CM Naveen Patnaik
-
Odisha: రెండు చోట్ల పోటీ చేస్తున్న సీఎం
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్ చీఫ్ , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హింజీలీ స్థానంతో పాటు బలాంగీర్ జిల్లాలోని కాంటాబాంజీ నియోజక వర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. నవీన్ పట్నాయక్ గతంలోనూ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ఆయన హింజీలీతో పాటు బిజేపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే తర్వాత బిజేపూర్‌కు రాజీనామా చేసిన ఆయన హింజిలీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేడీ ఇప్పటివరకు 126 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంకా 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒడిశాలో 147 నియోజకవర్గాలు, 21 లోక్‌సభ స్థానాలకు గాను నాలుగు దశల్లో మే 13, 20, 25, జూన్1 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
దేశంలో మూడో ధనిక ముఖ్యమంత్రిగా రికార్డు
భువనేశ్వర్: దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులలో రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ మూడో అత్యంత ధనవంతుడని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం నవీన్ రూ.63.87 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఇందులో రూ. 23,26,555 విలువైన చరాస్తులు, రూ.63,64,15,261ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. స్వీయ ఆదాయం రూ.21.17 లక్షలు కాగా, అతని అప్పులు రూ.15 లక్షలని ఏడీఆర్ తెలిపింది. గత సంవత్సరం చర, స్థిరాస్తులకు సంబంధించి పట్నాయక్ ప్రకటించిన ప్రకారం 2021 డిసెంబర్ 31నాటికి ముఖ్యమంత్రి వద్ద రూ.94.41 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అతనికి భారతీయ స్టేట్‌బ్యాంకు, జన్‌పథ్, న్యూఢిల్లీ బ్రాంచ్, పార్లమెంట్ హౌస్ బ్రాంచ్, భువనేశ్వర్ శాఖల్లో మూడు ఖాతాలు ఉన్నాయి. వీటితో పాటు మరో మూడు ఉమ్మడి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. గంజాం జిల్లా హింజిలికాట్ కాలేజ్ క్యాంపస్ బ్రాంచ్‌లో 2, బర్గడ్ జిల్లా పదంపూర్ బ్రాంచ్‌లో ఒక ఖాతా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. సాధారణ ఎన్నికల ప్రయోజనాల కోసం వర్తించిన ఖాతాలుగా నివేదిక తెలియజేసింది. ముఖ్యమంత్రుల సగటు ఆస్తులు: రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తుల విలువ రూ.33.96 కోట్లు. కోటీశ్వరుల ముఖ్యమంత్రులు: 30 రాష్ట్ర శాసనసభలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులలో 29 మంది(97%) కోటీశ్వరులు. దేశవ్యాప్తంగా 9మంది ముఖ్యమంత్రులు రూ.కోటి, అంతకంటే ఎక్కువ అప్పులు ప్రకటించారు. చరాస్తులు.. నవీన్ పట్నాయక్ చరాస్తులలో పోస్టాఫీస్ సేవింగ్స్ రూ.5,033, ఫిక్స్డ్ డిపాజిట్ రూ.1.11 కోట్లు, భారతీయ రిజర్వు బ్యాంకు బాండ్లు రూ.9 కోట్లు, పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ రూ.కోటి 34 లక్షల విలువైన ఆభరణాలు, రూ.6,434 విలువ చేసే అంబాసిడర్ కారు(1980 మోడల్) ఉన్నాయి. స్థిరాస్తులు.. దాదాపు రూ.9,52,46,190ల విలువైన నవీన్ నివాస్‌లో మూడింట రెండు వంతుల వాటా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్, న్యూఢిల్లీలో రూ.43,36,18,000 విలువైన ఆస్తిలో 50శాతం వాటా ఉంది. ఈ రెండు వారసత్వ ఆస్తులుగా పేర్కొన్నారు. రూ.510 కోట్ల సమగ్ర ఆస్తులతో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, రూ.163 కోట్లకు పైగా ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రెండో స్థానంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. -
Odisha Cabinet Reshuffle: ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా
భువనేశ్వర్: ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా చేసింది. సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలతో మంత్రులంతా రాజీనామా లేఖలు సమర్పించారు. స్పీకర్ సూర్యనారాయణ పాత్రో కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి ఇటీవలే మూడేళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మంత్రులంతా రాజీనామా చేయాలని ఆదేశించారు. రేపు(ఆదివారం) రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణా స్వీకారం జరగనుందని సంబంధింత వర్గాలు వెల్లడించాయి. చదవండి: ‘మీ సీనియర్ నాయకుడి అవినీతిని బట్టబయలు చేస్తాం’ -
Odisha Tour: ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం జగన్ భేటీ
-
బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం: నవీన్
భువనేశ్వర్: లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాలు ప్రతిపాదిస్తున్న మహాకూటమిలో చేరబోమని బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమాన దూరం పాటిస్తామని బుధవారం తేల్చిచెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏకం కావాలని బీజేపీయేతర పక్షాలు ప్రయత్నిస్తున్న సమయంలో నవీన్ పట్నాయక్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మహాకూటమిలో చేరికపై నిర్ణయానికి కొంత సమయం కావాలని ఆయన ఢిల్లీలో చెప్పిన మరుసటి రోజే ఈ విధంగా స్పందించడం గమనార్హం. బీజేడీకి కాంగ్రెస్‌తో రహస్య అవగాహన ఉందని బీజేపీ ఆరోపించగా, బీజేడీ ఎప్పటికీ బీజేపీ పక్షమేనని కాంగ్రెస్ పేర్కొంది. -
కాంగ్రెస్ నేతలకు బీజేడీ తీర్థం
పర్లాకిమిడి : భువనేశ్వర్‌లోని నవీన్ పట్నాయక్ నివాసంలో జరిగిన ‘మిశ్రణ పర్వ్’ కార్యక్రమంలో భాగంగా గజపతి జిల్లా నుంచి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచ్‌లు, సమితి సభ్యులు, వార్డు మెంబర్లు ముఖ్యమంత్రి సమక్షంలో బీజేడీ పార్టీలో చేరినట్టు మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గజపతి జిల్లాలోని కాశీనగర్, గుసాని సమితులకు చెందిన కాంగ్రెస్ నేతలు బీజేడీలో చేరుతున్నారని తెలిపారు. దీంతో పర్లాకిమిడి నియోజకవర్గంలో బీజేడీ పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు. మిశ్రణ పర్వ్‌లో జిల్లా బీజేడీ పరిశీలకుడు గోపాల్పూర్ ఎమ్మెల్మే డాక్టర్ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి, బరంపురం ఎంపీ సిద్ధాంత మహాపాత్రో, కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర సాహు తదితరులు పాల్గొన్నారు. -
68 పంచాయతీలకు రూ.16.60 కోట్లు
భువనేశ్వర్ : గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. ‘మన పల్లె–మన వికాసం’ పథకంలో భాగంగా 3 జిల్లాల్లోని 68 పంచాయతీలకు రూ.16.60 కోట్లు మంజూరుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ‘మన పల్లె–మన వికాసం’ కార్యక్రమంపై నిర్వహించారు. సమితి స్థాయిలో ఈ కార్యక్రమం నిధుల్ని మంజూరు చేయడం ఇటీవల ప్రారంభించారు. బాలాసోర్, ఢెంకనాల్, భద్రక్ జిల్లా గ్రామ పంచాయతీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. ఒక్కో పంచాయతీలో గ్రామీణ అభివృద్ధి పరిస్థితులను ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం 3 జిల్లాల్లోని 68 పంచాయతీలకు రూ.16.60 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. బాలాసోర్ జిల్లా నీలగిరి సమితి, ఢెంకనాల్ జిల్లా కొంకొడాహడో, భద్రక్ జిల్లా భొండారిపొఖొరి çసమితులకు ఈ నిధులు మంజూరయ్యాయి. బాలాసోర్ జిల్లా నీలగిరి సమితిలోని 25 పంచాయతీల్లో 302 ప్రాజెక్టులకు రూ. 6.25 కోట్లు, డెంకనాల్ జిల్లా కొంకొడాహడో సమితి 21 పంచాయతీల్లో 152 ప్రాజెక్టులకు రూ.4.85 కోట్లు, భద్రక్ జిల్లా భొండారిపొఖోరి సమితి 22 పంచాయతీల్లోని 222 ప్రాజెక్టులకు రూ.5.50 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. -
బీజేపీయే మహా అడ్డు
భువనేశ్వర్ : రాష్ట్రంలో మహా నది నీటి ప్రవాహాన్ని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోపించారు. మహా నది జలాల పంపిణీ వివాదంపై బిజూ జనతా దళ్(బీజేడీ) రాష్ట్ర శాఖ కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక వర్కు షాపు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో తీవ్ర కలకలం రేకెత్తిస్తున్న మహా నది జలాల వివాదంపై పార్టీ శ్రేణుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో మహా నది జలాలు అడుగంటి పోతున్నాయన్నారు. ఛత్తీస్గడ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాలిత ప్రభుత్వం మహా నది ఎగువ భాగంలో అక్రమ కట్టడాలు చేపట్టి రాష్ట్రంలో లోతట్టు ప్రాంతాలకు మహా నది జలాల ప్రవాహాన్ని అడ్డుకుంటుందని బాహాటంగా ఆరోపించారు. ఈ వివాదం పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థించిన పెడ చెవిన పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు గుర్తు చేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గరకు వెళ్లి మహా నది జలాల పంపిణీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మహా నది ఇరు వైపులా విశేష సంఖ్యలో మొక్కలు నాటి హరిత పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హరిత మహా నది కార్యక్రమాన్ని చేపట్టినట్టు ప్రకటించారు. ప్రాంతీయ పార్టీగా కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టే అవకాశం లేనందున రాష్ట్ర పురోగతి కుంటుపడుతుందని పార్టీ ఎంపీలు విచారం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలంతా సమైక్యంగా కృషి చేసి రానున్న ఎన్నికల్లో మహా నది ప్రధాన శీర్షికగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహా నది తీర ప్రాంతాల్లో 15 ప్రభావిత జిల్లాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో మహా సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ 15 జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, ఇతరేతర అనుబంధ వర్గాలు మహా సమ్మేళనంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మహా నదిపై చైతన్య సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. -
ఇంతులకు ఎంతగానో..
భువనేశ్వర్ : రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడం ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శాసన సభలో ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన వాయిదా తీర్మానంపై ఆయన సమగ్ర వివరాల్ని సభలో ప్రవేశ పెట్టారు. రాష్ట్ర హోం శాఖ బాధ్యతలు ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నందున వాయిదా తీర్మానంపట్ల ఆయన సమగ్ర సమాచారాన్ని సభలో తెలియజేశారు. బడ్జెట్ మలివిడత సమావేశాలు తరచూ వాయిదా పడుతున్నాయి. మహా నది జలాల పంపిణీ వివాదం, జగన్నాథుని ఉపవాసం వగైరా శీర్షికలతో సభా కార్యక్రమాలు వాయిదాపడిన విషయం విదితమే. జగన్నాథుని సేవల్లో అవాంఛనీయ జాప్యం వివాదాన్ని పురస్కరించుకుని రెండు రోజులుగా సభా కార్యక్రమాలు స్తంభించాయి. స్పీకర్ ప్రదీప్ కుమార్ ఆమత్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం నిర్వహించడంతో ఈ విచారకర పరిస్థితులకు తెరపడింది. శుక్రవారం సభా కార్యక్రమాలు తొలినుంచి సజావుగా సాగాయి. మహిళలపట్ల నేరాలు, శాంతి భద్రతల శీర్షికతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసన సభా పక్ష నాయకుడు నర్సింగ మిశ్రా సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్పీకర్ ఆమోదంతో ఈ తీర్మానంపై సభలో సుదీర్ఘంగా చర్చ సాగింది. రాష్ట్రంలో పలు చోట్ల మహిళలకు వ్యతిరేకంగా నమోదైన కేసులపట్ల తమ విభాగం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని సీఎం చెప్పారు. ఇటువంటి 943 కేసుల్ని రెడ్ ఫ్లాగ్ కేసులుగా గుర్తించి అత్యధిక ప్రాధాన్యం కల్పించామన్నారు. మహిళలపై వేధింపుల కేసులపట్ల విభాగం ఘాటుగా స్పందిస్తోందన్నారు. రాష్ట్రంలో 6 మహిళా పోలీస్ స్టేషన్లు మహిళల అక్రమ రవాణాను నివా రించడంలో జాతీయ స్థాయిలో రా ష్ట్రం అగ్ర స్థానంలో నిలిచిందన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా 537 పోలీసు స్టేషన్లలో మహిళా సహాయ డెస్కుల్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి సభకు వివరించారు. మహిళల భద్రతా వ్యవస్థను పటిష్టపరిచేందు కు 6 మహిళా పోలీసు స్టేషన్లు పనిచేస్తున్నాయి. మహిళలు, శిశువులు, బలహీన వర్గాలకు భద్రత కల్పి ంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం కల్పి స్తుంది. కేసుల నమోదు, ఉన్నత స్థాయి దర్యాప్తు, సత్వర సముచిత న్యాయం కల్పించడంలో పోలీసు వ్యవస్థ చురుగ్గా పనిచేయడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేసుల విచారణలో జాప్యం లేదు మహిళలు, బాలికలపట్ల అమానుష దాడులు వగైరా నేరాలకు పాల్పడిన నిందితులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టడంలో విభాగం ఏమాత్రం సంకోచించడం లేదన్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు అధికారులు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించి కేసుల విచారణలో జాప్యాన్ని నివారిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యల నివారణపట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మేధా శక్తిని సమన్వయపరచి నిరవధికంగా కృషి చేస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. పార్టీ, రాజకీయాలకు అతీతంగా సభ్యులంతా రాష్ట్ర ప్రజల రక్షణ, భద్రత వ్యవహారాల కార్యాచరణలో స్వచ్ఛందంగా పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తగ్గిన మావోయిస్టుల హింస రాష్ట్రంలో మావోయిజం తగ్గుముఖం పట్టిందని హోమ్ శాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రంలోని 6 మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో మావోయిజాన్ని పూర్తిగా నివారించినట్లు సభకు వివరించారు. ఈ జాబితాలో కెంజొహర్, మయూర్భంజ్, గజపతి, జాజ్‌పూర్, ఢెంకనాల్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ జిల్లాలు మావోయిస్టుల కబ్జా నుంచి విముక్తి పొందినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయాన్ని సభలో వివరించారు. సాధారణ ప్రజానీకంపట్ల మావోయిస్టుల హింసలు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు వివరించారు. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, భారీ స్థాయి దుకాణాలు ఇతరేతర జన సందోహిత ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయడం నేర నియంత్రణకు ఎంతగానో దోహదపడుతోందంటూ ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తప్పి పోయిన 8,118 మంది శిశువుల్ని పలు ప్రాంతాల్లో గుర్తించి ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ముష్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు విజయవంతమైనట్లు ముఖ్యమంత్రి సంతృత్తి వ్యక్తం చేశారు. -
సీఎంపై కోడిగుడ్లు విసిరిన మహిళలు
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు నిరసన సెగ తగిలింది. మహిళలు అనూహ్యంగా ఆయనపై గుడ్ల వర్షాన్ని కురిపించారు. అయితే, ముఖ్యమంత్రికి ఆ గుడ్లు తాకలేదు. ముఖ్యమంత్రి లక్ష్యంగా గుడ్లు దూసుకురావడంతో.. ఆయన వ్యక్తిగత సిబ్బంది, అధికారులు అడ్డుగా నిలబడ్డారు. బాలాసౌర్లో ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి లక్ష్యంగా గుడ్లు విసిరిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ముఖ్యమంత్రిపై కోడిగుడ్లు విసిరిన మహిళలు
-
పవర్ఫుల్ సీఎం
సాక్షి, భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పాలనలో పారదర్శకత పట్ల అత్యంత మక్కువ కనబరుస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో అడుగిడిన తొలి రోజుల నుంచి పారదర్శక పాలన నినాదాన్ని నిరవధికంగా కొనసాగిస్తున్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ నినాదాన్ని సోషల్ మీడియాతో అనుసంధానపరిచారు. ట్రిపుల్ టీ మంత్రం.. ఈ నేపథ్యంలో పాలన అధికారులకు ట్రిపుల్ టీ మంత్రాన్ని ప్రబోధించారు. టీమ్‌వర్క్–ట్రాన్స్పరెన్సీ (పారదర్శకత)–టెక్నాలజీ సూత్రంతో ప్రజలకు ప్రభుత్వ సేవల్ని సకాలంలో అందజేయాలని ఆదేశించారు. అధికారులకు ఆదేశాలు జారీ కంటే ముందుగా మంత్రి మండలి సభ్యులకు ఈ మేరకు సంకేతాలు జారీ చేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సభ్యులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణలు వంటి సందర్భాల్లో పార్టీ నుంచి తొలగించడంలో ఆయన ముందంజ వేస్తున్నారు. ప్రతిఒక్కరూ పూచీదారులే రాష్ట్రంలో బిజూ జనతాదళ్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి అయింది. ఈ వ్యవధిలో గత 17 ఏళ్ల నుంచి పార్టీ అధికారంలో నిరవధికంగా కొనసాగుతోంది. వ్యవస్థాపక అధ్యక్షునిగా నియమితులైన నవీన్ పట్నాయక్ నిరవధికంగా కొనసాగుతున్నారు. ఆయన అధ్యక్షతలో సభ్యులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజలకు పూచీదారులుగా వ్యవహరించాల్సిందేనంటారు. 44 మంది మంత్రుల తొలగింపు ఈ కార్యాచరణలో భాగంగా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ 17 ఏళ్ల పాలనలో 44 మంది మంత్రుల్ని తొలగించారు. వీరిలో అత్యధికులు అతిరథ మహారథులే. నిందిత సభ్యులు నిర్దోషులుగా రుజువు చేసుకునేంతవరకు పార్టీ వ్యవహారాల్లో చొరబడేందుకు ఏమాత్రం అవకాశం కల్పించరు. ఇటీవల కాలంలో నిర్దోషులుగా రుజువు చేసుకోవడంతో పాటు ఆయన వ్యక్తిగత విశ్వసనీయతను కూడా చూరగొనడం అనివార్యంగా పరోక్ష సంకేతాలు జారీ చేస్తున్నారు. పార్టీ నుంచి దీర్ఘకాలంగా దూరమైన పలువురు సీనియర్లను అక్కున చేర్చుకునేందుకు నవీన్ పట్నాయక్ యోచిస్తున్నారు. అయితే అంతకుముందు ఆయన ఒక్కొక్కరి పూర్వాపరాల్ని సమీక్షించిన మేరకు తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికి ఏడాది గడిచినా ఇంతవరకు ఈ మేరకు దాఖలాలు కనిపించడం లేదు. తొలగింపునకు గురైన పలువురు ప్రముఖులు పార్టీ అధ్యక్షుని పిలుపు కోసం నిరీక్షిస్తున్నారు. పునఃప్రవేశం ఆరుగురికి మాత్రమే నవీన్ పట్నాయక్ పాలనా కాలంలో తొలగింపునకు గురైన 44 మంది మంత్రుల్లో కేవలం ఇద్దరు మాత్రమే రాజీనామా చేశారు. కాగా 6గురు మాత్రం నిర్దోషులుగా రుజువు చేసుకుని అధ్యక్షుని మనసు చూరగొని తిరిగి పార్టీలో ప్రవేశం సాధించగలిగారు. ఈ జాబితాలో దేబీ ప్రసాద్ మిశ్రా, డాక్టర్ దామోదర్ రౌత్, విజయ శ్రీ రౌత్రాయ్, రొబి నారాయణ నొందొ, ప్రతాప్ చంద్ర జెనా, ప్రదీప్ మహారథి ఉన్నారు. అలాగే క్రమంగా నిజాయితీ ప్రదర్శించి నవీన్ పట్నాయక్ విశ్వసనీయత కూడగట్టుకోవడంతో తొలుత పుష్పేంద్ర సింగ్‌దేవ్, అతున్ సవ్యసాచి నాయక్‌లకు పార్టీలో ప్రవేశానికి అవకాశం సాధించారు. 2014 ఎన్నికల్లో పార్టీ విజయానికి సారథ్యం వహించడంతో వీరికి కొనసాగుతున్న క్యాబినెట్లో స్థానం కల్పించారు. తదుపరి దశల్లో ప్రఫుల్ల సామల్, ప్రతాప్ జెనా నవీన్ పట్నాయక్ మంత్రి మండలిలో స్థానం సాధించుకున్నారు. ఆది నుంచి ఇదే వరస నవీన్ పట్నాయక్ నేతృత్వంలో తొలి ప్రభుత్వం 2000వ సంవత్సరంలో ఏర్పడింది. 2004వ సంవత్సరం వరకు కొనసాగింది. ఈ వ్యవధిలో 6గురు మంత్రుల్ని క్యాబినెట్ నుంచి తొలగించి అవాక్కయ్యేలా చేశారు. నవీన్ తొలి వేటుకు బలైన వారిలో కమలా దాస్, ప్రొశాంతొ నొందొ, నళినీ కాంత మహంతి, అమర ప్రసాద్ శత్పతి, దేవీ ప్రసాద్ మిశ్రా, ఎ.పి. సింగ్ ఉన్నారు. ఈ విడతలో రాష్ట్ర రాజకీయాల్లో ఆరి తేరిన నాయకునిగా వెలుగొందిన రామకృష్ణ పట్నాయక్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. క్రమశిక్షణ చర్యల కింద.. అప్పట్లో ఆయన ఆర్థిక శాఖకు సారథ్యం వహించారు. రెండో విడత 2004 నుంచి 2009 సంవత్సరాల మధ్య పాలనలో క్రమ శిక్షణ చర్యల కింద నవీన్ పట్నాయక్ 14 మంది మంత్రుల్ని తొలగించారు. వీరిపట్ల పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలున్నాయి. ప్యారీ అంకుల్ కూడా అతీతులు కాదు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజకీయ గురువు, మార్గదర్శి, శ్రేయోభిలాషిగా వెలుగొందిన ప్యారీ మోహన మహాపాత్రో పట్ల కూడా ఆయన క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి బహిష్కరించేందుకు వెనుకంజ వేయలేదు. అప్పట్లో ఈ సంఘటన తీవ్ర కలకలం రేకెత్తించింది. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌తో అత్యంత సన్నిహితునిగా చలామణి అయిన ప్యారీ మోహన మహాపాత్రోను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అంకుల్‌గా పిలిచే వారు. ప్యారీ తెర వెనక కథానాయకునిగా నవీన్ పట్నాయక్‌తో పాలన నిర్వహించిన ఘనుడుగా పేరొందారు. రాష్ట్ర పాలనలో ఆయనను అందరూ తృతీయ శక్తిగా గుర్తించారు. ఇంతటి బంధం కూడా క్రమ శిక్షణ ఉల్లంఘనతో ఒక్కసారిగా బెడిసికొట్టింది. ప్యారీ మోహన మహాపాత్రో కన్ను మూసేంత వరకు పార్టీ శిబిరం వైపు కన్నెత్తి చూడలేని దయనీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీజేడీ చరిత్రలో అర్ధరాత్రి కుట్ర.. మూడో విడత 2009 నుంచి 2014 సంవత్సర కాలంలో బీజేడీ పాలన వ్యవధిలో ప్యారీ మోహన మహాపాత్రోపై వేటు పడింది. అంత వరకు పార్టీ ఆవిర్భావం నుంచి అపర చాణుక్యునిగా ఆయన వెలుగొందారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండగా గద్దెని ఎక్కే యోచనతో ప్యారీ మోహన మహాపాత్రో పన్నిన కుట్ర బహిర్గతమైంది. నవీన్ పట్నాయక్ విదేశీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చారు. తక్షణమే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ వ్యవహారంలో ఆయనకు సహకరించిన అనుచరుల్ని కూడా తొలగించారు. ప్రఫుల్ల చంద్ర ఘొడై, ప్రఫుల్ల సామల్, ప్రతాప్ చంద్ర జెనా, పుష్పేంద్ర సింగ్‌దేవ్, అతున్ సవ్యసాచి నాయక్ పార్టీ బహిష్కరణకు గురయ్యారు. ఈ విచారకర సంఘటన 2012 లో జరిగింది. ఈ వ్యూహం బీజేడీ చరిత్రలో అర్ధరాత్రి కుట్రగా మిగిలిపోయింది. ప్రస్తుత పరిస్థితి అదే పార్టీ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపట్ల బిజూ జనతా దళ్ అధ్యక్షునిగా నవీన్ పట్నాయక్ వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ప్రభుత్వ పాలనకు కళంకం తెచ్చిన ఆరోపణ కింద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ దామోదర్ రౌత్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే దామోదర్ రౌత్ నోటి దురుసుతనమే ఈ చర్యకు కారణం. లోగడ 2 సార్లు దామోదర్ రౌత్ పార్టీ క్రమ శిక్షణ వేటుకు గురయ్యారు. కొనసాగుతున్న 2014–19 విడత పాలనలో శ్రీ జగన్నాథుని నవ కళేబర మహోత్సవం, చిట్‌ఫండ్ మోసాల ఆరోపణలను పురస్కరించుకుని తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో అరుణ్ సాహు, సంజయ్ కుమార్ దాస్ వర్మను నవీన్ పట్నాయక్ తొలగించారు. -
జనంలోకి అడుగులు
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుని పర్యటనలు ముమ్మరమవుతున్నాయి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేస్తున్న నిధుల చిట్టా బహిరంగ సభల్లో ఆయన తెలియజేస్తున్నారు. రాష్ట్రానికి మంజూరైన నిధుల వినియోగం పట్ల లెక్కలపై నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటా నిర్వహించే పాదయాత్రకు బీజేడీ కసరత్తు చేస్తోంది. పాదయాత్రలో ప్రజలతో మమేకమై కేంద్రం వివక్షను వివరించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని భావిస్తోంది. భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించి వైఫల్యాల్ని ప్రతిపక్షాల నెత్తిన రుద్దే రీతిలో అధికార పక్షం బిజూ జనతా దళ్ ఏటా పాదయాత్ర నిర్వహిస్తోంది. ఏటా మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ యాత్రను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. లోక్‌నాయక్ దివంగత జయ ప్రకాష్ నారాయణ్ జయంతి అక్టోబరు 11వ తేదీ వరకు బీజేడీ పాదయాత్ర నిరవధికంగా కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రారంభించనున్న పాదయాత్రను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ మేరకు మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పాదయాత్ర–2017 కార్యాచరణ, పార్టీ ప్రముఖుల నుంచి క్షేత్ర స్థాయి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పాదయాత్రలో ప్రజల మనోగతాల్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని నవీన్ పట్నాయక్ సందేశం జారీ చేశారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షపై ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని బలోపేతం చేసే రీతిలో బీజేడీలోని ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. బీజేపీ తీరును ఎండగట్టండి పలు ప్రజాకర్షణ పథకాలకు కేంద్ర ప్రభుత్వం కుదించిన నిధుల మంజూరు విషయంలో ప్రజలకు గణాంకాల్ని స్పష్టంగా వివరించడం అనివార్యమని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపాదనకు తుంగలో తొక్కి రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం నీళ్లొదిలిందని తెలియజేయాలని సూచించారు. రాష్ట్ర జీవన రేఖగా పొంగి పొరలే మహానది జలాలు మన రాష్ట్రానికి ప్రవహించకుండా ఎగువ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్న వైనాన్ని వివరించాలని తెలియజేశారు. పొరుగు రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పురోగతికి ప్రోత్సహించి ఒడిశాకు అన్యాయం చేస్తున్న ఉద్దేశపూర్వక చర్యలపట్ల రాష్ట్ర ప్రజలకు వివరించి భారతీయ జనతా పార్టీ తీరుపట్ల ఎండగట్టాలని పార్టీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయికి వెళ్లండి పాదయాత్రను పురస్కరించుకుని పార్టీ అగ్రశ్రేణి నాయకులు క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు కదలాల్సిందే. రాజధాని వీడి గ్రామీణ పంచాయతీ ప్రతినిధులు వగైరా వర్గాలతో ప్రత్యక్షంగా సంప్రదించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో కలిసి ఈ ఏడాది పాద యాత్రను విజయవంతం చేయాలని నవీన్ పట్నాయక్ ఆదేశించారు. జిల్లా పర్యవేక్షకులు సత్వరమే ఆయా జిల్లాలకు చేరాలని స్పష్టం చేశారు. బిజూ జనతా దళ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు జేస్తున్న పలు ప్రజాహిత పథకాలపట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఉపదేశించారు. “అమ్మొ గాంవ్ – అమ్మొ బికాష్’, “అమ్మొ సొహొరొ–అమొరొ ఉన్నతి’ వంటి అత్యాధునిక బీజేడీ ప్రజాహిత పథకాలపట్ల ప్రజల్ని చైతన్యపరిస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వాస్తవ కార్యాచరణ ఏమిటో సామాన్యునికి సులభంగా అర్థమవుతుందని పార్టీ ప్రముఖులు సూచించారు. పాదయాత్రలో విశేష సంఖ్యలో విద్యార్థులు, యువజనం, మహిళలు, యువతులు వగైరా వర్గాల నుంచి ప్రజల్ని ఏకీకృతం చేసుకుని పాదయాత్ర ఫలప్రదం చేయాలని నవీన్ పట్నాయక్ కార్యకర్తల్ని ఉత్తేజపరిచారు. -
టాప్–3 లక్ష్యంగా...
ఆసియా అథ్లెటిక్స్ బరిలోకి భారత్ భువనేశ్వర్: స్వదేశంలో సత్తా చాటుకొని... వచ్చే నెలలో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బెర్త్ సంపాదించాలనే లక్ష్యంతో భారత అథ్లెట్స్ ఆసియా చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనున్నారు. స్థానిక కళింగ స్టేడియంలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించగా... ఈవెంట్స్ గురువారం మొదలవుతాయి. ఆసియా పోటీల్లో స్వర్ణ పతకాలు గెలిచిన వారికి వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. 95 మంది సభ్యుల భారీ బృందంతో ఈ పోటీల్లో ఆడుతున్న భారత్ ఓవరాల్‌గా పతకాల పట్టికలో టాప్–3లో నిలవాలనే లక్ష్యంతో ఉంది. 44 దేశాల నుంచి 800 మందికి పైగా అథ్లెట్స్ పాల్గొంటున్న ఈ పోటీలు ఆదివారం ముగుస్తాయి. -
గీతా మెహతా తెరవెనుకే సారథి
♦ సీఎం నవీన్ తదుపరి వారసులు ఎవరు? ♦ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతున్న చర్చ లోగడ..ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విదేశీ పర్యటనకు వెళ్లిన తరుణంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదా రుగా చలామణి అవుతున్న ప్యారీ మోహన్ మహాపాత్రో అర్ధరాత్రి ఆపరేషన్ నిర్వహించి రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం సృష్టించారు. ప్రస్తుతం.. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేడీ డీలాపడింది. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ బలం పుంజు కుంది. ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ ఆరోగ్య స్థితి మెరుగు కోసం విదేశీ పర్యటనకు యోచిస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి గందరగోళ పరిస్థితి ఏర్పడకుండా అధికార బీజేడీ పార్టీ వ్యవహారాల్ని పటిష్టంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రణాళిక వేస్తున్నారు. సోదరి గీతా మెహతాను ఆయన ప్రతినిధిగా నియమిస్తారని రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఈ చర్చ అంతా సీఎం బహిరంగ ప్రకటనతో తుస్సుమంది. భువనేశ్వర్: పంచాయతీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ చర్చలు బలం పుంజుకున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన రాజకీయ పార్టీల భావి స్థితిగతులపట్ల విశ్లేషణలు అలా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ కుమార్తె, వర్ధమాన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రంగ ప్రవేశం చేయనున్నట్లు చర్చ ఊపందుకుంది. ఆమె నవీన్ పట్నాయక్ తర్వాత రాష్ట్రంలో బిజూ జనతా దళ్‌కు సారథ్యం వహిస్తారని రాజకీయ శిబిరాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. రాజకీయ గణాంకాలు, విశ్లేషణలతో రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ మరో వారసురాలు అడుగిడుగుతుందనే నమ్మకం దాదాపు స్థిరపడిన క్షణంలో అంతా తుస్సుమంది. బీజేడీలో కేంద్ర శక్తి గీతా మెహతా రాష్ట్రంలో అధికార పక్షం బిజూ జనతా దళ్ పార్టీలో గీతా మెహతా ప్రముఖ పాత్రధారిగా నిలుస్తారనే చర్చ ఇటీవల కాలంలో ఊపందుకుంది. పార్టీ అంతరంగిక వ్యవహారాలతో పాటు నవీన్ పట్నాయక్ తర్వాత ఆమె రాష్ట్ర రాజకీయాల్లో పాలనాపగ్గాలు చేపడతారనే ఊహాగానాలు భారీగా ఊపందుకున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఫలితాలు దిగజారిన సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లో విశ్వసనీయ వ్యక్తిగా తన సోదరిని నవీన్ పట్నాయక్ రంగంలోకి దించుతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. వ్యూహాత్మక కార్యాచరణలో నవీన్‌కు సాటి ఎవరూ లేరని అంతా విశ్వసిస్తారు. ఈ క్రమంలో చర్చ ఇలా సాగుతోంది. తొలుత రాజ్యసభ రాష్ట్ర రాజకీయాల్లోకి గీతా మెహతాను దింపేందుకు రంగం సిద్ధం అయింది. ఇంత వరకు పార్టీ ప్రధాన శిబిరంలో తెర వెనక ఉంటూ పంచాయతీ ఎన్నికల విశ్లేషణ, సమీక్షలు నిర్వహించిన సోదరికి నవీన్ పట్నాయక్ పట్టం గడతారు. రాష్ట్రంలో బిజూ జనతా దళ్ సంఖ్యా బలాన్ని అనుకూలంగా మలుచుకుని సోదరిని ప్రతిష్టాత్మక పదవితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించుతారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ రేసులో ఉన్న బిష్ణు దాసును తప్పించి రాష్ట్ర ప్రణాళిక బోర్డు డిప్యుటీ చైర్మన్‌గా నియమించారు. దీంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఆయన సోదరి గీతా మెహతాను సిఫారసు చేయించి ప్రత్యక్ష రాజకీయాల నుంచి నవీన్ పట్నాయక్ అంచెలంచెలుగా తప్పుకునేందుకు పావులు కదుపుతున్నట్లు రాజకీయ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. బీజేడీ శిబిరంలో ఉత్సాహం దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ వారసులు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించడంపట్ల బిజూ జనతా దళ్ శిబిరం నుంచి సానుకూల పవనాలు వేగం పుంజుకున్నాయి. ఆరోగ్య పరీక్షల కోసం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దీర్ఘకాలం విదేశీ పర్యటనకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన గైర్హాజరులో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు విశ్వసనీయమైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ జాబితాలో ఆయన సోదరి గీతా మెహతా ఏకైక వ్యక్తిగా పేరు వినిపించింది. గీతా మెహతా పార్టీ వ్యవహారాల్ని చేపట్టి ప్రత్యక్షంగా రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగిడితే అంతా మేలు జరుగుతుందని బీజేడీ శ్రేణులు సానుకూలంగా స్పందించాయి. ప్రధానంగా పార్టీ సీనియర్ వర్గం ఆమె ప్రవేశంపట్ల అమితానందం ప్రదర్శించింది. రాజకీయ పదవులపట్ల అనాసక్తి సోదరి గీతా మెహతాకు ఎటువంటి రాజకీయ పదవులు, హోదాపట్ల ఆసక్తి లేనట్లు నవీన్ పట్నాయక్ సోమవారం బహిరంగంగా ప్రకటించారు.ఆయన తాజా ప్రకటనతో గీతా రాజకీయ ప్రవేశానికి తెరపడింది. రాజ్యసభ లేదా ఇతర రాజకీయ పదవులపట్ల ఆమె ఎటువంటి ఆసక్తి కనబరచడం లేదని ముఖ్యమంత్రి సూటిగా బహిరంగపరిచారు. -
సీఎంపై గుడ్లు విసిరేందుకు ప్రయత్నం