జియోకు వేగం తగ్గిందా?
జియోకు వేగం తగ్గిందా?
Published Mon, May 22 2017 5:55 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM
టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చి, సబ్ స్క్రైబర్లను భారీగా పెంచుకుంటూ రిలయన్స్ జియో బ్రేక్ లేకుండా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. సంచలన ఆఫర్లతో ఈ నెట్ వర్క్ పై సబ్ స్క్రైబర్లు విపరీతమైన ఆసక్తి చూపారు. అయితే తాజాగా సబ్ స్క్రైబర్లను పెంచుకోవడంలో జియో వేగం తగ్గిపోయిందట.మార్చి నెలలో కేవలం 5.8 మిలియన్ సబ్ స్క్రైబర్లను మాత్రమే రిలయన్స్ జియో తన నెట్ వర్క్ కు యాడ్ చేసుకుందని తాజా డేటాలో తెలిసింది. మార్చి నెల ముందు నెలలో 12.2 మిలియన్ సబ్ స్క్రైబర్లు జియోకు యాడ్ అయ్యారు. కానీ ప్రస్తుతం సబ్ స్క్రైబర్లు పడిపోతున్నారని ట్రాయ్ డేటా ఆధారంగా యూఎస్బీ రిపోర్టు వెల్లడించింది. ఈ తగ్గుముఖం చోటు చేసుకుంటున్నా.. ముఖేష్ అంబానీ కంపెనీనే సబ్ స్క్రైబర్లను పెంచుకోవడంలో టాప్ లో ఉందని తెలిసింది. జియో తర్వాత భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ లు ఉన్నాయి. జియో మార్కెట్ షేరు ఫిబ్రవరిలో 8.8 శాతం ఉండగా.. మార్చి నెలలో 9.3 శాతానికి పెరిగింది.
మార్చి నెలలో జియో సబ్ స్క్రైబర్ల వేగం తగ్గడం చూసి తామెంతో ఆశ్చర్యానికి గురయ్యామని, అదే నెలలో ఈ కంపెనీ ప్రైమ్ ఆఫర్ ను ప్రకటించినట్టు కూడా యూబీఎస్ పేర్కొంది. ఏప్రిల్ నెల నుంచి కంపెనీ ఛార్జీలు వసూలు చేస్తోంది. ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీ నెట్ అడిక్షన్ మూడు మిలియన్లు, 2.1 మిలియన్లు, 1.8 మిలియన్లుగా ఉంది. జియోకు పోటీగా ఈ దిగ్గజాలు బంపర్ ఆఫర్లను ప్రకటించడంతో వీరు కూడా సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచుకున్నారు. ఇతర టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ కమ్యూనికేషన్, టాటా టెలిసర్వీసెస్, టెలినార్ మార్కెట్ షేరును కోల్పోతూనే ఉన్నాయని యూబీఎస్ పేర్కొంది. వొడాఫోన్ తన బ్రాడ్ బ్యాండ్ సబ్ స్క్రైబర్లను మార్చి నెలలో రికవరీ చేసుకుంది. ఎయిర్ టెల్ తన బ్రాడ్ బ్యాండ్ వ్యాప్తిని మరింత పెంచుకుంది. ఫిబ్రవరి నెలలో ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండు వ్యాప్తి 20.9 శాతం ఉండగా.. మార్చిలో ఇది 22.1 శాతానికి పెరిగింది.
Advertisement
Advertisement