మిత్రా ఎనర్జీకి 175 మిలియన్ డాలర్ల ఏడీబీ రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్ రంగానికి చెందిన మిత్రా ఎనర్జీ (ఎంఈఐఎల్) తాజాగా ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) నుంచి 175 మిలియన్ డాలర్ల మేర రుణ సదుపాయం పొందింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో పవన విద్యుత్ ప్రాజెక్టులకు .. తెలంగాణ, పంజాబ్‌లలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఇది ఉపయోగపడనుందని కంపెనీ చైర్మన్ రవి కైలాస్ తెలిపారు. రాబోయే 12 నెలల్లో 1,000 మెగావాట్ల సామర్ధ్యాన్ని సాధించాలన్న మధ్యకాలిక లక్ష్యాలకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుదుత్పత్తి విభాగంలో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ఎంఈఐఎల్‌కు రుణ సదుపాయానికి ఆమోదం తెలిపినట్లు ఏడీబీ జేఎండీ సీనియర్ ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్ మయాంక్ చౌదరి తెలిపారు.