న్యూఢిల్లీ: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్‌ఎన్‌ఎల్‌ఐసీ)లో వాటాల కొనుగోలు కోసం తాజాగా ఆదిత్య బిర్లా క్యాపిటల్ కూడా బరిలోకి దిగింది. రిలయన్స్ క్యాపిటల్‌కు (ఆర్‌సీఎల్) ఉన్న 51 శాతం వాటా కొనుగోలు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్‌ఎన్‌ఎల్‌ఐసీలో రిలయన్స్ క్యాపిటల్‌కు 51 శాతం, జపాన్‌కి చెందిన నిప్పన్ లైఫ్‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి. ఇరు సంస్థలు కలిసి దీన్ని జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి.
భారీగా పేరుకుపోయిన రుణాల చెల్లింపులో పదే పదే డిఫాల్ట్ అవుతుండటంతో ఆర్‌సీఎల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ గతేడాది నవంబర్ 29న రద్దు చేసింది. దివాలా చట్టం కింద చర్యలకు సంబంధించి వై నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్‌సీఎల్ విక్రయం కోసం అడ్మినిస్ట్రేటర్ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను ఆహ్వానించారు. మొత్తం 14 బిడ్లు వచ్చాయి. పూర్తి కంపెనీని కొనేందుకు ఆరు కంపెనీలు ముందుకు రాగా, ఆర్‌సీఎల్‌లో భాగంగా ఉన్న వివిధ సంస్థలను వేర్వేరుగా కొనేందుకు మిగతా వారు బిడ్లు వేశారు. బిడ్డింగ్ గడువు ముగిసే నాటికి ఆర్‌ఎన్‌ఎల్‌ఐసీ కొనుగోలు కోసం ఒక్క బిడ్ కూడా రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment