికయ్యారు. నవంబర్ 24 నుంచి ఐదేళ్ల పదవీకాలంలో కొనసాగడానికి బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్లు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు -
మిత్రా ఎనర్జీకి 175 మిలియన్ డాలర్ల ఏడీబీ రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్ రంగానికి చెందిన మిత్రా ఎనర్జీ (ఎంఈఐఎల్) తాజాగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) నుంచి 175 మిలియన్ డాలర్ల మేర రుణ సదుపాయం పొందింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో పవన విద్యుత్ ప్రాజెక్టులకు .. తెలంగాణ, పంజాబ్‌లలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఇది ఉపయోగపడనుందని కంపెనీ చైర్మన్ రవి కైలాస్ తెలిపారు. రాబోయే 12 నెలల్లో 1,000 మెగావాట్ల సామర్ధ్యాన్ని సాధించాలన్న మధ్యకాలిక లక్ష్యాలకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుదుత్పత్తి విభాగంలో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ఎంఈఐఎల్కు రుణ సదుపాయానికి ఆమోదం తెలిపినట్లు ఏడీబీ జేఎండీ సీనియర్ ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ మయాంక్ చౌదరి తెలిపారు. -
ఏడీబీ ఈడీగా భారత సంతతి మహిళ
వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన మహిళ స్వాతి దండేకర్ ఏసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండో-అమెరికన్ స్వాతిని ఏడీబీ ఈడీగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. 2003లో అమెరికా దిగువ సభకు ఎన్నికైన తొలి వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పిన విషయం అందరికీ విదితమే. ఆమెతో సహా మరికొంత మందిని ఏడీబీ కార్యవర్గంలో చేరారు. అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లను నూతన అధికారులు తమ విధి నిర్వహణతో ఛేదిస్తారని అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు. వీరితో కలిసి పనిచేస్తూ మరింత ముందుకు వెళ్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్వాతి దండేకర్ గతంలో 2003-2009 మధ్య దిగువ సభ సభ్యురాలిగా, దిగువ సభ సెనెట్ సభ్యురాలిగా 2009-2011 కాలంలో విధులు నిర్వర్తించారు. భారత్ లోని నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ గ్రూపులో బ్యాచిలర్ డిగ్రీ, ముంబై వర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. -
భారత్ వృద్ధి అంచనాలకు ఏడీబీ కోత
- 7.8 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గింపు - పార్లమెంట్లో సంస్కరణల బిల్లులు ముందుకు వెళ్లడం లేదని వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7.8 శాతాన్ని 7.4 శాతానికి తగ్గించినట్లు ఏడీబీ అవుట్‌లుక్ పేర్కొంది. 2016-17లో వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదుకావచ్చని అంచనా వేసింది. ఇంతక్రితం ఈ అంచనా 8.2 శాతం. ప్రైవేటు వినియోగం, తయారీ, సేవల రంగాలు అన్నీ నెమ్మదిస్తాయని తెలిపింది. వృద్ధి క్యూ1లో 7 శాతానికి పరిమయిన నేపథ్యంలో పలు సంస్థలు భారత్ వృద్ధి అంచనాలకు కోత పెడుతున్నాయి. మూడు ప్రధాన కారణాలు... వృద్ధి రేటు కోతకు సంబంధించి మూడు కారణాలను ప్రధానంగా నివేదిక తెలిపింది. ‘అందులో ఒకటి వర్షాభావ పరిస్థితులు. మరొకటి అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనంగా ఉండడం. ఇక మూడవది పార్లమెంటులో సంస్కరణల బండిని ముందుకు తీసుకువెళ్లలేని పరిస్థితి.’ అని అవుట్‌లుక్ వివరించింది. దేశీయ పన్నుల వ్యవస్థ, భూ సేకరణ, కార్మిక చట్టాల వంటి అంశాలను ఈ సందర్భంగా నివేదిక ప్రస్తావించింది. వినియోగ ధరల సూచీ అధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఒకవేళ 4 శాతానికి కొంత అటుఇటుగా ఉన్నా... ఇది అనిశ్చితి పరిస్థితేనని పేర్కొంది. ఈ అంశం ప్రధానంగా అంతర్జాతీయ క్రూడ్ ధరలపై ఆధారపడి ఉందని పేర్కొంది. ఒకవేళ క్రూడ్ ధరలు పెరిగితే ప్రతికూలతలు తీవ్రమయ్యే అవకాశం ఉందని వివరించింది. కాగా గత త్రైమాసికంలో స్థిర పెట్టుబడుల వృద్ధి 4.1 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఎగుమతుల క్షీణ ధోరణి కొనసాగవచ్చని అంచనావేసింది. ఆసియా ప్రాంతం వృద్ధీ డౌన్... భారత్, చైనాల్లో వృద్ధి నెమ్మదించిన ప్రభావం ఆసియా ప్రాంతం మొత్తంపై ప్రభావం చూపుతుందని నివేదిక పేర్కొంది. 2015, 16ల్లో ఈ ప్రాంతం వృద్ధి రేటును 6.3 శాతం (రెండేళ్లలోనూ) నుంచి కిందకు కుదించింది. 2015లో 6 శాతం, 2016లో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని తాజా విశ్లేషణలో పేర్కొంది. -
నేడు అజర్‌బైజాన్‌కు జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆదివారం అజర్‌బైజాన్‌కు వెళ్లనున్నారు. రాజధాని బకూలో జరుగుతున్న ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వార్షిక సమావేశాల్లో పాల్గొనడం ఈ పర్యటనలో ప్రధాన అంశం. ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ మహర్షిసహా పలువురు ఆర్థికశాఖ సీనియర్ అధికారులు ఇప్పటికే ఏడీబీ గవర్నర్ల బోర్డ్ సమావేశాల్లో పాల్గొనడానికి బకూకు చేరుకున్నారు. నేడు ప్రారంభమైన 48వ ఏడీబీ వార్షిక సమావేశాలు నాలుగురోజుల పాటు జరగనున్నాయి. పర్యటన అనంతరం జైట్లీ మే 5న భారత్‌కు తిరిగి వస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వస్తువుల సేవల పన్ను, బ్లాక్‌మనీ బిల్లు వంటి కీలక ఆర్థిక అంశాలు ప్రస్తుతం పెండింగులో ఉండడమే దీనికి కారణం. ఆయా బిల్లులు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం లోక్‌సభ ఆమోదం పొందిన ఫైనాన్స్ బిల్లు 2015కు కూడా రాజ్యసభ ఆమోదం లభించాల్సి ఉంది. ఏడీబీ దృష్టి పెట్టే అంశాలు..! ప్రపంచ ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన, వాతావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రస్తుత ఏడీబీ సమావేశాలు దృష్టి పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మౌలిక రంగం, విద్య, ప్రాంతీయ సహకారం, ఆర్థిక రంగం అభివృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా చర్చ ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌ను నిర్మించండి
⇒ భారతీయ రైల్వేల్లో పెట్టుబడికి ప్రాధాన్యమివ్వాలి... ⇒ ఏడీబీ ప్రెసిడెంట్ తకెహికో నకావోకు ప్రధాని మోదీ విజ్ఞప్తి న్యూఢిల్లీ: భారతీయ రైల్వేల్లో పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)కు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రైల్వేను పూర్తిస్థాయిలో మలుపుతిప్పేవిధంగా ఈ రంగంలో ఒక ప్రాజెక్టును పూర్తిచేయాలని, అందరినీ అబ్బురపరిచే స్థాయిలో దీనికి రూపకల్పన చేయాల్సిందిగా ఏడీబీ ప్రెసిడెంట్ తకెహికో నకావోకు మోదీ విజ్ఞప్తి చేశారు. గురువారమిక్కడ తనను కలిసిన నకావోతో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రధాని కార్యాలయం(పీఎంవో) విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. ఏదైనా ఒక రైల్వే స్టేషన్‌ను ఎంచుకొని దాన్ని ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేయాలని... దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ప్రాజెక్టులను రైల్వే శాఖ చేపడుతుందని మోదీ సూచించినట్లు పీఎంవో తెలిపింది. కాగా, గతేడాది ఏడీబీ భారత్‌కు 1.4 బిలియన్ డాలర్లమేర రుణాలను(2013తో పోలిస్తే 40 శాతం అధికం) మంజూరు చేసినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక నాకావో భేటీ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కాగా, భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడుల పెంపుతో పాటు మెరగైన వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు మోదీ సర్కారు చేపడుతున్న చర్యలను నకావో ప్రశంసించినట్లు ఏడీబీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకోనుందని ఆయన చెప్పారని పేర్కొంది. మోదీతో భేటీ తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కూడా నకావో సమావేశమయ్యారు. ఆర్థికాభివృద్ధిలో సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌తో ఏడీబీ భాగస్వామ్యంపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇంధన సబ్సిడీల తగ్గింపు, పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితి పెంపు, మౌలిక రంగ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించడం వంటి తాజా సంస్కరణ చర్యలను నకావో వద్ద జైట్లీ ప్రధానంగా ప్రస్తావించారు. వృద్ధికి చేదోడుగా నిలవనున్న వస్తు-సేవల పన్ను(జీఎస్టీ) అమలు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నకావో కొనియాడారు. స్మార్ట్ సిటీలకు చేయూతనిస్తాం... భారత్‌లో 100 స్మార్ట్ సిటీలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రణాళికలకు తోడ్పాటునందిస్తామని ఏడీబీ ప్రెసిడెంట్ నాకావో హామీనిచ్చారు. సరైన పారిశుద్ధ్యం, చౌక రవాణా సదుపాయాలతోపాటు టెక్నాలజీ, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ సద్వినియోగంతో నగరాల్లోని పేదలకు సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. గురువారమిక్కడ జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
చమురు పతనంతో సంస్కరణలకు చాన్స్
* జీడీపీ 5.5% పురోగమిస్తుంది * ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంచనా న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో కుప్పకూలుతున్న ముడిచమురు ధరలు దేశీయంగా సంస్కరణల అమలుకు జోష్‌నిస్తాయని ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) పేర్కొంది. దేశ జీడీపీ పురోగమన పథంలో ఉన్నదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో 5.5% వృద్ధి సాధించే అవకాశమున్నదని అంచనా వేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 5.7%, ద్వితీయ త్రైమాసికం(క్యూ2)లో 5.3% చొప్పున ఆర్థిక వ్యవస్థ పురోగమించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్థంలో మందగమన పరిస్థితులు తలెత్తినప్పటికీ అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలు సుస్థిర బాటలో కొనసాగే అవకాశమున్నదని అభిప్రాయపడింది. కాగా, పతనమవుతున్న చమురు ధరలు పలు ఆసియా దేశాలకు వరంగా మారనున్నాయని వ్యాఖ్యానించింది. తద్వారా లాభదాయక సంస్కరణలకు వీలుచిక్కనుందని తెలిపింది. చమురును దిగుమతి చేసుకునే ఇండియా, ఇండోనేసియా వంటి దేశాలు సబ్సిడీ చెల్లింపుల వంటి కార్యక్రమాలలో సంస్కరణలకు తెరలేపుతాయని ఏడీబీ ప్రధాన ఆర్థికవేత్త షాంగ్జిన్ వేయ్ పేర్కొన్నారు. జీడీపీ 6.3% వృద్ధిని సాధించాలంటే మరిన్ని నిర్మాణాత్మక చర్యలను చేపట్టాల్సి ఉంటుందని సూచించారు. -
పెట్రోకారిడార్ ప్రాంతం పరిశీలన
నక్కపల్లి: మండలంలో పెట్రోకారిడార్ ప్రతిపాదిత గ్రామాల్లో గురువారం ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ప్రతినిధుల బృందం పర్యటించింది. 20 మంది సభ్యులతో కూడిన బృం దం రాజయ్యపేట, అమలాపురం, వేంపాడు, మూలపర గ్రామాల్లో పర్యటించి ప్రతిపాదిత పెట్రోకారిడార్‌మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించింది. అనంతరం రాజయ్యపేట,బోయపాడు మీదు గా మూలపర చేరుకుంది. ఇక్కడ పెట్రోకారి డార్ ఏర్పాటు చేస్తే పరిశ్రమల ఏర్పాటుకు సం బంధించి నీటివనరులు, రోడ్లు,ఇతర మౌలిక సదుపాయాలు, ప్రతిపాదిత ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ,ప్రైవేటు భూముల వివరాలు, తదితర వివరాలను ఏపీఐఐసీ అధికారులు వారికి వివరించారు. పెట్రోకారిడార్‌లోకి ఏయేగ్రామాలు వస్తాయి, ఈ ప్రాంతం నుంచి జాతీయరహదారి ఎంతదూరం ఉంది. గతంలో ఇక్కడ ఏయేపరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నది ఏడీబీ ప్రతినిధులు ఏపీఐఐసీ అధికారులను అడిగితెలుసుకున్నారు. పెట్రోకారిడార్ మాస్టర్‌ప్లాన్ రూపొందించినప్పటికీ, దాని ఏర్పాటుకు అనుమతులు, భూసేకరణ, రైతుల అంగీకారం గు రించి ఆరా తీశారు. రైతుల నుంచి ప్రైవేటు భూమి కొనుగోలు, పరిశ్రమల ఏర్పాటు, అవసరమైన తాగునీరు, విద్యుత్ సదుపాయం, రోడ్డురవాణా, ఇతర మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తున్నదీ చెప్పడంలో అధికారులు తడబడ్డా రు. పర్యావరణ అనుమతులు దాదాపు కొలిక్కి వచ్చాయని భూసేకరణకు నోటిఫికేషన్ విడుదలచేశామని,ఈనెలలో ప్రజాభిప్రాయసేకరణకు సిద్ధమవుతున్నామని ఏపీఐఐసీ అధికారలు ఏడీబీ ప్రతినిధులకు వివరించారు. ఈ బృందం వెంట నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు, స్థానిక తహశీల్దార్ సుందరరావు , ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. ప్రజల్లో ఉత్కంఠ.. దాదాపు 8 వాహనాలతోకూడిన కాన్వాయ్ ఒకదానివెంట ఒకటి రయ్య్‌మ్రని పరుగులు తీయడం వాహనశ్రేణి ముందు పోలీసుల వాహనం పైలట్‌గా వెళ్లడం ఒక్కసారిగా వాహనాలు ఆగడం టకటకామంటూ అధికారులు దిగి ఏవో పెద్దపెద్ద ప్లానులు చూడటం వారిలో వారే మాట్లాడుకోవడం, వచ్చిన వారంతా తెల్లదొరలమాదిరిగా ఉండటంతో ఏమిజరుగుతుందో తెలియక ఈ ప్రాంత ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. పీసీపీఐఆర్‌ఏర్పాటుకు ఈనెల 18న ప్రజాభిప్రాయసేకరణ జరగనుంది, ఇప్పటికే దీనిపై ఆందోళన చెందుతున్న ప్రజానీకం తాజాగా పెట్రోకారిడార్ ఏర్పాటుకోసం ప్రభుత్వం ఈప్రాంతానికి ఏడీబీ ప్రతినిధుల బృందాన్ని తీసుకొచ్చింది. దీంతొ తీరప్రాంతగ్రామాల్లో ఉత్కంఠనెలకొంది. స్థానిక అధికారులెవరూ ఈవిషయాలపై నోరుమెదపకపోవడం రైతులను,కూలీలను, గంగపుత్రులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అచ్యుతాపురంలో.. ఏడీబీ ప్రతినిధుల బృందం గురువారం మండలంలో పర్యటించింది. బ్రాండెక్స్ అపెరెల్‌సిటీకి చేరుకున్న బృంద సభ్యులకు పరిశ్రమలకు సంబంధించిన వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ద్వారా హెచ్‌ఆర్‌మేనేజర్ రఘుపతి వివరించారు. పరిశ్రమల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలపై సభ్యులు ప్రశ్నించారు. రోడ్లు విస్తరించాలని, విద్యుత్‌సరఫరా మెరుగుపడాలని సూచించారు. ముడిసరకు దిగుమతిలో ఇబ్బందులులేవని,ఎగుమతికి చెన్నయ్‌పోర్టును ఆశ్రయిస్తున్నామని బ్రాండెక్స్ అధికారులు తెలిపారు. ఉద్యోగులకు కొరతలేదన్నారు. హుద్‌హుద్ నష్టాన్ని వివరించారు. అనంతరం పూడిమడక హైస్కూల్ వద్దకు వెళ్లారు. ఎస్ఈజెడ్ అవుటర్ రింగ్‌రోడ్డు నమూనాను పరిశీలించారు. పైపులైన్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించారు. అక్కడ నుంచి ఆంజనేయ అల్లాయీస్ పరిశ్రమను సందర్శించి సమస్యలను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో సౌత్ ఆసియా రీజనల్ కార్పొరేషన్ డెరైక్టర్ శేఖర్‌బోను, ఎకనమిస్ట్ హు యన్ జంగ్, ప్రాజెక్టులీడర్ మనోజ్శర్మ, ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ రవిపెరీ, సుమిత్ చక్రవర్తి, జార్జ్, బెనిత్ అయ్యర్, సౌమ్య చటోపాధ్యాయ, ఏపీఐఐసీ జెడ్ఎం యతిరాజు పాల్గొన్నారు. -
మరోసారి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందాల రాక
- హుద్‌హుద్ నష్టం అంచనా - నేటి నుంచి 18 వరకు క్షేత్రస్థాయి పరిశీలన సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధి బృందాలు గురువారం నుంచి మరోసారి హుద్‌హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. 19 సభ్యులతో కూడిన ఈ బృందం వేర్వేరుగా ఉత్తరాంధ్రలో పర్యటించనున్నా రు. ఈ రెండు టీమ్‌ల కీలకాధికారులు హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో సమావేశమై న తర్వాత 11వ తేదీ సాయంత్రానికి విశాఖపట్నం వస్తారు. 12వ తేదీ నుంచి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారు. 13 నుంచి 15వ తేదీల్లో ఫీల్డ్ విజిట్స్‌కు వెళ్లనున్న ఈ బృందా లు 16-17వ తేదీల మధ్య డ్రాప్ట్ రిపోర్టు రూపకల్పన చేస్తారు. 18న తిరిగి హైదరాబాద్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌తో చర్చలు జరుపుతారు. గత నెల 25వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఇటీవలే కేంద్రానికి తమ నివేదికను సమర్పించింది. ఉత్తరాంధ్రలో విద్యుత్ వ్యవస్థ ఆధునికీకరణ కోసం రూ.900 కోట్ల మేర సాయమందించేందుకు సంసిద్ధత వ్య క్తం చేసిన తరుణంలో మరోసారి 19 సభ్యులతో కూడిన ఈ బృందాలు హుద్‌హుద్ తు ఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుండ డం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు రూ పొందించే నివేదికను బట్టే ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
కోస్టల్ కారిడార్‌కు ప్రణాళిక సిద్ధం
విశాఖ-చెన్నై మధ్య ఏప్రిల్ నుంచే ప్రారంభం అడ్డంకిగా మారనున్న భూ సేకరణ విశాఖ-చెన్నై మధ్య బుల్లెట్ ట్రైన్? బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా జలరవాణాకు పరిశీలన హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విశాఖపట్నం-చెన్నై కారిడార్ ప్రాజెక్టు 2015 ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) కారిడార్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. కారిడార్‌లో మెగా టూరిజం ప్రాజెక్టులు, పోర్టుల అభివృద్ధి, పెట్రో కెమికల్ ఇండస్ట్రీలు, ఎల్ఎన్జీ టెర్మిన ళ్లు, పవర్ ఆధారిత పరిశ్రమలపై ఇప్పటికే ఓ బ్లూ ప్రింటును కూడా రూపొందించింది. పోర్టుల నుంచి జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉండేలా రేడియం రోడ్లు, 6 లేన్ల రహదారులు నిర్మించనున్నారు. 975 కి.మీ. పొడవున్న కోస్తా తీర ప్రాంతం టూరిస్ట్ హబ్‌గా రూపొందించేందుకు వీలుగా బీచ్ రిసార్ట్స్, క్లబ్ హౌసెస్, హౌస్ బోట్స్ తదితరాలతో అందమైన పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దనున్నారు. అంతేకాకుండా బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా జలరవాణాకు అనుకూలంగా చేయనున్నారు. ఇందుకు 421.55 కి.మీ. పొడవున్న బకింగ్‌హామ్ కాలువను కాకినాడ నుంచి చెన్నైలోని విల్లుపురం వరకు జలరవాణాకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ఏడీబీ సూచించింది. విశాఖ-చెన్నై నడుమ బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు అనువుగా రైలు మార్గంపై అధ్యయనం చేయాలని రైల్వేకు లేఖ కూడా రాసింది. దక్షిణాసియాకు ప్రధాన వ్యాపార కేంద్రం కోస్టల్ కారిడార్‌లో తొలుత పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతులు, సౌకర్యాల కంటే పారిశ్రామిక జోన్ల ఏర్పాటుకు ప్రాధాన్యతిచ్చి పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఏడీబీ ప్రణాళికలు రూపొందించింది. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, అనంతపురం, ఏర్పేడు-శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఐదు పారిశ్రామిక జోన్ల ఏర్పాటుకుగాను రూ.15,320 కోట్లను అందించేందుకు ఏడీబీ సంసిద్ధత వ్యక్తం చేసింది. పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేసి జపాన్, చైనా, దక్షిణ కొరియా, యూరప్‌ల నుంచి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన ప్రతిపాదనలను కూడా ఏడీబీ అందించింది. 1.50 లక్షల ఎకరాల భూమి అవసరం కోస్టల్ కారిడార్‌లో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక జోన్లకు మొత్తం 1.50 లక్షల ఎకరాల భూమి అవసరమవుతుందని గతంలోనే నిర్ణయించారు. ప్రధానంగా రాజమండ్రి, భీమవరం, నూజివీడు, విజయవాడ, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేటల మీదుగా వెళుతుంది. ఆయా ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు గాను పెద్ద మొత్తంలో భూమి అవసరం కానుంది. భూసేకరణ ఇక్కడ ప్రధాన అడ్డంకిగా మారనుంది. ఈ కారిడార్‌లో విజయవాడ, గుంటూరు ప్రాంతాలుండటం, ఇక్కడే రాజధాని నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణ జరగనుండడంతో మరల పారిశ్రామిక జోన్లకు భూ సేకరణ ఎంతమేరకు సాధ్యమన్నది ప్రశ్నగా మారింది. -
విశాఖ పునర్నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్
ప్రపంచబ్యాంకు, ఏడీబీ నుంచి నిధులకు ప్రయత్నం: ఏపీ సీఎం చంద్రబాబు * ఆస్తి నష్టం అంచనాలకు మించి ఉంది * అందరి సహకారంతోనే ఉత్తరాంధ్రను సాధారణ స్థితికి తెచ్చాం * విద్యుత్తు సంస్థలకు నష్టం రూ.1,400 కోట్లుదాకా ఉంది * అంకితభావంతో పనిచేసిన విశాఖ కలెక్టర్, ఉద్యోగులకు అభినందనలు సాక్షి, హైదరాబాద్/విశాఖ రూరల్: హుదూద్ తుపాను ధాటికి పూర్తిగా దెబ్బతిన్న విశాఖ నగర పునర్నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)ల నుంచి నిధులు తెచ్చేందుకు మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తామ ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖను సుందరవనంగా, ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా తయారు చేస్తామని తెలిపారు. ఆదివారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, అనంతరం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తుపాను కారణంగా అంచనాలకు అందనివిధంగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఆయువు పట్టు లాంటి ఆర్థిక నగరం కుదేలైందని, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించిన స్మార్ట్ సిటీ ఇబ్బందుల్లో ఉందని అన్నారు. తుపాను ఓ నగరాన్ని అల్లకల్లోలం చేసిన సంఘటన ఇటీవలి కాలంలో ఎక్క డా లేదన్నారు. 30 లక్షలమంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. త్వరలో తాను ప్రధాని మోదీని కలిసి నగర పునర్నిర్మాణంపై చర్చిస్తానన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు నీతికి మారుపేరని, నిజాయితీ వీరి వారసత్వంలోనే ఉందని కితాబిచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఆరు రోజులపాటు తాను విశాఖలోనే ఉండి ప్రజ లకు ఇబ్బందులు లేకుండా ఎన్ని చేయాలో అన్ని కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తన బాధ్య త నెరవేర్చానని, సంతోషంగా ఉందని చెప్పారు. మళ్లీ మంగళవారం రాత్రికి విశాఖ వస్తానని, రెండు రోజులిక్కడే ఉండి పరిస్థితులను పూర్తిగా చక్కదిద్దుతానని అన్నారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, పశ్చి మబెంగాల్ రాష్ట్రాలతోపాటు అధికార యం త్రాంగం, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో తుపాను నష్టం నుంచి ఉత్తరాంధ్ర తేరుకునేలా చేయగలిగామని చెప్పారు. తుపాను వచ్చిన రెండోరోజే ప్రధాని మోదీ విశాఖకొచ్చి ప్రజలకు భరోసా కల్పించారన్నారు. ప్రభుత్వరంగానికే భారీ నష్టం తుపాను నష్టం ప్రభుత్వ రంగంలోనే భారీగా ఉందన్నారు. ఒక్క విద్యుత్తు శాఖ నష్టమే రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల వరకు ఉందని తెలిపారు. పెనుగాలులకు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిందన్నారు. 30 వేల విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయని, వేలాది ట్రాన్స్ఫార్మర్లు కుప్పకూలాయని, వందలాది సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని చెప్పారు. ఎన్టీపీసీలో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 10 లక్షల సర్వీసు కనెక్షన్లు ఇవ్వగా, ఇంకా 13 లక్షల కనెక్షన్లను పునరుద్ధరించాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు విద్యుత్ సరఫరా చేస్తామని, 22వ తేదీ నాటికి మండల కేంద్రాల్లో, 25వ తేదీకి జిల్లా మొత్తంగా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. విద్యుత్ రాని ప్రాంతాలు, ఏజెన్సీలో 5 లీటర్ల కిరోసిన్ ఇస్తామన్నారు.పరిశ్రమల పునరుద్ధరణకు ఏడుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు చెప్పారు. పచ్చదనానికి ప్రణాళిక విశాఖలో పచ్చదనం పరిరక్షణకు హార్టీకల్చర్ నిపుణులతో ప్రణాళిక రూపొందిస్తామని సీఎం తెలిపారు. సోమవారం నుంచి చెట్లను ప్రూనింగ్ చేస్తామని చెప్పారు. అందమైన ల్యాండ్ స్కేపింగ్, తుపాన్లను తట్టుకొనేలా చెట్లను వేయడానికి ముంబై నుంచి కన్సల్టెంట్లు వచ్చారని అన్నారు. విశాఖ జిల్లాలో 13 లక్షల కుటుంబాలకు నిత్యావసరాలను అందిస్తామని చెప్పారు. ముకేష్ అంబానీ రూ.11 కోట్ల విరాళం తుపాను బాధితుల సహాయార్థం రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ రూ.11 కోట్లు విరాళంగా ప్రకటించినట్లు సీఎం వెల్లడించారు. 23న కాగడాల ర్యాలీ తుపాను చేసిన గాయాన్ని మరచిపోయేందు కు, విశాఖవాసుల్లో ఆత్మవిశ్వాసం నింపేం దుకు ఈ నెల 23న ఆర్కే బీచ్‌లో ‘తుపాను ను జయిద్దాం’ నినాదంతో కాగడాల ర్యాలీ నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు. పరిస్థితులు చక్కబడ్డాక విశాఖ పునరుద్ధరణకు కృషి చేసిన ఇతర రాష్ట్రాల అధికారులు, సిబ్బందితో భారీ అభినందన సభ నిర్వహిస్తామని చెప్పారు. ఇతర జిల్లాలవారికి విందు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ యువరాజ్‌ను ఆదేశించారు. సహాయక పనుల్లో కష్టపడిన వారిని గుర్తించి అవార్డులిచ్చి సత్కరిస్తామన్నారు. -
మళ్లీ ప్రపంచబ్యాంకు బాటలో బాబు
రూ.20,000 కోట్ల అప్పు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం * ప్రపంచ బ్యాంకు, విదేశీ సంస్థల నుంచి రుణాలు * ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం * వివిధ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు రూపొందించాలని ఆదేశం * రంగాలవారీగా ఉండాలని సూచన సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ ప్రపంచబ్యాంకు బాట పడుతున్నారు. ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రూ. 20 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జెఐసీఏ), డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (డీఎఫ్ఐడీ), యునెటైడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యుఎస్‌ఎఐడీ), కెఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు, కెనడా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (సీఐడీఏ)ల నుంచి రుణాలు తెచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అందులోగల అవకాశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, రవాణా, రహదారులు - భవనాలు, పరిశ్రమలు, మౌలిక వసతులు - పెట్టుబడులు, ఇంధన, విద్య, ఆరోగ్యం, ఇరిగేషన్, వ్యవసాయం, అటవీ పర్యావరణ శాఖలు విదేశీ అప్పుల కోసం అవసరమైన ప్రాజెక్టులను తయారు చేయాలని సూచించారు. వివిధ రంగాల్లో అభివృద్ధితో పాటు సంస్కరణలు చేపట్టేలా వీటిని రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక హోదా రాగానే ఈ ప్రాజెక్టుల నివేదికలను కేంద్రానికి పంపించి ఆమోదం తీసుకోవాలని ఆదేశించారు. తద్వారా విదేశీ సంస్థల నుంచి తీసుకునే అప్పులో కేంద్ర ప్రభుత్వం 90 శాతం మేర గ్రాంటుగా భరిస్తుందనేది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది. రూపొందించే ప్రాజెక్టులు, తీసుకొనే రుణం.. * వ్యవసాయ, ఇతర రంగాలకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లను వేర్వేరు చేయడంతో పాటు సంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తికి రూ.3 వేల కోట్ల నుంచి రూ. 4 వేల కోట్లు * కొత్త రాజధాని నిర్మాణంతో పాటు రోడ్ నెట్వర్క్, నీరు, పారిశుద్ధ్యం, మురుగునీటి నిర్వహణకు కూడా రూ. 3 వేల కోట్లు * జపాన్, చైనా, కొరియన్ టౌన్‌షిప్‌లలాగ ఒక థీమ్ (ఇతివృత్తం) ఆధారంగా టౌన్‌షిప్‌ల నిర్మాణానికి రూ. 4 వేల కోట్లు * జల రవాణా మార్గాల అభివృద్ధికి పర్యాటక కేంద్రాలను రూపొందించి, బకింగ్‌హాం కెనాల్‌ను కాకినాడ, విజయవాడ ఇతర పట్టణాలకు అనుసంధానం చేయడానికి సుమారు రూ. 3 వేల కోట్లు * నాలెడ్జ్ హబ్‌ల నిర్మాణానికి రూ. 2 వేల కోట్లు * నగరాలు, పట్టణాల్లో ఉమ్మడిగా మౌలిక వసతుల కల్పనకు రూ. 3 వేల కోట్లు * గుజరాత్‌లోని జీఐఎఫ్‌టీ తరహాలో ఆర్థిక, సాంకేతిక (టెక్నికల్) నగరాల నిర్మాణానికి రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్లు. -
పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు బాధ్యత ఏడీబీదే
హైదరాబాద్: చెన్నై-వైజాగ్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు బాధ్యత ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)కి అప్పగిస్తూ భారత ప్రభుత్వంలోని పరిశ్రమల విభాగం నిర్ణయం తీసుకుంది. దీంతో వెయ్యి కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ కారిడార్ ఏర్పాటుకు అవసరమైన నిధుల్ని ఏడీబీయే సమకూర్చనుంది. ఈ మేరకు ఏడీబీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో శుక్రవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో భేటీ అయ్యారు. ప్రాథమికంగా కారిడార్ ఏర్పాటుకు కావాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబుకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే లైన్లు, రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆగస్టు 10న మరోసారి ఏడీబీ బృందం సీఎంతో భేటీ కానుంది. అప్పటికల్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ నివేదికను సిద్ధం చేసేలా నిర్ణయించారు. -
భారత్‌కు 10 బిలియన్ డాలర్ల రుణం
న్యూఢిల్లీ: భారత్‌కు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఐదు సంవత్సరాల కాలంలో (2013-17) 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.62,000 కోట్లు) రుణ సహాయాన్ని చేయనుంది. 2017 వరకూ వార్షికంగా 2 బిలియన్ డాలర్ల చొప్పున బ్యాంక్ ఈ సహాయాన్ని అందజేస్తుంది. ఏడీబీ-కేంద్ర ప్రభుత్వాలు ఈ మేరకు ఒక వ్యూహాత్మక భాగస్వామ్య వ్యూహాన్ని కుదుర్చుకున్నాయి. మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఏడీబీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. లక్ష్యాలు ఇవీ...: 12వ పంచవర్ష ప్రణాళికా లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ నిధులు కొంత దోహదపడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉపాధి అవకాశాల కల్పన, పెట్టుబడుల సంస్కరణల అమలు, మౌలిక రంగం పురోభివృద్ధి లక్ష్యంగా ఇంధనం, రవాణా, పట్టణాభివృద్ధి సేవలు, జలవనరుల సరఫరా, అభివృద్ధి వంటి అంశాల్లో ఈ నిధులను వెచ్చించనున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. భారత్ చర్యలు భేష్...: ఆర్థిక స్థిరత్వం, రూపాయి స్థిరీకరణ, మౌలిక రంగ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల అమలు వంటి అంశాల్లో భారత్ విశ్వసనీయ చర్యలు తీసుకుంటోందని ఏడీబీ దక్షిణ ఆసియా అభివృద్ధి వ్యవహారాల డెరైక్టర్ జనరల్ జూయిన్ మిరాందా పేర్కొన్నారు. కాగా, కొన్ని క్లిష్టమైన విధాన సమస్యలు పరిష్కారమయితే భారత్ అధిక వృద్ధి సాధ్యమేనని ఏడీబీ పేర్కొంది. పారిశ్రామిక భూ సేకరణ, సహజ వనరులకు సంబంధించి లెసైన్సుల మంజూరుల్లో ఇబ్బందులు తొలగిపోవాల్సిన ఉందని సూచించింది.