న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19), అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ ఆరికాభివృద్ధి రేట్లు వరుసగా 7.3 శాతం, 7.6 శాతం నమోదవుతాయని విశ్లేషిం చింది. ‘ఆసియన్ డెవలప్‌మెంట్ అవుట్ లుక్ (ఏడీఓ) 2018’ పేరుతో విడుదలైన ఏడీబీ వార్షిక ఆర్థిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
►భారత్‌కు కొన్ని సవాళ్లూ ఉన్నాయి. రూపాయి బలహీనత, విదేశీ ఫైనాన్షియల్ మార్కెట్ల ఒడిదుడుకులు ఇందులో ప్రధానమైనవి.
► చమురు ధరలు ఒకపక్క పెరుగుతున్నాయి. అయితే మరోపక్క దేశీయ డిమాండ్ బాగుంది. ఎగుమతులు ప్రత్యేకించి తయారీ రంగానికి సంబంధించి బాగున్నాయి. ఆయా అంశాల వల్ల చమురు ధరల పెరుగుదల తీవ్రత భారత్ ఆర్థిక వ్యవస్థపై లేకుండా చేస్తున్నాయి.
►ఆసియా వృద్ధి రేటు 2018లో 6 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. వాణిజ్య యుద్ధ భయాలు కీలకమైనవి.
ప్రపంచం కోలుకోలేదు...కానీ భారత్ భేష్: ఆంక్టాడ్
2008 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా ప్రపంచం కోలుకోలేదని ఆంక్టాడ్ (యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్) పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవడానికి సంకేతాలని పేర్కొంది. అయితే భారత్‌తో కూడిన బ్రిక్స్ దేశాలు మాత్రం మెరుగైన వృద్ధిని సాధిస్తున్నాయని కితా బిచ్చింది. దేశీయ డిమాండ్ పుంజుకోవడం దీనికి కారణమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment