
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 10 శాతం నుంచి 9.7 శాతానికి కుదించింది. తొలత 11 శాతం వృద్ధి అంచనాలను సెప్టెంబర్‌లో 10 శాతానికి తగ్గించింది. తాజాగా మరో 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కుదించింది. పరిశ్రమలకు సంబంధించి సరఫర సమస్యలు ఇందుకు ప్రధాన కారణమని మనీలా కేంద్రంగా పనిచేస్తున్న బహుళజాతి బ్యాంకింగ్ సంస్త పేర్కొంది.
దక్షిణాసియా వృద్ధి రేటును కూడా 8.8 శాతం నుంచి 8.6 శాతానికి సంస్థ తగ్గించింది. కాగా ఏడీబీ అంచనాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలు 9.5 శాతంకన్నా అధికంగానే ఉండడం గమనార్హం. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ అంచనా 8.7 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో అంచనాలకు మించి 8.4 శాతం వృద్ధి రేటు నమోదయిన సంగతి తెలిసిందే.
చదవండి: పన్ను పోటు లేని ప్రదేశం.. క్రిప్టో కుబేరులకు ఇప్పుడది స్వర్గధామం!
Comments
Please login to add a commentAdd a comment