
ఏప్రిల్‌లో 60.8కి డౌన్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటినెల ఏప్రిల్‌లో నెమ్మదించింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మార్చిలో 61.2 వద్ద ఉంటే, ఏప్రిల్‌లో 60.8కి తగ్గింది. అయితే ఈ స్థాయి కూడా 14 ఏళ్ల గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటం గమనార్హం.
కాగా, ఈ సూచీ 50పై ఉంటే దానిని వృద్ధి బాటగా, దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణించడం గమనార్హం. మరోవైపు తయారీ, సేవలు కలగలిపిన హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ మార్చిలో 61.8 ఉంటే, ఏప్రిల్‌లో 61.5కు తగ్గడం మరో అంశం. అయితే ఇది కూడా 14 సంవత్సరాల గరిష్ట స్థాయే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment