ఆదిత్య బిర్లా గ్రూప్ మాజీ హెచ్‌ఆర్ హెడ్, ప్రస్తుత లోక్‌సభ ఎన్నిలల్లో కటక్ నుంచి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంతృప్త్ మిశ్రా సుమారు రూ. 461 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా అభ్యర్థుల్లో ఈయనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు.
సంతృప్త్ మిశ్రా ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత గత ఫిబ్రవరిలో బీజేడీలో చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఆయన ఆదాయపు పన్ను రిటర్న్స్ 2021-22లో రూ. 76.23 కోట్లు, 2022-23లో రూ. 66.21 కోట్లుగా ఉన్నాయి. నామినేషన్ దాఖలు సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో రూ.408 కోట్ల విలువైన చరాస్తులు, రూ.4 కోట్ల బ్యాంకు డిపాజిట్లు సహా రూ.53 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు.
మ్యూచువల్ ఫండ్స్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, బాండ్‌లు, షేర్లలో మిశ్రా పెట్టుబడి మొత్తం ప్రస్తుత విలువ దాదాపు రూ. 308 కోట్లు. రూ.2.3 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన కార్లు ఆయనకున్నాయి. ఇక మిశ్రా భార్య చరాస్తుల విలువ రూ. 11.72 కోట్లు అని నివేదిక పేర్కొంది. ఒడిశాలో ఎటువంటి స్థిరాస్తి లేనప్పటికీ, మిశ్రాకు మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో వ్యవసాయ భూమి, హైదరాబాద్, ముంబైలలో ఫ్లాట్‌లు ఉన్నాయి.
కాగా ఒడిశాలో 21 లోక్‌స్థానాలు, 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నింటికీ ఏక కాలంలో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సంతృప్త్ మిశ్రా పోటీ చేసే కటక్ లోక్‌సభ స్థానానికి మే 25న ఆరో దశలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment