- హుద్‌హుద్ నష్టం అంచనా
- నేటి నుంచి 18 వరకు క్షేత్రస్థాయి పరిశీలన
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధి బృందాలు గురువారం నుంచి మరోసారి హుద్‌హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. 19 సభ్యులతో కూడిన ఈ బృందం వేర్వేరుగా ఉత్తరాంధ్రలో పర్యటించనున్నా రు. ఈ రెండు టీమ్‌ల కీలకాధికారులు హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో సమావేశమై న తర్వాత 11వ తేదీ సాయంత్రానికి విశాఖపట్నం వస్తారు. 12వ తేదీ నుంచి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారు.
13 నుంచి 15వ తేదీల్లో ఫీల్డ్ విజిట్స్‌కు వెళ్లనున్న ఈ బృందా లు 16-17వ తేదీల మధ్య డ్రాప్ట్ రిపోర్టు రూపకల్పన చేస్తారు. 18న తిరిగి హైదరాబాద్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌తో చర్చలు జరుపుతారు. గత నెల 25వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఇటీవలే కేంద్రానికి తమ నివేదికను సమర్పించింది.
ఉత్తరాంధ్రలో విద్యుత్ వ్యవస్థ ఆధునికీకరణ కోసం రూ.900 కోట్ల మేర సాయమందించేందుకు సంసిద్ధత వ్య క్తం చేసిన తరుణంలో మరోసారి 19 సభ్యులతో కూడిన ఈ బృందాలు హుద్‌హుద్ తు ఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుండ డం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు రూ పొందించే నివేదికను బట్టే ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మరోసారి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందాల రాక
Published Thu, Dec 11 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement