ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.2 శాతం పురోగమిస్తుందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ నివేదిక పేర్కొంది. విదేశీ ఒత్తిడులు, గృహ రుణ స్థాయిలు 15 సంవత్సరాల గరిష్ట స్థాయిలో (జీడీపీలో 5.8 శాతం) ఉన్నప్పటికీ సానుకూల పాలసీ విధానాలు, రుణ వృద్ధి, తగిన స్థాయిల్లో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు దేశం 2024–25లో 6.2 శాతం వృద్ధి బాటన నడవడానికి దోహదపడతాయని భావిస్తున్నట్లు నివేదిక ఆవిష్కరణ సందర్భంగా యుబీఎస్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ తన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు.
నివేదికలోని అంశాల్లో కొన్ని...
► 2023–24లో 6.3 శాతం వృద్ధి అంచనా. 2024–25లో 6.2 శాతంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. వినియోగ రంగంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి
(2023–24 అంచనా), 4.7 శాతానికి మెరుగుపడే వీలుంది.
► వచ్చే ఆర్థిక సంవత్సరం మూలధన మరింత విస్తృత ప్రాతిపదికన మెరుగుపడే వీలుంది. ఎన్నికల ముందు నెమ్మదించే అవకాశం ఉన్న ఈ విభాగం, ఎన్నికల అనంతరం వేగం
పుంజుకునే వీలుంది.
► 2025–26 నుంచి 2029–30 మధ్య వార్షికంగా భారత్ 6.5 శాతం పురోగమించవచ్చు. 2030లో దేశం 6 ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా ఆవిర్భవించే అవకాశం ఉంది.
► డిజిటలైజేషన్, సేవల ఎగుమతుల పురోగతి, తయారీ రంగం పటిష్టత ఎకానమీకి దన్నుగా నిలుస్తాయి.
► 2024–25లో రుణ వృద్ధి 13 నుంచి 14 శాతం ఉండే వీలుంది.
► దేశంలో తిరిగి మోదీ ప్రభుత్వమే అధికారంలోని వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే రాజకీయ స్థిరత్వం విధాన నిర్ణయాల కొనసాగింపునకు తద్వారా వివిధ రంగాల పురోగతికి దోహదపడే అంశాలు.
► 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సగటు 5.4 శాతం, 2024–25లో 4.8 శాతం నమోదయ్యే వీలుంది. సరఫరాల పరిస్థితి మెరుగుపడ్డం ఈ అంచనాలకు కారణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశాల ప్రకారం– 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను చేరుకోడానికి దీర్ఘకాలం పట్టే వీలుంది.
4 ట్రిలియన్ డాలర్లకు ఎకానమీ: పీహెచ్‌డీసీసీఐ
భారత్ ఎకానమీ విలువ 2024–25లో 4 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్‌డీసీసీఐ ఒక నివేదికలో పేర్కొంది. 2024–25లో ఈ విలువ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని విశ్లేíÙంచింది. 2024 ముగిసే సరికి ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ప్రస్తుతం 6.5 శాతం నుంచి 5.5 శాతం వరకూ తగ్గించే వీలుందని కూడా ఇండస్ట్రీ చాంబర్ విశ్లేíÙంచింది.
అంతర్జాతీయ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటూ దూసుకుపోతున్న భారత్– 2047 నాటికి ‘వికసిత భారత్ ఎకానమీ’ లక్ష్యాలను చేరుకోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. 2024లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటు 4.5 శాతంగా ఉంటుందని అంచనావేసింది. వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్స్‌టైల్, దుస్తులు, ఫార్మాస్యూటికల్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎల్రక్టానిక్స్, ఫిన్‌టెక్ సహా వృద్ధికి ఆశాజనకంగా ఉన్న పలు రంగాలను కూడా ఇండస్ట్రీ సంస్థ గుర్తించింది.
నాలుగు విభిన్న కాల వ్యవధులను విశ్లేషణకోసం పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కరోనా ముందస్తు సంవత్సరాలు(2018, 2019), కరోనా పీడిత సంవత్సరాలు (2020, 2021), కరోనా తర్వాతి సంవత్సరాలు (2022,2023) భవిష్యత్ అవుట్‌లుక్ సంవత్సరాలుగా(2024,2025) వీటిని విభజించింది. ఈ నాలుగు కాలాల్లో లీడ్ ఎకనామిక్ ఇండికేటర్స్ ర్యాంకింగ్‌ను గమనించినట్లు
ఇండస్ట్రీ బాడీ పీహెచ్‌డీసీసీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment