
సాక్షి, హైదరాబాద్: ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ తాజాగా ఛోటీ సిప్‌ను (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ప్రారంభించింది. డెట్, సెక్టోరల్, థీమ్యాటిక్‌లాంటి కొన్ని ఫండ్స్‌కి తప్ప మిగతా అన్ని రకాల స్కీములకు ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. నెలవారీగా రూ. 250 నుంచి ఈ సిప్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
కనీసం 60 వాయిదాలు కట్టాల్సి ఉంటుందని సంస్థ ఎండీ ఎ. బాలసుబ్రమణియన్ తెలిపారు. క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టే ధోరణిని అలవర్చుకునేందుకు ఈ విధానం తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇందులో, ముందస్తుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment