ముంబై: కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో మార్కెట్‌పట్ల బుల్లిష్‌గా ఉన్నామని, 2014 చివరికల్లా నిఫ్టీ 8,000 పాయింట్లను తాకుతుందని అంచనా వేస్తున్నామని స్విస్ బ్రోకరేజీ సంస్థ విదేశీ బ్యాంకింగ్ సంస్థ యూబీఎస్ పేర్కొంది. మోడీ అధ్యక్షతన ఎన్‌డీఏకు స్పష్టమైన మెజారిటీ లభించడం మార్కెట్లకు అత్యంత సానుకూల అంశమని అభిప్రాయపడింది. ఎన్‌డీఏ పటిష్టమైన, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వ్యాఖ్యానించింది.
మార్కెట్ వ్యూహం పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. వెరసి ఈక్విటీలపట్ల సానుకూల వైఖరితో ఉన్నామని, మార్కెట్లు గరిష్ట స్థాయిల్లోనే ట్రేడవుతాయని అంచనా వేసింది. గత కొన్ని నెలలుగా మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ, సరైన స్థాయిలోనే కొనసాగుతున్నాయని తెలిపింది. ఐదేళ్ల సగటు అయిన 15 పీఈ స్థాయిలో కదులుతున్నాయని వివరించింది. ఈ పీఈలో నిఫ్టీ విలువ 6,900కాగా, 2014 చివరికల్లా ఆర్జనలో 15% వృద్ధిని అంచనా వేస్తే నిఫ్టీ 7,800ను చేరుకుంటుందని పేర్కొంది. వృద్ధి అంచనాలరీత్యా ఇన్వెస్టర్లు ప్రీమియం స్థాయిలోనూ పెట్టుబడులకు ఆసక్తి చూపుతారని విశ్లేషించింది.
వచ్చే ఏడాది 15% వృద్ధి
ఈ ఏడాది చివరికల్లా ఇన్వెస్టర్లు వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16) వృద్ధిపై అంచనాలు మొదలుపెడతారని యూబీఎస్ పేర్కొంది. కనీస స్థాయిలో అంచనావేస్తే నిఫ్టీ కంపెనీల ఆర్జన 15% వృద్ధి చెందగలదని అభిప్రాయపడింది. ఈ ప్రకారం 15 పీఈ చొప్పున చూసినా నిఫ్టీ 8,000ను తాకగలదని వివరించింది. కాగా, రానున్న కొద్ది నెలల్లో ప్రభుత్వ విధానాలు, తదితర నిర్ణయాల ఫలిత ంగా నిఫ్టీ అంచనాలను మరింత పెంచే అవకాశం కూడా ఉన్నదని తెలిపింది. వీటితోపాటు ఆర్థిక రికవరీ వంటి అంశాలు కూడా మార్కెట్లకు దన్నునిస్తాయని తెలిపింది. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు ద్వారా దేశంలోనూ గుజరాత్ తరహా అభివృద్ధిపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉన్నారని యూబీఎస్ వ్యాఖ్యానించింది.
ఏడాదిలో 8,000 పాయింట్లకు నిఫ్టీ
Published Sat, May 17 2014 1:16 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement