సాక్షి,న్యూఢిల్లీ: భారత రేటింగ్‌ను మూడీస్ అప్‌గ్రేడ్ చేసిన కొద్దిసేపటికే మరో రేటింగ్ ఏజెన్సీ ప్రతికూలంగా స్పందించింది. భారత ద్రవ్య పరిస్థితి బలహీనంగా ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్‌అండ్‌పీ) వ్యాఖ్యానించింది. మూడీ రేటింగ్‌పై స్పందించేందుకు ఎస్‌అండ్‌పీ నిరాకరించింది.మరోవైపు మూడీస్ భారత రేటింగ్‌ను పెంచడాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా స్వాగతించారు.
మోదీ ప్రభుత్వ సంస్కరణలు వాణిజ్య వాతావరణాన్ని మెరుగపరిచి, ఉత్పాదకతను పెంచాయని, ఫలితంగా విదేశీ పెట్టుబడుల వెల్లువతో దేశం వృద్ధి బాటలో పయనిస్తోందని అమిత్ షా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇటీవల ప్రపంచ బ్యాంక్ సులభతర వాణిజ్యం ర్యాంక్, పీఈడబ్లూ‍్య అథ్యయనం, తాజాగా మూడీస్ రేటింగ్ నిదర్శనాలని అన్నారు.
జీఎస్‌టీ అమలునూ మూడీస్ ప్రశంసించడాన్ని ఈ సందర్భంగా అమిత్ షా ప్రస్తావించారు. ఇక మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్ మంచి నిర్ణయమని, ఇది ఎప్పుడో వెలువడాల్సిందని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment