అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ భారత్ ఎకానమీ పురోగతి బాటనే నడుస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదని విశ్లేషణా సంస్థలు పేర్కొంటున్నాయి. వృద్ధి, ద్రవ్యోల్బణం, ఎగుమతులు తక్షణం ఎకానమీ పురోగతికి అనుగుణంగా ఉంటాయన్నది వాటి అభిప్రాయం. స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని విశ్లేషణలను పరిశీలిస్తే...
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో 8.5 శాతానికి చేరుకుంటుందని ఇక్రా రేటింగ్స్ మంగళవారం ఒక నివేదికలో పేర్కొంది. గత జనవరి–మార్చి త్రైమాసికంలో నమోదైన 6.1 శాతం వృద్ధిరేటు నుంచి గణనీయంగా కోలుకుంటుందని వివరించింది. వేగవంతమైన వృద్ధికి విస్తృత స్థాయిలో డిమాండ్, సేవల రంగంలో రికవరీ కారణమని పేర్కొంది.
మొదటి త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)అంచనాలు 8.1 శాతం మించి ఇక్రా అంచనాలు ఉండడం గమనార్హం. సేవల డిమాండ్‌లో నిరంతర పురోగతి, మెరుగైన పెట్టుబడి కార్యకలాపాలు, ముఖ్యంగా ప్రభుత్వ మూలధన వ్యయంలో పెరుగుదల, కొన్ని రంగాలలో మార్జిన్‌లు పెరగడం, వివిధ వస్తువుల ధరలు అదుపులోనికి రావడం వంటి అంశాలు జూన్ జూన్ త్రైమాసికానికి సంబంధించి తమ వృద్ధి అంచనాను పెంచాయని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితీ నాయర్ తెలిపారు.
కేంద్రం, 23 రాష్ట్ర ప్రభుత్వాల (అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, గోవా, మణిపూర్, మేఘాలయ మినహా) మొత్తం మూలధన వ్యయం మొదటి త్రైమాసిక వ్యయం 76 శాతం పెరిగి రూ.1.2 లక్షల కోట్లకు, నికర రుణాలు 59.1 శాతం పెరిగి రూ.2.8 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆమె వెల్లడించారు. ఆధునికీకరణ, కొత్త ప్రాజెక్టులు, మూలధన వస్తువుల దిగుమతుల ప్రయోజనం కోసం మూల ధన సంబంధిత అంతర్జాతీయ వాణిజ్య రుణాలు క్యూ1లో 13.0 బిలియన్ డాలర్లని పేర్కొన్న నివేదిక, 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో పోల్చితే (9.6 బిలియన్ డాలర్లు) అధికమని పేర్కొంది. కాగా, ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఇంకా కొంత అనిశ్చితి నెలకొన్నట్లు పేర్కొంది. 6 శాతం వృద్ధి మాత్రమే నమోదుకావచ్చని అంచనావేసింది.
ద్రవ్యోల్బణం ఒత్తిడి తాత్కాలికమే
ఆర్థికశాఖ నివేదిక
టమోటా ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆహార పదార్థాలపై ధరల ఒత్తిడి తాత్కాలికంగానే ఉంటుందని మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే పెరిగిన ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మూలధన వ్యయం కోసం పెంచిన కేటాయింపులు ఇప్పుడు ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదలకూ దారితీస్తున్నాయని పేర్కొన్న ఆర్థిక మంత్రిత్వశాఖ.. దేశీయ వినియోగం, పెట్టుబడి డిమాండ్ వృద్ధిని ముందుకు తీసుకువెళతాయని తన జూలై నెలవారీ ఎకనామిక్ రివ్యూలో పేర్కొంది.
జూలైలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దాటి 15 నెలల గరిష్ట స్థాయిలో 7.44 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఆర్థికశాఖ ఎకానమీకి సంబంధించి తాజా భరోసాను ఇచి్చంది. ద్రవ్యోల్బణం తగ్గుదలకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోందని, కొత్త స్టాక్ కూడా మార్కెట్‌లోకి వస్తోందని ఆర్థికశాఖ తెలిపింది. ఇవన్నీ ద్రవ్యోల్బణం కట్టడికి దారితీస్తాయని విశ్లేíÙంచింది.
తగిన రుతుపవనాలు, ఖరీఫ్ సాగు గణనీయమైన పురోగతితో వ్యవసాయ రంగం ఊపందుకుంటోందని అంచనావేసింది. గోధుమలు, బియ్యం సమీకరణ బాగుందని తెలిపింది. దేశంలో ఆహార భద్రతను పెంచడానికి ఆహార ధాన్యాల బఫర్ స్టాక్ స్థాయిలను కేంద్రం పెంచుతుందని తెలిపింది. ప్రైవేట్ రంగం పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) 14 కీలక రంగాలకు ప్రోత్సాహకాలను అందిస్తోందన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. పీఎం గతి శక్తి, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్‌ఐపీ)తో కలిసి కొత్త మౌలిక సదుపాయాలను సృష్టించడంలో ప్రైవేట్–రంగం భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపింది.
800 బిలియన్ డాలర్లు దాటిన విదేశీ వాణిజ్యం
సేవల రంగం సాయం
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మందగించినప్పటికీ, 2023 ప్రథమార్థంలో భారతదేశం సేవల విభాగాలలో ఆరోగ్యకరమైన పెరుగుదల.. దేశం మొత్తం అంతర్జాతీయ వాణిజ్యానికి భరోసాను అందించిందని ఆర్థిక విశ్లేషనా సంస్థ–గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్‌ఐ) తన తాజా నివేదికలో పేర్కొంది. 2023 జనవరి–జూన్ మధ్య భారత్ వస్తువులు, సేవల వాణిజ్యం 800 బిలియన్ డాలర్లు దాటినట్లు జీటీఆర్‌ఐ నివేదిక పేర్కొంది.
నివేదిక ప్రకారం, సమీక్షా కాలంలో వస్తు, సేవల ఎగుమతులు 1.5 శాతం పెరిగి 385.4 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు ఇదే కాలంలో 5.9 శాతం ఎగసి 415.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక వేర్వేరుగా చూస్తే.. వస్తు ఎగుమతులు 8.1 శాతం తగ్గి 218.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు 8.3 శాతం క్షీణించి 325.7 బిలియన్ డాలర్లకు పడ్డాయి. కాగా, సేవల ఎగుమతులు మాత్రం 17.7 శాతం పెరిగి 166.7 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 3.7 శాతం పెరిగి 89.8 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఎస్‌బీఐ అంచనా 8.3 శాతం
బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మొదటి త్రైమాసికంలో 8.3 శాతం వృద్ధి అంచనాలను వేసింది. ఆర్‌బీఐ అంచనాలకు మించి ఈ విశ్లేషణ నమోదుకావడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంలో 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని తమ 30 హై ఫ్రీక్వెన్సీలతో కూడిన ఆరి్టఫిషియల్ న్యూట్రల్ నెట్‌వర్క్ (ఏఎన్‌ఎన్) అంచనా వేస్తున్నట్లు గ్రూప్ చీఫ్ ఎకమిస్ట సౌమ్య కాంతి ఘోష్ ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో పేర్కొన్నారు.
నివేదిక ప్రకారం, జూలై–సెపె్టంబర్‌లో 6.5 శాతం, అక్టోబర్–డిసెంబర్ మధ్య 6 శాతం, జనవరి–మార్చి (2024)లో 5.7 శాతం వృద్ధి నమోదవుతుంది. ఆర్‌బీఐ ఈ నెల మొదట్లో జరిగిన పాలసీ సమీక్ష 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5 శాతం, క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనా.
Comments
Please login to add a commentAdd a comment