
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్ చీఫ్ , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హింజీలీ స్థానంతో పాటు బలాంగీర్ జిల్లాలోని కాంటాబాంజీ నియోజక వర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు.
నవీన్ పట్నాయక్ గతంలోనూ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ఆయన హింజీలీతో పాటు బిజేపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే తర్వాత బిజేపూర్‌కు రాజీనామా చేసిన ఆయన హింజిలీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు.
ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేడీ ఇప్పటివరకు 126 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంకా 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒడిశాలో 147 నియోజకవర్గాలు, 21 లోక్‌సభ స్థానాలకు గాను నాలుగు దశల్లో మే 13, 20, 25, జూన్1 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment