ముంబై: భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను విదేశీ బ్రోకరేజ్ యూబీఎస్ అప్‌గ్రేడ్ చేసింది. దీనితో ఈ రేటు 6.3 శాతానికి ఎగసింది. మధ్య కాలికంగా చూస్తే (ఐదేళ్లు) క్రితం 5.75–6.25 శాతం శ్రేణి అంచనాలను ఎగువముఖంగా 6–6.5 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది.
బ్రోకరేజ్ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ తన్వీ గుప్తా జైన్ మాట్లాడుతూ దేశీయ ఆర్థిక కార్యకలాపాలు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయన్నారు. అయితే ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలు, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల ఫలితాలు వంటివి ఎకానమీపై ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment