న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2023–24, ఏప్రిల్–జూన్) 7.8 శాతంగా నమోదయ్యింది. వ్యవసాయం, ఫైనాన్షియల్ రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శించాయి. జూన్ త్రైమాసికంలో ప్రపంచంలో మరే దేశమూ ఈ స్థాయి వృద్ధిని నమోదుచేసుకోలేదు. దీనితో వృద్ధి వేగంలో భారత్ మొదటి స్థానంలో నిలిచినట్లయ్యింది.
6.3 శాతం వృద్ధి రేటుతో భారత్ తర్వాత చైనా వృద్ధి వేగంలో రెండవ స్థానంలో నిలిచింది. అయితే క్యూ1లో 8 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలకన్నా తాజా లెక్క తక్కువగా ఉండడం గమనార్హం. ఈ నెల రెండవ వారంలో జరిగిన ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనావేసింది. క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5 శాతం, క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా అంచనా వేసింది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనాకు వచి్చంది.
7.8 శాతం వృద్ధి అంటే...
2011–12ని బేస్ ఇయర్‌గా తీసుకుని ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తూ లెక్కిస్తే, 2022–23 మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.37.44 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో ఈ విలువ రూ.40.37 లక్షల కోట్లకు ఎగసింది. అంటే వృద్ధి 7.8 శాతం పెరిగిందన్నమాట. కాగా ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయని (ప్రస్తుత ధరల ప్రాతిపదిక) జీడీపీ వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. విలువల్లో రూ.65.42 లక్షల కోట్ల నుంచి రూ.70.67 లక్షల కోట్లకు పెరిగింది.
► 2022–23 క్యూ1లో జీడీపీ వృద్ధి రేటు 13.1 శాతంగా ఉంది. అయితే దీనికి లో బేస్ ఎఫెక్ట్ ఒక కారణం. అంటే కరోనా కష్టకాలం 2021–22 ఇదే కాలంలో చేటుచేసుకున్న అతి తక్కువ గణాంకాలు 2022–23 క్యూ1లో అధిక రేటు (శాతాల్లో) నమోదుకు దోహదపడ్డాయి.
► తాజా గణాంకాలకు ముందు త్రైమాసికం అంటే జనవరి–మార్చి మధ్య జీడీపీ విలువ 6.1% కాగా, అంతక్రితం త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్)ఈ రేటు 4.5%. అంటే సమీక్షా కాలంసహా అంతక్రితం గత 3 త్రైమాసికాల్లో వృద్ధి రేటు పెరుగుతూ వచి్చందన్నమాట.
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్– స్థూల విలువ జోడింపు అనేది ఆర్థిక వ్యవస్థలోని పరిశ్రమ, రంగం, తయారీదారు, ప్రాంతం లేదా ప్రాంతం ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువ. ఉత్పత్తి వ్యయాలను ఇందులో చేర్చరు) ప్రకారం వివిధ రంగాల వృద్ధి తీరును పరిశీలిస్తే..
జూలైలో మౌలిక రంగం ఓకే...
ఎనిమిది రంగాల భారత్ మౌలిక పరిశ్రమ జూలైలో మంచి పనితీరును కొనసాగించింది. బొగ్గు , క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, స్టీల్, సిమెంట్, విద్యుత్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాలు వీటిలో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వీటి వెయిటేజ్ 40.27 శాతం. ఐఐపీ జూలై డేటా సెపె్టంబర్ రెండవ వారం మొదట్లో వెలువడుతుంది. ఇక ఏప్రిల్ నుంచి జూలై వరకూ మౌలిక పరిశ్రమ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. కాగా, జూన్‌లో మౌలిక రంగం వృద్ధి రేటు 8.3 శాతం కావడం గమనార్హం. 2022 ఏప్రిల్–జూలై మధ్య ఈ రేటు 11.5 శాతం.
జూలైలో మౌలిక రంగం ఓకే...
ఎనిమిది రంగాల భారత్ మౌలిక పరిశ్రమ జూలైలో మంచి పనితీరును కొనసాగించింది. బొగ్గు , క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, స్టీల్, సిమెంట్, విద్యుత్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాలు వీటిలో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వీటి వెయిటేజ్ 40.27 శాతం. ఐఐపీ జూలై డేటా సెపె్టంబర్ రెండవ వారం మొదట్లో వెలువడుతుంది. ఇక ఏప్రిల్ నుంచి జూలై వరకూ మౌలిక పరిశ్రమ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. కాగా, జూన్‌లో మౌలిక రంగం వృద్ధి రేటు 8.3 శాతం కావడం గమనార్హం. 2022 ఏప్రిల్–జూలై మధ్య ఈ రేటు 11.5 శాతం.
వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.5% వృద్ధి సాధించే సత్తా భారత్‌కు ఉంది. ధరల కట్టడికి ప్రభుత్వం, ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అందువల్ల ద్రవ్యోల్బణం భయాలు అక్కర్లేదు.
– వి. అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్
Comments
Please login to add a commentAdd a comment