Purchase of shares
-
షీలా ఫోమ్ చేతికి కర్లాన్
న్యూఢిల్లీ: స్లీప్‌వెల్ పేరిట మ్యాట్రెస్‌లను తయారు చేసే షీలా ఫోమ్ తాజాగా కర్లాన్ ఎంటర్‌ప్రైజెస్‌లో 94.66% వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.2,035 కోట్లు వెచి్చంచనుంది. అలాగే, ఆన్లైన్ ఫరి్నచర్ బ్రాండ్ ఫర్లెంకో మాతృ సంస్థ హౌస్ ఆఫ్ కిరాయా ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 300 కోట్లతో 35% వాటాలు కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించిన రెండు ప్రతిపాదనలకు జూలై 17న జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు షీలా ఫోమ్ తెలిపింది. ‘రూ. 2,150 కోట్ల ఈక్విటీ వేల్యుయేషన్‌తో కేఈఎల్ (కర్లాన్ ఎంటర్ప్రైజెస్)లో 94.66% వాటాను కొనుగోలు చేయబోతున్నాం‘ అని వెల్లడించింది. మ్యాట్రెస్లు, ఫోమ్ ఆధారిత ఉత్పత్తుల విభాగంలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని షీలా ఫోమ్ తెలిపింది. కేఈఎల్లో 94.66% వాటా కొనుగోలు వ్యయం రూ.2,035 కోట్లుగా ఉండనున్నట్లు పేర్కొంది. దేశీయంగా ఆధునిక మ్యాట్రెస్‌ల విభాగంలో రెండింటి సంయుక్త మార్కెట్ వాటా దాదాపు 21 శాతంగా ఉంటుందని వివరించింది. దక్షిణాదికి చెందిన బిజినెస్ గ్రూప్ పాయ్ కుటుంబం 1962లో కర్ణాటక కాయిర్ ప్రోడక్ట్స్ (ప్రస్తుతం కేఈఎల్)ను ఏర్పాటు చేసింది. 1995లో దాని పేరు కర్లాన్ అని మారగా 2011లో కేఈఎల్ పేరిట అనుబంధ సంస్థ ఏర్పాటైంది. అటు పైన 2014లో వ్యాపారం కేఈఎల్కు బదిలీ అయింది. కంపెనీ ప్రస్తుతం ప్రధానంగా కర్లాన్ బ్రాండ్ కింద ఫోమ్, కాయిర్ ఆధారిత మ్యాట్రెస్లు మొదలైనవి తయారు చేస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.809 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. ఫరి్నచర్ రెంటల్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఫర్లెంకోలో పెట్టుబడులు ఉపయోగపడగలవని షీలా ఫోమ్ వివరించింది. -
Hindenburg-Adani: జేపీసీ కంటే కోర్టు కమిటీ అత్యుత్తమం
ముంబై: కుబేరుడు గౌతమ్ అదానీ షేర్ల కొనుగోలు వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలంటూ కొద్దిరోజులుగా విపక్ష పార్టీలు ఉమ్మడిగా డిమాండ్ చేస్తున్న వేళ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భిన్నమైన వాదన చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘విపక్షాల జేపీసీ డిమాండ్‌తో నేను పూర్తిగా విభేదించడం లేదు. కానీ జేపీసీ కంటే సర్వోన్నత న్యాయస్థానం కమిటీ ఈ వివాదాన్ని మరింత అర్థవంతంగా, ప్రభావవంతంగా పరిష్కరించగలదని భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ‘గతంలో కొన్ని జేపీసీలకు అధ్యక్షత వహించిన అనుభవం నాకుంది. అదానీ–హిండెన్‌బర్గ్ ఉదంతంలో ఒకవేళ జేపీసీ వేస్తే అందులో 21 మంది సభ్యులుంటారు. పార్లమెంట్లో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా 15 సభ్యత్వాలు అధికార పార్టీకే దక్కుతాయి. ఇక మిగిలిన ఆరుగురే విపక్షాలకు చెందిన వారు ఉంటారు. ఇది ప్యానెల్ పనితీరుపై అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది. జేపీసీ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించట్లేను. దాని కంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల ప్యానెల్ ప్రభావవంతంగా పనిచేయగలదు. నిర్ణీత కాలావధిలో నివేదించగలదు’ అని పవార్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవల ఒక జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ సంస్థకు పవార్ మద్దతిస్తూ హిండెన్‌బర్గ్‌ను విమర్శించడం గమనార్హం. ‘అదానీ గ్రూప్‌పై అమెరికా కేంద్రంగా పనిచేసే చరిత్రలేని ఏదో సంస్థ మాట్లాడితే దానికి ఎంత విలువ ఇవ్వాలో మనం నిర్ణయించుకోవాలి. ఇలాంటి ప్రకటనలు, నివేదికలు గతంలోనూ పలు సందర్భాల్లో వచ్చాయి. ఇలాంటి వాటి కారణంగా తాజాగా పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీనికి అనవసర ప్రాధాన్యం ఇచ్చాం. నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతు సమస్యలు ఇలా దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటిని వదిలేసి ఇలా అప్రధాన అంశాలను పట్టించుకుంటే ఇవి దేశ ఆర్థికవ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయి. వీటిని చూస్తుంటే కావాలనే ఏదో లక్ష్యంగా చేసుకుని ఈ తరహా అంశాలను లేవనెత్తుతున్నారు అనిపిస్తోంది ’ అని పవార్ వ్యాఖ్యానించారు. జేపీసీ పట్ల పవార్ విముఖత వ్యక్తంచేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ‘ ఈ అంశంలో 19 భావసారూప్య పార్టీలు ఒకే డిమాండ్‌తో ముందుకెళ్తున్నాయి. అయితే ఎన్సీపీకి సొంత అభిప్రాయాలు ఉండొచ్చు’ అని అన్నారు. పవార్ అభిప్రాయం మహారాష్ట్రలో, దేశంలో విపక్షాల ఐక్యతకు బీటలు పడేలా చేయలేదని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పష్టంచేశారు. -
మరింత పారదర్శకంగా బైబ్యాక్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షేర్ల బైబ్యాక్ విధానాన్ని క్రమబద్ధీకరించేందుకు నడుం బిగించింది. ఇందుకు తాజా ప్రతిపాదనలతో చర్చా పత్రాన్ని విడుదల చేసింది. తద్వారా బైబ్యాక్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా, వాటాదారులకు మద్దతిచ్చే బాటలో చేపట్టే చర్యలకు తెరతీసింది. వీటి ప్రకారం గరిష్ట పరిమితిలో కోతతోపాటు, బైబ్యాక్ పూర్తిచేసే గడువును భారీగా తగ్గించనుంది. బైబ్యాక్‌లో షేర్ల కొనుగోలు వివరాలపై స్పష్టత కోసం స్టాక్ ఎక్సే్ఛంజీలలో ప్రత్యేక విండోను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్ ద్వారా కంపెనీ చెల్లించిన మూలధనంలో 15 శాతానికి మించకుండా ఫ్రీ రిజర్వుల ద్వారా బైబ్యాక్‌ను చేపట్టేందుకు వీలుంది. వచ్చే ఏప్రిల్ నుంచి 10 శాతానికి కుదిస్తోంది. ఆపై ఏడాది 5 శాతానికి, తదుపరి పరిమితిని పూర్తిగా ఎత్తివేయనుంది. ఇక టెండర్ మార్గంలో బైబ్యాక్‌కు ప్రస్తుతమున్న 25 శాతం పరిమితిని 40 శాతానికి పెంచనుంది. ప్రస్తుతం బైబ్యాక్ పూర్తికి ఆరు నెలల గడువు లభిస్తోంది. అయితే ఈ గడువులో కృత్రిమంగా డిమాండును సృష్టించడం ద్వారా షేర్ల ధరలను ప్రభావితం చేసేందుకు అవకాశముంటున్నదని సెబీ పేర్కొంది. దీంతో గడువులో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజా ప్రతిపాదనలపై సెబీ డిసెంబర్ 1వరకూ పబ్లిక్ నుంచి సూచనలు కోరుతోంది. 22 రోజులకు పరిమితం తాజా ప్రతిపాదనల ప్రకారం 2023 ఏప్రిల్ నుంచి బైబ్యాక్ గడువును 66 పనిదినాలకు కుదించనుంది. ఆపై 2024 ఏప్రిల్ నుంచి 22 రోజులకు తగ్గించనుంది. ఈ బాటలో 2025 ఏప్రిల్ నుంచి ఓపెన్ మార్కెట్ విధానానికి స్వస్తి పలకనుంది. స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా బైబ్యాక్‌ను చేపడితే ఇందుకు కేటాయించిన నిధులను 75 శాతం వరకూ వినియోగించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి 50 శాతంగా ఉంది. అంతేకాకుండా గడువులో సగం రోజులు ముగిసేసరికి కనీసం 40 శాతం సొమ్మును షేర్ల కొనుగోలుకి వెచ్చించవలసి ఉంటుంది. యాక్టివ్‌గా ట్రేడయ్యే షేర్లలోనే బైబ్యాక్‌ను చేపట్టవలసి ఉంటుంది. కంపెనీ నికరంగా రుణరహితమై ఉంటే ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు బైబ్యాక్ చేపట్టేందుకు అనుమతిస్తారు. అయితే ఇందుకు ఆరు నెలల కనీస గడువును పాటించడంతోపాటు టెండర్ మార్గాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. ఇక బుక్ బిల్డింగ్ పద్ధతిలో ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు ప్రమోటర్లు, సహచరులు పాల్గొనేందుకు అనుమతించరు. బైబ్యాక్‌పై పన్ను విధింపును కంపెనీకి బదులుగా సంబంధిత వాటాదారులకు బదిలీ చేయవలసిందిగా ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం బైబ్యాక్‌లో పాలుపంచుకోని వాటాదారులపై పన్ను భారం పడుతున్నందున తాజా సవరణలకు సెబీ ప్రతిపాదించింది. -
సెలూన్ వ్యాపారంలోకి రిలయన్స్!
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇప్పుడు సెలూన్ వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తోంది. గ్రూప్ సంస్థ, దేశీయంగా అతి పెద్ద రిటైలింగ్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ తాజాగా చెన్నైకి చెందిన నేచురల్స్ సెలూన్ అండ్ స్పాలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి నేచురల్స్ ప్రమోటర్లతో చర్చలు జరుపుతోంది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించబోతున్నది మాత్రం వెల్లడి కాలేదు. తమ కంపెనీ చరిత్రలోనే ఇది ‘అతి పెద్ద మలుపు‘ అంటూ నేచురల్స్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు సీకే కుమరవేల్ .. లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ‘ఒక బహుళజాతి దిగ్గజం సెలూన్ పరిశ్రమలోకి ప్రవేశించబోతోంది’ అని పేర్కొన్నారు. ‘నేచురల్స్‌లో రిలయన్స్ రిటైల్ 49 శాతం వాటా కొనబోతోంది. దీనితో సెలూన్ల సంఖ్య మొత్తం 700 నుండి 4–5 రెట్లు వృద్ధి చెందనుంది. రాబోయే రోజుల్లో నేచురల్స్‌లో గణనీయమైన మార్పులు చూడబోతున్నాం’ అని కుమరవేల్ పోస్ట్ చేశారు. నేచురల్స్ కార్యకలాపాల విస్తరణలో సహాయపడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, నేచురల్స్‌లో వాటాల కొనుగోలు వార్తలపై స్పందించిన రిలయన్స్ ప్రతినిధి .. తాము ఎప్పటికప్పుడు వివిధ అవకాశాలను పరిశీలిస్తూ ఉంటామని పేర్కొన్నారు. ఈ డీల్ పూర్తయితే లాక్మే బ్రాండ్ పేరిట సెలూన్ సెగ్మెంట్లో కార్యకలాపాలు సాగిస్తున్న హిందుస్తాన్ యూనిలీవర్ వంటి దిగ్గజాలతో రిలయన్స్ రిటైల్ పోటీపడనుంది. 2000ల తొలినాళ్లలో కార్యకలాపాలు ప్రారంభించిన నేచురల్స్‌కు దేశవ్యాప్తంగా 700 సెలూన్లు ఉన్నాయి. 2025 నాటికి వీటి సంఖ్యను 3,000కు పెంచుకోవాలని యోచిస్తోంది. ఇక రిలయన్స్ గ్రూప్‌లో అన్ని రిటైల్ కంపెనీలకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) హోల్డింగ్ కంపెనీగా ఉంది. దీనికి రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్ఆర్వీఎల్ రూ. 2 లక్షల కోట్ల టర్నోవర్ (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) నమోదు చేసింది. రిలయన్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కేవీ కామత్ ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్‌ను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ప్రకటించింది. 74 సంవత్సరాల కామత్‌ను ఐదేళ్ల కాలానికి నియమించినట్లు సంస్థ స్టాక్ ఎక్సే్ఛంజ్‌కి సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపింది. 1971లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్, పద్మభూషణ్ కామత్‌కు బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల పదవీ విరమణ చేసిన రిలయన్స్ బోర్డులోని ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లలో ఒకరి స్థానంలో కామత్ నియమితులయ్యారు. -
రిలయన్స్ నిప్పన్ లైఫ్‌లో వాటాలపై ఆదిత్య బిర్లా గ్రూప్ ఆసక్తి
న్యూఢిల్లీ: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్ఎన్ఎల్ఐసీ)లో వాటాల కొనుగోలు కోసం తాజాగా ఆదిత్య బిర్లా క్యాపిటల్ కూడా బరిలోకి దిగింది. రిలయన్స్ క్యాపిటల్‌కు (ఆర్సీఎల్) ఉన్న 51 శాతం వాటా కొనుగోలు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్ఎన్ఎల్ఐసీలో రిలయన్స్ క్యాపిటల్‌కు 51 శాతం, జపాన్‌కి చెందిన నిప్పన్ లైఫ్‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి. ఇరు సంస్థలు కలిసి దీన్ని జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి. భారీగా పేరుకుపోయిన రుణాల చెల్లింపులో పదే పదే డిఫాల్ట్ అవుతుండటంతో ఆర్సీఎల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ గతేడాది నవంబర్ 29న రద్దు చేసింది. దివాలా చట్టం కింద చర్యలకు సంబంధించి వై నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్సీఎల్ విక్రయం కోసం అడ్మినిస్ట్రేటర్ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను ఆహ్వానించారు. మొత్తం 14 బిడ్లు వచ్చాయి. పూర్తి కంపెనీని కొనేందుకు ఆరు కంపెనీలు ముందుకు రాగా, ఆర్‌సీఎల్‌లో భాగంగా ఉన్న వివిధ సంస్థలను వేర్వేరుగా కొనేందుకు మిగతా వారు బిడ్లు వేశారు. బిడ్డింగ్ గడువు ముగిసే నాటికి ఆర్ఎన్ఎల్ఐసీ కొనుగోలు కోసం ఒక్క బిడ్ కూడా రాలేదు. -
జియో.. సిక్సర్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా అబుధాబికి చెందిన సార్వభౌమ సంస్థ ముబాదలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (ముబాదలా) జియోలో 1.85 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 9,094 కోట్లు. గడిచిన సుమారు నెలన్నర వ్యవధిలో జియోకి ఇది ఆరో డీల్. ఇప్పటిదాకా కంపెనీలోకి దాదాపు రూ. 92,202 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ‘జియో ప్లాట్‌ఫామ్స్‌లో ముబాదలా రూ. 9,093.60 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. దీని ప్రకారం కంపెనీ విలువ రూ. 5.16 లక్షల కోట్లుగా ఉంటుంది‘ అని సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదలా ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేశాయి. టెలికం సేవలు అందించే జియో ఇన్ఫోకామ్ సహా డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్.. జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జియోకు 38.8 కోట్ల పైగా యూజర్లు ఉన్నారు. వాటాలు ఇలా.. ఈ ఏడాది ఏప్రిల్ 22న జియోలో అమెరికాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 9.99% వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 43,574 కోట్లు. ఆ తర్వాత కొద్ది రోజులకే సిల్వర్ లేక్ రూ. 5,666 కోట్లతో 1.15% వాటాలు దక్కించుకుంది. మే 8న అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ రూ. 11,367 కోట్లు వెచ్చించి 2.32 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇక, మే 17న అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ 1.34 శాతం వాటాలను రూ. 6,598 కోట్లకు దక్కించుకుంది. అటుపైన మరో ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్ కూడా రూ. 11,367 కోట్లతో 2.32 శాతం వాటాలు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే వివిధ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ జరుపుతోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నిర్దేశించుకున్న గడువులోగానే లక్ష్యాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. చేతిలో ఉన్న నగదు నిల్వలను సర్దుబాటు చేసిన తర్వాత ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రిలయన్స్ నికర రుణభారం రూ. 1,61,035 కోట్లుగా ఉంది. పటిష్టమైన ముబాదలా పోర్ట్‌ఫోలియో.. . వినూత్న వ్యాపారాలకు తోడ్పాటు అందించేందుకు ముబాదలా 2017లో కొత్తగా వెంచర్స్ విభాగం ప్రారంభించింది. ఇది ప్రస్తుతం అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్య దేశాల్లో పలు వెంచర్ ఫండ్స్‌ను నిర్వహిస్తోంది. ముబాదలా పోర్ట్‌ఫోలియో లో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్స్, మెటల్స్, మైనింగ్, ఫార్మా, మెడికల్ టెక్, పునరుత్పాదక విద్యుత్ తదితర సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి. సిల్వర్ లేక్ మరో రూ.4,546 కోట్లు జియో ప్లాట్‌ఫామ్స్‌లో సిల్వర్ లేక్ కొత్తగా రూ. 4,547 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ సంస్థ జియోలో ఇప్పటికే రూ. 5,656 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అంతా కలిపి 2.08% వాటా కోసం సిల్వర్ లేక్ సుమారు రూ. 10,203 కోట్లు వెచ్చించినట్లవుతుంది. తాజా పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్స్ సుమారు 19.90% వాటాలు విక్రయించి రూ. 92,202.15 కోట్లు సమీకరించినట్లవుతుంది. టెక్నాలజీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు 1999లో ఏర్పాటైన సిల్వర్ లేక్ ఇప్పటిదాకా ట్విటర్, ఎయిర్‌బీఎన్‌బీ, ఆలీబాబా వంటి దిగ్గజ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. అబుధాబితో నాకు దీర్ఘకాలంగా సంబంధాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలకు యూఏఈని మరింతగా అనుసంధానించడంలో ముబాదలా ప్రభావవంతంగా పనిచేయడం నాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థల వృద్ధిలో కీలకపాత్ర పోషించిన ముబాదలా అనుభవం మాకు ఉపయోగపడుతుంది. – ముకేశ్ అంబానీ కీలక సవాళ్లను అధిగమించే దిశగా కొంగొత్త టెక్నాలజీలను తయారు చేస్తున్న అధిక వృద్ధి స్థాయి కంపెనీలలో పెట్టుబడులు పెట్టేందుకు మేము కట్టుబడి ఉన్నాం. క్రియాశీలకంగా కలిసి పనిచేస్తాం. – ముబాదలా గ్రూప్ సీఈవో ఖల్దూన్ అల్ ముబారక్ -
రిలయన్స్ కార్ట్‌లో నెట్‌మెడ్స్!
బెంగళూరు: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార విస్తరణ ప్రణాళికలు మరింత జోరందుకున్నాయి. ఇటీవలే జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాలను ప్రీమియం రేటుకు విక్రయించిన రిలయన్స్ ఈసారి ఆన్లైన్ ఫార్మా సేవల సంస్థ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు 150 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,150 కోట్లు) ఉండవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చివరి విడత నిధుల సమీకరణ సమయంలో నెట్‌మెడ్స్‌కి లభించిన వేల్యుయేషన్ కన్నా కాస్త ప్రీమియం రేటు చెల్లించవచ్చని పేర్కొన్నాయి. దీంతో పాటు కార్యకలాపాల విస్తరణకు మరిన్ని నిధులు కూడా సమకూర్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. అనుబంధ సంస్థ ద్వారా రిలయన్స్ ఈ డీల్ పూర్తి చేయొచ్చని వివరించాయి. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడానికి ముందు నుంచే రిలయన్స్, నెట్‌మెడ్స్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు రిలయన్స్, నెట్‌మెడ్ వర్గాలు నిరాకరించాయి. కొత్త వ్యాపార అవకాశాల మదింపు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, మార్కెట్ ఊహాగానాలపై వ్యాఖ్యానించలేమని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై వ్యాఖ్యానించలేమని నెట్‌మెడ్స్ వ్యవస్థాపకుడు ప్రదీప్ దాధా పేర్కొన్నారు. కస్టమర్లకు నిత్యావసరాలు మొదలైన వాటి సరఫరా కోసం మాత్రమే ప్రస్తుతం రిలయన్స్ రిటైల్‌తో జట్టు కట్టినట్లు వివరించారు. జోరుగా విస్తరణ .. ఆన్లైన్–టు–ఆఫ్‌లైన్ (ఓ2ఓ) వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నెట్‌మెడ్స్‌తో డీల్ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యాపారాల విస్తరణలో భాగంగా ఇటీవలే రిలయన్స్ రిటైల్, వాట్సాప్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. రిలయన్స్ టెలికం, డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాట్సాప్ మాతృసంస్థ ఫేస్బుక్ 9.99 శాతం వాటాలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 5.7 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. ఇక కంపెనీల కొనుగోళ్లపైనా రిలయన్స్ భారీగానే వెచ్చిస్తోంది. కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం 2017 నుంచి ప్రధానంగా జియో, రిలయన్స్ రిటైల్ వ్యాపార విభాగాల విస్తరణకు దాదాపు 3 బిలియన్ డాలర్ల దాకా వెచ్చించింది. సావన్, ఎంబైబ్, ఫైండ్, గ్రాబ్, హ్యాప్టిక్, రెవరీ, నౌఫ్లోట్స్ వంటి సంస్థలను కొనుగోలు చేసింది. ఫార్మాలో రిలయన్స్‌కు రెండో డీల్.. నెట్‌మెడ్స్‌ను కొనుగోలు చేస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి.. ఫార్మా రంగంలో ఇది రెండో డీల్ కానుంది. గతేడాదే బెంగళూరుకు చెందిన సి–స్క్వేర్ ఇన్ఫో సొల్యూషన్స్‌లో రిలయన్స్ 82% వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 82 కోట్లు వెచ్చించింది. ఫార్మా రంగంలోని డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు, సేల్స్ సిబ్బందికి అవసరమైన సాఫ్ట్వేర్ ను ఈ సంస్థ రూపొంది స్తుంది. అపోలో ఫార్మసీ, యాడ్‌కాక్ ఇన్‌గ్రామ్ వంటి కంపెనీలు దీనికి క్లయింట్లు. నెట్‌మెడ్స్ కథ ఇదీ.. ప్రదీప్ దాధా 2015లో నెట్‌మెడ్స్‌ను ప్రారంభించారు. ఆయన కుటుంబం.. సన్ ఫార్మాస్యూటికల్స్ ఔషధాలను తొలినాళ్లలో పంపిణీ చేసేది. ఆ తర్వాత ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని సన్ ఫార్మా కొనుగోలు చేసింది. నెట్‌మెడ్స్ ఇప్పటిదాకా మూడు విడతల్లో 100 మిలియన్ డాలర్ల దాకా నిధులు సమీకరించింది. దాధాల ఫ్యామిలీ ఆఫీస్‌తో పాటు హెల్త్‌కేర్ రంగ ఇన్వెస్టరు ఆర్బిమెడ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎంఏపీఈ అడ్వైజరీ, సిస్టెమా ఆసియా ఫండ్, సింగపూర్‌కి చెందిన దౌన్ పెన్ కంబోడియా గ్రూప్ మొదలైనవి నెట్మెడ్లో ఇన్వెస్టర్లు. కొత్తగా మరో 12 గిడ్డంగుల ఏర్పాటు ద్వారా మొత్తం వేర్‌హౌస్‌లను 26కి పెంచుకోనున్నట్లు నెట్‌మెడ్స్ గతేడాది ప్రకటించింది. కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ నివేదిక ప్రకారం ప్రస్తుతం నెట్‌మెడ్స్ .. నెలవారీ లావాదేవీల యూజర్ల సంఖ్య సుమారు ఆరు లక్షలుగా ఉంది. కంపెనీ ఆదాయాల్లో దాదాపు 90 శాతం వాటా .. ప్రిస్క్రిప్షన్ ఔషధాలు, ఓవర్ ది కౌంటర్ ఔషధాల విక్రయాలదే ఉంటోంది. ఈ రంగంలో 1ఎంజీ, మెడ్‌లైఫ్, ఫార్మ్ఈజీ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీవ్ర అనారోగ్యాలతో తరచూ ఔషధాలు తప్పనిసరిగా కొనుగోలు చేసే వర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఈ–ఫార్మా @ 6 బిలియన్ డాలర్లు కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ నివేదిక ప్రకారం ఈ–ఫార్మా పరిశ్రమ (కన్సల్టెన్సీ, డయాగ్నాస్టిక్స్ కూడా కలిపి) ప్రస్తుతం 1.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. వచ్చే అయిదేళ్లలో ఇది 16 బిలియన్ డాలర్ల దాకా చేరొచ్చని అంచనా. ఇప్పటికే దాదాపు నలభై లక్షల పైగా కుటుంబాలు ఆన్లైన్లో ఔషధాలను కొనుగోలు చేస్తున్నాయి. సాధారణంగా ఈ–ఫార్మా ప్లాట్‌ఫామ్ లపై సగటు కొనుగోలు లావాదేవీ విలువ రూ.1,400–1,700 స్థాయి లో ఉంటోంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో లబ్ది పొందిన అతి కొద్ది రంగాల్లో ఈ–ఫార్మా పరిశ్రమ కూడా ఒకటి. -
‘యస్’బీఐ..!
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను ఒడ్డున పడేసేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టింది. యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆసక్తి చూపుతున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంకు పునర్నిర్మాణ స్కీమ్ 2020 ముసాయిదాను ఆర్బీఐ రూపొందించింది. దీని ప్రకారం.. వ్యూహాత్మక ఇన్వెస్టర్లు యస్ బ్యాంక్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన రోజు నుంచి మూడేళ్ల దాకా వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోకూడదు. యస్ బ్యాంక్ షేరు ఒక్కింటికి రూ. 10 చొప్పున లెక్కించి వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యస్ బ్యాంకు షేరు ముఖ విలువ రూ. 2తో పోలిస్తే ఇది రూ. 8 అధికం. ఇక నిర్దేశిత తేదీ నుంచి బ్యాంక్ అధీకృత మూలధనాన్ని కూడా రూ. 5,000 కోట్లకు, ఈక్విటీ షేర్ల సంఖ్యను 2,400 కోట్లకు సవరించనున్నారు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు మార్చి 9 దాకా అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మొండిబాకీలు, నష్టాలు, నిధుల కొరత సమస్యలతో సతమతమవుతున్న యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఏప్రిల్ 3 దాకా నెల రోజులపాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవధిలో డిపాజిట్‌దారులు రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. అటు బ్యాంకు.. ఇతరత్రా రుణాలు ఇవ్వడానికి గానీ పెట్టుబడులు పెట్టడానికిగానీ లేదు. మారటోరియం గడువులోగానే బ్యాంకును పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఆర్బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఆర్బీఐ చర్యలు తీసుకుందని, ఖాతాదారుల సొమ్ముకు ఢోకా లేదని భరోసా నిచ్చారు. ఖాతాదారుల సొమ్ము భద్రం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యస్ బ్యాంక్‌లో గవర్నెన్స్ లోపాలు, నిబంధనలను పాటించకపోవడం, రిస్కుతో కూడుకున్న రుణాలివ్వడం వంటి ధోరణులను 2017 నుంచి రిజర్వ్ బ్యాంక్ గమనిస్తూనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ మేనేజ్మెంట్ను కూడా మార్చాలని ఆర్బీఐ ఆదేశించినట్లు తెలిపారు. యస్ బ్యాంక్‌లో సమస్యలు, వాటికి బాధ్యులెవరన్న అంశాలన్నింటిపైనా విచారణ జరపాలంటూ ఆర్బీఐకి ప్రభుత్వం సూచించినట్లు ఆమె వివరించారు. ‘ఖాతాదారుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్బీఐతో పాటు పరిస్థితులను నేను కూడా సమీక్షిస్తున్నాను. డిపాజిటర్ల సొమ్ము భద్రంగానే ఉంటుంది‘ అని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. నిర్దిష్ట 30 రోజుల్లోగానే పునర్నిర్మాణ స్కీమ్ అమల్లోకి రాగలదని, ఇన్వెస్ట్ చేసేందుకు ఎస్బీఐ ముందుకొచ్చిందని మంత్రి చెప్పారు. ఏడాది పాటు యస్ బ్యాంక్ సిబ్బంది ఉద్యోగాలు, జీతభత్యాలకు ఎలాంటి సమస్య ఉండబోదని భరోసానిచ్చారు. అంబానీ గ్రూప్, ఎస్సెల్, ఐఎల్ఎఫ్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్, వొడాఫోన్ వంటి సంస్థలకు ఇచ్చిన రుణాలు యస్ బ్యాంక్‌కు గుదిబండగా మారాయన్నారు. ఆందోళనలో కస్టమర్లు.. విత్డ్రాయల్స్పై ఆంక్షలతో యస్ బ్యాంక్ ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. వార్త తెలిసినప్పట్నుంచీ ఏటీఎంలు, పలు శాఖల్లో కస్టమర్లు బారులు తీరారు. తమ డిపాజిట్ల పరిస్థితి గురించి వాకబు చేస్తూ కనిపించారు. నెట్ బ్యాంకింగ్ పనిచేయకపోవడం, ఏటీఎంలలో డబ్బు లేకపోవడం తదితర ఫిర్యాదులతో బ్యాంక్ హెల్ప్‌లైన్ హోరెత్తింది. కొందరు ట్విట్టర్ వంటి వేదికల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆర్బీఐ ఆంక్షలు విధించడానికి రెండు రోజుల ముందునుంచే బ్యాంకు చిక్కుల్లో ఉన్న సంకేతాలు కనిపించాయని కొందరు ఖాతాదారులు చెప్పారు. బ్యాంకింగ్ సమస్యలపై మార్చి 3, 4 తారీఖుల నుంచే పలువురు కస్టమర్లు యస్ బ్యాంక్ ట్విట్టర్ హ్యాండిల్లో ఫిర్యాదులు చే శారు. షేరు 85 శాతం క్రాష్.. యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్‌ను రద్దు చేయడం, విత్ డ్రాయల్స్‌పై ఆంక్షల నేపథ్యంలో శుక్రవారం యస్ బ్యాంక్ షేర్ కుప్పకూలింది. శుక్రవారం ఒకానొక దశలో 85 శాతం దిగజారి రూ.5.55ను తాకింది. చివరకు 55 శాతం నష్టంతో రూ.16.55 వద్ద ముగిసింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి యస్ బ్యాంక్ షేర్ రూ.47గా ఉంది. షేర్ ధర భారీగా నష్టపోవడంతో ఈ షేర్లో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీగా నష్టపోయారు. ఎల్ఐసీ మార్క్–టు–మార్కెట్ నష్టాలు రూ.617కోట్ల మేర ఉండగా, మ్యూచువల్ ఫండ్స్ మార్క్–టు–మార్కెట్నష్టాలు కూడా ఇదే రేంజ్లో ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,162 కోట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు రూ.3,300 కోట్లు నష్టపోయారు. ఇక హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ నష్టాలు రూ.239 కోట్లుగా ఉన్నాయి. త్వరలో పరిష్కారమవుతుంది: ఎస్బీఐ చీఫ్ రజనీష్ కుమార్ ‘యస్ బ్యాంక్ సమస్య కేవలం ఆ బ్యాంకుకే పరిమితమైన అంశం. ఇది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ సమస్య కాదు. యస్ బ్యాంక్ సంక్షోభానికి చాలా తొందర్లోనే పరిష్కారం లభిస్తుంది‘ అని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. బ్యాంకులో వాటాలు కొనుగోలు చేసే పక్షంలో తమకు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. సత్వర చర్యలు తీసుకుంటున్నాం: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దేశీ ఆర్థిక రంగంలో స్థిరత్వానికి సమస్యలు వాటిల్లకుండా యస్ బ్యాంక్ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. బ్యాంకును పునరుద్ధరించడానికి అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. 30 రోజుల మారటోరియం అన్నది గరిష్ట పరిమితి అని.. ఈలోగానే పరిష్కార ప్రణాళిక అమల్లోకి రాగలదని దాస్ ధీమా వ్యక్తం చేశారు. ఖాతాదారుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామన్నారు. స్వయంగా పరిస్థితి చక్కదిద్దుకునేందుకు బ్యాంకుకు తగినంత సమయం ఇచ్చినా ఫలితం కనిపించకపోవడంతోనే ఆర్బీఐ ప్రస్తుత చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పరిశ్రమల సమాఖ్య అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ఇది తొందరపాటుతనం అని కొందరు .. చాలా ఆలస్యం చేశారని మరికొందరు వ్యాఖ్యానించవచ్చని, కానీ ఆర్బీఐ తగిన సమయంలోనే చర్యలు తీసుకుందని దాస్ చెప్పారు. డిజిటల్ పార్ట్నర్స్కు సెగ.. యస్ బ్యాంక్‌పై ఆంక్షలతో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, దానిపై ఆధారపడిన ఫిన్టñ క్ సంస్థలకు సమస్యలొచ్చి పడ్డాయి. ప్రధానంగా ఫోన్‌పే వంటి డిజిటల్ పేమెంట్స్ సంస్థల లావాదేవీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. అటు యస్ బ్యాంక్ ఖాతాల్లోకి యూపీఐ ప్లాట్‌ఫాం ద్వారా చేసే చెల్లింపులు సహా పలు లావాదేవీల సెటిల్మెంట్లపై పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఆంక్ష లు విధించింది. ఇక, యస్ బ్యాంక్ బాండ్లలో వివిధ స్కీమ్‌ల ద్వారా చేసిన పెట్టుబడుల విలువను సున్నా స్థాయికి తగ్గించేసినట్లు నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ తెలిపింది. మరోవైపు, యస్ బ్యాంక్‌లో ఖాతాలున్న షేర్, బాండ్ హోల్డర్ల నిధులు చిక్కుబడిపోకుండా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వారి షేర్లు, బాండ్లు మొదలైనవి విక్రయించిన పక్షంలో వచ్చే నిధులను వేరే బ్యాంకులో జమ చేసుకునే వీలు కల్పిస్తూ సత్వర చర్యలు తీసుకున్నాయి. పూరీ జగన్నాథునికీ కష్టాలు... యస్ బ్యాంకులో పూరీ జగన్నా«థ స్వామి ఆలయానికి సంబంధించి రూ. 545 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడంతో ఈ డిపాజిట్ల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ప్రైవేట్ బ్యాంకులో జగన్నాథుడి నిధులను డిపాజిట్ చేయడం అనైతికమని, ఈ విషయంలో శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, గుడి మేనేజింగ్ కమిటీపై పోలీసులకు ఫిర్యాదు చేశామని జగన్నాథ సేన కన్వీనర్ ప్రియదర్శి పట్నాయక్ చెప్పారు. అయితే, అధికారులు చర్యలేమీ ఇంతవరకూ తీసుకోలేదన్నారు. మరోవైపు, ఈ మొత్తాన్ని మార్చి నెలాఖరులోనే ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులోకి మళ్లించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుందని.. ఈలోగానే తాజా పరిణామం చోటు చేసుకుందని ఒడిశా న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా తెలిపారు. -
సాఫ్ట్‌బ్యాంక్‌లో భారతీయుడి భారీ పెట్టుబడులు..
- రూ.3,148 కోట్లు ఇన్వెస్ట్ చేసిన నికేశ్ అరోరా - సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్, సీఓఓగా విధులు టోక్యో: నికేశ్ అరోరా...గూగుల్ సంస్థలో అత్యున్నత స్థాయిలో పనిచేసి గత ఏడాది బయటకు వచ్చిన ఈయన 48 కోట్ల డాలర్ల(రూ.3,148 కోట్ల) విలువైన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ షేర్లను కొనుగోలు చేశారు. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌కు ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భారత్‌లో జన్మించిన అరోరా కొనుగోలును డెరైక్టర్ల బోర్డ్ ఆమోదించిందని సాఫ్ట్‌బ్యాంక్ సంస్థ టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్కు బుధవారం వెల్లడించింది. ఐఐటీ-వారణాసిలో పట్టభద్రుడైన అరోరా అమెరికా యూనివర్శిటీలో ఎంబీఏ చదివారు. పదేళ్లపాటు గూగుల్‌లో పనిచేసిన ఆయన గత ఏడాది జూలైలో సాఫ్ట్‌బ్యాంక్‌లో చేరారు. అరోరాకు సాఫ్ట్‌బ్యాంక్ 13.5 కోట్ల డాలర్ల వార్షిక వేతనాన్ని ఇస్తోందని సమచారం. దీంతో ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న మూడో ఉన్నతస్థాయి వ్యక్తిగా ఆయన నిలిచారు. నికేశ్ అరోరా గొప్ప బిజినెస్ లీడర్ అని, సహృదయుడని సాఫ్ట్‌బ్యాంక్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మసయోచి సన్ వ్యాఖ్యానించారు. కాగా, మసయోచి స్థానంలో నికేశ్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. -
టోరెంట్ ఫార్మా చేతికి జిగ్ ఫార్మా
న్యూఢిల్లీ: ఎన్కోర్ గ్రూప్‌లో భాగమైన జిగ్ ఫార్మాను కొనుగోలు చేసేందుకు ఫార్మా దిగ్గజం టోరెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం ఎంత వెచ్చిస్తున్నదీ వెల్లడి కాలేదు. జిగ్ ఫార్మాలో 100 శాతం వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టోరెంట్ ఫార్మా బీఎస్ఈకి వెల్లడించింది. చర్మ సంబంధ ఆయింట్మెంట్లు, జెల్స్, లోషన్లు మొదలైన ఉత్పత్తులను జిగ్ ఫార్మా తయారు చేస్తోంది. అమెరికా, యూరప్ మొదలైన మార్కెట్లలో డె ర్మటాలాజికల్ ఉత్పత్తుల విభాగంలో స్థానం పటిష్టం చేసుకునేందుకు జిగ్ కొనుగోలు ఉపయోగపడగలదని టోరెంట్ పేర్కొంది. ఇరు కంపెనీల బోర్డులు దీనికి ఆమోదం తెలిపినట్లు వివరించింది.