UBS report
-
సవాళ్లున్నా... 6.2 శాతం వృద్ధి!
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.2 శాతం పురోగమిస్తుందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ నివేదిక పేర్కొంది. విదేశీ ఒత్తిడులు, గృహ రుణ స్థాయిలు 15 సంవత్సరాల గరిష్ట స్థాయిలో (జీడీపీలో 5.8 శాతం) ఉన్నప్పటికీ సానుకూల పాలసీ విధానాలు, రుణ వృద్ధి, తగిన స్థాయిల్లో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు దేశం 2024–25లో 6.2 శాతం వృద్ధి బాటన నడవడానికి దోహదపడతాయని భావిస్తున్నట్లు నివేదిక ఆవిష్కరణ సందర్భంగా యుబీఎస్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ తన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు. నివేదికలోని అంశాల్లో కొన్ని... ► 2023–24లో 6.3 శాతం వృద్ధి అంచనా. 2024–25లో 6.2 శాతంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. వినియోగ రంగంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి (2023–24 అంచనా), 4.7 శాతానికి మెరుగుపడే వీలుంది. ► వచ్చే ఆర్థిక సంవత్సరం మూలధన మరింత విస్తృత ప్రాతిపదికన మెరుగుపడే వీలుంది. ఎన్నికల ముందు నెమ్మదించే అవకాశం ఉన్న ఈ విభాగం, ఎన్నికల అనంతరం వేగం పుంజుకునే వీలుంది. ► 2025–26 నుంచి 2029–30 మధ్య వార్షికంగా భారత్ 6.5 శాతం పురోగమించవచ్చు. 2030లో దేశం 6 ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా ఆవిర్భవించే అవకాశం ఉంది. ► డిజిటలైజేషన్, సేవల ఎగుమతుల పురోగతి, తయారీ రంగం పటిష్టత ఎకానమీకి దన్నుగా నిలుస్తాయి. ► 2024–25లో రుణ వృద్ధి 13 నుంచి 14 శాతం ఉండే వీలుంది. ► దేశంలో తిరిగి మోదీ ప్రభుత్వమే అధికారంలోని వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే రాజకీయ స్థిరత్వం విధాన నిర్ణయాల కొనసాగింపునకు తద్వారా వివిధ రంగాల పురోగతికి దోహదపడే అంశాలు. ► 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సగటు 5.4 శాతం, 2024–25లో 4.8 శాతం నమోదయ్యే వీలుంది. సరఫరాల పరిస్థితి మెరుగుపడ్డం ఈ అంచనాలకు కారణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశాల ప్రకారం– 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను చేరుకోడానికి దీర్ఘకాలం పట్టే వీలుంది. 4 ట్రిలియన్ డాలర్లకు ఎకానమీ: పీహెచ్‌డీసీసీఐ భారత్ ఎకానమీ విలువ 2024–25లో 4 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్‌డీసీసీఐ ఒక నివేదికలో పేర్కొంది. 2024–25లో ఈ విలువ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని విశ్లేíÙంచింది. 2024 ముగిసే సరికి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ప్రస్తుతం 6.5 శాతం నుంచి 5.5 శాతం వరకూ తగ్గించే వీలుందని కూడా ఇండస్ట్రీ చాంబర్ విశ్లేíÙంచింది. అంతర్జాతీయ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటూ దూసుకుపోతున్న భారత్– 2047 నాటికి ‘వికసిత భారత్ ఎకానమీ’ లక్ష్యాలను చేరుకోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. 2024లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటు 4.5 శాతంగా ఉంటుందని అంచనావేసింది. వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్స్టైల్, దుస్తులు, ఫార్మాస్యూటికల్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎల్రక్టానిక్స్, ఫిన్‌టెక్ సహా వృద్ధికి ఆశాజనకంగా ఉన్న పలు రంగాలను కూడా ఇండస్ట్రీ సంస్థ గుర్తించింది. నాలుగు విభిన్న కాల వ్యవధులను విశ్లేషణకోసం పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కరోనా ముందస్తు సంవత్సరాలు(2018, 2019), కరోనా పీడిత సంవత్సరాలు (2020, 2021), కరోనా తర్వాతి సంవత్సరాలు (2022,2023) భవిష్యత్ అవుట్‌లుక్ సంవత్సరాలుగా(2024,2025) వీటిని విభజించింది. ఈ నాలుగు కాలాల్లో లీడ్ ఎకనామిక్ ఇండికేటర్స్ ర్యాంకింగ్‌ను గమనించినట్లు ఇండస్ట్రీ బాడీ పీహెచ్‌డీసీసీఐ తెలిపింది. -
భారతీయుల దగ్గర ఎన్నివేల టన్నుల బంగారం ఉందో తెలుసా!
ముంబై: అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణ భారాన్ని తట్టుకునేందుకు హెడ్జింగ్ సాధనంగా పసిడికి డిమాండ్ పెరగవచ్చని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. ‘ద్రవ్యోల్బణం 1 శాతం పెరిగితే పుత్తడికి డిమాండ్ 2.6 శాతం మేర పెరగవచ్చన్నది మా అంచనా. అధిక ద్రవ్యోల్బణం వల్ల ఆర్థికంగా తలెత్తే ప్రతికూలతలతో పాటు ఈక్విటీ మార్కెట్ల వేల్యుయేషన్లు విపరీత స్థాయిలో ఉండటం, స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లు ఇటీవల నష్టపోవడం, డిపాజిట్ రేట్లు తక్కువ స్థాయిలో ఉండటం తదితర అంశాల కారణంగా సమీప భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా ప్రజలు బంగారం వైపు మళ్లే అవకాశం ఉంది‘ అని పేర్కొంది. అయితే, రేటు అధిక స్థాయిలో ఉండటమనేది పెట్టుబడులపరమైన డిమాండ్‌కు కొంత ప్రతిబంధకం కాగలదని వివరించింది. రూపాయి పతనం, ద్రవ్యోల్బణ పెరుగుదలకు హెడ్జింగ్ సాధనంగా గత కొన్నాళ్లుగా బంగారానికి ప్రాధాన్యత పెరుగుతోంది. దీర్ఘకాలికంగా చూస్తే గత 15 ఏళ్లలో ఇది ఈక్విటీలు, డెట్ సాధనాలకు మించిన రాబడులు అందించినట్లు యూబీఎస్ నివేదిక వివరించింది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 837 టన్నులుగా ఉండగా .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 750 టన్నులకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నట్లు యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా చీఫ్ ఎకానమిస్ట్ తన్వీ గుప్తా జైన్ తెలిపారు. అయినప్పటికీ రేటు ఎక్కువగానే కొనసాగుతుండటం వల్ల విలువపరంగా 34 బిలియన్ డాలర్ల స్థాయిలో .. అధికంగానే ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ)డేటా ప్రకారం భారతీయుల దగ్గర ప్రపంచంలోనే అత్యధికంగా 27,000 టన్నుల పైగా పసిడి ఉంది. దీని విలువ సుమారు 1.675 లక్షల కోట్ల డాలర్ల మేర ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం నామినల్ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) దీని వాటా 53 శాతం. అదే రిటైల్ బ్యాంక్ డిపాజిట్ల వాటా 46 శాతమే. రిజర్వ్ బ్యాంక్ దగ్గర 48 బిలియన్ డాలర్ల విలువ చేసే పసిడి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 33.34 శాతం పెరిగి 46.14 బిలియన్ డాలర్లకు (837 టన్నులు) చేరాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ 34.62 బిలియన్ డాలర్లే. చదవండి👉గ్రాము సార్వభౌమ బంగారం ధర ఎంతంటే! -
ద్రవ్యోల్బణం పెరిగినా... వడ్డీరేట్లు పెరగవు
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో ఏడు నెలల గరిష్ట స్థాయి 6.01 శాతంగా నమోదుకాగా, ఏప్రిల్ వరకూ ఇదే ధోరణిలో ఎగువముఖంగానే కొనసాగే అవకాశం ఉందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ సెక్యూరిటీస్ నివేదిక అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినా, 2022 ఆగస్టు వరకూ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) పెరగదని, ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకోదని నివేదిక అంచనావేసింది. అయితే ఆగస్టు తర్వాత జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షాల్లో (ఆర్థిక సంవత్సరం రెండవ భాగం) 50 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచే అవకాశం ఉందని యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనావేసింది. ద్రవ్యోల్బణం గణాంకాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని యూబీఎస్ సెక్యూరిటీస్ చీఫ్ ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు. తాజా పెరుగుదలకు కారణం లో బేస్ ఎఫెక్టుకు (‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్) తోడు సరఫరాల వైపు సమస్యలూ కారణమని అన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే (6.1 శాతం) పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం కొంచెం తక్కువగా 5.9 శాతంగా ఉందని పేర్కొన్నారు. ధరల తీవ్రత, సరఫరాల్లో సమస్యలు... కమోడిటీ ధరల పెరుగుదల, సరఫరాల వైపు సమస్యలు, ముడి సరకుల ధరల తీవ్రత వంటి కారణాల వల్ల ఏప్రిల్ వరకూ రిటైల్ ద్రవ్యోల్బణం 5 నుంచి 5.6 శాతం శ్రేణిలోనే ఉంటుందన్నది తమ అభిప్రాయమని తెలిపారు. వచ్చే రెండు, మూడు నెలలూ సరఫరాల సమస్యలు కొనసాగుతాయన్నది తమ అంచనా అని తెలిపారు. ఇక ఆరు నుంచి 12 నెలల కాలంలో క్రూడ్ ధరలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణి ఎగువ పరిమితికన్నా ఎక్కువగా జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం (6.01 శాతం) నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. గడచిన ఏడు నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం (2021 జూన్‌లో 6.26 శాతం) నమోదుకావడం ఇదే తొలిసారి. 2021 జనవరిలో 4.06 శాతం. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ ఈ నెల మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ మెజారిటీ (6:5) అభిప్రాయపడింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమావేశం అంచనావేసింది. మహమ్మారి పరిస్థితిపై అస్పష్టత, క్రూడ్‌సహా అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుదల వంటి అంశాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలను 7.8 శాతానికి తగ్గించడానికి కారణమని తెలిపింది. చదవండి: కొత్తగా 4.5 లక్షల కొలువులు..సానుకూలంగా రిక్రూట్మెంట్స్..! -
జోరు తగ్గుతున్న జియో!
♦ మార్చిలో తగ్గిన కొత్త యూజర్లు ♦ ఆకట్టుకోని ప్రైమ్ ఆఫర్ ♦ దీర్ఘకాలంలో ఎయిర్‌టెల్‌దే హవా ♦ యూబీఎస్ నివేదిక ముంబై: చౌక టారిఫ్‌లతో దేశీ టెలికం రంగంలో సంచలనం సృష్టించినప్పటికీ .. కొత్త యూజర్లను ఆకర్షించడంలో రిలయన్స్ జియో జోరు కాస్త మందగించింది. మార్చి గణాంకాలు ఇందుకు నిదర్శనం. ఫిబ్రవరిలో 1.22 కోట్ల మంది యూజర్లను దక్కించుకున్న జియో మార్చిలో కేవలం 58 లక్షల మంది కొత్త సబ్‌స్క్రయిబర్స్‌ను నమోదు చేయగలిగింది. దీంతో ఫిబ్రవరిలో 8.8%గా ఉన్న జియో మార్కెట్ వాటా తర్వాత నెలలో కేవలం 9.3%కి పెరిగింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ఆధారంగా కన్సల్టెన్సీ సంస్థ యూబీఎస్.. భారత టెలికం రంగంపై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చిలో కొత్త యూజర్లను జోడించుకునే విషయంలో ఇతర టెల్కోలు.. ముఖ్యంగా ఎయిర్టెల్ మెరుగైన పనితీరు కనపర్చింది. మార్కెట్ సరళి చూస్తుంటే ఎయిర్టెల్ పటిష్టంగానే ఉన్నట్లు కనిపిస్తోందని యూబీఎస్ వివరించింది. కార్యకలాపాలు విస్తరించడంలోనూ, భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టగలిగే సామర్ధ్యంపరంగానూ చూస్తే దీర్ఘకాలికంగా ఎయిర్టెల్ గెలుపుగుర్రంగా నిలవగలదని పేర్కొంది. రాశి తగ్గినా.. ఫస్టే.. కొత్త యూజర్ల సంఖ్య పెరిగే వేగం మందగించినా... నికరంగా చేరే వారి సంఖ్య విషయంలో జియోనే ముందువరుసలో ఉంది. భారతి ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మార్చిలో జియో ప్రైమ్ ఆఫర్‌ని ప్రకటించినప్పటికీ .. యూజర్ల సంఖ్య అంతక్రితం నెలతో పోలిస్తే భారీగా పెరగకపోవడం ఆశ్చర్యకరమైన విషయమని యూబీఎస్ తన నివేదికలో పేర్కొంది. జియో పెయిడ్ సర్వీసులు ఏప్రిల్ నుంచి ప్రారంభం అయిన నేపథ్యంలో.. కొత్తగా జియో కనెక్షన్ తీసుకున్నవారు, ఇతర టెల్కోల నుంచి జియోకి మారిన వారి గురించి మరింత సమాచారం లభించగలదని యూబీఎస్ వివరించింది. ఇతర టెల్కోల రికవరీ.. జియో ఆఫర్లకు దీటైన ఆఫర్లు ప్రకటించడంతో మార్చిలో ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య నికరంగా 30 లక్షలు, ఐడియా 21 లక్షలు, వొడాఫోన్ 18 లక్షల మేర పెరిగింది. ఫిబ్రవరిలో కొత్తగా ఎయిర్టెల్ కనెక్షన్ తీసుకున్న వారి సంఖ్య 12 లక్షలు, ఐడియా యూజర్లు 12 లక్షలు, వొడాఫోన్ యూజర్ల సంఖ్య 8 లక్షల మేర పెరిగింది. -
ఐఫోన్ 6 కావాలా? 360 గంటలు పనిచెయ్!
జ్యూరిక్‌లో 20 గంటల పనికే... * కొనుగోలు శక్తిపై యూబీఎస్ నివేదిక న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఐఫోన్ 6 కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఆర్జించాలంటే సగటున 360 గంటల సేపు పనిచేయాల్సి ఉంటోంది. అదే జ్యూరిక్‌లో మాత్రం 20 గంటలే సరిపోతోంది. కొనుగోలు శక్తిపై యూబీఎస్ రూపొందించిన (ప్రైసెస్ అండ్ ఎర్నింగ్స్ 2015) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఢిల్లీ వాసులు 360.3 గంటలు, ముంబై వాసులు 349.4 గంటలు పనిచేస్తే యాపిల్ ఐఫోన్ కొనుక్కోగలిగేంత డబ్బును ఆర్జించగలుగుతారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా 71 నగరాల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో కీవ్ (627.2 గంటలు), జకార్తా/నైరోబీ(468 గంటలు) ఉన్నాయి. 353.4 గంటల పనితో కైరో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు, జ్యూరిక్, న్యూయార్క్ వాసులు ఐఫోన్ 6 కొనుగోలు చేసేంత డబ్బు ఆర్జించాలంటే మూడు రోజుల కన్నా తక్కువ వ్యవధి పనిచేస్తే సరిపోతోంది. ఆయా నగరాల్లో ప్రజల కొనుగోలు శక్తిని లెక్కించేందుకు యాపిల్ ఐఫోన్ 6 (16జీబీ మోడల్)ను స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ ప్రామాణికంగా తీసుకుంది. ఇండియాలో ఐఫోన్-6 ధర రూ. 65,000 వరకూ ఉంది. కొనుగోలు శక్తిలో అట్టడుగున ముంబై, ఢిల్లీ.. నివేదిక ప్రకారం నికరంగా గంట వేతనాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, కనిష్టమైన కొనుగోలు శక్తిని సూచిస్తూ అట్టడుగు పది నగరాల జాబితాలో న్యూఢిల్లీ, ముంబై ఉన్నాయి. అయితే ఈ నగరాల్లో పనిగంటలు ఎక్కువగా వున్నాయి. న్యూఢిల్లీలో ఉద్యోగులు ఏటా 2,214 గంటలు, ముంబైలో 2,277 గంటలు సగటున పనిచేస్తున్నారు. ఢిల్లీ వాసులకు సెలవులు ఏటా 26 మాత్రమే ఉండగా, ముంబైలో 21 రోజులు ఉంటున్నాయి. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వర్కర్లు సగటున వారానికి 40 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. ఏటా 4.5 వారాల మేర పెయిడ్ వెకేషన్ ప్రయోజనాలు పొందుతున్నారు. వారానికి అత్యధికంగా 50 పని గంటలు, ఏడాదికి 17 సెలవులతో హాంకాంగ్ పని గంటల విషయంలో టాప్‌లో ఉంది. ఇక పారిస్‌లో ఉద్యోగులు వారానికి కేవలం 35 గంటలు (కొత్త ప్రభుత్వ నిబంధనల ప్రకారం) పనిచేస్తుండగా, 29 రోజుల పెయిడ్ వెకేషన్ ప్రయోజనాలు పొందుతున్నారు.