The World Bank
-
సిటీ.. స్మార్టీ
ఐ.ఎఫ్.సి. సహకారం పి.పి.పి.పద్ధతిలో అభివృద్ధి అవకాశాలు పుష్కలం ఢిల్లీ తర్వాత తొలి నగరం స్వాగ తిస్తున్న నగరవాసులు విజయవాడ : విజయవాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు వరల్డ్ బ్యాంకుకు చెందిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐ.ఎఫ్.సి) ఆసక్తిచూపడంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బుధవారం ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమైనప్పుడు విజయవాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసే అంశం చర్చకు వచ్చింది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో నగరాభివృద్ధికి ఐ.ఎఫ్.సి. ముందుకు వచ్చింది. దీనికి సీఎం కొంత సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గురువారం రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో విజయవాడను స్మార్ట్ సిటీగా మార్చేం దుకు నిధులు కేటాయిస్తామని ప్రకటించడం గమనార్హం. ఢిల్లీ తర్వాత తొలి స్మార్ట్ నగరం ఐ.ఎఫ్.సి. విజయవాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అంగీకరిస్తే.. దేశంలో ఢిల్లీ తర్వాత తొలి స్మార్ట్ సిటీ విజయవాడ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ కావడంతో దీన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపుతున్నారు. అదే జరిగితే నగర రూపురేఖలే మారిపోతాయి. స్మార్ట్ సిటీలో మెట్రో రైలు, విశాలమైన రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి శానిటేషన్ అభివృద్ధి, 24 గంటల విద్యుత్ సౌకర్యం, రోజంతా నగర ప్రజలకు శుద్ధమైన మంచినీరు అందుబాటులో ఉంటాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్, విమానాశ్రయం, నగరమంతా వైఫై సౌకర్యం, డిస్నీల్యాండ్, కాల్వల్లో బోటింగ్‌లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వర్షం నీటిని వడిసిపట్టి భూగర్భ జలవనరులను పెంచుకునే సౌకర్యాలు ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు. కాగా ఈ ప్రాజెక్టులో కొన్నింటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో సమకూర్చితే, మరికొన్ని పి.పి.పి. పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ఐ.ఎఫ్.సి నిధులు కేటాయిస్తుంది. అభివృద్ధికి అన్ని హంగులూ.. విజయవాడను స్మార్ట్ సిటీగా మార్చేందుకు నిధులు కేటాయిస్తే ఇక్కడ అన్ని రకాల వనరులు ఉన్నాయని నగర ప్రముఖులు చెబుతున్నారు. 113 ఎకరాల్లో విస్తరించి ఉన్న భవానీ ద్వీపాన్ని గ్రీన్ ఫీల్డ్ జోన్‌గా అభివృద్ధి చేయడమే కాకుండా డిస్నీల్యాండ్‌ను ఏర్పాటు చేస్తే వాటర్ బోటింగ్ సౌకర్యం పర్యాటకులకు అందుబాటులోకి వస్తుంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ దేవాలయాన్ని అభివృద్ధి పరిచి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చివచ్చు. నగరం మధ్య నుంచి వెళుతున్న మూడు కాల్వలను రవాణా సౌకర్యాలు, బోటింగ్‌కు ఉపయోగించుకోవచ్చు. శివారు ప్రాంతాల్లో అత్యాధునిక టెక్నాలజీతో శానిటేషన్ మిషన్లు ఏర్పాటు చేసి చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దవచ్చు. ఇప్పటికే ఆసియాలోనే పెద్దదైన బస్‌స్టేషన్, పది ప్లాట్‌ఫారాలు ఉన్న రైల్వేస్టేషన్ ఉన్నాయి. వీటిని మరికాస్త అభివృద్ధి చేస్తే దేశంలో ఇతర బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లను తలదన్నేలా నిలుస్తాయి. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు ఇప్పటికే మంజూరైన మెట్రో రైలు నిర్మాణం పూర్తయితే నగరాభివృద్ధి దూసుకుపోతుంది. ఇప్పటికే నగరంలో కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లు, ఐనాక్స్ థియేటర్లు వచ్చేశాయి. రాబోయే రోజుల్లో మెట్రో నగరాలకు దీటుగా ఇవి అభివృద్ధి చెందుతాయి. పోలీసులు కృషితో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, నేరాలను అదుపులో ఉంచితే రాబోయే రోజుల్లో స్మార్ట్ సిటీగా విజయవాడ అభివృద్ధి చెందడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. -
మరోసారి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందాల రాక
- హుద్‌హుద్ నష్టం అంచనా - నేటి నుంచి 18 వరకు క్షేత్రస్థాయి పరిశీలన సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధి బృందాలు గురువారం నుంచి మరోసారి హుద్‌హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. 19 సభ్యులతో కూడిన ఈ బృందం వేర్వేరుగా ఉత్తరాంధ్రలో పర్యటించనున్నా రు. ఈ రెండు టీమ్‌ల కీలకాధికారులు హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో సమావేశమై న తర్వాత 11వ తేదీ సాయంత్రానికి విశాఖపట్నం వస్తారు. 12వ తేదీ నుంచి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారు. 13 నుంచి 15వ తేదీల్లో ఫీల్డ్ విజిట్స్‌కు వెళ్లనున్న ఈ బృందా లు 16-17వ తేదీల మధ్య డ్రాప్ట్ రిపోర్టు రూపకల్పన చేస్తారు. 18న తిరిగి హైదరాబాద్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌తో చర్చలు జరుపుతారు. గత నెల 25వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఇటీవలే కేంద్రానికి తమ నివేదికను సమర్పించింది. ఉత్తరాంధ్రలో విద్యుత్ వ్యవస్థ ఆధునికీకరణ కోసం రూ.900 కోట్ల మేర సాయమందించేందుకు సంసిద్ధత వ్య క్తం చేసిన తరుణంలో మరోసారి 19 సభ్యులతో కూడిన ఈ బృందాలు హుద్‌హుద్ తు ఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుండ డం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు రూ పొందించే నివేదికను బట్టే ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
నెల రోజుల గరిష్టం
128 పాయింట్లు ప్లస్ 26,881కు చేరిన సెన్సెక్స్ మళ్లీ 8,000 దాటిన నిఫ్టీ చివర్లో పెరిగిన కొనుగోళ్లతో మార్కెట్లు నష్టాల నుంచి బయటపడి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 128 పాయింట్లు పుంజుకుని 26,881 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ సైతం 36 పాయింట్లు లాభపడి 8,028 వద్ద నిలిచింది. తద్వారా మళ్లీ 8,000 మైలురాయికి ఎగువన ముగిసింది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 5.6%కు చేరుతుందన్న ప్రపంచ బ్యాంకు అంచనాలు, ఆసియా, యూరప్ మార్కెట్ల లాభాలు దేశీయంగా సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయని విశ్లేషకులు తెలి పారు. ఇదికాకుండా అక్టోబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు నేపథ్యంలో జరిగిన షార్ట్ కవరింగ్ కూడా మార్కెట్లకు బలాన్నిచ్చినట్లు పేర్కొన్నారు. సన్ ఫార్మా జోష్ సెన్సెక్స్ దిగ్గజాలలో సన్ ఫార్మా 4.3% పుంజుకోగా, సిప్లా, టాటా పవర్, ఎస్బీఐ, గెయిల్, ఐసీఐసీఐ 3-2% మధ్య పురోగమించాయి. అయితే మరోవైపు హీరోమోటో, భారతీ, హెచ్‌యూఎల్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, మారుతీ, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ 1.5-0.5% మధ్య నష్టపోయాయి. -
నీటిపారుదల నిర్లక్ష్యం
చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు రూ.90 కోట్ల మంజూరు ఇప్పటికి రూ.32.50 కోట్ల పనులు మాత్రమే పూర్తి నిధుల వినియోగం గడువును మరో రెండేళ్లకు పెంచిన ప్రపంచ బ్యాంకు అప్పటికైనా పూర్తయ్యేనో..లేదో..? చేపా చేపా ఎందుకు ఎండలేదంటే.. ఆవు గడ్డిమేయలేదంట.. ఇది అందరికీ తెల్సిందే. జిల్లాలోని నీటిపారుదల శాఖ అధికారులూ ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. గండి పడ్డ చెరువులు.. దుస్థితికి చేరిన కట్టలకు మరమ్మతులు చేసేందుకు పుష్కలంగా నిధులు మంజూరైనా ఖర్చుచేయలేక చేతులెత్తేశారు. కారణం.. సిబ్బంది కొరత..ఎస్టిమేషన్లలో జాప్యం.. వెరసి వచ్చిన నిధులు వెనక్కెళ్లే ప్రమాదం నెలకొంది. ఎలాగోలా ప్రపంచబ్యాంకు మరో రెండేళ్లు గడువు ఇచ్చింది. ఇప్పటికైనా మేల్కొంటారో.. వదిలేస్తారో వేచిచూడాల్సిందే..! సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో 8,058 చెరువులు, కుంటల కింద 30,370 ఎకరాల ఆయకట్టు విస్తరిం చి ఉంది. రాష్ట్రంలో చెరువులు, కుంటల కింద అత్యధిక ఆయకట్టు ఉన్న జిల్లా చిత్తూరే కావడం గమనా ర్హం. శతాబ్దాల క్రితం నిర్మించిన చెరువులు, కుంటలు ఆలనాపాలనా లేకపోవడం వల్ల అధిక శాతం వనరులు నిరర్థకంగా మారాయి. చెరువులు, కుంటల గండ్లు పూడ్చడం.. కట్టలను పటిష్టం చేయడం.. తూములను మరమ్మతు చేయడం.. ఫీడర్, సప్లయ్ చానళ్లను అభివృద్ధి చేయడం ద్వారా చిన్న నీటి వనరులను పునరుద్ధరించాలని 2005లో అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి భావించారు. ఈ క్రమంలోనే చిన్న నీటివనరుల పునరుద్ధరణకు సహకరించాలని ప్రపంచ బ్యాంకును కోరారు. వైఎస్ ప్రతిపాదన మేరకు మన జిల్లాలో చెరువులు, కుంటల పునరుద్ధరణకు ట్రిఫుల్ ఆర్(రిపేర్స్ రీకన్స్ట్రక్షన్ రినోవేషన్) పథకం కింద రూ.90 కోట్లను 2007లో ప్రపంచ బ్యాంకు మంజూరు చేసింది. ఈ నిధులను 2010 లోగా ఖర్చు చేయాలని సూచించింది. కానీ.. ఆ నిధులను ఖర్చు చేయడంలో చిన్న నీటిపారుదలశాఖ అధికారులు విఫలమయ్యారు. గడువు ముగియడంతో నిధులను వెనక్కి తీసుకుంటున్నట్లు 2010లో ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు స్పష్టీకరించింది. సిబ్బంది కొరత, ఎస్టిమేట్లలో జాప్యం వల్ల పనులు చేపట్టలేకపోయామని.. మరో నాలుగేళ్లు గడువు ఇవ్వాలని ప్రపంచ బ్యాంను 2010లో ప్రభుత్వం కోరింది. ఇందుకు ప్రపంచ బ్యాంకు సమ్మతించింది. కానీ.. పొడిగించిన గడువు ముగిసే నాటికి కూడా అధికారులు పనులను పూర్తిచేయలేకపోయారు. జిల్లాలో కేవలం 310 చెరువులను రూ.32.50 కోట్లతో అభివృద్ధి చేయగలిగారు. తక్కిన 57.50 కోట్లను ఇప్పటిదాకా ఖర్చుచేయలేపోయారు. నెలాఖరుతో నిధుల వినియోగానికి గడువు ముగియనుండడంతో ట్రిపుల్ ఆర్ పథకం ప్రగతిని ప్రపంచ బ్యాంకు ఇటీవల ఆరా తీసింది. రూ.57.50 కోట్లను ఖర్చు చేయలేదని పసిగట్టిన ప్రపంచ బ్యాంకు.. ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వాన్ని మరోసారి కోరింది. ఇందుకు స్పందించిన ప్రభుత్వం.. మరో రెండేళ్లు గడువు ఇస్తే పనులను పూర్తిచేస్తామని ప్రపంచ బ్యాంకుకు హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు నిధుల వినియోగానికి అక్టోబర్ 2016 వరకూ గడువు ఇచ్చింది. కానీ.. అప్పటికైనా నిధులను వినియోగించుకుని చిన్న నీటివనరులను అభివృద్ధి చేస్తారా అన్న ప్రశ్నకు అధికారవర్గాల నుంచి సరైన సమాధానం లభించకపోవడం గమనార్హం. -
సంస్కరణల తర్వాతే సాగు నీటి సంఘాలకు ఎన్నికలు!
చట్టంలో వూర్పు దిశగా సర్కారు ఆలోచనలు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి వినియోగ సంఘాలకు ఎన్నికలు జరిపే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టాల కారణంగా పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన నీటి సంఘాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి సంస్కరణలు తేవాలని భావిస్తోంది. నీటి వినియోగ సంఘాలను అసలైన రైతు సంఘాలుగా మార్చేందుకు చట్టంలో కీలక మార్పులు చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. సాగు నీటి సంఘాల ఎన్నికల విషయుంలో ఇటీవల ఫలు దఫాలుగా అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రుల స్థాయిలో కీలక చర్చలు జరిగాయి. జైకా, వరల్డ్‌బ్యాంక్ నిధుల కేటాయింపుల్లో ఆ సంస్థల ప్రతినిధులు రైతుల భాగస్వామ్యాన్ని కోరుతున్నారని, ఈ దృష్ట్యా నీటి సంఘాల ఎన్నికలు అనివార్యమని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇదే సమయంలో నీటి సంఘాల ముసుగులో అధ్యక్షులుగా ఎన్నికైన నేతలు అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారని, నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చే నిధులను దుర్వినియోగం చేసిన ఉదంతాలను ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలకు వివరించారు. ముఖ్యంగా ఎస్సారెస్పీ పరిధిలో గతంలో సాగునీటి సంఘాలు చేసిన అక్రమాలకు 20 మంది ఇంజనీర్లు బలయ్యారని, ఇప్పటికీ వారంతా ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ దృష్ట్యా నిజమైన రైతు వ్యవస్థతో సంఘాల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి సైతం సానుకూలంగా స్పందించి, ఆయకట్టు అభివృద్ధి, సమర్థంగా నీటి సరఫరా, కాల్వల నిర్వహణ ఉండేలా అసలైన రైతు సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే రైతు యాజమాన్య చట్టానికి కీలక మార్పులు చేసే దిశగా ప్రభుత్వ కార్యాచరణ ఉండవచ్చని, ఆ తర్వాతే ఎన్నికల ప్రక్రియపై ముందుకు వెళతారని అధికారులు వెల్లడించారు. -
ఉద్యోగ సంక్షోభం పొంచి ఉంది
సిడ్ని: ప్రపంచం ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కోనున్నదని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. అంతర్జాతీయ ఆర్థిక రికవరీ అవకాశాలను ఇది దెబ్బతీయగలదని, దీనిని నివారించగల మంత్రదండమేదీ లేదని పేర్కొంది. ఆస్ట్రేలియాలో జరిగిన జీ20 దేశాల కార్మిక, ఉద్యోగకల్పన మంత్రుల సమావేశంలో దీనికి సంబంధించిన నివేదికను ప్రపంచ బ్యాంక్ మంగళవారం విడుదల చేసింది. అంతర్జాతీయ కార్మిక సమాఖ్య (ఐఎల్ఓ), ఓఈసీడీలతో కలిసి ప్రపంచబ్యాంక్ ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు.., పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 2030 కల్లా 60 కోట్ల ఉద్యోగాలు కల్పించాలి? జీ 20 దేశాల్లో ఉద్యోగ కొరత తీవ్రత ఉంది. జీ20 దేశాల్లో వేతన, ఆదాయ అసమానతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జీ 20 దేశాల్లో నిరుద్యోగుల సంఖ్య 10 కోట్లకు పైగానే ఉంది. రోజుకు 2 డాలర్లతో జీవనాన్ని వెళ్లదీస్తున్న దీనుల సంఖ్య 45 కోట్లుగా ఉంది. మందకొడిగా ఉన్న వృద్ధి ఉద్యోగవకాశాలకు విఘాతం కలిగిస్తోంది. -
మళ్లీ ప్రపంచబ్యాంకు బాటలో బాబు
రూ.20,000 కోట్ల అప్పు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం * ప్రపంచ బ్యాంకు, విదేశీ సంస్థల నుంచి రుణాలు * ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం * వివిధ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు రూపొందించాలని ఆదేశం * రంగాలవారీగా ఉండాలని సూచన సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ ప్రపంచబ్యాంకు బాట పడుతున్నారు. ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రూ. 20 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జెఐసీఏ), డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (డీఎఫ్ఐడీ), యునెటైడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యుఎస్‌ఎఐడీ), కెఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు, కెనడా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (సీఐడీఏ)ల నుంచి రుణాలు తెచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అందులోగల అవకాశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, రవాణా, రహదారులు - భవనాలు, పరిశ్రమలు, మౌలిక వసతులు - పెట్టుబడులు, ఇంధన, విద్య, ఆరోగ్యం, ఇరిగేషన్, వ్యవసాయం, అటవీ పర్యావరణ శాఖలు విదేశీ అప్పుల కోసం అవసరమైన ప్రాజెక్టులను తయారు చేయాలని సూచించారు. వివిధ రంగాల్లో అభివృద్ధితో పాటు సంస్కరణలు చేపట్టేలా వీటిని రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక హోదా రాగానే ఈ ప్రాజెక్టుల నివేదికలను కేంద్రానికి పంపించి ఆమోదం తీసుకోవాలని ఆదేశించారు. తద్వారా విదేశీ సంస్థల నుంచి తీసుకునే అప్పులో కేంద్ర ప్రభుత్వం 90 శాతం మేర గ్రాంటుగా భరిస్తుందనేది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది. రూపొందించే ప్రాజెక్టులు, తీసుకొనే రుణం.. * వ్యవసాయ, ఇతర రంగాలకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లను వేర్వేరు చేయడంతో పాటు సంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తికి రూ.3 వేల కోట్ల నుంచి రూ. 4 వేల కోట్లు * కొత్త రాజధాని నిర్మాణంతో పాటు రోడ్ నెట్వర్క్, నీరు, పారిశుద్ధ్యం, మురుగునీటి నిర్వహణకు కూడా రూ. 3 వేల కోట్లు * జపాన్, చైనా, కొరియన్ టౌన్‌షిప్‌లలాగ ఒక థీమ్ (ఇతివృత్తం) ఆధారంగా టౌన్‌షిప్‌ల నిర్మాణానికి రూ. 4 వేల కోట్లు * జల రవాణా మార్గాల అభివృద్ధికి పర్యాటక కేంద్రాలను రూపొందించి, బకింగ్‌హాం కెనాల్‌ను కాకినాడ, విజయవాడ ఇతర పట్టణాలకు అనుసంధానం చేయడానికి సుమారు రూ. 3 వేల కోట్లు * నాలెడ్జ్ హబ్‌ల నిర్మాణానికి రూ. 2 వేల కోట్లు * నగరాలు, పట్టణాల్లో ఉమ్మడిగా మౌలిక వసతుల కల్పనకు రూ. 3 వేల కోట్లు * గుజరాత్‌లోని జీఐఎఫ్‌టీ తరహాలో ఆర్థిక, సాంకేతిక (టెక్నికల్) నగరాల నిర్మాణానికి రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్లు. -
ఆధునికీకరణ అంతంతే..
దర్శి, న్యూస్‌లైన్: నాగార్జున సాగర్ కాల్వల ఆధునికీకరణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. సాగర్ కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణ పనులను ప్రపంచ బ్యాంకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.4,400 కోట్లతో చేపట్టారు. ఈ పనులు ఈ ఏడాది ఆగస్టులోపు పూర్తికావాల్సి ఉంది. కాంట్రాక్టర్ల ఒప్పందం ప్రకారం ఈ పనులు మూడేళ్లలో పూర్తిచేసేలా టెండర్లు వేశారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తిచేయలేకపోతున్నారు. కుడి కాలువకు రూ.2400 కోట్లు వెచ్చిస్తుండగా.. ప్రకాశం జిల్లాకు రూ.439.68 కోట్లు.. అందులో దర్శి, త్రిపురాంతకం, అద్దంకి, చీమకుర్తి సబ్డివిజన్లకు ఐదు ప్యాకేజీలుగా రూ.234.27 కోట్లు కేటాయించారు. ఈ ప్యాకేజీల్లో ఇప్పటి వరకు 218 కోట్లు ఖర్చు చేశారు. 16.27 కోట్ల విలువైన పనులు ఆగస్టు లోపు పూర్తి కావాల్సింది. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ కమిటీలకు 196.68 కోట్లు కేటాయించారు. అందులో గత ఏడాది 78 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 118.68 కోట్ల విలువైన పనులు ఆగస్టులోపే కాంట్రాక్టర్లు పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం మెయిన్ కాలువలకు 60 శాతం పనులు పూర్తి కాగా మేజర్ కాలువలకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. డబ్ల్యూఏ ప్రెసిడెంట్ పరిధిలో మైనర్ కాలువల మరమ్మతులకు ఇప్పటి వరకు టెండర్లు పిలవలేదు. చివరి భూములకు అందని నీరు... ఆధునికీకరణ పనులు పూర్తికాకపోతే చివరి భూములకు నీరందే పరిస్థితి ఉండదు. ఖరీఫ్ పంటకు కాలువ నీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఆధునికీకరణ పనులు ముందుకు సాగకపోవడంతో ఈ ఏడాది కూడా చివరి భూముల రైతులు నీటిపై ఆశలు వదులుకున్నారు. ప్రధానంగా రజానగరం మేజరు, త్రిపురాంతకం మండలం ముడివేముల, దర్శి మండలం యర్ర ఓబనపల్లి మేజర్‌కు నీరందే పరిస్థితుల్లేవు. యర్ర ఓబనపల్లి మేజరుకు కాలువలు చేసినప్పటికీ నీరందక కాంట్రాక్టరు కాలువను పూడ్చివేశారు. దానిని వెడల్పు చేయకుండా మళ్లీ చేస్తే ఆ కాలువ పనులకు బిల్లులు రావని ఆపడంతో గత ఏడాది రైతులు నిరందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చేసిన పనులకు బిల్లులు సకాలంలో రావడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఏదేమైనా ఆధునీకరణ పనులు ఆగ స్టులోపు పూర్తయితేనే రైతులకు పూర్తి స్థాయిలో నీరందుతుంది. లేకపోతే చివరి భూములకు నీరందడం క ష్టంగా మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు చేసిన పనులు పూర్తి కాకుండానే మధ్యలోనే మరమ్మతులకు గురవుతున్నాయి. -
‘అమృత హస్తం, మార్పు’ పనితీరు భేష్
నర్సాపూర్‌రూరల్, న్యూస్‌లైన్: గర్భిణి, బాలింత, శిశుమరణాల తగ్గింపు కోసం ప్రవేశ పెట్టిన మార్పు, అమృతహస్తం పథకాల పని తీరు భేష్‌గా ఉందని వరల్డ్ బ్యాంక్, విదేశీ బృందం సభ్యులు కితాబునిచ్చారు. గురువారం నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో వరల్డ్ బ్యాంక్ బృందం సభ్యులతోపాటు లూయిస్ దేశానికి చెందిన 5 మంది సీనియర్ ప్రభుత్వ అధికారుల బృందం సభ్యులు మార్పు, అమృతహస్తం పథకాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా కొనసాగుతున్న అమృత హస్తం పథకం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్ భరత్‌గౌడ్ అధ్యక్షతన నిర్విహించిన మార్పు గ్రామస్థాయి సమావేశంలో వారు పాల్గొని మార్పు పథకంలో పనిచేస్తున్న అధికారులతోపాటు గర్భిణి, బాలింతలతో చర్చించారు. అమృత హస్తం, మార్పు పథకాల పని తీరు తెలుసున్న వరల్డ్ బ్యాంక్, విదేశీ బృందం సభ్యులు అశికోయిలీ కతురియ, సంగీత, ఖాంప్లో సిహకంగ్, ఖాసేంగ్ ఫిలావోంగ్, సెంగ్ప్రాసేవ్ వాంతనౌవోంగ్, చాన్లావ్ లుఆంగ్లత్, సోవంఖమ్ పోమ్మసెంగ్, ఫెట్దర చంతల మాట్లాడుతూ ఈ పథకాలను తమ దేశాల్లో కూడా ప్రవేశ పెట్టించెందుకు కృషి చేస్తామన్నారు. ఈపథకాలపై విదేశీయులతోపాటు మనదేశంలోని ఆయా రాష్ట్రాల అధికారులకు అహగాహన కల్పించేందకు మెదక్ జిల్లాకు తీసుకు రానున్నట్లు తెలిపారు. అనంతరం రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్యో కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్పు రాష్ట్ర కోఆర్డినేటర్ సరళ రాజ్యలక్ష్మి, ఆర్జెడి విజయలక్ష్మి, జిల్లా వైద్యాఆరోగ్య శాఖ అధికారి పద్మ, డీఆర్డీఓ ప్రాజెక్ట్ అధికారి రాజెశ్వర్రెడ్డి, ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి శైలజ, సీడీపీఓ కనకదుర్గ, ఎంపీడీఓ రమాదేవి, పీహెచ్సీ వైద్యురాలు జ్యోతి, సర్పంచ్ భరత్‌గౌడ్, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ బాబూరావు, ఏపీఎం సత్యనారాయణ మాజీ ఆత్మకమిటీ చెర్మన్ ఆంజనేయులుగౌడ్. అశోక్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. జిల్లాస్పత్రిని సందర్శించిన బృందం సంగారెడ్డి అర్బన్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని పోషక పునరావస కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు, ప్రపంచ బ్యాంకు బృందం, లావోస్ దేశం మెటర్నల్ చైల్డ్ హెల్త్ సెంటర్ ప్రతినిధులు గురువారం సందర్శించారు. వైద్యం అందిస్తున్న తీరును పరిశీలించి డాక్టర్ల ద్వారా వివరాలను తెలుసుకున్నారు. ఎన్ఆర్సీ సెంటర్ పనితీరును స్టడీ చేయడానికి వచ్చినట్లు ఆ సంస్థ డెరైక్టర్ కాంపియో సీయాకాంగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లావోస్ దేశ మెటర్నల్ చైల్డ్ హెల్త్ సెంటర్ డిప్యుటీ డెరైక్టర్లు ఖామ్సెంగ్ ఫిల్వాంగ్, వరల్డ్ బ్యాంక్ ఇండియా అధికారులు అశికోయిల్ ఖథారియా, మోహినోక్, రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ జాయింట్ డెరైక్టర్ సరళ రాజ్యలక్ష్మి, ఎన్ఆర్హెచ్ఎం డీపీఎంఓ జగన్నాథ్‌రెడ్డి, ఎన్ఆర్సీ వైద్యులు డాక్టర్ రహీం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.