ఏడీబీ ఈడీగా భారత సంతతి మహిళ
వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన మహిళ స్వాతి దండేకర్ ఏసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండో-అమెరికన్ స్వాతిని ఏడీబీ ఈడీగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. 2003లో అమెరికా దిగువ సభకు ఎన్నికైన తొలి వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పిన విషయం అందరికీ విదితమే. ఆమెతో సహా మరికొంత మందిని ఏడీబీ కార్యవర్గంలో చేరారు. అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లను నూతన అధికారులు తమ విధి నిర్వహణతో ఛేదిస్తారని అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు.
వీరితో కలిసి పనిచేస్తూ మరింత ముందుకు వెళ్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్వాతి దండేకర్ గతంలో 2003-2009 మధ్య దిగువ సభ సభ్యురాలిగా, దిగువ సభ సెనెట్ సభ్యురాలిగా 2009-2011 కాలంలో విధులు నిర్వర్తించారు. భారత్ లోని నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ గ్రూపులో బ్యాచిలర్ డిగ్రీ, ముంబై వర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు.