UBS
-
భారత ఈక్విటీల్లో యూబీఎస్ ఏజీ వరుస అమ్మకాలు
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కు చెందిన ఆర్థిక సేవల కంపెనీ యూబీఎస్ గ్రూప్ ఏజీ.. శుక్రవారం ఒక్క రో జే (30వ తేదీన) ఏకంగా భారత ఈక్విటీల్లో భారీ అమ్మ కాలకు దిగింది. ఏడు కంపెనీల్లో రూ.4,961 కోట్ల విలువ చేసే షేర్లను ఓపెన్ మార్కెట్ లావాదేవీల రూ పంలో విక్రయించింది. యూబీఎస్ ప్రిన్సిపల్ క్యాపిటల్ ఏషియా రూపంలో బల్‌్కడీల్స్ ద్వారా అమ్మకాలు చేసినట్టు ఎన్ఎస్ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయిల్ ఇండియాలో రూ.972 కోట్లు, డిక్సన్ టెక్నాలజీస్‌లో రూ.904 కోట్లు, ఆర్‌వీఎన్‌ఎల్‌లో రూ.797 కోట్లు, జైడస్ లైఫ్సైన్సెస్లో రూ.756 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేసింది. అలాగే, వొడాఫోన్ ఐడియా, ఒరాకిల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్‌లోనూ రూ.1,531 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. మరోవైపు బంధన్ బ్యాంక్‌లో రూ.384 కోట్ల విలువ చేసే 1.92 కోట్ల షేర్లను యూబీఎస్ ప్రిన్సిపల్ క్యాపిటల్ కొనుగోలు చేసింది. -
2023–24లో వృద్ధి 6.3 శాతం: యూబీఎస్
ముంబై: భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను విదేశీ బ్రోకరేజ్ యూబీఎస్ అప్‌గ్రేడ్ చేసింది. దీనితో ఈ రేటు 6.3 శాతానికి ఎగసింది. మధ్య కాలికంగా చూస్తే (ఐదేళ్లు) క్రితం 5.75–6.25 శాతం శ్రేణి అంచనాలను ఎగువముఖంగా 6–6.5 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. బ్రోకరేజ్ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ తన్వీ గుప్తా జైన్ మాట్లాడుతూ దేశీయ ఆర్థిక కార్యకలాపాలు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయన్నారు. అయితే ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలు, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల ఫలితాలు వంటివి ఎకానమీపై ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడ్డారు. -
ఆర్బీఐ అంచనాలను మించి ద్రవ్యోల్బణం
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకు మించి నమోదవుతుందని యూబీఎస్ అంచనాలు వేస్తోంది. 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతం. అయితే క్యూ2లో అంచనాలకు మించి 6.8 శాతం వినియోగ ద్రవ్యోల్బణం నమోదవుతందన్నది యూబీఎస్ తాజా అంచనా. సెపె్టంబర్లో 6 శాతం పైబడి సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం నమోదవుతుందని భావిస్తున్నట్లు యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతానికి తగ్గినప్పటికీ ఈ స్థాయి సైతం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయికన్నా 83 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికంగా ఉండడం గమనార్హం. పలు నిత్యావసర వస్తువులు సామాన్యునికి అందని తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 9.94 శాతంగా ఉంది. ఒక్క కూరగాయల ధరల పెరుగుదల చూస్తే, 2023 ఆగస్టులో 26.14 శాతంగా ఉంది. ఆగస్టులో ఆయిల్, ఫ్యాట్స్ విభాగం (మైనస్ 15.28 శాతం) మినహా అన్ని విభాగాల్లో ధరలూ పెరుగుదనే సూచించాయి. వీటిలో తృణధాన్యాలు (11.85 శాతం), మాంసం–చేపలు (3.68 శాతం), గుడ్లు (4.31 శాతం), పాలు–పాల ఉత్పత్తులు (7.73 శాతం), పండ్లు (4.05 శాతం), కూరగాయలు (26.14 శాతం), పుప్పు దినుసులు (13.04 శాతం), చక్కెర, సంబంధిత ఉత్పత్తులు (3.80 శాతం), సుగంధ ద్రవ్యాలు (23.19 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (3.67 శాతం), ప్రెపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ విభాగం (5.31 శాతం), ఫుడ్ అండ్ బేవరేజెస్ (9.19 శాతం), పాన్, పొగాకు, మత్తు ప్రేరిత ఉత్పత్తులు (4.10 శాతం) ఉన్నాయి. దుస్తులు, పాదరక్షల విభాగంలో ఆగస్టు వినియోగ ద్రవ్యోల్బణం 5.15 శాతంగా ఉంది. హౌసింగ్ విభాగంలో ధరల పెరుగుదల 4.38 శాతం. ఫ్యూయెల్ అండ్ లైట్లో 4.31 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. -
Global Wealth Report 2023: భారత్ తప్ప పలు అగ్రదేశాల్లో సంపద కరిగిపోతోంది
అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో సంపద పెరుగుతోంది. భారత్‌లో తప్ప ► అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. అధిక ధరలు, డాలర్‌తో పోల్చి చూస్తే వివిధ దేశాల కరెన్సీలు పడిపోవడం, భౌగోళిక రాజకీయాలు, వాతావరణ మార్పులు వంటివెన్నో దేశాల ఆర్థిక వ్యవస్థని కుంగదీస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సంపద క్షీణించడం ప్రారంభమైంది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత మళ్లీ 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నట్టుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యూబీఎస్) రూపొందించిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2023లో వెల్లడైంది. ప్రపంచ దేశాల్లో అమెరికా అత్యధికంగా సంపదని కోల్పోతే ఆ తర్వాత స్థానంలో జపాన్ ఉంది. 2021లో ప్రపంచ దేశాల సంపద 466.2 ట్రిలియన్ డాలర్లు ఉండగా 2022 నాటికి 2.4% తగ్గి 454.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక సంపద తగ్గిపోవడంలో అమెరికా ముందుంది. ఏడాదిలో 5.9 ట్రిలియన్ డాలర్ల సంపదను అగ్రరాజ్యం కోల్పోయింది. ఆ తర్వాత స్థానంలో జపాన్ నిలిచింది. 2021తో పోల్చి చూస్తే ఆ దేశం 2.5 ట్రిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. ప్రాంతాల వారీగా ఇలా.. ► అత్యంత సంపన్న దేశాలున్న ఉత్తర అమెరికా, యూరప్‌లు భారీగా నష్టపోయాయి. 2022లో ఈ దేశాల్లో 10.9 ట్రిలి యన్ డాలర్ల నష్టం జరిగింది. ► ఆసియా ఫసిఫిక్ దేశాల్లో 2.1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది. ► లాటిన్ అమెరికాలో 2.4 ట్రిలియన్ డాలర్ల సంపద పెరిగింది. ► 2022లో భారీగా సంపద హరించుకుపోయిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత జపాన్, చైనా, కెనడా, ఆ్రస్టేలియా ఉన్నాయి. ► సంపద భారీగా పెరిగిన దేశాల్లో భారత్, బ్రెజిల్, మెక్సికో, రష్యా నిలిచాయి. ► తలసరి ఆదాయంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటే, అమెరికా, ఆస్ట్రేలియా, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో పెరుగుతున్న సంపద ► ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం సంపద పెరుగుతోంది. 2021తో పోల్చి చూస్తే మన దేశ సంపద 675 బిలియన్ డాలర్లు అంటే 4.6% పెరిగింది. 2022 నాటికి 15.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనా వంటి దేశాల్లో కూడా సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం పెరగడం విశేషం. దేశంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అపర కుబేరులుగా మారారు. 2000 నుంచి 2022 వరకు ఏడాదికి 15% మిలియనీర్లు పెరుగుతూ వస్తున్నారు. ఉక్రెయిన్‌తో ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్నప్పటికీ రష్యా సంపద కూడా పెరగడం గమనార్హం. స్థిరంగా సంపద పెరుగుదల.. ► భారత్‌లో సంపద పెరుగుదల 20 ఏళ్లుగా స్థిరంగా కొనసాగుతోంది. మధ్య తరగతికి చెందిన వ్యక్తుల సంపద ఏడాదికి 5.9% చొప్పున పెరుగుతోంది. ఒకప్పుడు చైనాలో మధ్యతరగతి సంపద అధికంగా పెరుగుతూ ఉండేది. ఇప్పుడు భారత్ చైనా స్థానాన్ని ఆక్రమించింది. మిలియనీర్లు మన దేశంలో ఏకంగా 15% పెరుగుతూ వస్తున్నారు. మొత్తమ్మీద మిలియనీర్లు అమెరికాలోనే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా కోట్లకు పడగలెత్తిన వారు 5.9 కోట్ల మంది ఉంటే వారిలో 2.3 కోట్ల మంది అంటే 40% అమెరికాలోనే ఉన్నారు. 2027 నాటికి భారత్, చైనా, బ్రెజిల్, యూకే, దక్షిణ కొరియాలో కూడా కోటీశ్వరుల సంఖ్య పెరుగుతుందని గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ అంచనా. 2022–27 మధ్య చైనాలో కోటీశ్వరులు 26%,భారత్‌లో 11% పెరుగుతారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఆ బ్యాంకు ఉద్యోగులు ఇక ఇంటికే..!
సంక్షోభంలో చిక్కుకున్న క్రెడిట్ సూసీ బ్యాంక్ ఉద్యోగులకు త్వరలో ఉద్వాసన తప్పదని స్విస్ వారపత్రిక ‘హ్యాండెల్స్ జూటింగ్’ తాజాగా తెలిపింది. ఈ క్రెడిట్ సూసీ బ్యాంకును స్విట్జర్లాండ్ దిగ్గజ బ్యాంక్ యూబీఎస్ టేకోవర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు బ్యాంకుల విలీనాన్ని యూబీఎస్ ప్రారంభించిందని, క్రెడిట్ సూసీలోని వేలాది మంది ఉద్యోగులు త్వరలో తొలగింపు నోటీసులు అందుకోనున్నారని ఆ పత్రిక పేర్కొంది. క్రెడిట్ సూసీ బ్యాంకును 3.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి గత మార్చి నెలలో యూబీఎస్ అంగీకరించింది. ఇక అప్పటి నుంచి దీని ప్రభావం ఉద్యోగాలపై కచ్చితంగా ఉంటుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. విలీనం అనంతరం క్రెడిట్సూసీలోని చాలామంది ఉద్యోగులను తొలగించే యోచనలో యూబీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గియో ఎర్మోట్టి ఉన్నట్లు సదరు స్విస్ పత్రిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా క్రెడిట్ సూసీకి చెందిన 30,000 నుంచి 35,000 ఉద్యోగాల కోత ఉంటుందని స్విస్ మీడియా ఊహాగానాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇదీ చదవండి: Credit Suisse Layoffs 2023: 35,000 ఉద్యోగాలు కట్! సంక్షోభంలో చిక్కుకున్న స్విస్ బ్యాంకులో సగానికిపైగా కోతలు.. గత సంవత్సరం చివరి నాటికి యూబీఎస్, క్రెడిట్ సూసీ బ్యాంకుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 37,000 మంది స్విట్జర్లాండ్‌లోనే పనిచేస్తున్నారు. కాగా దీనిపై వ్యాఖ్యానించడానికి యూబీఎస్ నిరాకరించింది. -
35,000 ఉద్యోగాలు కట్! స్విస్ బ్యాంకులో సగానికిపైగా కోతలు..
స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్.. తాను టేకోవర్ చేస్తున్న మరో స్విస్ బ్యాంకు క్రెడిట్ సూసీలో 35,000 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోందని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ తాజాగా కథనం వెలువరించింది. దాదాపు 45,000 మంది ఉద్యోగులు ఉన్న క్రెడిట్ సూసీ.. దాని సాల్వెన్సీ గురించి ఇన్వెస్టర్ల భయాలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దాదాపుగా కుప్పకూలింది. దీంతో స్విస్ ప్రభుత్వం భారీ బెయిలౌట్‌తో అండగా నిలవడంతో క్రెడిట్ సూసీను కొనుగోలు చేసేందుకు యూబీఎస్ గ్రూప్ ముందుకు వచ్చింది. ప్రపంచంలో ప్రముఖమైన ఈ రెండు బ్యాంకులు కలుస్తున్న నేపథ్యంలో భారీగా ఉద్యోగాల కోతలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు ముందుగానే హెచ్చరించారు. కాగా ఉద్యోగ కోతలపై వివరణ కోసం అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ... యూబీఎస్‌ను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించింది. మూడు దశల్లో.. యూబీఎస్, క్రెడిట్ సూసీ రెండు బ్యాంకింగ్ సంస్థల్లో కలిపి గత సంవత్సరం చివరి నాటికి దాదాపు 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 37,000 మంది స్విట్జర్లాండ్‌లో పని చేస్తున్నారు. ఉద్యోగుల కోత మూడు దశల్లో ఉంటుందని, మొదటిది జూలై చివరలో, మిగిలినవి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉంటాయని ఉద్యోగులకు తెలియజేసినట్లుగా బ్లూమ్‌బర్గ్ నివేదిక ఆయా కంపెనీలకు దగ్గరగా ఉన్న మూలాలను ఉటంకిస్తూ పేర్కొంది. బ్యాంక్ టేకోవర్‌కు సంబంధించి రాబోయే నెలల్లో ఒడుదుడుకులు ఉంటాయని, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కఠినమైన నిర్ణయాలు ఉంటాయని యూబీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గియో ఎర్మోట్టి జూన్ నెల ప్రారంభంలో హెచ్చరించారు. ఇదీ చదవండి: Bank Holidays July 2023: నెలలో దాదాపు సగం రోజులు సెలవులే! -
2022–23లో భారత్ వృద్ధి 6.9 శాతం
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 6.9 శాతంగా నమోదవుతుందని యూబీఎస్ ఆర్థికవేత్తలు అంచనావేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఈ రేటు మరింతగా 5.5 శాతానికి పడిపోతుందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ ఎకనమిస్టులు ఒక నివేదికలో విశ్లేషించారు. 2024–25లో 6 శాతం వృద్ధి అంచనా వేసిన సంస్థ, దీర్ఘకాలిక సగటు ఇదే స్థాయిలో కొనసాగుతుందని పేర్కొంది. ప్రపంచ వృద్ధి మందగమనం, కఠిన ద్రవ్య విధానాలు భారత్ వృద్ధి మందగమనానికి కారణమని నివేదిక పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావం తక్కువగా ఉండే దేశాల్లో భారత్ కూడా ఒకటైనప్పటికీ, ఈ ప్రతికూలతల నుంచి భారత్ ఎకానమీ తప్పించుకోలేదు. ► భారత్ వ్యవస్థీకృత వృద్ధి ధోరణి చెక్కుచెదరకుండా ఉంది. అయితే ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) వంటి స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వంపై సమీప కాలంలో భారత్ దృష్టి సారించాలి. లేదంటే తీవ్ర ప్రతికూల పరిస్థితులకు అవకాశం ఉంది. ► ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా 4 శాతం కనిష్టం నుంచి 1.90 శాతం పెరిగి 5.9 శాతానికి ఎగసిన రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది వృద్ధికి విఘాతం కలిగించే అంశం. ► కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే వినియోగదారుల వ్యయంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గృహాల కొనుగోలు శక్తి పెరిగింది. అయితే ఈ సానుకూల ప్రభావాలు వడ్డీరేట్ల పెంపు పరిణామాలతో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. పొదుపుల్లో క్షీణత నమోదుకావచ్చు. అలాగే అసంపూర్తిగా మిగిలిఉన్న లేబర్ మార్కెట్ పునరుద్ధరణ... గృహాల కొనుగోలు శక్తి, డిమాండ్‌పై ప్రభావం చూపుతుంది. ► ఈ పరిస్థితి కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికల అమలును వాయిదే వేసే అవకాశం ఉంది. ► కొన్ని క్లిష్టతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెట్టుబడులు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ప్రతికూల ఫలితాల తగ్గింపు, ప్రైవేటు మూలధనానికి ప్రోత్సాహం వంటి అవకాశాలు దీనివల్ల ఒనగూరతాయి. ► ఇక ఎగుమతుల విషయానికి వస్తే, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఉంటుంది. 450 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన కొంత క్లిష్టంగా మారవచ్చు. ► రూపాయి తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి సెంట్రల్ బ్యాంక్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగిన చర్యలు తీసుకుంటోంది. ఇతర సెంట్రల్ బ్యాంకులతో సమన్వయాన్ని సాధిస్తోంది. ► 2024లో సాధారణ ఎన్నికలను ఎదుర్కొననున్న కేంద్ర ప్రభుత్వం, వృద్ధికి మద్దతుగా ద్రవ్య స్థిరీకరణ విధానాలను కొంత నెమ్మది చేయచ్చు. ఇది ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే వీలుంది. -
2022 జూన్ నుంచి రేట్ల పెంపు!
న్యూఢిల్లీ: వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత పెరుగుదల ధోరణి వ్యవస్థీకృతం (తీవ్రతను అడ్డుకోలేని వాస్తవ స్థితి) కాదని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత సరఫరాల పరమైనదని, తాత్కాలికమైన ఈ సమస్య అదుపులోనికి (2–6 శ్రేణిలోకి) దిగివస్తుందని ఈ నివేదిక సూచించింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది మేనెల వరకూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో యథాతథంగా కొనసాగే అవకాశం ఉందని, 2022 జూన్ నుంచీ రేట్లు పెరగవచ్చని నివేదిక పేర్కొంది. ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్ష వివరాలు శుక్రవారం వెల్లడవనున్న నేపథ్యంలో యూబీఎస్ ఈ విశ్లేషణ చేయడం గమనార్హం. నివేదికలో తన్వీ గుప్తా జైన్ పేర్కొన్న మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.5 శాతంగా కొనసాగుతుంది. 2022–23లో 4.5 శాతంగా కొనసాగవచ్చు. దిగువస్థాయి వడ్డీరేట్ల వ్యవస్థ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించడం లేదు. వడ్డీరేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, గృహ పొదుపులు పెరిగాయి. మహమ్మారి ప్రేరిత అనిశ్చితి దీనికి ప్రధాన కారణం. తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వృద్ధికి, ఆదాయానికి, ఉపాధి కల్పనకు దోహపపడుతుంది. భారత జీడీపీ వృద్ధి అంచనాలను 2021–22 ఆర్థిక సంవత్సరానికి 1.5 శాతం తగ్గించి 10 శాతంగా యూబీఎస్ గత నెలలో ప్రకటించడం గమనార్హం. కార్మికుల భాగస్వామ్యం తగ్గడం, పట్టణ నిరుద్యోగిత 12 నెలల గరిష్టం 17.4 శాతానికి పెరగడం ప్రతికూల అంశాలుగా యూబీఎస్ పేర్కొంది. అయితే క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొంది. -
ఎస్ బ్యాంకు టాప్ టెన్ నుంచి ఔట్
సాక్షి, ముంబై : ప్రయివేటు రంగ బ్యాంకు ఎస్బ్యాంకును కష్టాలు వీడడం లేదు. ఇటీవల తీవ్ర నష్టాలతో కుదైలైన ఎస్‌బ్యాంక్‌నకు తాజాగా రేటింగ్‌షాక్ తగిలింది. బ్రోకింగ్ సంస్థ యూబీఎస్ ఇండియా ఎస్‌బ్యాంకు ర్యాంకింగ్ 47 శాతం డౌన్ గ్రేడ్ చేసింది. గతంలో ఇచ్చిన రూ. 170 ను రూ. 90కు కుదించి సెల్ రేటింగ్ ఇచ్చింది. దీంతో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. గురువారం దాదాపు 13శాతం నష్టాలతో కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు పనితీరు మరింత నీరసించవచ్చని, బ్యాంకు ఆదాయాలు తగ్గిపోనున్నాయని యూబీఎస్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ షేరులో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఎస్‌బ్యాంకు దేశంలోని 10 అత్యంత విలువైన బ్యాంకుల జాబితాలో స్థానం కోల్పోయింది. దాదాపు 20 బ్రోకరేజ్ సంస్థ ఎస్‌బ్యాంకు షేరుకు సెల్ రేటింగ్ ఇచ్చాయి. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ యస్ బ్యాంక్ విదేశీ కరెన్సీ జారీ రేటింగ్‌ను బీఏ1కు సవరించింది. ఫైనాన్స్ కంపెనీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ ఒత్తిళ్ల కారణంగా బ్యాంక్ క్రెడిట్ ప్రొఫైల్ బలహీనపడవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు 6.61 ట్రిలియన్లతో టాప్ టెన్ జాబితాలో టాప్‌లో ఉండగా, ఎస్బీఐ 3.05 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో రెండవ స్థానంలో, కోటక్ మహీంద్రా 2.84 ట్రిలియన్లతో మూడవ స్థానంలో, ఐసీఐసీఐ బ్యాంక్ 2.69 ట్రిలియన్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ (2.14 ట్రిలియన్లు) ఇండస్ఇండ్ బ్యాంక్ (రూ.87,540 కోట్లు) బంధన్ బ్యాంక్ (రూ. 64,808 కోట్లు) బ్యాంక్ ఆఫ్ బ్యాంకు (రూ.40,420కోట్లు) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ. 34093 కోట్ల) తరువాతి స్థానాల్లో నిలిచాయి. కాగా టాప్ మేనేజ్మెంట్లో మార్పులు చేపడుతున్న నేపథ్యంలో ఇటీవల బ్యాంక్ బోర్డు నుంచి నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముకేష్ సబర్వాల్, నాన్‌ఎగ్జిక్యూటివ్, నాన్‌ఇండిపెండెంట్ డైరెక్టర్ అజయ్ కుమార్ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
మాల్యాకు యూకే కోర్టు భారీ షాక్
భారత్‌లో ప్రభుత్వ బ్యాంకులకు రూ.9వేల వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్‌మాల్యా(62)కు యూకేకోర్టు షాక్ ఇచ్చింది. మాల్యా లండన్ హౌస్‌కు సంబంధించి యూబీఎస్(యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విజ్టర్లాండ్) వద్ద తీసుకున్నరుణాలపై కోర్టు కీలక తీర్పు చెప్పింది. స్విస్‌బ్యాంకు యూబీఎస్‌కు సుమారు రూ.80 లక్షలు (88,000 పౌండ్ల) చెల్లించాలని బుధవారం ఆదేశించింది. ఈ మొత్తాన్ని జనవరి 4, 2019 నాటికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒకవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారుడుగా నిర్ధారించిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించేందకు భారత్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే లండన్‌లో పలు కేసుల్లో న్యాయపోరాటం చేస్తున్నాడు. తాజా తీర్పు మాల్యాకి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. యుబిఎస్ బ్యాంకు తనకు మాల్యా చెల్లించాల్సిన 26.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.19.50కోట్లు) రుణానికి బదులుగా లండన్ లోని రీజెంట్స్ పార్క్ ఇంటిని స్వాధీనం చేసుకొనేందుకు యూకే హైకోర్టును ఆశ్రయించింది. మాల్యా కుటుంబానికి చెందిన రోజ్ క్యాపిటల్ వెంచర్స్ కంపెనీ విలాసవంతమైన నివాస సముదాయం నిర్మాణం కోసం రీజెంట్స్ పార్క్ ఇంటిని యుబిఎస్ గ్రూప్ దగ్గర తనఖా పెట్టి రుణం తీసుకొంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మాల్యా సుమారుగా 1 బిలియన్ పౌండ్ల రుణాలకు (దాదాపు రూ.10,000 కోట్లు) సంబంధించి పలు కేసులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు భారత్, యుకెలలో సివిల్ దావాలు, క్రిమినల్ మోసం ఆరోపణలు ఉన్నాయి. కాగా 2016 మార్చిలో భారత్ నుంచి లండన్‌కు చెక్కేసిన కేసులో గత ఏడాది డిసెంబరు 4న లండన్ కోర్టులో విచారణ మొదలైన సంగతి తెలిసిందే. -
జోరుగా నియామకాలు
న్యూఢిల్లీ: డిమాండ్ మెరుగుపడుతున్న నేపథ్యంలో కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టాలని యోచిస్తున్నాయి. దీంతో హైరింగ్ కార్యకలాపాలు గతేడాది కన్నా మరింత వేగం పుంజుకోనున్నాయి. యూబీఎస్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. యూబీఎస్ ఎవిడెన్స్ ల్యాబ్స్ నిర్వహించిన సీ–సూట్ సర్వేలో 247 మంది ఎగ్జిక్యూటివ్స్ (సీఈవోలు, సీఎఫ్‌వోలు, ఫైనాన్స్ డైరెక్టర్లు మొదలైనవారు) పాల్గొన్నారు. వీరిలో దాదాపు సగభాగం ఎగ్జిక్యూటివ్స్‌కి చెందిన సంస్థలు .. ఈసారి నియామకాలు గతేడాది కన్నా మరింత ఉధృతంగా చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నాయి. వచ్చే అయిదేళ్లలో ఏడాదికి నలభై లక్షల ఉద్యోగాల కల్పన జరగవచ్చని యూబీఎస్ అంచనా వేస్తోంది. గత అయిదేళ్లలో ఇది ఏటా ఇరవై లక్షలుగా ఉంది. సర్వే ప్రకారం భవిష్యత్‌లో చేపట్టే నియామకాల్లో ఎక్కువగా తాత్కాలిక ఉద్యోగాలే ఉండనున్నాయి. సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల సంస్థలు .. జీతభత్యాల పెంపు పది శాతం లోపే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు యూబీఎస్ తెలిపింది. కొత్త ఆటోమేషన్ టెక్నాలజీలు ఇంకా హైరింగ్ ప్రణాళికలను దెబ్బతీసే స్థాయికి చేరలేదని పేర్కొంది. -
అందరి దృష్టిని ఆకర్షించిన రకూన్
-
జియోకు వేగం తగ్గిందా?
టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చి, సబ్ స్క్రైబర్లను భారీగా పెంచుకుంటూ రిలయన్స్ జియో బ్రేక్ లేకుండా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. సంచలన ఆఫర్లతో ఈ నెట్ వర్క్ పై సబ్ స్క్రైబర్లు విపరీతమైన ఆసక్తి చూపారు. అయితే తాజాగా సబ్ స్క్రైబర్లను పెంచుకోవడంలో జియో వేగం తగ్గిపోయిందట.మార్చి నెలలో కేవలం 5.8 మిలియన్ సబ్ స్క్రైబర్లను మాత్రమే రిలయన్స్ జియో తన నెట్ వర్క్ కు యాడ్ చేసుకుందని తాజా డేటాలో తెలిసింది. మార్చి నెల ముందు నెలలో 12.2 మిలియన్ సబ్ స్క్రైబర్లు జియోకు యాడ్ అయ్యారు. కానీ ప్రస్తుతం సబ్ స్క్రైబర్లు పడిపోతున్నారని ట్రాయ్ డేటా ఆధారంగా యూఎస్బీ రిపోర్టు వెల్లడించింది. ఈ తగ్గుముఖం చోటు చేసుకుంటున్నా.. ముఖేష్ అంబానీ కంపెనీనే సబ్ స్క్రైబర్లను పెంచుకోవడంలో టాప్ లో ఉందని తెలిసింది. జియో తర్వాత భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ లు ఉన్నాయి. జియో మార్కెట్ షేరు ఫిబ్రవరిలో 8.8 శాతం ఉండగా.. మార్చి నెలలో 9.3 శాతానికి పెరిగింది. మార్చి నెలలో జియో సబ్ స్క్రైబర్ల వేగం తగ్గడం చూసి తామెంతో ఆశ్చర్యానికి గురయ్యామని, అదే నెలలో ఈ కంపెనీ ప్రైమ్ ఆఫర్ ను ప్రకటించినట్టు కూడా యూబీఎస్ పేర్కొంది. ఏప్రిల్ నెల నుంచి కంపెనీ ఛార్జీలు వసూలు చేస్తోంది. ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీ నెట్ అడిక్షన్ మూడు మిలియన్లు, 2.1 మిలియన్లు, 1.8 మిలియన్లుగా ఉంది. జియోకు పోటీగా ఈ దిగ్గజాలు బంపర్ ఆఫర్లను ప్రకటించడంతో వీరు కూడా సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచుకున్నారు. ఇతర టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ కమ్యూనికేషన్, టాటా టెలిసర్వీసెస్, టెలినార్ మార్కెట్ షేరును కోల్పోతూనే ఉన్నాయని యూబీఎస్ పేర్కొంది. వొడాఫోన్ తన బ్రాడ్ బ్యాండ్ సబ్ స్క్రైబర్లను మార్చి నెలలో రికవరీ చేసుకుంది. ఎయిర్ టెల్ తన బ్రాడ్ బ్యాండ్ వ్యాప్తిని మరింత పెంచుకుంది. ఫిబ్రవరి నెలలో ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండు వ్యాప్తి 20.9 శాతం ఉండగా.. మార్చిలో ఇది 22.1 శాతానికి పెరిగింది. -
ఐటీ ఇండస్ట్రీకి విశాల్ సిక్కా గుడ్ న్యూస్
ముంబై : ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ సిక్కా.. ఇటీవల చేసిన కామెంట్లు ఇండస్ట్రీపై ఆశలు పెంచుతున్నాయి. 2014-15 రెండో క్వార్టర్ నుంచి మొదటిసారి ఐటీ రంగంలో ధర స్థిరత్వం ఉన్నట్టు సిక్కా చెప్పారు. ఇది ఐటీ ఇండస్ట్రీకి పాజిటివ్ డెవలప్ మెంట్ అని బ్రోకరేజ్ యూబీఎస్ అభివర్ణించింది. విశాల్ సిక్కా చేసిన కామెంట్ తో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కంపెనీలలో భారీ ఎత్తున ఐటీ బడ్జెట్ పెరుగుతాయని, ముఖ్యంగా అమెరికాలో పెరుగుతాయని బ్రోకరేజ్ తెలిపింది. భారతీయ ఐటీ వెండర్స్ కు మేజర్ క్లయింట్స్ గా అమెరికానే ఉండటం విశేషం. 2017లో ఇండస్ట్రి వృద్ధికి కూడా ఇది సహకరించనున్నట్టు పేర్కొంది. మంచి డిమాండ్ పరిస్థితులను ఈ ధర స్థిరత్వ వాతావరణం సూచిస్తుందని బ్రోకరేజ్ సంస్థ వివరించింది. ఆటోమేషన్, వీసా సమస్యలు, రూపాయి విలువ పెరగడం మాత్రమే కాక, సాంప్రదాయ ఐటీ సర్వీసు బిజినెస్ లలో ఒకానొక ప్రధాన సమస్యలో ధరల ఒత్తిడి కూడా ఒకటి. ఈ సమస్యలతో 2016లో బీఎస్ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 5.5 శాతం పడిపోయింది. ఇదే సమయంలో సెన్సెక్స్ 12.4 శాతం పైకి ఎగిసింది. కానీ ప్రస్తుతం ధరల స్థిరత్వం ఏర్పడటం సానుకూల అంశమని బ్రోకరేజ్ సంస్థ చెబుతోంది. -
రెండో రోజూ నష్టాలే...
* 43 పాయింట్ల నష్టంతో 25,580కు సెన్సెక్స్ * 7 పాయింట్ల నష్టపోయి 7,785కు నిఫ్టీ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన మంగళవారం నాటి ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చైనా ఆర్థిక వ్యవస్థపై తాజాగా రేగిన ఆందోళనలు కొనసాగడంతో వరుసగా రెండో రోజూ స్టాక్ సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 43 పాయింట్లు నష్టపోయి 25,580 పాయింట్ల వద్ద. నిఫ్టీ చివరకు 7 పాయింట్ల నష్టంతో 7,785 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇది సెన్సెక్స్‌కు రెండు వారాల కనిష్ట స్థాయి. లోహ, ఆయిల్, గ్యాస్, రియల్టీ, యుటిలిటీస్, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఇటీవల పతనం కారణంగా తగ్గి ఆకర్షణీయంగా ఉన్న రియల్టీ, విద్యుత్తు, ఆయిల్, గ్యాస్ షేర్లో కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైంది. 25,745 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 25,767-25,514 పాయింట్లు, గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. నిఫ్టీ 68 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఏడాది చివరకు నిఫ్టీ @ 8,200: యూబీఎస్ అంచనా ఎన్ఎస్ఈ నిఫ్టీ ఈ ఏడాది చివరకు 8,200 పాయింట్లకు చేరుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం యూబీఎస్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. జీడీపీ అంచనా 7.6%. 2016-17లో 7.8% అంచనా. -
2016 మార్చికల్లా 0.75% రేట్ల కోత: యూబీఎస్
న్యూఢిల్లీ : ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2015-16లో 0.75 శాతం రెపో రేటు తగ్గిస్తుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం యూబీఎస్ అంచనావేసింది. వర్షాభావ పరిస్థితులతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలుండటంతో సమీప భవిష్యత్తులో ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.25%) తగ్గించకపోవచ్చన్న అంచనాల నేపథ్యంలో దీనికి భిన్నంగా యూబీఎస్ తాజా నివేదిక పేర్కొనడం గమనార్హం. రానున్న ఆగస్టు 2 సమీక్ష సందర్భంగా రేట్ల కోత ఉండకపోయినా, అటు తర్వాత తగ్గింపు దిశలో నిర్ణయం ఉంటుందని యూబీఎస్ విశ్లేషకుడు గౌతమ్ చెప్పారు. -
కుబేరుల గని.. ముంబై వర్సిటీ
* పూర్వ విద్యార్థుల్లో 12 మంది బిలియనీర్లు * టాప్ 10 వర్సిటీల్లో 9వ స్థానం న్యూఢిల్లీ: అత్యధిక సంఖ్యలో సంపన్నులను సృష్టించిన టాప్ 10 విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ ఆఫ్ ముంబై తొమ్మిదో స్థానం దక్కించుకుంది. ముంబై వర్సిటీ నుంచి బ్యాచిలర్స్ పట్టా పుచ్చుకున్న వారిలో ఏకంగా 12 మంది బిలియనీర్లుగా ఉన్నారు. దీంతో కోట్లకు పడగలెత్తిన పూర్వ విద్యార్థులు .. అత్యధిక సంఖ్యలో ఉన్న వర్సిటీల్లో ఒకటిగా ముంబై విశ్వవిద్యాలయం నిల్చింది. అమెరికా వర్సిటీలను మినహాయిస్తే ఇంత ఎక్కువ సంఖ్యలో బిలియనీర్లను అందించిన ఏకైక విశ్వవిద్యాలయం ఇదొక్కటే. వెల్త్-ఎక్స్, యూబీఎస్ ఈ ఏడాది నిర్వహించిన బిలియనీర్ సెన్సస్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో 25 మంది బిలియనీర్ పూర్వ విద్యార్థులతో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (16 మంది), ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం (14 మంది) వరుసగా టాప్ ఫైవ్‌లో ఉన్నాయి. ముంబై విశ్వవిద్యాలయంలో చదివిన బిలియనీర్ల సంఖ్య.. అటు ఎంఐటీ, ఎన్‌వైయూ, యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా, డ్యూక్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రఖ్యాత వర్సిటీల కన్నా అధికం కావడం గమనార్హం. టాప్ 20 బిలియనీర్ స్కూల్స్‌లో 16 అమెరికాలోనే ఉన్నాయి. మిగతా నాలుగింటిలో.. ముంబై విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (బ్రిటన్), లొమొనొసొవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీ(రష్యా), ఈటీహెచ్ జ్యూరిక్(స్విట్జర్లాండ్) ఉన్నాయి. -
డిసెంబర్‌కల్లా 8,000కు నిఫ్టీ..!
ముంబై: ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 8,000 పాయింట్ల మైలురాయిని తాకుతుందని స్విస్ బ్రోకరేజీ దిగ్గజం యూబీఎస్ తాజాగా అంచనా వేసింది. దేశీ ఈక్విటీలపై బుల్లిష్‌గా ఉన్నామని, భవిష్యత్‌లో మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొంటుందని భావిస్తున్నామని యూబీఎస్ విశ్లేషకులు గౌతమ్.సి చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉన్నారని, దీంతో ప్రీమియం విలువలకు మార్కెట్లు చేరతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. సమయానుకూల(సైక్లికల్) ఆర్థిక రికవరీను సూచిస్తూ గణాంకాలు వెలువడుతున్నాయని, వెరసి 2014 చివరికల్లా నిఫ్టీ 8,000 పాయింట్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని నివేదికలో అంచనా వేశారు. ఇప్పటికే ప్రధాని మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పలు సంస్కరణలకు తెరలేపిందని నివేదికలో యూబీఎస్ పేర్కొంది. వీటిని మార్కెట్ పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. బిజినెస్‌కు స్నేహపూర్వక వాతావరణం కల్పించడం, కార్మిక సంస్కరణలు, పర్యావరణ, అటవీ అనుమతులకు ఈ క్లియరెన్స్ సౌకర్యాలు, ప్రస్తుత గనుల్లో ఉత్పత్తి పెంపునకు ఆటోమేటిక్ అనుమతులు తదితర పలు చర్యలను నివేదికలో యూబీఎస్ ప్రధానంగా ప్రస్తావించింది. ఇవికాకుండా రైల్వే, బీమా, రక్షణ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐలు) తెరలేపడం, రియల్టీ, ఇన్ఫ్రా రంగాల ట్రస్ట్‌లకు వీలు కల్పించడం వంటి అంశాలను కూడా పేర్కొంది. -
ఏడాదిలో 8,000 పాయింట్లకు నిఫ్టీ
ముంబై: కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో మార్కెట్‌పట్ల బుల్లిష్‌గా ఉన్నామని, 2014 చివరికల్లా నిఫ్టీ 8,000 పాయింట్లను తాకుతుందని అంచనా వేస్తున్నామని స్విస్ బ్రోకరేజీ సంస్థ విదేశీ బ్యాంకింగ్ సంస్థ యూబీఎస్ పేర్కొంది. మోడీ అధ్యక్షతన ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ లభించడం మార్కెట్లకు అత్యంత సానుకూల అంశమని అభిప్రాయపడింది. ఎన్డీఏ పటిష్టమైన, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వ్యాఖ్యానించింది. మార్కెట్ వ్యూహం పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. వెరసి ఈక్విటీలపట్ల సానుకూల వైఖరితో ఉన్నామని, మార్కెట్లు గరిష్ట స్థాయిల్లోనే ట్రేడవుతాయని అంచనా వేసింది. గత కొన్ని నెలలుగా మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ, సరైన స్థాయిలోనే కొనసాగుతున్నాయని తెలిపింది. ఐదేళ్ల సగటు అయిన 15 పీఈ స్థాయిలో కదులుతున్నాయని వివరించింది. ఈ పీఈలో నిఫ్టీ విలువ 6,900కాగా, 2014 చివరికల్లా ఆర్జనలో 15% వృద్ధిని అంచనా వేస్తే నిఫ్టీ 7,800ను చేరుకుంటుందని పేర్కొంది. వృద్ధి అంచనాలరీత్యా ఇన్వెస్టర్లు ప్రీమియం స్థాయిలోనూ పెట్టుబడులకు ఆసక్తి చూపుతారని విశ్లేషించింది. వచ్చే ఏడాది 15% వృద్ధి ఈ ఏడాది చివరికల్లా ఇన్వెస్టర్లు వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16) వృద్ధిపై అంచనాలు మొదలుపెడతారని యూబీఎస్ పేర్కొంది. కనీస స్థాయిలో అంచనావేస్తే నిఫ్టీ కంపెనీల ఆర్జన 15% వృద్ధి చెందగలదని అభిప్రాయపడింది. ఈ ప్రకారం 15 పీఈ చొప్పున చూసినా నిఫ్టీ 8,000ను తాకగలదని వివరించింది. కాగా, రానున్న కొద్ది నెలల్లో ప్రభుత్వ విధానాలు, తదితర నిర్ణయాల ఫలిత ంగా నిఫ్టీ అంచనాలను మరింత పెంచే అవకాశం కూడా ఉన్నదని తెలిపింది. వీటితోపాటు ఆర్థిక రికవరీ వంటి అంశాలు కూడా మార్కెట్లకు దన్నునిస్తాయని తెలిపింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు ద్వారా దేశంలోనూ గుజరాత్ తరహా అభివృద్ధిపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉన్నారని యూబీఎస్ వ్యాఖ్యానించింది.