S & P
-
భారత్ అవుట్‌లుక్.. పాజిటివ్
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు భరోసా ఇస్తూ పది సంవత్సరాల విరామం తర్వాత అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ భారతదేశ సార్వ¿ౌమ (సావరిన్) రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’ నుంచి ‘పాజిటివ్’కు మెరుగుపరిచింది. గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ వ్యయ నిర్వహణ బాగుందని, ద్రవ్య విధానాల్లో సంస్కరణలు విస్తృత స్థాయిలో కొనసాగుతాయని భావిస్తున్నామని ఎస్అండ్పీ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంతా బాగుంటే రెండేళ్లలో సావరిన్ రేటింగ్‌నూ పెంచుతామని పేర్కొంది. కాగా, ఆరు బ్యాంకులు– ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండియాన్ బ్యాంకులు సహా ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్‌లకు సంబంధించీ ఇదే అవుట్‌లుక్ పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. -
2023-24లో వృద్ధి 6 శాతం: ఎస్అండ్పీ
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) 6 శాతానికే పరిమితం అవుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనావేసింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగించడం, అసాధారణ రుతుపవనాల ప్రతి కూలతలు, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలు తమ అంచనాకు కారణంగా తెలిపింది. కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలిక ధోరణి అయినప్పటికీ, వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను 5 నుంచి 5.5 శాతానికి పెంచుతున్నట్లు పేర్కొంది. (ట్రేడింగ్‌పై మోజు, రా..రమ్మంటున్న లాభాలు, డీమ్యాట్ ఖాతాలు జూమ్) అంతర్జాతీయ క్రూడ్ ధరల తీవ్రత దీనికి కారణంగా పేర్కొంది. కాగా, 2024-25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి అంచనాలను 6.9 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఎస్అండ్పీ తెలిపింది. 2022–23 భారత్ వృద్ధి రేటు 7.2 శాతంకావడం ఇక్కడ గమనార్హం. మరోవైపు 2023లో ఆసియా పసిఫిక్ ప్రాంత వృద్ధి అంచనాను 3.9 శాతంగా అంచనావేస్తున్నట్లు ఎస్అండ్పీ తెలిపింది. (ఉద్యోగులకు గుడ్‌న్యూస్..అంచనాలకు మించి భారీగా జీతాల పెంపు!) -
జూలైలో సేవలు సూపర్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం జూలైలో అద్భుత పనితీరు కనబరిచింది. ఇందుకు సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సరీ్వసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ పదమూడేళ్ల గరిష్ట స్థాయి 62.3కు ఎగసింది. జూన్‌లో సూచీ 58.5 వద్ద ఉంది. అయితే సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. ఈ ప్రాతిపదికన సేవల పీఎంఐ గడచిన 24 నెలలుగా అప్‌ట్రెండ్‌లోనే కొనసాగుతోంది. సేవలు–తయారీ కలిపినా స్పీడే... కాగా, సేవలు, తయారీ రంగంతో కూడిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ జూలైలో 61.9కు ఎగసింది. జూన్‌లో ఇది 59.4 వద్ద ఉంది. కాగా, భారత్ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగాన్ని చూస్తే, జూలైలో వరుసగా 25వ నెల వృద్ధి బాటన నిలిచింది. జూలైలో సూచీ 57.7 వద్ద పటిష్టంగా ఉంది. అయితే జూన్‌కన్నా (57.8) స్వల్పంగా తగ్గింది. -
భారత వృద్ధి రేటు అంచనాల్లో కోత, 2022 - 23 లో వృద్ధి 7 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ 2022–23 వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్ (ఎస్అండ్పీ) కుదించింది. క్రితం (సెప్టెంబర్ నాటి) 7.3 శాతం అంచనాలను 7 శాతానికి కుదిస్తున్నట్లు తెలిపింది. అయితే దేశీయంగా పటిష్టంగా ఉన్న డిమాండ్ పరిస్థితులు ఎకానమీని అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకుని నిలబడేలా చేస్తున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా–పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ లూయీస్ క్యూజియెస్ విశ్లేషించారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి సెప్టెంబర్ 6.5 శాతం అంచనాను తాజాగా 6 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2022–23లో సగటును 6.8 శాతంగా ఉంటుందని, 2023 మార్చి నాటికి ఆర్బీఐ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీరేటు (ప్రస్తుతం 5.9 శాతం) 6.25 శాతానికి చేరుతుందని ఎస్అండ్పీ భావిస్తోంది. ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఆర్బీఐ మే నుంచి రెపో రేటును నాలుగు దఫాల్లో 1.9 శాతం పెంచింది. దీనితో ఈ రేటు మూడేళ్ల గరిష్టానికి చేరింది. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం. -
ప్రపంచ బిలియనీర్లకు శనిలా దాపురించిన చైనా కొత్త సంక్షోభం..!
చైనాకు చెందిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎవర్‌గ్రాండే దివాలా తీసేందుకు సిద్ధంగా ఉంది. ఎవర్‌గ్రాండే గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఇది ఒకటి. 2008 అమెరికాలో సుమారు 600 బిలియన్ డాలర్లకు దివాలా తీసిన సంస్థ లేమన్ బ్రదర్స్ మాదిరిగానే ఎవర్ గ్రాండే దివాలా తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లేమన్ బ్రదర్స్ తరహాలో ఎవర్‌గ్రాండే కూడా ప్రపంచంలో రెండో అతిపెద్ద సంక్షోభంగా నిలిచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: బ్యాంకులకు భారీ షాక్ ? అప్పులు చెల్లించలేని స్థితికి చేరిన మరో సంస్థ ! శనిలా దాపురించిన ఎవర్‌గ్రాండే..! తాజాగా ఎవర్‌గ్రాండే సంక్షోభం ప్రపంచంలోని బిలియనీర్లకు శనిలాగా పట్టుకుంది. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులైన ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, వారెన్ బఫెట్ తదితర బిలియనీర్లు ఏకంగా సుమారు 26 బిలియన్ల డాలర్ల(సుమారు రూ.1,92,082 కోట్ల రూపాయలు)పైగా నష్టపోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ నికర విలువ 7.2 బిలియన్ డాలర్లు తగ్గి 198 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సుమారు 5.6 బిలియన్ డాలర్లను కోల్పోగా, జెఫ్ బెజోస్ నికర విలువ 194 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచ బిలియనీర్ల జాబితాలోని మొదటి ఐదు స్థానాల్లోని మరో ముగ్గురు వ్యక్తులు లూయిస్ విట్టన్ ఎస్ఈ గ్రూప్ హెడ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండు బిలియన్ డాలర్లు నష్టపోయి 157 బిలియన్ డాలర్ల వద్ద, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 1.94 బిలియన్ డాలర్లు నష్టపోయి 149 బిలియన్ డాలర్ల వద్ద, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 3.27 బిలియన్ డాలరు నష్టపోయి.. 132 బిలియన్ వద్ద నిలిచారు. వారితో పాటుగా లారీపేజ్-సెర్జే బ్రిన్, స్టీవ్ బామర్, లారీ ఎల్లిసన్, వారన్ బఫెట్ వరుసగా..1.9 , 1.8, 1.9 , బిలియన్ డాలర్లు, 764 మిలియన్ డాలర్లు, 701 మిలియన్ డాలర్లు నష్టపోయారు. వడ్డీలను చెల్లించలేం..ఇన్వెస్టర్లకు పంగనామాలు..! బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో 359 వ స్థానంలో నిలిచిన ఎవర్‌గ్రాండే వ్యవస్థాపకుడు, ఛైర్మన్ హుయ్ కా యాన్ కంపెనీ షేర్లు 11 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో అతని నికర ఆస్తులు విలువ ర్యాంకింగ్‌లో తగ్గుదల కనిపించింది. ఎవర్‌గ్రాండే షేర్లు చివరిగా 2010 మేలో ఈ స్థాయిలో ట్రేడ్ అయ్యాయి. ఎవర్‌గ్రాండే చైనాలో రియల్ఎస్టేట్ రంగంలో అతి పెద్ద దిగ్గజం. సంస్థ జారీ చేసిన బాండ్లపై సెప్టెంబర్ 23నాటికి కట్టాల్సిన 80 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించలేనని ఎవర్‌గ్రాండే ప్రకటించడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు. -
జియోకి ఆ గేమ్నే మార్చేసే సత్తా..!
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో దూసుకుపోతోన్న బిలీనియర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులను ఈ ఏడాదే లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులు ఈ సెగ్మెంట్లో ఉన్న పోటీ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని క్రెడిట్ రేటింగ్ కంపెనీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ చెప్పింది. ఈ కొత్త సర్వీసులతో పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అదనంగా 5 బిలియన్ డాలర్లను చేకూర్చనుందని సీఎల్ఎస్ఏ ఇండియా తెలిపింది. దీంతో రిలయన్స్ ఆదాయాలు ఈబీఐటీడీఏల తర్వాత రూ.40 బిలియన్లుగా ఉండనున్నాయని బ్రోకరేజ్ సంస్థ అంచనావేస్తుంది. గతంలో ఫైబర్-టూ-హోమ్‌లపై టెలికాం కంపెనీల ఎక్కువగా దృష్టిసారించేవి కావని, వైర్లెస్ బిజినెస్‌లపైనే ఎక్కువగా వృద్ధిని నమోదు చేయాలనుకునేవని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మెహుల్ సుఖ్‌వాలా చెప్పారు. కాగ, 2016లో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి జియో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జియో ప్రభావంతో కొన్ని టెలికాం కంపెనీలు మూతపడగా.. మరికొన్ని కంపెనీలు విలీన బాట పట్టాయి. ఉచిత కాలింగ్, ఉచిత డేటా రూపంలో జియో ఈ ధరల యుద్ధానికి తెరతీసింది. 16 నెలల అనంతరం జియో తొలిసారి లాభాలను సైతం నమోదు చేసింది. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల రంగంలోనూ తనదైన సత్తా చాటాలని జియో ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఎంపిక చేసిన అర్బన్ ప్రాంతాల్లో ఉచితంగా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఆఫర్ చేస్తోంది. 100ఎంబీపీఎస్ స్పీడు మొదలుకొని డేటా ప్లాన్లను అందించాలని జియో చూస్తోంది. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తున్న సంస్థల కన్నా తక్కువ ధరలతో ఎక్కువ స్పీడుతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు జియో చెప్పింది. -
భారీగా పతనమైన అమెరికా స్టాక్‌మార్కెట్లు
వాషింగ్టన్ : అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఎస్ అండ్ పీ 500, డో ఇండస్ట్రియల్స్ సూచీలు రెండూ సోమవారం ట్రేడింగ్‌లో 4.0 శాతానికి పైగా నష్టపోయాయి. డో ఏకంగా తన చరిత్రలోనే అతిపెద్ద ఇంట్రాడే పతనాన్ని నమోదుచేసింది. సుమారు 1600 పాయింట్ల మేర కిందకి జారింది. ఆఖరికి 1175 పాయింట్ల నష్టంలో 25వేల కిందకు వచ్చి చేరింది. ఏడాదంతా ఆర్జించిన లాభాలను వాల్‌స్ట్రీట్ కోల్పోయింది. 2011 ఆగస్టు నుంచి అతిపెద్ద సింగిల్-డే నష్టాన్ని ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్, డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ నమోదుచేశాయి. గత ఆరేళ్ల కాలంలో ఎస్ అండ్ పీ 500కి సోమవారమే అతిచెత్త డే. చివరికి 2648.94 వద్ద క్లోజైంది. 0.5 శాతం పైకి ఎగిసిన నాస్డాక్ కాంపోజిట్ కూడా 3.8 శాతం నష్టాలు గడించి 6,967.53 వద్ద స్థిరపడింది. ప్రారంభ లాభాలకు ఆపిల్, అమెజాన్ సహకరించినప్పటికీ.. చివరి వరకు స్టాక్‌మార్కెట్లను ఈ షేర్లు కాపాడలేకపోయాయి. అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించడంతో మార్కెట్లో ఈ పరిస్థితి నెలకొంది. అంతేకాక యూరో జోన్ రుణ సంక్షోభంలోకి కూరుకుపోయింది. గత మూడు నుంచి నాలుగేళ్లుగా మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న చాలా మంది ఇన్వెస్టర్లు అంతకముందు ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని లాస్‌వేగాస్‌లోని బ్రైట్ ట్రేడింగ్ ప్రొప్రైటరీ ట్రేడర్ డెనిస్ డిక్ చెప్పారు. మార్కెట్లో తీవ్రంగా అమ్మకాల ఒత్తిడి నెలకొందని విశ్లేషకులు చెప్పారు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పన్ను కోతలు, బలమైన కార్పొరేట్ ఫలితాలు మార్కెట్ వాల్యుయేషన్‌కు మద్దతు ఇస్తాయని బుల్ విశ్లేషకులు చెబుతున్నారు. బుల్ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా... ఇటీవల ఏళ్లలో సెంట్రల్ బ్యాంకు తన సరళతరమైన విధానాలను విత్‌డ్రా చేస్తుందని, బాండు దిగుబడి పెరుగుతుందని దీంతో మార్కెట్లు మరింత పతనం కావొచ్చని బేర్ విశ్లేషకులంటున్నారు. సోమవారం మార్కెట్లో ఫైనాన్సియల్, హెల్త్‌కేర్, ఇండస్ట్రియల్ సెక్టార్లు ఎక్కువగా నష్టపోయాయి. దిగ్గజ 11 ఎస్ అండ్ పీ రంగాలు కనీసం 1.7 శాతం మేర కిందకి పడిపోయాయి. 30 బ్లూచిప్ డో ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్ కూడా నెగిటివ్‌గా ముగిశాయి. వాల్‌స్ట్రీట్ మార్కెట్ల ప్రభావం ఇటు ఆసియన్ మార్కెట్లపైనా పడుతోంది. -
మోడీకి షాకిచ్చిన ఎస్అండ్పీ
సాక్షి, న్యూఢిల్లీ : మోడీ సంస్కరణలకు మెచ్చిన మూడీస్ భారత క్రెడిట్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయగా.. మరో రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ మాత్రం మోడీకి షాకిచ్చింది. భారత సావరిన్ రేటింగ్‌ను ఎస్అండ్పీ అప్‌గ్రేడ్ చేయలేదు. భారత సావరిన్ రేటింగ్‌ను స్థిరంగా 'బీబీబీ-'గానే ఉంచింది. అదేవిధంగా భారత్‌పై తన అవుట్‌లుక్‌ను కూడా స్థిరంగానే ఉంచుతున్నట్టు తెలిసింది. మూడీస్ అప్‌గ్రేడ్ అనంతరం ఎస్అండ్పీ కూడా భారత రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేస్తుందని అందరూ భావించారు. కానీ తాజాగా ఎస్అండ్పీ మాత్రం తన రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయకుండా, ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్‌తో వరుసగా ఏడు ట్రేడింగ్ సెషన్ల నుంచి సెన్సెక్స్ లాభపడుతూ వస్తోంది. భారత్‌లో అత్యధిక మొత్తంలో ద్రవ్యలోటు, తక్కువ తలసరి ఆదాయం, ప్రభుత్వం రుణాలు బలహీనమైనవిగా ఎస్అండ్పీ పేర్కొంది. రెండు క్వార్టర్ల నుంచి అంచనావేసిన దాని కంటే తక్కువ వృద్ధి నమోదైనప్పటికీ, 2018-20లో భారత ఆర్థికవ్యవస్థ వేగవంతంగా పరుగులు తీయగలదని ఈ రేటింగ్ సంస్థ అంచనావేస్తోంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వులు పెరుగుతూ ఉంటాయని తెలిపింది. అయితే తక్కువ తలసరి ఆదాయం, అధిక మొత్తంలో ద్రవ్యలోటు, ప్రభుత్వంపై ఉన్న రుణ భారం దేశీయ సావరిన్ క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రభావం చూపుతున్నట్టు ఎస్అండ్పీ వివరించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత తొలిసారి మూడీస్ భారత సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచింది. రేటింగ్ అవుట్‌లుక్‌ను కూడా స్టేబుల్ నుంచి పాజిటివ్‌కు మార్చింది. -
మూడీస్ భేష్...ఎస్అండ్పీ పూర్
సాక్షి,న్యూఢిల్లీ: భారత రేటింగ్‌ను మూడీస్ అప్‌గ్రేడ్ చేసిన కొద్దిసేపటికే మరో రేటింగ్ ఏజెన్సీ ప్రతికూలంగా స్పందించింది. భారత ద్రవ్య పరిస్థితి బలహీనంగా ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్అండ్పీ) వ్యాఖ్యానించింది. మూడీ రేటింగ్‌పై స్పందించేందుకు ఎస్అండ్పీ నిరాకరించింది.మరోవైపు మూడీస్ భారత రేటింగ్‌ను పెంచడాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా స్వాగతించారు. మోదీ ప్రభుత్వ సంస్కరణలు వాణిజ్య వాతావరణాన్ని మెరుగపరిచి, ఉత్పాదకతను పెంచాయని, ఫలితంగా విదేశీ పెట్టుబడుల వెల్లువతో దేశం వృద్ధి బాటలో పయనిస్తోందని అమిత్ షా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇటీవల ప్రపంచ బ్యాంక్ సులభతర వాణిజ్యం ర్యాంక్, పీఈడబ్లూ్య అథ్యయనం, తాజాగా మూడీస్ రేటింగ్ నిదర్శనాలని అన్నారు. జీఎస్టీ అమలునూ మూడీస్ ప్రశంసించడాన్ని ఈ సందర్భంగా అమిత్ షా ప్రస్తావించారు. ఇక మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్ మంచి నిర్ణయమని, ఇది ఎప్పుడో వెలువడాల్సిందని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. -
ప్రభుత్వ బ్యాంకులకు రూ.1.9 లక్షల కోట్లు కావాలి
♦ 2019 మార్చి నాటికి దీన్ని సమకూర్చాల్సిందే... ♦ బ్యాంకుల మూలధన అవసరాలపై ఎస్ అండ్ పీ అంచనా న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకులకు 2019 మార్చి నాటికి రూ.1.9 లక్షల కోట్ల (29.6 బిలియన్ డాలర్లు) తాజా మూలధనం అవసరమవుతుందని గ్లోబల్ రేటింగ్ సంస్థ– ఎస్ అండ్ పీ అంచనావేసింది. లేదంటే నిరర్థక ఆస్తులకు (ఎన్పీఏ) కేటాయింపులు కష్టతరం అవుతాయని తన తాజా నివేదికలో వివరించింది. మూలధన అవసరాలకు సంబంధించి అంతర్జాతీయ బాసెల్–3 ప్రమాణాల అమలుకూ తాజా మూలధనం అవసరమని విశ్లేషించింది. సంస్థ క్రెడిట్ అనలిస్ట్ గీతా చౌ రూపొందించిన నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ తాజా మూలధనం కల్పించలేని పక్షంలో బలహీనంగా ఉన్న లాభదాయకత... బ్యాంకులపై ఒత్తిళ్లను పెంచుతుంది. ♦ ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ మూలధన అవసరాలను నెరవేర్చుకోడానికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ♦ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించటంలో భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రధానంగా 3 సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఒకటి ఈక్విటీ విలువలు కనిష్ట స్థాయిలో ఉండటం కాగా రెండోది ఎక్కువ సంఖ్యలో బ్యాంకులుండటం. నియమ నిబంధనల చట్రం మూడవది. అదే సమయంలో అడిషనల్ టైర్–1 క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్ల జారీ ద్వారా నిధుల సమీకరణ కూడా వాటికి కష్టం కావచ్చు. ఈ ఇన్‌స్ట్రుమెంట్లపై డిఫాల్డ్ రిస్క్ అధికంగా ఉండటమే దీనికి కారణం. ♦ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మద్దతు విషయంలో ప్రభుత్వ నిబద్ధత సుస్పష్టంగా కనబడుతోంది. ♦ దేశంలో పటిష్ట బ్యాంకింగ్‌కు సానుకూల వాతావరణం కనబడుతోంది. బలహీన ప్రభుత్వ రంగ బ్యాంకులు క్రమంగా తమ మార్కెట్ షేర్‌ను లాభదాయక ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు అలాగే నాన్–బ్యాంక్ ఫైనాన్స్ సంస్థలకు కోల్పోయే వీలుంది. -
దేశీయ డిమాండ్, ఎగుమతులే చోదకం
భారత్‌పై ఎస్ అండ్ పీ నివేదిక న్యూఢిల్లీ: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, దేశీయ విధానపరమైన మార్పుల ప్రభావాన్ని అధిగమించేందుకు కంపెనీలకు బలమైన స్థానిక డిమాండ్, ఎగుమతుల పరంగా ధరలతో పోటీపడే సామర్థ్యం అక్కరకు వస్తాయని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. ఆర్థికంగా వేగవంతమైన వృద్ధి, సంస్కరణలు భారత్‌ను ఓ చక్కని మార్కెట్‌గా మార్చాయని ‘ఇండియా కార్పొరేట్ అవుట్‌లుక్ 2017’ నివేదికలో ఎస్అండ్పీ పేర్కొంది. భారత్‌లో ఆరోగ్యవంతమైన ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్ల తగ్గుముఖం సైతం కంపెనీలకు లబ్ధి కలిగిస్తాయని తెలిపింది. ‘‘అంతర్జాతీయ కంపెనీలతో పోలిస్తే భారత కంపెనీలు మంచి స్థితిలో ఉన్నాయి. మూలధన వ్యయ నిర్వహణ సామర్థ్యం, కొనసాగుతున్న సంస్థాగత సంస్కరణలను వేగంగా సర్దుబాటు చేసుకోగల సామర్థ్యాలు భారత కంపెనీలకు ఉండడం కలసి వస్తుంది’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ అభిషేక్ దంగా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డీమోనిటైజేషన్ వల్ల స్వల్ప కాలం పాటు ఆదాయ వృద్ధికి సమస్య ఉందని, జీఎస్టీని అమల్లోకి తేవాలన్న ప్రతిపాదన వల్ల 2018లో ఇదే విధమైన సవాలు ఎదురవుతుందని తెలిపింది. -
అన్నీ మంచి ఆర్థిక శకునములే..!
భారత్‌పై అంతర్జాతీయ క్రెడిట్, ఫైనాన్షియల్ దిగ్గజ సంస్థల అంచనాలు న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై భరోసాను కల్పించే అంచనాలను అంతర్జాతీయ క్రెడిట్, ఫైనాన్షియల్ దిగ్గజ సంస్థలు వెలువరించాయి. వచ్చే కొద్ది సంవత్సరాలూ 8 శాతం వృద్ధి రేటు ఖాయమని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ తన ‘ఏపీఏసీ ఎకనమిక్ స్నాప్సార్ట్స్-సెప్టెంబర్ 2016’ నివేదికలో పేర్కొంది. ఇక బ్యాంకింగ్ మొండిబకాయిల భారం తగ్గుతున్నట్లు మూడీస్ అభిప్రాయపడింది. ఆర్థిక సేవల ప్రపంచ దిగ్గజ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తన తాజా నివేదికలో భారత్ క్రమ వృద్ధి బాటలో ఉందని వివరించింది. ఆయా సంస్థల అభిప్రాయాలు క్లుప్తంగా... సంస్కరణల అమలు బలం: ఎస్ అండ్ పీ భారత్‌కు పటిష్ట దేశీయ వినియోగం పెద్ద బలం. రానున్న కొద్ది సంవత్సరాలు 8% వృద్ధి సాధిస్తుందని అంచనావేస్తున్నాం. ముఖ్యంగా భారత్ చేపట్టిన వ్యవస్థాగత సంస్కరణలు కూడా వృద్ధి పథానికి బలం చేకూర్చుతున్నాయి. ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఇక్కడ కీలకమైనది. ఇక ద్రవ్యోల్బణంపై ఒక కన్నేసి ఉంచాలి. ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ధరల ఒడిదుడుకులు ఉండే ఇతర వస్తువుల విషయంలో ఆర్బీఐ అప్రమత్తత అవసరం. కాగా, 2016-17కు సంబంధించి ఆర్బీఐ వృద్ధి రేటు అంచనా 7.6%. క్రమ వృద్ధి: మోర్గాన్ స్టాన్లీ భారత్‌సహా పలు వర్థమాన దేశాల్లో క్రమ వృద్ధి నమోదవుతుంది. ఈ ఏడాది వర్థమాన దేశాల వృద్ధి రేటు 4 % కాగా వచ్చే ఏడాది ఆయా దేశాల వృద్ధి రేటు 4.7%గా ఉంటుందని భావిస్తున్నాం. వృద్ధి విషయంలో ప్రస్తుత స్థాయిల నుంచి భారత్, ఇండోనేషియాలు మరింత పురోగతి సాధించవచ్చు. అయితే చైనా, కొరియాల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. బ్యాంకింగ్ బెటర్: మూడీస్ బ్యాంకింగ్ మొండిబకాయిల తీవ్రత తగ్గుతోంది. వచ్చే 12 నెలల నుంచి 18 నెలల మధ్య బ్యాంకింగ్ అవుట్‌లుక్ స్థిరపడవచ్చు. ఇటీవలి రుణ నాణ్యత గుర్తింపు (ఏక్యూఆర్), తగిన ప్రొవిజనింగ్ కేటాయింపులు కీలకమైనవి. 11 బ్యాంకుల అవుట్‌లుక్ పాజిటివ్‌గా ఉంది. మున్ముందు నికర వడ్డీ మార్జిన్లు (ఎన్ఐఎం)లు స్థిరపడే వీలుంది. అయితే రానున్న మూడేళ్లలో భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం అవసరం ఉంటుంది. రేటింగ్ (ప్రస్తుతం చెత్త శ్రేణికి ఒక అంచె ఎగువన ‘బీఏఏ3’) పెంపునకు సంబంధించి సెప్టెంబర్ 21న మూడీస్ ప్రతినిధులు, ఆర్థిక వ్యవహారాల శాఖ ఉన్నత స్థాయి అధికారుల మధ్య సమావేశం వార్తల నేపథ్యంలో ఈ నివేదిక వెలువడింది. -
బ్యాంకులకు మరింత మూలధనం కావాల్సిందే: ఎస్అండ్పీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ తాజా మూలధన కేటాయింపులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు తక్షణం ప్రయోజనాన్ని కల్పిస్తాయన్న అంశంలో సందేహం లేదని రేటింగ్ ఏజెన్సీ స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) పేర్కొంది. అయితే ఈ నిధులు దీర్ఘకాలానికి పూర్తి స్థాయిలో సరిపోవని పేర్కొంది. రానున్న నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల తాజా మూలధన కేటాయింపులు జరపనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.25,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే అందించనున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుత మూలధన కేటాయింపులు దీర్ఘకాలానికి, దేశ వృద్ధి అవసరాలకు సరిపోవని విశ్లేషించిన ఎస్అండ్పీ, బలహీన బ్యాంకులు మొండిబకాయిలు ఇబ్బంది కరమేనని విశ్లేషించింది. -
మరో 12 నెలలు...పెట్టుబడులకు గడ్డుకాలమే!
న్యూఢిల్లీ: భారత్‌లో కంపెనీల పెట్టుబడి వ్యయాలు జోరందుకోవడానికి(రికవరీ) మరో 12 నెలల వ్యవధి పట్టొచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) అభిప్రాయపడింది. ప్రధానంగా ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు వేచిచూసే ధోరణితో ఉండటమే దీనికి కారణమని తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ‘రానున్న 2015-16 ఆర్థిక సంవత్సరంలో కూడా పెట్టుబడి వ్యయాల క్షీణత కొనసాగనుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అంత్యంత ప్రకాశవంతమైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తున్నప్పటికీ ఈ ప్రతికూల ధోరణి కనబడుతోంది. దేశీ కార్పొరేట్లు కొత్త ప్రాజెక్టులకు ముందుకురావడం లేదు. ముందుగా తమ రుణ భారాన్ని తగ్గించుకొని.. లాభాలను పెంచుకోవడంపై అధికంగా దృష్టిపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భార త్లో పెట్టుబడుల రికవరీకి ఏడాది కాలం పడుతుం దని భావిస్తున్నాం’ అని ఎస్అండ్పీ వివరించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అగ్రగామి 10 కంపెనీల పెట్టుబడి వ్యయాలు రూ.3.7 లక్షల గరిష్టస్థాయిని తాకాయని నివేదిక పేర్కొంది. తర్వాత రెండేళ్లలో ఈ మొత్తం భారీగా తగ్గుముఖం పడుతోందని తెలిపింది. ‘మోదీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశావహంగానే ఉన్నప్పటికీ.. భారతీయ కార్పొరేట్ల పెట్టుబడులు 2015-16లో 10-15 శాతం మేర క్షీణించనున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ, ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు ఫలితాల కోసం కార్పొరేట్లు వేచిచూస్తున్నారు. గతేడాది చివరివరకూ కూడా దేశంలో వడ్డీరేట్లు అధికంగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా కూడా ఆర్థికపరమైన అనిశ్చితి నెలకొంది. ఇవన్నీ కూడా పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయి’ అని ఎస్అండ్పీ అభిప్రాయపడింది. అయితే, విస్తృత స్థాయిలో పెట్టుబడి వ్యయాల రికవరీకి ముందు ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)లు, కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పెట్టుబడులు కొంత చేదోడుగా నిలువనున్నాయని ఎస్అండ్పీ అంచనా వేసింది.