న్యూఢిల్లీ: భారత్ మధ్య కాలిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను రేటింగ్ దిగ్గజం– ఫిచ్ 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీనితో ఈ రేటు 5.5 శాతం నుంచి 6.2 శాతానికి చేరింది. 2023 నుండి 2027 వరకు మధ్యకాలంగా ఫిచ్ నిర్వచించింది. ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డం, పని చేసే వయస్సులో ఉన్న జనాభా అంచనాలో స్వల్ప పెరుగుదల తమ తాజా అప్‌గ్రేడ్‌కు కారణమని పేర్కొంది. ఫిచ్ తాజా అంచనాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
► కరోనా కాలంలో భారత్‌లో భారీగా పడిపోయిన ఉపాధి అవకాశాలు దేశంలో వేగంగా రికవరీ అవుతున్నట్లు తెలిపింది. మహమ్మారి నాటి కాలంలో పోల్చితే కారి్మక సరఫరా వృద్ధి రేటు పెరిగినప్పటికీ, 2019 స్థాయి నాటికన్నా తక్కువగానే ఉంది. 2000 సంవత్సరం ప్రారంభంలో నమోదయిన స్థాయిలకంటే కూడా తక్కువే. ముఖ్యంగా మహిళల్లో ఉపాధి అవకాశాల రేటురేటు చాలా తక్కువగా ఉంది.
► భారత్‌లో పాటు బ్రెజిల్, మెక్సికో, ఇండోనేíÙయా, పోలాండ్, టర్కీ వృద్ధి రేట్ల అంచనా పెరిగింది.అయితే భారత్ కన్నా తక్కువగా 0.2 శాతం మాత్రమే బ్రెజిల్ టర్కీ, ఇండోనేషియా వృద్ధి రేటు అంచనాలకు ఎగశాయి.
► 10 వర్థమాన ఆర్థిక వ్యవస్థల మధ్యకాలిక వృద్ధిని 4 శాతంగా అంచనా వేసింది. ఇది మునుపటి అంచనా కంటే 30 బేసిస్ పాయింట్లు (ఇంతక్రితం అంచనా 4.3 శాతం) తక్కువ. చైనా వృద్ధి అంచనాలో 0.7 శాతం పాయింట్ల కోత వల్ల ప్రధానంగా ఈ పరిస్థితి నెలకొంది. దీనితో చైనా ఎకానమీ సగటు వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది. ఇటీవలి సంవత్సరాలలో చైనా వృద్ధి బాగా మందగించింది. రియల్టీ రంగంలో క్షీణత మొత్తం పెట్టుబడుల అవుట్‌లుక్‌కు దెబ్బతీసింది.
► రష్యా వృద్ధి రేటును ఈ కాలంలో చైనా 80 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఆ దేశం వృద్ధి రేటు మధ్య కాలికంగా 80 బేసిస్ పాయింట్లుగానే (ఒక శాతం కన్నా తక్కువ) ఉంటుంది.
2023–24లో 6.3 శాతం
కాగా, భారత్ స్థూల దేశీయోత్పత్తి 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతమన్న తన అంచనాలను రేటింగ్ దిగ్గజం– ఫిచ్ పునరుద్ఘాటించింది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు వృద్ధి స్పీడ్‌కు బ్రేకులు వేస్తాయని ఫిచ్ అభిప్రాయపడింది. 2024–25లో వృద్ధి రేటు 6.5 శాతమని అంచనావేస్తున్నట్లు తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో ద్రవ్యోల్బణం 6 శాతం పైనే కొనసాగే అవకాశం ఉందని ఫిచ్ అభిప్రాయపడింది.
2023–2027 మధ్య భారత్ వృద్ధి జూమ్
Published Tue, Nov 7 2023 4:50 AM | Last Updated on Tue, Nov 7 2023 4:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment