Domestic demand
-
2023–24లో 6.4 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతంగా కొనసాగుతుందన్న తన అంచనాలను ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) పునరుద్ఘాటించింది. దేశీయ డిమాండ్ ఆర్థిక క్రియాశీలతకు దోహదపడే ప్రధాన అంశంగా పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగ రికవరీ బాగుందని పేర్కొన్న ఏడీబీ, అంతర్జాతీయ అనిశి్చతుల దేశీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తన ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ) విశ్లేíÙంచింది. ఇక 2023–24లో 5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను తాజాగా 4.9 శాతానికి ఏడీబీ తగ్గించింది. క్రూడ్ ఆయిల్ ధరల్లో కొంత తగ్గుదల దీనికి కారణంగా పేర్కొంది. సాధరణ వర్షపాతం, ఇతర వాతావరణ అంశాలను పరిగణనలోకి తీసుకుని (తదుపరి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఏవీ ఉండబోవన్న అంచనా ప్రాతిపదికన) 2023–24లో 6.4 శాతం, 2024–25లో 6.7 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నట్లు అవుట్‌లుక్ పేర్కొంది. కాగా, ఆసియా, పసిఫిక్‌లో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు సగటున 4.8 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటాయని ఏడీబీ అవుట్‌లుక్ అంచనా వేసింది. చై నా ఎకానమీ వృద్ధి రేటును 5 శాతంగా అంచనావే సింది. 2025లో ఈ రేటును 4.5 శాతంగా పేర్కొంది. -
స్థానిక వినియోగమే భారత్‌కు బలం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం చూస్తున్న తరుణంలో, దేశీ వినియోగమే భారత్ ఆర్థిక వ్యవస్థకు సహజ ప్రేరణగా నిలుస్తోందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. భారత్ జీడీపీ అధిక శాతం దేశీయ డిమాండ్‌పైనే ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో అజయ్ బంగా బుధవారం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జీ20కి సంబంధించిన అంశాలు, ప్రపంచబ్యాంక్, భారత్ మధ్య సహకారంపై ఆర్థిక మంత్రితో చర్చించినట్టు చెప్పారు. ‘‘జీ20లో ఏం చేశామన్నది, అలాగే సమావేశం ఎలా కొనసాగిందన్నది మాట్లాడుకున్నాం. జీ20లో భాగంగా ప్రపంచబ్యాంక్, భారత్ ఇంకా ఏం చేయగలవన్నదీ చర్చించాం. ప్రపంచబ్యాంక్‌కు పోర్ట్‌ఫోలియో పరంగా భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ మార్కెట్‌పై ఎంతో ఆసక్తి నెలకొంది’’అని బంగా వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఆరంభంలో మరింత క్షీణించేందుకు రిస్క్‌లు ఉన్నట్టు చెప్పారు. ‘‘భారత్ జీడీపీలో అధిక భాగం దేశీయ వినియోగం నుంచే సమకూరుతోంది. కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరికొన్ని నెలల పాటు నిదానించినా, దేశీ వినియోగంతో భారత్ బలంగా నిలబడుతుంది’’అని బంగా పేర్కొన్నారు. జీ20 సమావేశంలో పాల్గొనేందుకు గాను భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఇక్కడకు విచ్చేశారు. గత నెలలోనే ఆయన ప్రపంచబ్యాంక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అనంతరం భారత్ పర్యటనకు తొలిసారి విచ్చేశారు. విజ్ఞానం, టెక్నాలజీ అంతరాలను తగ్గించడమనేది భవిష్యత్ ఆర్థిక వృద్ధికి కీలకమని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నట్టు బంగా తెలిపారు. -
మేలో ‘తయారీ’భేష్: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: తయారీ రంగం మేలో మంచి పనితీరును కనబరచిందని హెచ్ఎస్బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఈ సూచీ ఏప్రిల్‌లో 51.3 పాయింట్ల వద్ద ఉంటే.. మేలో 52.6కు చేరింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. దేశీయ డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణమని కూడా హెచ్ఎస్బీసీ వివరించింది. ముడి వస్తువుల ధరలు తీవ్రంగానే ఉన్నాయని, ఉపాధి కల్పన విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని నివేదిక పేర్కొంటూ... అయినా దేశీయ డిమాండ్ పటిష్టతతో తయారీ రంగం మేలో కొంత మెరుగుపడినట్లు తెలిపింది. హెచ్ఎస్బీసీ సూచీ కూర్పు ప్రకారం... ఇది 50 పాయింట్ల పైన ఉంటే.. సంబంధిత రంగం వృద్ధిలో ఉన్నట్లే భావించడం జరుగుతుంది. దిగువన ఉంటే దానిని క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన తయారీ రంగం వరుసగా 19 నెలల నుంచీ వృద్ధి స్థాయిలోనే కొనసాగుతోంది.