నక్కపల్లి: మండలంలో పెట్రోకారిడార్ ప్రతిపాదిత గ్రామాల్లో గురువారం ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ప్రతినిధుల బృందం పర్యటించింది. 20 మంది సభ్యులతో కూడిన బృం దం రాజయ్యపేట, అమలాపురం, వేంపాడు, మూలపర గ్రామాల్లో పర్యటించి ప్రతిపాదిత పెట్రోకారిడార్‌మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించింది. అనంతరం రాజయ్యపేట,బోయపాడు మీదు గా మూలపర చేరుకుంది. ఇక్కడ పెట్రోకారి డార్ ఏర్పాటు చేస్తే పరిశ్రమల ఏర్పాటుకు సం బంధించి నీటివనరులు, రోడ్లు,ఇతర మౌలిక సదుపాయాలు, ప్రతిపాదిత ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ,ప్రైవేటు భూముల వివరాలు, తదితర వివరాలను ఏపీఐఐసీ అధికారులు వారికి వివరించారు.
పెట్రోకారిడార్‌లోకి ఏయేగ్రామాలు వస్తాయి, ఈ ప్రాంతం నుంచి జాతీయరహదారి ఎంతదూరం ఉంది. గతంలో ఇక్కడ ఏయేపరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నది ఏడీబీ ప్రతినిధులు ఏపీఐఐసీ అధికారులను అడిగితెలుసుకున్నారు. పెట్రోకారిడార్ మాస్టర్‌ప్లాన్ రూపొందించినప్పటికీ, దాని ఏర్పాటుకు అనుమతులు, భూసేకరణ, రైతుల అంగీకారం గు రించి ఆరా తీశారు.
రైతుల నుంచి ప్రైవేటు భూమి కొనుగోలు, పరిశ్రమల ఏర్పాటు, అవసరమైన తాగునీరు, విద్యుత్ సదుపాయం, రోడ్డురవాణా, ఇతర మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తున్నదీ చెప్పడంలో అధికారులు తడబడ్డా రు. పర్యావరణ అనుమతులు దాదాపు కొలిక్కి వచ్చాయని భూసేకరణకు నోటిఫికేషన్ విడుదలచేశామని,ఈనెలలో ప్రజాభిప్రాయసేకరణకు సిద్ధమవుతున్నామని ఏపీఐఐసీ అధికారలు ఏడీబీ ప్రతినిధులకు వివరించారు. ఈ బృందం వెంట నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు, స్థానిక తహశీల్దార్ సుందరరావు , ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
ప్రజల్లో ఉత్కంఠ..
దాదాపు 8 వాహనాలతోకూడిన కాన్వాయ్ ఒకదానివెంట ఒకటి రయ్య్‌మ్రని పరుగులు తీయడం వాహనశ్రేణి ముందు పోలీసుల వాహనం పైలట్‌గా వెళ్లడం ఒక్కసారిగా వాహనాలు ఆగడం టకటకామంటూ అధికారులు దిగి ఏవో పెద్దపెద్ద ప్లానులు చూడటం వారిలో వారే మాట్లాడుకోవడం, వచ్చిన వారంతా తెల్లదొరలమాదిరిగా ఉండటంతో ఏమిజరుగుతుందో తెలియక ఈ ప్రాంత ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు.
పీసీపీఐఆర్‌ఏర్పాటుకు ఈనెల 18న ప్రజాభిప్రాయసేకరణ జరగనుంది, ఇప్పటికే దీనిపై ఆందోళన చెందుతున్న ప్రజానీకం తాజాగా పెట్రోకారిడార్ ఏర్పాటుకోసం ప్రభుత్వం ఈప్రాంతానికి ఏడీబీ ప్రతినిధుల బృందాన్ని తీసుకొచ్చింది. దీంతొ తీరప్రాంతగ్రామాల్లో ఉత్కంఠనెలకొంది. స్థానిక అధికారులెవరూ ఈవిషయాలపై నోరుమెదపకపోవడం రైతులను,కూలీలను, గంగపుత్రులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
అచ్యుతాపురంలో.. ఏడీబీ ప్రతినిధుల బృందం గురువారం మండలంలో పర్యటించింది. బ్రాండెక్స్ అపెరెల్‌సిటీకి చేరుకున్న బృంద సభ్యులకు పరిశ్రమలకు సంబంధించిన వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ద్వారా హెచ్‌ఆర్‌మేనేజర్ రఘుపతి వివరించారు. పరిశ్రమల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలపై సభ్యులు ప్రశ్నించారు. రోడ్లు విస్తరించాలని, విద్యుత్‌సరఫరా మెరుగుపడాలని సూచించారు. ముడిసరకు దిగుమతిలో ఇబ్బందులులేవని,ఎగుమతికి చెన్నయ్‌పోర్టును ఆశ్రయిస్తున్నామని బ్రాండెక్స్ అధికారులు తెలిపారు.
ఉద్యోగులకు కొరతలేదన్నారు. హుద్‌హుద్ నష్టాన్ని వివరించారు. అనంతరం పూడిమడక హైస్కూల్ వద్దకు వెళ్లారు. ఎస్‌ఈజెడ్ అవుటర్ రింగ్‌రోడ్డు నమూనాను పరిశీలించారు. పైపులైన్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించారు. అక్కడ నుంచి ఆంజనేయ అల్లాయీస్ పరిశ్రమను సందర్శించి సమస్యలను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో సౌత్ ఆసియా రీజనల్ కార్పొరేషన్ డెరైక్టర్ శేఖర్‌బోను, ఎకనమిస్ట్ హు యన్ జంగ్, ప్రాజెక్టులీడర్ మనోజ్‌శర్మ, ట్రాన్స్‌పోర్ట్ స్పెషలిస్ట్ రవిపెరీ, సుమిత్ చక్రవర్తి, జార్జ్, బెనిత్ అయ్యర్, సౌమ్య చటోపాధ్యాయ, ఏపీఐఐసీ జెడ్‌ఎం యతిరాజు పాల్గొన్నారు.
పెట్రోకారిడార్ ప్రాంతం పరిశీలన
Published Fri, Dec 12 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM
Advertisement
Advertisement