ఏడు కంపెనీల్లో వాటాల విక్రయం
వీటి విలువ రూ.4,961 కోట్లు
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కు చెందిన ఆర్థిక సేవల కంపెనీ యూబీఎస్ గ్రూప్ ఏజీ.. శుక్రవారం ఒక్క రో జే (30వ తేదీన) ఏకంగా భారత ఈక్విటీల్లో భారీ అమ్మ కాలకు దిగింది. ఏడు కంపెనీల్లో రూ.4,961 కోట్ల విలువ చేసే షేర్లను ఓపెన్ మార్కెట్ లావాదేవీల రూ పంలో విక్రయించింది. యూబీఎస్ ప్రిన్సిపల్ క్యాపిటల్ ఏషియా రూపంలో బల్‌్కడీల్స్ ద్వారా అమ్మకాలు చేసినట్టు ఎన్‌ఎస్‌ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆయిల్ ఇండియాలో రూ.972 కోట్లు, డిక్సన్ టెక్నాలజీస్‌లో రూ.904 కోట్లు, ఆర్‌వీఎన్‌ఎల్‌లో రూ.797 కోట్లు, జైడస్ లైఫ్‌సైన్సెస్‌లో రూ.756 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేసింది. అలాగే, వొడాఫోన్ ఐడియా, ఒరాకిల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్‌లోనూ రూ.1,531 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. మరోవైపు బంధన్ బ్యాంక్‌లో రూ.384 కోట్ల విలువ చేసే 1.92 కోట్ల షేర్లను యూబీఎస్ ప్రిన్సిపల్ క్యాపిటల్ కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment