న్యూఢిల్లీ: దేశీయంగా టెలి కం యూజర్ల సంఖ్య ఏప్రిల్‌లో 120 కోట్లు దాటింది. ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో మొత్తం సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 120.12 కోట్లుగా నమోదైంది.
ఈ ఏడాది మార్చిలో ఇది 119.92 కోట్లుగా ఉంది. చివరిసారిగా 2017 జూలైలో 121 కోట్ల రికార్డు స్థాయిని తాకింది. తాజాగా, వైర్‌లెస్ విభాగంలో రిలయన్స్ జియోకి ఏప్రిల్‌లో 26.8 లక్షల మంది కొత్త యూజర్లు జత వడంతో మొత్తం యూజర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరింది.
7.52 లక్షల కొత్త కస్టమర్లు, మొత్తం 26.75 కోట్ల యూజర్లతో ఎయిర్‌టెల్ తర్వాత స్థానంలో ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ల సంఖ్య 12.3 లక్షలు, వొడాఫోన్ ఐడియా యూజర్లు 7.35 లక్షల మేర తగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment