బ్యాంకులకు మరింత మూలధనం కావాల్సిందే: ఎస్‌అండ్‌పీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ తాజా మూలధన కేటాయింపులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు తక్షణం ప్రయోజనాన్ని కల్పిస్తాయన్న అంశంలో సందేహం లేదని రేటింగ్ ఏజెన్సీ స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) పేర్కొంది. అయితే ఈ నిధులు దీర్ఘకాలానికి పూర్తి స్థాయిలో సరిపోవని పేర్కొంది. రానున్న నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల తాజా మూలధన కేటాయింపులు జరపనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.25,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే అందించనున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుత మూలధన కేటాయింపులు దీర్ఘకాలానికి, దేశ వృద్ధి అవసరాలకు సరిపోవని విశ్లేషించిన ఎస్‌అండ్‌పీ, బలహీన బ్యాంకులు మొండిబకాయిలు ఇబ్బంది కరమేనని విశ్లేషించింది.